శిఖర్‌ను యూవీ ఎలా ఫూల్‌ చేశాడో చూడండి! | Yuvraj pulls April fool's prank on Dhawan | Sakshi
Sakshi News home page

శిఖర్‌ను యూవీ ఎలా ఫూల్‌ చేశాడో చూడండి!

Published Sat, Apr 1 2017 5:57 PM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM

శిఖర్‌ను యూవీ ఎలా ఫూల్‌ చేశాడో చూడండి!

శిఖర్‌ను యూవీ ఎలా ఫూల్‌ చేశాడో చూడండి!

మైదానంలో చెలరేగి ఆడటమే కాదు.. తోటి ఆటగాళ్లను సరదాగా ఆటపట్టించడంలోనూ టీమిండియా క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ ముందుంటాడు. ఏప్రిల్‌ 1 ’ఫూల్స్‌ డే’  కావడంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు సహచర ఆటగాడైన శిఖర్‌ ధావన్‌ను యూవీ ఫూల్‌ చేశాడు. జట్టుకు కేటాయించిన హోటల్‌లో శిఖర్‌ స్నానం చేసేందుకు స్మిమ్మింగ్‌పూల్‌లో దిగిన వెంటనే అతని భార్య ఆయేషా ముఖర్జీకి ఫోన్‌చేయమంటూ యూవీ తెలివిగా ఆటపట్టించాడు.

’అత్యవసర పరిస్థితి వచ్చి పడింది. నువ్వు వెంటనే నీ భార్యకు ఫోన్‌ చేయ్‌’మంటూ యూవీ శిఖర్‌కు చెప్పాడు. దీంతో గాబరా పడిపోయిన శిఖర్‌ వెంటనే స్మిమ్మింగ్‌ఫూల్‌ నుంచి బయటకు వచ్చి.. తన బ్యాగులో ఫోన్‌ కోసం ఆదరాబాదరాగా వెతికాడు. ఈ ఘటనను అంతా గుట్టుగా రికార్డు చేసిన యూవీ.. ఇదిగో శిఖర్‌ను ఇలా ఏప్పిల్‌ పూల్‌ చేశానంటూ ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పెట్టాడు. ఏప్రిల్‌ ఫూల్‌ చేసిన విషయాన్ని శిఖర్‌కు సైతం యూవీ చెప్పాడు. శిఖర్‌ సరదాగా తీసుకొని.. నిజంగా ఫూల్‌ అయ్యానంటూ నవ్వుతూ చెప్పాడు. మొత్తానికి ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement