

ప్రస్తుతం ఆమె అటు జూనియర్ ఎన్టీఆర్‌తో, ఇటు రామ్‌చరణ్‌తో సినిమాలు చేస్తోంది.

ఇదిలా ఉంటే జాన్వీకి దైవభక్తి ఎక్కువే! తరచూ ఆమె తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటుంది.

తండ్రిని తోడు తీసుకెళ్లకపోయినా ప్రియుడు శిఖర్ పహారియాను వెంటేసుకుని వెళ్తుంది.

అతడిని ముద్దుగా శిఖు అని పిలుస్తూ ఉంటుంది.

ఇటీవల ఓ ఈవెంట్‌లో శిఖు అని రాసి ఉన్న నెక్లెస్ ధరించి అతడిపై ఉన్న ప్రేమను చెప్పకనే చెప్పింది.

దీనికంటే ముందే బోనీకపూర్ సైతం తనకు శిఖర్ అంటే ఎంతో ఇష్టం, గౌరవమని చెప్పాడు.

అతడు ఎప్పటికీ తమతోనే ఉండాలని ఆకాంక్షించాడు. అతడు తమ కుటుంబానికి దొరకడం ఎంతో అదృష్టమన్నాడు. శి

శిఖర్‌ను ఇంతగా అభిమానిస్తున్న బోనీ.. కూతురి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇంతదాకా వచ్చాక పెళ్లి చేస్తే పోలా అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.



















