Top Stories
ప్రధాన వార్తలు

దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితులకు ఉరిశిక్ష
సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసు నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష విధించింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. పేలుళ్లకు పాల్పడ్డ ఐదుగురికి హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. నిందితుల అప్పీల్ పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం.. అక్తర్, జియా ఉర్ రహమాన్, తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, అజాజ్ షేక్‌కు ఉరి శిక్ష విధించింది.2013లో జరిగిన ఈ పేలుళ్లలో 18 మంది మృతి చెందగా, 130 మంది వరకు గాయపడ్డారు. ఈ కేసులో కీలక నిందితుడు యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2016లో ఉరి శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు.ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. 2013, ఫిబ్రవరి 21న హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లు సంభవించాయి. ఎన్ఐఏ రంగంలోకి దిగి దర్యాప్తు చేసింది. 157 మంది సాక్ష్యాలను నమోదుచేసింది. ఈ ఘటనలో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ప్రధాన నిందితుడిగా తేలింది.అసదుల్లా అక్తర్, వకాస్, తెహసీన్ అక్తర్, ఎజాజ్ షేక్, సయ్యద్ మక్బూల్‌ని నిందితులుగా గుర్తించారు. మూడేళ్లు ఈ కేసులు విచారించిన ఎన్ఐఏ స్పెషల్ కోర్టు.. నిందితులకు మరణశిక్షను విధించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన యాసిన్ భత్కల్ను 2013లో నేపాల్ సరిహద్దుల్లో పట్టుకున్నారు. ఢిల్లీ, దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసు సహా పలు కేసుల్లో దోషిగా తేలగా తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

కాసేపట్లో పాపిరెడ్డిపల్లికి వైఎస్ జగన్
వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసుల అత్యుత్సాహం👉టీడీపీ నేతల డైరెక్షన్లో ప్రజలను అడ్డుకుంటున్న పోలీసులు👉పాపిరెడ్డిపల్లి గ్రామంంలో నిషేధాజ్ఞలు👉స్థానికులను కూడా అనుమతించిన పోలీసులు👉వాహనాలు వదిలి పొలాల ద్వారా పాపిరెడ్డిపల్లికి వస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులు👉ఎన్ఎస్ గేట్, రామగిరి వద్ద వైఎస్సార్ సీపీ వాహనాలు అడ్డుకుంటున్న పోలీసులు👉పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలుటీడీపీ గూండాల చేతిలో ఇటీవల దారుణ హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం శ్రీసత్యసాయి జిల్లాకు రానున్నారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఈ ఏడాది మార్చి 30న కొందరు టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీలో కీలకంగా వ్యవహరి స్తున్న కురుబ లింగమయ్య కుటుంబంపై దాడికి దిగారు.దాడిలో లింగమయ్య తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. నిందితులు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత దగ్గరి బంధువులు. అయితే మరుసటి రోజు లింగమయ్య అంత్యక్రియలకు ఎవరినీ అనుమతించకుండా పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించారు. ఈ క్రమంలోనే బాధిత కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు.ఈ నెల 8వ తేదీన పాపిరెడ్డిపల్లికి వస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగా మంగళవారం బెంగళూరు నుంచి పాపిరెడ్డిపల్లికి వస్తున్నారు. లింగమయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పనున్నారు. ఆ కుటుంబానికి భరోసా కల్పించనున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ పర్యటన ఏర్పాట్లను ఆయన కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ సోమవారం పరిశీలించారు.

సంపద సృష్టి.. సంపన్నులకు మాత్రమేనా బాబూ!
ఏ దేశమైనా అభివృద్ది చెందడం అంటే ఏమిటి? పేదరికం తగ్గడం.. పేదల ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడడం! కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కలిగిన వారికి మరింత సంపద సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. దీన్నే అభివృద్ధి అనుకోమంటున్నారు. విశాఖపట్నంలో ఒక మాల్ నిర్మాణానికి విలువైన ప్రభుత్వ భూమిని అప్పనంగా కట్టబెట్టడం చూస్తే ఈ ఆలోచనే వస్తుంది ఎవరికైనా. రాష్ట్రం ఎటు పోయినా ఫర్వాలేదు... అమరావతిని మాత్రం అప్పులు తెచ్చిమరీ నిర్మాణాలు చేపట్టి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరిన్ని డబ్బులు సంపాదించుకుంటే చాలన్నట్టుగా ఉండటం ఇంకో ఉదాహరణ.ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుత పేదలను ఊరించి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ తరువాత వాటిని మూలన పడేశారు. బాబు గారికి వత్తాసు పలికి ఉప ముఖ్యమంత్రి హోదా దక్కించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు హామీల ఊసే ఎత్తడం లేదు. లేని వారికి పైసా విదల్చని వీరిద్దరూ లూలూ మాల్‌కు మాత్రం వేల కోట్లు దోచిపెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2017లో చంద్రబాబు ప్రభుత్వం విశాఖ బీచ్ రోడ్డులోని హార్బర్ పార్కు వద్ద సుమారు 14 ఎకరాల భూమిని లూలూ మాల్‌కు కేటాయించింది. మాల్ నిర్మాణం, కన్వెన్షన్ సెంటర్, హైపర్ మార్కెట్ వంటివి ఏర్పాటు చేస్తామన్న ఈ సంస్థ ప్రతిపాదనలకు ఊ కొట్టింది. కానీ ఆరేళ్లపాటు ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకపోవడంతో 2023లో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేసింది.వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు సంస్థకు కేటాయించడంపై విమర్శలు కూడా వచ్చిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. అయితే 2024లో చంద్రబాబు ప్రభుత్వం తిరిగి రావడం... లూలూ గ్రూప్ తెరపైకి వచ్చింది. మళ్లీ భూముల పందేరం జరిగిపోయింది. మాల్స్ వచ్చిన కొత్తలోనైతే వాటిని ప్రోత్సహించేందుకు భూమి ఇచ్చారంటే ఒక అర్థముంది. విశాఖ, విజయవాడల్లో ఇప్పటికే బోలెడన్ని మాల్స్ ఉన్నాయి. అది కూడా నగరానికి దూరంగా పార్కింగ్ తదితర సౌకర్యాలు కల్పించిన ఓకే అనుకోవచ్చు కానీ.. విశాఖ బీచ్ రోడ్లో స్థలమివ్వడమంటే...??? ఈ 14 ఎకరాల స్థలం విలువ రూ.1500 కోట్ల నుంచి రూ. రెండు వేల కోట్ల వరకు ఉండవచ్చు. దీనిని ఏకంగా 99 ఏళ్లకు లీజ్ కు ఇవ్వడం కూడా ఆశ్చర్యమే మరి!వీటన్నింటికీ అదనంగా ఇంకో రూ.170 కోట్ల విలువైన రాయితీలు కూడా ఇచ్చేస్తున్నారు. ఈ మేళ్లన్నింటికీ లూలూ ప్రభుత్వానికి ఇచ్చేదెంత? నెలకు ముష్టి నాలుగు లక్షల చొప్పున ఏడాదికి రూ.50 లక్షలు మాత్రమే. ఇంకో విషయం.. లూలూ ఏమీ ఆషామాషీ కంపెనీ కాదు. కావాలనుకుంటే సొంతంగా భూములు కొనుక్కోగల ఆర్థిక స్థోమత ఉన్నదే. హైదరాబాద్‌లో ఎలాంటి ప్రభుత్వ సహకారం లేకుండానే ఈ సంస్థ భారీ మాల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదంతా లూలూ గ్రూపు సంపద మరింత పెంచేందుకే అన్నది లోగుట్టు!లూలూ ఏమీ పరిశ్రమ కాదు. కేవలం షాపింగ్ ఏరియాకు సదుపాయాలు కల్పించే సంస్థ. ఇలాంటి మాల్స్ వల్ల చిన్న, చిన్న వ్యాపారులంతా ఉపాధి కోల్పోయే అవకాశాలెక్కువ. పోనీ మాల్లో తక్కువ అద్దెకు షాపులిచ్చి సామాన్య దుకాణదారులను ఏదైనా ఆదుకుంటారా? అంటే అదీ లేదు. దుకాణాల అద్దెలపై ప్రభుత్వానికి నియంత్రణే లేదు. అందుకే శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. ఈ కంపెనీకి ఇచ్చే రాయితీల మొత్తం రూ.170 కోట్లతో ప్రభుత్వమే షాపింగ్ మాల్ నిర్మాణం చేపట్టవచ్చని అన్నారు.బీచ్ సమీపంలోని రిషికొండపై జగన్ సర్కార్ ప్రతిష్టాత్మక ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే నానా రచ్చ చేసిన కూటమి పెద్దలు లూలూ గ్రూప్ కు ఇంత భారీ ఎత్తున విలువైన భూమిని ఎలా కేటాయిస్తారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వరు. అమరావతి విషయానికి వస్తే, గత ప్రభుత్వం అక్కడ పేదల కోసం ఇచ్చిన ఏభై వేల ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకుంటున్నామని మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ చాలా గట్టిగా చెబుతున్నారు. ప్రత్యామ్నాయ స్థలాలు ఇస్తామని అంటున్నారు కానీ అది ఎప్పటికి జరుగుతుందో తెలియదు. మరో వైపు సుమారు ఏభై వేల కోట్ల అప్పు తెచ్చి ఖర్చు పెడతామంటున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ నగరం అని ప్రచారం చేసిన పెద్దలు బడ్జెట్ ద్వారా రూ.ఆరు వేల కోట్లు కేటాయించడం ద్వారా వారు అసత్యాలు చెబుతున్న విషయం తేటతెల్లమైంది. ఇక్కడ పేదలకు స్థలాలు ఇవ్వకుండా, ధనికులు, బడా భూ స్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ది చేకూర్చి, వారి సంపద పెంచే దిశగా చంద్రబాబు సర్కార్ సన్నాహం చేస్తోంది.రాజధాని పనుల టెండర్లు తమకు కావల్సినవారికి కేటాయించడం, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడం, సిండికేట్ల ద్వారా కథ నడిపించడంపై విమర్శపూర్వక వార్తలు వస్తున్నా, ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. కనీసం అందులో వాస్తవం లేదని చెప్పే యత్నం చేయడం లేదంటే ఎంతగా తెగించారో అర్థం చేసుకోవచ్చు. అమరావతి గురించి మాత్రం ఎల్లో మీడియాలో నిత్యం ఊదరగొట్టి ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తున్నారు. ఉదాహరణకు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని, పది లక్షల కోట్ల పెట్టుబడులు అని, ఏడున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబితే దానిని బ్యానర్ కథనాలుగా వండి వార్చారు.ఇలాంటివన్నీ కేవలం ప్రజలను మభ్య పెట్టడానికే అన్న సంగతి అర్థమవుతూనే ఉంది. ఒక పక్క ఐఐటీ విద్యార్థులకే ఉద్యోగాలు దొరకడం కష్టమవుతోందని వార్తలు వస్తుంటే చంద్రబాబు మాత్రం లక్షల ఉద్యోగాలు అమరావతికి తరలి వస్తాయని అంటున్నారు. అమరావతి గ్రామాలలో రూ.138 కోట్లతో 14 స్కూళ్లు, 17 అంగన్ వాడీలు, 16 వెల్ నెస్ సెంటర్లను ఆధునికంగా తయారు చేస్తోందని ఎల్లో మీడియా బాకా ఊదింది. మరి ఇదే విధంగా మిగిలిన రాష్ట్రం అంతటా ఎందుకు ఏర్పాటు చేయరు? గత జగన్ ప్రభుత్వం పట్టణం, గ్రామం, ప్రాంతం అన్న తేడా లేకుండా స్కూళ్లను, ఆస్పత్రులను బాగు చేస్తే దానిపై విష ప్రచారం చేసిన ఈ మీడియాకు ఇప్పుడు అంతా అద్భుతంగానే కనిపిస్తోంది. కూటమి సర్కార్ సంపద సృష్టి అంటే బడాబాబులకే అన్న సంగతి పదే, పదే అర్థమవుతోందన్నమాట!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

నువ్వు బెదిరిస్తే.. బెదిరిపోతామా?.. ట్రంప్ టారిఫ్ డెడ్‌లైన్‌పై చైనా
వాషింగ్టన్: టారిఫ్‌ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్ లైన్‌కు తాము భయపడబోమని చైనా స్పష్టం చేసింది. ట్రంప్ ఈ తరహా బెదిరింపులకు పాల్పడడం మంచి పద్దతి కాదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. చైనా -అమెరికా దేశాల మధ్య టారిఫ్‌ల యుద్ధం కొనసాగుతోంది. తమ దేశంపై విధించిన 34శాతం ప్రతీకార సుంకాల విధింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ చైనాకు హుకుం జారీ చేశారు. లేదంటే చైనాపై అదనంగా మరో 50 శాతం టారిఫ్ విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇందుకోసం 48 గంటల సమయం కూడా ఇచ్చారు. బెదిరిస్తే.. బెదిరిపోతామా ఈ తరుణంలో ట్రంప్ విధించిన డెడ్‌లైన్‌పై చైనా ధీటుగా స్పందించింది. అగ్రరాజ్యం బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేసింది. ఈ తరహా ఒత్తిడి, బెదిరింపులు మంచి పద్దతి కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి లియు పెంగ్యు మీడియాకు తెలిపారు.మంచి పద్దతి కాదుట్రంప్ విధించిన 48గంటల డెడ్‌లైన్‌పై అమెరికా మీడియా లియు పెంగ్యుని ప్రశ్నించింది. బదులుగా, పెంగ్యు స్పందిస్తూ.. తమపై ట్రంప్ టారిఫ్ ఒత్తిడి, బెదిరింపులకు లొంగబోము. చైనా మెరుగైన సంబంధాలు కొనసాగించాలంటే ఒత్తిడి,బెదిరింపులకు పాల్పడటం మంచి పద్దని కాదని ఇప్పటికే చెప్పాం. చైనా తన చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాల్ని కాపాడుకుంటుంది’ అని చెప్పారు. మరిన్ని అమెరికా ఉత్పత్తులపై చైనా టారిఫ్మరోవైపు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ సైతం ట్రంప్ వ్యాఖ్యలపై ప్రతీకార చర్యకు సిద్ధమైంది. తన సొంత హక్కులను,ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైతే మరిన్ని అమెరికా ఉత్పుత్తులపై టారిఫ్ విధిస్తామని పునరుద్ఘాటించింది. ట్రంప్ టారిఫ్ బెదిరింపులపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. అమెరికా విధిస్తున్న ప్రతీకార సుంకాలు పూర్తిగా అర్ధం లేనివి. ఒక సాధారణ ఏకపక్ష బెదిరింపుగా అభిప్రాయం వ్యక్తం చేసింది.

అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల..: హార్దిక్
ఐపీఎల్-2025 (IPL 2025)లో ముంబై ఇండియన్స్‌కు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిన హార్దిక్ సేన.. తాజాగా సొంత మైదానం వాంఖడేలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ముందు తలవంచింది. ఆఖరి వరకు పోరాడినా పన్నెండు పరుగుల తేడాతో ఓడిపోయి పరాభవాన్ని మూటగట్టుకుంది.ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya).. తాము తీవ్ర నిరాశకు గురైనట్లు తెలిపాడు. వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని.. కాబట్టి తాను బౌలర్లను నిందించబోనని స్పష్టం చేశాడు. గత మ్యాచ్‌లో పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డ తిలక్ వర్మ ఈరోజు మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని హర్షం వ్యక్తం చేశాడు.జస్ప్రీత్ బుమ్రా రాకతో జట్టు మరింత పటిష్టంగా మారిందని.. అనుకున్న ఫలితాలు రాబట్టేందుకు సానుకూల దృక్పథంతో ముందుకు సాగటం ముఖ్యమని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. కాగా ఆర్సీబీతో సోమవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ చేసింది.ఆర్సీబీ బ్యాటర్లు ధనాధన్ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి (42 బంతుల్లో 67), దేవదత్ పడిక్కల్ (22 బంతుల్లో 37), కెప్టెన్ రజత్ పాటిదార్ (32 బంతుల్లో 64) దంచికొట్టగా.. వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ (19 బంతుల్లో 40 నాటౌట్)తో దుమ్ములేపాడు. ఫలితంగా ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా రెండేసి వికెట్లు తీయగా.. విఘ్నేశ్ పుతూర్‌కు ఒక వికెట్ దక్కింది. అయితే, బుమ్రా నాలుగు ఓవర్ల కోటాలో 29 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. ఇక లక్ష్య ఛేదనలో ముంబై ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ (17), రియాన్ రికెల్టన్ (17) వికెట్లు కోల్పోయింది.తిలక్, హార్దిక్ పోరాటం వృథావిల్ జాక్స్ (22), సూర్యకుమార్ యాదవ్ (28) కూడా నిరాశపరచగా.. తిలక్ వర్మ (29 బంతుల్లో 56), హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 42) అద్భుత ఇన్నింగ్స్‌తో గెలుపు ఆశలు రేకెత్తించారు. అయితే, బెంగళూరు బౌలర్ల ప్రతాపం ముందు వీరు తలవంచకతప్పలేదు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయిన ముంబై.. 209 పరుగుల వద్ద నిలిచిపోయి.. పరాజయాన్ని ఆహ్వానించింది.రోహిత్ రావడం వల్ల అతడు లోయర్ ఆర్డర్లోఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా స్పందిస్తూ.. ‘‘పరుగుల వరద పారింది. వికెట్ చాలా బాగుంది. అయితే, మేము ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. పిచ్‌ను చూసిన తర్వాత బౌలర్లను తప్పుపట్టడానికి ఏమీ లేదనిపించింది.ఇక బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానం జట్టుకు వెన్నెముక లాంటిది. గత మ్యాచ్‌కు రోహిత్ అందుబాటులో లేడు కాబట్టి నమన్ ధీర్ టాపార్డర్‌లో ఆడాడు. నమన్ బహుముఖ ప్రజ్ఞగల ఆటగాడు. అతడు ఏ స్థానంలోనైనా రాణించగలడు. రోహిత్ వచ్చాడు గనుక ఈసారి లోయర్ ఆర్డర్లో బరిలోకి దిగాడు.తిలక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడుతిలక్ వర్మ ఈరోజు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. గత మ్యాచ్‌లో అతడిని రిటైర్డ్ అవుట్‌గా వెనక్కి పిలిపించాలన్న మా కోచ్ నిర్ణయం సరైందేనని ఇప్పటికీ నమ్ముతున్నా. ఏదేమైనా పవర్ ప్లేలో పరుగులు రాబట్టడమే అత్యంత ముఖ్యం.ఈరోజు మధ్య ఓవర్లలోనూ మేము ఒకటి, రెండు సందర్భాల్లో గట్టిగా హిట్టింగ్ చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. డెత్ ఓవర్లలో ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయాం. ఇక బుమ్రా జట్టులోకి రావడం.. మా టీమ్‌ను ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలుపుతుందనడం అతిశయోక్తి కాదు.ఈరోజు తను బాగానే రాణించాడు. మా జట్టు ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతోనే ఉంటుంది. మా ఆటగాళ్లకు మేము అండగా ఉంటాం. తప్పక అనుకున్న ఫలితాలు రాబడతాం’’ అని చెప్పుకొచ్చాడు.చదవండి: గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్‌గా ఊహించని పేరు చెప్పిన కపిల్ దేవ్ A #TATAIPL Classic in every sense 🔥#RCB hold their nerves to seal a win after 1️⃣0️⃣ years against #MI at Wankhede! Scorecard ▶️ https://t.co/ArsodkwOfO#TATAIPL | #MIvRCB | @RCBTweets pic.twitter.com/uu98T8NtWE— IndianPremierLeague (@IPL) April 7, 2025

సింగపూర్‌లో అగ్ని ప్రమాదం.. పవన్ కుమారుడికి గాయాలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సింగపూర్ వెళ్లనున్నారు. ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్‌ను వెంటనే స్కూల్ యాజమాన్యం ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే, బాబు ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది.ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ ఉన్నారు. ఫోన్ కాల్ ద్వారా ఆయన సమాచారం తెలుసుకున్నారు. కానీ, ఇప్పటికే అక్కడ ఆయన పర్యటన షెడ్యూల్‌కు సంబంధించన ఏర్పాట్లు అన్నీ అధికారులు చేశారు. దీంతో అక్కిడి పర్యటన ముగించుకుని ఆయన సింగపూర్ వెళ్లనున్నారు.

మీరట్ హత్య కేసులో మరో ట్విస్ట్.. వెలుగులోకి మరో కీలక విషయం
మీరట్: మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ప్రేమించి వివాహం చేసుకున్న భర్తను ప్రియుడి సాయంతో భార్యే దారుణంగా హత్య చేసి, ముక్కలు చేసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో తాజాగా మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితురాలు ముస్కాన్ రస్తోగి గర్భం దాల్చినట్లు సీనియర్ జైలు సూపరింటెండెంట్ వీరేష్ రాజ్ శర్మ వెల్లడించారు.ముస్కాన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరుతూ జైలు అధికారులు సీఎం కార్యాలయాన్ని కోరారు. దీంతో ఇటీవల ఆమెకు గర్భ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ కటారియా తెలిపారు. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తున్న ఈ హత్య కేసులో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.ఈ కేసులో అరెస్టైన ముస్కాన్, సాహిల్‌కు సంబంధించి.. గతంలో కూడా పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ మాదకద్రవ్యాలకు బానిసలుగా మారారని పేర్కొన్నారు. జైల్లో ఆహారం తినకుండా తమకు గంజాయి, మత్తు ఇంజెక్షన్లు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. అరెస్ట్ నాటి నుంచి అవి దొరక్కపోవడంతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని.. తరచూ గంజాయి కోసం డిమాండ్ చేసినట్లు కూడా పోలీసులు చెప్పారు.సౌరభ్ రాజ్‌పుత్(29), ముస్కాన్(27) 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు మర్చంట్ నేవీలో పని చేసేవాడు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత సాహిల్(25)తో ముస్కాన్ వివాహేతర సంబంధం పెట్టుకొంది. దీనిపై వారు విడాకుల వరకు వెళ్లారు. కానీ, కుమార్తె కోసం సౌరభ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తర్వాత ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లిన అతడు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమార్తె పుట్టినరోజు కోసం తిరిగొచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అతడి శరీరాన్ని ముక్కలు చేసి.. వాటిని ఓ డ్రమ్ములో వేసి సిమెంట్‌తో సీల్ చేసింది.

గోల్డెన్ ఛాన్స్! తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఇటీవలి కాలంలో క్రమంగా తగ్గుముఖం పడుతోంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం కొంత తగ్గి కొనుగోలుదారులకు మరింత ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.82,250 (22 క్యారెట్స్), రూ.89,730 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.600, రూ.650 తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.600, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.650 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.82,250 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.89,730 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.600 దిగి రూ.82,400కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.650 తగ్గి రూ.89,880 వద్దకు చేరింది.ఇదీ చదవండి: ఎగుమతిదార్లకు బాసటగా కేంద్రం చర్యలువెండి ధరలుబంగారం ధరలు మంగళవారం తగ్గినా వెండి ధరలు(Silver Price) మాత్రం స్థిరంగానే ఉన్నాయి. సోమవారం ముగింపు ధరలతో పోలిస్తే ఏమాత్రం కదలాడకుండా నిలకడగా ఉన్నాయి. దాంతో కేజీ వెండి రేటు రూ.1,03,000 వద్ద స్థిరంగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

ఎవరీ సోమాదాస్..? కోర్టులు ఆమె పోరాటాన్ని గౌరవించి మరీ..!
‘నేను బాగుంటే చాలు’ అనుకునే ఈ రోజుల్లో నలుగురి కోసం పోరాటానికి దిగడం మామూలు విషయం కాదు.పశ్చిమ బెంగాల్ టీచర్ల నియామకంలో అవక తవకలున్నాయని 25,752 ఉద్యోగాలని తొలగించింది సుప్రీంకోర్టు – ఒక్క ఉద్యోగం తప్ప. ఆ ఉద్యోగం సోమా దాస్ది. ఈ బెంగాలీ టీచర్ తనకు ఉద్యోగం రానందుకు పోరాడింది. ఉద్యోగం రాని వాళ్ల కోసం పోరాడింది. ఈలోపు కేన్సర్ వస్తే దానిపై పోరాడింది. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆమె పోరాటాన్ని గౌరవించి ఉద్యోగాన్ని నిలబెట్టాయి. కాని ఇప్పుడు ఈ తీర్పు వల్ల కూడా ఎందరో రోడ్డున పడతారని పోరాటానికి సిద్ధమైంది సోమాదాస్. ఇలా ఎవరున్నారని?‘మళ్లీ కొత్త ఓరాటం చేయాలేమో’ అంది సోమా దాస్.మొన్నటి ఏప్రిల్ 3వ తేదీకి ముందు, తర్వాత ఆమె జీవితం ఒకేలా ఉంది. ఎందుకంటే ఆమె ఉద్యోగం పోలేదు. కాని ఆమెతోపాటు ఉద్యోగంలో చేరిన వారంతా సుప్రీంకోర్టు తీర్పుతో భవిష్యత్తు తెలియని స్థితిలో పడ్డారు. ‘సుప్రీంకోర్టు తీర్పు ఇలా వెలువడటంలో ప్రభుత్వ వైఫల్యం ఉంది. నియామకాల్లో ప్రతిభ చూపి నిజాయితీగా ఉద్యోగాలు సాధించినవారు ఉన్నారు. వారి లిస్ట్ ప్రభుత్వం దగ్గర ఉంది. సుప్రీంకోర్టుకు ఆ లిస్టు ఇచ్చి వారి ఉద్యోగాలను కాపాడాల్సింది’ అందామె. ఈ గొడవ 2016 నుంచి మొదలైంది. వెస్ట్ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్యు.బి.ఎస్.ఎస్.సి.) 2016లో భారీగా పరీక్షలు నిర్వహించి స్కూల్, కాలేజీ స్థాయిలో చేసిన టీచింగ్, నాన్ టీచింగ్ నియామకాలు చేసింది. 25,725 మంది ఉద్యోగులు చేరారు. అయితే ఆనాటి నుంచి గొడవలు మొదలయ్యాయి. దొడ్డిదారిన చాలామంది ఉద్యోగాల్లో చేరారంటూ అర్హులైనవారు రోడ్డెక్కారు. నిరసనలు చేశారు. వారిలో సోమాదాస్ ముందు వరుసలో ఉంది. ‘నా పేరు మెరిట్ లిస్ట్‌లో ఉంది. కాని నాకు ఉద్యోగం ఇవ్వలేదు. నా బదులు ఎవరో దొంగ పద్ధతిలో చేరారు’ అని ఆమె కోల్‌కతా హైకోర్టులో కేసు వేసింది. ఆ కేసు నడుస్తుండగానే విపరీతంగా నిరసన ప్రదర్శనల్లో ముందు వరుసలో కనిపించింది. రోజుల తరబడి నిరాహార దీక్షల్లో కూచోవడం వల్ల ఆమె పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇంతలో ఆమెకు కేన్సర్ వచ్చింది. అయినా సరే కేన్సర్‌తో పోరాడుతూనే తన కోసం, సాటి వారి కోసం పోరాటం చేసింది. ఇది కోల్‌కతా హైకోర్టు జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ్ దృష్టికి వచ్చి ఆయన ఆమెను కోర్టుకు పిలిపించారు. ‘ఇంకొక ఉద్యోగం ఇవ్వమని ప్రభుత్వానికి చెబుతాను. చేస్తావా?’ అని అడిగారు. ‘టీచర్ కావడం నా జీవిత లక్ష్యం’ అని కరాఖండీగా చెప్పింది సోమాదాస్. దాంతో 2022లో ఆమెకు బెంగాలి భాషను బోధించే టీచరుగా ఉద్యోగం వేయించారు జడ్జి. కాని అదే జడ్జి 2024, ఏప్రిల్ 12న మొత్తం నియామకాలు చెల్లవు అని తీర్పు చెప్పారు. కాని ఒక్క సోమాదాస్ ఉద్యోగం మాత్రం ఉంటుంది అని పేర్కొన్నారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌కు వెళితే న్యాయమూర్తులు దేబాంశు, మహమ్మద్ షబ్బార్ కూడా ‘నియామకాలు చెల్లవు. సోమాదాస్ ఉద్యోగం ఉంటుంది’ అని తీర్పు చెప్పారు. కేసు సుప్రీంకోర్టుకు వచ్చాక న్యాయమూర్తులు సంజీవ్‌ఖన్నా, సంజయ్ కుమార్‌లు తీర్పు చెప్తూ ‘ఉద్యోగాలు చెల్లవు. కాని సోమాదాస్ ఉద్యోగం కొనసాగుతుంది’ అన్నారు.ఇంతమంది న్యాయమూర్తులు సోమాదాస్‌కు వెన్నంటి నిలిచి ఆమె ఉద్యోగం కాపాడటం చాలా అరుదు. దానికి కారణం సోమాదాస్ నిరుపేద కుటుంబం నుంచి రావడం, న్యాయం కోసం వెరవక పోరాడటం, ఆమె అర్హతలన్నీ సరిగ్గా ఉండటం, కేన్సర్ వచ్చినా దానిపై పోరాడుతూ ఉద్యోగం కోసం పోరాటాన్ని కొనసాగించడం.దీనిని బట్టి పోరాటం చేసే వారికి... న్యాయం కోసం ఎలుగెత్తే వారికి గౌరవం ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. సాధారణంగా ఈ పని చేయడానికి చాలామంది వెరుస్తూ ఉంటారు. ‘నా ఉద్యోగం ఉందని సంతోషంగా ఏమీ లేను. ఇన్నాళ్లలో ఎంతోమంది ఈ ఉద్యోగాల వల్ల స్థిరపడ్డారు. ఇప్పుడు వారి ఉద్యోగాలు పోతే కుటుంబాలను ఎలా నడుపుతారు. వారి న్యాయం కోసం ఏదైనా చేయాలి’ అంది సోమా దాస్. నిజమే. దాదాపు ఎనిమిదేళ్లుగా ఉద్యోగం చేస్తూ ఇప్పుడు ఆ ఉద్యోగం పోగొట్టుకోవాలంటే దొడ్డిదారిన చేరిన వాళ్ల కంటే నిజమైన అర్హతలతో చేరినవారు కుదేలవుతారు. ‘త్వరలో ఏదో ఒక దారి దొరుకుతుంది. మేం పోరాడతాం’ అంటోంది సోమాదాస్.కొందరు అలా ఉంటారు మరి.

