ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న నేను వ్యవసాయం చేయాలని ఈ ఏడు వరితో పాటు టమాటా సాగు చేపట్టాను. టమాట పంట సాగు వర్షాకాలంలో చేయడం చాలా కష్టం. వర్షానికి చేను కుల్లిపోతుంది. అందుకే నేను ఏపుగా పందిరి పైకి పెరిగే ఇన్‌సోనా రకం టమాటా రకాన్ని సుమారు అర ఎకరం పొలంలో నాటు వేశాను.
నాటు వేసిన అనంతరం పొలం పరిసర ప్రాంతాల్లో మీటరు ఎత్తు గల కర్రలను కొట్టుకుని తెచ్చి ఈ పొలంలో పాతాను. కర్రలకు జీఐ వైరును కట్టి టమాట మొక్కలకు జనపనార తాడు, మందం దారం సాయంతో ఈ వైరుకు వేలాడదీసాను. దీంతో టమాట మొక్కలు భూమి మీద పరుచుకోకుండా ఎత్తుగా పెరిగాయి. టమాట చెట్టుకు కాత ఎక్కువ పట్టింది. వర్షాలకు కాయ, మొక్కలు కుళ్లిపోలేదు. టమాటా పంటకు సోకే పచ్చ పురుగు నుంచి పంటను కాపాడుకోవడానికి చుట్టూ బంతి మొక్కలను నాటాను. దీంతో పచ్చ పురుగు ఉధృతి తగ్గింది. అర ఎకరంలో పంటకు రూ.25 వేలు పెట్టుబడి పెట్టాను. టమాటా దిగుబడితోపాటు బంతిపూలు కూడా చేతికందివచ్చాయి.
కాయను సులువుగా తెంపొచ్చు : జయరాజ్, ఉద్యాన శాఖ అధికారి
సాధారణ పంటకు బదులు పందిరి మీదకు పాకే విధంగా టమాటా సాగు చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చు. ఈ పద్ధతితో చెట్టు ఏపుగా పెరిగి అధిక శాతం కాత పడుతుంది. నేలమీద పారితే వర్షాకాలంలో నీరు నిలిచినా, గాలి సోకక మొక్కలు, కాయలు కుళ్లిపోతాయి. ఎత్తుగా పెరగడంతో పొలంలో గాలి సోకి చీడపీడల బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. కాయను తెంపడానికి కూడా సులువుగా ఉంటుంది. దిగుబడి కాలం పెరిగి 25 శాతం మేరకు అధిక దిగుబడి సాధించవచ్చు. టమాటాలో ఇన్‌సోనా వంగడం ఎత్తుగా పెరుగుతుంది. ఈ రకం పందిరి సాగుకు అనుకూలంగా ఉంటుంది.
1
ఐఫోన్6 అమ్మకాలు 17 నుంచి..
తొలిసారిగా ముందస్తు బుకింగ్స్ రూ.53,500 నుంచి రూ.80,500 రేంజ్‌లో ధరలు
న్యూఢిల్లీ: యాపిల్ కంపెనీ కొత్త ఐఫోన్‌లు, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లను ఈ నెల 17 నుంచి భారత్‌లో విక్రయించనున్నది. ఈ కొత్త ఐఫోన్ ల ధరలు రూ.53,500 నుంచి రూ.80,500 రేంజ్‌లో ఉన్నాయి. ఈ ధరలు ఈ కామర్స్ సంస్థలు ఆఫర్ చేసిన ధరల కంటే తక్కువగా ఉండడం విశేషం. అయితే అమెరికాలో ఐఫోన్ రిటైల్ ధరలతో పోల్చితే ఈ ధరలు 10-17% అధికం. అమెజాన్ వెబ్‌సైట్ ఐఫోన్ 6ను డెలివరీ చార్జీలతో కలిపి 750 డాలర్లు (సుమారురూ.46,000)కు విక్రయిస్తోంది.
తొలిసారిగా ముందస్తు బుకింగ్స్
గత నెలలో యాపిల్ కంపెనీ పెద్ద స్క్రీన్ ఉన్న ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్, కొత్తగా యాపిల్ వాచ్, యాపిల్ పే(మొబైల్ వాలెట్)లను ఆవిష్కరించింది. ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌ల విక్రయలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఐఫోన్‌కు భారత్‌లో అధీకృత డిస్ట్రిబ్యూటర్లుగా రెడింగ్టన్, ఇన్‌గ్రామ్ మైక్రో, రాశి పెరిఫెరల్స్, రిలయన్స్‌లు వ్యవహరిస్తున్నాయి. ఈ కొత్త ఫోన్లను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.
భారత్‌లో ఐఫోన్‌కు ముందస్తు బుకింగ్స్ ఇదే తొలిసారి. వినియోగదారులు ఈ రెండు మోడళ్ల కోసం ఈ నెల 7 నుంచే ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని ఇన్‌గ్రామ్ మైక్రో పేర్కొంది. యాపిల్ కంపెనీకి ఈ సంస్థ అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్. 24 నగరాల్లోని 1,200 అవుట్‌లెట్లతో పాటు, తమ వెబ్‌సైట్ ద్వారా కూడా ముందస్తుగా ఈ ఐఫోన్‌లను బుక్ చేసుకోవచ్చని ఇన్‌గ్రామ్ తెలిపింది. ఈ రెండు ఫోన్‌లు 2జీ, 3జీ, 4 జీ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తాయి.
8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 1.2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. 6.9 మిల్లీమీటర్ల మందం ఉన్న ఐఫోన్ 6లో 4.7 అంగుళాల స్క్రీన్ ఉండగా, 7.1 మిల్లీమీటర్ల మందం ఉన్న ఐఫోన్ 6 ప్లస్‌లో 5.5 అంగుళాల స్క్రీన్ ఉంది. గత ఏడాది యాపిల్ ఐఫోన్ 5ఎస్‌ను రూ.53,500 ధరకు భారత్‌లో అందించింది. ఈ మోడల్ ప్రస్తుత ధర రూ.30,000 రేంజ్‌లో ఉంది.
కట్టెల పందిరిపై టమాటా సాగు
Published Tue, Oct 7 2014 12:06 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement