Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

This Is How USA Reacts To Tahawwur Rana Extradition To India1
రాణా అప్పగింతపై స్పందించిన అమెరికా

26/11 ముంబై ఉగ్రదాడుల కీలక సూత్రధారి తహవూర్‌ హుసేన్‌ రాణా.. సుమారు దశాబ్దంన్నర తర్వాత విచారణ ఎదుర్కొనబోతున్నాడు. పాక్‌ మూలాలు ఉన్న లష్కరే ఉగ్రవాది అయిన రాణాను అమెరికా మార్షల్స్‌ బుధవారం ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకొచ్చారు. గురువారం సాయంత్రం ఢిల్లీ పాలెం ఎయిర్‌పోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అధికారులకు అప్పగించడంతో అధికారిక ప్రక్రియ ముగిసింది. అయితే ఈ పరిణామంపై అమెరికా స్పందించింది. భారత్‌కు అతన్ని అప్పగించడం గర్వకారణంగా ఉందంటూ ప్రకటించింది.‘‘2008 ముంబై ఉగ్రదాడులకు రూపకర్తగా తహవూర్‌ రాణా(tahawwur rana)పై అభియోగాలు ఉన్నాయి. ఇందుకుగానూ న్యాయస్థానాల్లో విచారణ ఎదుర్కొనేందుకు అతన్ని అమెరికా నుంచి భారత్‌కు తరలించాం’’ అని విదేశాంగ ప్రతినిధి టామీ బ్రూస్‌ మీడియాకు వెల్లడించారు.. ముంబైలో నాడు జరిగిన ఉగ్రదాడి యావత్‌ ప్రపంచాన్ని దిగ్‌భ్రాంతికి చేసింది. కొంతమందికి గుర్తు లేకపోవచ్చు. కానీ, ఒకసారి పరిశీలిస్తే అది ఎంత భయంకరమైందో.. ఈనాటికి ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో తెలుస్తుంది. ఈ దాడులకు బాధ్యులను చట్టం ముందు నిలబెట్టడానికి భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు అమెరికా చాలా కాలంగా మద్దతు ఇస్తోంది. ఉగ్రవాదం అనే ప్రపంచ మహమ్మారిని ఎదుర్కొనడానికి భారత్‌, అమెరికా కలిసి కట్టుగా పని చేస్తుంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) మొదటి నుంచి చెబుతున్నారు. ఈ విషయంలో ఆయన తన నిబద్ధతను కనబరిచారు. అందుకు మేం గర్వపడుతున్నాం’’ అని టామీ బ్రూస్‌ ప్రకటించారు.2009 అక్టోబర్‌లో ముంబై ఉగ్రదాడులు సహా పలు కేసులు ఉన్న డేవిడ్‌ కోల్మన్‌ హెడ్లీని అమెరికాలో అరెస్ట్ చేశారు. హెడ్లీ ఇచ్చిన సమాచారంతో ఇల్లినాయిస్‌ చికాగోలో ఇమ్మిగ్రేషన్‌ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న తహవూర్‌ రాణాను అక్టోబర్‌ 18వ తేదీన ఎఫ్‌బీఐ అరెస్ట్‌ చేసింది. ఆపై అభియోగాలు రుజువు కావడంతో 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే ముంబై ఉగ్రదాడి కేసులో విచారణ ఎదుర్కొనేందుకు తనను భారత్‌కు అప్పగించకుండా నిలువరించాలంటూ ఇన్నేళ్లపాటు దాదాపు అక్కడి అన్ని కోర్టులను ఆశ్రయిస్తూ వచ్చాడు రాణా. అయితే ఊరట మాత్రం దక్కలేదు.ఈలోపు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో రాణాను భారత్‌కు అప్పగించే విషయంపై ట్రంప్‌ స్పష్టమైన ప్రకటన చేశారు. ‘‘26/11 ముంబయి ఉగ్ర దాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్‌ (India)కు అప్పగిస్తాం. అలాగే త్వరలో మరింతమంది నేరగాళ్ల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటాం’’ అని ఆయన ప్రకటించారు. అందుకు తగ్గట్లే పరిణామాలు చకచకా జరిగి రాణాను భారత్‌కు అమెరికా అప్పగించింది.ఇదిలా ఉంటే.. ఏప్రిల్‌ 10వ తేదీన భారత్‌లో దిగగానే తహవూర్‌ రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అరెస్ట్ చేసింది. ఆపై కోర్టులో ప్రవేశపెట్టగా 18 రోజుల ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో అతన్ని తీహార్‌ జైలుకు తరలించారు. 2008 ముంబై ఉగ్రదాడుల కేసుకు సంబంధించి మొత్తం 10 క్రిమినల్‌ అభియోగాలను రాణా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

KSR Comments On TDP And Janasena Politics2
టీడీపీ, జనసేన మధ్య ఏం నడుస్తోంది?

ఆంధ్రప్రదేశ్‌ కూటమి భాగస్వాములు టీడీపీ, జనసేనల మధ్య అంతా బాగానే ఉందా? లేక ఎవరికి వారు తమదైన రాజకీయ క్రీడలు ఆడేస్తున్నారా? ఈ అనుమానం ఎందుకొస్తోందంటే.. ఒకపక్క సీఎం చంద్రబాబు కుమారుడు, మంత్రి లోకేశ్‌.. పవన్‌ కళ్యాణ్‌ను అతిగా పొగిడేస్తూంటే.. ఇంకోపక్క పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తూండటం!. ఇదే సమయంలో చంద్రబాబు కూడా పవన్‌ కళ్యాణ్‌ నాకు మంచి మిత్రుడంటూ పలు కార్యక్రమాల్లో ప్రశంసిస్తూండటం.. ఏదో తేడా కొడుతున్నట్టుగానే ఉంది రాజకీయ విశ్లేషకులకు! ఇప్పటికిప్పుడు ఇరు పార్టీల్లో పెద్ద విభేదాలేవీ స్పష్టం కాకపోయినప్పటికీ పిఠాపురం వ్యవహారం మాత్రం వివాదాల్లోనే ఉంటోంది.జనసేన గెలిచిన ఇతర నియోజకవర్గాల్లోనూ టీడీపీ స్థానిక నేతలు తాము చెప్పిన వారికే పనులు చేయాలని ఏకంగా లేఖలు రాస్తుండటం కూడా ఇరు పార్టీల మధ్య సయోధ్యపై ప్రశ్నలు విసురుతోంది!. అక్కడ వర్మకు ఎమ్మెల్సీ పదవి రాకుండా పవన్ టీడీపీపై ఒత్తిడి చేయగలిగారని అంటారు. అంతేకాక తన బదులు నాగబాబును నియోజకవర్గంలో తిప్పుతూ ప్రభుత్వ కార్యక్రమాలు చేయిస్తున్నారు. ఈ సందర్భంగా వర్మకు అసలు విలువ ఇవ్వడం లేదు. దాంతో రెండు వర్గాల వారు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటున్నారు. నాగబాబుకు అసాధారణ స్థాయిలో పోలీసులు భద్రత కల్పించడం కూడా ఆసక్తికరమైన విషయమే. రెండు వర్గాల మధ్య ఏదైనా గొడవ చెలరేగితే వచ్చే ఇబ్బందుల రీత్యా ఇలా చేసి ఉండవచ్చు.నెల్లిమర్ల నియోజకవర్గంలో స్థానిక టీడీపీ నేత తాము చెప్పినవారికే పనులు చేయాలని అధికారులకు ఉత్తరం రాయడం విశేషం. ఇక్కడే కాదు. ఆయా చోట్ల జనసేన ఎమ్మెల్యేలు ఉన్నా, పెత్తనం టీడీపీ వారే చేస్తున్నారన్నది జనసేన కేడర్‌లో బాధగా ఉంది. తిరువూరులో టీడీపీ ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తే, సమస్య ఏమిటో తెలుసుకోకుండా జనసేన అధిష్టానం తన పార్టీ నేతనే మందలించిందన్న వార్తలు వచ్చాయి. రాజకీయాలలో ఇవన్ని సాధారణంగా జరిగేవే. అయినా ఒక్కొక్కటిగా గొడవలు పెరుగుతూ, ఆ తర్వాత రోజులలో అవే పెద్దవిగా మారుతుంటాయి. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టయిన తర్వాత పవన్ కళ్యాణ్, లోకేశ్‌ల మధ్య స్నేహం పెరిగిన మాట నిజమైనా.. ఎన్నికల తరువాత మాత్రం వీరిద్దరూ అంటీ అంటనట్టుగానే ఉన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటన తరువాత లోకేశ్‌ ఒకరకంగా పవన్ కళ్యాణ్‌ను అవమానించేలా వ్యాఖ్యానించారు కూడా. టీటీడీ అధికారులు, ఛైర్మన్ క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తే, అది ఆయన పార్టీ అభిప్రాయం అని లోకేశ్‌ తీసిపారేశారు. చైర్మన్‌తో తూతూ మంత్రంగా క్షమాపణ చెప్పించారు తప్పితే పవన్ కోరినట్లు అధికారులపై ముఖ్యమంత్రి చర్య తీసుకోలేదు. క్షమాపణలు కూడా చెప్పించ లేదు. పవన్ కళ్యాణ్ వద్ద పనిచేసే అధికారుల నియామకం విషయంలో కూడా లోకేశ్‌ జోక్యం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. దానిపై పవన్ ఢిల్లీలో కూడా నిరసన చెప్పారని కథనాలు వ్యాపించాయి.అటవీ శాఖకు చెందిన భూమిలో ఉందన్న సాకుతో కాశీనాయన ఆశ్రమంలో భవనాలు కూల్చిన ఘటనపై పవన్ మాట్లాడ లేదు కానీ, లోకేశ్‌ క్షమాపణ చెప్పడం విశేషం. నిజానికి లోకేశ్‌కు జనసేనతో పొత్తు అంత ఇష్టం లేదని ఎన్నికల ముందు ప్రచారం జరిగింది. దానికి తగినట్లే పవన్‌కు ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ఉండదని, ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం పాలిట్‌బ్యూరో నిర్ణయమని లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయినా పవన్ సర్దుకుపోయారు. బీజేపీ వారు ఏభై సీట్లు డిమాండ్ చేయమని సూచించినా, పవన్ పట్టుబట్టలేదు. పైగా టీడీపీకి చెందిన వారికే కొందరికి తన పార్టీ టిక్కెట్లు ఇచ్చి చంద్రబాబు ఏం చెబితే అది చేశారని అంటారు.2017 ప్రాంతంలో లోకేశ్‌పై పవన్ చాలా తీవ్రమైన వ్యాఖ్యలే చేసినా 2020 నాటికి రాజీపడిపోయి చంద్రబాబుతో చేతులు కలిపారు. 2024లో అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు, పవన్‌ల కన్నా లోకేశ్‌ పవర్‌ఫుల్‌ అయ్యారన్న అభిప్రాయం సర్వత్రా ఏర్పడింది. తాను కూడా అలాగే ఇతర శాఖలలో జోక్యం చేసుకోవాలని అనుకున్నారో ఏమో తెలియదు కానీ, పౌర సరఫరాల శాఖలో వేలు పెట్టి ‘సీజ్ ద షిప్’ అని అధికారులను ఆదేశించి పవన్ నవ్వులపాలయ్యారు. చంద్రబాబు, పవన్‌ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు ఇంతవరకు కనిపించలేదు కానీ.. లోకేశ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అంశంలో పవన్ అభ్యంతరం చెప్పారని రెండు పార్టీలలో గుసగుసలు వినిపించాయి. అందువల్లే లోకేశ్‌ కోరిక తీరలేదని అంటారు. ఇప్పటికే లోకేశ్‌ను సీఎంను చేయాలని చంద్రబాబుపై కుటుంబపరంగా ఒత్తిడి ఉందని చెబుతారు. అయినా పవన్ కళ్యాణ్ నుంచి సమస్య వస్తుందని చంద్రబాబు సర్ది చెబుతుండవచ్చన్నది ఎక్కువ మంది అభిప్రాయం.ఇక, ఇది నిజమా? కాదా? అన్నది చెప్పలేం కానీ.. పవన్ కళ్యాణ్ ఆయా సభలలో చంద్రబాబు పదిహేనేళ్లు సీఎంగా ఉండాలని, ఆయన సమర్థుడని, అనుభవజ్ఞుడని పనికట్టుకుని పొగుడుతున్న తీరు లోకేశ్‌ అనుచరులకు మింగుడుపడటం లేదనిపిస్తుంది. కేవలం లోకేశ్‌ను సీఎం కానివ్వకుండా, లేదా డిప్యూటీ సీఎం ప్రమోషన్ రానివ్వకుండా చూడడానికి పవన్ ప్రకటనలు ఉపయోగపడుతున్నట్లుగా ఉంది. ఈ నేపథ్యంలోనే లోకేశ్‌ వ్యూహం మార్చి తన ప్రమోషన్‌కు పవన్ కళ్యాణ్ నుంచి ఆటంకం లేకుండా ఉండడానికి ప్రయత్నాలు ఆరంభించారా అన్న సందేహం కలుగుతుంది. కొన్నాళ్లుగా లోకేశ్‌ తనకు సంబంధం లేని శాఖలలో కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు హాజరవుతున్నారు. ఆ సభలలో ఒకటికి రెండుసార్లు 'పవనన్న, పవనన్న’ అని ప్రస్తావిస్తూండటం.. ‘పవనన్న పట్టుబడితే సాధించి తీరుతారని, కేంద్రం నుంచి కూడా నిధులు తెస్తున్నారని’ పొగడ్తలు కురిపిస్తున్నారు.గతంలో ఇలాంటి ప్రోగ్రాంలను చంద్రబాబు వదలి పెట్టేవారు కారు. ఇప్పుడు తన కుమారుడి ఆధిపత్యానికి ఆయన అడ్డు చెప్పడం లేదు. దాంతో టీడీపీ మంత్రులు లోకేశ్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ప్రకాశం, అనకాపల్లి జిల్లాలలో లోకేశ్‌ పర్యటనలే ఇందుకు నిదర్శనం. చంద్రబాబు తర్వాత పెత్తనం ఎటూ లోకేశ్‌దే కనుక ఇందులో పెద్దగా ఆక్షేపించవలసింది ఉండకపోవచ్చు. పార్టీ పరంగా అయితే ఏమైనా చేసుకోవచ్చు కాని, ప్రభుత్వ పరంగా లోకేశ్‌ ఇలా పెత్తనం చెలాయించడం కరెక్టేనా అన్న చర్చ వస్తుంది.మరోవైపు, పవన్ కళ్యాణ్ మాత్రం సభలలో చంద్రబాబునే పొగుడుతూ, లోకేశ్‌ను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అయినప్పటికీ లోకేశ్‌ బుజ్జగించి పవన్‌ను తన దారిలోకి తెచ్చుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చన్నది పలువురి భావన. పదిహేనేళ్లు కలిసి ఉండాలని అనుకుంటున్నప్పుడు మరీ తేడా ఏదైనా వస్తే తప్ప భవిష్యత్తులో లోకేశ్‌కు కూడా విధేయత ప్రదర్శించక తప్పని స్థితి పవన్‌కు వస్తుందని అంటున్నారు. చంద్రబాబుకు ఇప్పటికే 74 ఏళ్లు వచ్చినందున భవిష్యత్తులో ఆ పరిణామం జరగవచ్చు. లోకేశ్‌ మరో మాట కూడా చెబుతున్నారు.టీడీపీ, జనసేనల మధ్య ఎన్ని గొడవలు వచ్చినా కూర్చుని పరిష్కరించుకుంటాము తప్ప వేరు పడబోమని అన్నారు. ఇది కూడా గమనించవలసిన అంశమే. రాజకీయాలలో పైకి ఒకటి చెబుతారు. లోపల జరిగేవి వేరుగా ఉంటుంటాయి. అలాగే పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు ఎవరి వ్యూహాలతో వారు ముందుకు వెళుతూ, కలిసి ఉన్నట్లు కనిపిస్తూనే ఎవరికి వారు పైచేయి తెచ్చుకునేందుకు యత్నించినా ఆశ్చర్యం ఉండదు. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Today Gold And Silver Price April 11, 20253
బాబోయ్ బంగారం.. రెండు రోజుల్లో రూ.4960 పెరిగిన రేటు

దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. గురువారం గరిష్టంగా రూ. 2940 పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు (ఏప్రిల్ 11) రూ. 2020 పెరిగి ఒక్కసారిగా షాకిచ్చింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 87,450 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 95,400 వద్ద నిలిచాయి. నిన్న మాదిరిగానే ఈ రోజు కూడా రూ. 1850 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 2020 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 1850, రూ. 2020 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 87,450 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 95,400 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 87,600 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 95,550 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 1850, రూ. 2020 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా కొంత పెరుగుదలవైపు అడుగులు వేసాయి. ఈ రోజు (ఏప్రిల్ 10) కేజీ సిల్వర్ రేటు రూ. 1,08,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 97,100 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్‌టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).ఇదీ చదవండి: గూగుల్ డొమైన్ కొనేసిన ఇండియన్.. తర్వాత ఏం జరిగిందంటే?

Dhoni As Captain Wont Automatically Turn The Tide For CSK: Uthappa4
ధోనిని కెప్టెన్‌ చేసినంత మాత్రాన చెన్నై రాత మారిపోదు!

మహేంద్ర సింగ్‌ ధోని మరోసారి చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK)సారథిగా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గ్వైక్వాడ్‌ గాయం కారణంగా ఐపీఎల్‌-2025 (IPL 2025)లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కావడంతో ఈ మార్పు అనివార్యమైంది. గువాహాటిలో గత నెల 30న రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తుండగా రుతురాజ్‌ మోచేతికి గాయమైంది. అయితే దానికి చికిత్స కొనసాగిస్తూ అతడు మరో రెండు మ్యాచ్‌లు ఆడాడు. కానీ.. నొప్పి తీవ్రం కావడంతో పరీక్షలు చేయగా మోచేతికి ఫ్రాక్చర్‌ అయినట్లు తేలింది.కేకేఆర్‌తో మ్యాచ్‌లోఫలితంగా ‘అన్‌క్యాప్డ్‌’ ప్లేయర్‌ ధోని (MS Dhoni) కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టనున్నాడు. సొంత మైదానం చెపాక్‌లో జరిగే శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ధోని విధుల్లో చేరనున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌, ఒకప్పటి సీఎస్‌కే స్టార్‌ రాబిన్‌ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనిని కెప్టెన్‌ చేసినంత మాత్రాన చెన్నై జట్టు రాత మారదని అభిప్రాయపడ్డాడు.మీరెలా ముందుకు వెళ్లగలరు?‘‘జట్టులో ఎన్నో లోపాలు ఉన్నాయి. ముందుగా వాటిని సరిచేయాలి. అంతేగానీ ధోనిని తిరిగి కెప్టెన్‌గా చేసినందు వల్ల పరిస్థితులు వాటికవే చక్కబడిపోవు. రుతు లాంటి కీలక బ్యాటర్‌ స్థానాన్ని ఎవరితో మీరు భర్తీ చేస్తారు? ఈ లోటును ఎలా పూడ్చుకుంటారు?.. ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ను ఎక్కడి నుంచి తెస్తారు?డెవాన్‌ కాన్వే పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో రిటైర్డ్‌ అవుట్‌ కావడానికి ముందు 69 పరుగులు చేశాడు. ఇక రచిన్‌ ఆరంభం నుంచే పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి సమయంలో రుతు లాంటి సాలిడ్‌ బ్యాటర్‌ లేకుండా మీరెలా ముందుకు వెళ్లగలరు?’’ అని రాబిన్‌ ఊతప్ప స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో సీఎస్‌కే యాజమాన్యాన్ని ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా గతేడాది సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న ధోని.. తన వారసుడిగా రుతురాజ్‌ గైక్వాడ్‌ను ప్రకటించాడు. అయితే, అతడి సారథ్యంలో చెన్నై గొప్పగా రాణించలేకపోతోంది. ఐపీఎల్‌-2024లో రుతు సేన పద్నాలుగు మ్యాచ్‌లకు ఏడు గెలిచింది. అయితే, ఆర్సీబీతో కీలక మ్యాచ్‌లో ఓడి ప్లే ఆఫ్స్‌ చేరకుండానే ఇంటి బాటపట్టింది.తొమ్మిదో స్థానంలోఇక ఐపీఎల్‌-2025లోనూ ఆరంభ మ్యాచ్‌లో ముంబై గెలిచిన చెన్నై.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఇప్పటి వరకు మొత్తంగా ఐదు మ్యాచ్‌లలో ఒక్కటి మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.ఇదిలా ఉంటే.. సీఎస్‌కే టీమ్‌కు కర్త, కర్మ, క్రియగా ఉన్న ధోని 2008–2023 మధ్య 235 మ్యాచ్‌లలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ‘తలా’ నాయకత్వంలో 5 సార్లు జట్టు ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలిచింది. 2022లో ధోని స్థానంలో రవీంద్ర జడేజాను చెన్నై యాజమాన్యం కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అయితే టోర్నీ మధ్యలో అతడు 8 మ్యాచ్‌ల తర్వాత సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ధోనియే బాధ్యతలు తీసుకున్నాడు. 2024 సీజన్‌ నుంచి జట్టు సారథ్య బాధ్యతలు రుతురాజ్‌కు అప్పగించారు. అతడి కెప్టెన్సీలో టీమ్‌ 19 మ్యాచ్‌లు ఆడింది. వీటిలో 8 గెలిచి, 11 ఓడింది. చదవండి: IPL 2025: పృథ్వీ షాకు బంపరాఫర్‌.. ధోని టీమ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!?

Donlad Trump Govt Full Focus On Inidan Students In USA5
భారత విద్యార్థులపై ట్రంప్‌ సంచలన నిర్ణయం.. కేంద్రం అలర్ట్‌

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలో భారతీయ విద్యార్థుల ప్రతి కదలికపై ఆ దేశ అధికారులు నిఘా పెడుతున్నారు. ఎక్కడి వెళ్లినా, ఏం చేస్తున్నా నీడలా వెంటాడుతున్నారు. విద్యార్థులు నిజంగానే చదువుతున్నారా? చట్ట వ్యతిరేకంగా ఉద్యోగాలేమైనా చేస్తున్నారా? వాళ్ల బ్యాంకు లావాదేవీలు ఎలా ఉన్నాయి? సరైన పత్రాలతోనే వచ్చారా? అనే వివరాలను సేకరిస్తున్నారు. హెచ్‌–1బీ వీసా పొందిన వారిపైనా నిఘా కొనసాగుతోందని ప్రవాస భారతీయులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రధాన వర్సిటీలపై దృష్టిఅమెరికా వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య రానురాను పెరుగుతోంది. 2022–23లో 2,68,923 మంది వెళ్తే, 2023–24లో 3,31,602 మంది వెళ్లారు. ప్రధానంగా న్యూయార్క్‌ వర్సిటీ, నార్త్‌ ఈస్టర్న్‌ వర్సిటీ, కొలంబియా వర్సిటీ, అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియాలోనే లక్షకుపైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో చాలామంది క్యాంపస్‌ల బయట పార్ట్‌ టైం ఉద్యోగాలు చేస్తున్నారనేది అమెరికా అనుమానం. వారిని వెతికి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే న్యూయార్క్, బోస్టన్, టెంపే, లాస్‌ ఏంజెల్స్‌ ప్రాంతాల్లో నిఘా కొనసాగుతోంది. తలనొప్పిగా ఓపీటీ అమెరికాలో ఎంఎస్‌ చేసిన తర్వాత తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునేందుకు (ఇవి కూడా స్కిల్డ్‌ మాత్రమే) ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) ఇస్తారు. 2023–24 లెక్కల ప్రకారం భారత విద్యార్థులు 97,556 మంది ఓపీటీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఓపీటీ చేసిన తర్వాత ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా మరికొంత కాలం అమెరికాలో ఉండొచ్చు. ట్రంప్‌ సర్కార్‌ ఇప్పుడు ఈ సదుపాయాన్ని ఎత్తివేసే ఆలోచనలో ఉంది. అందుకోసం త్వరలో చట్టం తెస్తానని ట్రంప్‌ ప్రకటించారు. అదే జరిగితే ఎంఎస్‌ పూర్తయిన వెంటనే ఉద్యోగం వచ్చిన వాళ్లు మాత్రమే అక్కడ ఉంటారు. మిగతా వాళ్లు తిరిగి ఇండియాకు రావాల్సి ఉంటుంది. అమెరికా వెళ్లడం కోసం ఒక్కో విద్యార్థి సగటున రూ.35 లక్షల నుంచి రూ.49 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఉత్త చేతులతో ఇండియాకు తిరిగి వచ్చే పరిస్థితిని తలచుకుంటేనే గుండె పగిలిపోతోందని విద్యార్థులు అంటున్నారు. ఏఐతో పటిష్టమైన డేటా ప్రతి విదేశీ విద్యార్థిపై ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాయంతో నిఘా పెట్టినట్టు ప్రవాస భారతీయులు చెబుతున్నారు. విద్యార్థి ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడ ఉన్నాడు? అతని బ్యాంకు బ్యాలెన్స్‌ ఎంత? అమెరికా వచ్చిన తర్వాత ఎంత సంపాదించాడు? ఎలా సంపాదించాడు? ఏయే ఉద్యోగాలు చేశాడు? అనే వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థి ఏడాది కాలంగా ఎక్కడెక్కడికి వెళ్లాడు? ఏయే లొకేషన్స్‌లో ఉన్నాడు? ఆ లొకేషన్స్‌లో మాల్స్, పెట్రోల్‌ బంకులు, రెస్టారెంట్లు ఏం ఉన్నాయి? వాటి నుంచి ఎవరికి డబ్బు చెల్లించారు? ఇందులో విద్యార్థులుగా ఉన్నవారికి ఎంత? ఎందుకు? అనే వివరాలపై దృష్టి పెట్టారు. వీటి ఆధారంగా విద్యార్థి చదువు కోసం కాకుండా, ఉపాధి కోసం వచ్చినట్టు గుర్తించే ఆలోచనలో ఉన్నారు. ఇది అమెరికా చట్టాలకు విరుద్ధం కాబట్టి అలాంటి విద్యార్థులకు సమస్యలు తప్పేట్టు లేదు. కన్సల్టెన్సీలపై నిఘా అమెరికా అధికారుల నిఘాపై ఆ దేశంలోని భారత రాయభార కార్యాలయం ఇటీవల భారత ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. విద్య కన్సల్టెన్సీలు విద్యార్థులను అక్రమంగా అమెరికాకు పంపుతున్నాయని ఆక్షేపించింది. ఇప్పటివరకు 5 వేల మందిని ఈ కేటగిరీ కింద గుర్తించినట్టు తెలిపింది. దీంతో భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కన్సల్టెన్సీల వివరాలు ఇవ్వాలని ఇటీవల లేఖ రాసింది. పత్రాలన్నీ చూస్తున్నారు ఇండియా నుంచి విచ్చిన విద్యార్థి ఆర్థిక స్థితిగతులపై అమెరికాలో ఆరా తీస్తున్నారు. చదువు కోసమే వచ్చిన వారికి ఇబ్బంది ఉండదు. కానీ ఇతర మార్గాల్లో డబ్బులు సంపాదించిన వారిని ప్రశ్నించే వీలుంది. – విక్రమ్‌ శశాంక్, ప్రవాస భారతీయుడు. ఓపీటీ తీసేస్తే పరిస్థితి ఏమిటి? రూ.45 లక్షలు అప్పు చేసి అమెరికా వచ్చాను. పార్ట్‌ టైం జాబ్‌ చేసి కొంత తీర్చాను. ఇప్పుడు ఓపీటీ ఎత్తివేస్తే తిరిగి ఇండియా వెళ్లిపోవాలి. అక్కడ ఉద్యోగం వస్తుందో రాదో చెప్పలేం. అప్పు తీర్చే మార్గం కన్పించడం లేదు. – అఖిలేష్‌ పూనాటి, అమెరికాలో ఎంఎస్‌ పూర్తిచేసిన విద్యార్థి. హెచ్‌–1బీకీ తిప్పలే ఇక్కడి ఉద్యోగాలు ఇక్కడివాళ్లకే (అమెరికన్లకు) అనే నినాదం ఊపందుకుంటోంది. ఇండియాతోపాటు ఇతర దేశాలవారినీ ఎందుకు రప్పించాలనే భావనతో ట్రంప్‌ వెళ్తున్నారు. భవిష్యత్‌లో హెచ్‌–1బీ వీసాలు ఉండకపోవచ్చు. ఇక్కడే పిల్లలను చదివిద్దామని వచ్చాను. ఇప్పుడు వాళ్లు కూడా ఇబ్బంది పడాల్సిందే. – మంజులా రాయ్, హెచ్‌–1బీ వీసాపై అమెరికా వెళ్లిన ఎంఎన్‌సీ ఉద్యోగిని. అమెరికాలో అత్యధికంగా భారతీయ విద్యార్థులున్న వర్సిటీలు యూనివర్సిటీ ప్రాంతం విద్యార్థుల సంఖ్య న్యూయార్క్‌ వర్సిటీ న్యూయార్క్‌ 27,247 నార్త్‌ ఈస్ట్రన్‌ వర్సిటీ బోస్టన్‌ 21,023 కొలంబియా వర్సిటీ న్యూయార్క్‌ 20,321 అరిజోనా స్టేట్‌ వర్సిటీ టెంపే 18,430 యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా లాస్‌ ఏంజెల్స్‌ 17,469.

Egg prices continue rise in US6
‘గుడ్లు’ తేలేసేలా.. అమెరికాలో డజను కోడిగుడ్లు రూ.536

వాషింగ్టన్‌: అమెరికాలో కోడి గుడ్లు ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. నెల నెలా రేటు పెరుగుతూ కొనుగోలు దారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అమెరికా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరిలో డజను కోడి గుడ్లు ధర 5.90 డాలర్లు (భారత కరెన్సీలో రూ.508.76) ఉండగా మార్చి నెలలో 6.23 డాలర్లు (రూ.536) ఫిబ్రవరిలో 5.90 డాలర్లకు చేరింది. అయితే, అమెరికాలో కోడి గుడ్లు ధరలు ఆకాశాన్ని తాకడం వెనుక బర్డ్ ఫ్లూ ఓ కారణం. బర్డ్‌ ఫ్లూని అరికట్టేందుకు అమెరికా గుడ్లు పెట్టే కోళ్లను నిర్మూలించింది. ఆ ప్రభావం రిటైల్ మార్కెట్‌లోని గుడ్ల ధరలపై పడింది. ట్రంప్‌ వరుస ప్రకటనలు ఫలితంగా గుడ్లు తేలేసేలా.. కొండెక్కిన కోడిగుడ్ల ధరలతో అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆందోళనలపై.. గత కొన్ని వారాలుగా తన పాలనలో గుడ్లు ధరల్ని తగ్గించామంటూ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. తాను రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హోల్‌సేల్ గుడ్ల ధరలు 59శాతం నుంచి చివరికి 79 శాతానికి తగ్గాయని చెప్పారు’ అని న్యూయార్క్‌ టైమ్స్‌ తన కథనంలో పేర్కొంది. బర్డ్ ఫ్లూ నియంత్రణకు బయోసెక్యూరిటీఇదే విషయంపై వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లి సైతం ప్రస్తావించారు. బర్డ్ ఫ్లూ నియంత్రణకు బయోసెక్యూరిటీని బలోపేతం చేసినట్లు, కొత్త నిబంధనలను సడలించి కోడి గుడ్ల సరఫరా పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బర్డ్ ఫ్లూపై మేం తీసుకున్న చర్యలు ఫలితాల్ని ఇస్తున్నాయి’ అని పేర్కొన్నారు. గుడ్ల ధరలపై భిన్నాభిప్రాయాలు అమెరికాలో అమాంతం పెరిగిపోతున్న గుడ్ల ధరలపై ఆర్థిక నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ ఆహార ఆర్థిక నిపుణుడు డేవిడ్ ఓర్టెగా మాట్లాడుతూ.. హోల్‌సేల్ ధరలు తగ్గినా, ఆ ప్రభావం రిటైల్ ధరలపై పడేందుకు కొన్ని వారాలు సమయం పడుతుందన్నారు. పాల్ట్రీ ఫారాల్లో బర్డ్ ఫ్లూ తగ్గడం, సరఫరా పెరగడం వల్ల హోల్‌సేల్ ధరలు తగ్గినప్పటికీ.. రిటైల్ ధరలు ఎంత తగ్గుతాయో అంచనా వేయడం కష్టం’ అని కార్నెల్ యూనివర్శిటీకి ఆర్థిక నిపుణుడు క్రిస్టఫర్ బి. బారెట్ చెప్పారు.

Sai Rajesh Gets Emotional Over Sampoornesh Babu Financial Help7
సంపూను రోడ్డు మీదకు వదిలేశాడా? సాయి రాజేశ్‌ ఆన్సరిదే!

సంపూర్ణేశ్‌బాబును హీరో చేసిన డైరెక్టర్‌ సాయి రాజేశ్‌ (Sai Rajesh). హృదయ కాలేయం చిత్రంతో సంపూ కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ మూవీ విజయం సాధించడంతో అతడు వరుస సినిమాలు చేసుకుంటూ పోయాడు. దాదాపు రెండేళ్ల గ్యాప్‌ తర్వాత ఇతడు సోదరా సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ మూవీ ఏప్రిల్‌ 25న విడుదల కానుంది.ఏ హీరో ఒప్పుకోలేదుగురువారం జరిగిన ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు సాయి రాజేశ్‌ అతిథిగా విచ్చేశాడు. ఆయన మాట్లాడుతూ.. నేను, సంపూర్ణేశ్‌ (Sampoornesh Babu) ఒక షార్ట్‌ ఫిలిం చూడటానికి ఇదే ప్రసాద్‌ ల్యాబ్‌కు వచ్చాం. ఆ సమయంలో నేను బాధలో ఉన్నాను. 'యార్క్‌ యార్‌' అనే తమిళ సినిమా చూసి ఓ పిచ్చి మూవీ తీయాలనుకున్నాను. దానిచుట్టూ కామెడీ క్రియేట్‌ చేయాలనుకున్నాను. ఈ కాన్సెప్ట్‌ను అప్పుడే ఎదుగుతున్న పలువురు హీరోలకు చెప్పాను. ఎవరూ ఒప్పుకోలేదు. నా బతుకు అయిపోయిందనుకున్నాను. హీరో దొరికేశాడుఈ ప్రసాద్‌ ల్యాబ్‌లో షార్ట్‌ ఫిలిం చూసి బయట చెట్టు కింద నిల్చున్నప్పుడు సంపూ రంగురంగుల చొక్కాతో కనిపించాడు. అతడిని చూసి నాకు హీరో దొరికేశాడు అనుకున్నాను. ఇది జరిగి 13 ఏళ్లవుతోంది. ఇదంతా కలలా ఉంది. అప్పుడు నాకు రూ.60 వేలదాకా అప్పు ఉంది. కథ డిస్కషన్‌ కోసం సంపూ సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు వచ్చేవాడు. ఏదో ఒక పార్క్‌లో కూర్చుని కథ గురించి మాట్లాడుకుని సాయంత్రానికి బస్‌స్టాప్‌లో దింపేసేవాడిని. ఇంటికి తిరిగెళ్లడానికి నీ దగ్గర డబ్బులున్నాయా? అని అడిగితే లేవన్నాడు.గిల్టీగా ఫీలయ్యాదాంతో నా దగ్గరున్న రూ.500లలో రెండు వందలు అతడికి ఇచ్చేవాడిని. ఒకసారి ఏమైందంటే నేనేదో పనిలో పడిపోయి అతడి ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. తర్వాత ఆ విషయమే మర్చిపోయాను. అప్పుడు సంపూ కృష్ణానగర్‌లో మడత మంచం అద్దెకు తీసుకుని రోజంతా అక్కడే ఉన్నాడు. నాకు మళ్లీ ఫోన్‌ చేసి.. అన్నా, నేను వచ్చేశాను అని చెప్పాడు. నాకు చాలా గిల్టీగా అనిపించింది. సినిమా పిచ్చితో నేను చెడిపోయిందే కాక మరొకరిని చెడగొడుతున్నానా? డబ్బులు లేకుండా సినిమా తీయగలనా? ఇలా రకరకాలుగా అనుకున్నాను.లక్షల్లో రెమ్యునరేషన్‌చివరకు ఎలాగోలా సినిమా తీశాం. తను హీరో అయ్యాడు, నేను డైరెక్టర్‌ అయ్యాను. హృదయకాలేయం (Hrudaya Kaleyam Movie) సూపర్‌ హిట్‌ అయ్యాక సంపూర్ణేశ్‌కు లక్షల్లో రెమ్యునరేషన్‌ ఇచ్చేవారు. నేను సింగిల్‌ బెడ్‌రూమ్‌ ప్లాట్‌ఫామ్‌లో ఉండేవాడిని. సంపూ సిద్దిపేటలో నాలుగంతస్తుల ఇల్లు కట్టేశాడు. నేను ఈఎమ్‌ఐలో నానో కారు కొనుక్కుంటే మనోడు ఫోర్డ్‌ కొన్నాడు. కొబ్బరిమట్ట సినిమా సమయంలో నేను ఆర్థికంగా చితికిపోయానని సంపూ గ్రహించాడు. రూ.6 లక్షలు పెట్టి హోండా కారు కొనిచ్చాడు. ఇల్లు కొనుగోలు..మణికొండలో ఒక అపార్ట్‌మెంట్‌ కోసం రూ.12 లక్షలు కట్టి.. మిగతా రూ.13 లక్షలు నువ్వు ఎలాగైనా కట్టుకో అన్నాడు. ఆ ఇంటి విలువ ఇప్పుడు ఎన్నో రెట్లు పెరిగిపోయింది. తను సంపాదించిన డబ్బు.. నాకోసం, తన చుట్టూ ఉండేవాళ్లకోసం, సమాజం కోసం ఖర్చుపెడతాడు. ఓ వ్యక్తి నేను సంపూను రోడ్డు మీద వదిలేశాను అని కామెంట్‌ చేశాడు. రోడ్డు మీద వదిలేయడం ఏంట్రా? ఏ రోజుకైనా సంపూ కోసం నేనుంటా.. నాకోసం సంపూ ఉంటాడంతే! అని సాయి రాజేశ్‌ ఎమోషనలయ్యాడు.చదవండి: సూర్య కొత్త సినిమాలో హీరోయిన్‌ 'అనఘా రవి'కి ఛాన్స్‌

Visakha CP Shanka Brata Bagchi Writes to DGP, Prisons Department8
AP: ‘మీ జైలర్ తప్పు చేశారు.. ఆచూకీ ఇవ్వండి’

విశాఖ,సాక్షి: ‘మీ జైలర్ తప్పు చేశారు.. ఆచూకీ ఇవ్వండి’ అంటూ జైళ్ల శాఖ డీజీపీకి విశాఖ నగర పోలీసు కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి లేఖ రాశారు. ఆ లేఖ ప్రస్తుతం పోలీసు, జైళ్ల శాఖలో చర్చనీయాంశంగా మారింది.పోలీసుల సమాచారం మేరకు..గతంలో విశాఖకు చెందిన ఓ గృహిణికి అనంతపురం జైలర్‌ సుబ్బారెడ్డి అసభ్య సందేశాలు పంపించారు. దీనిపై బాధితురాలు పోలీసులు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైన నాటి నుంచి జైలర్‌ సుబ్బారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు.ఈ నేపథ్యంలో జైళ్ల శాఖ డీజీపీకి విశాఖ నగర పోలీసు కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి లేఖ రాశారు. ఆ లేఖలో విచారణ నిమిత్తం జైలర్‌ సుబ్బారెడ్డి ఆచూకీ చెప్పాలని కోరారు.

HPSEB Carified MP Kangana Ranaut Power bills Issue9
మేడమ్‌ కళ్లు పెద్దవి చేసి చూడండి.. కంగనాకు అదిరిపోయే కౌంటర్‌

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కింది. బాలీవుడ్ స్టార్, మండి ఎంపీ కంగనా రనౌత్‌ ఇంటికి సంబంధించి వచ్చిన కరెంట్‌ బిల్లు విషయంలో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఈ క్రమంలో మంత్రి, విద్యుత్‌ శాఖ అధికారులు.. కంగనాకు కౌంటరిచ్చారు. కంగనా ఇంటికి వచ్చిన బిల్లు లక్ష కాదని రూ.55 వేలు మాత్రమేనని.. గతంలో చెల్లించని బిల్లుల కారణంగా రూ.91,100 గా పూర్తి బిల్లు వచ్చిందని క్లారిటీ ఇచ్చారు.మండి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక వివాదం ఉండాల్సిందే. తాజాగా తన ఇంటికి లక్ష రూపాయల బిల్లు వచ్చిందంటూ గోల చేసింది కంగనా. తప్పంతా కాంగ్రెస్ ప్రభుత్వానిదే అంటూ మండిపడ్డారు. మనాలీలో ఉన్న మా ఇంటికి ఈ నెల రూ.లక్ష కరెంట్‌ బిల్లు వచ్చింది. ఈ మధ్యకాలంలో నేను ఆ ఇంట్లో ఉండటం లేదు. దీంతో ఆ బిల్లు చూసి షాకయ్యా. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఇలాంటి పరిస్థితులు సిగ్గుచేటు. అయినప్పటికీ మనందరికీ ఒక అవకాశం ఉంది. నా సోదరీ సోదరులను నేను కోరేది ఒక్కటే. ఇలాంటి సమస్యలపై మనమంతా క్షేత్రస్థాయిలో పనిచేయాలి. దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ తోడేళ్ల చెర నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.#WATCH | Shimla, HP | Sandeep Kumar, Managing Director of the Himachal Pradesh State Electricity Board Limited (HPSEBL), says, "BJP MP Kangana Ranaut raised an issue that the electricity board has asked her to pay the electricity bill of Rs 1 lakh of her house. The bill is almost… pic.twitter.com/oBnZPl9OhU— ANI (@ANI) April 10, 2025 దీంతో, రంగంలోని దిగిన విద్యుత్‌ శాఖ అధికారులు.. బిల్లుపై ఆరా తీశారు. ఎంపీ కంగనా ఆరోపణలపై హిమాచల్ ప్రదేశ్ HPSEBL మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ కుమార్ స్పందించారు. ఈ క్రమంలో కంగనాకు.. 55 వేల రూపాయలు కేవలం ఈ నెల బిల్లు మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. కానీ, ఆమె గతంలో చెల్లించని బిల్లులు కూడా కలిపి రూ.91,100గా పూర్తి బిల్లు వచ్చిందని చెప్పారు. చెల్లింపులు సకాలంలో చేసి ఉంటే ఇంత మొత్తంలో బిల్లు వచ్చేది కాదని స్పష్టం చేశారు. అంతేకాకుండా 28 రోజుల్లోనే ఎంపీ కంగనా రనౌత్ దాదాపు 9 వేల యూనిట్ల విద్యుత్ వినియోగించారని.. అందుకే ఒక్క నెల బిల్లు కూడా రూ.55 వేలు వచ్చిందని అన్ని లెక్కలతో సహా చూపించారు. ఇదే సమయంలో తాము కంగనాకు రూ.700 సబ్సిడీ కూడా ఇచ్చినట్లు తెలిపారు. దీంతో, కంగనాకు బిగ్‌ షాక్‌ తగిలింది.మరోవైపు.. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడమ్‌ కరెంట్‌ బిల్లులు చెల్లించరు. అంతటితో ఆగకుండా ప్రభుత్వాన్నే నిందిస్తారు. ప్రజావేదికలపై గోల చేస్తారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇప్పటికైనా కళ్లు పెద్దవి చూసి బిల్లును చూడండి అంటూ చురకలు అంటించారు. Mandi, Himachal Pradesh: BJP MP Kangana Ranaut says, "In Himachal Pradesh, the Congress has created such a miserable situation. This month, I received an electricity bill of ₹1 lakh for my house in Manali, where I don’t even stay! Just imagine the condition here..." pic.twitter.com/6AAzvTekrt— IANS (@ians_india) April 8, 2025

Coconut Water: Why Should Avoid Drinking Too Much 10
ఎండల్లో... కొబ్బరి నీళ్లతో గేమ్స్‌ వద్దు!

ఎండ వేడిని తట్టుకోవడానికి, ఎండా కాలంలో సత్తువతో ఉండడానికి కొబ్బరి నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే అంతమంచిది అనుకుంటారు చాలామంది. అయితే ఇది సరిౖయెనది కాదు అంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే...కొబ్బరి నీళ్లలో ΄పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల రక్తంలో పొటాషియం స్థాయులు పెరుగుతాయి. శరీరంలో లవణాల సమతూకం దెబ్బతింటుంది. కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపుతుంది.కొబ్బరినీళ్లలో అధిక పొటాషియం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. కొబ్బరి నీళ్లలో అధిక చక్కెర కంటెంట్‌ వల్ల బరువు పెరగడానికి దారి తీయవచ్చు. డయాబెటిస్, గుండె జబ్బులు, దంత క్షయ ప్రమాదం పెరగవచ్చు.కొబ్బరితో అలర్జీలు అసాధారణమేమీ కాదు. కొంతమందికి కొబ్బరి నీటి వల్ల అలెర్జీలు రావచ్చు. దద్దుర్లు, వాపుతోబాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురు కావచ్చు.హైబీపి ఉన్న వారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, పేగు పూత వ్యాధి ఉన్న వాళ్లు కొబ్బరినీళ్లకు దూరంగా ఉండటమే మంచిది. (చదవండి: వేగాన్‌ వర్సెస్‌ నాన్‌వెజ్‌ డైట్‌: ఈ కవల సోదరుల ప్రయోగంలో వేటిలో విటమిన్లు ఎక్కువంటే..?)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement