భీమసేనుడు | Maruti Shastri opinion on Bhimasena | Sakshi
Sakshi News home page

భీమసేనుడు

Published Tue, Aug 9 2016 1:49 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

భీమసేనుడు

భీమసేనుడు

భీముడు అంటే కుంతీపుత్రుడయిన భీమసేనుడే కాదు. భయం కలిగించగల వాడెవరయినా భీముడే. శ్రీమన్నారాయణుడికి ‘భీమో, భీమ పరాక్రమః’ అని విష్ణు సహస్ర నామాలలో రెండు నామాలు కనిపి స్తాయి. మన పౌరాణిక నామాలు దాదాపు అన్నీ సార్థక నామాలే. ఆ పేర్లకు ఆ వ్యక్తుల గుణ గణా లతోనో, ఘన కార్యాలతోనో జీవిత విశేషాలతోనో ముడిపడిన వ్యుత్పత్తి అర్థాలు ఉంటాయి. సాధారణ అర్థంలో మాత్రం భీముడు అంటే వాయుదేవుడి వరం వలన కుంతీదేవికి కలిగిన భీమబలుడైన కుమారుడు.

బాల్యం నుంచే భీముడు బండలు పిండి చేయగల బలశాలి. పాండవుల పట్ల దుర్యోధనుడి ఈర్ష్యకు తొట్ట తొలి కారణం భీముడి అసాధారణ మైన శరీర బలం. కౌరవ పాండ వులు కలసి పెరుగుతూ విద్యా భ్యాసం చేసే రోజులలో, భీముడు కొంటెతనంతో తన భుజబలాన్ని తన సవతి తమ్ముళ్ల మీద ప్రయో గించే వాడని భారతం చెప్తుంది. పది పదిహేనుమంది కౌరవులని ఒక్కసారి చంకనెత్తుకొని నీళ్లలో ముంచే వాడు. వాళ్లు చెట్లెక్కి పళ్లు కోస్తుంటే, చెట్టునే కదిలించి చెట్టు పళ్లనూ, వాటిని కోస్తున్న పిల్లలనూ ఏకకా లంలో కిందికి రాల్చేసి నవ్వేవాడు. జన్మతః ఈర్ష్యాళు వైన దుర్యోధనుడికి భీముడి బాహుబలమంటే కంట గింపు. అది భీముడిని కుట్రలు చేసి చంపి వేసే ప్రయ త్నాల దాకా వెళ్లింది.



అయితే దుర్మార్గుడి దుర్మార్గం వల్ల కూడా సజ్జ నుడు సత్ఫలితాలే పొందుతాడు.  నిద్రిస్తున్న భీముడి కాళ్లూ చేతులు కట్టివేసి దుర్యోధనుడు నీళ్లలో పారే యించినా, భీముడు పాతాళ లోకానికి వెళ్లి, వెయ్యి ఏనుగుల బలం వరంగా పొంది తిరిగి వచ్చాడు. భీముడు కార్యశూరుడేగానీ అతడిని కార్యోన్ముఖం చేసేందుకు గట్టి బాహ్య ప్రేరణ ఏదైనా కావాలి. అదృష్టవశాత్తూ అతడికి ధర్మరాజు మార్గదర్శనం లభించింది. అన్న వ్యూహానికి తన పరాక్రమం జోడించి ఎన్నో ఘన విజయాలు సాధించగలిగాడు. తల్లి దీవించి పంపగా వెళ్లి ప్రజాకంటకుడైన బకాసు రుడిని పరిమార్చాడు. శ్రీకృష్ణుడి ప్రోత్సాహంతో మహా వీరుడైన జరాసంధుడిని మట్టుపెట్టాడు. ద్రౌపది ప్రేర ణతో కీచకుడిని చంపి మూటగట్టాడు.
 యుద్ధంలో కౌరవులను ఎక్కువ మందిని భీముడే చంపేస్తాడు. ఆ పగతోనే, దృతరాష్ర్టుడు, యుద్ధానంతరం, అన్ని పాత వైరాలూ మరిచిపోయి ఆప్యాయంగా కౌగిలించుకొనే మిషతో భీముడిని తన ఉక్కు కౌగిలిలో నలిపి చంపటానికి సిద్ధపడతాడు. వ్రతం చెడిందే గానీ ఫలం దక్కలేదు. యతో ధర్మ స్తో జయ అన్న పాఠాన్ని ఆ మోహాంధుడైన రాజుకు నేర్పేం దుకు విధి చేసిన ఆఖరి ప్రయత్నం అది.
                                                                                                                                                    - ఎం. మారుతి శాస్త్రి
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement