
తెలుగు హీరోయిన్ అదితిరావు హైదరి త్వరలో పెళ్లికూతురిగా ముస్తాబు కానుంది.

తెలుగు హీరోయిన్ అదితిరావు హైదరి త్వరలో పెళ్లికూతురిగా ముస్తాబు కానుంది. హీరో సిద్దార్థ్‌తో ఏడడుగులు వేయనుంది. చాలాకాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట మార్చి 27న సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు.

త్వరలోనే ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారు.

నేడు (ఏప్రిల్ 17) సిద్దార్థ్ బర్త్‌డే. కాబోయే భర్తకు క్యూట్ విషెస్ చెప్పింది అదితి.

ఈ నవ్వులు- సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. నీకు మరింత శక్తి అందాలి.

పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇట్లు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండే చీర్‌లీడర్' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.

దీనికి సిద్దార్థ్‌తో దిగిన కొన్ని ఫోటోలను జత చేసింది.









