వందరెట్ల వేగంతో వైఫై | Wi-fi on rays of light: 100 times faster, and never overloaded | Sakshi
Sakshi News home page

వందరెట్ల వేగంతో వైఫై

Published Mon, Mar 20 2017 4:07 AM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM

వందరెట్ల వేగంతో వైఫై

వందరెట్ల వేగంతో వైఫై

లండన్‌:  ప్రస్తుత వైఫై వేగం కంటే వందరెట్ల వేగం గల సరికొత్త వైఫై వ్యవస్థను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇందుకోసం ఎటువంటి ప్రమాదంలేని పరారుణ కిరణాలను ఉపయోగించారు. దీనితో ఇప్పటికంటే ఎక్కువ పరికరాలకు నిరంతరాయంగా అత్యధిక వేగంతో వైఫై సౌకర్యం కల్పించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

ఈ వైఫై వ్యవస్థను నెదర్లాండ్స్‌లోని ఇండ్హోవెన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారు. దీని ద్వారా సెకనుకు 40 జీబీ డేటా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న అన్ని పరికరాలకూ ఒక్కోదానికి ఒక్కో పరారుణ కాంతికిరణం కనెక్ట్‌ అయి ఉండటం వల్ల ఎన్ని పరికరాలను వైఫైకి అనుసంధానం చేసినా ఏమాత్రం వేగం తగ్గకుండా అన్నిటికీ అదే వేగంతో డేటా సరఫరా అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement