Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Fires On Chandrababu for Aqua sector crisis1
ఆక్వా ఆక్రందన పట్టదా?: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా? అమెరికా టారిఫ్‌ల దెబ్బ ఒకటైతే.. ఆ పేరు చెప్పి మీ పార్టీకి చెందిన వ్యాపారులంతా సిండికేట్‌గా మారి రైతులను దోచుకు తింటుంటే ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? ఆక్వా ధరలు రోజు రోజుకూ పతనం అవుతున్నా ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు..?’ అని సీఎం చంద్రబాబును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. ‘ప్రభుత్వ స్థాయిలో ఒక సమీక్ష నిర్వహించి గట్టి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?’ అని సూటిగా ప్రశ్నించారు. ‘రైతులంతా గగ్గోలు పెడితే.. మీడియా, వైఎస్సార్‌సీపీ నిలదీస్తే కేంద్రానికి ఓ లేఖ రాసి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం? ఇక ప్రభుత్వం ఉండీ ఏం లాభం? వంద కౌంట్‌ రొయ్యల ధర అకస్మాత్తుగా రూ.280 నుంచి దాదాపు రూ.200– 210కి పడిపోయింది. ఈ ధరలు ఇంకా తగ్గుతున్నా, క్రాప్‌ హాలిడే మినహా వేరే మార్గం లేదని రైతులు కన్నీళ్లు పెడుతున్నా ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?’ అని సీఎం చంద్రబాబును నిలదీస్తూ ‘ఎక్స్‌’ వేదికగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పోస్టు చేశారు. అందులో ఇంకా ఏమన్నారంటే..⇒ చంద్రబాబూ..! కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ధాన్యం, పత్తి, పొగాకు, మిర్చి, కంది, పెసలు, మినుము, అరటి, టమోటా.. ఇలా ప్రతి పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయింది. దళారులు రైతుల కష్టాన్ని దోచుకు తింటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సమస్యలను ప్రస్తావిస్తే మీ ప్రభుత్వం ఎదురుదాడి చేసి తప్పించుకుంటోంది గానీ ఎక్కడా బాధ్యత తీసుకోవడం లేదు. ఇప్పుడు ఆక్వా విషయంలోనూ అంతే! ⇒ ఎగుమతుల్లోనూ, విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించడంలోనూ రాష్ట్ర ఆక్వా రంగం దేశంలోనే నంబర్‌ వన్‌. అలాంటి రంగాన్ని మరింతగా ఆదుకోవడానికి మా హయాంలో ఆక్వా కల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేశాం. ఆక్వా సీడ్, ఫీడ్‌ ధరలను నియంత్రించడంతోపాటు నాణ్యత పాటించేలా ప్రత్యేక చట్టాలు తెచ్చాం. సిండికేట్‌గా మారి దోపిడీ చేసే విధానాలకు చెక్‌ పెడుతూ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రొయ్యలకు ధరలు నిర్ణయించాం. దాదాపు ఐదేళ్ల క్రితం కోవిడ్‌ సమయంలో 100 కౌంట్‌కు కనీస ధరగా రూ.210 నిర్ణయించి ఆ విపత్తు రోజుల్లో రైతులకు బాసటగా నిలిచాం. మా ప్రభుత్వం అధికారంలో ఉండగా మూడుసార్లు ఫీడ్‌ ధరలు తగ్గించాం. ఇప్పుడు ఫిష్‌ ఆయిల్, సోయాబీన్‌ సహా ముడిసరుకుల దిగుమతులపై సుంకం దాదాపు 15 నుంచి 5 శాతం తగ్గినా ఈ కూటమి ప్రభుత్వంలో ఫీడ్‌ ధరలు ఒక్క పైసా కూడా తగ్గలేదు. మేం ఏర్పాటు చేసిన నియంత్రణ బోర్డు అందుబాటులో ఉన్నా సరే రేట్లు తగ్గడం లేదు.⇒ గతంలో చంద్రబాబు హయాంలో ఆక్వాజోన్‌ పరిధిలో కేవలం 80 – 90 వేల ఎకరాలు మాత్రమే ఉంటే మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 4.22 లక్షల ఎకరాలు ఆ జోన్‌ పరిధిలోకి తెచ్చాం. ఆక్వా రంగంలో మొత్తం 64 వేల విద్యుత్‌ కనెక్షన్లు ఉంటే అందులో జోన్‌ పరిధిలో ఉన్న 54 వేల కనెక్షన్లకు రూ.1.50కే యూనిట్‌ కరెంటు అందించాం. దీనికోసం రూ.3,640 కోట్లు సబ్సిడీ కింద ఖర్చు చేశాం. ఆక్వా జోన్లలో ఉన్న ఆర్బీకేల్లో ఫిషరీస్‌ గ్రాడ్యుయేట్లను ఆక్వా అసిస్టెంట్లుగా నియమించి రైతుకు చేదోడుగా నిలిచి ఎప్పుడు సమస్య తలెత్తినా వెంటనే స్పందించి పరి­ష్కారం చూపించాం. ఇప్పుడు ఆర్బీకే వ్యవస్థను నాశనం చేయ­డంతోపాటు అత్యధికంగా ఆర్జి­స్తున్న రంగాన్ని దెబ్బ తీస్తున్నారు. ⇒ చంద్రబాబూ..! ఇప్పటికైనా కళ్లు తెరవండి. వెంటనే రొయ్యలకు ధరలు ప్రకటించి ధరల పతనాన్ని అడ్డుకోండి. అమెరికా టారిఫ్‌ల పేరుతో రైతుల్ని దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోండి. ఈ టారిఫ్‌లు కేవలం మన దేశానికి మాత్రమే పరిమితమైనవి కావు. ఇక ముందు కూడా ఇవి కొనసాగుతాయి కాబట్టి ఊరికే ఒక లేఖ రాసి చేతులు దులుపుకోవడం సరికాదు.

Donald Trump 50percent tariff threat and one-day deadline to China2
మరో 50 శాతం వేస్తాం

వాషింగ్టన్‌: చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి విరుచుకుపడ్డారు. అమెరికాపై 34 శాతం ప్రతీకార సుంకాలు విధించడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఆ నిర్ణయాన్ని మంగళవారంలోగా వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే బుధవారం నుంచి చైనాపై ఏకంగా మరో 50 శాతం అదనపు సుంకాలు విధిస్తానని సోమవారం హెచ్చరించారు. అంతేకాదు, ‘‘చైనా విజ్ఞప్తి మేరకు పలు అంశాలపై ఆ దేశంతో పురోగతిలో ఉన్న అన్నిరకాల చర్చలనూ ఉన్నపళాన నిలిపేస్తాం. బదులుగా ఇతర దేశాలపై దృష్టి సారిస్తాం. ఆయా రంగాల్లో వాటితో బంధాలను పటిష్టం చేసుకుంటాం’’ అని కుండబద్దలు కొట్టారు. చైనాపై ట్రంప్‌ ఇటీవలే 34 శాతం సుంకాలు విధించడం, బదులుగా అమెరికాపైనా అంతే శాతం సుంకాలు విధిస్తున్నట్టు చైనా ప్రకటించడం తెలిసిందే. అంతేగాక తమనుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న పలు కీలక ఖనిజాలపై ఆంక్షలు కూడా విధించింది. దీనిపై ట్రంప్‌ తీవ్రంగా మండిపడుతూ తన సోషల్‌ మీడియా హాండిల్‌ ట్రూత్‌లో పలు పోస్టులు పెట్టారు. ‘‘అమెరికా ఉత్పత్తులపై చైనా ఏళ్లుగా రికార్డు స్థాయిలో భారీ టారిఫ్‌లు వసూలు చేస్తోంది. అవి చాలవన్నట్టు నిన్న మరో 34 శాతం ప్రతీకార సుంకాలు విధించింది. ఇవిగాక చైనా కంపెనీలు అనైతిక సబ్సిడీలు, భారీ ద్రవ్య అవకతవకల వంటివాటికి పాల్పడుతూ వస్తున్నాయి! నేను విధించిన సుంకాలపై ఏ దేశమైనా ప్రతీకార చర్యలకు దిగితే సహించబోమని స్పష్టంగా హెచ్చరించా. వాటిపై అదనపు బాదుడు తప్పదని అప్పుడే స్పష్టం చేశా. చైనా ఇప్పుడు వాటిని రుచిచూడబోతోంది’’ అని ప్రకటించారు. అమెరికాలో ద్రవ్యోల్బణం లేదు తన సుంకాల దెబ్బకు ప్రపంచ మార్కెట్లన్నీ పతనమవుతున్నా ట్రంప్‌ మాత్రం డోంట్‌ కేర్‌ అంటున్నారు. అమెరికా ద్రవ్యోల్బణం కోరల్లో చిక్కుతోందని ఆర్థిక నిపుణులంతా గగ్గోలు పెడుతున్నా అదేమీ లేదని చెప్పుకొచ్చారు. ఎవరేమన్నా సుంకాలపై తగ్గే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలంటికీ అమెరికా గత పాలకులు, తమను ఇంతకాలంగా దోచేసిన చైనా వంటి దేశాలే కారణమని నిందించారు. ‘‘ఒక్కోసారి చేదుగా ఉన్నా చికిత్స తప్పదు. నా చర్యల ఫలితాలు ఇప్పటికే కని్పస్తున్నాయి. చమురు ధరలు దిగొచ్చాయి. వడ్డీ రేట్లూ తగ్గుముఖం పడుతున్నాయి. ఆహార పదార్థాల ధరలూ తగ్గుతున్నాయి. ఇక ద్రవ్యోల్బణం ఎక్కడున్నట్టు? పలు దేశాలు అమెరికాను ఇంతకాలం పీల్చి పిప్పి చేశాయి. ముఖ్యంగా చైనా! ఇప్పుడు చూడండి, నా టారిఫ్‌ల దెబ్బకు చైనా మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఇకపై అమెరికాకు ప్రతి వారం ఏకంగా బిలియన్ల కొద్దీ డాలర్లు వచి్చపడతాయి. చూసుకోండి’’ అంటూ స్పష్టం చేశారు.ఇక భారత్‌లోనే ఉత్పత్తి! యాపిల్, సామ్‌సంగ్‌ యోచన మొబైళ్ల తయారీ దిగ్గజాలు యాపిల్, సామ్‌సంగ్‌ ట్రంప్‌ టారిఫ్‌ల ప్రభావాన్ని తప్పించుకునే మార్గాల అన్వేషణలో పడ్డాయి. తమ అంతర్జాతీయ ఉత్పత్తి కేంద్రాలను లాభదాయక ప్రాంతాలకు తరలించాలని యోచిస్తున్నాయి. వియత్నాంపై 46 శాతం చైనాపై 34 శాతం చొప్పున సుంకాలు విధించిన ట్రంప్‌ భారత్‌పై 26 శాతంతో సరిపెట్టడం తెలిసిందే. దాంతో భారత్‌లో ఉత్పత్తిని వీలైనంతగా పెంచడంతో పాటు అంతర్జాతీయ ఉత్పత్తి వ్యవస్థలను వీలైనంత వరకూ ఇక్కడికి తరలించాలని యాపిల్, సామ్‌సంగ్‌ యోచిస్తున్నట్టు సమాచారం. యాపిల్‌ చాలాకాలంగా భారత్‌లో ఐఫోన్లు తయారు చేస్తోంది. ‘‘చైనాలో ఉత్పత్తిని వీలైనంతగా తగ్గించుకోవాలని కంపెనీ నిర్ణయానికి వచి్చంది. ఇకమీదట అమెరికాకు కేవలం భారత్‌లో తయారైన ఐఫోన్లనే పంపనుంది. ప్రస్తుతానికి చైనాలో తయారు చేసిన ఫోన్లను యూరప్, లాటిన్‌ అమెరికా, ఆసియా దేశాలకు పంపిస్తుంది’’ అని కంపెనీ వర్గాలను ఉటంకిస్తూ వార్తలొస్తున్నాయి. అంతేగాక ట్రంప్‌ టారిఫ్‌ల దెబ్బకు అమెరికాలో ఐఫోన్ల ధరలు 40 శాతం దాకా పెరగవచ్చంటున్నారు.

JEE candidates miss exam over 2 minute delay: blame traffic snarls caused by Deputy CM convoy in Visakhapatnam3
ఈ పాపం.. ఎవరిది పవన్‌?

పెందుర్తి: వారంతా తన కలను సాకారం చేసుకునేందుకు నిద్రాహారాలు మాని తపించారు. జీవిత లక్ష్యం నెరవేరే రోజు వచ్చింది.. కానీ ఎన్నో ఆశలతో పరీక్షకు సిద్ధమైన ఆ విద్యార్థులకు సోమవారం విశాఖలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ పర్యటన శాపంగా మారింది. ఉదయం నుంచే కూటమి నేతల కోలాహలం.. కఠినమైన ఆంక్షల కారణంగా ట్రాఫిక్‌లో చిక్కుకుని 23 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్‌ పరీక్షకు దూరమయ్యారు.పవన్‌కళ్యాణ్‌ కాన్వాయ్‌ కోసం ఎన్‌ఏడీ నుంచి పెందుర్తి వరకు వాహనాలను నిలిపివేయడంతో జేఈఈ మెయిన్‌ పరీక్ష రాసేందుకు వెళుతున్న విద్యార్థులంతా చిక్కుకుపోయారు. రెండు నిమిషాలు ఆలస్యం కావడంతో నిర్వాహకులు వారిని పరీక్షకు అనుమతించలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే పవన్‌కళ్యాణ్‌ రాక సందర్భంగా ట్రాఫిక్‌ను ఆపలేదని.. బీఆర్‌టీఎస్‌ మధ్య రోడ్డులో ఆయన వెళ్లారని.. మిగిలిన సర్విస్‌ రోడ్లపై ఇతర వాహనాలు యథావిధిగా ముందుకు సాగాయని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.అసలేం జరిగింది..! అల్లూరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ పర్యటన నేపథ్యంలో ఎన్‌ఏడీ కొత్త రోడ్డు నుంచి పెందుర్తి వరకు ఉదయం నుంచి పోలీసులు ట్రాఫిక్‌ను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు. పవన్‌ ప్రత్యేక విమానంలో ఉదయం 8.15 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకోగా 6.30 నుంచే ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ వచ్చారు. పవన్‌ కాన్వాయ్‌కు కేటాయించిన బీఆర్‌టీఎస్‌ మధ్య రోడ్డులో ఇతర వాహనాలను పూర్తిగా నిలిపివేయగా.. ఎడమ, కుడి మార్గాల్లోనూ ఆంక్షలు విధించడంతో ట్రాఫిక్‌ మందకొడిగా సాగింది. ఈ రోడ్డులో 7.30 నుంచి ట్రాఫిక్‌ను పూర్తిగా నియంత్రించారు.దీంతో పరీక్షకు హాజరు కావాల్సిన విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. దాదాపు 2 గంటల పాటు ట్రాఫిక్‌ను కఠినంగా నియంత్రించడం.. జనసేన కార్యకర్తలు ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేయడంతో బీఆర్‌టీఎస్‌ సర్విస్‌ రోడ్డుపై రద్దీ పెరిగిపోయి విద్యార్థులు జేఈఈ పరీక్షకు ఆలస్యమైనట్లు స్పష్టమవుతోంది. మరోపక్క పవన్‌ ఎయిర్‌పోర్టులో ఉదయం 8.21 గంటలకు బయల్దేరగా వేపగుంట నుంచి పెందుర్తి మార్గంలో అన్ని వైపులా ఉదయం 8.10 గంటలకే ట్రాఫిక్‌ను నిలిపివేసేలా జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌ బాబు పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.దీనివల్ల పవన్‌వెళ్లే వరకు ఆ మార్గంలో వాహనాలు కదల్లేదు. దీంతో వేపగుంట నుంచి చినముషిడివాడ కేంద్రానికి కేవలం 10 నిమిషాల లోపు చేరుకోవాల్సిన విద్యార్థులు ఆలస్యమయ్యారు. మరోవైపు జనసేన పార్టీ నిబంధనల ప్రకారం గజమాలతో అధినేతను గానీ ఇతర నాయకులను గానీ సత్కరించడం నిషిధ్ధం. కానీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గజమాలతో పవన్‌ను (షెడ్యూల్‌ ప్రకారం పవన్‌కళ్యాణ్‌ ఎక్కడా ఆగే వీలు లేదు) సత్కరించేందుకే ఇంత హడావిడి చేసి విద్యార్థులు పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయేలా చేశారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.పవన్‌ వెళుతున్న రోడ్డులోనే ఉన్న చినముషిడివాడలోని అయాన్‌ డిజిటల్‌ కేంద్రంలో 1,350 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్‌ పరీక్షకు హజరవుతున్నారని తెలిసి కూడా అధికారులు దానిపై ప్రత్యేక దృష్టి సారించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవన్‌కళ్యాణ్‌ పర్యటన కారణంగా ట్రాఫిక్‌ నిలిపివేయడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. చినముషిడివాడ కేంద్రంలో జేఈఈ పరీక్షకు సగటున 50 నుంచి 70 మంది గైర్హాజరు అవుతున్నట్లు సీపీతో పాటు వెస్ట్‌ జోన్‌ ఏసీపీ పృధ్వితేజ పేర్కొన్నారు.అలా ఎలా సార్‌!!సాధారణంగా ఎన్‌ఏడీ కొత్త రోడ్డు నుంచి బీఆర్‌టీఎస్‌ మీదుగా చినముషిడివాడ చేరుకోవడానికి వాహనం / ట్రాఫిక్‌ పరిస్థితిని బట్టి 10 నుంచి 20 నిమిషాలు పడుతుంది. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ కాన్వాయ్‌ చినముషిడివాడ అయాన్‌ డిజిటల్‌ కేంద్రాన్ని ఉదయం 8.41 గంటలకు (ఎయిర్‌పోర్టులో బయలుదేరిన సమయం ఉదయం 8.21 గంటలు అని చెబుతున్నారు) దాటిందని చెబుతున్నారు. ఒక వీవీఐపీ వస్తున్నారంటే కనీసం గంట ముందు నుంచే ఇటు పోలీసులు అటు పార్టీ అభిమానులు, నాయకుల హడావుడి ఉంటుంది. అంటే ఉదయం 7 నుంచే రోడ్లపై వారి హంగామా మొదలైంది.బీఆర్‌టీఎస్‌ మధ్య మార్గంలో ఇతర వాహనాలపై నిషేధం విధించడం.. వాటిని సర్విసు రోడ్డులోకి మళ్లించడం.. జనసేనతో పాటు ఇతర కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల ఓవరాక్షన్‌ కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిందని జేఈఈ పరీక్ష రాసే అవకాశం కోల్పోయిన విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే పోలీసులు తప్పుడు వివరణలు ఇవ్వడం విడ్డూరంగా ఉంది. ఎయిర్‌పోర్టు నుంచి చినముషిడివాడకు డిప్యూటీ సీఎం కాన్వాయ్‌ రావడానికి 20 నిమిషాల సుదీర్ఘ సమయం (వీవీఐపీల ప్రయాణ సమయం సుమారుగా 10 నిమిషాలు) పట్టడం మరో ఆశ్చర్యకరమైన విషయం.నా కల చెదిరింది..జేఈఈ రాసి ఉన్నతస్థాయిలో నిలవాలన్నది నా కల. దీని కోసం చాలా కష్టపడ్డా. మా ఇంటి (కంచ­రపాలెం) నుంచి చినముషిడివాడకు ఎంత ట్రాఫిక్‌ ఉన్నా 30–40 నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. ఎన్‌ఏడీ కొత్త రోడ్డుకు వచ్చేసరికి చాలా ట్రాఫిక్‌ ఉంది. అక్కడి నుంచి చినముషిడివాడ చేరుకోవడానికి 45–50 నిమిషాలు పట్టింది. 2 నిమిషాల ఆలస్యంతో పరీక్ష రాసే అవకాశం కోల్పోయా. నా కల చెదిరిపోయింది. – బొడ్డు జశ్వంత్, జేఈఈ అభ్యర్థి, కంచరపాలెంవిచారణ చేపట్టండి: పవన్‌కళ్యాణ్‌సాక్షి, అమరావతి: పెందుర్తి ప్రాంతంలో జేఈఈకి కొందరు విద్యార్థులు హాజరుకాలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకుని వాస్తవాలపై విచారణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ ఆదేశించారు. తన కాన్వాయి కోసం ఎంతసేపు ట్రాఫిక్‌ని ఆపేశారు, పరీక్ష కేంద్రం దగ్గరకు విద్యార్థులు చేరుకోవలసిన మార్గాల్లో ఆ సమయంలో ట్రాఫిక్‌ పరిస్థితి, సర్వీసు రోడ్లలో ట్రాఫిక్‌ను నియంత్రించారా? వంటి అంశాలపై విచారించాలని సూచించారు. రేయింబవళ్లు కష్టపడి.. జేఈఈ పరీక్ష కోసం మా అబ్బాయి రేయింబవళ్లు కష్టపడి చదివాడు. చినముషిడివాడ కేంద్రం వద్దకు వెళ్లేందుకు ఉదయం 6.30కే ఇంటి నుంచి బయలుదేరాం. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ నిలిపేయడంతో చిక్కుకుపోయాం. రెండు నిమిషాలు ఆలస్యం కావడంతో లోపలికి అనుమతించలేదు. మా అబ్బాయి మళ్లీ పరీక్ష రాసేలా పవన్‌కళ్యాణ్, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – సత్యవతి, కంచరపాలెం, విద్యార్థి తల్లిఏం చేయాలో.. మాది సాధారణ కుటుంబం. జేఈఈపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా. తుని నుంచి వేకువజామున బయలుదేరి వచ్చా. ఎన్‌ఏడీ వచ్చేసరికి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పరీక్షా కేంద్రానికి మరో 10 నిమిషాల్లో చేరుకుంటాననగా ట్రాఫిక్‌ను ఆపేశారు. రెండు నిమిషాలు ఆలస్యం కావడంతో అనుమతించలేదు. ఇప్పుడు నా భవిష్యత్‌ ఏమిటో.. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – ఆళ్ల హేమంత్, తునిమరో అవకాశం ఇవ్వాలి.. బాబు, పవన్‌ స్పందించాలి ముమ్మాటికి పవన్‌కళ్యాణ్‌ పర్యటన కారణంగా ట్రాఫిక్‌ జామ్‌ వల్లే మా పిల్లలు పరీక్షకు ఆలస్యం అయ్యారు. లేదంటే నిర్దేశిత సమయానికి చాలా ముందే కేంద్రానికి చేరుకునేవాళ్లు. పరీక్షకు అనుమతించకపోవడంతో పిల్లల భవిష్యత్‌ పాడవుతుంది. మంగళవారం వరకు పరీక్షలు ఉంటాయి కాబట్టి పిల్లలందరికీ మరో అవకాశం ఇవ్వాలి. దీనిపై పవన్, చంద్రబాబు ఉన్నత స్థాయిలో మాట్లాడాలి. – అనిల్, విద్యార్థి తండ్రిట్రాఫిక్‌ వల్లే.. ఎన్‌ఏడీ నుంచి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయా. చాలా దూరం ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అయినా ఏదోలా కేంద్రానికి చేరుకున్నా రెండు నిమిషాలు ఆలస్యం అయ్యానని పరీక్షకు అనుమతించలేదు. కేవలం ట్రాఫిక్‌ వల్లే పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయా. – ఆర్యన్‌రాజ్‌

Rasi Phalalu: Daily Horoscope On 08-04-2025 In Telugu4
ఈ రాశి వారికి ఇంటాబయటా అనుకూలం.. ఆస్తిలాభం

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.ఏకాదశి రా.11.20 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: ఆశ్లేష ఉ.10.29 వరకు, తదుపరి మఖ, వర్జ్యం: రా.11.01 నుండి 12.40 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.21 నుండి 9.10 వరకు, తదుపరి రా.10.52 నుండి 11.38 వరకు, అమృత ఘడియలు: ఉ.8.51 నుండి 10.28 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.53, సూర్యాస్తమయం: 6.10. మేషం... వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంతమేర అనుకూలిస్తాయి.వృషభం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలోవిజయం. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.మిథునం... కుటుంబంలో ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. అనారోగ్యం.కర్కాటకం... వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆస్తిలాభం. సోదరులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు. విందువినోదాలు.సింహం..... శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. రుణయత్నాలు. సోదరులు,సోదరీలతో వివాదాలు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.కన్య.... కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.తుల.... చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. ఆస్తిలాభ సూచనలు. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.వృశ్చికం.... సన్నిహితులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.ధనుస్సు... వ్యవహారాలలో ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొద్దిపాటి చికాకులు.మకరం.... యత్నకార్యసిద్ధి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు కలసివస్తాయి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.కుంభం.... వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనసౌఖ్యం. కీలక నిర్ణయాలు. నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.మీనం.... శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

Rs 14 lakh crore wiped off from Indian stock market as Trump tariffs5
మార్కెట్లు భగ భగ

‘మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌’ నినాదంతో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలిచిన ట్రంప్‌... ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో సృష్టిస్తున్న భగభగలు చల్లారటం లేదు. అమెరికాతో వ్యాపారం చేస్తున్న ప్రతి దేశాన్నీ కాళ్ల బేరానికి వచ్చేలా చేయడానికి ఆయన ఎంచుకున్న ప్రతీకార సుంకాలు అమెరికా సహా అన్ని స్టాక్‌ మార్కెట్లలోనూ కల్లోలాన్ని కొనసాగిస్తున్నాయి. కెనడా, జపాన్‌ సహా పలు దేశాల అధినేతలు ట్రంప్‌తో చర్చలకు వెళుతున్నట్లు ఇప్పటికే ప్రకటించగా... చైనా మాత్రం దిగిరాలేదు. పైపెచ్చు ట్రంప్‌ టారిఫ్‌లకు జవాబుగా చైనా కూడా అమెరికా వస్తువులపై సుంకాలు పెంచటంతో ట్రంప్‌ బెదిరింపులకు దిగారు. చైనా వాటిని ఉపసంహరించుకోకపోతే మరో 50 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. సోమవారం అమెరికా మార్కెట్లు మొదట్లో కోలుకున్నట్లు కనిపించినా ఈ ట్రేడ్‌ వార్‌ భయాలతో మళ్లీ భారీ పతనం దిశగా కదిలాయి. మరోవంక ట్రంప్‌ చర్యలతో ప్రపంచాన్ని మాంద్యం ముంచెత్తే అవకాశాలు 60 శాతానికి చేరినట్లు ఆర్థిక దిగ్గజాలు ప్రకటించాయి. దీంతో భారత్‌ సహా ప్రపంచ మార్కెట్లన్నీ సోమవారం భారీ పతనాన్ని చూశాయి. సెన్సెక్స్‌ ఆరంభంలో 4 వేల పాయింట్ల వరకూ నష్టపోయినా చివరకు కాస్త కోలుకుని 2,226.79 పాయింట్లు (–2.95%) క్షీణించి 73,137 వద్ద ముగిసింది. నిఫ్టీ 742 పాయింట్లు (–3.24%) పడిపోయి 22,160 వద్ద ముగిసింది. ఈ పతనంతో రూ.14 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరయ్యింది. చమురు, బంగారం ధరలు కూడా భారీగా పతనంఅవుతున్నాయి. మరోవైపు హాంకాంగ్‌ సూచీ హాంగ్‌సెంగ్‌ 15% నష్టపోగా... తైవాన్‌ వెయిటెడ్‌ 11%, జపాన్‌ నికాయ్‌ 8%, సింగపూర్‌ స్ట్రెయిట్‌ టైమ్స్‌ 8%, చైనా షాంఘై 7% చొప్పున నష్టపోయాయి. యూరప్‌ మార్కెట్ల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ట్రంప్‌ టారిఫ్‌ వార్‌తో ప్రపంచ మార్కెట్లను బేర్‌ చీల్చిచెండాడింది. ఆసియా నుంచి అమెరికా దాకా బ్లాక్‌ మండే దెబ్బకు ఇన్వెస్టర్లు కుదేలయ్యారు. అమెరికా సుంకాలకు చైనా ప్రతీకార టారిఫ్‌లు విధించడం.. ఇతర దేశాలూ అదే బాటలో వెళ్తుండటంతో వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. దీంతో ద్రవ్యోల్బణం ఎగబాకి ఆర్థిక మాంద్యానికి దారి తీయొచ్చనే భయాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల సునామీ వెల్లువెత్తింది. ఈ ప్రభావం దేశీయ ఈక్విటీ మార్కెట్‌పైనా విరుచుకుపడింది. ఫలితంగా భారత స్టాక్‌ సూచీలు పది నెలల్లో (2024 జూన్‌ 4 తర్వాత) అతిపెద్ద నష్టాన్ని చూశాయి. సెన్సెక్స్‌ 2,227 పాయింట్లు క్షీణించి 73,138 వద్ద, నిఫ్టీ 743 పాయింట్లు నష్టపోయి 22,162 వద్ద నిలిచింది. ఈ క్రాష్‌తో ఇన్వెస్టర్ల సంపదగా భావించే, బీఎస్‌ఈలోని లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ సోమవారం ఒక్కరోజే రూ.14.09 లక్షల కోట్లు ఆవిరై రూ.389 లక్షల కోట్ల (4.54 ట్రిలియన్‌ డాలర్లు)కు పడిపోయింది. ఒకానొక దశలో సంపద రూ.20.16 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. ముంబై: గత వారాంతంలో అమెరికా మార్కెట్లు కుప్పకూలడంతో సోమవారం ఆసియా మార్కెట్లు అతలాకుతలం అయ్యాయి. ఆ సెగతో మన సూచీలు కూడా భారీ నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ ఏకంగా 3,915 పాయింట్ల క్షీణతతో 71,450 వద్ద, నిఫ్టీ 1,146 వద్ద పతనంతో 21,758 వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 3,940 పాయింట్లు, నిఫ్టీ 1160 పాయింట్లు దిగజారాయి. జాతీయ, అంత్జాతీయ ప్రతికూలతల ప్రభావంతో రోజంతా భారీ నష్టాల్లో కదలాడాయి. అయితే కనిష్టాల వద్ద కొన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలు కొంత భర్తీ అయ్యాయి.→ సెన్సెక్స్‌ సూచీలో ఒక్క హెచ్‌యూఎల్‌ (0.25%) మినహా మిగిలిన 29 షేర్లు నష్టాలు చవిచూశాయి. రంగాల వారీగా సూచీల్లో మెటల్‌ 6.22%, రియల్టీ 5.69%, కమోడిటీస్‌ 4.68%, ఇండ్రస్టియల్‌ 4.57%, కన్జూమర్‌ డి్రస్కేషనరీ 4%, ఆటో 3.77%, బ్యాంకెక్స్‌ 3.37%, ఐటీ, టెక్‌ మూడు శాతాలు క్షీణించాయి. బీఎస్‌ఈలో 3,515 షేర్లు నష్టపోయాయి. 570 స్టాక్స్‌ లాభపడ్డాయి. మిగిలిన 140 షేర్లలో ఎలాంటి మార్పుల్లేవు. 775 స్టాక్స్‌ ఏడాది కనిష్టాన్ని , 59 షేర్లు ఏడాది గరిష్టాన్ని తాకాయి.ఐటీ షేర్లు.. హాహాకారాలు... ఆర్థిక మాంద్య భయాలతో అమెరికా నుంచి అధిక ఆదాయాలు ఆర్జించే ఐటీ షేర్లు భారీ క్షీణించాయి. ఆన్‌వర్డ్‌ టెక్నాలజీస్‌ 14%, జెనెసిస్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేషన్‌ 11% క్షీణించాయి. క్విక్‌ హీల్‌ టెక్నాలజీస్‌ 10%, జాగిల్‌ ప్రీపెయిడ్‌ ఓషియన్‌ సరీ్వసెస్, డేటామాటిక్స్‌ గ్లోబల్‌ సరీ్వసెస్‌ 9%, న్యూజెన్‌ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌ 8%, హ్యాపియెస్ట్‌ మైండ్స్, సొనాటా సాఫ్ట్‌వేర్, టాటా టెక్నాలజీ, ఎంఫసిస్‌ 6% క్షీణించాయి. అధిక వెయిటేజీ ఇన్ఫోసిస్‌ 4%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 3%, టెక్‌ మహీంద్రా 2.50%, ఎల్‌టీఐమైండ్‌ట్రీ 2%, విప్రో ఒకశాతం, టీసీఎస్‌ అరశాతంనష్టపోయాయి. బీఎస్‌ఈ ఐటీ ఇండెక్స్‌ గడిచిన మూడు ట్రేడింగ్‌ సెషన్లలో 8 శాతం క్షీణించింది.టాటా.. టప టపా!టెక్నాలజీ, స్టీల్, ఆటోమొబైల్స్‌ రంగాల్లో అధిక భాగం వ్యాపారాలు కలిగిన టాటా గ్రూప్‌ షేర్లు డీలా పడ్డాయి. టాటా ట్రెంట్‌ షేరు 15%, టాటా స్టీల్‌ 9%, టాటా మోటార్స్, టాటా టెక్నాలజీ 6%, టీసీఎస్, టాటా కెమికల్స్, టైటాన్, ఇండియన్‌ హోటల్స్‌ షేర్లు 5–2% నష్టపోయాయి. ఈ గ్రూప్‌లో మొత్తం 16 లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.90,000 కోట్లు హరించుకుపోయి రూ.25.3 లక్షల కోట్లకు దిగివచి్చంది. ఒకానొక దశలో రూ.2.3 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ కోల్పోయింది.అప్రమత్తత అవసరం: నిపుణులుతీవ్ర అనిశ్చితులతో ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లో భయాందోళనలు భారీగా పెరిగాయి. ట్రంప్‌ సుంకాల విధింపుతో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితులు ఎప్పుడు సద్దుమణుగుతాయో ఎవరికి సరైన స్పష్టత లేదు. అయినప్పట్టకీ.., ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్లపై ప్రభావం తక్కువగా ఉంది. క్షీణత వేళ అప్రమత్తతతో వ్యహరిస్తూ మంచి షేరు విలువ ఆకర్షణీయంగా కనిపిస్తే కొనుగోలు చేయొచ్చు. రక్షణాత్మక రంగాల్లో పెట్టుబడి మరీ మంచిది అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వ్యూహకర్త వి.కే. విజయ్‌కుమార్‌ తెలిపారు.

Cooking gas price hiked by Rs 50 per cylinder 6
గ్యాస్‌ బండపై  రూ. 50 వడ్డింపు

సాక్షి, న్యూఢిల్లీ: ఎల్పీజీ వినియోగదారులపై భారం మరింత పెరిగింది. గృహావసరాల ఎల్పీజీ సిలిండర్‌ ధరను 50 రూపాయలు పెంచుతూ కేంద్రం సోమవారం నిర్ణయం తీసుకుంది. ఇది సాధారణ వినియోగదారులతో పాటు నిరుపేద ఉజ్వల పథక లబ్దిదారులకు కూడా వర్తిస్తుందని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి వెల్లడించారు. సోమవారం అర్ధరాత్రి నుంచే పెంపు అమల్లోకి వచ్చింది. ఎల్పీజీ విక్రయాలపై పెట్రోలియం సంస్థలు నష్టాలు మూటగట్టుకుంటున్నందున ఈ నిర్ణయం తప్పలేదన్నారు. తాజా పెంపుతో దేశ రాజధానిలో ఎల్పీజీ సిలిండర్‌ ధర ఉజ్వల వినియోగదారులకు రూ.503 నుంచి రూ.553కు పెరిగింది. సాధారణ వినియోగదారులకు ధర రూ.853కి చేరింది. సీఎన్‌జీ ధరలను కూడా దాదాపు నాలుగు శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఢిల్లీలో సీఎన్‌జీ ధర కిలోకు ఒక రూపాయి పెరిగి రూ.75.09కి చేరింది. వీటితో పాటు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని కూడా కేంద్రం 2 రూపాయల చొప్పున పెంచింది. అయితే ఈ పెంపు రిటైల్‌ ధరలకు వర్తించబోదు. ఫలితంగా ఈ భారం సామాన్య వినియోగదారులపై పడబోదని పురి స్పష్టం చేశారు. ‘‘అంతర్జాతీయంగా చమురు ధరలు బ్యారల్‌కు 70–75 డాలర్ల నుంచి 60 డాలర్లకు తగ్గిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ సుంకం విధించాలని నిర్ణయించాం. దీనివల్ల కేంద్రానికి రూ.32 వేల అదనపు ఆదాయం సమకూరనుంది. సమీప భవిష్యత్తులో చమురు ధరలు పెరగని పక్షంలో పెట్రో ధరలను తగ్గించే అవకాశం కూడా ఉంది’’ అని మంత్రి వెల్లడించారు. తాజా నిర్ణయంతో పెట్రోల్‌పై కేంద్రం పన్నులు లీటర్‌కు రూ.21.9కి, డీజిల్‌పై రూ.15.8కి చేరాయి. భారత్‌లో పెట్రోల్, డీజిల్‌ వార్షిక వినియోగం 16,000 కోట్ల లీటర్లు. మన చమురు అవసరాలకు 85 శాతం దాకా దిగుమతులపైనే ఆధారపడ్డాం.

YS Jagan Questions To CM Chandrababu Naidu: Andhra pradesh7
జీఎస్‌డీపీపై ఇన్ని బోగస్‌ మాటలా బాబూ?

సాక్షి, అమరావతి: ‘‘గత ఆర్థిక సంవత్సరం (2024–­25)లో మొదటి 11 నెలల్లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం పెరుగుదల కేవలం 2.16 శాతం మాత్రమే నమోదైతే... రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) ఏకంగా 8.21% ఉంటుందని అంచనా వేయడం సమర్థనీ­యమేనా?’’ అని సీఎం చంద్రబాబును ‘ఎక్స్‌’ వేదికగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ అంకెలను ఎవరైనా ఆర్థికవేత్త లోతుగా పరిశీలిస్తే.. మీ ప్రభుత్వ మొదటి ఏడాది పనితీరు, ఆర్థిక అరాచకాలను కప్పి పుచ్చేందుకే జీఎస్‌డీపీ వృద్ధి రేటును పెంచారన్న వాస్తవం వెల్లడవు­తుం­దని పేర్కొన్నారు. దీని వల్ల రాష్ట్రం విశ్వసనీయ­తను కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్ర విశాల ప్రయోజనాలు, ప్రతిష్ట, విశ్వసనీయతను కాపా­డేం­దుకు.. జీఎస్‌డీపీలో అతిగా వేసిన అంచనాలను సరిదిద్దుకోవాలని సీఎం చంద్రబాబుకు హితవు పలి­కారు. ఈమేరకు సోమవారం తన ‘ఎక్స్‌’ ఖాతాలో వైఎస్‌ జగన్‌ పోస్ట్‌ చేశారు. అందులో ఏమన్నారంటే..è చంద్రబాబూ..! మీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని.. మీ అనుభవం, సమర్థతతో వాటిని అధిగమించి రాష్ట్రం పురోగమిస్తుందని ప్రజలను నమ్మించడానికి ఎల్లో మీడియా సంస్థలతో కలసి మీరు విశ్రాంతి లేకుండా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఎలా పని చేసిందన్న దానికి భిన్నమైన చిత్రాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించారు. ⇒ నాడు కోవిడ్‌ మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ 2019–24లో రాష్ట్ర ప్రభుత్వ అప్పుల పెరుగుదలలో వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్‌) 13.57 శాతం మాత్రమే. అదే 2014–19లో కోవిడ్‌ లాంటి ఇబ్బందులు ఏవీ లేకున్నా సరే రాష్ట్ర అప్పుల వార్షిక వృద్ధి రేటు 22.63 శాతంగా ఉంది. వీటిని బట్టి చూస్తే.. 2019–24 మధ్య రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పనితీరు ప్రశంసించ దగ్గదన్నది స్పష్టమవుతోంది. ⇒ కోవిడ్‌ ప్రభావం వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ 2019–24 మధ్య ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలలో దేశ వృద్ధి రేటును రాష్ట్ర వృద్ధి రేటు అధిగమించింది. 2025 మార్చిలో విడుదలైన రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే నివేదిక, ఎంవోఎస్‌పీఐ నివేదికలే అందుకు నిదర్శనం. అయినప్పటికీ 2019–24లో రాష్ట్రంలో తీవ్ర సంక్షోభం ఉందని మీరు చెబుతున్నారు.⇒ మరోవైపు మీ పాలనలో మొదటి సంవత్సరంలో చాలా ఆందోళనకరమైన ధోరణి ఆవిష్కృతమైంది. కోవిడ్‌ లాంటి ప్రతికూల పరిస్థితులు లేనప్పటికీ.. 2024–25లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయాలు, పన్నే­తర ఆదాయాల పెరుగుదల చాలా తక్కువగా ఉంది. కేంద్ర పన్నుల్లో వాటా పెరగకపోతే, అప్పులు చేయక­పోతే.. మీ ప్రభుత్వం ప్రాథమిక ఖర్చులను కూడా తీర్చలేకపోయేది. మీ అసమర్థ పాలన.. అసంబద్ధ విధానాల వల్లే ఈ పరిస్థితి దాపురించింది. ఇంకా ప్రధానమైన విషయం ఏమిటంటే .. మీ ప్రభుత్వం మొదటి సంవత్సరంలో మూలధన వ్యయం 42.78 శాతం తగ్గింది.⇒ రాష్ట్ర ఆర్థిక పనితీరును బలోపేతం చేయడానికి దిద్దుబాటు చర్యలు ప్రారంభించాల్సిన అవసరాన్ని పూర్తిగా విస్మరించి.. రాష్ట్ర ఆర్థిక పనితీరుపై తప్పుడు ప్రచారం చేయడానికి మీ ప్రభుత్వం అన్ని ప్రయత్నా­లను చేస్తుండటం ఆందోళనకరం. రాష్ట్ర ఆర్థిక పనితీ­రును ఒక్కసారి పరిశీలిస్తే.. ఎంత ఇబ్బంది, దోపిడీ జరుగుతుందో తెలుస్తుంది. అయినప్పటికీ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోందని మీరు అబద్ధం చెబుతున్నారు.⇒ ఎంవోఎస్‌పీఐ విడుదల చేసిన డేటా ప్రకారం రాష్ట్రం ఈమేరకు పనితీరు కనబరుస్తున్నట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం వెల్లడిస్తోంది. నిజానికి ఎంవోఎస్‌పీఐ విడుదల చేసే డేటాకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక, గణాంకాల డైరెక్టరేట్‌ డేటానే మూలం. దీన్ని బట్టి చూస్తే.. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన డేటా మినహా మరొకటి కాదు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన ముందస్తు అంచనాలు మాత్రమే. వాటిని ఎంవోఎస్‌పీఐ వంటి ఏ స్వతంత్ర సంస్థ ధృవీకరించలేదు. ⇒ 2024–25లో కేంద్ర పన్నుల ఆదాయాలు ఫిబ్రవరి 25 వరకూ 10.87 శాతం వృద్ధిని నమోదు చేశాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 2024–25లో దేశీయ స్థూల ఉత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 6.48 శాతంగా అంచనా వేసింది. ఇది సమర్థనీయమే. ⇒ తమిళనాడు ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాలు 2024–25లో ఫిబ్రవరి 2025 వరకు 13.01 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి తమిళనాడు జీఎస్‌డీపీ వృద్ధి రేటు 9.69 శాతంగా అంచనా వేసింది. ఇది కూడా సమర్థనీయమే.⇒ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాలు 2024–25లో ఫిబ్రవరి వరకు 2.16 శాతం మాత్రమే పెరిగితే.. జీఎస్‌డీపీ వృద్ధి రేటు 8.21 శాతంగా ఉంటుందని మీ ప్రభుత్వం అంచనా వేసింది. మరి ఇది సమర్థనీ­యమైన­దేనా? పన్ను ఆదాయాల వృద్ధి రేటు.. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దాదాపు సమానంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 2024–25 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో పన్నేతర ఆదాయం 33.35 శాతం తగ్గింది. మూలధన వ్యయం 42.78 శాతం తగ్గింది. ⇒ గత సంవత్సరం మీ ప్రభుత్వ ఆర్థిక పనితీరు పేలవంగా ఉండటం ఆదాయాల తీరును బట్టి స్పష్టంగా కనిపిస్తున్నందున.. ఈ సంవత్సరం ఇంత బలమైన ఆర్థిక పనితీరు గురించి మీ ప్రభుత్వ అంచనాను మీరు ఎలా సమర్థిస్తారు? ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే 2024–25 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో పన్ను ఆదాయంలో పెరుగుదల ముందస్తు జీడీపీ వృద్ధి అంచనా కంటే ఎక్కువగా ఉంది. ఇది సముచితం. ఎందుకంటే, ప్రస్తుత ధరల వద్ద వినియోగం, పెట్టుబడి వ్యయంపై పన్నులు విధిస్తారు కాబట్టి.. ఇది వాస్తవ జీడీపీ వృద్ధి ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేస్తుంది.

Healthcare Services Halted in Network Hospitals Across Andhra Pradesh8
‘ఆరోగ్యశ్రీ’ ఆగిపోయింది!

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం పెదమామిడిపల్లికి చెందిన పార్వతి భర్త సుబ్రహ్మణ్యానికి కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆపరేషన్‌ అవసరమని వైద్యులు చెప్పడంతో పార్వతి తన భర్త సుబ్రహ్మణ్యాన్ని తీసుకుని ఎంతో కష్టం మీద రూ.7 వేలకు ఓ ప్రైవేటు అంబులెన్స్‌లో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చింది. అక్కడ రేషన్‌ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు చూపి, తన భర్త ఆపరేషన్‌ విషయం తెలిపింది.ఆరోగ్యశ్రీలో ఆపరేషన్‌ చేయడంలేదని, డబ్బులిస్తేనే చేస్తామని ఆస్పత్రి సిబ్బంది చెప్పడంతో ఏం చేయాలో తెలీక భర్తను తీసుకుని పార్వతి తిరిగి ఇంటికి బయల్దే రింది. తన భర్తకు ఆపరేషన్‌ చేయిద్దామని ఎంతో ఆశగా వచ్చానని, ఇప్పుడు ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారని కన్నీరుమున్నీరైంది. రూ.వేలు, రూ.లక్షలు పెట్టి ఆపరేషన్‌ చేయించుకునే స్థోమత తమకులేదని ఆవేదన చెందింది. సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రవ్యాప్తంగా ‘ఆరోగ్యశ్రీ లేదు. ప్రభుత్వం మాకు బకాయిలు చెల్లించలేదు.. ఉచితంగా చికిత్సలు చేయలేం వెళ్లిపోండి..’ అన్న మాటలు నెట్‌వర్క్‌ ఆస్పత్రుల దగ్గర సోమ­వారం వినిపించాయి. ఎంతో ఆశతో వైద్యం కోసం వచ్చిన రోగులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ శాపనార్థా­లు పెట్టారు. ఈ పరిస్థితికి కారణం రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రూ.3,500 కోట్ల మేర బిల్లులు సుదీర్ఘ కాలంగా చెల్లించకపోవడం, బిల్లుల కోసం ప్రభుత్వం వద్ద మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవ­డంతో సోమవారం నుంచి ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు రాష్ట్రవ్యాప్తంగా సమ్మెబాట పట్టాయి.‘బకాయిలు చెల్లించా­లని వైద్యశాఖ అధి­కా­రుల ను­ంచి సీఎం వరకూ అందరినీ కలి­సి పలు దఫాలుగా కోరాం.. ఇబ్బందులను వివరించాం. ప్రతినెలా రూ.330 కోట్ల మేర వైద్యసేవలను నెట్‌వర్క్‌ ఆస్పత్రులు అందిస్తున్నాయి. కానీ, ప్రభుత్వం నుంచి చెల్లింపులు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. దీంతో అప్పుల ఊబిలోకి కూరుకుపోయాం. ఇప్పుడు బ్యాంకులు కూడా మాకు అప్పులు మంజూరు చేయడంలేదు. ఈ పరి­స్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. గత్యంతరంలేని పరిస్థి­తుల్లో సేవ­లు నిలిపేస్తున్నాం. అర్థం చేసుకోండి’.. అంటూ నెట్‌­వర్క్‌ ఆస్పత్రుల వద్ద యాజమాన్యాలు పోస్టర్లు అతికించాయి.ఎన్ని రకాలుగా అడిగినా పట్టించుకోని సర్కారు..సోమవారం ఆస్పత్రులకు వచ్చిన ఆరోగ్యశ్రీ లబ్ధి­­దా­­­రులను పథకం కింద యాజమాన్యాలు చేర్చుకోలేదు. నగదు రహిత సేవలు పూర్తిగా ఆపేశామని.. డబ్బులు కట్టి వైద్యసేవలు పొందాలని సూచించారు. దీంతో పేదరోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. వాస్తవానికి.. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఈ ఏడాది జనవరి 6 నుంచి ఆరోగ్యశ్రీ కింద ఓపీ, ఈహెచ్‌ఎస్‌ కింద అన్ని రకాల వైద్యసేవలను నెట్‌వర్క్‌ ఆస్పత్రులు నిలిపేశాయి. అయినప్పటికీ ప్రభుత్వంలో చల­నం లేకపోవడంతో సోమవారం (ఏప్రిల్‌ 7) నుంచి వైద్య­సేవలు ఆపేస్తామని నెలరోజుల ముందే ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (ఆశా) ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. తమ సమస్యలపై కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆశా ప్రతినిధులు వినతిపత్రాలు ఇచ్చారు. బిలు­­్లలు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. కనీసం రూ.1,500 కోట్లు అయినా మంజూరు చేయకపోతే సేవలు కొనసాగించబోమని ప్ర­భు­­త్వానికి తేలి్చచెప్పారు. ఇన్ని రకాలుగా ఆస్ప­త్రుల యాజమాన్యాలు హెచ్చరించినా ప్ర­భు­త్వం పట్టించుకోకపోవడంతో చేసేదిలేక సమ్మె­లోకి వెళ్లా­రు. ఆరోగ్య­శ్రీ అమలును బీమా రూపంలో ప్రై­వే­ట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలకు కట్టబెట్టడం కోస­ం టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యంతో చెల­గాటం ఆడుతోందని ప్రజలు మండిపడుతున్నా­రు.పేదలకు ఇబ్బందికరం.. నా కొడుకు ఐదేళ్ల నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. కాకినాడలోని ఒక కార్పొరేట్‌ ఆస్పత్రికి వచ్చాం. ఆరోగ్యశ్రీ సేవలు బందయ్యాయని చెప్పారు. ఇప్పుడేం చేయాలో పాలుపోవడంలేదు. కార్పొరేట్‌ వైద్య­సేవలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్య­లు తీసుకోవాలి. ఆరోగ్యశ్రీ వైద్యసేవలు నిలిచిపోవడం పేదలకు ఇబ్బందికరం. – కె. సత్యవతి, జగన్నాథపురం, కాకినాడ గుండె నొప్పితో వస్తే ఉచిత సేవలు లేవన్నారు.. మూడ్రోజుల నుంచి ఆయాసం, గుండె నొప్పి­తో బాధపడుతున్నా. నంద్యాల పట్టణంలో ఆరోగ్యశ్రీ సేవలు అందించే ఓ ప్రైవేటు ఆçస్పత్రికి వచ్చాం. నా భర్త సంజీవరాజు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. డాక్టర్‌ పరీక్షలు చేసి ఆస్పత్రిలో అడ్మిట్‌ కావాలన్నారు. అయితే, ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశామని చెప్పారు. ఉచితంగా వైద్యం చేసేందుకు వీలుపడదన్నారు. రూ.15 వేల దాకా ఖర్చవుతుందని చెప్పడంతో అంత డబ్బులేక వెనుదిరిగాం. మాలాంటి పేదలకు పెద్ద జబ్బులు వస్తే ఎవరు దిక్కు? – మల్లేశ్వరి, నంద్యాలఆపరేషన్‌ చేస్తారో లేదో.. ప్రమాదవశాత్తు కుడి భుజం విరిగింది. ఆపరేషన్‌ కోసం ఆరోగ్యశ్రీ కార్డుతో ఆస్పత్రికి వచ్చాను. రిజి్రస్టేషన్‌లో పేరు రాసుకున్నారుగానీ డాక్టర్‌ అందుబాటులో లేరని చెబుతున్నారు. ఆయన వస్తేనే ఆపరేషన్‌ గురించి మాట్లాడాలని అంటున్నారు. ఇప్పుడేదో సమ్మె అంటున్నారు. ఆపరేషన్‌ చేస్తారో లేదో అని ఆందోళనగా ఉంది. – కె. సత్యం, నిద్దాం, జి.సిగడాం మండలం, శ్రీకాకుళం జిల్లాఆరోగ్యశ్రీ అంటేనే.. లేదు పొమ్మంటున్నారు.. మాది తిరుపతి కొర్లగుంట, నా భర్త భవన నిర్మాణ కారి్మకుడు. ఆయనకు కొంతకాలంగా ఛాతీలో నొప్పి వ­స్తోంది. దీంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి సోమవారం ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని వెళ్లాం. ఆరోగ్య­శ్రీ కింద ఓపీలు ఇవ్వడంలేదు, వెళ్లిపొమ్మన్నారు. డ­బ్బు­లు కడితేనే ఓపీ ఇస్తామని తెగేసి చెప్పారు. దీంతో చేసేదిలేక ఇంటికి వచ్చేశాం. అప్పు కోసం ప్రయతి్నస్తు­న్నాం. గత ప్రభుత్వంలో మా నాన్నకు గుండె ఆపరేషన్‌ చేయించాం. ఒక్క రూ­పాయి లేకుండా వైఎస్సాఆర్‌ ఆరోగ్యశ్రీతో ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేశా­రు. పైగా.. ఇంటికొచ్చిన మూడునెలలు పాటు నెలకు రూ.5వేలు చొప్పున ఖర్చు­ల­కు ఇచ్చారు. – సావిత్రమ్మ, దినసరి కూలి, తిరుపతిసంజీవని’ ఊపిరి తీసిన చంద్రబాబు సర్కార్‌ఈ చిత్రం చూడండి.. వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేటకు చెందిన మహబూబ్‌ సాబ్‌కు సుస్తీ చేసి ప్రాణం మీదకు వచ్చింది. ఫోన్‌ చేస్తే 108 కుయ్‌ కుయ్‌మని రాలేదు సరికదా! కనీసం పలకలేదు. దీంతో మహబూబ్‌ కుటుంబానికి ఏంచేయాలో పాలుపోలేదు. చంద్రబాబు పాలనలో 108ని నమ్ముకోవడం దండగని అర్థం చేసుకున్న ఆ కుటుంబం అప్పటికప్పుడు బాడుగకు ఓ ట్రాలీ మాట్లాడుకున్నారు. ఆ ట్రాలీకి దుప్పటి కప్పి.. అందులోనే మహబూబ్‌ను కడప రిమ్స్‌కు చికిత్స కోసం తీసుకువచ్చారు.దిగొచ్చిన ప్రభుత్వం..ఆరోగ్యశ్రీ సేవలను నెట్‌వర్క్‌ ఆస్పత్రులు స్తంభింపజేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. ‘ఆశ’ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు అత్యవసర సమావేశం నిర్వహించి చర్చలు జరిపారు. పెండింగ్‌ బకాయిలు చెల్లింపుల కోసం వెంటనే రూ.500 కోట్లు విడుదల చేయడానికి ఆయన ఆమోదం తెలిపారు. మిగిలిన బకాయిల చెల్లింపుపై హామీ ఇచ్చారు. దీంతో సేవలను తిరిగి ప్రారంభిస్తున్నామని ‘ఆశ’ అధ్యక్షుడు డాక్టర్‌ విజయ్‌కుమార్‌ సోమవారం రాత్రి పొద్దు­పో­యిన తరువాత వెల్లడించారు. ఈనెల 10 తర్వాత ఆరోగ్యశాఖ మంత్రితో ప్రత్యేక సమావేశం ఉంటుందన్నారు. ఇం­దులో పెండింగ్‌ బకాయిలు, భవిష్యత్‌ చెల్లింపు షెడ్యూల్, ప్యాకేజీ రివిజన్లు వంటి అంశాలపై చర్చిస్తామన్నారు.

Deputy CM Bhatti orders withdrawal of cases against HCU students9
కేసులు ఎత్తేయండి.. హెచ్‌సీయూ విద్యార్థులపై భట్టి ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోలీసు అధికారులను ఆదేశించారు. జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ క్రమంలో న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీస్‌ అధికారులకు తగు సూచనలు చేయవలసిందిగా న్యాయశాఖ అధికారులను ఆదేశించారు. కంచ గచ్చిబౌలి భూముల వివాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల సబ్‌ కమిటీ సోమవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం అధ్యక్షతన సమావేశమైంది. కమిటీ సభ్యులైన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్‌ రెడ్డి, ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ శివధర్‌రెడ్డి, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అభిషేక్‌ మహంతి ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌ విశ్వవిద్యాలయ ఉపాధ్యాయ సంఘం (యూహెచ్‌టీఏ), పౌర సమాజ ప్రతినిధులు కూడా వారితో సమావేశమై పలు డిమాండ్లు ప్రస్తావించారు. ఈ సమావేశం అనంతరం డిప్యూటీ కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్కడ పోలీసు పహారా తప్పనిసరి పౌర సమాజ ప్రతినిధులు, యూహెచ్‌టీఏ ప్రస్తావించిన పలు అంశాలు, డిమాండ్లపై మంత్రుల ఉప కమిటీ కీలక ప్రకటన చేసింది. యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఇతర ప్రాంతాల నుంచి పోలీసు బలగాల ఉప సంహరణ కోసం హెచ్‌సీయూ వీసీకి లేఖ రాస్తామని హామీ ఇచి్చంది. విద్యార్థులు, హాస్టళ్ల భద్రతకు సంబంధించి వీసీ హామీ ఇస్తే బలగాలను ఉపసంహరిస్తామని పేర్కొంది. అయితే వివాదానికి కేంద్ర బింధువుగా ఉన్న 400 ఎకరాల్లో మాత్రం పోలీసు బందోబస్తు కొనసాగుతుందని మంత్రులు స్పష్టం చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 400 ఎకరాల భూమిని రక్షించేందుకు పోలీసు పహారా తప్పనిసరి అని పేర్కొన్నారు. అధ్యాపకులు, విద్యార్థులు సహా ఎవరినీ 400 ఎకరాల్లో సర్వేకు అనుమతించలేమని తెలిపారు. విద్యార్థులు కోరిన విధంగా యూనివర్సిటీని సందర్శించడానికి మంత్రుల కమిటీ సానుకూలంగా ఉందని, అయితే సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికిప్పుడు యూనివర్సిటీకి రాలేమని చెప్పారు. అయితే విద్యార్థులపై కేసులను సాధ్యమైనంత త్వరగా ఉపసంహరించుకునేలా పోలీసు, న్యాయ శాఖతో సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రులు హామీ ఇచ్చారు. డిమాండ్లు అంగీకరిస్తేనే జేఏసీ నేతలు వస్తారు: యూహెచ్‌టీఏ మంత్రుల సబ్‌ కమిటీని కలిసిన యూనివర్సిటీ అధ్యాపక, పౌర సమాజ ప్రతినిధులు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. హెచ్‌సీయూ నుంచి పోలీసు బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, నిషేధాజ్ఞలను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై ఇటీవల నమోదు చేసిన అన్ని కేసులను ఉపసంహరించుకోవడంతో పాటు పోలీసు కస్టడీలో ఉన్న ఇద్దరు విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర సాధికార కమిటీ క్యాంపస్‌ను సందర్శించే ముందు 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూమిలో నష్టాన్ని అంచనా వేయడంతో పాటు జీవవైవిధ్య సర్వే నిర్వహించడానికి నిపుణులైన అధ్యాపకులు, పరిశోధకులకు అనుమతి ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్లే విద్యార్థి జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఈ సమావేశానికి హాజరు కాలేదని మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. పైన పేర్కొన్న తక్షణ డిమాండ్లు నెరవేర్చిన తర్వాతే విద్యార్థి జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నాయకులు మంత్రుల కమిటీ నిర్వహించే సమావేశానికి హాజరవుతారని యూహెచ్‌టీఏ, పౌర సమాజ ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రొఫెసర్లు సౌమ్య, శ్రీపర్ణ దాస్, భంగ్యా భూక్యా, పౌర సమాజ ప్రతినిధులు విస్సా కిరణ్‌ కుమార్, వి.సంధ్య, కె.సజయ, ఇమ్రాన్‌ సిద్దికీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 IPL 2025: Royal Challengers Bangaloru beat Mumbai Indians by 12 runs10
IPL 2025: ఆర్‌సీబీ అదరహో

ముంబై విజయలక్ష్యం 222 పరుగులు... ఆర్‌సీబీ చక్కటి బౌలింగ్‌తో స్కోరు 99/4 వద్ద నిలిచింది. ముంబై గెలిచేందుకు 8 ఓవర్లలో 123 పరుగులు చేయడం అసాధ్యంగా అనిపించింది. అయితే అసాధారణ ఆటతో తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా పోరాడారు. కేవలం 34 బంతుల్లో 89 పరుగులు జోడించి విజయం దిశగా నడిపించారు. అయితే ఆరు పరుగుల వ్యవధిలో వీరిద్దరిని అవుట్‌ చేసి బెంగళూరు చివరకు మ్యాచ్‌పై పట్టు నిలబెట్టుకుంది. అంతకుముందు కెప్టెన్‌ రజత్‌ పాటీదార్, విరాట్‌ కోహ్లి, జితేశ్‌ శర్మ దూకుడుతో బెంగళూరు ప్రత్యర్థికి సవాల్‌ విసిరింది. ముంబై: వాంఖెడే మైదానంలో పదేళ్ల తర్వాత ముంబైపై బెంగళూరు విజయం సాధించింది. సోమవారం చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఆర్‌సీబీ 12 పరుగులతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రజత్‌ పాటీదార్‌ (32 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లి (42 బంతుల్లో 67; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా... జితేశ్‌ శర్మ (19 బంతుల్లో 40 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), దేవదత్‌ పడిక్కల్‌ (22 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ (29 బంతుల్లో 56; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీ చేయగా, హార్దిక్‌ పాండ్యా (15 బంతుల్లో 42; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించాడు. సమష్టి ప్రదర్శన... ఇన్నింగ్స్‌ రెండో బంతికే ఫిల్‌ సాల్ట్‌ (4) వెనుదిరగ్గా... కోహ్లి, పడిక్కల్‌ కలిసి దూకుడుగా స్కోరుబోర్డును నడిపించారు. బౌల్ట్‌ ఓవర్లో వీరిద్దరు కలిసి 16 పరుగులు రాబట్టారు. చహర్‌ ఓవర్లో పడిక్కల్‌ వరుసగా 6, 6, 4 బాదగా పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 73 పరుగులకు చేరింది. చక్కటి షాట్లు ఆడిన కోహ్లి 29 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. మరో భారీ షాట్‌కు ప్రయతి్నంచి పడిక్కల్‌ వెనుదిరగడంతో 91 పరుగుల (52 బంతుల్లో) రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత సాంట్నర్‌ ఓవర్లో 2 సిక్స్‌లతో పాటీదార్‌ జోరు ప్రదర్శించాడు. హార్దిక్‌ ఒకే ఓవర్లో కోహ్లి, లివింగ్‌స్టోన్‌ (0)లను అవుట్‌ చేయగా, బౌల్ట్‌ ఓవర్లో ఆర్‌సీబీ బ్యాటర్లు పాటీదార్, జితేశ్‌ కలిసి 18 పరుగులు సాధించారు. 16 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 169/4. ఆఖరి 4 ఓవర్లలో బెంగళూరు 52 పరుగులు సాధించింది. భారీ భాగస్వామ్యం... భువనేశ్వర్‌ వేసిన తొలి ఓవర్లో 6, 4తో దూకుడుగా ఆటను మొదలు పెట్టిన రోహిత్‌ శర్మ (9 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్‌)... దయాళ్‌ తర్వాతి ఓవర్లో వరుసగా 2 ఫోర్లు కొట్టి తర్వాతి బంతికి బౌల్డయ్యాడు. రికెల్టన్‌ (17), జాక్స్‌ (22) కూడా మెరుగ్గానే ఆరంభించినా ఎక్కువ సేపు నిలవలేకపోయారు. బౌలర్‌ దయాళ్, కీపర్‌ జితేశ్‌ సమన్వయలోపంతో సులువైన క్యాచ్‌ను వదిలేయడంతో బతికిపోయిన సూర్యకుమార్‌ యాదవ్‌ (26 బంతుల్లో 28; 5 ఫోర్లు)ను అదే ఓవర్లో మరో రెండు బంతుల తర్వాత పెవిలియన్‌ పంపించి దయాళ్‌ సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత సుయాశ్‌ ఓవర్లో తిలక్‌ 2 ఫోర్లు, సిక్స్‌...హాజల్‌వుడ్‌ వేసిన తర్వాతి ఓవర్లో హార్దిక్‌ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు బాది విజయంపై ఆశలు రేపారు. గత మ్యాచ్‌లో ‘రిటైర్ట్‌ అవుట్‌’గా పంపించిన కసి తిలక్‌ బ్యాటింగ్‌లో కనిపించింది. తర్వాతి మూడు ఓవర్లలో కూడా ఈ జోరు కొనసాగి 43 పరుగులు వచ్చాయి. అయితే తిలక్‌ వికెట్‌తో ఆట మళ్లీ బెంగళూరు వైపు మొగ్గింది. స్కోరు వివరాలు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (బి) బౌల్ట్‌ 4; కోహ్లి (సి) నమన్‌ (బి) హార్దిక్‌ 67; పడిక్కల్‌ (సి) జాక్స్‌ (బి) పుతూర్‌ 37; పాటీదార్‌ (సి) రికెల్టన్‌ (బి) బౌల్ట్‌ 64; లివింగ్‌స్టోన్‌ (సి) బుమ్రా (బి) హార్దిక్‌ 0; జితేశ్‌ (నాటౌట్‌) 40; డేవిడ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 221. వికెట్ల పతనం: 1–4, 2–95, 3–143, 4–144, 5–213. బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–57–2, చహర్‌ 2–0–29–0, బుమ్రా 4–0–29–0, జాక్స్‌ 1–0–10–0, సాంట్నర్‌ 4–0–40–0, హార్దిక్‌ 4–0– 45–2, విఘ్నేశ్‌ 1–0–10–1. ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (బి) దయాళ్‌ 17; రికెల్టన్‌ (ఎల్బీ) (బి) హాజల్‌వుడ్‌ 17; జాక్స్‌ (సి) కోహ్లి (బి) కృనాల్‌ 22; సూర్యకుమార్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) దయాళ్‌ 28; తిలక్‌వర్మ (సి) సాల్ట్‌ (బి) భువనేశ్వర్‌ 56; హార్దిక్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) హాజల్‌వుడ్‌ 42; నమన్‌ ధీర్‌ (సి) దయాళ్‌ (బి) కృనాల్‌ 11; సాంట్నర్‌ (సి) డేవిడ్‌ (బి) కృనాల్‌ 8; దీపక్‌ చహర్‌ (సి) డేవిడ్‌ (బి) కృనాల్‌ 0; బౌల్ట్‌ (నాటౌట్‌) 1; బుమ్రా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–21, 2–38, 3–79, 4–99, 5–188, 6–194, 7–203, 8–203, 9–209. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–48–1, యశ్‌ దయాళ్‌ 4–0–46–2, హాజల్‌వుడ్‌ 4–0–37–2, సుయాశ్‌ శర్మ 4–0–32–0, కృనాల్‌ పాండ్యా 4–0–45–4.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement