ఎన్నారైల రక్షణే కర్తవ్యం | YS Jagan Mohan reddy letter to MEA Sushma swaraj on NRIs safety | Sakshi
Sakshi News home page

ఎన్నారైల రక్షణే కర్తవ్యం

Published Tue, Feb 28 2017 12:51 AM | Last Updated on Wed, Jul 25 2018 4:42 PM

ఎన్నారైల రక్షణే కర్తవ్యం - Sakshi

ఎన్నారైల రక్షణే కర్తవ్యం

- అమెరికాకు ఉన్నత స్థాయి బృందం పంపండి
- విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు వైఎస్‌ జగన్‌ లేఖ


అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించేందుకు అన్నివిధాలా పటిష్ట మైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సోమవారం విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కోరారు. జాత్యహంకార ధోరణితో ఉత్పన్న మైన సమస్యల పరిష్కారానికి ప్రధాని నరేంద్ర మోదీ లేదా విదేశాంగ మంత్రి సారథ్యంలో ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం అమెరికా వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కేంద్రం తీసుకునే అన్ని చర్యలకు తాము సంపూర్ణ మద్దతునిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు కేంద్రమంత్రికి వైఎస్‌ జగన్‌ ఒక లేఖ రాశారు. వివరాలు...

మేడమ్,
అమెరికాలో భారతీయ ఇంజనీర్లు శ్రీనివాస్‌ కూచిభొట్ల, మేడసాని అలోక్‌పై జరిగిన జాత్యహంకార దాడిలో శ్రీనివాస్‌ మరణించడం, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు, ఆవేదన నెలకొని ఉండటం బాధ కలిగిస్తోంది. అమెరికాలో నివ సిస్తున్న భారతీయుల రక్షణ, భద్రత అంశాలపై శ్రీని వాస్‌ సతీమణి సునయన దుమాల లేవనెత్తిన ప్రశ్నలు అమెరికా ప్రభుత్వ పరి పాలనా యంత్రాంగం తీరుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న భారతీయుల ప్రయో జనాలను కాపాడాల్సిన బాధ్యత భారత ప్రభు త్వంపై ఉంది కనుక ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణించాలి. 32 లక్షల మందితో కూడిన బలమైన భారతీయ అమెరికన్‌ సమాజం, ప్రస్తుతం వివిధ యూనివర్సిటీల్లో చదువు కుంటున్న మరో లక్ష మంది విద్యార్థులతో అమెరికాలో మనం ఓ గణనీయమైన సంఖ్యలోనే ఉన్నాం. ఇప్పుడు వారంతా తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. తమ వ్యక్తి గత క్షేమం, ఉద్యోగ భద్రత, భవిష్యత్తులో వ్యాపార, ఉద్యోగ అవకాశాల విషయమై వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది.

2016 మొదలుకుని వరసగా రెండో ఏడాదిలో కూడా అమెరికాలో విద్వేష ముఠాల సంఖ్య పెరుగు తున్నట్టుగా ఇటీవలి ఒక అధ్యయనం వెల్లడించింది. అమెరికా పాలకుల మారుతున్న విధానాల కారణంగా సమీప భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి కొనసాగేలా ఉంది. అయితే ఇటీవలి దాడుల విషయంలో మీరు సత్వరమే స్పందించిన తీరును, అలాగే బాధిత కుటుం బాలకు విషాద సమయంలో అన్నివిధాలా భరోసా కల్పించడాన్ని నేను అభినందిస్తున్నాను.

అదే సమయంలో ఈ సమస్య పరిష్కారం దిశగా ఉభయ ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకోని పక్షంలో భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని దాడులు పునరా వృతం అయ్యే అవకాశం ఉంది. పరిస్థితి మరింత విషమించకముందే.. భారత్‌ విషయంలో స్నేహపూర్వక దృక్పథంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ముందుకు వచ్చేలా చూడటం ద్వారా ఆ దేశంతో మన సంబం ధాలు బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
భారతీయ అమెరికన్లు సుదూర ప్రాంతంలో ఉంటున్నప్పటికీ భారత దేశాభివృద్ధిలో వారు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు ప్రపంచ స్థాయి విజయాలతో మన దేశం గర్వపడేలా చేశారు. వ్యాపార, వాణిజ్య, విద్య, వైద్య రంగాలతో పాటు భారత గ్రామీణాభివృద్ధికి వారు చేసిన కృషి వెలకట్టలేనిది. అక్కడి మన సోదరుల ఆందోళనలో పాలు పంచుకోవ డానికి, వారిపై మన ప్రేమాభిమానాలను వ్యక్తం చేయ డానికి ఇదే సరైన సమయమని నేను భావిస్తున్నాను. క్లిష్ట పరిస్థితుల్లో మనం అండగా నిలిచి మనవారి ప్రయో జనాలను పరిరక్షించాల్సిన అవసరం ఉంది.

అందువల్ల అమెరికాలోని మన వృత్తి విద్యా నిపు ణులు, వ్యాపారులు, విద్యార్థుల హక్కులు, ప్రయోజ నాలు, ప్రాణాలను కాపాడటానికి బలమైన రక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరు తున్నాను. అమెరికా విదేశాంగ, న్యాయ, హోం శాఖలతో కలసి పనిచేయడం ద్వారా.. జాత్యహంకార నేరా లకు సంబంధించిన సమస్యలు, ఇమ్మి గ్రేషన్‌ అంశాలపై భారతీయ అమెరిక న్లకు ఎప్పటికప్పుడు సరైన న్యాయ సహాయం అందేలా చూడటం, ప్రయా ణాలు, బస తదితర అంశాలపై అప్రమత్తం చేసేలా హెచ్చరికల జారీ వంటి చర్యలు ఇందులో అంత ర్భాగంగా ఉండాలి.

ఈ విషయంలో తగిన చర్యలు చేపట్టేలా చూసేం దుకు వీలుగా, భారత్, అమెరికా దేశాలు ఒక్కటిగా ఉన్నాయని స్పష్టం చేసేందుకు ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో గానీ, మీ (సుష్మా స్వరాజ్‌) సారథ్యంలో గానీ ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం అమెరికాకు వెళ్లాలి. ఇది అమెరికా ప్రజలకు, ముఖ్యంగా జాత్య హంకార ముఠాలకు.. మనం వారికి బలమే తప్ప శత్రువులం ఎంతమాత్రం కాదనే ఒక గట్టి సందేశా న్నిస్తుంది. ఈ విషయంలో మీ గట్టి జోక్యం అవసరమైన మార్పును తీసుకువస్తుందని నేను భావిస్తున్నాను. భార తీయ అమెరికన్లకు మద్దతుగా నిలిచేందుకు, అలాగే భారత్, అమెరికాల ప్రయోజనాల పరిరక్షణకు మీరు తీసుకునే అన్ని రకాల చర్యలకు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇస్తున్నాను.

అభినందనలతో....
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement