జైపూర్: ప్రేమను ఆసరాగా తీసుకున్న ఓయువకుడు మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా రాజస్థాన్ లో వెలుగుచూసింది. నేతరామ్ రాయ్ గర్ (22)అనే యువకుడు పలుమార్లు తనపై లైంగాక దాడి జరిపాడంటూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. ఆ యువకుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డ సమయంలో తీసిన వీడియోలను చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ కోర్టుకు తెలిపింది.
వివరాల్లోకి వెళితే.. పెళ్లి చేసుకున్న అనంతరం ఆ మహిళ భర్త నుంచి విడిపోయి గత కొంతకాలంగా తల్లి దండ్రులే వద్ద ఉంటోంది. ఆ క్రమంలోనే ఆమెకు నేతరామ్ రాయ్ గర్ అనే యువకుడు పరిచయమైయ్యాడు. అలా వారిద్దరూ ఒకరు నొకరు ఇష్టపడుతూ వచ్చారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని కూడా నమ్మించాడు. ఆ యువకుడి మాయమాటల్ని నమ్మిన ఆ మహిళ అతనితో సాన్నిహిత్యంగా మెలగడం ఆరంభించింది. దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ యువకుడు ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఇప్పుడేమో పెళ్లి చేసుకోనే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. తన తల్లి దండ్రులు పెళ్లికి ఒప్పుకోవడం లేదంటూ ప్లేటు ఫిరాయించాడు. దీంతో ఆ మహిళ చేసేది లేక కోర్టును ఆశ్రయించింది. తనపై గత రెండున్నర సంవత్సరాల నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడని తెలిపింది. కోర్టు ఆదేశాలతో ఆ యువకుడిపై 376 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం
Published Thu, Jun 26 2014 5:22 PM | Last Updated on Fri, Jul 12 2019 3:07 PM
Advertisement
Advertisement