అడ్డగోలు రాష్ట్ర విభజనను నిరసిస్తూ వైఎస్సార్ జిల్లా రాజంపేట, రైల్వేకోడూరుల్లో ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు చేపట్టిన ఆమరణ దీక్షలు సోమవారం నాటితో ఐదురోజులు పూర్తి చేసుకుని మంగళవారంతో ఆరోరోజుకు చేరాయి.
అడ్డగోలు రాష్ట్ర విభజనను నిరసిస్తూ వైఎస్సార్ జిల్లా రాజంపేట, రైల్వేకోడూరుల్లో ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు చేపట్టిన ఆమరణ దీక్షలు సోమవారం నాటితో ఐదురోజులు పూర్తి చేసుకుని మంగళవారంతో ఆరోరోజుకు చేరాయి. కొరుముట్ల ఆరోగ్యం సోమవారం రాత్రి క్షీణించింది. బీపీ 100/70గా నమోదైంది. షుగర్, సోడియం లెవెల్స్ తగ్గాయి. ఆకేపాటి బీపీ, షుగర్ లెవెల్స్ ఆందోళనకర స్థాయికి చేరాయి. అయినాసరే లెక్కచేయకుండా సమైక్యమే లక్ష్యంగా దీక్షలు కొనసాగిస్తున్నారు.
గడికోట, రవీంద్రల దీక్ష విరమణ
సమైక్యాంధ్రగానే రాష్ట్రాన్ని కొనసాగించాలని కడపలో ఎనిమిదిరోజులుగా ఆమరణదీక్ష చేసిన రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డి సోమవారం దీక్ష విరమించారు. ఈనెల 12న ప్రారంభమై వీరి దీక్షలు సోమవారం మధ్యాహ్నం వరకు కొనసాగాయి. ఆదివారం రాత్రి పోలీసులు దీక్షను భగ్నం చేసి రిమ్స్‌కు తరలించినా చికిత్సకు సహకరించకుండా మొండికేశారు. కడప ఆర్డీవో వీరబ్రహ్మం రెండుమార్లు వచ్చి విన్నవించడంతో ఎట్టకేలకు మధ్యాహ్నం నిమ్మరసం తీసుకుని దీక్ష విరమించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.