1/16
కంటెంట్ బాగుంటే ఏ భాషలో తెరకెక్కిన చిత్రాన్నైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువు చేసింది ‘ప్రేమలు’
2/16
దర్శకధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో ఈ చిత్రాన్ని మార్చి 8న రిలీజ్ చేశాడు. దర్శకుడితో పాటు నటీనటులంతా కొత్తవారే అయినా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారు
3/16
ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు తమదైన అభినయంతో అకట్టుకున్నారు. ముఖ్యంగా హీరోయిన్‌గా నటించిన మమితా బైజు.. ప్రస్తుతం టాలీవుడ్ యువత కలల రాణిగా మారిపోయింది
4/16
ఈ చిత్రంలో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ రీనూ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. అమాయకపు మాటలు.. చూపులతో అందరిని కట్టిపడేసింది
5/16
ఈ సినిమా రిలీజ్ తర్వాత చాలా మంది మమిత గురించి గూగుల్‌లో సెర్చ్ చేయడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన పాత వీడియో క్లిప్పులను షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు
6/16
రాజమౌళి సైతం ఈ బ్యూటీ నటనపై ప్రశంసలు కురిపించడం మరో విశేషం. గీతాంజలి ఫేం గిరిజ, ఫిదా బ్యూటీ సాయి పల్లవితో మమితా బైజును పోలుస్తూ చాలా సహజంగా నటించిందని అభినందించాడు.
7/16
కేరళలోని కొట్టాయంలో జన్మించిన మమిత..ప్రస్తుతం సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేస్తోంది. స్కూల్ డేస్‌లో సాంస్కృతిక కార్యక్రమాల్లో చరుగ్గా పాల్గొనేది.
8/16
మమితా బైజు కెరీర్ తొలినాళ్లలో సపోర్టింగ్ క్యారెక్టర్లు ప్లే చేసింది. తొలి సినిమా ‘సర్వోపరి పలక్కరన్(2017’). ఇందులో ఆమె సహాయ నటిగా నటించింది.స్కూల్‌లో ఇచ్చిన ఓ ప్రదర్శన కారణంగా ఆమెకు ఈ అవకాశం లభించింది
9/16
ఆ తర్వాత ‘హనీ బీ 2: సెలబ్రేషన్స్’ ‘డాకినీ’, ‘స్కూల్ డైరీ’, ‘వికృతి’, ‘కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్’, ‘ఆపరేషన్ జావా’ లాంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
10/16
2021లో వచ్చిన ‘ఖోఖో’ సినిమాలో టీమ్ కెప్టెన్ పాత్ర పోషించి.. తనదైన నటనతో ఆకట్టుకుంది. ఈ చిత్రానికిగాను ఉత్తమ సహాయ నటిగా ‘కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు’ అందుకుంది.
11/16
ఇక గతేడాది ‘ప్రణయ విలాజం’. ‘రామచంద్ర బాక్ అండ్ కో’ సినిమాలతో మలయాళ ప్రేక్షకుల్ని అలరించింది.
12/16
టాలీవుడ్ హీరోల్లో అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని..అతనితో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది మమితా
13/16
14/16
15/16
16/16