Top Stories
ప్రధాన వార్తలు

అంబేద్కర్ జయంతి.. వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి. ఈ సందర్భంగా అంబేద్కర్‌కు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళి అర్పించారు. అంబేద్కర్ ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని చెప్పుకొచ్చారు.అంబేద్కర్ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారు. సమానత్వం, సాధికారతను అందించారు. మన పరిపాలనలో అంబేద్కర్ ఆశయాలతో ముందడుగు వేశాం. రాష్ట్రంలోని అణగారిన వర్గాలకు గౌరవం, న్యాయం అందించడానికి ఎప్పుడూ పని చేస్తాం. అంబేద్కర్ ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం. ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం’ అని అన్నారు.

జగన్ విజన్ బాబు తలకెక్కిందా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు అసలు విజనరీ ఎవరో అర్థమై ఉండాలి. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన ఒకే ఒక్క మంచి పనితో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దూరదృష్టి, దార్శనికత ఏమిటో తెలిసి వచ్చి ఉంటుంది. బాబు ఇటీవల వెళ్లిన ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన అభివృద్ధి.. పిల్లలు ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడేయడం, చూసిన తరువాత కూడా బాబుకు చేయాల్సిందేమిటి? చేస్తున్నదేమిటన్న ఆత్మవిమర్శ చేసుకోకపోతే దానికి ఆయనే బాధ్యుడు అవుతాడు. వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో జరిగిన సంస్కరణలపై ఇప్పటివరకూ చంద్రబాబు ఎల్లో మీడియా ముఖ్యంగా ఈనాడు పత్రిక లేదా టీవీ ఛానల్లో రాసిన పచ్చి అబద్దాల వార్తలు మాత్రమే చూసి ఉంటారు. ఇప్పుడు వాస్తవం తెలుసుకుని ఉంటారు. ఇంతకాలం తాను చేసిందేమిటన్న స్పృహ ఆయనకు వచ్చి ఉంటే మంచిదే. జగన్ ముఖ్యమంత్రిగా విద్య, వైద్య రంగాలకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. ఇందుకోసం వేలాది కోట్లు ఖర్చు పెట్టి స్కూళ్లు, ఆస్పత్రులు బాగు చేశారు. స్కూల్స్‌లో బల్లల మొదలు, టాయిలెట్ల వరకు, పిల్లల డ్రెస్ మొదలు, వారు తినే ఆహార పదార్ధాల వరకు జగన్ పర్యవేక్షించేవారు. పిల్లలకు పోషకాహారం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.అంతకుముందు చంద్రబాబు 2014 హయాం వరకు పాడైపోయి ఉన్న స్కూళ్లను ఒక విప్లవం మాదిరి జగన్ దశల వారీగా బాగు చేయించారు. ప్రభుత్వ స్కూళ్లు అంటే నరకప్రాయం అన్న అభిప్రాయాన్ని తొలగించి, వాటిని ఆహ్లాదకరమైన ప్రదేశాలుగా తీర్చి దిద్దారంటే అతిశయోక్తి కాదు. తాగునీటి సదుపాయంతోపాటు, స్కూల్ ఆవరణ అంతా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టారు. టాయిలెట్స్ నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. పాఠ్య పుస్తకాలు రెండు భాషల్లో (ఇంగ్లీషు, తెలుగు)నూ చదువుకునే వెసులుబాటు కల్పించారు. అంతర్జాతీయ స్థాయి ఐబీ కోర్సు, టోఫెల్ వంటి పరీక్షలకు మూడో తరగతి నుంచే విద్యార్థులను సన్నద్ధం చేసేలా చర్యలు తీసుకున్నారు. దాంతో ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్దులంతా జగన్ మామ అని పిలుచుకునేవారు.అన్నింటినీ మించి పిల్లలు స్కూళ్లు మానివేయకుండా అమ్మ ఒడి అనే స్కీమ్ ను తెచ్చి విద్యార్ధుల సంఖ్య పెరిగేలా చేశారు. ఇంత చేస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పిస్తుండేది. కానీ, ఎన్నికల నాటికి వాస్తవం తెలుసుకుని విద్యార్ధి ప్రతీ ఒక్కరికి రూ.15 వేలు చొప్పున ఇస్తామంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నిమ్మల రామానాయుడు వంటివారు ఎక్కాలు చదివినట్లు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీని మరిచారు. దాంతో ఈ ఏడాది ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గింది. జగన్ సంస్కరణలు తీసుకు వస్తే వాటికి వ్యతిరేకంగా టీచర్లను టీడీసీ నేతలు రెచ్చగొట్టారు. మెగా డీఎస్సీ నిర్వహించి స్కూళ్లలో టీచర్ల పోస్టులను భర్తీ చేస్తామని ప్రచారం చేశారు.ఇన్ని హామీలు ఇచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. పైగా ఉన్న ఐబీ సిలబస్ ఎత్తివేసింది. పాఠశాలల్లో ఆంగ్ల మీడియం ఉందో, లేదో తెలియదు. టోఫెల్ కోచింగ్ రద్దు చేశారు. ముఖ్యమంత్రి కుమారుడు లోకేశే మంత్రి అయినా విద్యా వ్యవస్థ అధ్వాన్నంగా మారే పరిస్థితులు సృష్టించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్లలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అక్కడి సదుపాయాలను పరిశీలించి పిల్లలతో మాట్లాడారు. వారు ఆంగ్లంలో మాట్లాడుతుంటే బహుశా ఆయన ఆశ్చర్యపోయి ఉండాలి. గతంలో ఆంగ్ల మీడియంను ఆయనతో సహా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వ్యతిరేకించే వారు. చంద్రబాబుకు ఆ పిల్లలలో ఉన్న బలమైన ఆకాంక్ష ఏమిటో అర్థమై ఉండాలి.విద్యార్ధులు వారు చేస్తున్న ప్రయోగాల గురించి ఇంగ్లీష్‌లో వివరిస్తుంటే, బాబు గారు మధ్య, మధ్యలో ఎక్కువ భాగం తెలుగులోనే మాట్లాడారు. ఒక బాలిక ‘‘కలర్‌పుల్ గుడ్ మార్నింగ్’’ అని అన్నప్పుడు అలా ఎందుకు అన్నావు అని ప్రశ్నించి, ఇన్నోవేటివ్‌గా మాట్లాడావు కాబట్టి ఆకర్షించావు అని సీఎం వ్యాఖ్యానించారు. నిజానికి ఆయన కేవలం ఆ బాలిక మాటలకే కాదు. మాజీ సీఎం జగన్ తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులకు కూడా ఆకర్షితులై మరో బాలుడిని భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు అన్నప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవ్వాలని ఉందని జవాబు ఇచ్చాడు. దానికి ఏమి చదవాలని అడిగితే ఇంగ్లీష్ అని చెప్పేసరికి చంద్రబాబు అవాక్కై ఉండాలి. కొంతకాలం క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లాలో ఒక స్కూల్ ను సందర్శించి ప్రైవేటు స్కూళ్ల మాదిరి సదుపాయాలు ఉన్నాయని ప్రశంసించారు. మంత్రి లోకేష్ కూడా ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న వాస్తవ పరిస్థితి గమనించి ఒకింత ఆశ్చర్యపడిన వీడియోలు గతంలో వచ్చాయి.ఇప్పుడు చంద్రబాబు స్వయంగా చూశారు. అయినా వారిలో అహం దెబ్బతింటుంది కనుక, జగన్ పాలనలో జరిగిన ఈ మార్పులను అంగీకరించడానికి మనసు అంగీకరించదు. అంతేకాక చంద్రబాబుకు ప్రభుత్వ స్కూళ్లపై అంత నమ్మకం ఉన్న మనిషి కాదని అంటారు. కొందరు కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల యజమానులకు ఆయన ఆప్త మిత్రుడు. అలాంటి వారిలో ఒకరైన నారాయణ చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి. అయినా ఫర్వాలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా ఈ స్కూళ్లను పాడు చేయకుండా వాటిని జగన్ టైమ్ నాటి ప్రమాణాలతో కొనసాగిస్తే మంచిదే. కాని పలు స్కూళ్లలో పారిశుద్ధ్యం కొరవడిందని వార్తలు వస్తున్నాయి. దానికి కారణం గతంలో ఉన్న విధంగా ఇప్పుడు ప్రత్యేక సిబ్బంది లేకపోవడమే. విద్యా రంగానికి సంబంధించి జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు యథావిధిగా కొనసాగించితే ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేద పిల్లలకు న్యాయం చేసినట్లవుతుంది. జగన్ ఫోబియాతో బాధపడుతున్న వారికి అది ఎంతవరకు జరుగుతుందో తెలియదు. ఇక్కడ ఒక కొసమెరుపు ఉంది. చంద్రబాబు స్కూల్‌కు రావడం సంతోషంగా ఉందని ఒక బాలిక అంది. ఎందుకు అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు ఆ బాలిక సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయిందట.అంటే ఏదో మర్యాద కోసం అలా మాట్లాడిందే తప్ప ఇంకొకటి కాదేమో అన్న వ్యాఖ్యలు వచ్చాయి. అదే జగన్ సీఎం హోదాలో వచ్చి ఉంటే తాము సంతోషానికి ఆ బాలికలు వంద కారణాలు ఉండేవి. మరి ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు స్కూల్‌కు వచ్చినా, రాకపోయినా పెద్దగా తేడా లేదన్న భావన ఉండవచ్చు. ఎందుకంటే వారేమీ తమ హయాంలో స్కూళ్లను ఇలా మెరుగు పరచలేదు కనుక. జగన్ మంచి చదువే పేద పిల్లలకు ఇచ్చే సంపద అని పలుమార్లు చెప్పేవారు. అదే చంద్రబాబు మాత్రం విద్య ప్రభుత్వ బాధ్యత కాదని గతంలోనే చెప్పుకున్నారు. తన మనుమడు దేవాన్శ్‌ను మంచి ప్రైవేటు స్కూల్లో చదివిస్తుండవచ్చు. అలాగే ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేద పిల్లలను కూడా అదే తరహాలో భావించి మంచి విద్య ఇవ్వడానికి యత్నిస్తే పేరు వస్తుంది. ఏది ఏమైనా విద్యకు సంబంధించి జగన్ విజన్ ను చంద్రబాబు అంగీకరించక తప్పదు కదా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

అప్పటి నోటిఫికేషన్లకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవు: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ అమలు చరిత్రాత్మకమైనదని చెప్పుకొచ్చారు. ఈరోజు నుంచే ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లు అమలవుతాయని స్పష్టం చేశారు. త్వరలోనే అన్ని నోటిఫికేషన్లు ఎస్సీ రిజర్వేషన్ల అమలుతో విడుదల అవుతాయని తెలిపారు. ఇదే సమయంలో గత ఏడాది ఫస్ట్ ఆగస్టు కు ముందు ఇచ్చిన నోటిఫికేషన్లకు ఈ రిజర్వేషన్లు వర్తించవు అని కార్లిటీ ఇచ్చారు.రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ (SC classification) అమలు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవో తొలి కాపీనీ మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) సచివాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో మంత్రులతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ఎస్సీ రిజర్వేషన్లపై ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అమలు అవుతాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు లోబడి ఎస్సీ రిజర్వేషన్లు అమలు అవుతాయి. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల పై అందరికీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నాం.ఎస్సీ వర్గీకరణ పూర్తి అయ్యే వరకు నోటిఫికేషన్ ఇవ్వవద్దు అని అనాడు చెప్పాము. రేపు సబ్ కమిటీ ఉన్నతాధికారులతో నోటిఫికేషన్ ప్రక్రియపై భేటీ అవుతాయి. త్వరలోనే అన్ని నోటిఫికేషన్లు ఎస్సీ రిజర్వేషన్ల అమలుతో విడుదల అవుతాయి. 59 ఉప కులాలకు ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయడానికి వన్ మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్ పని చేసింది. 50వేల వినతులను అక్తర్ కమిషన్ పరిశీలన చేసి ఎస్సీ రిజర్వేషన్లు మూడు కేటగిరీలుగా విభజన చేశారు.గ్రూప్ఏ-1, గ్రూప్బీ-9, గ్రూప్‌సీ-5 శాతంతో అసెంబ్లీలో చట్టం చేశాం. గవర్నర్ ఆమోదం తెలిపారు. మొత్తం ఇండియాలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ రిజర్వేషన్లను అమలు చేస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ. ఇందుకు సంబంధించి జీవీ-33 విడుదల చేశాము. యాక్ట్ 15తో మూడు భాషల్లో విడుదల చేశాం. జీవీ-9ను విడుదల చేశాం. రాబోయే రోజుల్లో ఎస్సీ రిజర్వేషన్లు ఎంత పెరిగితే ఆ స్థాయిలో రిజర్వేషన్లు అమలు చేస్తామని వ్యాఖ్యలు చేశారు.

ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా సౌరవ్ గంగూలీ పునర్నియామకం
ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) మెన్స్ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పునర్నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఐసీసీ గ్లోబల్ గవర్నింగ్ బాడీ ఆదివారం (ఏప్రిల్ 13) ప్రకటించింది. గంగూలీ దీర్ఘకాల సహచరుడు వీవీఎస్ లక్ష్మణ్ కూడా ప్యానెల్ సభ్యులలో ఒకరిగా మళ్లీ ఎంపికయ్యారు.2000 నుండి 2005 వరకు భారత జట్టుకు నాయకత్వం వహించిన గంగూలీ 2021లో తొలిసారి ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. నాటి నుంచి గంగూలీ ఈ పదవిలో కొనసాగుతున్నారు. 52 ఏళ్ల గంగూలీ భారత లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే నుండి ఈ పదవిని స్వీకరించారు. కుంబ్లే గరిష్టంగా అనుమతించబడిన మూడు మూడు సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసిన తర్వాత పదవీ విరమణ చేశారు. గంగూలీ, లక్ష్మణ్‌లతో పాటు కొత్తగా ఏర్పాటు చేయబడిన కమిటీలో ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఆటగాడు హమీద్ హసన్, వెస్టిండీస్ బ్యాటింగ్ ఐకాన్ డెస్మండ్ హేన్స్, దక్షిణాఫ్రికా ప్రస్తుత టెస్ట్ మరియు వన్డే జట్టు కెప్టెన్ టెంబా బవుమా, ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ జోనాథన్ ట్రాట్ ఉన్నారు.మహిళల క్రికెట్ కమిటీ విషయానికొస్తే.. న్యూజిలాండ్ మాజీ ఆఫ్ స్పిన్నర్ కేథరిన్ క్యాంప్‌బెల్ ఛైర్ పర్సన్‌గా ఎంపిక కాగా, ఆస్ట్రేలియా మాజీ క్రీడాకారిణి అవ్రిల్ ఫాహే, క్రికెట్ దక్షిణాఫ్రికా ఫోలెట్సి మోసేకి ఇతర సభ్యులుగా ఉన్నారు.ఆఫ్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్ల కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్అఫ్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్ల భవితవ్యంపై ఐసీసీ కీలక చర్య తీసుకుంది. తాలిబన్ల పాలన ప్రారంభమైన తర్వాత తీవ్రంగా ప్రభావితమైన ఆఫ్ఘనిస్తాన్ మహిళా క్రికెట్‌కు పునరుజ్జీవనం కలిగించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.తాలిబన్ పరిపాలనలో మహిళలు క్రీడల్లో పాల్గొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొందరు ఆఫ్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్లు ఆస్ట్రేలియా లాంటి దేశాలకు శరణార్థులుగా వెళ్లి క్రికెట్ ఆడుతున్నారు. ఇలాంటి వారితో పాటు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే ఆఫ్ఘనిస్తాన్ యువతులకు మద్దతుగా ఐసీసీ ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌తో పాటు ఆఫ్ఘన్ మహిళా క్రికెట్‌కు మద్దతు నిధిని ప్రారంభిస్తున్న విషయాన్ని ఐసీసీ అధ్యక్షుడు జై షా ఓ అధికారిక ప్రకటనలో తెలిపారు.

మతవాదులను సంతృప్తి పరిచిన కాంగ్రెస్: ప్రధాని మోదీ
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ హర్యానాలో పలు అభివృద్ది పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ(Prime Minister Modi) కాంగ్రెస్‌పై ఆరోపణల దాడి చేశారు. వక్ఫ్ (సవరణ) చట్టంపై తమ వైఖరి వెల్లడించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మతవాదులను సంతృప్తి పరచిందని ప్రధాని మోదీ ఆరోపించారు.ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ మతవాదులను సంతృప్తి పరచిందనడానికి వక్ఫ్ చట్టమే రుజువు అని అన్నారు. లక్షల హెక్టార్ల భూమిని వక్ఫ్ పేరుతో దక్కించుకున్నారని, వీటితో పేద ముస్లింలు ఏనాడూ ప్రయోజనం పొందలేదని మోదీ పేర్కొన్నారు. ఇక్కడ లాభపడింది భూ మాఫియానే అని అన్నారు. ఈ దోపిడీ ఇకపై కొత్త చట్టంతో ఆగిపోతుందని, సవరించిన వక్ఫ్ చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డు(Waqf Board) ఏ ఆదివాసీ భూమినీ క్లెయిమ్ చేయలేదని అన్నారు. ఇదే నిజమైన సామాజిక న్యాయమని, దీంతో పేద ముస్లింలు తమ హక్కులను కాపాడుకోగలుగుతారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ దార్శనికతకు ద్రోహం చేసిందని, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీలను రెండవ తరగతి పౌరులుగా చూస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. డాక్టర్ అంబేద్కర్ పేదలు, వెనుకబడిన వర్గాలకు గౌరవం ఇవ్వాలని కలలు కన్నారని, కానీ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల వైరస్‌ను వ్యాప్తి చేసి, అంబేదర్కర్ దార్శనికతకు అడ్డుకట్ట వేసిందని ప్రధాని పేర్కొన్నారు. వారు అంబేద్కర్ జీవించి ఉన్నప్పుడు కూడా అతనిని అవమానించారని, ఎన్నికల్లో ఓడిపోయేలా చేశారని, ఆయన వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి ప్రయత్నించారని ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఉమ్మడి పౌర చట్టాన్ని అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నదని, ఉత్తరాఖండ్(Uttarakhand)లో ఇప్పుడు లౌకిక పౌర కోడ్ అమలులో ఉందని, కాంగ్రెస్ ఇప్పటికీ దానిని వ్యతిరేకిస్తున్నదని ప్రధాని ఆరోపించారు.ప్రధాని వ్యాఖ్యలకు ప్రతిస్పందించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ అంబేద్కర్ ఆదర్శాలపై తమ పార్టీ ట్రాక్ రికార్డ్‌ను సమర్థించుకుంటూ, బీజేపీ చారిత్రక వంచనకు పాల్పడిందని ఆరోపించారు. ఇలాంటివారు అప్పట్లో బాబా సాహెబ్‌కు శత్రువులని, నేటికీ అలాగే ఉన్నారన్నారు. బాబాసాహెబ్ బౌద్ధమతాన్ని స్వీకరించినప్పుడు ఆయన అంటరానివాడిగా మారారని వారు ఆరోపించారని ఖర్గే పేర్కొన్నారు. నాడు ఆయనను హిందూ మహాసభ వ్యతిరేకించిందని అన్నారు. మహిళా చట్టంలో రిజర్వేషన్ కల్పించి, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలను ఖర్గే గుర్తు చేశారు. ఇది కూడా చదవండి: మూడు దశాబ్ధాల్లో 10 భారీ అగ్నిప్రమాదాలు

బంగారం తగ్గిందోచ్... గోల్డ్ స్పీడ్‌కు బ్రేక్!
వరుసగా ఐదు రోజులుగా దూసుకెళ్తున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. దేశంలో బంగారం ధరలు (Gold Prices) నేడు (April 14) కాస్త దిగొచ్చాయి. స్వల్పంగా రూ.150-రూ.160 మేర తగ్గుదల నమోదైంది. బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి.నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 87,550 వద్ద, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 95,510 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.150, రూ.160 చొప్పున తగ్గాయి.దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.95,660 వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,700 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.160, రూ.150 చొప్పున తగ్గుదలను నమోదు చేశాయి.ఇది చదివారా? అప్పుపై వడ్డీ తగ్గించిన ప్రముఖ బ్యాంక్చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 87,550 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 95,510 వద్దకు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు రూ.150, రూ.160 చొప్పున క్షీణించాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.వెండి ధరల్లోనూ మార్పుదేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ నేడు స్వల్ప తగ్గుదల నమోదైంది. క్రితం రోజుతో పోలిస్తే వెండి ధర కేజీకి రూ.100 క్షీణించింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ రూ.1,09,900 వద్ద ఉండగా ఢిల్లీలో రూ. 99,900 వద్దకు దిగివచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

అలాంటి తప్పులు భవిష్యత్తులో జరగనివ్వను: సమంత
హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) సినిమా వచ్చి రెండేళ్లవుతోంది. చివరగా 'ఖుషి' చిత్రంతో పలకరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే మూవీ చేస్తోంది. అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో రక్త్ బ్రహ్మాండ్ అనే ప్రాజెక్ట్‌లోనూ భాగమైంది. ఇవి కాకుండా శుభం అనే సినిమా నిర్మిస్తోంది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన ఆమె నటీనటుల మధ్య పారితోషికం వ్యత్యాసంపై పెదవి విప్పింది.రెమ్యునరేషన్ వ్యత్యాసాలుసమంత మాట్లాడుతూ.. నేను చాలా సినిమాల్లో హీరోతో పాటు సమాన పనిదినాల్లో వర్క్ చేశాను. కానీ మాకిచ్చే రెమ్యునరేషన్ మాత్రం ఒకేలా ఉండేది కాదు. కొన్ని పెద్ద సినిమాల్లో హీరో పాత్ర కీలకంగా ఉంటుంది. పైగా తనే జనాల్ని థియేటర్‌కు రప్పించగలడు... అలాంటివాటిని నేను అర్థం చేసుకోగలను. అలాంటి సినిమాల్లో ఇద్దరి మధ్య బేధం చూపించినా నేను తప్పుపట్టను.సమానత్వం కనిపించదుకానీ కొన్ని చిత్రాల్లో హీరోహీరోయిన్‌కు ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఉంటుంది. పారితోషికం దగ్గర మాత్రం ఆ సమానత్వం కనిపించదు. అదెందుకో ఇప్పటికీ అర్థం కాదు. నా విషయానికి వస్తే.. నేను ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లవుతోంది. ఇన్నేళ్లలో నేను చేసిన తప్పుల్ని పునరావృతం కాకుండా చూసుకుంటాను. ఇప్పుడు సడన్‌గా అన్నీ మార్చలేనేమో కానీ భవిష్యత్తు గురించి మాత్రం ఏదో ఒకటి చేయగలను. అయినా నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఎక్కడైతే నిందలు, బాధలు పడ్డామో అక్కడే పరిష్కారం వెతుక్కోవాలి. నేను ఈ సిద్ధాంతాన్నే నమ్ముతాను అని సమంత చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) చదవండి: కారులో బాంబు పెట్టి లేపేస్తాం.. సల్మాన్‌కు వార్నింగ్

Bangladesh: చరిత్రను చెరిపేస్తున్నారు: షేక్ హసీనా ఆగ్రహం
న్యూఢిల్లీ/ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా(Sheikh Hasina) ఆ దేశ తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ఘన చరిత్రను చెరిపేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అవామీ లీగ్ కార్యకర్తలతో సామాజిక మాధ్యమాల సాయంతో మాట్లాడిన ఆమె మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్‌ను మతోన్మాద దేశంగా మార్చిందని, దేశ స్వాతంత్ర్య సమరంలో పోరాడిన తన తండ్రి బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ జ్ఞాపకాలను తుడిచిపెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్(Muhammad Yunus)ను దేశ ప్రజలను ఎన్నడూ ప్రేమించని వ్యక్తిగా హసీనా అభివర్ణించారు. యూనస్‌ను వడ్డీ వ్యాపారిగా పేర్కొంటూ, అతను అధిక వడ్డీ రేట్లకు అప్పులిచ్చి, ఆ డబ్బుతో విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడిపాడని ఆరోపించారు. యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం అవామీ లీగ్ కార్యకర్తలపై దాడులు చేస్తోందని, హత్యలకు పాల్పడుతోందని, మీడియా స్వేచ్ఛను అణచివేస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. షేక్ హసనా చేసిన విమర్శలు యూనస్ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచాయి.2024, ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమం అనంతరం షేక్ హసీనా అధికారం నుంచి దిగిపోయారు. ఆ తరువాత ఆమె భారతదేశంలో ఆశ్రయం పొందారు. అప్పటి నుంచి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి యూనస్ నాయకత్వం వహిస్తున్నారు. నాటి నుంచి హసీనా..మహ్మద్ యూనస్‌పై పలు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఆమె తమ పార్టీ అవామీ లీగ్(Awami League)ను నిషేధించే ప్రయత్నాలను ప్రశ్నిస్తూ, ఇందుకు యూనస్ ప్రభుత్వానికి రాజ్యాంగ ఆధారం లేదని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ప్రజలు ప్రస్తుత పరిస్థితులను గుర్తించి, యూనస్‌ను అధికారం నుంచి తొలగిస్తారని, తాను తిరిగి అధికారంలోకి వస్తానని హసీనా ఆశాభావం వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: అంబేద్కర్ మదిలో ‘హైదరాబాద్’.. కలకత్తా, ముంబైలను కాదంటూ..

కర్నూలులో డీఆర్డీవో లేజర్ ఆయుధ పరీక్ష సక్సెస్.. భారత్ సరికొత్త రికార్డు
కర్నూలు: భారత అమ్ములపొదిలోకి సరికొత్త లేజర్ అస్త్రం చేరనుంది. అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని డీఆర్డీవో తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. ఇందుకు ఏపీలోని కర్నూలు జిల్లా వేదికైంది. ఈ సందర్బంగా 30 కిలోవాట్ల లేజర్ ఆధారిత ఆయుధ వ్యవస్థను ఉపయోగించి డ్రోన్లను కూల్చివేసే పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్ష విజయవంతమైంది.వివరాల ప్రకారం.. శత్రువుల క్షిపణులు, డ్రోన్లు, అస్త్రాలను క్షణాల్లో నేలకూల్చే అద్భుతమైనన లేజర్ వ్యవస్థను డీఆర్డీవో తీసుకువచ్చింది. కర్నూలులోని ఓర్వకల్లులో నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్లో ఆదివారం ప్రయోగం జరిగింది. ఫిక్స్డ్ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్‌లు, మిస్సైళ్లు, డ్రోన్లను ఈ లేజర్ ఆయుధంతో కూల్చివేయడం ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశం. ఈ క్రమంలో లేజర్ కిరణం తాకగానే, లక్ష్యంగా ఉన్న వస్తువు కాలి బూడిదైంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత రక్షణ వర్గాల్లో హర్షం వ్యక్తమైంది. దీంతో, ఇలాంటి వ్యవస్థ కలిగిన అమెరికా, చైనా, రష్యా దేశాల సరసన భారత్ చేరింది. ఇజ్రాయెల్ సైతం ప్రయోగాలు చేస్తోంది. ఇక, దీనికి సంబంధించిన వీడియోలను డీఆర్డీవో ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.CHESS DRDO conducted a successful field demonstration of the Land version of Vehicle mounted Laser Directed Weapon(DEW) MK-II(A) at Kurnool today. It defeated the fixed wing UAV and Swarm Drones successfully causing structural damage and disable the surveillance sensors. With… pic.twitter.com/U1jaIurZco— DRDO (@DRDO_India) April 13, 2025అయితే, ఈ ఆయుధాన్ని హైదరాబాద్‌లోని డీఆర్డీవో ల్యాబ్ సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ (CHESS) అభివృద్ధి చేసింది. దేశంలోని ఇతర ల్యాబ్‌లు, విద్యా సంస్థలు, పరిశ్రమలు సైతం ఇందులో పాలుపంచుకున్నాయి. ఈ ఆయుధానికి MK-2(A) DEW అని పేరు పెట్టారు. తాజా పరీక్షలో ఈ అస్త్రం తన పూర్తిస్థాయి సామర్థ్యాన్ని చాటినట్లు డీఆర్డీవో ప్రకటించింది. చాలా దూరంలో ఉన్న ఫిక్స్డ్ వింగ్ డ్రోన్లను నేలకూల్చింది. అదే విధంగా డ్రోన్ల దాడిని తిప్పికొట్టింది. ‘శత్రువుల’ నిఘా సెన్సార్లు, యాంటెన్నాలను ధ్వంసం చేసి, మెరుపువేగంతో సెకన్లలోనే లక్ష్యాలపై విరుచుకుపడే సామర్థ్యాన్ని చాటింది. #WATCH | Kurnool, Andhra Pradesh: For the first time, India has showcased its capability to shoot down fixed-wing aircraft, missiles and swarm drones using a 30-kilowatt laser-based weapon system. India has joined list of selected countries, including the US, China, and Russia,… pic.twitter.com/fjGHmqH8N4— ANI (@ANI) April 13, 2025

Sharmila Tagore: కీమోథెరపీ చేయంచుకోకుండానే కేన్సర్‌ని ఓడించారామె..!
బాలీవుడ్ దిగ్గజ నటి షర్మిలా ఠాగూర్‌కి ఊపిరితిత్తుల కేన్సర్ నిర్థారణ అయ్యినట్లు ఓ ఇంటర్యూలో ఆమెనే స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆ కేన్సర్‌ని కీమోథెరఫీ వంటి చికిత్సలతోనే పనిలేకుండానే సునాయాసంగా ఓడించారు. ఇప్పుడామె పూర్తిగా కోలుకున్నారు కూడా. ఆ విషయాన్ని కూతురు నటి సోహా అలీ ఖాన్ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. ముందుగానే ఆ వ్యాధిని గుర్తించడంతోనే తన తల్లి సురక్షితంగా ఆ వ్యాధి నుంచి బయటపడగలిగారని అన్నారు. ఆ సమయంలో మా కుటుంబం పడిన బాధ అంతఇంతగాదంటూ నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారామె. అందరూ తనతల్లిలా బాధకరమైన చికిత్సల జోలికిపోకుండానే సులభంగా ఈ కేన్సర్‌ని జయించడం ఎలాగో కూడా వివరించారు. అదెలాగా చూద్దామా..!.సోహా తన యూట్యూబ్ ఛానెల్లో నయన్‌దీప్ రక్షిత్‌కి ఇచ్చిన ఇంటర్వ్వ్యూలో తన ఫ్యామిలీ ఫేస్ చేసిన క్లిష్ట సమయాన్ని పంచుకున్నారు. నిజానికి ఒక వ్యాధి నిర్థారణ యావత్తు కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేస్తుందని భావోద్వేగంగా మాట్లాడారు. ఆ సమయం తామెంతో ఒత్తిడికి గురయ్యామని చెప్పారు. అయితే దేవుడి దయ వల్ల తన తల్లి ఆరోగ్య పరిస్థతి మరింత క్షీణించక మునుపే గుర్తించగలిగాం. చెప్పాలంటే కేన్సర్ స్టేజ్ జీరోలో ఉండగానే గుర్తించడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇంకా ఆమె శరీరంలో కేన్సర్ వ్యాపించని దశ. అందువల్ల ఆమెకు కీమోథెరపీ లేదా రేడియేషన్ వంటి అదనపు చికిత్సలు లేకుండానే శస్త్ర చికిత్సతో ద్వారా నయం చేశారు. ఊపిరితిత్తుల కేన్సర్‌ని ముందుగానే ఎలా గుర్తించొచ్చంటే..ప్రపంచవ్యాప్తంగా కేన్సర్ సంబంధిత మరణాలలో ఊపిరితిత్తుల కేన్సర్ కూడా ఒకట. ఇది ముందస్తు హెచ్చిరికలతో మన శరీరాన్ని అప్రమత్తం చేస్తుందట. అవేంటంటే..సాధారణ కార్యకలాపాల సమయంలో శ్వాస ఆడకపోవడం లేదా ఊపిరి ఆడకపోవడం.ఛాతీ నొప్పి లోతైన శ్వాస లేదా తీవ్రమైన దగ్గుబరువు తగ్గిపోవడంరక్తం లేదా తుప్పు రంగు కఫం దగ్గుబ్రోన్కైటిస్ లేదా న్యుమోనియా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లునిజానికి ఇవన్నీ చూడటానికి సాధారణ వైద్య పరిస్థితులే. అవి తరుచుగా కొనసాగి..ఆందోళనకు గురిచేస్తే తక్కణమే వైద్య నిపుణుడిని సంప్రదించాలి. అలాకాకుండా ధూమపానం లేదా సెకండ్‌హ్యాండ్ పొగకు గురైన చరిత్ర కలిగినవారు క్రమంతప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ఈ అలవాట్లతో ప్రమాదాన్ని నివారించొచ్చు..ధూమపానానికి దూరంగా ఉండటంపొగ పీల్చే వ్యక్తులకు దూరంగా ఉండటంఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడంవ్యాయామం చేయడంఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం.(చదవండి: సరికొత్త మ్యూజిక్ థెరపీ..'జెంబే'..! ఆ వ్యాధులను నయం చేస్తుందట..!)
విజేతలుండని యుద్ధం
మాతో పెట్టుకుంటే రక్తపు మరకలే..
మతవాదులను సంతృప్తి పరిచిన కాంగ్రెస్: ప్రధాని మోదీ
అప్పటి నోటిఫికేషన్లకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవు: ఉత్తమ్
Deomali Hills: సినీ దర్శకుడు రాజమౌళి కారణంగా ఫేమస్ అయిన పర్యాటక ప్రాంతం ఇదే..!
ఏదీ ఎండాకాలం ఎక్కడొచ్చింది.. ఆ రోజులెక్కడున్నాయి
ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా సౌరవ్ గంగూలీ పునర్నియామకం
రూ.1,000 కోట్లు టార్గెట్.. హైదరాబాద్‌లో తయారీ కేంద్రం
యంగ్ హీరోకి దారుణమైన పరిస్థితి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
పృథ్వీరాజ్ కొత్త సినిమా ప్రకటన.. రెండేళ్ల పెద్ద హీరోయిన్‌తో జోడీ
ఐపీఎల్‌తో పోటీ పడి చేతులు కాల్చుకున్న పీఎస్ఎల్.. ఏమైందో చూడండి..!
వెరైటీ వెడ్డింగ్ కార్డు.. బీజేపీ నేత సరికొత్త ఆలోచన
మాతో స్నేహం అంటూనే దాడి చేస్తారా?.. రష్యాపై భారత్ సీరియస్
మీరు ప్రపంచం మొత్తాన్ని బెదిరిస్తుంటే.. మీ ఒక్కరిని బెదిరిస్తే తప్పా? అని అంటున్నాడ్సార్
ఈ రాశి వారికి ఆస్తివివాదాల పరిష్కారం.. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి
నేను కెప్టెన్‌ని!.. ముందు నన్ను అడగాలి కదా: మండిపడ్డ శ్రేయస్
హేళన చేసిన చేతులే చప్పట్లు కొట్టాయి
'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు
రెడ్‌బుక్ రాజ్యాంగానికి గురజాల డీఎస్పీ బలి
రైతు తలరాత మార్చిన రైల్వే లైన్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన రైతు
మనోజ్‌ను పట్టుకుని ఏడ్చేసిన మంచు లక్ష్మి
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
బెంగళూరు మెట్రోస్టేషన్లో ప్రేమికుల...
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
పాక్ క్రికెట్ బోర్డు దయనీయ స్థితి.. 42 బంతుల్లో శతక్కొట్టిన ఆటగాడికి హెయిర్ డ్రైయర్ బహుమతి
అతడి బ్యాటింగ్‌కు వీరాభిమానిని.. వాళ్లంతా అద్భుతం: కమిన్స్
భువనేశ్వర్ కుమార్ 'ట్రిపుల్' సెంచరీ
వక్ఫ్ సవరణ చట్టంపై హీరో విజయ్ కీలక నిర్ణయం
గొప్ప నటి.. చివరి రోజుల్లో రూ.50 కోసం చేయి చాచింది.. విజయ ఎమోషనల్
గంటలో నాలుగు భూకంపాలు.. భారత్‌లోనూ..
వారి వల్లే ఈ విజయం.. చాలా సంతోషంగా ఉంది: ఆర్సీబీ కెప్టెన్
గోల్డ్ రేటు ఇంకా పెరుగుతుందా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..
నాకన్నా చిన్నోడే కానీ, మగతనం ఎక్కువై: హీరో గురించి నటి
రూ.75 లక్షలు అడ్వాన్స్.. నితిన్ మోసం చేశాడు: నిర్మాత
దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..?
IPL 2025: రుతురాజ్ స్థానాన్ని భర్తీ చేసిన సీఎస్కే
పీఎం మోదీ ఎంట్రీ.. దేవర సాంగ్ బీజీఎం చూశారా!
హిట్ ఇచ్చిన డైరెక్టర్‌కు మరో ఛాన్స్ ఇస్తున్న 'బాలకృష్ణ'
తిరుమలలో మరో అపచారం
Hyderabad: అపార్ట్మెంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం
వారెవ్వా కరుణ్.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి ఇరగదీశాడు
చంద్రబాబు ప్రభుత్వ భూ దాహం.. మరో 44,676 ఎకరాలు!
తమన్నా-విజయ్ బ్రేకప్.. సలహా ఇచ్చిన చిరంజీవి?
40లలోకి వచ్చిన ఉద్యోగులు జాగ్రత్త! హెచ్చరిస్తున్న సీఈవో
హిట్ కొట్టినా.. కలెక్షన్స్ ఏంటి ఇలా ఉన్నాయ్?
చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ
పెళ్లి కావట్లేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
రేపు బ్యాంకులకు సెలవు: ఎందుకంటే?
మారుతున్న ట్రెండ్: ఇప్పుడంతా ఇల్లు.. ఆఫీసు.. షాపింగ్
స్టార్ హీరో కుమారుడితో అనుపమ డేటింగ్.. ముద్దు ఫోటోలు వైరల్
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో టీడీపీ కుట్ర బట్టబయలు
'మా సినిమాలు చూసి అసూయ పడుతున్నారు'.. స్టార్ హీరో
అణు విద్యుచ్ఛక్తిలో... చైనా అద్భుతం!
పెద్ది ఫైట్
దత్తత డీడ్ చెల్లదు.. కుమార్తెలే వారసులు
అంత ఎనర్జీ ఎక్కడా చూడలేదు.. సింగిల్ షాట్లో చేశారు: సునీల్
ఏపీకి వర్షసూచన.. ఈ జిల్లాల్లో రెండు రోజులు వర్షాలు
IPL 2025, MI VS DC: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్
మైదానంలోనే మాక్సీ, స్టొయినిస్‌తో గొడవ.. స్పందించిన ట్రవిస్ హెడ్
స్టైలు మారింది.. గంగవ్వ కొత్త లుక్ చూశారా?
సాక్షి కార్టూన్ 13-04-2025
అంతరిక్షం నుంచి అందాల భారతం
అపార్ట్మెంట్ మెయింటెనెన్స్‌పై జీఎస్టీ.. ఇదిగో క్లారిటీ..
గొప్ప మనసు చాటుకున్న తాప్సీ.. భర్తతో కలిసి సాయం!
భారతీయులే లక్ష్యంగా ట్రంప్ మరో బాంబు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
భర్త చనిపోయిన బాధలో అంజలి.. ఆస్తి కోసం ఆమెకు మద్యం తాగించి..
తెలంగాణ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్స్
భారత్ చేతిలో హై పవర్ లేజర్ ఆయుధం
కరుణ్ అద్భుతంగా ఆడాడు.. అలా చేయాలంటే చాలా సాహసం కావాలి: హార్దిక్
ప్రపంచంలో అన్నింటికన్నా సులభమైన పనేంటో తెలుసా?.. నవ్వులు పూయిస్తోన్న టీజర్
భారతీయ కుటుంబ వ్యవస్థలో అనూహ్య మార్పులు
సగం కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15..
నా సినిమాలో ఆ సీన్‌ను అమ్మాయిలు షేర్ చేయడం చూసి బాధపడ్డాను.. డైరెక్టర్ క్షమాపణ
తీరు మార్చుకోని బాబర్ ఆజమ్.. చెలరేగిన ఓవరాక్షన్ స్పిన్నర్ అబ్రార్
నాకైతే నవ్వొస్తోంది.. అభిషేక్ లక్కీ.. అతడుంటే వికెట్లు తీసేవాడు: శ్రేయస్
మహేశ్- రాజమౌళి సినిమాకు 'డైలాగ్ రైటర్'గా ప్రముఖ దర్శకుడు
ఇన్‌స్టా లవర్‌తో వివాహిత పెళ్లి
అక్టోబరులో ఆన్ డ్యూటీ
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
ఈవీలపై మహిళలకు రూ.36,000 రాయితీ.. లిమిటెడ్ ఆఫర్
ఆమెను చూస్తే మా నాన్న లేని లోటు తీరింది: జూనియర్ ఎన్టీఆర్
ప్రపంచానికి మహీంద్రా హెచ్చరిక.. ట్వీట్ వైరల్
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్లు.. టాప్ 5లో ముగ్గురు మనోళ్లే!
సురేష్ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం
రష్యా గ్యాస్ పైప్‌లైన్ మాకిచ్చేయండి
విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్‌పై 'బన్ని' నిర్మాత కామెంట్లు
‘కౌంట్’ డౌన్.. కల్లోలం 'రోడ్డున పడ్డ రొయ్య'!
అప్పుపై వడ్డీ తగ్గించిన ప్రముఖ బ్యాంక్
యూఎస్‌లో ఐఫోన్లు ఎందుకు తయారు చేయరంటే..
'హిట్ 3' సెన్సార్ రిపోర్ట్.. ఆ సీన్లన్నీ బ్లర్!
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
మహేష్ బాబు హిట్ సినిమా రీరిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
బీఆర్ఎస్ సభకు అనుమతి
షేర్ చేసుకుందాం... కేర్ తీసుకుందాం
ఐటీకి అనిశ్చితి కొంతకాలమే: టీసీఎస్ సీఈవో
ట్రంప్ ప్రభుత్వం ‘30 డేస్’ వార్నింగ్.. మర్యాదగా వెళ్లిపోండి
నేడు తమిళుల ఉగాది.. సొంత భాషలోనే శుభాకాంక్షలు చెప్పుకుంటున్న జనం
వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే జయరాం.. ఉద్యోగం పేరుతో లక్షల్లో డబ్బులు..
డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ @ రూ.22,150 కోట్లు
భర్తను హత్య చేసేందుకు 20 లక్షల సుపారీ..!
భారత్‌లో వేగంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు ఇదే!
'జాట్' సినిమాను బాయ్‌కాట్ చేయండి.. ఫైర్ అవుతున్న తమిళులు
DC VS MI: ఢిల్లీ కొంప ముంచిన హ్యాట్రిక్ రనౌట్స్.. చరిత్రలో ఇదే తొలిసారి
బేబీ.. ఇలా అయితే కష్టమే!
RR VS RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. మరో సెంచరీ
గంట ప్రయాణం నిమిషంలో.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన
ఛీ..య్యాక్..! ఆఫీస్ బాత్రూమ్నే ఇల్లుగానా..!
హింసాత్మకంగా‘వక్ఫ్’ నిరసనలు.. కేంద్ర బలగాలకు హైకోర్టు ఆదేశం
అమరావతి కోసం మరో భారీ భూ సమీకరణ
విజేతలుండని యుద్ధం
మాతో పెట్టుకుంటే రక్తపు మరకలే..
మతవాదులను సంతృప్తి పరిచిన కాంగ్రెస్: ప్రధాని మోదీ
అప్పటి నోటిఫికేషన్లకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవు: ఉత్తమ్
Deomali Hills: సినీ దర్శకుడు రాజమౌళి కారణంగా ఫేమస్ అయిన పర్యాటక ప్రాంతం ఇదే..!
ఏదీ ఎండాకాలం ఎక్కడొచ్చింది.. ఆ రోజులెక్కడున్నాయి
ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా సౌరవ్ గంగూలీ పునర్నియామకం
రూ.1,000 కోట్లు టార్గెట్.. హైదరాబాద్‌లో తయారీ కేంద్రం
యంగ్ హీరోకి దారుణమైన పరిస్థితి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
పృథ్వీరాజ్ కొత్త సినిమా ప్రకటన.. రెండేళ్ల పెద్ద హీరోయిన్‌తో జోడీ
ఐపీఎల్‌తో పోటీ పడి చేతులు కాల్చుకున్న పీఎస్ఎల్.. ఏమైందో చూడండి..!
వెరైటీ వెడ్డింగ్ కార్డు.. బీజేపీ నేత సరికొత్త ఆలోచన
మాతో స్నేహం అంటూనే దాడి చేస్తారా?.. రష్యాపై భారత్ సీరియస్
మీరు ప్రపంచం మొత్తాన్ని బెదిరిస్తుంటే.. మీ ఒక్కరిని బెదిరిస్తే తప్పా? అని అంటున్నాడ్సార్
ఈ రాశి వారికి ఆస్తివివాదాల పరిష్కారం.. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి
నేను కెప్టెన్‌ని!.. ముందు నన్ను అడగాలి కదా: మండిపడ్డ శ్రేయస్
హేళన చేసిన చేతులే చప్పట్లు కొట్టాయి
'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు
రెడ్‌బుక్ రాజ్యాంగానికి గురజాల డీఎస్పీ బలి
రైతు తలరాత మార్చిన రైల్వే లైన్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన రైతు
మనోజ్‌ను పట్టుకుని ఏడ్చేసిన మంచు లక్ష్మి
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
బెంగళూరు మెట్రోస్టేషన్లో ప్రేమికుల...
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
పాక్ క్రికెట్ బోర్డు దయనీయ స్థితి.. 42 బంతుల్లో శతక్కొట్టిన ఆటగాడికి హెయిర్ డ్రైయర్ బహుమతి
అతడి బ్యాటింగ్‌కు వీరాభిమానిని.. వాళ్లంతా అద్భుతం: కమిన్స్
భువనేశ్వర్ కుమార్ 'ట్రిపుల్' సెంచరీ
వక్ఫ్ సవరణ చట్టంపై హీరో విజయ్ కీలక నిర్ణయం
గొప్ప నటి.. చివరి రోజుల్లో రూ.50 కోసం చేయి చాచింది.. విజయ ఎమోషనల్
గంటలో నాలుగు భూకంపాలు.. భారత్‌లోనూ..
వారి వల్లే ఈ విజయం.. చాలా సంతోషంగా ఉంది: ఆర్సీబీ కెప్టెన్
గోల్డ్ రేటు ఇంకా పెరుగుతుందా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..
నాకన్నా చిన్నోడే కానీ, మగతనం ఎక్కువై: హీరో గురించి నటి
రూ.75 లక్షలు అడ్వాన్స్.. నితిన్ మోసం చేశాడు: నిర్మాత
దర్శనానికి వచ్చి.. ఉంగరం దొంగిలిస్తారా..?
IPL 2025: రుతురాజ్ స్థానాన్ని భర్తీ చేసిన సీఎస్కే
పీఎం మోదీ ఎంట్రీ.. దేవర సాంగ్ బీజీఎం చూశారా!
హిట్ ఇచ్చిన డైరెక్టర్‌కు మరో ఛాన్స్ ఇస్తున్న 'బాలకృష్ణ'
తిరుమలలో మరో అపచారం
Hyderabad: అపార్ట్మెంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం
వారెవ్వా కరుణ్.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి ఇరగదీశాడు
చంద్రబాబు ప్రభుత్వ భూ దాహం.. మరో 44,676 ఎకరాలు!
తమన్నా-విజయ్ బ్రేకప్.. సలహా ఇచ్చిన చిరంజీవి?
40లలోకి వచ్చిన ఉద్యోగులు జాగ్రత్త! హెచ్చరిస్తున్న సీఈవో
హిట్ కొట్టినా.. కలెక్షన్స్ ఏంటి ఇలా ఉన్నాయ్?
చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ
పెళ్లి కావట్లేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
రేపు బ్యాంకులకు సెలవు: ఎందుకంటే?
మారుతున్న ట్రెండ్: ఇప్పుడంతా ఇల్లు.. ఆఫీసు.. షాపింగ్
స్టార్ హీరో కుమారుడితో అనుపమ డేటింగ్.. ముద్దు ఫోటోలు వైరల్
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో టీడీపీ కుట్ర బట్టబయలు
'మా సినిమాలు చూసి అసూయ పడుతున్నారు'.. స్టార్ హీరో
అణు విద్యుచ్ఛక్తిలో... చైనా అద్భుతం!
పెద్ది ఫైట్
దత్తత డీడ్ చెల్లదు.. కుమార్తెలే వారసులు
అంత ఎనర్జీ ఎక్కడా చూడలేదు.. సింగిల్ షాట్లో చేశారు: సునీల్
ఏపీకి వర్షసూచన.. ఈ జిల్లాల్లో రెండు రోజులు వర్షాలు
IPL 2025, MI VS DC: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్
మైదానంలోనే మాక్సీ, స్టొయినిస్‌తో గొడవ.. స్పందించిన ట్రవిస్ హెడ్
స్టైలు మారింది.. గంగవ్వ కొత్త లుక్ చూశారా?
సాక్షి కార్టూన్ 13-04-2025
అంతరిక్షం నుంచి అందాల భారతం
అపార్ట్మెంట్ మెయింటెనెన్స్‌పై జీఎస్టీ.. ఇదిగో క్లారిటీ..
గొప్ప మనసు చాటుకున్న తాప్సీ.. భర్తతో కలిసి సాయం!
భారతీయులే లక్ష్యంగా ట్రంప్ మరో బాంబు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
భర్త చనిపోయిన బాధలో అంజలి.. ఆస్తి కోసం ఆమెకు మద్యం తాగించి..
తెలంగాణ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్స్
భారత్ చేతిలో హై పవర్ లేజర్ ఆయుధం
కరుణ్ అద్భుతంగా ఆడాడు.. అలా చేయాలంటే చాలా సాహసం కావాలి: హార్దిక్
ప్రపంచంలో అన్నింటికన్నా సులభమైన పనేంటో తెలుసా?.. నవ్వులు పూయిస్తోన్న టీజర్
భారతీయ కుటుంబ వ్యవస్థలో అనూహ్య మార్పులు
సగం కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15..
నా సినిమాలో ఆ సీన్‌ను అమ్మాయిలు షేర్ చేయడం చూసి బాధపడ్డాను.. డైరెక్టర్ క్షమాపణ
తీరు మార్చుకోని బాబర్ ఆజమ్.. చెలరేగిన ఓవరాక్షన్ స్పిన్నర్ అబ్రార్
నాకైతే నవ్వొస్తోంది.. అభిషేక్ లక్కీ.. అతడుంటే వికెట్లు తీసేవాడు: శ్రేయస్
మహేశ్- రాజమౌళి సినిమాకు 'డైలాగ్ రైటర్'గా ప్రముఖ దర్శకుడు
ఇన్‌స్టా లవర్‌తో వివాహిత పెళ్లి
అక్టోబరులో ఆన్ డ్యూటీ
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
ఈవీలపై మహిళలకు రూ.36,000 రాయితీ.. లిమిటెడ్ ఆఫర్
ఆమెను చూస్తే మా నాన్న లేని లోటు తీరింది: జూనియర్ ఎన్టీఆర్
ప్రపంచానికి మహీంద్రా హెచ్చరిక.. ట్వీట్ వైరల్
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్లు.. టాప్ 5లో ముగ్గురు మనోళ్లే!
సురేష్ హత్య కేసు దర్యాప్తు ముమ్మరం
రష్యా గ్యాస్ పైప్‌లైన్ మాకిచ్చేయండి
విశ్వంభర గ్రాఫిక్స్ వర్క్‌పై 'బన్ని' నిర్మాత కామెంట్లు
‘కౌంట్’ డౌన్.. కల్లోలం 'రోడ్డున పడ్డ రొయ్య'!
అప్పుపై వడ్డీ తగ్గించిన ప్రముఖ బ్యాంక్
యూఎస్‌లో ఐఫోన్లు ఎందుకు తయారు చేయరంటే..
'హిట్ 3' సెన్సార్ రిపోర్ట్.. ఆ సీన్లన్నీ బ్లర్!
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
మహేష్ బాబు హిట్ సినిమా రీరిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
బీఆర్ఎస్ సభకు అనుమతి
షేర్ చేసుకుందాం... కేర్ తీసుకుందాం
ఐటీకి అనిశ్చితి కొంతకాలమే: టీసీఎస్ సీఈవో
ట్రంప్ ప్రభుత్వం ‘30 డేస్’ వార్నింగ్.. మర్యాదగా వెళ్లిపోండి
నేడు తమిళుల ఉగాది.. సొంత భాషలోనే శుభాకాంక్షలు చెప్పుకుంటున్న జనం
వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే జయరాం.. ఉద్యోగం పేరుతో లక్షల్లో డబ్బులు..
డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ @ రూ.22,150 కోట్లు
భర్తను హత్య చేసేందుకు 20 లక్షల సుపారీ..!
భారత్‌లో వేగంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు ఇదే!
'జాట్' సినిమాను బాయ్‌కాట్ చేయండి.. ఫైర్ అవుతున్న తమిళులు
DC VS MI: ఢిల్లీ కొంప ముంచిన హ్యాట్రిక్ రనౌట్స్.. చరిత్రలో ఇదే తొలిసారి
బేబీ.. ఇలా అయితే కష్టమే!
RR VS RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. మరో సెంచరీ
గంట ప్రయాణం నిమిషంలో.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన
ఛీ..య్యాక్..! ఆఫీస్ బాత్రూమ్నే ఇల్లుగానా..!
హింసాత్మకంగా‘వక్ఫ్’ నిరసనలు.. కేంద్ర బలగాలకు హైకోర్టు ఆదేశం
అమరావతి కోసం మరో భారీ భూ సమీకరణ
సినిమా

నాకన్నా చిన్నోడే కానీ, మగతనం ఎక్కువై: హీరో గురించి నటి
బాలీవుడ్ నటి, పాప్ గాయని, బిజినెస్ ఉమెన్... మరెన్నో రంగాల్లో ప్రసిద్ధి చెందిన 'కునిక సదానంద్ లాల్' తన వైవిధ్యమైన పాత్రలతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. ముంబైలో చలనచిత్రరంగానికి మారడానికి ముందుగానే కునిక నటనా జీవితం ఢిల్లీలో ప్రారంభమైంది, ఆమె తొలుత అనేక టీవీ సిరీస్‌లలో కనిపించింది. ప్రముఖ హాస్యనటుడు అస్రానీ భార్య మంజు అస్రానీ టీవీ సిరీస్‌లో ఓ అద్భుతమైన పాత్రతో బ్రేక్ అందుకుని సినిమా తారగా మారారు. దాదాపుగా 125 సినిమాల్లో నటించారు. గుమ్రాహ్, బేటా వంటి సినిమాల్లో విలన్‌గానూ మెప్పించారు. ఆమె సినిమా విజయాలకు మించి, ప్రైవేటు ఆల్బమ్స్ ద్వారా గాయనిగా పేరొందారు. విజయవంతమైన పలు సంస్థల వ్యవస్థాపకురాలు, సామాజిక కార్యకర్త కూడా. ముంబైలోని గోరేగావ్ శివారులో, వైట్ ఇటాలియన్ కేఫ్, జింగ్కేఫ్ మెజెస్టికా ది రాయల్ బాంక్వెట్ హాల్, అలాగే ఎక్స్హేల్ స్పా వంటివి నిర్వహిస్తున్నారు. తాజాగా సిద్ధార్థ్ కన్నన్ షోలో కనిపించినప్పటి నుంచి కునికా సదానంద్ వార్తల్లో వ్యక్తిగా మారారు. ఆ షో లొ ఆమె చాలా ఓపెన్ అయ్యారు గాయకుడు కుమార్ సానుతో తన ప్రేమ వ్యవహారం గురించి అంతేకాదు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పలువురు హీరోయిన్లతో నడిపిన వ్యవహారాల గురించి కూడా మాట్లాడడం విశేషం. ఆమె మేల్ హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ గురించి కూడా ప్రస్తావించారు అంతేకాదు గతంలో హీరోయిన్లను లొంగదీసుకోవాలని లైట్మెన్లతో సహా ఎలా ట్రై చేసేవారో కూడా వెల్లడించారు. దాంతో ఆ ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అక్షయ్ కుమార్ ఎఫైర్స్‌పై కామెంట్లుఅక్షయ్ కుమార్‌కి హీరోయిన్లతో ఉన్న ఎఫైర్స్ గురించి ఆమె మాట్లాడుతూ ‘అతను చాలా అందంగా ఉంటాడు అంతేకాదు అతను నా కంటే ఒక సంవత్సరం చిన్నవాడు అయినా కూడా అతను ఇంకా ఫిట్‌గానే ఉన్నాడు‘ మగవాళ్లలో మేల్ హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ స్థాయిలు చురుకుగా ఉన్నప్పుడు, మంచి ఫిట్నెస్ పొందుతారని అది సాధారణమేనని చెప్పారు. అంటే మగతనం ఎక్కువైతే ఫిట్నెస్ దాంతో ఆడవాళ్ళ కు ఆకర్షణ కలగడం.. వల్ల ఇలాంటి ఎఫైర్స్ పుట్టుకొస్తాయన్నట్టుగా అభిప్రాయపడ్డారు. అదే ఇంటర్వ్యూలో తన నటనా జీవితంలో ప్రారంభంలో బాలీవుడ్ టాప్ సింగర్ కుమార్ సానుని కలుసుకున్నానని తొలిచూపులోనే నచ్చడంతో అదొక తక్షణ ఆకర్షణగా భావించానని వెల్లడించారు. తాను ఓ సినిమా చిత్రీకరణ సందర్భంగా ఊటీలో ఉన్నప్పుడు అదే సమయంలో కుమార్ సాను కూడా తన సోదరి, మేనల్లుడితో విహారయాత్రలో ఉన్నాడని అలా తమ మధ్య బలమైన అనుబంధం ఏర్పడిందన్నారు.పరిశ్రమలో తన ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్న ఆమె... గతంలో గౌరవప్రదమైన కుటుంబాలకు చెందిన మహిళలు అరుదుగా మాత్రమే సినిమాల్లో కెరీర్‌ను ఎంచుకునేవారని అన్నారు. దానికి తగ్గట్టే అప్పటి పరిస్థితులు ఉండేవని చెప్పారు. లైటింగ్ టెక్నీషియన్లు కూడా నటీమణుల పట్ల తరచుగా అనుచితమైన ఆలోచనలతో ఉంటారని, ఆమె వెల్లడించడం విశేషం ‘వారు తమ చేతులపై పెర్ఫ్యూమ్తో వస్తారు, వాటిని హీరోయిన్ వైపు చాచేవారని అంతేకాక హీరోయిన్ల చెవుల్లో అసభ్యకరమైన విధంగా గుసగుసలాడేవారు‘ అని ఆమె అన్నారు. ఈ నేపధ్యంలో అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరమన్నారు. తానెలా ఇలాంటి పరిస్థితుల నుంచి తనను తాను కాపాడుకున్నానో కూడా వివరించారు.‘షూటింగ్ సమయం అయిపోయాక ఆకలితో ఉన్న సింహాలు బయటికి వచ్చి, బయట తిరుగుతున్నట్లుగా ఉండేది. కొంతమంది చాలా మర్యాదగా సాయంత్రం కలుద్దామా? అని ఫోన్లు చేస్తే, మరికొందరు మాత్రం మరింత దూకుడుగా ప్రవర్తించేవారు అంటూ వెల్లడించారు. అలాంటి సందర్భాల్లో తన హెయిర్‌డ్రెస్సర్ తరచుగా తన గదిలో రక్షణగా ఉండేవాడని చెప్పారామె తాను అందుబాటులో లేనని లేదా డిన్నర్‌కి బయటకు వెళ్లారని చెబుతూ, ఆమె హెయిర్డ్రెసర్ వారిని తెలివిగా తప్పించేవాడని గుర్తు చేసుకున్నారు.

కారులో బాంబు పెట్టి లేపేస్తాం.. సల్మాన్‌కు వార్నింగ్
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)కు మరోసారి బెదిరింపులు ఎదురయ్యాయి. ముంబై రవాణాశాఖ విభాగానికి వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. దీనిపై అధికారులు అప్రమత్తమయ్యారు. వర్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.ఎందుకీ బెదిరింపులు?1998లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన సల్మాన్ ఖాన్‌పై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi gang) ఆగ్రహం వ్యక్తం చేసింది. హీరోను చంపుతామని పలుమార్లు హెచ్చరికలు చేసింది. ఈ క్రమంలోనే 2024లో.. కృష్ణజింకను వేటాడి తప్పు చేసినందుకుగానూ గుడికి వెళ్లొచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే తమకు రూ.5 కోట్లు ఇవ్వాలంది. తర్వాత అదే ఏడాది ఓ గుర్తు తెలియని వ్యక్తి తనకు రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.పన్వేల్‌లో ఉన్న సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్‌లో కొందరు ఫేక్ ఐడీలతో చొరబడేందుకు ప్రయత్నించారు. గత డిసెంబ్లోనూ సల్మాన్ సినిమా సెట్లోకి ఓ వ్యక్తి ప్రవేశించి.. లారెన్స్ బిష్ణోయ్ పేరు ప్రస్తావిస్తూ బెదిరింపు ధోరణిలో మాట్లాడాడు. గతేడాది సల్మాన్ ఇంటి ముందు పలుమార్లు కాల్పులు జరగడంతో అతడు ఇంటి బాల్కనీకి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలను పెట్టించుకున్నాడు.వరుస బెదిరింపులపై ఇటీవల సల్మాన్ మాట్లాడుతూ.. నేను భగవంతుడిని నమ్ముతాను. దేవుడు నాకు ఆయుష్షు ఎంతవరకు ఇస్తే అంతవరకు మాత్రమే బతుకుతాను. నా జీవితం దేవుడి చేతుల్లోనే ఉంది. పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నప్పటికీ మన చేతిలో ఏమీ ఉండదు అన్నాడు.చదవండి: స్టైలు మారింది.. గంగవ్వ కొత్త లుక్ చూశారా?

మోస్ట్ వైలెంట్‌గా 'హిట్-3' ట్రైలర్.. మార్కోను మించిపోయిన 'నాని'
హిట్3 సినిమాలో అర్జున్ సర్కార్‌గా పోలీస్ పాత్రలో దుమ్మురేపేందుకు నాని సిద్ధం అయ్యాడు. మే 1న విడుదల కానున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మలయాళంలో గతేడాది వచ్చిన 'మార్కో' సినిమాకు మించిన వయలెన్స్ హిట్-3లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గతంలో చెప్పిన వ్యాఖ్యలను హిట్3 నాని పాత్రకు కలుపుతూ ఎలివేషన్స్ ఇచ్చారు. ఇదీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకుడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని ఏ సర్టిఫికెట్ పొందింది. అంటే 18 ఏళ్లు నిండిన వాళ్లు మాత్రమే ఈ మూవీ చూసేందుకు అర్హులు. హిట్ 3 సినిమా రన్‌టైమ్ 2 గంటల 35 నిమిషాలు ఉండనుంది. ఈ కామెంట్‌తో వెండితెరపై రక్తపాతం చూపించబోతున్నారని క్లియర్‌గా అర్థం అవుతుంది. ఇప్పటికే హిట్ 3(Hit 3 Movie) గురించి నాని ఇలా హింట్ ఇచ్చేశాడు. యాక్షన్ గట్టిగా ఉంటుందని, కచ్చితంగా పిల్లలు చూడకూడదని చెప్పుకొచ్చాడు. దీనిని బట్టి చూస్తే సినిమాలో ఏ రేంజ్లో వయలెన్స్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా భారీ బడ్జెట్‌తో వాల్‌పోస్టర్ సినిమా ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై నానినే ఈ చిత్రాన్ని నిర్మించారు.

స్టైలు మారింది.. గంగవ్వ కొత్త లుక్ చూశారా?
గంగవ్వ (Milkuri Gangavva).. ఎరుకనే కదా! అమాయకత్వం, బోలాతనం, గడబిడ మాట్లాడే వైఖరితో అందరికీ సుపరిచితమైంది. యూట్యూబ్ ఆమెను అందరికీ చేరువ చేసింది. తెలంగాణ యాసతో ఆమె మాట్లాడుతుంటే మనింట్లో బామ్మ ముచ్చటచెప్పినట్లే ఉంటది. మై విలేజ్ షో ద్వారా నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవల్లో ఫేమస్ అయింది. ఆ మధ్య తెలుగు బిగ్‌బాస్ నాలుగో సీజన్లోనూ పాల్గొని తన హుషారుతో అందర్నీ నవ్వించింది.గంగవ్వ కొత్త లుక్ప్రస్తుతం మళ్లీ యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్న ఆమె తాజాగా కొత్త లుక్‌తో అందర్నీ సర్ప్రైజ్ చేసింది. ఈ మధ్య హైదరాబాద్ వచ్చిన ఆమె బిగ్‌బాస్ 5 విన్నర్ వీజే సన్నీ ప్రారంభించిన టీబీసీ సెలూన్‌కు వెళ్లింది. ఇంకేముంది.. సన్నీ దగ్గరుండి గంగవ్వ జుట్టు కడిగించి, దానికి నల్ల రంగు వేయించాడు. పనిలో పనిగా కొత్త హెయిర్ స్టైల్ కూడా ట్రై చేసింది గంగవ్వ. జుట్టు స్ట్రెయిటినింగ్ చేయించుకుని వదిలేసింది. అవసరమైతే తలకు నూనెంటకుండా ఈ హెయిర్ స్టైల్‌ను ఇలాగే కంటిన్యూ చేస్తానంది. కాలికి పెడిక్యూర్ కూడా చేయించుకుంది.సినిమాలు ఫైనల్‌గా గంగవ్వ కొత్త లుక్ చూసిన అభిమానులు భలే ఉందని కామెంట్లు చేస్తున్నారు. గంగవ్వ యూట్యూబ్ స్టార్ కాకముందు ఓ వ్యవసాయ కూలీ. తనకు ముగ్గురు పిల్లలు. రెక్కల కష్టంతో ముగ్గురు పిల్లల పెళ్లి చేసింది. మలి వయసులో యూట్యూబర్‌గా మారడమే కాకుండా సినిమాల్లోనూ అడుగుపెట్టింది. మల్లేశం, ఇస్మార్ట్ శంకర్, లవ్ స్టోరీ, ఇంటింటి రామాయణం, స్వాగ్, గేమ్ ఛేంజర్ వంటి పలు చిత్రాల్లో నటించింది.చదవండి: 'జాట్' సినిమాను బాయ్‌కాట్ చేయండి.. ఫైర్ అవుతున్న తమిళులు
న్యూస్ పాడ్‌కాస్ట్

ఆంధ్రప్రదేశ్‌లోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం. 8 మంది సజీవ దహనం. 8 మందికి తీవ్ర గాయాలు

కొత్త సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్‌కు మినహాయింపు. ట్రంప్ సర్కారు తాజా ప్రకటన. అమెరికా కంపెనీల ప్రయోజనాలే లక్ష్యం

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు 125 శాతానికి పెంపు... డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతానికి ప్రతీకారంగా చైనా నిర్ణయం

చర్యకు ప్రతి చర్య తప్పదు.. అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టికాయ వేస్తారు... ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరిక

చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన... చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టీకరణ

మీ కుటుంబానికి అండగా ఉంటాం... పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ఆగిన ‘ఆరోగ్యశ్రీ’!. సమ్మెలో నెట్వర్క్ ఆస్పత్రులు

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని ప్రభుత్వం... సమ్మె బాటలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు

ఏపీలో ఊరూ వాడా ఏరులై పారుతున్న వైనం. కూటమి నేతల సిండికేట్ కబంధ హస్తాల్లో మద్యం షాపులు.

వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింలను దగా చేసిన ఏపీ సీఎం చంద్రబాబు... మూడు సవరణలు ప్రతిపాదించామంటూ తెలుగుదేశం పార్టీ గొప్పలు... అవి పసలేని సవరణలేనని మైనార్టీల ఆగ్రహం
క్రీడలు

DC VS MI: ఢిల్లీ కొంప ముంచిన హ్యాట్రిక్ రనౌట్స్.. చరిత్రలో ఇదే తొలిసారి
ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ జరగని ఓ ఘటన నిన్న చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో అత్యంత అరుదైన హ్యాట్రిక్ రనౌట్స్ నమోదయ్యాయి. ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదిస్తూ.. ఢిల్లీ వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లను రనౌట్ల రూపంలో కోల్పోయింది. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్లో వరుసగా మూడు బంతుల్లో మూడు రనౌట్లు కావడం ఇదే మొదటిసారి.లీగ్ ఆరంభ సీజన్లో (2008) ఓ సారి ఒకే ఓవర్లో మూడు రనౌట్లు నమోదైనా, అవి వరుస బంతుల్లో జరగలేదు. నాడు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ లక్ష్యాన్ని ఛేదిస్తూ చివరి ఓవర్లో (2, 4, 6 బంతులకు) మూడు వికెట్లు రనౌట్ల రూపంలో కోల్పోయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఒకే ఓవర్లో, అందులోనూ వరుసగా మూడు బంతుల్లో రనౌట్లు నమోదయ్యాయి.నిన్నటి మ్యాచ్‌లో ముంబై నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ ఢిల్లీ 19వ ఓవర్ చివరి మూడు బంతులకు వరుసగా అశుతోష్ శర్మ (17), కుల్దీప్ యాదవ్ (1), మొహిత్ శర్మ (0) వికెట్లను రనౌట్ల రూపంలో కోల్పోయింది. కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించి గెలుపుకు పటిష్ట పునాది వేసినా, చివర్లో హ్యాట్రిక్ వికెట్లు కోల్పోయి ఢిల్లీ పరాజయాన్ని కొని తెచ్చుకుంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఢిల్లీపై 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ప్రస్తుత సీజన్లో ఢిల్లీకి ఇదే తొలి ఓటమి. లేని, అనవసరమైన పరుగుల కోసం ప్రయత్నించి ఢిల్లీ గెలుపు గుర్రాన్ని దిగింది. పరుగుల వేటలో ఒత్తిడికిలోనై రనౌటైంది.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (59), ర్యాన్ రికెల్టన్ (41), సూర్యకుమార్ యాదవ్ (40), నమన్ ధీర్ (38) రాణించగా.. రోహిత్ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం ఛేదనలో ఢిల్లీ తొలి బంతికే జేక్ ఫ్రేజర్ (0) వికెట్ కోల్పోయినా.. అభిషేక్ పోరెల్ (33), కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతంగా ఆడి గెలుపుకు పటిష్ట పునాది వేశారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ముంబై బౌలర్లు పుంజుకున్నారు. కొత్త బంతితో కర్ణ్ శర్మ (4-0-36-3), మిచెల్ సాంట్నర్ (4-0-43-2) మాయ చేశారు. 58 పరుగుల వ్యవధిలో ఢిల్లీ చివరి 8 వికెట్లు కోల్పోయింది. ఈ గెలుపుతో ముంబై తొమ్మిదో స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకగా.. సీజన్లో తొలి ఓటమి చవిచూసిన ఢిల్లీ టాప్ ప్లేస్ నుండి రెండో స్థానానికి పడిపోయింది.నేటికి అది రికార్డే2008 సీజన్లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా ఐదుగురు ముంబై బ్యాటర్లు రనౌట్లయ్యారు (చివరి ఓవర్లో మూడు రనౌట్లతో కలుపుకుని). ఐపీఎల్ చరిత్రలో నేటికీ ఇది ఓ రికార్డుగా కొనసాగుతుంది. ఇప్పటివరకు ఏ ఐపీఎల్ మ్యాచ్‌లోనూ ఐదుగురు బ్యాటర్లు రనౌట్లు కాలేదు.

కరుణ్ అద్భుతంగా ఆడాడు.. అలా చేయాలంటే చాలా సాహసం కావాలి: హార్దిక్
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (ఏప్రిల్ 13) రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (59), ర్యాన్ రికెల్టన్ (41), సూర్యకుమార్ యాదవ్ (40), నమన్ ధీర్ (38) రాణించగా.. రోహిత్ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం ఛేదనలో ఢిల్లీ తొలి బంతికే జేక్ ఫ్రేజర్ (0) వికెట్ కోల్పోయినా.. అభిషేక్ పోరెల్ (33), కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతంగా ఆడి జట్టు గెలుపుకు పటిష్ట పునాది వేశారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ముంబై బౌలర్లు పుంజుకున్నారు. కొత్త బంతితో కర్ణ్ శర్మ (4-0-36-3), మిచెల్ సాంట్నర్ (4-0-43-2) మాయ చేశారు. 58 పరుగుల వ్యవధిలో ఢిల్లీ చివరి 8 వికెట్లు కోల్పోయింది. 19వ ఓవర్ చివరి మూడు బంతులకు ముగ్గురు ఢిల్లీ బ్యాటర్లు రనౌట్ కావడంతో ఢిల్లీ ఓటమి ఖరారైంది. కీలకమైన మూడు వికెట్లు తీసిన కర్ణ్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఈ గెలుపుతో ముంబై తొమ్మిదో స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకగా.. సీజన్లో తొలి ఓటమి చవిచూసిన ఢిల్లీ టాప్ ప్లేస్ నుండి రెండో స్థానానికి పడిపోయింది. మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఇలా అన్నాడు. గెలవడం ఎప్పుడూ ప్రత్యేకమే. ముఖ్యంగా ఇలాంటి విజయాలు. కరుణ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఓ దశలో మ్యాచ్ చేయి దాటిపోతున్నట్లు అనిపించింది. అయినా మేము గెలుపుపై ఆశలు వదులు కోలేదు. పోటీలో ఉండేందుకు ఒకరినొకరం ఉత్తేజపరచుకున్నాము. ఒకర్రెండు వికెట్లు ఆటను మాకు అనుకూలంగా మారుస్తాయని తెలుసు. గతంలో నాకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయి.కర్ణ్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బౌండరీల పరిధి 60 మీటర్లలోపు ఉన్నప్పుడు బంతిని టాస్ వేయాలంటే చాలా సాహసం కావాలి. కర్ణ్ శర్మ అలా చేసి సక్సెస్ సాధించాడు. అందరం తలో చేయి వేసి మా అవకాశాలను నిలుపుకోగలిగాము. బ్యాటింగ్ ఆర్డర్‌పై స్పందిస్తూ.. ఆటగాళ్లు ఫామ్‌లోకి రావాల్సి ఉంది. వీలైనన్ని బంతులు ఎదుర్కొంటేనే అది జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో మంచు తీవ్ర ప్రభావం చూపింది. కొత్త బంతితో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇలాంటి విజయాలు జట్టు గతిని మారుస్తాయి. పరిస్థితులు అనుకూలంగా మారుతాయి.

గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిన ఢిల్లీ.. కరుణ్ పోరాటం వృధా.. సీజన్లో తొలి ఓటమి
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ నాలుగు వరుస విజయాల తర్వాత తొలి ఓటమి చవిచూసింది. ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్ 13) రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో 12 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లోనూ ఢిల్లీ గెలవాల్సి ఉండింది. అయితే 19వ ఓవర్ చివరి మూడు బంతులకు మూడు వికెట్లు రనౌట్ల రూపంలో కోల్పోయి ఓటమిని కొని తెచ్చుకుంది. సింగిల్స్ తీసినా గెలిచే మ్యాచ్‌లో ఢిల్లీ చివరి వరుస బ్యాటర్లు డబుల్స్ కోసం ప్రయత్నించి రనౌటయ్యారు. 19వ ఓవర్లో హై డ్రామా నడిచింది. నాలుగో బంతికి రనౌట్ కాకముందు అశుతోష్ శర్మ వరుసగా రెండు బౌండరీలు బాది మంచి టచ్‌లో కనిపించాడు. అయితే అతను లేని రెండో పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. ఆతర్వాతి బంతికి కుల్దీప్ కూడా అనవసరమైన రెండో పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. చివరి బంతికి మోహిత్ సింగిల్ తీసే ప్రయత్నం చేయగా.. సాంట్నర్ డైరెక్ట్ హిట్‌తో అతన్ని కూడా రనౌట్ చేశాడు. దీంతో ఢిల్లీ మరో ఓవర్ మిగిలుండగానే పరాజయంపాలైంది. ముంబై నిర్దేశించిన 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీ విజయానికి పటిష్ట పునాది వేశాడు. ఓ దశలో (11.3 ఓవర్లలో 135/2) ఢిల్లీ సునాయాసంగా గెలిచేలా కనిపించింది.అయితే కరుణ్ ఔట్ కావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ముంబై బౌలర్లు పుంజుకున్నారు. కొత్త బంతితో కర్ణ్ శర్మ (4-0-36-3), మిచెల్ సాంట్నర్ (4-0-43-2) మాయ చేశారు. 58 పరుగుల వ్యవధిలో ఢిల్లీ చివరి 8 వికెట్లు కోల్పోయింది. ఛేదనలో ఢిల్లీ తొలి బంతికే జేక్ ఫ్రేజర్ (0) వికెట్ కోల్పోయినా.. అభిషేక్ పోరెల్ (33), కరుణ్ నాయర్ రెండో వికెట్‌కు 10.1 ఓవర్లలో 119 పరుగులు జోడించారు. 119 పరుగుల వద్ద పోరెల్, 135 పరుగుల వద్ద (11.4వ ఓవర్) కరుణ్ నాయర్ వికెట్ వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ పతనం మొదలైంది. కేఎల్ రాహుల్‌ను (15) కర్ణ్ శర్మ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు (క్యాచ్ అండ్ బౌల్డ్). ఆ తర్వాత అక్షర్ పటేల్‌ను (9) బుమ్రా, ట్రిస్టన్ స్టబ్స్‌ను (1) కర్ణ్ శర్మ ఔట్ చేశారు. తొలి మ్యాచ్‌లో (ఈ సీజన్లో) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అశుతోష్ శర్మ (17), కుల్దీప్ (1), మోహిత్ శర్మ (0) రనౌట్ కాగా.. మరో హిట్టర్ విప్రాజ్ నిగమ్‌ను (14) సాంట్నర్ స్టంపౌట్ చేశాడు. అంతకుముందు ముంబై టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (59), రికెల్టన్ (41), సూర్యకుమార్‌యాదవ్ (40), నమన్ ధీర్ (38) రాణించగా.. రోహిత్ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ముంబై తొమ్మిదో స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకగా.. సీజన్లో తొలి ఓటమి చవిచూసిన ఢిల్లీ టాప్ ప్లేస్ నుండి రెండో స్థానానికి పడిపోయింది.మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఓటమి పట్ల విచారం వ్యక్తం చేశాడు. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయామని బాధ పడ్డాడు. మిడిలార్డర్లో కొన్ని చెత్త షాట్లు కొంపముంచాయని అన్నాడు. మంచు కూడా కీలకపాత్ర పోషించిందని తెలిపాడు. కుల్దీప్, కరుణ్ నాయర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.

IPL 2025, MI VS DC: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (ఏప్రిల్ 13) రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ పటిష్ట స్థితిలో ఉండినప్పటికీ.. ఆతర్వాత ఒత్తిడికి లోనై ఓటమిని కొని తెచ్చుకుంది. 19వ ఓవర్లో చివరి మూడు బంతులకు ఢిల్లీ వరుసగా మూడు వికెట్లు రనౌట్ల రూపంలో కోల్పోయి పరాజయంపాలైంది. ఓ దశలో ఢిల్లీ 11.3 ఓవర్లలో 135 పరుగులు (రెండు వికెట్ల నష్టానికి) చేసి సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) ఔట్ కావడంతో పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైంది. 58 పరుగుల వ్యవధిలో ఢిల్లీ చివరి 8 వికెట్లు కోల్పోయింది. తద్వారా కరుణ్ నాయర్ అద్భుత ఇన్నింగ్స్ వృధా అయ్యింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ ఈ మ్యాచ్‌లో దుమ్మురేపాడు. బుమ్రా లాంటి బౌలర్‌ను కూడా ఉతికి ఆరేశాడు. ముంబై విజయంలో వెటరన్ కర్ణ్ శర్మ (4-0-36-3), మిచెల్ సాంట్నర్ (4-0-43-2) కీలకపాత్ర పోషించారు. సాంట్నర్ అద్భుతమైన టచ్‌లో ఉన్న కరుణ్ నాయర్‌ను క్లీన్ బౌల్డ్ చేయగా.. కర్ణ్ శర్మ.. అభిషేక్ పోరెల్ (33), కేఎల్ రాహుల్ (15), ట్రిస్టన్ స్టబ్స్ (1) వికెట్లు తీశాడు. ఛేదనలో ఢిల్లీ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. జేక్ ఫ్రేజర్ డకౌటై మరోసారి నిరాశపరిచాడు. తమ తొలి మ్యాచ్‌లో (ఈ సీజన్లో) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అశుతోష్ శర్మ (17) ఈ మ్యాచ్‌లో రనౌటయ్యాడు. ముంబై బౌలర్లలో దీపక్ చాహర్, బుమ్రా కూడా తలో వికెట్ తీశారు.ఈ మ్యాచ్‌లో ముంబై తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (59), రికెల్టన్ (41), సూర్యకుమార్‌యాదవ్ (40), నమన్ ధీర్ (38) రాణించగా.. రోహిత్ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ముంబై తొమ్మిదో స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. ఢిల్లీ ఈ సీజన్లో తొలి ఓటమిని చవిచూసి, రెండో స్థానానికి పడిపోయింది.చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్ఢిల్లీపై గెలుపుతో ముంబై ఇండియన్స్ ఓ అరుదైన రికార్డు సృష్టించింది. తొలి ఇన్నింగ్స్‌లో 200 ప్లస్ స్కోర్లు చేసిన ప్రతిసారి గెలిచిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు ముంబై 15 మ్యాచ్‌ల్లో ఇలా గెలిచింది. ముంబై తర్వాత ఢిల్లీ అత్యధిక మ్యాచ్‌ల్లో ఇలా గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు 13 సార్లు తొలి ఇన్నింగ్స్‌లో 200 ప్లస్ స్కోర్లు చేసి గెలిచింది. ముంబై, ఢిల్లీ కంటే సీఎస్కే అత్యధిక సార్లు (21) 200 ప్లస్ స్కోర్లకు డిఫెండ్ చేసుకున్నప్పటికీ.. ఐదు సార్లు ఓడిపోయింది. ఆర్సీబీ కూడా 19 సార్లు తొలి ఇన్నింగ్స్‌లో 200 ప్లస్ స్కోర్లు చేసి డిఫెండ్ చేసుకోగా.. 5 సార్లు ఓటమిపాలైంది. ఎస్ఆర్హెచ్ 15 సార్లు 200 ప్లస్ స్కోర్లు చేసి డిఫెండ్ చేసుకోగా.. 2 సార్లు ఓటమిపాలైంది.
బిజినెస్

పట్టణాల్లో అధిక ఖర్చు వీటికే..
నెలవారీ సంపాదనను నిత్యావసర ఖర్చులు, విలాసాలు, ఆన్లైన్ షాపింగ్.. వంటి వాటికి వెచ్చిస్తుంటారు. అయితే గ్రామీణ వినియోగదారుల ఖర్చులు పట్టణ వినియోగదారులతో పోలిస్తే కాస్తా భిన్నంగా ఉండవచ్చు. ఎందుకంటే అక్కడి సామాజిక, ఆర్థిక పరిస్థితులు వేరుగా ఉంటాయి. కానీ పట్టణాల్లో వినియోగదారుల ఖర్చులు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఆర్థిక స్తోమత మెరుగ్గా ఉన్న కొందరు మరింత లగ్జరీ వస్తువులు, హోటళ్లు, రెస్టారెంట్లకు ఖర్చు చేస్తారు. సాధారణంగా పట్టణ వినియోగదారులు ఎలాంటి వాటికి అధికంగా ఖర్చు చేస్తున్నారో నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఫుడ్ అండ్ బేవరేజెస్నెలవారీ బడ్జెట్లో గణనీయమైన భాగం అంటే సుమారు 20-30% ఆహార పదార్థాలకు కేటాయిస్తున్నారు. బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, పాల ఉత్పత్తులు వంటి నిత్యావసరాలు ఇందులో ఉన్నాయి. బ్రాండెడ్, ప్యాకేజ్డ్ ఆహారాలు, తినడానికి సిద్ధంగా ఉన్న భోజనం, ప్రాసెస్ చేసిన స్నాక్స్‌కు కూడా ప్రాధాన్యత పెరుగుతోంది.హౌసింగ్, యుటిలిటీస్అద్దె లేదా ఇంటి కోసం ఈఎంఐలకు అధికంగా చెల్లింపులు చేస్తున్నారు. గృహ ఖర్చులు బడ్జెట్లో 25-35% వరకు ఉంటున్నాయి. సొంతంగా ఇళ్లు ఉన్న పట్టణ వినియోగదారులు తరచుగా తమ ఇంటి సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రిన్యువేషన్, అలంకరణలు, స్మార్ట్ హోమ్ గాడ్జెట్ల కోసం వెచ్చిస్తున్నారు.హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్గత దశాబ్ద కాలంలో హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ వంటి సేవలపై ఖర్చు గణనీయంగా పెరిగింది. ఈ విభాగాల్లో వరుసగా 8.2 శాతం, 7.5 శాతం వృద్ధిరేటు నమోదైంది. దాంతో వీటికి చేసే ఖర్చు భారీ మొత్తంలో ఉంటుంది. ఆరోగ్య బీమా తీసుకోని వారి పరిస్థితులు దారుణంగా ఉంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రతిఒక్కరు తమ కనీస బాధ్యతగా తప్పకుండా ఆరోగ్యబీమా తీసుకోవాలని సూచిస్తున్నారు. విద్యార్థుల ఫీజుల విషయంలో ప్రభుత్వాలు స్పందించి విచ్చలవిడిగా యాజమాన్యాలు వాటిని పెంచకుండా కట్టడి చేయాలని కోరుతున్నారు.రవాణాప్రజా రవాణా, వ్యక్తిగత వాహనాలు, ఇంధనం, నిర్వహణ.. వంటి ఖర్చులు బడ్జెట్లో 10-15% ఉంటున్నాయి. ఇది వినియోగదారుల వ్యయ సరళితోపాటు ఆటోమొబైల్ పరిశ్రమ వృద్ధిని సూచిస్తుంది. చాలా మంది రవాణా కోసం కార్లు, ద్విచక్ర వాహనాలను ఎంచుకుంటున్నారు.వినోదంసినిమాలు, కచేరీలు, థీమ్ పార్కులు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు వంటి ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో ఖర్చు చేస్తున్నారు. ఇది సాధారణంగా బడ్జెట్లో 5-10% వాటాను కలిగి ఉంటుంది. కొవిడ్ సమయంలో ఆన్లైన్ గేమింగ్ల కోసం పట్టణ వినియోగదారులు అధికంగా ఖర్చు చేశారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: ఆదాయం చారెడు.. ఖర్చు బారెడు!పొదుపు విషయంలో చాలా మందికి సాధారణంగా ఖర్చు తర్వాత మిగిలింది జాగ్రత్తగా పొదుపు చేద్దామనే ఆలోచన ఉంటుంది. కానీ ముందు పొదుపు తర్వాతే ఖర్చు అనే ధోరణి అలవరుచుకుంటే తప్పకుండా దీర్ఘకాలంలో మంచి రాబడిని సొంతం చేసుకోవచ్చు. కాబట్టి ఖర్చులు ఎలాగో ఉంటాయి. తర్కంతో ఆలోచించి తక్కువ ఖర్చు చేస్తూ పొదుపునకు పెద్దపీట వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆదాయం చారెడు.. ఖర్చు బారెడు!
భారతదేశంలోని పట్టణ వినియోగదారుల ఆదాయాలకు, వారి ఖర్చులకు పొంతన లేకుండా ఉంది. ఖర్చులకు అనుగుణంగా తమ ఆదాయం పెరగకుండా స్తబ్దుగా ఉండటంపై ఆందోళన చెందుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వేలో వెల్లడైంది. అందులోని వివరాల ప్రకారం 55% పట్టణ నివాసితులు మునుపటి సంవత్సరంతో పోలిస్తే తమ ఆదాయంలో ఎటువంటి మార్పు లేదని తెలిపారు. ఇది దాదాపు 11 సంవత్సరాల్లో అత్యధిక వాటాను సూచిస్తుంది. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ 80% మంది పట్టణ వినియోగదారులు నిత్యావసర వస్తువులపై చేస్తున్న ఖర్చు అధికంగా ఉందని పేర్కొన్నారు.భవిష్యత్తు పొదుపు ప్రశ్నార్థకంఈ పరిస్థితి పట్టణ కుటుంబాలకు ఆదాయం-ఖర్చు మధ్య సమతుల్యతను హైలైట్ చేస్తుంది. ఆదాయం స్తబ్దుగా ఉండి ఖర్చులు పెరుగుతుండడంతో క్రమంగా అప్పుల్లో కురుకుపోతున్నారు. ద్రవ్యోల్బణ రేట్లు తగ్గినప్పటికీ నిత్యావసర ఖర్చులు నిరంతరం పెరుగుతుండడం గమనార్హం. దాంతో చాలా మంది వినియోగదారులు తమ ఆర్థిక బడ్జెట్‌ను పునఃసమీక్షించుకోవలసి వస్తుంది. ఇది ప్రజల విచక్షణ వ్యయాన్ని(డిసిక్రీషనరీ స్పెండింగ్) తగ్గిస్తుంది. భవిష్యత్తు అవసరాలకు పెద్దగా పొదుపు చేయలేని పరిస్థితి నెలకొంటుంది.వేతన పెంపు లేదుఈ ధోరణికి అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి. ఆర్థిక అనిశ్చితి, ఉద్యోగ మార్కెట్లలో హెచ్చుతగ్గులు, రంగాలవారీగా నెలకొన్న మందగమనాలు చాలా మంది వ్యక్తుల ఆదాయ వృద్ధిని దెబ్బతీస్తున్నాయి. తరచుగా పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా వేతన ఉద్యోగులకు, సాలరీ ఇంక్రిమెంట్లు లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంటుంది. ఫ్రీలాన్సర్లు, చిన్న వ్యాపార యజమానులు సైతం స్థిరమైన ఆదాయ మార్గాలను నిర్వహించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు.దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావంఈ ఆర్థిక ఒత్తిడి కేవలం వ్యక్తిగతంగా కొన్ని ఇళ్లకు మాత్రమే పరిమితం కాదు. డిస్పోజబుల్ ఆదాయం(నెలవారీ ఖర్చుల అనంతరం మిగులు డబ్బు) తగ్గడంతో పట్టణ వినియోగదారులు నిత్యావసర వస్తువులు, ఇతర సేవలపై ఖర్చును నియంత్రించే అవకాశం ఉంది. ఇది రిటైల్, ఎంటర్టైన్మెంట్, టూరిజం.. వంటి రంగాలను ప్రభావితం చేస్తుంది. అంతేకాక, వినియోగదారుల్లో ఖర్చుకు సంబంధించిన అప్రమత్తత వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది.ఇదీ చదవండి: అప్పుపై వడ్డీ తగ్గించిన ప్రముఖ బ్యాంక్వ్యూహాత్మక చర్యలు అవసరంఈ ఆందోళనలను పరిష్కరించడానికి విధానకర్తలు ప్రధానంగా పట్టణ, గ్రామీణ వినియోగదారులకు మద్దతుగా నిలిచేందుకు వారితో కలిసి పనిచేయాలి. ఉపాధి అవకాశాలను పెంచడం, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం, కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించే చర్యలను ప్రవేశపెట్టడం వంటి వ్యూహాత్మక చర్యల్లో కొత్త విధానాలు రూపొందించి పక్కాగా అమలు చేయాలి. ఇవి వినియోగదారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించడానికి, అవసరమైన ఆర్థిక ఉపశమనానికి సహాయపడతాయి.

అకౌంట్లను వెంటనే ఫ్రీజ్ చేసే అధికారాలు కావాలి
న్యూఢిల్లీ: అక్రమ లావాదేవీలకు వీలు కల్పిస్తున్న మ్యూల్ ఖాతాలను వెంటనే స్తంభింపజేసేందుకు (ఫ్రీజ్) బ్యాంక్ సిబ్బందికి అధికారాలు ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ ఆర్బీఐకి ఈ మేరకు ప్రతిపాదన చేయనున్నట్టు తెలిపింది. సైబర్ నేరస్థులు ఈ మ్యూల్ ఖాతాల ద్వారానే నిధులు తరలిస్తుంటారన్నది గమనార్హం.కొంత కమీషన్ ముట్టచెప్పి వేరే వారి ఖాతాలను లావాదేవీలకు వినియోగించుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఖాతాదారుల ప్రమేయం లేకుండా కూడా వారి ఖాతాలను వినియోగిస్తుంటారు. అంతర్గత వ్యవస్థలు ఈ తరహా లావాదేవీల గురించి హెచ్చరించిన వెంటనే ఖాతాలను నిలిపివేసే అధికారం ఇవ్వాలని కోరనున్నట్టు వర్కింగ్ గ్రూప్ తెలిపింది. ప్రస్తుతం ఏదైనా ఖాతాను ఫ్రీజ్ చేయాలంటే కోర్టు లేదా దర్యాప్తు సంస్థల ఆదేశాలతోనే బ్యాంక్ సిబ్బంది చేయగలరు.మరోవైపు అక్రమ లావాదేవీలకు అవకాశం ఉన్న ఖాతాలను గుర్తించేందుకు బ్యాంక్‌లు సైతం తనిఖీ చేయాలన్నది మరో ప్రతిపాదన. ఓటరు గుర్తింపు కార్డుతో ఖాతాలు తెరిచిన వారి గుర్తింపు ధ్రువీకరించుకునేందుకు వీలుగా ఎన్నికల సంఘం డేటాబేస్‌ను తనిఖీ చేసే అవకాశం బ్యాంక్ సిబ్బందికి కల్పించాలని కోరనున్నట్టు వర్కింగ్ గ్రూప్ తెలిపింది.

ఐటీకి అనిశ్చితి కొంతకాలమే: టీసీఎస్ సీఈవో
ముంబై: ప్రపంచ దేశాల మధ్య టారిఫ్‌ల కారణంగా తలెత్తిన అనిశ్చితి స్వల్పకాలమే కొనసాగనున్నట్లు సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సీఈవో, ఎండీ కె.కృతివాసన్ పేర్కొన్నారు. వెరసి ఐటీ సేవల పరిశ్రమకు కొంతకాలమే అనిశ్చితి సవాళ్లు సృష్టించనున్నట్లు అభిప్రాయపడ్డారు. కొద్ది నెలల్లోనే పరిష్కారం లభించనున్నట్లు అంచనా వేశారు.39 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీ ఆర్డర్ బుక్ భవిష్యత్ ఆదాయ ఆర్జనకు హామీ ఇస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. డీల్ పైప్‌లైన్ పటిష్టంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులతో కొంతమంది క్లయింట్ల నుంచి విచక్షణ వ్యయాలు నిలిచిపోతున్నట్లు వెల్లడించారు. అయితే ధరల విషయంగా ఒత్తిడిలేదని స్పష్టం చేశారు.నిజానికి వార్షికంగా, త్రైమాసికవారీగా ధరలు స్వల్పంగా మెరుగుపడినట్లు తెలియజేశారు. గతేడాదికి 30 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించిన కంపెనీ విచక్షణ వ్యయాల వాటాపై వివరణ ఇవ్వని సంగతి తెలిసిందే. ఇవి ఆదాయంలో కీలకమే అయినప్పటికీ ప్రస్తుత ట్రెండ్‌వల్ల కంపెనీపై ప్రతికూల ప్రభావం పడలేదని వివరించారు.యూఎస్‌లో పరిస్థితులు సర్దుకుంటే ఉత్తర అమెరికా బిజినెస్‌లో తిరిగి పురోభివృద్ధి అందుకోగలమని అంచనా వేశారు. సాఫ్ట్వేర్ సేవల ఔట్‌సోర్సింగ్‌కు ప్రపంచంలోనే యూఎస్ అతిపెద్ద మార్కెట్‌కాగా.. ప్రస్తుతం కంపెనీ ఆదాయంలో వాటా 48%కి పరిమితం కావడం గమనార్హం!
ఫ్యామిలీ

ఛీ..య్యాక్..! ఆఫీస్ బాత్రూమ్నే ఇల్లుగానా..!
డబ్బులు అందరూ ఆదా చేస్తారు. కాని, చైనాకు చెందిన యాంగ్ అనే అమ్మాయి అద్దె డబ్బులను ఆదా చేయడానికి ఏకంగా అఫీసు బాత్రూమ్నే తన ఇంటిగా ఎంచుకుంది. అద్దె చెల్లించి మరీ, అక్కడే ఫోల్డబుల్ బెడ్ వేసుకొని, కమోడ్స్ కనిపించకుండా క్లాత్‌ను కర్టెన్‌గా కట్టుకొని పడుకుంటుంది. చిన్న కబోర్ట్లాంటి దాంట్లో కిచెన్ సామాన్లు సర్దుకుంది. బట్టలు పెట్టుకోవడానికి హ్యాంగర్ రాడ్ ఏర్పాటు చేసుకుంది. అక్కడే తన బట్టలు ఉతుక్కొని, బిల్టింగ్పై వాటిని ఆరేస్తుంది. ఇలా అచ్చం ఇంట్లో ఉన్నట్లుగానే అందులో ఉంటోంది. వాష్‌రూమ్ కదా, అక్కడ వాసన రాదా? అంటే, ఎలాంటి వాసన రాకుండా రోజూ రాత్రి నీట్‌గా క్లీన్ చేస్తుందట. మళ్లీ ఉదయం కాగానే మంచం, సామాన్లు, కర్టెన్లు అన్నీ ఒక పక్కకు సర్దేస్తుంది. తన ఆర్థిక పరిస్థితిని తను పనిచేసే ఫర్నిచర్ ఫ్యాక్టరీ యజమానికి వివరించి, వాష్‌రూమ్‌ను అద్దెకు ఇవ్వమని అడిగింది. ఆయన అద్దె ఏమీ వద్దు, కేవలం కరెంట్, వాటర్ బిల్లు కట్టుకోమని చెప్పాడట. ఇప్పుడు కేవలం నెలకు రూ. 545 మాత్రమే బిల్లులకు కడుతోంది. ఇలా తను కూడబెట్టుకున్న డబ్బులతో త్వరలోనే ఇల్లు కొంటానని, అప్పటి వరకు ఈ బాత్రూమ్లోనే ఉంటానని చెబుతోంది. తన బాత్రూమ్ ఇంటిని ఆమెనే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. (చదవండి: Wedding Menu: ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..! క్రియేటివిటీ మాములుగా లేదుగా..)

కాబోయే తల్లులు యాంటీబయాటిక్స్ వాడితే..!
ఏ చిన్న ఇన్ఫెక్షన్ లేదా ఏ ఆరోగ్య సమస్య వచ్చినా చాలామంది అడపదడపా యాంటీబయాటిక్ టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. కానీ గర్భవతుల విషయంలో వాళ్లు ఇలా చేయడం ఎంతమాత్రమూ సరికాదు. ఎందుకంటే యాంటీబయాటిక్స్ మాత్రమే కాకుండా డాక్టర్ సలహా సూచన లేకుండా ఏ టాబ్లెట్‌ను కూడా గర్భవతులు వాడకూడదు. ఆ టాబ్లెట్స్ వాళ్లకు ఎంతో కీడు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. గర్భవతులు యాంటీబయాటిక్స్ వాడితే ఆ దుష్ప్రభావం కడుపులోని బిడ్డపై పడి... ఆ చిన్నారికి ఎన్నో రకాల కీడు జరిగే అవకాశముంటుంది. ఉదాహరణకు కాబోయే తల్లులు యాంటీబయాటిక్స్ వాడితే... అవి బిడ్డ ఎముకల ఎదుగుదలకు అవరోధంగా పరిణమించవచ్చు. దాంతో బిడ్డ అవయవ నిర్మాణంలోనే లోసాలు (అనటామికల్ అబ్నార్మాలిటీస్) వచ్చి, కొన్ని అవకరాలు వచ్చే అవకాశముంది. కాబోయే తల్లి స్ట్రెప్టోమైసన్ వాడటం వల్ల బిడ్డకు వినికిడి లోపాలు వచ్చే అవకాశాలుంటాయి. తల్లులు వాడే టెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్ కారణంగా బిడ్డ దంతాలకు రావాల్సిన సహజమైన రంగు రాక΄ోవచ్చు. కొన్ని సందర్భాల్లో బిడ్డకు వచ్చే ఆ దంతాలు తమ సహజమైన మెరుపును కోల్పోవచ్చు. సల్ఫోనమైడ్స్ అనే యాంటీబయాటిక్స్ కారణంగా బిడ్డ పుట్టిన నెలలోపే వారికి కామెర్లు రావచ్చు. అయితే ప్రెగ్నెన్సీలో సైతం తీసుకోదగిన కొన్ని సురక్షితమైన యాంటీబయాటిక్స్ కూడా ఉంటాయి. అంటే... గర్భవతి ఏ త్రైమాసికంలో ఉందో దాన్ని బట్టి కొన్ని యాంటీబయాటిక్స్‌ను గర్భవతులకు సురక్షితంగా వాడుకోదగ్గవి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల గర్భిణికి యాంటీబయాటిక్స్ వాడాల్సిన పరిస్థితి వస్తే డాక్టర్ల పర్యవేక్షణలో వాటిని వాడాల్సి ఉంటుంది. అలాంటివి వాడుకోవచ్చు.(చదవండి: సమ్మర్లో వర్కౌట్లు చేసేటప్పుడూ..బీ కేర్‌ఫుల్ ..!)

సమ్మర్లో వర్కౌట్లు చేసేటప్పుడు.. బీ కేర్‌ఫుల్..!
సమ్మర్ ముదరగానే చెమటలు పడుతుండటంతో దేహం ద్రవాలను కోల్పోయి, చాలామందిలో మజిల్ క్రాంప్స్ రావడం పెరుగుతుంది. అకస్మాత్తుగా నిద్రలో గానీ, కొందరిలో పగటివేళలోనే పిక్కలు, తొడకండరాలు, ఛాతీ కండరాలు పట్టేస్తుంటాయి. కంటినిండా నిద్ర లేకపోవడం, ఆహారంలో కొన్ని అవసరమైన పోషకాలు లోపించడం, దేహానికి అలసటతో కలిగే నిస్సత్తువతోపాటు కొన్ని రకాల మందులు వాడకంతోనూ కొందరిలో మజిల్ క్రాంప్స్ కనిపించవచ్చు. కండరాల అలసట వల్ల, అలాగే వ్యాయామానికి ముందు తగినంతగా స్ట్రెచ్ ఎక్సర్సైజులు చేయకపోవడం, రక్తంలో ఎలక్ట్రోలైట్స్ పరిమాణం తగ్గిపోవడం కూడా కారణాలవుతాయి. ఈ సమస్యకు తక్షణ పరిష్కారంగా తాజాగా తయారు చేసుకున్న మజ్జిగలో కొద్దిగా ఉప్పు వేసుకుని తాగడం, చక్కెర లేకుండా పండ్లరసాలు, ద్రవాహారాలు తీసుకోవచ్చు. అన్ని పోషకాలతో కూడిన సమతుల ఆహారం తీసుకుంటూ ఉండటంతోపాటు, కంటినిండా నిద్రపోవడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చు. వ్యాయామానికి ముందు చేసే వార్మప్ కూడా ఈ సమస్య నివారణకు బాగానే తోడ్పడుతుంది. (చదవండి:

చిటికెలో జుట్టుని నచ్చిన హెయిర్ స్టైల్లో మార్చుకోవచ్చు ఇలా..!
జుట్టును మృదువుగా, అందంగా సరిచేసుకోవాలంటే చేతిలో స్ట్రెయిటెనర్ ఉండాల్సిందే అంటారు చాలామంది ఆడవారు. అయితే సమయం ఉన్నా లేకున్నా, వీలున్నా లేకున్నా– పవర్ ప్లగ్ సమీపంలోనే చాలా స్ట్రెయిటెనర్లతో కేశాలంకరణ సాధ్యమవుతుంది. కానీ ఈ లేటెస్ట్ వైర్లెస్ గాడ్జెట్‌తో సులభంగా ఎక్కడైనా, ఎప్పుడైనా జుట్టును నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా ప్రయాణాల్లో ఈ గాడ్జెట్ భలేగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది రీచార్జబుల్ స్ట్రెయిటెనర్. దీన్ని వైర్లెస్ గాడ్జెట్‌లా వాడుకునే వీలుంటుంది. ఇది చూడటానికి, ఉపయోగించడానికి అచ్చం దువ్వెనలా ఉండటంతో జుట్టు దువ్వుకున్నట్లే దువ్వుకుని, ఈజీగా స్ట్రెయిటెనింగ్ చేసుకోవచ్చు. దీనిలో 120 డిగ్రీస్ నుంచి 200 డిగ్రీస్ సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు మొత్తం మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఆరోగ్యమైన జుట్టుకు, బలహీనపడిన జుట్టుకు ఉష్ణోగ్రతను ఎంపిక చేసుకోవడంలో వ్యత్యాసం పాటించాలి. దీనితో పొడిబారి చిట్లిన జుట్టును సరి చేసుకోవచ్చు. వంకీల జుట్టును సులభంగా నిటారుగా మార్చుకోవచ్చు. ఉంగరాల జుట్టును మృదువుగా చేసుకోవచ్చు. ఈ గాడ్జెట్‌కు అటాచ్ చేసుకునేందుకు అనువుగా చార్జింగ్ బేస్ కూడా లభిస్తుంది. ఈ కూంబ్ మెషిన్ ముందువైపు పవర్ బటన్ పైన ఆప్షన్స్ టెంపరేచర్ డీటైల్స్‌తో పాటు చార్జింగ్ ఇండికేషన్ కూడా కనిపిస్తుంది. దీన్ని కొనుగోలు చేసే సమయంలో బ్యాటరీ సామర్థ్యాన్ని, వినియోగదారుల రివ్యూలను పరిగణనలోకి తీసుకోవడం ఉత్తమం.జుట్టు రాలు సమస్యకు చెక్..ఈరోజుల్లో చాలామందికి జుట్టు రాలడమే ప్రధాన సమస్యగా మారింది. అందుకు పరిష్కారంగా ‘హెయిర్ మెసోథెరపీ’ అనే విధానాన్ని సూచిస్తున్నారు ప్రొఫెషనల్ బ్యూటీషియన్స్. మెసోథెరపీలో చాలా సన్నని సూదులను ఉపయోగించి.. విటమిన్లు, ఎంజైమ్‌లు, హార్మోన్లు వంటివి జుట్టు కుదుళ్లలోకి నేరుగా ఇంజెక్ట్ చేస్తారు. ఈ ప్రక్రియ జుట్టు రాలడాన్ని తగ్గించి, బలమైన జుట్టు పెరిగేందుకు దోహదపడుతుంది. ఈ థెరపీ మాడులో రక్త ప్రసరణను మెరుగుపరచి, జుట్టు కుదుళ్లను ఉత్తేజపరుస్తుంది. జుట్టు రాలడానికి కారణమయ్యే హార్మోన్ల అసమతుల్యతను సరిచేస్తుంది. ఈ చికిత్స సాధారణంగా కొన్ని వారాల వ్యవధిలో అనేక సెషన్లలో జరుగుతుంది. ఒక్కో సెషన్ సుమారు 30 నిమిషాలు పడుతుంది. హెయిర్ మెసోథెరపీని అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే చేయించుకోవాలి. చికిత్సకు ముందు, తరువాత వైద్యుల సూచనలను కచ్చితంగా పాటించాలి. (చదవండి: Biodegradable Plastics: ప్లాస్టిక్‌ని వదిలించుకోవాలంటే.. చేతికి మట్టి అంటాల్సిందే..!)
ఫొటోలు


సింహాచలం : దర్శనానికి వచ్చి దేవుడి ఉంగరం దొంగిలిస్తారా? (ఫొటోలు)


హైదరాబాద్ : జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)


వెళ్లొస్తాం.. లింగమయ్యా ముగిసిన సలేశ్వరం బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)


వైట్ డ్రెస్ లో ప్రణీత సుభాష్ అందాల మెరుపులు (ఫోటోలు)


హైదరాబాద్ లో అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)


తెలుగు రాష్ట్రాల్లో ఈదురు గాలులతో వడగండ్ల వాన బీభత్సం (ఫొటోలు)


రాజ్ తరుణ్ ‘పాంచ్ మినార్’ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)


సోమాజిగూడ జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన ఇన్ఫ్లూయెన్సర్స్ (ఫొటోలు)


ఫిలిం ఫైనాన్షియర్ బంగారు బాబు కుమారుడి వివాహ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు (ఫోటోలు)


Meenakshi Chaudhary : తిరుమలలో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ మీనాక్షి చౌదరి (ఫోటోలు)
అంతర్జాతీయం

అణు విద్యుచ్ఛక్తిలో... చైనా అద్భుతం!
ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ అవసరాలు నానాటికీ ఊహాతీతంగా పెరిగిపోతున్నాయి. కృత్రిమ మేధ, రోబోటిక్స్, సెమీ కండక్టర్లు, బయో టెక్నాలజీ వంటి రంగాల్లో ముందంజలో ఉండాలంటే అత్యధిక విద్యుత్, అది కూడా కారుచౌకగా అందుబాటులో ఉండటం అత్యంత ముఖ్యం. ఎందుకంటే ఒక అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను నిర్వహించాలంటే కనీసం 40 లక్షల విద్యుత్ వాహనాలను చార్జ్ చేయడానికి సమానమైన విద్యుత్ కావాలని అంచనా. ఆన్లైన్ డేటాను రెప్పపాటులో ప్రాసెస్ చేసే కృత్రిమ మేధ డేటా సెంటర్లకు ప్రాణమైన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ (జీపీయూ)లకు కూడా నిరంతరం నిరాటంకమైన విద్యుత్ సరఫరా తప్పనిసరి. ప్రపంచమే డేటామయంగా మారిన నేపథ్యంలో డేటాను కాపాడుకోవాలన్నా, ఆన్లైన్లో నిరంతరం అందుబాటులో ఉంచాలన్నా అపారమైన విద్యుచ్ఛక్తి కావాల్సిందే. అణు విద్యుత్ రంగంలో ఇప్పటికే నంబర్‌వన్‌గా ఉన్న చైనా దీన్ని ముందే పసిగట్టింది. ప్రపంచంలోనే తొలిసారిగా ‘కేంద్రక సంలీన, విచ్చిత్తి’ సూత్రాల కలబోతగా ఓ వినూత్న అణు రియాక్టర్ తయారీకి నడుం బిగించింది. ఈ ప్రయత్నం గనుక ఫలిస్తే అపారమైన విద్యుత్ నిరంతరంగా అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. అన్నింట్లోనూ అగ్రస్థానం కేసి... ప్రపంచంలో ఎక్కడ ఏ కొత్త రకం వస్తువు తయారైనా వెంటనే దానికి నకలు తయారు చేస్తుందని చైనాకు పేరుంది. ఇమిటేషన్ టెక్నాలజీకి పేరెన్నికగన్న చైనా ఇప్పుడు వినూత్న ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక శక్తిగా ఎదగాలని ఆశపడుతోంది. పరిశోధన, అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా వాటికి అత్యధిక నిధులు కేటాయించిన దేశాల్లో చైనాది రెండో స్థానం విశేషం. హువాయీ, టెన్సెంట్, అలీబాబా, గ్జియోమీ, డీజేఐ కంపెనీలు, ఇన్నోవేషన్‌కు సంబంధించి బీవైడీ తదితరాలు చైనాను టెక్నాలజీలో అగ్రస్థానంలో నిలిపాయి. 5జీ టెక్నాలజీలో హువాయీ, డ్రోన్ టెక్నాలజీలో బీవైడీ టాప్ కంపెనీలుగా వెలుగొందుతున్నాయి. ఐదు నిమిషాలు ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్ల వెళ్లగల బ్యాటరీ, చార్జింగ్ వ్యవస్థలను బీవైడీ అభివృద్ధి చేసింది. విద్యుత్ వాహనాల అమ్మకాలు, ఆదాయంలో అది ‘టెస్లా’ను దాటేసిందని బీబీసీ ఇటీవలే పేర్కొంది. విద్యుత్ ఆధారిత రంగాల్లో అగ్రగామిగా కొనసాగాలంటే నిరంతర విద్యుత్ అవసరం. ఆ అవసరాలు తీరేలా చైనా ఇలా కేంద్రక సంలీన, విచ్ఛిత్తి రియాక్టర్ పనిలో పడింది.ఇలా పని చేస్తుంది జియాన్‌గ్జీ ప్రావిన్సులోని యహోహూ సైన్స్ ద్వీపంలో ఝింగ్‌హువో పేరిట ఈ వినూత్న అణు విద్యుత్కేంద్రాన్ని కేంద్రాన్ని చైనా నిర్మిస్తోంది. చైనా భాషలో ఝింగ్‌హువో అంటే మెరుపు. కేంద్రక విచ్చిత్తిలో యురేనియం వంటి బరువైన అణువులోని కేంద్రకం రెండు చిన్న కేంద్రకాలుగా విడిపోతుంది. ఆ క్రమంలో అత్యధిక స్థాయిలో ఉష్ణశక్తి వెలువడుతుంది. అణుబాంబు తయారీలో ఉండేది ఈ సూత్రమే. అణు రియాక్టర్లలో నూ దీన్నే వాడతారు. అదే కేంద్రక సంలీన ప్రక్రియలో రెండు కేంద్రకాలు కలిసిపోయి ఒక్కటిగా మారతాయి. విచ్చిత్తితో పోలిస్తే సంలీన చర్యతోనే అత్యధిక విద్యుదుత్పత్తి సాధ్యం. ఝింగ్‌హువో రియాక్టర్లో తొలుత సంలీన చర్యలు జరిపి వాటి ద్వారా వచ్చే భారయుత కేంద్రకాల సాయంతో విచ్ఛిత్తి జరుపుతారు. తద్వారా మరింత ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని చైనా శాస్తవేత్తలు చెబుతున్నారు. ఐదేళ్లలో లక్ష్యాన్ని సాధించాలని భావిస్తున్నారు.అత్యధిక ‘క్యూ వాల్యూ’ అత్యధిక అణు విద్యుదుత్పత్తి జరగాలంటే కేంద్రక సంలీన చర్యలో అత్యధిక శక్తి ఉద్గారం జరగాలి. సంలీన ప్రక్రియలో విడుదలయ్యే అత్యధిక ఉష్ణశక్తిని రియాక్టర్ విద్యుత్ రూపంలోకి మారుస్తుంది. సంలీన ప్రక్రియకు వెచ్చించాల్సిన శక్తి కంటే దాన్నుంచి ఉత్పన్నమయ్యే శక్తి ఎక్కువగా ఉండటాన్ని ‘నికర శక్తి లాభం’గా పిలుస్తారు. దాన్నే ‘క్యూ వాల్యూ’గా చెప్తారు. సంలీన ప్రక్రియలో అత్యధికంగా ఏకంగా 30 క్యూ వాల్యూను సాధించాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్టు సౌత్ చైనా మారి్నంగ్ పోస్ట్ కథనం పేర్కొంది. మూడేళ్ల క్రితం అమెరికాలో కాలిఫోరి్నయాలోని నేషనల్ ఇగ్నిషన్ ఫెసిలిటీ కేంద్రం 1.5 క్యూ వాల్యూను సాధించింది. ఫ్రాన్స్‌లోని ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పరమెంటల్ రియాక్టర్ (ఐటీఈఆర్) 10 క్యూ వాల్యూను సాధించే ప్రయత్నంలో ఉంది. అమెరికా, ఫ్రాన్స్ ఇప్పటికే కేంద్రక సంలీనం ద్వారా అణువిద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు శ్రమిస్తున్నాయి. చైనా తాజా యత్నాలు ఫలిస్తే అది ఏకంగా 20 ఏళ్లు ముందుకు దూసుకెళ్లగలదని ఆంట్రప్రెన్యూర్ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్నాడ్ బేర్‌ట్రెండ్ అభిప్రాయపడ్డారు.– సాక్షి, నేషనల్ డెస్క్

Jesus Nut: టెక్ సీఈవో ఫ్యామిలీ ప్రాణం తీసిన ‘జీసెస్ నట్’ కథ!
వాషింగ్టన్: జర్మనీకి చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీ సీమెన్స్ స్పెయిన్ విభాగం సీఈవో అగస్టిన్ ఎస్కోబార్ (agustin escobar) కుటుంబం మరణానికి ‘జీసెస్ నట్’ (jesus nut) కారణమైందని నిపుణులు భావిస్తున్నారు.గత గురువారం ఆగస్టిన్ ఎస్కోబార్, అతని భార్య, మెర్సి కాంప్రూబి మాంటాల్, వారి ముగ్గురు పిల్లలు (వయస్సు 4, 5, 11), పైలట్‌తో సహా సైట్ సీయింగ్ కోసం బయల్దేరారు. ఇందుకోసం బెల్ 206 అనే సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్‌ను వినియోగించారు.అయితే, సీఈవో కుటుంబం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వాల్ స్ట్రీట్ హెలిపోర్ట్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు టేకాఫ్ అవుతుండగా.. మన్‌హట్టన్ వినువీధిలో .. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దిశగా వెళ్లింది. ఆ సమయంలో గిరిగిరా తిరుగుతూ న్యూయార్క్ నగరంలోని ‘మిరాకిల్ ఆన్ ది హడ్సన్’ (miracle on the hudson) నదిలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంపై అందిన ప్రాథమిక సమాచారం మేరకు.. పక్షి ఢీకొట్టడం వల్లే హెలికాఫ్టర్ ప్రమాదం జరిగి ఉంటుందేమోనని అందరూ భావించారు. హెలికాప్టర్‌కు ప్రమాదం జరిగే సమయంలో స్థానికులు వీడియోలు తీశారు. ఆ వీడియోల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఘోరం జరిగే సమయంలో పక్షుల జాడ ఎక్కడా కనిపించలేదు. దీంతో హెలికాప్టర్ ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందా? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగింది. పలు ఆధారాలు, ఏవియేషన్ రంగ నిపుణులు, ప్రమాదానికి ముందు జరిగిన నిర్లక్ష్యం ఆధారంగా బెల్ 206 హెలికాప్టర్ ప్రమాదానికి కారణం ‘జీసెస్ నట్’ కారణమనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.ఏంటి ‘జీసెస్ నట్’ జీసెస్ నట్ అనేది హెలికాప్టర్ మెయిన్ రోటర్ మాస్ట్‌పై(mast) అమర్చబడి ఉంటుంది. అంటే ఇది హెలికాప్టర్ రెక్కలు..హెలికాప్టర్ ఇంజిన్‌కు జాయింట్ చేసి ఉంటుంది. ఈ భాగం వద్ద జీసెస్ నట్ ఉంటుంది. అది ఏ మాత్రం సరిగ్గా లేకపోయినా, ఊడినా హెలికాప్టర్ మొత్తం అదుపు తప్పుతుంది. ఆ నట్టు ఊడి పోతే హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడేయడం పైలెట్ వల్ల కూడా సాధ్యం కాదు. ఆగస్టిన్ ఎస్కోబార్ కుటుంబం ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లోని ఈ జీసెస్ నట్ ఊడిపోవడం వల్లే విషాదం చోటు చేసుకున్న న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ఈ ఘటనపై ఎఫ్ఏఏ (fedaral viation Administration) విచారణను వేగవంతం చేసింది.‘జీసెస్ నట్’ అంటే ఏమిటి?.. చరిత్ర ఏం చెబుతోందిజీసెస్ నట్ అనే పదం వియత్నాం యుద్ధంలో అమెరికన్ సైనికుల నోట తొలిసారి ఈ పదం వెలుగులోకి వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. 1930, 1940లలో యుద్ధ సమయంలో అమెరికా నేవి ప్రత్యర్థుల్ని మట్టికరింపించేందుకు చిన్న ఎయిర్ క్ట్రాప్ట్లను భారీ సంఖ్యలో డిజైన్ చేయించింది. కాన్సాలిడేటెడ్ మోడల్ 28లో పీబీవై కాటలినా అనే ఎయిర్ క్ట్రాప్ట్లో తొలిసారి ఈ నట్టును వినియోగంలోకి తెచ్చారు. పైన చెప్పుకున్నట్లుగా ఈ నట్టు ఎయిర్ క్ట్రాప్ట్ రెక్కలకు, ఇంజిన్‌కు అనుసంధానం చేసి ఉంటుంది. అయితే వియత్నంతో జరిగే యుద్ధంలో ఈ ఎయిర్ క్ట్రాఫ్ట్లో సైనికులు ప్రయాణిస్తుండగా ఎదైనా ప్రమాదం జరిగితే ఆ నట్టు బిగించిన రూటర్ మాస్ట్ ఊడిపోతే .. జీసెస్‌ను ప్రార్థించడం తప్ప ఏం చేయలేం అని అమెరికా సైనికులు అనేవారంటూ వీకీపీడియా సమాచారం చెబుతోంది.ప్రయాణానికి ముందే అంతేకాదు, ఈ తరహా జీసెస్ నట్ ఉన్న ఎయిర్క్రాప్ట్లలో ప్రయాణించే ముందు నట్టు సరిగ్గా ఉందా? లేదా? అని పరిశీలించాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే ప్రయాల్సి ఉంది. లేదంటే ప్రాణాలు గాల్లోనే కలిసి పోవడం ఖాయం. తాజాగా ‘మిరాకిల్ ఆన్ ది హడ్సన్’ నదిలో చోటు చేసుకున్న సీమెన్స్ స్పెయిన్ విభాగం సీఈవో అగస్టిన్ ఎస్కోబార్ కుటుంబం హెలికాప్టర్ ప్రమాదం ఈ జీసెస్ నట్ పనితీరుపై దృష్టిసారించకపోవడం వల్లే ప్రాణ నష్టం జరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.

ట్రంప్ ప్రభుత్వం ‘30 డేస్’ వార్నింగ్.. మర్యాదగా వెళ్లిపోండి
వాషింగ్టన్: ఇప్పటికే ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం.. మరొక కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడాలని చూసే వారిని మరోసారి హెచ్చరించింది. అక్కడ సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు ఉండాలని చూస్తే అందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అక్రమంగా తమ దేశంలో స్థిరపడాలని చూసే వారిని అప్రమత్తం చేస్తూ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. ‘ ఇక్కడ ఉన్న విదేశీ పౌరులు ఎవరైనా సరే 30 రోజులు దాటితే అమెరికా ప్రభుత్వం నమోదు తప్పనిసరి. ఒకవేళ అలా జరగకపోతే భారీ జరిమానాలే కాదు.. జైలు శిక్షను కూడా చూడాల్సి వస్తుంది’అని ట్రంప్ ఆధ్వర్యంలోని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఎక్స్’లో ఒక ట్వీట్ చేసింది. ‘ దయచేసి ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్లిపోండి. మీకు మీరుగా స్వచ్ఛందంగా అమెరికా నుంచి వైదొలగండి.’ అంటూ స్పష్టం చేసింది.Foreign nationals present in the U.S. longer than 30 days must register with the federal government. Failure to comply is a crime punishable by fines and imprisonment. @POTUS Trump and @Sec_Noem have a clear message to Illegal aliens: LEAVE NOW and self-deport. pic.twitter.com/FrsAQtUA7H— Homeland Security (@DHSgov) April 12, 2025వారికి ఈ నిబంధన వర్తించదు..స్టూడెంట్ పర్మిట్లు , వీసాలు ఉండి యూఎస్ లో ఉన్నవారిని ఇది ప్రత్యక్షంగా ప్రభావితం చేసే అవకాశం లేదు. కానీ విదేశీ పౌరులై సరైన అనుమతి లేకుండా యూఎస్ లో ఉండేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అక్రమ వలసల్ని నిరోధించేందుకు కఠిన చర్యల్లో భాగంగా ట్రంప్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. హెచ్ 1 బీ వీసాపై ఉన్న వ్యక్తి ఉద్యోగం కోల్పోయిన సమయంలో కూడా తాజా నిబంధన వర్తించదు. దానికి నిర్దేశించిన గడువు అనే నిబంధన ఇక్కడ వర్తిస్తుంది. విద్యార్థులు, హెచ్ 1 బీ వీసాదారులు యూఎస్ లో ఉండటానికి తప్పనిసరి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

సూడాన్‌లో మారణహోమం.. వందలాది మంది మృతి
కర్టోమ్: ఆఫ్రికా దేశం సూడాన్ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. పౌరుల శిబిరాలపై ఆర్ఎస్ఎఫ్ బలగాలు దాడులకు తెగబడ్డాయి. ఈ దాడుల్లో దాదాపు 114 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో, సూడాన్‌లో మారణహోమం జరిగింది.వివరాల ప్రకారం.. పశ్చిమ సూడాన్‌లోని నార్త్ డార్ఫర్‌లో గత రెండు రోజులుగా పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) బలగాలు దాడులు జరుపుతున్నాయి. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో వందలాది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. జామ్జామ్‌లోని పౌరుల శిబిరాలపై శుక్రవారం ఆర్ఎస్ఎఫ్ బలగాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. మరణించిన వారిలో తొమ్మిది మంది రిలీఫ్ ఇంటర్నేషనల్ ఉద్యోగులు కూడా ఉన్నారు. #Sudan 🇸🇩: a desperate situation is unfolding in #Darfur as the #RSF has overrun the Zamzam IDP camp near #ElFasher, leaving hundreds killed and forcing thousands to flee towards the besieged city.The city of El-Fasher is on the brink after a year of brutal siege. pic.twitter.com/NReidyJklJ— Thomas van Linge (@ThomasVLinge) April 12, 2025 ఇక, శనివారం అబూషాక్ శిబిరంపై దాడులు జరిపారు. ఇందులో 14 మంది మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. ఈ శిబిరంపై జరిగిన దాడిలో 40 మందికి పైగా మృతి చెందారని ఒక స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. ఈ దాడులకు సంబంధించి బలగాలు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దాడుల సందర్భంగా భయంతో పౌరులు పరుగులు తీశారు. బతుకు జీవుడా అంటూ ప్రాణలు అరచేతిలో పట్టుకున్నారు. మరోవైపు.. దాడుల్లో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులు.. కన్నీటిపర్యంతమవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. అయితే, 2023 ఏప్రిల్‌లో సూడాన్ ఆర్మీ చీఫ్ అబ్దుల్ ఫత్తా అల్-బుర్హాన్ మాజీ డిప్యూటీ, ఆర్ఎస్ఎఫ్ కమాండర్ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లోల మధ్య ఘర్షణ నెలకొనడంతో ఇరువర్గాల మధ్య దాడులు ప్రారంభమయ్యాయి. సూడానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (SAF), ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య జరిగిన దాడుల వల్ల 2023 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 29,600 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. Scenes of Mourning: Funeral Held for Victims of Zamzam Camp MassacreHeartbreaking scenes unfolded in Darfur as residents gathered to bury the martyrs of Zamzam displacement camp, following the brutal attack carried out by the UAE-backed Rapid Support Militia.The funeral… pic.twitter.com/gvd6sNQUEV— Sudanese Echo (@SudaneseEcho) April 12, 2025
జాతీయం

విద్యార్థులూ, జై శ్రీరామ్ అనండి
చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి మరోసారి వివాదాస్పదమయ్యారు. మదురైలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన గవర్నర్.. ‘జై శ్రీరామ్’ నినాదం చేయాలంటూ విద్యార్థులను ఆదేశించారు. కంబ రామాయణం రాసిన ప్రాచీన కవిని సన్మానించే కార్యక్రమంలో భాగంగా ‘ఈ రోజున శ్రీరాముని భక్తుడైన వ్యక్తికి నివాళులు అర్పిద్దాం. నేను ‘జై శ్రీరామ్’ అంటాను. మీరూ చెప్పండి’ అంటూ విద్యార్థులకు సూచించారు. దీనిపై అధికార డీఎంకే, కాంగ్రెస్ గవర్నర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. డీఎంకే ఆయనను ఆరెస్సెస్ అధికార ప్రతినిధిగా అభివరి్ణంచింది. గవర్నర్ మత నాయకుడిలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అసన్ మౌలానా విమర్శించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలకు ప్రచార మాస్టర్‌గా మారారని ఆరోపించారు.

భారతీయ కుటుంబ వ్యవస్థలో అనూహ్య మార్పులు
బెంగళూరు: భారత సమాజంలో కుటుంబ వ్యవస్థ అనూహ్య మార్పులకు లోనవుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న అన్నారు. విడాకుల సంఖ్య కొంతకాలంగా క్రమంగా పెరిగిపోతోందంటూ ఆందోళన వెలిబుచ్చారు. ‘‘రెండు దశాబ్దాలుగా 25–29 ఏళ్ల మధ్య వయసున్న యువతుల్లో అవివాహితుల సంఖ్య పెరుగుతోంది. మొత్తంగా అమ్మాయిల్లో సగటు వివాహ వయసు కూడా పెరుగుతోంది’’ అని నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ సమాచారాన్ని ఉటంకించారు. సుప్రీంకోర్టులో ఫ్యామిలీ కోర్టుల కమిటీకి చైర్పర్సన్ అయిన ఆమె ‘కుటుంబం: భారతీయ సమాజానికి పునాది’ పేరిట బెంగళూరులో జరిగిన దక్షిణాది ప్రాంతీయ సదస్సులో మాట్లాడారు. ‘పట్టణీకరణ, మహిళల్లో పెరిగిన ఆర్థిక స్వేచ్ఛ, అందరికీ విద్య అందుబాటులో రావడం వంటి కారణాలతో కుటుంబాల్లో మార్పులొస్తున్నాయి. విద్య, సాధికారతతో మహిళలు సాధించిన సామాజిక, ఆర్థిక స్వాతం్రత్యాన్ని సానుకూల దృక్పథంతోనే చూడాలి. వారు తమ కుటుంబానికి గాక దేశానికీ ఎనలేని సేవ చేస్తున్నారు’’ అని ఆమె అన్నారు. 40 శాతం పెళ్లిళ్లు విచ్చిన్నం కుటుంబ తగాదాల కేసులు పెరిగిపోతుండటం పట్ల జస్టిస్ నాగరత్న ఆవేనద వెలిబుచ్చారు. అందుకు మహిళలే కారణమన్న వాదనను ఆమె తోసిపుచ్చారు. సమాజ ధోరణి మారకపోవడం వంటివే అందుకు ప్రధానంగా కారణమని అభిప్రాయపడ్డారు. ‘‘సామాజిక, ఆర్థిక పరిస్థితులకు తగ్గట్లు మారనప్పుడే వైవాహిక వివాదాలు తలెత్తుతాయి. గత పదేళ్లుగా జరిగిన పెళ్లిళ్లలో 40 శాతం దాకా విచ్చిన్నమయ్యాయి. ఇంతగా కుటుంబ కలహాల కేసులు వచ్చిపడుతుండటం ఫ్యామిలీ కోర్టులకు తలకు మించిన భారం అవుతోంది. బ్రేక్‌ఫాస్ట్ సరిగా చేయలేదనో, ఫంక్షన్‌కు త్వరగా ముస్తాబు కాలేదనో కూడా కోర్టు దాకా వస్తున్నారు.ఇలాంటి గొడవల వల్ల అంతిమంగా అందరికంటే ఎక్కువగా నష్టపోయేది పిల్లలే. కుటుంబ వివాదాలకు ఫ్యామిలీ కోర్టుల కంటే కౌన్సిలింగ్, మధ్యవర్తిత్వం ఉత్తమం. ఇరుపక్షాలూ సంయమనంతో ప్రయత్నిస్తే సమస్య పరిష్కారమవుతుంది. ముందు భార్యాభర్తలు పరస్పరం అర్థం చేసుకుని గౌరవించుకోవాలి. భాగస్వామి అవసరాలను అర్థం చేసుకోవాలి. సమస్యను అవతలి వ్యక్తి దృక్కోణం నుంచి చూడాలి. ‘‘భార్య ఏమీ ఆశించకుండా ఇంటిల్లిపాది పనులూ ఒంటిచేత్తో చక్కబెడుతుందని భర్త గుర్తుంచుకోవాలి. ఆమెకు తగిన విలువ ఇస్తే పిల్లలూ మంచి వాతావరణంలో పెరుగుతారు’’ అంటూ హితవు పలికారు.

రెండ్రోజులు ఢిల్లీలో సీఎస్ మకాం
సాక్షి, న్యూఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూముల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలపై ఎలా స్పందించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. గత విచారణలో భాగంగా కంచ గచ్చిబౌలిలో వెంటనే పనులు ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమ ఆదేశాల విషయంలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా సీఎస్ వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.అలాగే ఆ భూములను సందర్శించి ఈ నెల 16లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌తోపాటు మరో 10 మంది అధికారులతో కలిసి శనివారం ఢిల్లీ చేరుకున్న సీఎస్ శాంతికుమారి ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సుమారు ఐదు గంటలపాటు అధికారులతో సమాలోచనలు చేశారు.సుప్రీంకోర్టుకు సమర్పించాల్సిన నివేదికపై సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సహా మరికొందరు న్యాయవాదులతో ఆమె ప్రత్యేకంగా సమావేశమైనట్లు సమాచారం. నివేదికలో పొందుపర్చాల్సిన అంశాలేమిటి? క్షేత్రస్థాయిలో ఏం జరిగింది? ప్రభుత్వం నివేదిక సమర్పించాక న్యాయస్థానం ఎలా స్పందిస్తుంది? వంటి విషయాలపై న్యాయవాదుల సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. అనంతరం ఢిల్లీ పర్యటన ముగించుకొని ఆదివారం సాయంత్రం ఆమె హైదరాబాద్‌కు తిరిగి వెళ్లారు.

వక్ఫ్ సవరణ చట్టంపై హీరో విజయ్ కీలక నిర్ణయం
ఢిల్లీ: సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్ విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 4న పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ చట్టంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ అంశాన్ని ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలతో పాటు పలువురు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో తాజాగా విజయ్ సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ వారంలో సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. సుదీర్ఘ చర్చ, తీవ్రస్థాయి వాదోపవాదాల అనంతరం వక్ఫ్ (సవరణ) బిల్లు–2025పై పార్లమెంటు ఆమోదముద్ర పడింది. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్యే లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించడం తెలిసిందే.రాజ్యసభ ఆమోదం కూడా పొందింది. 13 గంటలకు పైగా జరిగిన చర్చ అనంతరం ఓటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా జరిగింది. దాదాపుగా ప్రతి సవరణపైనా ఓటింగ్‌కు విపక్షాలు పట్టుబట్టాయి. వాటి సవరణలన్నీ వీగిపోయాయి. చివరికి బిల్లు ఆమోదం పొందింది. దానికి అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు పడ్డాయి. వక్ఫ్ బిల్లును లోక్‌సభ 288–232 ఓట్లతో ఆమోదించడం తెలిసిందే. వక్ఫ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా వేశారు. రాష్ట్రపతి సంతకంతో చట్టంగా రూపుదాల్చింది.
ఎన్ఆర్ఐ

Ugadi 2025 సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
'శ్రీ సాంస్కృతిక కళాసారథి' ఆధ్వర్యంలో సింగపూర్ లోని తెలుగువారి కోసం ప్రత్యేక 'విశ్వావసు ఉగాది వేడుకలు' కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం భారతదేశం నుండి ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు, రచయిత డాక్టర్ రామ్ మాధవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా లోక్‌సభ సభ్యులు డీకే అరుణ, ప్రముఖ రాజకీయవేత్త, సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి విచ్చేశారు.సింగపూర్ తెలుగు గాయనీ గాయకులు చక్కటి సాంప్రదాయబద్ధమైన పాటలతో ప్రేక్షకులను అలరించారు. నాట్య కళాకారుల ప్రత్యేక నృత్య ప్రదర్శనలు, చిన్నారుల పద్య పఠనాలు అందరినీ ఆకర్షించాయి. సింగపూర్ తెలుగు ప్రజలందరూ ఆనందంగా ఉగాది వేడుకలు జరుపుకున్నారు.సింగపూర్‌లోని తెలుగువారి సాంస్కృతిక ప్రతిభను ప్రదర్శించేందుందుకు వేదికను ఏర్పాటు చేయగలగడం, దానికి ప్రత్యేకించి భారతదేశం నుండి అతిథులు విచ్చేసి తమను అభినందించడం చాలా ఆనందంగా ఉందన్నారు కార్యక్రమ ప్రధాన నిర్వాహకులు, సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్. మరిన్ని NRI న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ సందర్బంగా సింగపూర్ కవయిత్రి కవిత కుందుర్తి రచించిన కవితా సంపుటి "Just A Housewife", రామ్ మాధవ్ రచించిన “Our Constitution Our Pride” అనే పుస్తకాలు ఆవిష్కరించారు. దాదాపు 350 మంది పైగా హాజరైన ఈ కార్యక్రమంలో సింగపూర్ లోని "స్వర" నాట్య సంస్థ నుండి కళాకారుల నాట్య ప్రదర్శనలు, చిన్నారులు ఉగాది పాటకు నాట్య ప్రదర్శన చేయగా, సంగీత విద్యాలయాలైన స్వరలయ ఆర్ట్స్, మహతి సంగీత విద్యాలయం, విద్య సంగీతం, జయలక్ష్మి ఆర్ట్స్ సంస్థల నుండి విద్యార్థులు గీతాలాపన చేశారు. చిన్నారుల వేద పఠనం, భగవద్గీత శ్లోక పఠనం వంటివి అందరినీ ఆకట్టుకున్నాయి.సింగపూర్ గాయనీమణులు తంగిరాల సౌభాగ్య లక్ష్మి, శైలజ చిలుకూరి, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, షర్మిల, శేషు కుమారి యడవల్లి, ఉషా గాయత్రి నిష్టల, రాధిక నడదూర్, శ్రీవాణి, విద్యాధరి, దీప తదితరులు సంప్రదాయ భక్తి పాటలు, ఉగాది పాటలు, శివ పదం కీర్తనలు మొదలైనవి వినిపించారు. వాద్య సంగీత ప్రక్రియలో వీణపై వేదుల శేషశ్రీ,, వయోలిన్ పై భమిడిపాటి ప్రభాత్ దర్శన్ తమ ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్యఅతిథి డాక్టర్ రామ్ మాధవ్ మాట్లాడుతూ తెలుగు భాషకు ఆదరణ తగ్గుతున్న ఈ రోజుల్లో తెలుగు భాష గొప్పతనం చాటేలా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఇళ్లలో తెలుగు రాయడం, చదవడం తగ్గిపోవడం వలన, తెలుగుభాష కనుమరుగు కావడానికి ముఖ్యకారణమన్నారు. ప్రపంచములో త్వరితగతిన అంతరించుకుపోతున్న భాషలో తెలుగు బాషా కూడా ఉండడం బాధాకరమని, దానిని కాపాడుకోవడం మన బాధ్యత అని తెలిపారు. వారి ప్రసంగం ఆధ్యంతం ఒక్క ఆంగ్ల పదం లేకుండా అచ్చతెలుగులో ప్రసంగించడం విశేషంగా నిలిచింది.కార్యక్రమ విశిష్ట అతిథి డీకే అరుణ మాట్లాడుతూ "నేను 14 ఏళ్ల తర్వాత ఎంపీ హోదాలో సింగపూర్ లో ఇలా ఉగాది వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే సంతోషిస్తున్నాం, కానీ తెలుగు భాష గొప్పతనాన్ని వాళ్లకు నేర్పించడం లేదు. విదేశాలలో ఉన్నటువంటి తెలుగువారు ఇలా తెలుగు భాష గొప్పతనాన్ని చాటుతూ, మన సంప్రదాయాలు, కట్టుబాట్లు చిన్న పిల్లలకు, భావి తరాలకు నేర్పుతుండటం అభినందనీయం" అని చెపుతూ అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమ ఆత్మీయ అతిధి వామరాజు సత్యమూర్తి మాట్లడుతూ "విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలలో సింగపూర్ లో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది, నేను సింగపూర్ కి వచ్చినప్పుడల్లా అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్ల పుట్టింటికి వచ్చినంత సంతోషం గా ఉందని" తెలియచేస్తూ కార్యక్రమములో పాల్గొన్న తన పాత మిత్రులను పేరు పేరున పలకరిస్తూ వారితో తనకున్న పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగిన వారి ప్రసంగములో అందరినీ నవ్విస్తూ, కొన్ని సామెతలను చెపుతూ, కవులను గుర్తుచేస్తూ, చివరలో కార్యక్రమ నిర్వాహుకులకు ఉండే కష్టాలను సోదాహరణంగా వివరించి అందరిని నవ్వించారు.ఈ కార్యక్రమములో తెలంగాణ కల్చరల్ సొసైటీ కార్యవర్గ సభ్యులు, తెలుగు సమాజం సభ్యులు, సింగపూర్ నలుమూలలు నుండి తెలుగువారు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ సభ్యులు రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, పాతూరి రాంబాబు, వ్యాఖ్యాతగా సౌజన్య బొమ్మకంటి తదితరులు పాల్గొన్నారు. GIIS స్కూల్ నిర్వాహకులు అతుల్ మరియు ప్రముఖ పారిశ్రామకవేత్త కుమార్ నిట్టల ప్రత్యేక సహాయ సహకారాలు అందించారు.స్కేటింగ్ లో విశేష ప్రతిభను ప్రపంచ స్థాయిలో ప్రదర్శితున్న నైనికా ముక్కాలను, తాను సాధించిన విజయాలను అభినందిస్తూ అతిధులు మరియు నిర్వాహుకులు నైనికా ఘనంగా సత్కరించారు. అతిథులని ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను బహుకరించి, కళాకారులకు అతిథులచే సర్టిఫికెట్ ప్రదానం చేయించారు, కాత్యాయనీ గణేశ్న ,వంశీకృష్ణ శిష్ట్లా సాంకేతిక సహాయం అందించగా, వీర మాంగోస్ వారు స్పాన్సర్ గా వ్యవహరించారు, అభిరుచులు, సరిగమ గ్రాండ్ వారు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. నిర్వాహకులు, సభా వేదిక అందించిన GIIS యాజమాన్యానికి, అతిథులకు సహకరించిన కళాకారులకు స్పాన్సర్స్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం
డాలస్, టెక్సస్, అమెరికా: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది పర్వదిన సందర్భంగా - “రైతన్నా! మానవజాతి మనుగడకు మూలాధారం నీవేనన్నా” అనే అంశంపై జరిపిన 78 వ అంతర్జాల అంతర్జాతీయ ఉగాది కవిసమ్మేళనం 30 మందికి పైగా పాల్గొన్న కవుల స్వీయ కవితా పఠనంతో ఎంతో ఉత్సాహభరితంగా జరిగింది.ముఖ్యఅతిథిగా పాల్గొన్న ‘పద్మశ్రీ పురస్కార గ్రహీత’ యడ్లపల్లి వెంకటేశ్వరరావు బ్రిటష్ కాలంనాటి ఆధునిక సేంద్రీయపద్దతుల వరకు వ్యవసాయపద్దతులలో వచ్చిన మార్పులను సోదాహరణంగా వివరించారు. రైతులకు వ్యవసాయసంబంధ విజ్ఞానాన్ని అందించేందుకు ‘రైతునేస్తం’ మాస పత్రిక, పశుఆరోగ్యం, సంరక్షణ కోసం ‘పశునేస్తం’ మాసపత్రిక, సేంద్రీయ పద్ధతులకోసం ‘ప్రకృతి నేస్తం’ మాసపత్రికలను, ‘రైతునేస్తం యూట్యూబ్’ చానెల్ ద్వారా సమగ్ర సమాచారం అందిస్తూ నిరంతరం రైతుసేవలో నిమగ్నమై ఉన్నామని తెలియజేశారు. రైతుకు ప్రాధ్యాన్యం ఇస్తూ తానా ప్రపంచసాహిత్యవేదిక ఇంత పెద్ద ఎత్తున కవిసమ్మేళనం నిర్వహించడం ముదాహవమని, ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరూ వ్రాసిన కవితలను పుస్తకరూపంలో తీసుకురావడం ఆనందంగా ఉందంటూ అందరి హర్షధ్వానాలమధ్య ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న ముఖ్యఅతిథి, కవి సమ్మేళనంలో పాల్గొన్న కవు లందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతు కుటుంబ నేపధ్యంనుండి వచ్చిన తనకు వ్యవసాయంలోఉన్న అన్ని కష్టాలు తెలుసునని, ప్రభుత్వాలు రైతులకు అన్ని విధాలా సహాయపడాలని, ‘రైతు క్షేమమే సమాజ క్షేమం’ అన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ - వివిధ రకాల పంటల ఉత్పత్తులలో, ఎగుమతులలో భారతదేశం ముందువరుసలోఉన్నా రైతు మాత్రం తరతరాలగా వెనుకబడిపోతూనే ఉన్నాడన్నారు. మహాకవి పోతన, కవిసార్వభౌమ శ్రీనాధుడులాంటి ప్రాచీన కవులు స్వయంగా వ్యసాయం చేసిన కవి కర్షకులని, గుర్రం జాషువా, ఇనగంటి పున్నయ్య చౌదరి, దువ్వూరి రామిరెడ్డి, తుమ్మల సీతారామమూర్తి లాంటి ఆధునిక కవులు రైతులపై వ్రాసిన కవితలను చదివి వారికి ఘన నివాళులర్పించారు. అలాగే రైతు నేపధ్యంలో వచ్చిన ‘పేద రైతు’, ‘కత్తిపట్టిన రైతు’, ‘రైతు కుటుంబం’, ‘రైతు బిడ్డ’, ‘పాడి పంటలు’, ‘రోజులు మారాయి’, ‘తోడి కోడళ్ళు’ లాంటి సినిమాలు, వాటిల్లోని పాటలు, అవి ఆనాటి సమాజంపై చూపిన ప్రభావం ఎంతైనా ఉందని, ఈ రోజుల్లో అలాంటి సినిమాలు కరువయ్యాయి అన్నారు. మన విద్యావిధానంలో సమూలమైన మార్పులు రావాలని, పసిప్రాయంనుండే పిల్లలకు అవగాహన కల్పించడానికి రైతు జీవన విధానాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలని, చట్టాలుచేసే నాయకులు కనీసం నెలకు నాల్గురోజులు విధిగా రైతులను పంటపొలాల్లో కలసి వారి కష్టనష్టాలు తెలుసుకుంటే, పరిస్థితులు చాలావరకు చక్కబడతాయని అభిప్రాయపడ్డారు.ఈ కవి సమ్మేళనంలో వివిధ ప్రాంతాలనుండి పాల్గొన్న 30 మందికి పైగా కవులు రైతు జీవితాన్ని బహు కోణాలలో కవితల రూపంలో అద్భుతంగా ఆవిష్కరించారు.పాల్గొన్న కవులు: దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి, ప్రకాశం జిల్లా; మంత్రి కృష్ణమోహన్, మార్కాపురం; పాయల మురళీకృష్ణ, విజయనగరం జిల్లా; నన్నపనేని రవి, ప్రకాశం జిల్లా; డా. తలారి డాకన్న, వికారాబాద్ జిల్లా; చొక్కర తాతారావు, విశాఖపట్నం; రామ్ డొక్కా, ఆస్టిన్, అమెరికా; దొండపాటి నాగజ్యోతి శేఖర్, కోనసీమ జిల్లా; ర్యాలి ప్రసాద్, కాకినాడ; సాలిపల్లి మంగామణి (శ్రీమణి), విశాఖపట్నం; సిరికి స్వామినాయుడు, మన్యం జిల్లా; తన్నీరు శశికళ, నెల్లూరు; చేబ్రోలు శశిబాల, హైదరాబాద్; లలిత రామ్, ఆరెగాన్, అమెరికా; బాలసుధాకర్ మౌళి, విజయనగరం; గంటేడ గౌరునాయుడు, విజయనగరం జిల్లా; కోసూరి రవికుమార్, పల్నాడు జిల్లా; మార్ని జానకిరామ చౌదరి, కాకినాడ; కె.ఎ. మునిసురేష్ పిళ్లె, శ్రీకాళహస్తి; డా. బీరం సుందరరావు, చీరాల; డా. వేంకట నక్త రాజు, డాలస్, అమెరికా; బండ్ల మాధవరావు, విజయవాడ; డా. కొండపల్లి నీహారిణి, హైదరాబాద్; నారదభట్ల అరుణ, హైదరాబాద్; పి. అమరజ్యోతి, అనకాపల్లి; యార్లగడ్డ రాఘవేంద్రరావు, హైదరాబాద్; చిటిప్రోలు సుబ్బారావు, హైదరాబాద్; డా. శ్రీరమ్య రావు, న్యూజెర్సీ, అమెరికా, డా. శ్రీదేవి శ్రీకాంత్, బోట్స్వానా, దక్షిణాఫ్రికా; డా. భాస్కర్ కొంపెల్ల, పెన్సిల్వేనియా, అమెరికా; ఆది మోపిదేవి, కాలిఫోర్నియా, అమెరికా; డా. కె. గీత, కాలిఫోర్నియా, అమెరికా; శ్రీ శ్రీధర్ రెడ్డి బిల్లా, కాలిఫోర్నియా, అమెరికా నుండి పాల్గొన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు శ్రమైక జీవన విధానం, తీరు తెన్నులపై తరచూ చర్చ జరపవలసిన అవసరం ఎంతైనా ఉందని, మన అందరికీ ఆహరం పంచే రైతన్న జీవితం విషాదగాధగా మిగలడం ఎవ్వరికీ శ్రేయస్కరంగాదన్నారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వార వీక్షించవచ్చును.https://youtube.com/live/qVbhijoUiX8అలాగే రైతు నేస్తం ఫౌండేషన్ సహకారంతో తానా ప్రపంచసాహిత్యవేదిక వెలువరించిన రైతు కవితల పుస్తకాన్ని కూడా ఇక్కడ పొందు పరుస్తున్నాము.

డా.గుడారు జగదీష్‌కు “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డు
మారిషస్ తెలుగు మహా సభ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ తెలుగు ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఫీనిక్స్‌లోని ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్‌లో తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని, శ్రీ విశ్వావసు నామ తెలుగు ఉగాదిని మారిషస్‌లోని తెలుగు వారు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ప్రముఖ సామాజిక-సాంస్కృతిక సంస్థ మారిషస్ తెలుగు మహా సభ నిర్వహించిన ఈ కార్యక్రమం, తెలుగు ప్రజల వారసత్వం మరియు సంప్రదాయాలను పరిరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఒక వేదికగా నిలచింది. కార్యక్రమం సాంప్రదాయ తెలుగు నూతన సంవత్సర ఆచారాలతో ప్రారంభమైంది, వీటిలో భాగంగా మా తెలుగు తల్లి, దీప ప్రజ్వలనం మరియు గణపతి వందనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్ గుడారు జగదీష్ వైద్య రంగంలో చేసిన అసాధారణ కృషికి, ముఖ్యంగా వికలాంగుల శ్రేయస్సు కోసం వారి యొక్క అచంచలమైన అంకితభావానికి గుర్తింపుగా మారిషస్ ప్రధాన మంత్రి సత్కరించారు.నాలుగు దశాబ్దాలుగా వికలాంగుల పునరావాసం మరియు సమాజ సేవకు అంకితమైన డాక్టర్ జగదీష్ దేశ విదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన అవిశ్రాంత సేవ ఎంతో మంది అభాగ్యుల జీవితాలను ప్రభావితం చేసింది. ఈ సేవలను గుర్తించిన మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్ గూలమ్ డాక్టర్ గుడారు జగదీష్ ను “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డుతో సత్కరించారు. డాక్టర్ జగదీష్ అసాధారణ మానవతా స్ఫూర్తిని మరియు అంకితభావాన్ని మారిషస్ ప్రధాని ప్రశంసించారు. డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ తనను ఈ గౌరవ పురస్కారానికి ఎంపిక చేసినందుకు మారిషస్ తెలుగు మహా సభ సభ్యులకు, మారిషస్ ప్రధాన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సంధర్భంగా మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్ గూలమ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన డాక్టర్ జగదీష్ కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ మరియు మంగళూరులోని మణిపాల్ విశ్వవిద్యాలయం వంటి ప్రఖ్యాత వైద్య సంస్థలలో వైద్య విద్యను అభ్యసించి ఆర్థోపెడిక్స్ విభాగంలో నైపుణ్యం పొంది, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ సంస్థల నుండి అత్యాధునిక పద్ధతులలో అధునాతన శిక్షణ సైతం తీసుకున్నారని తెలిపారు. అమెరికా, జర్మనీ, ఇంగ్లాండు, ఇటలీ, ఫ్రాన్స్, నైజీరియా, కెన్యా, ఒమన్, స్విట్జర్లాండ్ మరియు మారిషస్‌లలో కూడా ఉచిత క్యాంపులు నిర్వహించి తన సేవలను విస్తరించి, అనేక జాతీయ మరియు అంతర్జాతీయ జర్నల్స్‌లో తన పరిశోధనలు ప్రచురించారని తెలిపారు. రాబోయే రోజుల్లో మారిషస్‌కు కూడా డాక్టర్ జగదీష్ తన సేవలను అందించాలని ప్రధాని కోరారు.ప్రధానమంత్రి తన ప్రసంగంలో, తెలుగు సంస్కృతిని కాపాడటానికి, ప్రోత్సహించడానికి మరియు సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే వ్యక్తులను గుర్తించడంలో మారిషస్ తెలుగు మహాసభ యొక్క నిబద్ధతను ప్రశంసించారు. డాక్టర్ జగదీష్ అంకితభావం మరియు సమాజం పట్ల సేవానిరతిని ఆయన ప్రశంసించారు. ఆయన సేవ అందరికీ ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు."ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గుర్తింపు నాకే కాదు, సమాజానికి సేవ చేయడానికి తమ జీవితాలను అంకితం చేసే ప్రతి వైద్యునికి ఈ గౌరవం దక్కుతుంది. ప్రతి ఒక్కరికీ అవసరమైన ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండేలా నా సేవలను కొనసాగించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను" అని డాక్టర్ జగదీష్ అన్నారు.మారిషస్ తెలుగు మహా సభ ప్రతినిధులు మాట్లాడుతూ టి.టి.డి. బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్‌గా & గ్రీన్మెడ్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ అధిపతి . డాక్టర్ జగదీష్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా ఉచిత పోలియో సర్జికల్ మరియు స్క్రీనింగ్ శిబిరాలకు నాయకత్వం వహించారని, నలభై మూడు సంవత్సరాల తన సేవలో భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో వికలాంగుల జీవితాలను మెరుగుపరచడానికి అనేక క్యాంపులను నిర్వహించి, 1,83,000 కు పైగా శస్త్ర చికిత్సలు చేయడం ద్వారా ఎంతో మందిని అంగ వైకల్యం పై విజయం సాధించేలా చేశారని తెలిపారు. ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా అసమానమైనదని గుర్తు చేశారు.రాబోయే సంవత్సరాన్ని శ్రీ విశ్వావసు నామ సంవత్సరము అంటారు. దీని అర్థం ఇది విశ్వానికి సంబంధించినది. అదేవిధంగా, ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి తన సేవలను అందించిన డాక్టర్ గుడారు జగదీష్ కూడా మొత్తం విశ్వానికి సంబంధించిన వైద్యుడు కాబట్టి విశ్వావసు పేరిట “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డుతో ఆయనను సత్కరిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగు వారి యొక్క కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబించే శాస్త్రీయ నృత్యాలు, జానపద పాటలు మరియు సాంప్రదాయ సంగీతంతో సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. ఈ అవార్డు ప్రదానోత్సవంలో మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రామ్ గూలమ్ తో పాటు ఉప ప్రధాన మంత్రి శ్రీ పాల్ రేమండ్ బెరెంజర్, ప్రజాసేవలు మరియు పరిపాలనా సంస్కరణల మంత్రి శ్రీ లుచ్మన్ రాజ్ పెంటియా, విద్య, కళలు మరియు సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీ మహేంద్ర గోండీయా, మారిషస్‌లో భారత హైకమిషనర్ అనురాగ్ శ్రీవాస్తవ, ఇందిరా గాంధీ భారత సంస్కృతి డైరెక్టర్ డాక్టర్ కాదంబినీ ఆచార్య, మారిషస్ తెలుగు మహా సభ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

సింగపూర్‌లో విశ్వావసు నామ ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్ లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో మార్చి 30న ఘనంగా జరిగాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో బాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. గంటల పంచాంగాన్ని ప్రముఖ పంచాంగ కర్తలు పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ (శ్ర శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి)సిద్ధం చేయడం జరిగింది. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి తదితర ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గాప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి , ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము,కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలను భక్తులు కొనియాడారు.ఉగాది వేడుకల నిర్వహణ, దాతలకు, స్పాన్సర్లతోపాటు, సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS ధన్యవాదాలు తెలిపింది. ఈ వేడుకలలో పాల్గొన్న వై.ఎస్.వి.ఎస్.ఆర్.కృష్ణ (పాస్స్పోర్ట్ అటాచ్, ఇండియన్ హై కమిషన్, సింగపూర్) గారికి అధ్యక్షులు గడప రమేష్ బాబు, కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే మై హోమ్ బిల్డర్స్, సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, గారాంటో అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, సౌజన్య డెకార్స్‌కు సొసైటీ కృతజ్ఞతలు తెలిపింది.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్రైమ్

మిస్టరీగానే తల్లి, కుమార్తె మరణం
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో శనివారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన తల్లి, కుమార్తె మరణం మిస్టరీగానే మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన గుర్రం సీతారాంరెడ్డి తన అక్క కుమార్తె రాజేశ్వరీ(34)ని 2008లో వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఓ ప్రైవేట్ ఆగ్రో కెమికల్ సంస్థలో పనిచేస్తున్న సీతారాంరెడ్డి నల్లగొండ జిల్లా సేల్స్ మేనేజర్‌గా బదిలీపై 15ఏళ్ల క్రితమే మిర్యాలగూడకు వచ్చి హౌసింగ్‌బోర్డులో అద్దెకు ఉంటున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు వేదశ్రీ, వేద సాయిశ్రీ(13) సంతానం. ఈ నెల 10న కంపెనీ బడ్జెట్ ఆడిట్ సమావేశం ఉండటంతో సీతారాంరెడ్డి హైదరాబాద్‌కు వెళ్లాడు. రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చిన సీతారాంరెడ్డికి గొంతుపై గాయాలతో చిన్న కుమార్తె వేద సాయిశ్రీ, బెడ్రూంలో ఉరేసుకుని భార్య రాజేశ్వరీ మృతిచెంది ఉండటంతో పోలీసులకు సమాచారం అందించాడు. నోరు విప్పని పెద్ద కుమార్తె..సీతారాంరెడ్డి పెద్ద కుమార్తె వేదశ్రీ నోరు విప్పితేనే రాజేశ్వరీ, వేద సాయిశ్రీ మృతికి గల కారణాలు తెలుస్తాయి. కానీ ఆమె మాత్రం తాను శుక్రవారం రాత్రి నిద్రపోగా శనివారం మధ్యాహ్నం మేలుకువ వచ్చిందని చెబుతోంది. దీంతో వారిపై మత్తు పదార్ధాల ప్రయోగం జరిగిందా..? అనే అనుమానాలకు తావిస్తోంది. అయితే సీతారాంరెడ్డి హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు వస్తున్న సమయంలో ‘ఎక్కడ ఉన్నావు డాడీ’ అంటూ మెసేజ్ చేయడం, తల్లి ఫోన్‌కు వరుసగా వస్తున్న ఫోన్ కాల్స్‌ను కట్ చేయడం వంటివి చూస్తే పెద్ద కుమార్తె వేదశ్రీ స్పృహాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మృతదేహాలపై కత్తి గాట్లు..రాజేశ్వరీ ఎడమ చేయి మణికట్టు, పాదాల వద్ద కత్తిగాయాలు ఉండగా, వేద సాయిశ్రీ గొంతును పదునైన కత్తితో కోసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం ఇది హత్యగానే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసును ఛేదించేందుకు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు నేతృత్వంలో మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే మృతుల ఇంట్లో ఓ లేఖ లభ్యమైనట్లు ప్రచారం జరుగుతుండగా పోలీసులు మాత్రం దానిని ధ్రువీకరించడం లేదు. మిర్యాలగూడ వన్ టౌన్ సీఐ మోతీరాం పర్యవేక్షణలో తల్లి, కుమార్తె మృతదేహాలకు ఆదివారం పోస్టుమార్టం పూర్తిచేసి బంధువులకు అప్పగించారు. అనుమానాస్పద స్థితిలో తల్లి, కుమార్తె మృతిఅన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం: డీఎస్పీ తల్లి, కుమార్తె మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు తెలిపారు. మూడు బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మృతుల శరీరాలపై కత్తిగాట్లు ఉన్నందున పోస్టుమార్టం నివేదిక తర్వాత క్లూస్‌టీం సమాచారం మేరకు లోతైన విచారణ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు.

చనిపోయే ముందు మేము గుర్తుకు రాలేదా అమ్మ..!
కరీంనగర్: అదనపు కట్నం వేధింపులు ఓ వివాహితను బలి తీసుకున్నాయి. పెళ్లయి ఎనిమిదేళ్లయినా అత్తింటివారి వేధింపులు ఆగలేదు. నాలుగేళ్లపాటు భర్త, అత్తామామ, బావ, మరిది వేధింపులు తట్టుకుంది. ఆర్నెళ్ల క్రితం ఆడపిల్ల పుట్టడంతో మరింత ఎక్కువయ్యాయి. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ అయినా తీరు మారలేదు. చివరకు ఆ వివాహిత చావే శరణ్యనుకుంది. ఉరేసుకుని తనువు చాలించింది. ఫలితంగా ఆమె కుమారుడు (6), కూతురు (ఆర్నెళ్లు) తల్లిలేనివారయ్యారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై తహాసీనొదీ్దన్ కథనం ప్రకారం.. దండేపల్లికి చెందిన గంగధరి మల్లేశ్‌కు, బుగ్గారం మండలం యశ్వంత్‌రావుపేటకు చెందిన వరలక్ష్మి అలియాస్ మేఘనతో 2017లో వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.4 లక్షల కట్నం, 4 తులాల బంగారం, ఇతర సామగ్రి ఇచ్చారు. నాలుగేళ్లపాటు వీరి కాపురం బాగానే సాగింది. కూలీ పనులకు వెళ్లే మల్లేశ్‌కు అదనపు కట్నంపై ఆశపుట్టింది. అప్పటి నుంచి భార్యను వేధిస్తున్నాడు. దీనికి మల్లేశ్ తల్లిదండ్రులు లక్ష్మి, నర్సయ్య, సోదరులు తోడయ్యారు. కుటుంబమంతా వేధించడంతో మేఘన భరించలేకపోయింది. విషయాన్ని పుట్టింటివారికి చెప్పడంతో ఏడాది క్రితం పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. నచ్చజెప్పి మళ్లీ కాపురానికి పంపించారు.ఆరు నెలల క్రితం పాప జననం..ఆర్నెళ్ల క్రితం మేఘన పాపకు జన్మనిచ్చింది. అప్పటినుంచి కట్నం వేధింపులు మొదలయ్యాయి. భీవండిలో ఉండే తన తండ్రి రాజమల్లుకు 10 రోజుల క్రితం ఫోన్ చేసి చెప్పింది. త్వరలోనే యశ్వంత్‌రావ్‌పేటకు వస్తానని, వచ్చాక పుట్టింటికి తీసుకొస్తానని నచ్చజెప్పాడు. శనివారం స్వగ్రామానికి వచ్చిన రాజమల్లు ఆదివారం భార్య అమ్మాయితో కలిసి దండేపల్లిలోని కూతురు ఇంటికి వెళ్లాడు. అక్కడ కూతురు కనిపించకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా చీరతో ఉరేసుకుని కనిపించింది. కన్నబిడ్డను విగతజీవిగా చూసిన తల్లిదండ్రులో బోరున విలపించారు. పుట్టింటికి తీసుకుపోతానంటిని కదా బిడ్డా.. అంతలోనే ఇలా అయ్యిందా అంటూ తండ్రి విలపించిన తీరు అందరినీ కన్నీరు పెట్టించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన కూతురు మృతికి అల్లుడు, అతని తల్లిదండ్రులు, అన్న, తమ్ముడే కారణమని రాజమల్లు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.తల్లి ప్రేమకు దూరమైన చిన్నారులు..వరలక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుమారుడు శ్రీనాథ్, కూతురు శరణ్య తల్లిప్రేమకు దూరమయ్యారు. తల్లి ఏమైందో కూడా ఆ చిన్నారులకు తెలియడం లేదు. కనీసం ఆ తల్లికి ఆత్మహత్య చేసుకునే ముందు తన పిల్లలైన గుర్తుకు రాలేదా అని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.

భర్తను హత్య చేసేందుకు 20 లక్షల సుపారీ..!
ఖమ్మంఅర్బన్: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ భర్తను హత్య చేయించేందుకు ఐదుగురు కలిసి ప్రణాళిక రచించిన ఘటన వెలుగులోకి వచ్చింది. హత్యకు రూ.20 లక్షల సుపారీ ఇస్తానని, అందులో అడ్వాన్స్‌గా రూ.ఐదు లక్షలు ఇచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్టు ఖమ్మంఅర్బన్ (ఖానాపురం హవేలీ) సీఐ భానుప్రకాష్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ముదిగొండ మండలం సువర్ణపూరానికి చెందిన ఓ వివాహితకు అదే గ్రామానికి చెందిన కొండూరి రామాంజనేయులు అలియాస్ రాముతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం ఆమె భర్తకు తెలిసి దంపతుల మధ్య విభేదాలు పెరిగాయి. ఈ క్రమంలో మహిళ భర్తను చంపేందుకు రామాంజనేయులు ప్రణాళిక రచించాడు. ఖమ్మంరూరల్ మండలం బారుగూడెం గ్రామానికి చెందిన దంతాల వెంకటనారాయణ అలియాస్ వెంకట్‌ను సంప్రదించి హత్య విషయమై వివరించాడు. వెంకట్ తన స్నేహితుడు, రౌడీషి టర్ అయిన పగడాల విజయ్‌కుమార్ అలియాస్ చంటిని పరిచయం చేశాడు. హత్యకు రూ.20 లక్షలు సుపారీగా ఒప్పుకొని, మొదటగా రూ.ఐదు లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలో మార్చి 12న ఖమ్మం నగరంలోని ధంసలాపురం వద్ద సదరు మహిళ భర్తను కిడ్నాప్ చేశారు. మిగతా డబ్బు కోసం రామును సంప్రదిస్తే స్పందించకపోవడంతో ఆమె భర్తను బెదిరించి రూ.1,50,000 నగదు, బంగారు గొలుసు తీసుకొని వదిలేశారు. కాగా, సదరు వ్యక్తి ఏప్రిల్ 11న ఖమ్మంఅర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, నగర ఏసీపీ రమణమూర్తి పర్యవేక్షణలో విచారణ చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులు సువర్ణాపురానికి చెందిన పొక్లెయిన్ ఆపరేటర్ కొండూరి రామాంజనేయులు, దంతాల వెంకటనారాయణ (కారుడ్రైవర్, బారుగూడెం, ఖమ్మంరూరల్), పగాడాల విజయ్‌కుమార్ (చంటి – బైక్ మెకానిక్, అగ్రహారంకాలనీ, ఖమ్మం), వేముల కృష్ణ (బైక్ మెకానిక్, అగ్రహారంకాలనీ, ఖమ్మం), బుర్రి విజయ్ (డెకరేషన్ వర్కర్, బృందావన్‌కాలనీ పువ్వాడఅజయ్‌నగర్, ఖమ్మం) ఆదివారం నగర శివారులోని చెరుకూరి మామిడి తోటలో సమావేశమైనట్లు తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రెండు కత్తులు, ఒక ఎయిర్ గన్, రూ.90,000 నగదు, 5 సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ భానుప్రకాష్ వివరించారు.

ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకోబోయి.!
హైదరాబాద్ : బాలానగర్ డివిజన్ పరిధిలోని ఐడీపీఎల్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి తన బైక్‌ను వేగంగా వెనక్కి మళ్లించి వేగంగా వెళ్లే క్రమంలో ఆర్టీసీ బస్సు కింద పడి మృతి చెందిన ఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ నరసింహ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. షాపూర్ నగర్లో నివసించే జోషిబాబు (35) కార్పెంటర్ పని చేస్తున్నాడు. జీడిమెట్ల నుంచి బాలానగర్ వైపు వస్తున్న క్రమంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. వీరిని చూసి భయపడి తిరిగి వేగంగా వెనక్కి వెళ్లే క్రమంలో తన ద్విచక్ర వాహనం పడిపోయింది. దీంతో అతని తలపై నుంచి ఆర్టీసీ దూసుపోయింది. తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ పోలీసులు తెలిపారు.
వీడియోలు


లక్ష ఎకరాలు! చంద్రబాబు భారీ కుట్ర ఇదే


వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం


ఏలూరు జిల్లాలో జనసేన నాయకుడి దౌర్జన్యం


YSRCP Leaders: అంబేద్కర్ జోలికి వస్తే పాతాళానికి తొక్కుతాం


Rachamallu Siva Prasad: ఇక్కడ ఉన్నది రాచమల్లు నా ప్రాణం ఉన్నంతవరకు..


పాస్టర్ ప్రవీణ్ మద్యం తాగారా?తాగలేదా? ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు


టాప్ డైరెక్టర్స్‌కి ఏంటీ పరిస్థితి


బన్నీ పైనే తమిళ్ తంబీల ఆశలు


తనకంటే చిన్నోడితో.. అనుపమా ఇదేంటమ్మా..?


కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి డైవర్షన్ డ్రామా