పాడి పశువుల ఎంపికలో జాగ్రత్తలు...
పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్‌బాబు
వర్గల్: పాడి పశువులు రైతుకు జీవనోపాధిగా నిలుస్తున్నాయి. పాడి కోసం అనువైన ఆవులు, గేదెలను ఎంపిక చే సుకున్నపుడే తగిన పాల దిగుబడి సాధించవచ్చు. వ్యవసాయంతోపాటు పాడి ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని వర్గల్ మండల పశు సంవర్ధక శాఖాధికారి డాక్టర్ రమేష్‌బాబు సూచించారు. పాల దిగుబడికి ఉపయుక్తంగా ఉండే పశు జాతులు, నాణ్యమైన పాడి పశువు లక్షణాలను ఆయన వివరించారు. సంకర జాతి ఆవుల విషయంలో హోలిస్టయిన్ ఫ్రీజియన్, జెర్సీ జాతులకు మన వాతావరణాన్ని తట్టుకునే శక్తి ఉంటుందన్నారు. ఇవి అధిక పాలసారతో రైతుకు ఎక్కువ ఆదాయాన్ని తెచ్చి పెడతాయన్నారు. గేదెల విషయంలో ముర్రా, సూర్తీ, నాగపురి, జఫ్రాబాది, గ్రేడెడ్ జాతులు ఇక్కడి వాతావరణానికి అనుకూలమని వివరించారు.
మంచి పాడి పశువుల లక్షణాలు...
ూ పశువు ఆరోగ్యవంతమైనదై ఉండాలి.
ూ శరీరం నిండుగా ఉండాలి.
ూ గేదె లేదా ఆవును వెనుకనుంచి చూసినా ముందు నుంచి చూసినా త్రిభుజాకారంలో కనిపించాలి.
ూ పొదుగు పెద్దదిగా ఉండాలి. పాలు తీసిన తరువాత ముడుచుకుపోవాలి.
ూ నాలుగు చన్నులు చతురస్త్రాకారంగా ఉండాలి. అన్ని చన్నుల నుంచి పాలు వస్తుండాలి.
ూ పాడికి పనికి వచ్చే పశువును ఎంపిక చేసుకున్న తర్వాత కనీసం వరుసగా మూడు రోజులు ఉదయం, సాయంత్రం పాల దిగుబడి పరీరక్షించిన తరువాత కొనుగోలు చేయాలి.
సాగులో సమస్యలపై ఫోన్ ఇన్ నేడు
సంగారెడ్డి రూరల్: పంటల సాగు, ఎరువుల వాడకంలో రైతులకు సూచనలు, సలహాలు అందించేందుకు జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గురువారం ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 7గంటల నుంచి 9 వరకు అన్నదాతలు తమ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. సాగులో ఎదుర్కొం టున్న సమస్యలపై ఫోన్ ఇన్ ద్వారా శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులను నుంచి తగిన సమాధానాలు పొందవచ్చన్నారు. ఫోన్ చేయాల్సిన నంబర్ 08455-278272.
సమాచారం
మెదక్ డీఈ
దుర్గామహేశ్వరరావు 9440813625
మెదక్ ఏడీ రామచంద్రయ్య 9440813652
మెదక్ రూరల్- 1 ఏఈ
తిరుపతయ్య 9440813676
మెదక్ రూరల్- 2 ఏఈ
శ్రీనివాస్‌రావు 9440813335
వరిలో ఎర్ర, పసుపు మచ్చలు
ప్రశ్న: వరి నాటి వారం రోజులైతంది. శేనుపై ఎర్రటి, పసుపు రంగు కనిపిస్తున్నయ్. దీని నివారణకు ఏం చేయాలో తెలియజేయండి.
- అంజిరెడ్డి, జిన్నారం, ఫోన్: 9963831117
జవాబు: సూక్ష్మధాతు లోపం వల్ల వరి పంటపై ఇలాంటి రంగు గల మచ్చలు వస్తాయి. వీటి నివారణకు రెండున్నర గ్రాముల జింక్ సల్ఫేట్‌ను ఒక లీటర్ నీటిలో కలిపి పంటకు సరిపోయే మేర పిచికారీ చేయాలి. లేదా 4 గ్రాముల ఫార్ములా-4 మందును ఒక లీటర్ నీటిలో కలిపి స్పే చేయాలి. ఇలా చేయటం వల్ల వరిపై ఎర్రటి, పసుపురంగు గల మచ్చలు తొలగిపోతాయి.
- సాల్మన్‌నాయక్, ఏఓ జిన్నారం,
సెల్: 8886612477