క్షమాపణ చెప్పనున్న సీఈవో
క్షమాపణ చెప్పనున్న సీఈవో
Published Tue, Sep 20 2016 8:04 PM | Last Updated on Mon, Aug 20 2018 2:50 PM
న్యూయార్క్ : ఇంటర్నేషనల్గా బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సేవలందించే వెల్స్ ఫార్గో సీఈవో జాన్ స్టంఫ్ అమెరికన్ కాంగ్రెస్కు, పబ్లిక్కు క్షమాపణ చెప్పేందుకు సిద్దమయ్యారు. సెనెట్ బ్యాంకింగ్ కమిటీ ముందు స్టంఫ్ హాజరుకాబోతున్న ఆయన, సెనెట్కు క్షమాపణ చెప్పబోతున్నారు. దీనికి సంబంధించిన ఓ కాఫీని అసోసియేట్ ప్రెస్కు విడుదల చేశారు. బ్యాంకు తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైనందుకు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందుతున్నామని ఆ కాఫీలో సీఈవో స్టంఫ్ పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లఘించి, కస్టమర్ల నమ్మకాన్ని ఒమ్ము చేసినందుకు క్షమాపణ కోరుతున్నట్టు తెలిపారు.
రిటైల్ బ్యాంకర్ల దూకుడు ఉత్పత్తి అమ్మకపు గమ్యాలను చేధించడానికి నిబంధనలకు విరుద్ధంగా మిలియన్లకు పైగా అనధికారిక అకౌంట్లను తెరిచిందనే ఆరోపణలను ఈ కంపెనీ ఎదుర్కొంటోంది. ఈ కుంభకోణ నేపథ్యంలో కంపెనీ 185 మిలియన్ డాలర్ల జరిమానాను సైతం ఫేస్ చేస్తోంది. సంస్థ ఉద్యోగులు ఆయా ఖాతాదారుల అనుమతి లేకుండా 20 లక్షలకు పైగా ఖాతాలు తెరిచిన కుంభకోణం వెలుగులోకి రావడంతో కంపెనీ విలువ ఒక్కసారిగా కుప్పకూలింది. కంపెనీ విలువ కుప్పకూలడంతో, దీనిలో ఇన్వెస్ట్ చేసిన వారి సంపద ఆవిరైంది. 2013 లో లాస్ ఏంజిల్స్ టైమ్స్ విచారణ లో ఈ విషయంలో తొలిసారి వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామాల పట్ల విచారం వ్యక్తం చేసిన ఫార్గో అనుమతిలేకుండా ప్రారంభించిన ఖాతాలకు సంబంధించిన ఫీజును వాపస్ చేస్తామని వెల్లడించింది. జనవరి 1 నుంచి సేల్స్ టార్గెట్ను కూడా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.
Advertisement