‘ఆరోగ్యశ్రీ’ ఆగిపోయింది!
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం పెదమామిడిపల్లికి చెందిన పార్వతి భర్త సుబ్రహ్మణ్యానికి కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆపరేషన్ అవసరమని వైద్యులు చెప్పడంతో పార్వతి తన భర్త సుబ్రహ్మణ్యాన్ని తీసుకుని ఎంతో కష్టం మీద రూ.7 వేలకు ఓ ప్రైవేటు అంబులెన్స్‌లో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చింది. అక్కడ రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు చూపి, తన భర్త ఆపరేషన్ విషయం తెలిపింది.ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయడంలేదని, డబ్బులిస్తేనే చేస్తామని ఆస్పత్రి సిబ్బంది చెప్పడంతో ఏం చేయాలో తెలీక భర్తను తీసుకుని పార్వతి తిరిగి ఇంటికి బయల్దే రింది. తన భర్తకు ఆపరేషన్ చేయిద్దామని ఎంతో ఆశగా వచ్చానని, ఇప్పుడు ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారని కన్నీరుమున్నీరైంది. రూ.వేలు, రూ.లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించుకునే స్థోమత తమకులేదని ఆవేదన చెందింది. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా ‘ఆరోగ్యశ్రీ లేదు. ప్రభుత్వం మాకు బకాయిలు చెల్లించలేదు.. ఉచితంగా చికిత్సలు చేయలేం వెళ్లిపోండి..’ అన్న మాటలు నెట్వర్క్ ఆస్పత్రుల దగ్గర సోమవారం వినిపించాయి. ఎంతో ఆశతో వైద్యం కోసం వచ్చిన రోగులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ శాపనార్థాలు పెట్టారు. ఈ పరిస్థితికి కారణం రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రూ.3,500 కోట్ల మేర బిల్లులు సుదీర్ఘ కాలంగా చెల్లించకపోవడం, బిల్లుల కోసం ప్రభుత్వం వద్ద మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో సోమవారం నుంచి ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు రాష్ట్రవ్యాప్తంగా సమ్మెబాట పట్టాయి.‘బకాయిలు చెల్లించాలని వైద్యశాఖ అధికారుల నుంచి సీఎం వరకూ అందరినీ కలిసి పలు దఫాలుగా కోరాం.. ఇబ్బందులను వివరించాం. ప్రతినెలా రూ.330 కోట్ల మేర వైద్యసేవలను నెట్వర్క్ ఆస్పత్రులు అందిస్తున్నాయి. కానీ, ప్రభుత్వం నుంచి చెల్లింపులు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. దీంతో అప్పుల ఊబిలోకి కూరుకుపోయాం. ఇప్పుడు బ్యాంకులు కూడా మాకు అప్పులు మంజూరు చేయడంలేదు. ఈ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. గత్యంతరంలేని పరిస్థితుల్లో సేవలు నిలిపేస్తున్నాం. అర్థం చేసుకోండి’.. అంటూ నెట్వర్క్ ఆస్పత్రుల వద్ద యాజమాన్యాలు పోస్టర్లు అతికించాయి.ఎన్ని రకాలుగా అడిగినా పట్టించుకోని సర్కారు..సోమవారం ఆస్పత్రులకు వచ్చిన ఆరోగ్యశ్రీ లబ్ధిదారులను పథకం కింద యాజమాన్యాలు చేర్చుకోలేదు. నగదు రహిత సేవలు పూర్తిగా ఆపేశామని.. డబ్బులు కట్టి వైద్యసేవలు పొందాలని సూచించారు. దీంతో పేదరోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. వాస్తవానికి.. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఈ ఏడాది జనవరి 6 నుంచి ఆరోగ్యశ్రీ కింద ఓపీ, ఈహెచ్ఎస్ కింద అన్ని రకాల వైద్యసేవలను నెట్వర్క్ ఆస్పత్రులు నిలిపేశాయి. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో సోమవారం (ఏప్రిల్ 7) నుంచి వైద్యసేవలు ఆపేస్తామని నెలరోజుల ముందే ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. తమ సమస్యలపై కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆశా ప్రతినిధులు వినతిపత్రాలు ఇచ్చారు. బిలు్లలు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. కనీసం రూ.1,500 కోట్లు అయినా మంజూరు చేయకపోతే సేవలు కొనసాగించబోమని ప్రభుత్వానికి తేలి్చచెప్పారు. ఇన్ని రకాలుగా ఆస్పత్రుల యాజమాన్యాలు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చేసేదిలేక సమ్మెలోకి వెళ్లారు. ఆరోగ్యశ్రీ అమలును బీమా రూపంలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టడం కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతోందని ప్రజలు మండిపడుతున్నారు.పేదలకు ఇబ్బందికరం.. నా కొడుకు ఐదేళ్ల నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. కాకినాడలోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి వచ్చాం. ఆరోగ్యశ్రీ సేవలు బందయ్యాయని చెప్పారు. ఇప్పుడేం చేయాలో పాలుపోవడంలేదు. కార్పొరేట్ వైద్యసేవలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆరోగ్యశ్రీ వైద్యసేవలు నిలిచిపోవడం పేదలకు ఇబ్బందికరం. – కె. సత్యవతి, జగన్నాథపురం, కాకినాడ గుండె నొప్పితో వస్తే ఉచిత సేవలు లేవన్నారు.. మూడ్రోజుల నుంచి ఆయాసం, గుండె నొప్పితో బాధపడుతున్నా. నంద్యాల పట్టణంలో ఆరోగ్యశ్రీ సేవలు అందించే ఓ ప్రైవేటు ఆçస్పత్రికి వచ్చాం. నా భర్త సంజీవరాజు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. డాక్టర్ పరీక్షలు చేసి ఆస్పత్రిలో అడ్మిట్ కావాలన్నారు. అయితే, ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశామని చెప్పారు. ఉచితంగా వైద్యం చేసేందుకు వీలుపడదన్నారు. రూ.15 వేల దాకా ఖర్చవుతుందని చెప్పడంతో అంత డబ్బులేక వెనుదిరిగాం. మాలాంటి పేదలకు పెద్ద జబ్బులు వస్తే ఎవరు దిక్కు? – మల్లేశ్వరి, నంద్యాలఆపరేషన్ చేస్తారో లేదో.. ప్రమాదవశాత్తు కుడి భుజం విరిగింది. ఆపరేషన్ కోసం ఆరోగ్యశ్రీ కార్డుతో ఆస్పత్రికి వచ్చాను. రిజి్రస్టేషన్‌లో పేరు రాసుకున్నారుగానీ డాక్టర్ అందుబాటులో లేరని చెబుతున్నారు. ఆయన వస్తేనే ఆపరేషన్ గురించి మాట్లాడాలని అంటున్నారు. ఇప్పుడేదో సమ్మె అంటున్నారు. ఆపరేషన్ చేస్తారో లేదో అని ఆందోళనగా ఉంది. – కె. సత్యం, నిద్దాం, జి.సిగడాం మండలం, శ్రీకాకుళం జిల్లాఆరోగ్యశ్రీ అంటేనే.. లేదు పొమ్మంటున్నారు.. మాది తిరుపతి కొర్లగుంట, నా భర్త భవన నిర్మాణ కారి్మకుడు. ఆయనకు కొంతకాలంగా ఛాతీలో నొప్పి వస్తోంది. దీంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి సోమవారం ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని వెళ్లాం. ఆరోగ్యశ్రీ కింద ఓపీలు ఇవ్వడంలేదు, వెళ్లిపొమ్మన్నారు. డబ్బులు కడితేనే ఓపీ ఇస్తామని తెగేసి చెప్పారు. దీంతో చేసేదిలేక ఇంటికి వచ్చేశాం. అప్పు కోసం ప్రయతి్నస్తున్నాం. గత ప్రభుత్వంలో మా నాన్నకు గుండె ఆపరేషన్ చేయించాం. ఒక్క రూపాయి లేకుండా వైఎస్సాఆర్ ఆరోగ్యశ్రీతో ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్ చేశారు. పైగా.. ఇంటికొచ్చిన మూడునెలలు పాటు నెలకు రూ.5వేలు చొప్పున ఖర్చులకు ఇచ్చారు. – సావిత్రమ్మ, దినసరి కూలి, తిరుపతిసంజీవని’ ఊపిరి తీసిన చంద్రబాబు సర్కార్ఈ చిత్రం చూడండి.. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేటకు చెందిన మహబూబ్ సాబ్‌కు సుస్తీ చేసి ప్రాణం మీదకు వచ్చింది. ఫోన్ చేస్తే 108 కుయ్ కుయ్‌మని రాలేదు సరికదా! కనీసం పలకలేదు. దీంతో మహబూబ్ కుటుంబానికి ఏంచేయాలో పాలుపోలేదు. చంద్రబాబు పాలనలో 108ని నమ్ముకోవడం దండగని అర్థం చేసుకున్న ఆ కుటుంబం అప్పటికప్పుడు బాడుగకు ఓ ట్రాలీ మాట్లాడుకున్నారు. ఆ ట్రాలీకి దుప్పటి కప్పి.. అందులోనే మహబూబ్‌ను కడప రిమ్స్‌కు చికిత్స కోసం తీసుకువచ్చారు.దిగొచ్చిన ప్రభుత్వం..ఆరోగ్యశ్రీ సేవలను నెట్వర్క్ ఆస్పత్రులు స్తంభింపజేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. ‘ఆశ’ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు అత్యవసర సమావేశం నిర్వహించి చర్చలు జరిపారు. పెండింగ్ బకాయిలు చెల్లింపుల కోసం వెంటనే రూ.500 కోట్లు విడుదల చేయడానికి ఆయన ఆమోదం తెలిపారు. మిగిలిన బకాయిల చెల్లింపుపై హామీ ఇచ్చారు. దీంతో సేవలను తిరిగి ప్రారంభిస్తున్నామని ‘ఆశ’ అధ్యక్షుడు డాక్టర్ విజయ్‌కుమార్ సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత వెల్లడించారు. ఈనెల 10 తర్వాత ఆరోగ్యశాఖ మంత్రితో ప్రత్యేక సమావేశం ఉంటుందన్నారు. ఇందులో పెండింగ్ బకాయిలు, భవిష్యత్ చెల్లింపు షెడ్యూల్, ప్యాకేజీ రివిజన్లు వంటి అంశాలపై చర్చిస్తామన్నారు.
Telangana: గ్రూప్–1 ఉద్యోగం సాధించిన జువేరియా
అల్లు అర్జున్- అట్లీ 'AA22' ప్రకటన వచ్చేసింది (వీడియో)
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు
టామ్ క్రూజ్ 'మిషన్ ఇంపాజిబుల్' తెలుగు ట్రైలర్
‘ప్లే ఆఫ్’ బెర్త్ లక్ష్యంగా...
శిలా నిశ్శబ్దం..! శిధిలమైనా..కళతో ప్రాణం పోశారు..
విజేత పెగూలా.. ఎనిమిదో టైటిల్
సంపద సృష్టి.. సంపన్నులకు మాత్రమేనా బాబూ!
మరో ఇండోర్‌లా.. భాగ్యనగరం కాగలదా..?
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
15 ఏళ్ల ఏజ్ గ్యాప్.. మాకేలాంటి ఇబ్బంది లేదు: తమన్నా
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
వరద రాజధానిలో ప్రజాధనం వృథా
భర్త చనిపోయి బాధలో ఉన్న అత్తను ఓదార్చాల్సిందిపోయి ...
మావోయిస్టుల శాంతి చర్చల ప్రకటన
ఈ రాశి వారికి ఇంటాబయటా అనుకూలం.. ఆస్తిలాభం
ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్‌మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
EMIలు తగ్గుతాయ్.. లోన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్..
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
నీ చుట్టూ శత్రువులు.. 'కాంతార' హీరోపై పంజర్లి ఆగ్రహం
ఓటీటీలోకి మలయాళ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
AP: రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి
సింగపూర్‌లో అగ్ని ప్రమాదం.. పవన్ కుమారుడికి గాయాలు
ఇన్‌స్టాలో స్నేహారెడ్డి పోస్ట్.. అల్లు అభిమానుల్లో టెన్షన్!
సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ప్రకటించిన సౌతాఫ్రికా.. క్లాసెన్‌కు భారీ షాక్
...సూపర్ సిక్స్ సార్!
Chicken Price: కోడి కోయలేం.. తినలేం..!
బీఆర్ఎస్ సభకు 3 వేల బస్సులు
సిద్ధార్థ్‌కు కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియల్లో సానియాను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు
కూనో చీతాలకు నీరు పోశాడు.. ఉద్యోగం నుంచి సస్పెండ్!
బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
‘ట్రంప్’ అలజడికి తట్టుకున్న ఒకేఒక్క ఇన్వెస్టర్..
యూపీలో ఏం జరుగుతోంది?: సుప్రీంకోర్టు ఆగ్రహం
తెలుగబ్బాయికి నిరాశ.. 'ఇండియన్ ఐడల్' విజేతగా మానసి
బంగారం కొనడానికి ఇదే మంచి సమయం: మరింత తగ్గిన రేటు
ప్రాణాలు తీస్తున్న సరదా
ఈ పాపం.. ఎవరిది పవన్?
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నిరసన సెగ
వచ్చేస్తున్నాయి.. సరికొత్త స్మార్ట్ఫోన్లు
‘తోలు తీస్తా, తాట తీస్తా అంటాడు.. ఊళ్లో మాత్రం ఉండడు’
అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల..: హార్దిక్
రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేసిన ధోని
మీడియాపై ఊగిపోయిన సీఎం చంద్రబాబు
పాకిస్తాన్‌కు గట్టి షాకిచ్చిన ఐసీసీ.. పది రోజుల్లో ఇది మూడోసారి
‘నా అప్పు 6 వేల కోట్లు.. వసూలు చేసింది14 వేల కోట్లు’
SRH: వరుసగా నాలుగు ఓటములు!.. మా బ్యాటింగ్ శైలి మారదు: వెటోరి
Hyderabad: భార్య కడుపుతో ఉన్నా కనికరించని దుర్మార్గుడు..
రా..రమ్మని ఆహ్వానించేలా ఇంటిని అలంకరించుకోండి ఇలా..!
ఎన్టీఆర్ నాకంటే 9 ఏళ్లు చిన్నోడు.. ‘ఒరేయ్’ అంటే షాకయ్యా: రాజీవ్
శ్రీరామనవమి స్పెషల్ లుక్.. తారల ఫెస్టివల్ వైబ్స్ చూశారా?
తల్లి బదులు పది పరీక్షకు కూతురు!
ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన ఇంగ్లండ్ ఆటగాడు
Rat Ronin: వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఎలుక.. దేశ ప్రజల ప్రాణాలను కాపాడిన హీరో
ఏడు అడుగుల కండక్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్
ఓవైపు ప్రపంచ మార్కెట్లు కుదేలు.. ట్రంప్ ఆసక్తికర ప్రకటన
అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్
ఏఐ కాద్సార్! నిజం జింకే!!
విజయ్ దేవరకొండతో సినిమా.. వారం వరకు భయపడ్డా
'రామ్ చరణ్' రికార్డ్ దాటాలని ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఫ్యాన్స్
మొక్కజొన్న మెషీన్లో పడి మహిళ దుర్మరణం
ఎన్టీఆర్ ఎందుకింత సన్నమైపోయాడు? కారణం అదేనా
బెంగళూరులో దారుణం.. వాకింగ్ చేస్తున్న మహిళపై లైంగిక వేధింపులు
నువ్వు బెదిరిస్తే.. బెదిరిపోతామా?.. ట్రంప్ టారిఫ్ డెడ్‌లైన్‌పై చైనా
డబ్బు, పేరున్నా సుఖం లేదు.. ఛీ, ఎందుకీ బతుకు?.. వర్ష ఎమోషనల్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఇంటిమేట్ సీన్స్.. ఆ ఫీలింగ్ ఉండకూడదు: బాలీవుడ్ హీరోయిన్
విడిపోయిన ప్రముఖ బుల్లితెర జంట.. వెల్లడించిన భర్త!
2025 మార్చిలో ఎక్కువమంది కొన్న కారు ఇదే..
ఆక్వా కుదేలు.. ఇక ప్రభుత్వం ఉండీ ఏం లాభం?: వైఎస్ జగన్
కల్లుతాగి 100 మందికి పైగా అస్వస్థత.. వింత ప్రవర్తన
పర్యటించడానికి సాధ్యం కాని దేశాలివే..!
RCB Vs MI: ఆర్సీబీ అదరహో
నెల క్రితమే నిశ్చితార్థం.. జీవితాన్ని మలుపు తిప్పిన విహారం
ఇక్కడా తీసేశారు.. కాంట్రవర్సీ వీడియో సాంగ్ రిలీజ్
ఓటీటీ/ థియేటర్లో ఈ వారం 10కి పైగా సినిమాలు విడుదల
తల్లీకొడుకు... యాక్షన్
IPL 2025: హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు.. తొలి భారత క్రికెటర్‌గా
సినిమాల్లోకి స్టార్ హీరోయిన్ కూతురు.. ‘ఎంట్రీ’ కోసం ఎన్ని కష్టాలో..!
జియో కొత్త రీచార్జ్ ప్లాన్: రోజుకు 2జీబీ డేటా
ట్రంప్ విధ్వంసం
Saudi Arabia: 14 దేశాలకు వీసాల జారీ నిలిపివేత.. జాబితాలో భారత్
ఓటీటీలో 'టైమ్ లూప్ హారర్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
'పెద్ది' సిక్సర్‌తో.. పుష్ప2, దేవర రికార్డ్స్ గల్లంతు
ముంబై కంచుకోట బద్దలు.. పదేళ్ల తర్వాత ఆర్సీబీ గెలుపు
అనర్హులతో అడ్డగోలుగా మూల్యాంకనం!
నీట్‌ను ఎందుకు రద్దు చేయలేదు?.. సుప్రీం కోర్టుకు దీదీ సూటి ప్రశ్న
దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
HYD: మియాపూర్ మెట్రోస్టేషన్ వద్ద లారీ బీభత్సం
మరో 50 శాతం వేస్తాం
IPL 2025: నిబంధనలు ఉల్లంఘించిన ఇషాంత్ శర్మ.. భారీ జరిమానా
సమ్మె బాటలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు
రోషన్ భయ్యా.. ఈ రోతేంటయ్యా!
చెట్లు కుములుతున్న దృశ్యం
అందుకే పంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి రాలేదు: సీఎం స్టాలిన్
తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు!
మీరట్ హత్య కేసులో మరో ట్విస్ట్.. వెలుగులోకి మరో కీలక విషయం
రేవంత్ విషయంలో ఒక న్యాయం.. చంద్రబాబుకు మరొకటా?
కాసేపట్లో పాపిరెడ్డిపల్లికి వైఎస్ జగన్
సచిన్ మెచ్చిన గుమ్మడికాయ చికెన్ కర్రీ..! ఉబ్బితబ్బిబైన మాస్టర్ చెఫ్
'యుగానికి ఒక్కడు' సీక్వెల్ ధనుష్‌తోనే.. కార్తీపై దర్శకుడి కామెంట్స్
లవకుశ చిత్రంలో సాంగ్.. వాళ్లిద్దరు కాదు.. ధన్‌రాజ్ పోస్ట్ వైరల్!
Saaree Review: ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ
రాముడి పాత్ర చేసిన తొలి తెలుగు హీరో ఎవరో తెలుసా?
స్టాక్‌మార్కెట్‌పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత
నయనతార@ 9
వివాహేతర సంబంధం.. చిన్నారిపై తల్లి పైశాచికం
World Health Day: వీళ్ల ఆరోగ్యమే.. దేశానికి మహాభాగ్యం!
Telangana: గ్రూప్–1 ఉద్యోగం సాధించిన జువేరియా
అల్లు అర్జున్- అట్లీ 'AA22' ప్రకటన వచ్చేసింది (వీడియో)
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు
టామ్ క్రూజ్ 'మిషన్ ఇంపాజిబుల్' తెలుగు ట్రైలర్
‘ప్లే ఆఫ్’ బెర్త్ లక్ష్యంగా...
శిలా నిశ్శబ్దం..! శిధిలమైనా..కళతో ప్రాణం పోశారు..
విజేత పెగూలా.. ఎనిమిదో టైటిల్
సంపద సృష్టి.. సంపన్నులకు మాత్రమేనా బాబూ!
మరో ఇండోర్‌లా.. భాగ్యనగరం కాగలదా..?
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
15 ఏళ్ల ఏజ్ గ్యాప్.. మాకేలాంటి ఇబ్బంది లేదు: తమన్నా
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
వరద రాజధానిలో ప్రజాధనం వృథా
భర్త చనిపోయి బాధలో ఉన్న అత్తను ఓదార్చాల్సిందిపోయి ...
మావోయిస్టుల శాంతి చర్చల ప్రకటన
ఈ రాశి వారికి ఇంటాబయటా అనుకూలం.. ఆస్తిలాభం
ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్‌మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
EMIలు తగ్గుతాయ్.. లోన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్..
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
నీ చుట్టూ శత్రువులు.. 'కాంతార' హీరోపై పంజర్లి ఆగ్రహం
ఓటీటీలోకి మలయాళ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
AP: రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి
సింగపూర్‌లో అగ్ని ప్రమాదం.. పవన్ కుమారుడికి గాయాలు
ఇన్‌స్టాలో స్నేహారెడ్డి పోస్ట్.. అల్లు అభిమానుల్లో టెన్షన్!
సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ప్రకటించిన సౌతాఫ్రికా.. క్లాసెన్‌కు భారీ షాక్
...సూపర్ సిక్స్ సార్!
Chicken Price: కోడి కోయలేం.. తినలేం..!
బీఆర్ఎస్ సభకు 3 వేల బస్సులు
సిద్ధార్థ్‌కు కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియల్లో సానియాను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు
కూనో చీతాలకు నీరు పోశాడు.. ఉద్యోగం నుంచి సస్పెండ్!
బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
‘ట్రంప్’ అలజడికి తట్టుకున్న ఒకేఒక్క ఇన్వెస్టర్..
యూపీలో ఏం జరుగుతోంది?: సుప్రీంకోర్టు ఆగ్రహం
తెలుగబ్బాయికి నిరాశ.. 'ఇండియన్ ఐడల్' విజేతగా మానసి
బంగారం కొనడానికి ఇదే మంచి సమయం: మరింత తగ్గిన రేటు
ప్రాణాలు తీస్తున్న సరదా
ఈ పాపం.. ఎవరిది పవన్?
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నిరసన సెగ
వచ్చేస్తున్నాయి.. సరికొత్త స్మార్ట్ఫోన్లు
‘తోలు తీస్తా, తాట తీస్తా అంటాడు.. ఊళ్లో మాత్రం ఉండడు’
అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల..: హార్దిక్
రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేసిన ధోని
మీడియాపై ఊగిపోయిన సీఎం చంద్రబాబు
పాకిస్తాన్‌కు గట్టి షాకిచ్చిన ఐసీసీ.. పది రోజుల్లో ఇది మూడోసారి
‘నా అప్పు 6 వేల కోట్లు.. వసూలు చేసింది14 వేల కోట్లు’
SRH: వరుసగా నాలుగు ఓటములు!.. మా బ్యాటింగ్ శైలి మారదు: వెటోరి
Hyderabad: భార్య కడుపుతో ఉన్నా కనికరించని దుర్మార్గుడు..
రా..రమ్మని ఆహ్వానించేలా ఇంటిని అలంకరించుకోండి ఇలా..!
ఎన్టీఆర్ నాకంటే 9 ఏళ్లు చిన్నోడు.. ‘ఒరేయ్’ అంటే షాకయ్యా: రాజీవ్
శ్రీరామనవమి స్పెషల్ లుక్.. తారల ఫెస్టివల్ వైబ్స్ చూశారా?
తల్లి బదులు పది పరీక్షకు కూతురు!
ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన ఇంగ్లండ్ ఆటగాడు
Rat Ronin: వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఎలుక.. దేశ ప్రజల ప్రాణాలను కాపాడిన హీరో
ఏడు అడుగుల కండక్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్
ఓవైపు ప్రపంచ మార్కెట్లు కుదేలు.. ట్రంప్ ఆసక్తికర ప్రకటన
అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్
ఏఐ కాద్సార్! నిజం జింకే!!
విజయ్ దేవరకొండతో సినిమా.. వారం వరకు భయపడ్డా
'రామ్ చరణ్' రికార్డ్ దాటాలని ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఫ్యాన్స్
మొక్కజొన్న మెషీన్లో పడి మహిళ దుర్మరణం
ఎన్టీఆర్ ఎందుకింత సన్నమైపోయాడు? కారణం అదేనా
బెంగళూరులో దారుణం.. వాకింగ్ చేస్తున్న మహిళపై లైంగిక వేధింపులు
నువ్వు బెదిరిస్తే.. బెదిరిపోతామా?.. ట్రంప్ టారిఫ్ డెడ్‌లైన్‌పై చైనా
డబ్బు, పేరున్నా సుఖం లేదు.. ఛీ, ఎందుకీ బతుకు?.. వర్ష ఎమోషనల్
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఇంటిమేట్ సీన్స్.. ఆ ఫీలింగ్ ఉండకూడదు: బాలీవుడ్ హీరోయిన్
విడిపోయిన ప్రముఖ బుల్లితెర జంట.. వెల్లడించిన భర్త!
2025 మార్చిలో ఎక్కువమంది కొన్న కారు ఇదే..
ఆక్వా కుదేలు.. ఇక ప్రభుత్వం ఉండీ ఏం లాభం?: వైఎస్ జగన్
కల్లుతాగి 100 మందికి పైగా అస్వస్థత.. వింత ప్రవర్తన
పర్యటించడానికి సాధ్యం కాని దేశాలివే..!
RCB Vs MI: ఆర్సీబీ అదరహో
నెల క్రితమే నిశ్చితార్థం.. జీవితాన్ని మలుపు తిప్పిన విహారం
ఇక్కడా తీసేశారు.. కాంట్రవర్సీ వీడియో సాంగ్ రిలీజ్
ఓటీటీ/ థియేటర్లో ఈ వారం 10కి పైగా సినిమాలు విడుదల
తల్లీకొడుకు... యాక్షన్
IPL 2025: హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు.. తొలి భారత క్రికెటర్‌గా
సినిమాల్లోకి స్టార్ హీరోయిన్ కూతురు.. ‘ఎంట్రీ’ కోసం ఎన్ని కష్టాలో..!
జియో కొత్త రీచార్జ్ ప్లాన్: రోజుకు 2జీబీ డేటా
ట్రంప్ విధ్వంసం
Saudi Arabia: 14 దేశాలకు వీసాల జారీ నిలిపివేత.. జాబితాలో భారత్
ఓటీటీలో 'టైమ్ లూప్ హారర్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
'పెద్ది' సిక్సర్‌తో.. పుష్ప2, దేవర రికార్డ్స్ గల్లంతు
ముంబై కంచుకోట బద్దలు.. పదేళ్ల తర్వాత ఆర్సీబీ గెలుపు
అనర్హులతో అడ్డగోలుగా మూల్యాంకనం!
నీట్‌ను ఎందుకు రద్దు చేయలేదు?.. సుప్రీం కోర్టుకు దీదీ సూటి ప్రశ్న
దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
HYD: మియాపూర్ మెట్రోస్టేషన్ వద్ద లారీ బీభత్సం
మరో 50 శాతం వేస్తాం
IPL 2025: నిబంధనలు ఉల్లంఘించిన ఇషాంత్ శర్మ.. భారీ జరిమానా
సమ్మె బాటలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు
రోషన్ భయ్యా.. ఈ రోతేంటయ్యా!
చెట్లు కుములుతున్న దృశ్యం
అందుకే పంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి రాలేదు: సీఎం స్టాలిన్
తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు!
మీరట్ హత్య కేసులో మరో ట్విస్ట్.. వెలుగులోకి మరో కీలక విషయం
రేవంత్ విషయంలో ఒక న్యాయం.. చంద్రబాబుకు మరొకటా?
కాసేపట్లో పాపిరెడ్డిపల్లికి వైఎస్ జగన్
సచిన్ మెచ్చిన గుమ్మడికాయ చికెన్ కర్రీ..! ఉబ్బితబ్బిబైన మాస్టర్ చెఫ్
'యుగానికి ఒక్కడు' సీక్వెల్ ధనుష్‌తోనే.. కార్తీపై దర్శకుడి కామెంట్స్
లవకుశ చిత్రంలో సాంగ్.. వాళ్లిద్దరు కాదు.. ధన్‌రాజ్ పోస్ట్ వైరల్!
Saaree Review: ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ
రాముడి పాత్ర చేసిన తొలి తెలుగు హీరో ఎవరో తెలుసా?
స్టాక్‌మార్కెట్‌పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత
నయనతార@ 9
వివాహేతర సంబంధం.. చిన్నారిపై తల్లి పైశాచికం
World Health Day: వీళ్ల ఆరోగ్యమే.. దేశానికి మహాభాగ్యం!
సినిమా

వచ్చాడు గౌతమ్
స్టెతస్కోప్ పట్టుకున్న చేతి నిండా రుధిరం, కళ్లల్లో రౌద్రం చూస్తుంటే ప్రాణాలు పోయాల్సిన డాక్టర్ హత్య చేశాడా? అనేలా ఉంది ‘వచ్చిన వాడు గౌతమ్’(Vachina Vaadu Gautam) పోస్టర్. అశ్విన్ బాబు(Ashwin Babu) హీరోగా మామిడాల ఎం.ఆర్. కృష్ణ దర్శకత్వంలో టి. గణపతి రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ఇది. వచ్చాడు గౌతమ్ అంటూ ఈ చిత్రంలో అశ్విన్ ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు.‘‘అరుణశ్రీ ఎంటర్ టైన్మెంట్స్పై గణపతి రెడ్డి నిర్మిస్తున్న మూడో చిత్రం ఇది. గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ 90 శాతం పూర్తయింది. ఈ చిత్రంలో సాయి రోనక్ అతిథి పాత్రలో కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. రియా సుమన్, అయేషా ఖాన్, మురళీ శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గౌర హరి, కెమేరా: ఎం.ఎన్. బాల్ రెడ్డి.

స్టార్ హీరో కూతురికి తల్లిగా నటించనున్న దీపికా పదుకోన్
స్క్రీన్‌పై షారుక్ ఖాన్ తనయ సుహానా ఖాన్‌కు తల్లిగా నటించనున్నారట దీపికా పదుకోన్. షారుక్ ఖాన్ హీరోగా ఆయన కుమార్తె సుహానా మరో లీడ్ రోల్లో నటించనున్న చిత్రం ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్నారని బాలీవుడ్ టాక్. అభిషేక్ బచ్చన్ విలన్‌గా నటించనున్నారు. తాజాగా ఈ మూవీలో దీపికా పదుకోన్ ఓ లీడ్ చేయనున్నారనే టాక్ తెర పైకి వచ్చింది. సుహానా ఖాన్‌కు తల్లిగా కనిపిస్తారట దీపికా పదుకోన్. ఈ పాత్ర కథకు చాలా కీలకంగా ఉంటుందట. మే లేదా జూన్‌లో ‘కింగ్’ సినిమా చిత్రీకరణనుప్రారంభించాలనుకుంటున్నారు. ఇదిలా ఉంటే... ఈ చిత్రదర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ‘ఎక్స్’ వేదికగా ‘ఫాల్స్’ అని పేర్కొన్నారు. మరి... ‘అవాస్తవం’ అని ఆయన పేర్కొన్నది దీపికా పదుకోన్ తల్లి పాత్ర గురించా? లేదా వేరే ఏదైనా సినిమా గురించా లేక వేరే ఏ విషయం గురించా అనేది తెలియాల్సి ఉంది.

