ఆస్ట్రేలియాలో కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు
ఆస్ట్రేలియాలో టీపీసీసీ ఎన్నారై సెల్‌ను సోమవారం ఏర్పాటు చేసినట్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. సిడ్నీ కేంద్రంగా 50 మంది ఎన్నారైలు కలిసి ఎన్నారై సెల్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించింది. ఈ సందర్భంగా గాంధీ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నారైలతో పలువు టీపీసీసీ నేతలు మాట్లాడారు.
పీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి, మాజీ అసెంబ్లీ స్పీకర్ సురేష్ రెడ్డి, ఎన్నారై చైర్మన్ బీ.వినోద్ కుమార్ (రిటైర్డ్ IFS), కల్వకుర్తి ఎమ్మెల్యే చల్ల వంశీ చంద్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షులు దాసోజు శ్రవణ్, టీపీసీసీ అధికార ప్రతినిధి మహేష్ కొనగల పలువురు తమ సందేశాన్ని ఇచ్చి ఎన్నారైలలో స్ఫూర్తి నింపారు. వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కి ఫోన్ ద్వారా తమ సందేశాన్ని ఇచ్చి సామాజిక సేవలో ముందంజలో ఉండాలని పిలుపు నిచ్చారు.
అలాగే లండన్ నుండి ఎన్నారై కో-ఆర్డినేటర్ గంప వేణుగోపాల్ మాట్లాడుతూ తమ మద్దతు కాంగ్రెస్‌కు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఎన్నారై సెల్‌కి డా. బీ వినోద్‌ను చైర్మన్‌గా, మన్యం రాజశేఖర్ రెడ్డిని కన్వీనర్‌గా, మేక దేవి ప్రసాద్ రెడ్డిని కో-కన్వీనర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. శ్యామ్ ప్రసాద్, ఇమ్రాన్ మొహమ్మద్, ఉదయ్ కిరణ్, రాంబాబు, సంజయ్‌లను కమిటీ మెంబర్లుగా నియమిస్తున్నట్లు తెలిపారు.