ప్రేమను పండించిన ‘స్వాతంత్య్రం’
సుప్రసిద్ధ భారతీయ ఆంగ్ల రచయిత ఆర్ కె నారాయణ్ సృష్టించిన కాల్పనిక గ్రామం మాల్గుడి పరిసరాలు ఆధా రంగానే ‘మహాత్ముని కోసం నిరీక్షణ’ నవల రూపొం దింది. ఇద్దరు సాధారణ యువతీ యువకుల ప్రేమ జీవిత క్రమంలో.. జాతీయోద్యమ కాలపు ఉద్విగ్నత లను చిత్రించిన ఈ నవల రచయిత రచనల్లో అత్యంత విజయవంతమైన నవలగా చరిత్రకెక్కింది. ఈ కథలో ప్రధాన పాత్ర శ్రీరామ్. హైస్కూల్ చదువు పూర్తి చేశాక మాల్గుడిలో తన అమ్మమ్మతో కలిసి నివసిస్తుంటాడు.
మహాత్మాగాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న భారతి పట్ల ఆక ర్షణలో పడతాడు శ్రీరామ్. ఆమె పట్ల ప్రేమ భావం శ్రీరామ్‌ను కూడా క్విట్ ఇండియా ఉద్యమంవైవు మర లిస్తుంది. ఒక క్రమంలో అతడు బ్రిటిష్ వ్యతిరేక తీవ్ర వాదులతో చేయి కలిపి, గ్రామీణ ప్రాంత అజ్ఞాత కార్య క్రమాల్లో పాల్గొంటాడు. తన కార్యకలాపాల ఫలితంగా జైలుకు వెళతాడు. తిరిగివచ్చిన తర్వాత భారతిని కలు స్తాడు. దేశ విభజన మధ్యనాటి ఉద్విగ్న పరిస్థితుల మధ్య భారతి, శ్రీరామ్ మహాత్మాగాంధీ అంగీకారంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు
భారతిలోని హాస్యప్రవృత్తి, చిరచిరలాడే స్వభా వం, సమర్థత, నమ్రత శ్రీరామ్‌ని కట్టిపడేస్తుంది. కానీ శ్రీరామ్‌లోని చపలచిత్తం కారణంగా.. తొలుత మహా త్ముడి ఆదర్శాల పట్ల విశ్వాసం ప్రకటించి న ప్పటికీ, ప్రజాకర్షణ కలి గిన జగదీష్ వంటి జాతీయ విప్లవకారుల ప్రభావానికి కూడా అతడు సులువుగా గుర వుతుంటాడు. వలసవాద వ్యతి రేక పోరాటంలోని ద్వంద్వ, అనిశ్చిత పరిస్థితిని, ప్రజ లపై దాని ప్రభావాన్ని అత్యంత ప్రభావవంతంగా చిత్రించిన విశిష్ట నవల ‘మహాత్ముని కోసం నిరీక్షణ’. తమ తమ వ్యక్తిగత సంకుచిత ప్రయోజనాలు, ఆలోచ నల మధ్యలోంచే భారతీయులు స్వాతంత్య్రోద్యమాన్ని ఎలా నిర్మించారు, ఎలా పాల్గొన్నారు, స్వీయ జాగరూ కత, వైయక్తిక దార్శనికత గురించిన గాంధీ బోధనలను వారు తమలో ఎలా ఇంకింప చేసుకున్నారనే చరిత్రను కళ్లకు కట్టిన నవల ఇది.
స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో సాగే అద్భుతమైన ప్రేమ గాథ ‘వెయిటింగ్ ఫర్ ది మహాత్మా‘ను ఆర్.కె. నారాయణ్ రచించగా అంతే ఆసక్తికరంగా సరళమైన వ్యవహారిక భాషలో రచయిత వేమవరపు భీమేశ్వరరావు అనువదించారు. తొలుత ఫిజిక్స్ మాస్టారు, తర్వాత హోమియో డాక్టర్, ఆ తర్వాత రచయితగా మారిన భీమే శ్వరరావు ఆర్కే నారాయణ్ ఆత్మను తెలుగులోకి తీసుకు రావడంలో విజయం సాధించారు. 1940లో స్వాతంత్రో ద్యమంతోపాటు భారత్‌లో ఆవిర్భవిస్తున్న సామాన్యుడి ఆకాంక్షల క్రమవికాసాన్ని, నాటి సామాజిక స్థితిగతు లను ప్రతిభావంతంగా వివరించిన నవలను తెలుగు పాఠకులకు అందించారు.
ఎప్పుడో కాలేజీ రోజుల్లో చదివిన ‘వెయిటింగ్ ఫర్ ది మహాత్మా’ ఆంగ్ల గ్రంథాన్ని డెబ్బై ఏళ్ల వయస్సులో తెనిగించి తన ఇష్ట రచయితకు అనువాదకులు చేసిన అక్షర నివాళి ఇది. యాభై ఏళ్ల క్రితం ‘చెట్టునీడ’ కథ ప్రచురించిన తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు రచనా వ్యాసంగం చేపట్టిన భీమేశ్వరరావు గాంధీ ఆశయాలతో అంతర్లీనమైన ప్రేమకథను ఇష్టంగా తెలుగు పాఠకులకు అందించారు. 1920ల నాటి స్వాతం త్య్రోద్యమ కాలం నుంచి 1970ల నాటి నక్సలైట్ ఉద్య మం వరకు సాగిన తెలుగు రాజకీయ, సామాజిక పరి ణామాలను ‘అతడు ఆమె’ సీక్వెల్ నవలా రచన ద్వారా ఉçప్పల లక్ష్మణరావు అద్భుతంగా చిత్రిం చారు. మహాత్ముని ఆదర్శాలు, వ్యక్తిగత ఆకాంక్షలు ప్రాతిపదికన ఆర్కే రచన కూడా ఇలాగే సాగడం విశేషం.
‘మహాత్ముని కోసం నిరీక్షణ’, పేజీలు 260, వెల: రూ.150, ప్రతులకు: అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు, రచయిత భీమేశ్వరరావు వేమవరపు, సికింద్రాబాద్, మొబైల్ నంబర్ : 98497 78163
కె. రాజశేఖరరాజు