న్యూఢిల్లీ: డ్యూయల్ కోర్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్ స్మార్ట్ ఫోన్ లకు చెల్లుచీటీ ఇస్తూ ప్రముఖ మొబైల్ తయారీ దారు జొపో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ను భారతమార్కెట్లో బుధవారం లాంచ్ చేసింది. శరవేగంగా మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని అత్యంత వేగంగా పనిచేసే డాకా కోర్ ప్రాసెసర్ స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న డ్యూయల్ కోర్, క్వాడ్ కోర్ ప్రాసెసర్ల స్థానంలో డెకా కోర్(10కోర్) ప్రాసెసర్ ఉపయోగించి తయారుచేసిన తొలి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. దీని ధరను కంపెనీ రూ, 29,999 గా కంపెనీ నిర్ణయించింది. జొపో స్పీడ్ 8 పేరుతో వస్తున్న ఈ ఫోన్ లాంచింగ్ ముందే ఇది అమెజాన్, స్నాప్ డీల్, ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో వుంది.
జోపో స్పీడ్ 8 ఫీచర్లు...
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్
డెకాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్, మాలి టి880 ఎంపీ4 గ్రాఫిక్స్
4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
21 మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
3600 ఎంఏహెచ్ బ్యాటరీ,
4జీ ఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.1, యూఎస్‌బీ టైప్-సి, ఎన్ఎఫ్‌సీ
150 గ్రాం.బరువు తూగుతున్న ఈ స్మార్ట్ఫోన్ లో . లైట్ సెన్సర్, దూరం సెన్సార్,యాక్సెల్ రో మీట్, జియోమెట్రిక్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్లు అమర్చబడి ఉన్నాయి.
డెకా కోర్ 'జొపో స్పీడ్ 8' లాంచ్
Published Wed, Jul 20 2016 1:48 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM
Advertisement
Advertisement