

చిన్నప్పుడు ట్రోఫీ గెలిచిన ఈ పాప వయ్యారానికి కేరాఫ్ అడ్రస్!(ఫోటోలు)

ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి టాలీవుడ్‌లో ఓ బ్యూటిఫుల్ హీరోయిన్.

కన్నడ సినిమాతో వెండితెరకు పరిచయమై తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సెటిలైపోయింది.

ప్రస్తుతం హీరో నిఖిల్‌తో కలిసి సినిమా చేస్తోంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? తనే బ్యూటిఫుల్ హీరోయిన్ నభా నటేష్.

బెంగళూరులో మోడలింగ్ చేసిన నభా వీధి నాటకాలు కూడా ప్రదర్శించింది. ఆ అనుభవంతోనే సినిమాల్లోకి రావాలన్న ఆలోచన వచ్చింది.

సరిగ్గా అప్పుడే కన్నడలో శివరాజ్‌కుమార్ పక్కన వజ్రకాయ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. మూడు నెలలపాటు ట్రైనింగ్ తీసుకుని ఆ సినిమా చేసింది. పొగ అంటేనే పడని ఈ బ్యూటీ అందులోని పాత్ర కోసం బీడీలు కూడా కాల్చింది. ఆ కష్టం ఊరికే పోలేదు.

తెలుగులో ఆమె మొదటి సినిమా అదుగో. కానీ దీనికంటే ముందు నన్ను దోచుకుందువటే రిలీజైంది.

ఇస్మార్ట్ శంకర్, సోలో బ్రతుకే సో బెటర్, మాస్ట్రో వంటి చిత్రాలతో అలరించింది. ఈ మధ్యే డార్లింగ్ సినిమాతో పలకరించింది. ప్రస్తుతం స్వయంభు మూవీ చేస్తోంది.

నేడు (నవంబర్ 14న) చిల్డ్రన్స్ డే సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ట్రోఫీలను తీసుకోవడం అంటే ఇష్టమంటున్న బ్యూటీ.. చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది.




