దిస్ ఈజ్ మొమోస్ | FOODIES: THIS IS Memos for Variety dishes | Sakshi
Sakshi News home page

దిస్ ఈజ్ మొమోస్

Published Thu, Sep 18 2014 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM

దిస్ ఈజ్ మొమోస్

దిస్ ఈజ్ మొమోస్

పునుగులు, మిర్చి బజ్జీలు, సమోసాలు, చాట్స్, పానీపూరీ... ఇవన్నీ ఈవెనింగ్ స్నాక్స్‌గా పాపులర్. అయితే వీటి స్థానంలో కొత్త కొత్త వెరైటీలు పుట్టుకొస్తున్నాయి. పావ్‌బాజీ, అరేబియన్ షావర్మా... అలా అలా ఇప్పుడు మొమోస్. మిగతావన్నీ సరే... ఈ మొమోస్ ఏమిటి! సౌండ్ ట్రెండీగా ఉందనుకుంటున్నారా? ఈవెనింగ్ స్నాక్స్‌గా ఇప్పుడు ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్న లే‘టేస్ట్’ ఇది. ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్, ఐటీ ప్రొఫెషనల్స్‌లో వీటికి క్రేజ్. ఈ మొమోస్‌కు మూలాలు నేపాల్, టిబెట్ ప్రాంతాల్లో ఉన్నాయి. మొత్తంగా ఇదొక నేపాల్, టిబెట్, హిమాలయన్ రీజియన్‌కు చెందిన ఒక సంప్రదాయ వంటకం.
 
 మొమో అనేది స్టీమ్డ్ డంప్లింగ్. తెలుగులో ఉడికించిన కుడుములనొచ్చు. దీన్లో వెజిటబుల్స్, లేదంటే మటన్ వంటివి నింపుతారు. లేయర్‌ను నీళ్లు, పిండి కలిపి చేస్తారు. అందులో వెజిటబుల్స్/ మటన్‌ను కూరి కనీసం 20 నిమిషాలు ఉడికిస్తారు. వేడి వేడిగా రెడ్ చిల్లీ గార్లిక్ సాస్ గానీ, ఎల్లో సెసామే సాస్‌లతో గానీ తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. సంప్రదాయ స్టీమ్డ్ మొమోస్ మాత్రమే కాకుండా అవసరమనుకుంటే విభిన్న రకాలను మేళవించి ఫ్రైడ్ మొమోస్ కూడా తయారు చేసుకోవచ్చు.
 
 సిటీలో కొన్ని చోట్ల ఈ మొమోస్ అందుబాటులో ఉన్నాయి.
 రాజ్‌భవన్ రోడ్‌లోని ఫార్చూన్ 9 బిల్డింగ్ బయట ఉన్న ఖాట్మండూ మొమోస్ అందులో ఒకటి. ఇక్కడ మీకు అచ్చమైన సంప్రదాయ మొమోస్ లభిస్తాయి. నేపాల్‌కు చెందిన ఓం ప్రకాష్ దీన్ని ఏడాది క్రితం ప్రారంభిం చారు. స్వల్ప కాలంలోనే ఇది చాలా మం దికి ఫేవరెట్ ప్లేస్‌గా మారిందంటే దానికి కారణం మొమోస్ టేస్టే. సాయంత్రం 5 గంటల తర్వాత ఇక్కడ మొమోస్ కోసం పోగయ్యే యువ సమూహాలను మనం గమనించవచ్చు. ఒక చిన్న బేనర్ మీద ఖాట్మాండూ మొమోస్ అని ఉంటుంది. దాని కింద ఒక వుడెన్ టేబుల్, స్టీమ్ ఓవెన్, బాక్సుల్లో పెట్టుకుని తెచ్చిన మొమోస్ మాత్రమే ఉంటాయి. చికెన్, వెజ్, పనీర్ వెరైటీలు ఇక్కడ లభిస్తాయి. వీటికి తోడుగా రెడ్ చిల్లీ గార్లిక్ చట్నీ టేస్టీగా ఉంటుంది. రూ.50కి 6 మొమోస్ ఇస్తారు.
 
 ‘మొదట్లో 10 మొమోస్ అమ్మడం కూడా కష్టం అయ్యేది. 5 గంటలకు వచ్చినా కొన్ని గంటల పాటు ఖాళీగా కూచునేవాడ్ని’ అన్నాడు ఓంప్రకాష్. ఇప్పుడు.. ఈ మొమోస్ రుచి చూడాలంటే రాత్రి 8.30 గంటల లోపే వెళ్లాలి. ఎందుకంటే నో స్టాక్ అనే మాట వింటే డిజప్పాయింట్ అవుతాం కదా. మరో విషయం... గచ్చిబౌలి, సికింద్రాబాద్ నుంచి కూడా ఇక్కడికి మొమోస్ కోసం వస్తుంటారు. ఇటీవలే హైటెక్ సిటీలోని హోండాసిటీ షోరూమ్ పక్కన మరో బ్రాంచిని కూడా తాను స్టార్ట్ చేశానని చెప్పాడు ఓం ప్రకాష్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement