Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Google lays off hundreds of employees amid ongoing restructuring1
గూగుల్‌లో ఆగని లేఆఫ్‌లు.. మళ్లీ వందలాది తొలగింపులు

ప్రపంచ టెక్‌ దిగ్గజం గూగుల్‌లో (Google) లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. తన ప్లాట్‌ఫామ్స్ అండ్ డివైజెస్ విభాగం నుంచి తాజాగా వందలాది మంది ఉద్యోగులను తొలగించిందని ( layoff )ఆండ్రాయిడ్, పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లు, క్రోమ్ బ్రౌజర్‌లో పనిచేసే ఉద్యోగులు ఇందులో ఉన్నారని ‘ది ఇన్ఫర్మేషన్‌’ అనే వార్తా నివేదిక పేర్కొంది. అయితే ఎంత మంది ఉద్యోగులు తొలగింపులకు గురయ్యారన్న వివరాలు వెల్లడి కాలేదు.తొలగింపు వెనుక కారణం..కార్యకలాపాలను క్రమబద్ధీకరణ, సామర్థ్య పెంపు కోసం గూగుల్ చేస్తున్న విస్తృత ప్రయత్నాలకు అనుగుణంగా ఈ సిబ్బంది పునర్‌వ్యవస్థీకరణ చేపట్టినట్లు తెలుస్తోంది. గత ఏడాది గూగుల్ తన ఆండ్రాయిడ్, క్రోమ్ టీమ్‌లను పిక్సెల్ అండ్ డివైజెస్ గ్రూప్ కింద విలీనం చేయడంతో ప్రారంభమైన సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా ఈ తొలగింపులు జరిగాయి. జనవరిలో కంపెనీ స్వచ్ఛంద నిష్క్రమణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ తాజా ఉద్యోగ కోతలు ఆ చొరవకు కొనసాగింపు అని సూచిస్తున్నాయి.గూగుల్ ప్రకారం.. చురుకుదనం, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడమే పునర్నిర్మాణం లక్ష్యం. ఇది కంపెనీ తన ప్రధాన ఉత్పత్తులు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. వందలాది ఉద్యోగులకు నష్టం కలిగించే ఈ చర్య వ్యయ తగ్గింపు, వనరుల ఆప్టిమైజ్ కోసం మొత్తం టెక్‌ పరిశ్రమ అవలంభిస్తున్న ధోరణిని ప్రతిబింబిస్తోంది.ఇన్నోవేషన్ పై ప్రభావంపునర్ వ్యవస్థీకరణకు గూగుల్ తీసుకున్న నిర్ణయం ఉత్పత్తుల అభివృద్ధి, ఆవిష్కరణలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళనలను రేకెత్తిస్తోంది. కీలక బృందాల్లో తక్కువ మంది ఉద్యోగులతో, సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ పురోగతిలో గూగుల్ ఎలా ముందుకు వెళ్తుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇంకా నియామకాలు జరుగుతున్నాయని, ఇన్నోవేషన్ పై పూర్తిగా వెనక్కి తగ్గకుండా వనరులను పునర్వినియోగం చేస్తున్నామని కంపెనీ పేర్కొంది.టెక్ పరిశ్రమలో తొలగింపులుఉద్యోగాల కోత, పునర్నిర్మాణ చర్యలను అమలు చేస్తోన్న టెక్‌ కంపెనీ గూగుల్ ఒక్కటే కాదు. ఆర్థిక అనిశ్చితి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆటోమేషన్ వరకు కారణాలను చూపుతూ అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ సహా పలు బడా టెక్ కంపెనీలు గత ఏడాది ఉద్యోగుల తొలగింపును ప్రకటించాయి.

IPL 2025: Kolkata Knight Riders humiliate Chennai Super Kings by 8 wickets 2
న‌రైన్ ఆల్ రౌండ్ షో.. సీఎస్‌కేపై కేకేఆర్ గ్రాండ్ విక్ట‌రీ

ఐపీఎల్‌-2025లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆట‌తీరు ఏ మాత్రం మార‌లేదు. ఈ మెగా టోర్నీలో భాగంగా చెపాక్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘోర ఓట‌మి పాలైంది. మ‌రోసారి సీఎస్‌కే బ్యాట‌ర్లు దారుణ ప్ర‌దర్శ‌న క‌న‌బ‌రిచారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి కేవ‌లం 103 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. సీఎస్‌కే బ్యాట‌ర్ల‌లో శివ‌మ్ దూబే(31 నాటౌట్‌) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. విజ‌య్ శంక‌ర్‌(29) కాస్త ఫ‌ర్వాలేద‌న్పించాడు. కేకేఆర్ బౌల‌ర్ల‌లో సునీల్ న‌రైన్ మూడు కీల‌క మూడు వికెట్లు ప‌డ‌గొట్టి సీఎస్‌కే ప‌త‌నాన్ని శాసించాడు. న‌రైన్‌తో పాటు హ‌ర్షిత్ రానా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి త‌లా రెండు వికెట్లు, వైభ‌వ్ ఆరోరా, మోయిన్ అలీ త‌లా వికెట్ సాధించారు. కెప్టెన్ ధోని(1) సైతం తీవ్రనిరాశ‌ప‌రిచాడు.సునీల్ న‌రైన్ విధ్వంసం..అనంత‌రం 104 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని కేకేఆర్ రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి కేవ‌లం 10.1 ఓవ‌ర్ల‌లోనే చేధించింది. కేకేఆర్ బ్యాట‌ర్ల‌లో సునీల్ న‌రైన్‌(18 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 44) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. డికాక్‌(23 ), ర‌హానే(20 నాటౌట్‌), రింకూ సింగ్‌(15 నాటౌట్‌) రాణించారు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో నూర్ అహ్మ‌ద్‌, అన్షుల్ కాంబోజ్ త‌లా వికెట్ సాధించారు. ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టిన సునీల్ న‌రైన్‌కు ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. కాగా సీఎస్‌కేకు వ‌రుస‌గా ఇది ఐదో ఓట‌మి కావ‌డం గ‌మ‌నార్హం.చ‌ద‌వండి: IPL 2025: చ‌రిత్ర సృష్టించిన ఎంఎస్‌ ధోని.. ఐపీఎల్ హిస్టరీలోనే

TGIIC Lands Are Key to Govt Revenue: Telangana3
ఖజానాకు భూమ్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే అత్యధికంగా పారిశ్రామిక ల్యాండ్‌ బ్యాంక్‌ను కలిగిన తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ).. రాష్ట్ర ఖజానాకు బంగారు బాతులా మారింది. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైన నిధుల సేకరణలో సర్కారుకు కల్పతరువులా ఉపయోగపడుతోంది. ఎఫ్‌ఆర్‌బీఎం వంటి రిజర్వు బ్యాంకు నిబంధనల పరిధిలోకి రాకుండా రాష్ట్ర ఖజానాకు పన్నేతర ఆదాయాన్ని సమకూర్చడంలో టీజీఐఐసీ భూములు అత్యంత కీలకంగా మారుతున్నాయి.నిధులు అవసరమైనప్పుడల్లా పారిశ్రామిక అభివృద్ధి పేరిట టీజీఐఐసీ భూముల వేలం వైపు ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయి. ఇటీవల రంగారెడ్డి జిల్లా కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి తాకట్టుతో టీజీఐఐసీ ప్రభుత్వానికి రూ.10 వేల కోట్ల రుణం సమకూర్చినట్లు అధికార వర్గాల సమాచారం. అంతకుముందు కూడా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇటీవలి కాలం వరకు టీజీఐఐసీ భూముల ద్వారా రూ. వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వాలు సమకూర్చుకోవడం గమనార్హం. సొంతగా, హెచ్‌ఎండీఏతో కలిసి..: తెలంగాణ ఆవిర్భావం మొదలుకుని 2023 వరకు టీజీఐఐసీ భూముల వేలం ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి రూ.21 వేల కోట్లు ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. టీజీఐఐసీ కొన్నిసార్లు సొంతగా, మరికొన్ని సందర్భాల్లో హెచ్‌ఎండీఏతో కలిసి భూములు వేలం వేయడంతో పాటు పరిశ్రమలకు భూముల కేటాయింపులు జరిపింది. 2014 నుంచి 2023 మధ్యకాలంలో హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ ద్వారా వివిధ సందర్భాల్లో 811 ఎకరాలను వేలం వేయడం లేదా కేటాయింపుల ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. తద్వారా రూ.21 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. వాణిజ్యం, రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి పేరిట.. హైదరాబాద్‌ పరిసరాల్లోని కోకాపేట, ఖానామెట్‌ భూములు వేలం వేయడం ద్వారా రూ.10 వేలు కోట్లు సమీకరణ లక్ష్యంగా 2019లో సన్నాహాలు ప్రారంభించారు. ఈ మేరకు 2023లోనే జరిగిన భూముల వేలం ద్వారా రూ.2,729 కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్రంలో వాణిజ్యం, రియల్‌ ఎస్టేట్‌ రంగాల అభివృద్ధి కోసం ఈ భూములను వేలం వేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. వేలం ద్వారా సమకూరిన నిధులను రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి, హైదరాబాద్‌లో మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలు కోసం వెచ్చించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. 400 ఎకరాల తనఖాతో.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కంచ గచ్చిబౌలి సర్వే నంబరు 25(పి)లోని 400 ఎకరాలను ఐసీఐసీఐ బ్యాంకుకు తనఖా పెట్టి రూ.10 వేల కోట్ల రుణ సమీకరణ చేసింది. రైతు భరోసా ఇచ్చేందుకు ఈ నిధులు వెచ్చిస్తామని ప్రకటించింది. ఆ తర్వాత తాకట్టులో ఉన్న ఇవే భూములను అభివృద్ధి చేసి వేలం వేయడం ద్వారా రూ.20 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల మేర నిధులు సమీకరించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలే తాజాగా పెద్దయెత్తున వివాదానికి కారణమయ్యాయి. టాప్‌లో టీజీఐఐసీ పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో దేశంలోని అనేక రాష్ట్రాలు మౌలిక సదుపాయాల సంస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. ఇదే తరహాలో రాష్ట్రంలో టీజీఐఐసీ ఏర్పాటైంది. అయితే దేశంలోని ఇతర సంస్థలతో పోల్చుకుంటే టీజీఐఐసీ వద్ద అత్యధికంగా సుమారు లక్షన్నర ఎకరాల ల్యాండ్‌ బ్యాంకు ఉన్నట్టు సమాచారం. ల్యాండ్‌ బ్యాంకు పరంగా చూస్తే తెలంగాణ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (ఎంఐడీసీ– 48,437 ఎకరాలు), తమిళనాడు (సిప్‌కాట్‌– 48,198 ఎకరాలు) ఉన్నాయి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హరియాణా రాష్ట్రాల పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థలు గణనీయంగా ల్యాండ్‌ బ్యాంక్‌లను కలిగి ఉన్నాయి. మేడ్చల్‌ –సిద్దిపేట జోన్‌లో ఏకంగా 42,431 ఎకరాలు టీజీఐఐసీ పరిధిలో సైబరాబాద్, మేడ్చల్‌–సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, పటాన్‌చెరు, శంషాబాద్, యాదాద్రి, ఖమ్మం, వరంగల్‌..ఇలా తొమ్మిది పారిశ్రామిక జోన్లు ఉన్నాయి. అయితే ఒక్క మేడ్చల్‌– సిద్దిపేట జోన్‌లోనే ఏకంగా 42,431 ఎకరాలు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇండియా ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ బ్యాంక్‌ లెక్కల ప్రకారం తెలంగాణలో 71,613 ఎకరాల్లో ఐటీ, పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటిలో 53,550 ఎకరాల్లో ఐటీ, ఐటీ అనుబంధ సేవలకు చెందిన సంస్థలు ఉన్నాయి. 2,634 ఎకరాల్లో ఎల్రక్టానిక్స్, హార్డ్‌వేర్‌ సంస్థలు, మరో 10,039 ఎకరాల్లో రక్షణ, ఏరోస్పేస్, ఆహార ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్, ఆటోమొబైల్స్, రసాయనాలు, ఫార్మాస్యూటికల్స్‌ రంగాలకు చెందిన పరిశ్రమలు ఉన్నాయి.

Suryapet District Court Sensational Verdict4
సూర్యాపేట కోర్టు సంచలన తీర్పు.. కూతురిని చంపిన తల్లికి ఉరిశిక్ష

సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కూతుర్ని చంపిన కేసులో తల్లికి జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించింది. మానసిక స్థితి సరిగ్గాలేదని కన్న కూతుర్నే తల్లి చంపేసింది. మోతె మండలం మేకపాటి తండాలో 2021, ఏప్రిల్‌లో జరిగిన ఘటనలో ఇవాళ జిల్లా న్యాయస్థానం తీర్పు చెప్పింది.నాంపల్లి పోక్సో కోర్టు సంచలన తీర్పు..నాంపల్లి పోక్సో కోర్టు కూడా ఇవాళ సంచలన తీర్పునిచ్చింది. బాలికపై లైంగికదాడి యత్నం చేసిన నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. 2023లో రాజ్ భవన్ మక్త ప్రాంతంలో బాలికపై అత్యాచారయత్నం జరిగింది. సెల్‌ఫోన్‌ ఇస్తానని చెప్పి బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి శ్రీనివాస్‌ అనే వ్యక్తి లైంగికదాడి యత్నం చేశాడు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌పై పోలీసులపై కేసు నమోదు చేశారు. శ్రీనివాస్‌కు 25 జైలు శిక్షతో పాటు కోర్టు జరిమానా విధించారు.

BJP announces alliance with AIADMK in Tamil Nadu5
తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు ఖరారైంది. డీఎంకే-కాంగ్రెస్‌ కూటమికి వ్యతిరేకంగా బీజేపీ-అన్నాడీఎంకేలు కూటమిగా కలిసి పోటీచేయడానికి నిర్ణయించాయి. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత అమిత్‌ షా స్పష్టం చేశారు. ‘ఏడీఎంకే అంతర్గత వ్యవహారంలో మేం జోక్యం చేసుకోం. పొత్తు కోసం ఏడీఎంకే ఎలాంటి షరతులు విధించలేదు. వచ్చ ఎన్నికల్లో కూటమి ఘన విజయం ఖాయం’ అని ఆయన వ్యాఖ్యానించారు. 2026లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఈ రెండు పార్టీలు పొత్తు ఇప్పుడు పెద్ద హాట్‌ టాపిక్‌ గా మారింది. తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం ఖాయంఈ పొత్తులో భాగంగా తమిళనాడు కూటమి సీఎం అభ్యర్థిగా కె పళనిస్వామి అని అమిత్‌ షా ప్రకటించారు. అమిత్‌ షా మాట్లాడుతూ.. 1998 నుంచి ఏఐఏడీఎంకే అనేది ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ.. తమిళనాడు మాజీ సీఎం జయలలితలు ఇద్దరూ కలిసే గతంలో పని చేశారు. ఎన్డీఏ భాగ్వస్వామ్యం అనేది విజయానికి సంకేతం. మా పొత్తుతో మేం మరింత పటిష్టం కానున్నాం. కచ్చితంగా ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మెజార్టీతో ప్రభుత్వాన్ని చేపడతాం’ అని అమిత్‌ షా పేర్కొన్నారు.

CM Chandrababu Naidu Shocking Comments On Schemes6
‘అన్నీ చేయాలనే ఉంది తమ్ముళ్లూ.. కానీ గల్లా పెట్టె ఖాళీ’

ఏలూరు జిల్లా: గతేడాది ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు.. ఒక్కొక్కటిగా కాల గర్భంలో కలిపేసే యత్నాలే జరుగుతున్నాయి. అప్పుడు ఎన్నికల్లో ఏదో రకంగా గెలవాలని ఉద్దేశంతో మోసపూరిత హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చేసరికి మాత్రం డొంక తిరుగుడు మాటలు చెబుతున్నారు. ప్రజలు తమకు ఏదో చేస్తారని ఓటేస్తే.. మరి చంద్రబాబేమో వింత వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘‘అప్పులు పుట్టడం లేదు’’ అపి ప్రజలకు చెబుతున్నారు. అన్నీ చేయాలనే ఉంది తమ్ముళ్లూ.. కానీ గల్లా పెట్టె ఖాళీ అయిపోయింది’ అంటూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజవర్గం అగిరపల్ల్లిలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ అప్పు తేవాలన్నా.. ఇచ్చేవాడులేడు.. అప్పులు ఇవ్వాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. పరపతి ఉంటే.. డబ్బులు తిరిగి ఇస్తారనే నమ్మకం ఉంటే అప్పులు ఇస్తారు.. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు చంద్రబాబు.అసలు హామీలు ఇచ్చినప్పుడు తెలియదా.. అని ఒకవైపు జనం అనుకుంటుంటే, బాబు గారు మాత్రం తాను పథకాల్ని అమలు చేయలేనని పరోక్షంగా జనాలకు చెప్పేస్తున్నారు చంద్రబాబు.

Renu Desai Responds On Her Second Marriage News In Social Media7
నా రెండో పెళ్లిపై అంత ఆసక్తి ఎందుకు?.. రేణు దేశాయ్ ఆగ్రహం

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. తనపై వస్తున్న వార్తలపై స్పందించారు. తన రెండో పెళ్లిపై మీకు ఎంత ఆసక్తి అని ప్రశ్నించారు. ఇలాంటి వార్తలతో సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? అని రేణు దేశాయ్ నిలదీశారు. సోషల్ మీడియాలో తన రెండో పెళ్లిపై వస్తున్న వార్తలపై ఆమె మండిపడ్డారు.కాగా.. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో తన రెండో పెళ్లి గురించి రేణు దేశాయ్ మాట్లాడారు. దీంతో పాటు పలు అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. రాజకీయాల్లోకి రావడంపై కూడా క్లారిటీ ఇచ్చారు. అలాగే సమాజంలో జరుగుతున్న పలు విషయాలపై కూజా మాట్లాడారు. ఇవన్నీ వదిలేసి కేవలం తన రెండో పెళ్లినే ఎందుకు హైలెట్ చేస్తున్నారంటూ రేణు దేశాయ్ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ చేశారు.రేణు దేశాయ్ సోషల్ మీడియాలో రాస్తూ..' మీడియా వాళ్లు నా రెండో పెళ్లి గురించి ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారని నాకు అర్థమైంది. నేను గంటకు పైగా మాట్లాడిన పాడ్‌కాస్ట్‌లో మన సమాజానికి ఉపయోగమైన చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడా. కానీ వాటిని గురించి చర్చ చేయరు. సమస్యల కంటే నా రెండో పెళ్లికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. నేను మీ అందరినీ కోరుకునేది ఒక్కటే.. దయ చేసి ఈ 44 ఏళ్ల మహిళ వివాహం గురించి మీ దృష్టిని మరల్చండి'అని పోస్ట్ చేశారు.

Sonali Bendre Ditched Wig At Airport To Face Amid Cancer Treatment8
బట్టతల పర్లేదు..! ఎయిర్‌పోర్ట్‌లో నటి సోనాలికి ఎదురైన ఆ ఘటన

కొన్నిపరిస్థితులు సమాజం ముందుకు రాలేని విధంగా చేస్తాయి. అవమానకరంగా ఉంటాయి. మన తప్పిదం కాకపోయినా..అభ్రతభావంతో ఉండాల్సి వస్తుంటుంది. కొన్ని అనారోగ్యాలు మనకు సోకాయి అని నోరువిప్పడానికే జంకేలా ఉంటాయి. ఒకవేళ్ల ఆ వ్యాధితో బాధపడుతున్నానంటే ..మనల్ని ఎలా చూస్తారన్న భయం, ఆందోళన వంటివి వెన్నాడుతూనే ఉంటాయి. పైగా వాటి కోసం తీసుకునే చికిత్సల కారణంగా మన రూపం మారుతుంది..ఐతే ఆ ఆకృతితో బయటకు రావాలన్నా..గట్స్‌ ఉండాలి. కానీ అలాంటి సమయంలోనే అసలైన అందం ప్రస్ఫుటంగా బయటకొస్తుందట. అదే అంటోంది బాలీవుడ్‌ నటి సోనాలి బింద్రే.బాలీవుడ్‌ నటి సోనాలి బింద్రే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో హిట్‌ సినిమాలతో ప్రేకక్షకుల, విమర్శకుల ప్రశంసలను అందుకున్న తార. టాలీవుడ్‌లో కూడా మంచి సక్సెస్‌ని అందుకుంది. అయితే ఆమె కేన్సర్‌తో పోరాడి గెలిచిన గ్రేట్‌ వారియర్‌ కూడా. ఆ క్రమంలో తనకు ఎదురైన అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తనకు నాలుగో దశ మెటాస్టాటిక్ కేన్సర్‌ ఉన్నట్లు నిర్థారణ అయ్యాక..ట్రీట్‌మెంట్‌ కోసం విదేశాలకు వెళ్లి తిరిగి వస్తున్నప్పుడూ..ఎయిర్‌పోర్ట్‌లో విలేకరులను ఎదుర్కొనాల్సి ఉంది. అయితే కీమోథెరపీ కారణంగా జుట్టు ఉండదన్నవిషయం తెలిసిందే. అందువల్ల సోనాలి ముందుగానే ఆ టైంకి ధరించాల్సిన విగ్‌ తదితరాలను ఏర్పాటు చేసుకున్నారట. కానీ ట్రీట్‌మెంట్‌ కారణంగా వచ్చిన అలసట కారణంగా ఆ విగ్‌ ధరించే ఓపిక తనలో లేదట. వీల్‌ఛైర్‌లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారట. దీంతో ఎయిర్‌పోర్ట్‌లోని విలేకరుల ముందుకు బట్టతలతోనే వెళ్తా పర్లేదు అని చెప్పేశారట తన సన్నిహితులతో. అలానే వారి ముందుకు రాగానే అక్కడున్న ప్రతి జర్నలిస్ట్‌ చాలా అటెన్షన్‌తో తనకు సహకరించారట. సోనాలి అలానే వచ్చి.. వాళ్లు అడిగే ప్రశ్నలకు మాట్లాడుతుంటే..ఒక ఫోటోగ్రాఫర్‌ వచ్చి చాలా అద్భుతంగా ఉంది ఈ రూపం అని అన్నారట. అతనెవరో నాకు తెలియదుగానీ ఇప్పటికీ ఆ మాటలు మర్చిపోలేను అంటోంది సోనాలి. అప్పుడే నాకు తెలిసింది మనల్ని మనం అంగీకరిస్తే..ఆటోమేటిగ్గా సమాజం అంగీకరిస్తుంది. మనలోని బలానికి ప్రతీది తలవంచుతుంది అని ఆ సంఘటన నాకు అర్థమయ్యేలా చేసిందని భావోద్వేగంగా మాట్లాడారు. ఎందుకంటే వాళ్ల నుంచి అలాంటి స్పందన వస్తుందని కలలో కూడా ఊహించలేదు. "అందులోనూ ఆ పరిస్థితుల్లో జాలి వంటివి నచ్చవు..కేవలం ధైర్యంగా మాట్లాడే మాటలే ఇష్టమవుతాయి. అంతేగాదు అక్కడున్నవాళ్లంతా ఆ వ్యాధితో చేసిన పోరాటానికి, ఓర్పుకి సెల్యూట్‌ చేయడం మరింత ధైర్యాన్నిచ్చింది. అంటే ఎప్పుడూ మన లుక్స్‌ కాదు అందాన్ని నిర్దేశించేవి..నిశబ్దంగా మనలో అంతర్లీనంగా ఉండే బలమే అసలైన అందం అని తెలుసుకున్నా." అని అంటోంది సోనాలి. అంతేగాదు వ్యాధుల కొరకు తీసుకునే చికిత్సలు కారణంగా వచ్చే మచ్చలు, శారీరక మార్పులు సిగ్గుపడే విషయాలు కావు..నయం అయ్యి ఆ మహమ్మారి నుంచి బయటపడ్డ వారియర్స్‌ అని అర్థం అంటోంది. అలాంటి సమయంలో తీసుకునే విశ్రాంతిని నిరుత్సాహంతో నింపొద్దు..మనస్సులో శాంతిని నెలకొల్పి..మరింత బలంతో ముందుకొచ్చే సమయంగా భావించాలని చెబుతోంది సోనాలి. (చదవండి: యూట్యూబ్ సెన్సేషన్‌ ఈ 74 ఏళ్ల బామ్మ..! నెలకు రూ.5 లక్షలు పైనే..)

Ysrcp Shyamala Fires On ITdp For Posting Derogatory9
టీడీపీ తోడేళ్లు.. జనసేన గుంటనక్కలపై కేసులేవీ?: శ్యామల

సాక్షి, తాడేపల్లి: టీడీపీ తోడేళ్లు.. జనసేన గుంటనక్కలు సోషల్ మీడియాలో మహిళలపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారని.. ఈ నక్కలు, తోడేళ్లను పెంచి పోషిస్తోంది టీడీపీనే అంటూ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల మండిపడ్డారు. శుక్రవారం ఆమె ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఫ్యామిలీ సహా అందరిపైనా ఇష్టానుసారం ట్రోల్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. బరితెగించి పోస్టులు పెడతున్న వారిపై ఎందుకు కేసులు పెట్టటం లేదంటూ ఆమె ప్రశ్నించారు.‘‘ఒకడ్ని అరెస్టు చేసినట్టు చూపించి మహిళా ఉద్దారకుల్లాగ ప్రమోషన్ చేసుకుంటున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ గుంటనక్కలు, తోడేళ్లను ఎందుకు అరెస్టు చేయలేదు?. వైఎస్ జగన్ ఫ్యామిలీ గురించి ఇష్టానుసారం మాట్లాడిన హోంమంత్రి అనితపై ఎందుకు కేసు పెట్టలేదు?. కేవలం కిరణ్ అనే వ్యక్తిని అరెస్టు చేయటం ఒక డ్రామా. టీడీపీ అంటేనే తెలుగు డ్రామా పార్టీ. అరెస్టయిన చేబ్రోలు కిరణ్ విచారణలో చంద్రబాబు, లోకేష్ పేర్లే చెప్పాడు. మరి చంద్రబాబు, లోకేష్‌లపై ఎందుకు కేసు పెట్టలేదు?’’ అంటూ శ్యామల ప్రశ్నలు గుప్పించారు.‘‘మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే చంద్రబాబు, పవన్ స్టేజీల మీద స్కిట్‌లు చేసుకుంటున్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు సైకో అని దుర్భాషలాడారు. ఇది కరెక్టా?. పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ దారుణంగా కించపరిచేలా మాట్లాడారు. వారిని చూసే వారి కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.ఐ-టీడీపీ పేరుతో విష వృక్షాన్ని పెంచి పోషిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులను పోలీసులు కనీసం చదవడం లేదు. మహిళలు, ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే హోంమంత్రి ఏం చేస్తున్నారు?. ఎంతమంది బాధితులను ఆమె పరామర్శించారు?’’ అని శ్యామల నిలదీశారు.‘‘నా మీద కూడా దారుణంగా ట్రోల్స్ చేశారు. నా వ్యక్తిత్వహనానికి పాల్పడ్డారు. రాష్ట్రంలో పీ4 కాదు ఏ4 అమలవుతోంది. ఏ4 అంటే అరాచకాలు, అక్రమాలు, అఘాయిత్యాలు, అప్పులు’’ అంటూ శ్యామల వ్యాఖ్యానించారు.

How a Jharkhand Shopkeeper Ravi Kumar Turns Millionaire With Dream1110
కిరాణ కొట్టు కుర్రాడు.. ఒక్క రాత్రిలో కోటీశ్వరుడయ్యాడు!

అదృష్టం ఎప్పుడు, ఎవరి తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా జార్ఖండ్‌లోని పాలమూ డివిజన్‌కు చెందిన రవి కుమార్‌ జీవితం ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. కిరాణ కొట్టు నడిపిస్తూ జీవనం సాగించే కుర్రాడు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు! అది కూడా లాటరీతోనో, జూదంతోనో కాదు. డ్రీమ్ 11 అనే ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఆ అదృష్టం వరించింది. ఊహించని ఈ గెలుపుతో రవి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.పాలమూ హెడ్‌క్వార్టర్స్‌కి 7 కిలోమీటర్ల దూరంలో.. చియాంకి రైల్వే స్టేషన్‌ సమీపంలోని తెలియాబండ్‌ ప్రాంతం ఉంది. మహేంద్ర మెహతా కొడుకు రవి కుమార్‌ మెహతా ఎప్పుడు చూసినా కిరాణా షాపులో ఫోన్‌ పట్టుకుని ఇంట్లోవాళ్లతో తిట్లు తింటూ కనిపిస్తుంటాడు. 2018 నుంచి డ్రీమ్‌11 ఆడుతున్న రవి మొన్నటిదాకా రూ.5 లక్షలు పొగొట్టాడు. ఈ విషయంపై ఇంట్లో రోజూ గొడవే. అయినప్పటికీ రవి తన ప్రయత్నం మాత్రం వీడలేదు. చివరగా.. ఆరోజు రానే వచ్చింది.ఏప్రిల్‌ 9వ తేదీ అతని జీవితంలో మరుపురానిరోజు. గుజరాత్‌ టైటానస్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌లో సాయి సుదర్శన్‌ను కెప్టెన్‌గా, రషీద్‌ ఖాన్‌ను వైస్‌ కెప్టెన్‌గా ఎంచుకుని టీం ఏర్పాటు చేశాడు. ఆ నిర్ణయం వర్కవుట్‌ అయ్యింది. డ్రీమ్‌11తో ఒక్క రాత్రిలోనే రూ.3 కోట్లు సంపాదించాడతను. అంతే.. అతని కళ్లలో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. భావోద్వేగంతో తల్లిని గట్టిగా హత్తుకున్నాడు. తప్పుడు పనులు డబ్బులు పొగొట్టావ్‌ అని తిట్టావ్‌ కదా అమ్మా.. ఇప్పుడు చూడు ఎంత సంపాదించానో అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రైజ్‌మనీలో 30 శాతం జీఎస్టీ కిందకు పోయింది.మిగిలిన డబ్బును తన తల్లి ఖాతాలోకి మళ్లించాడు. వచ్చిన డబ్బుతో సగంలో ఆగిపోయిన ఇంటిని కట్టుకోవడంతో పాటు కాస్త పొలం కొనుక్కోవాలని.. ఇలా ప్లానులు గీసుకుంటున్నాడు.లోకల్‌ 18కు ఇచ్చిన ఇంటరర్వ్యూలో మాట్లాడుతూ.. రూ.49 పెట్టుబడితో లక్ష వస్తే చాలానుకున్నాడట. విజయం కోసం ఓపికగా ఎదురు చూడాలని చెబుతున్నాడతను . ఇక వచ్చిన ప్రైజ్‌మనీతో తమ కుటుంబ ఆర్థిక స్థితిని మార్చుకోవాలని అనుకుంటున్నాడతను. 2018 నుంచి డ్రీమ్‌11 ఆడుతున్న రవి.. ఇప్పటిదాకా రెండు ఐడీలతో 621 టీంలను సృష్టించాడు. ఈ క్రమంలోనే కిరాణం షాపు ద్వారా వచ్చిన ఆదాయంలో రూ.5 లక్షలు పొగొట్టాడు. చివరకు.. పడిన చోటే నిలబడి ఆ కుటుంబంతో పాటు చుట్టుపక్కలవాళ్ల నుంచి గ్రేట్‌ అనిపించుకున్నాడు.Disclaimer: ఈ ఆర్టికల్‌ కేవలం జరిగిన ఘటన తెలియజేయడం కోసం మాత్రమే. బెట్టింగ్‌, ఫాంటసీ గేమింగ్‌లను ప్రోత్సహించడం మా ఉద్దేశం ఎంతమాత్రం కాదు

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement