న్యూఢిల్లీ : మొబైల్ మార్కెటింగ్ స్టార్టప్ సంస్థ యాపిటరేట్‌ను కొనుగోలు చేసినట్లు ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఇందుకు ఎంత వెచ్చించినదీ తెలపలేదు. మొబైల్ టెక్నాలజీపై ప్రధానంగా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో తమకు ఈ కొనుగోలు ఉపకరించగలదని కంపెనీ వివరించింది.
తమ మొబైల్ యాప్‌లో యాపిటరేట్ మొబైల్ మార్కెటింగ్ ఆటోమేషన్ ప్లాట్‌ఫామ్‌ను అనుసంధానిస్తామని పేర్కొంది. వెబ్‌పేజీలో చేపట్టే కొత్త మార్పులు, చేర్పుల ప్రభావం అమ్మకాలపై ఏ విధంగా ఉంటుందనేది విశ్లేషిస్తుంది యాపిటరేట్. గ్రెగ్ బాద్రోస్, ప్రశాంత్ మాలిక్ వంటి ఏంజల్ ఇన్వెస్టర్లతో పాటు ఎస్‌ఏఐఎఫ్ పార్ట్‌నర్స్ వంటి సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి యాపిటరేట్ నిధులు సమీకరించింది.
ఫ్లిప్‌కార్ట్ ఖాతాలో యాపిటరేట్
Published Thu, Apr 30 2015 12:33 AM | Last Updated on Sun, Sep 3 2017 1:07 AM
Advertisement
Advertisement