కథ విన్నారా?
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్ లో ఓ మూవీ రూపొందించడానికి సన్నాహాలు మొదలయ్యాయనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇటీవల హృతిక్ రోషన్ ను కలిసి ఓ కథ వినిపించారట బాబీ. ఈ స్టోరీ లైన్‌కు ప్రాథమికంగా అంగీకారం తెలిపారట హృతిక్. దీంతో ప్రస్తుతం స్క్రిప్ట్‌కు మరింత మెరుగులుదిద్దే పనిలో దర్శకుడు బాబీ బిజీగా ఉన్నారని సమాచారం. మరోసారి హృతిక్ రోషన్ ను కలిసి, బాబీ ఫైనల్ స్క్రిప్ట్ నరేషన్ ఇవ్వనున్నారట. అప్పుడు ఈ స్టోరీకి హృతిక్ రోషన్ ఫైనల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఈ కాంబినేషన్ సెట్ అయినట్లేనని ఫిల్మ్‌నగర్ టాక్.ఇక ఈ మూవీని భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్నారని భోగట్టా. మరి.. హృతిక్ రోషన్ కథ విన్నారా? హృతిక్–బాబీల కాంబినేషన్ సెట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇదిలా ఉంటే హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన స్పై యాక్షన్ డ్రామా ‘వార్ 2’ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా ఈ సినిమాను నిర్మించారు.

ఓ ట్యాక్సీ డ్రైవర్ కథ
మోహన్‌లాల్(Mohanlal), శోభన ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘తుడరుమ్’(Thudarum). తరుణ్ మూర్తి దర్శకత్వంలో ఎమ్. రంజిత్ ఈ క్రైమ్ డ్రామా మూవీని నిర్మించారు. ఈ సినిమాను తొలుత జనవరి 30న విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు. దీంతో ‘తుడరుమ్’ సినిమా మే చివర్లో విడుదల కానుందనే వార్తలు తెరపైకి వచ్చాయి. కానీ ఈ వార్తలు అవాస్తవమని, ఈ సినిమాను ఈ నెల 25న రిలీజ్ చేస్తున్నామని పేర్కొన్నారు మోహన్‌లాల్. ఈ సినిమాలో ట్యాక్సీ డ్రైవర్‌గా కనిపిస్తారాయన. ఇక దాదాపు పదిహేనేళ్ల తర్వాత మోహన్‌లాల్, శోభన మళ్లీ ఈ సినిమా కోసం స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
న్యూస్ పాడ్‌కాస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో ఆగిన ‘ఆరోగ్యశ్రీ’!. సమ్మెలో నెట్వర్క్ ఆస్పత్రులు

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని ప్రభుత్వం... సమ్మె బాటలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు

ఏపీలో ఊరూ వాడా ఏరులై పారుతున్న వైనం. కూటమి నేతల సిండికేట్ కబంధ హస్తాల్లో మద్యం షాపులు.

వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింలను దగా చేసిన ఏపీ సీఎం చంద్రబాబు... మూడు సవరణలు ప్రతిపాదించామంటూ తెలుగుదేశం పార్టీ గొప్పలు... అవి పసలేని సవరణలేనని మైనార్టీల ఆగ్రహం

తక్షణమే పనులు నిలిపివేయండి కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు... నేడు రాజ్యసభ ముందుకు బిల్లు

నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు... చర్చతోపాటు ఓటింగ్ జరిగే అవకాశం

శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్లను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... రోడ్డున పడిన 2 లక్షల 66 వేల కుటుంబాలు
క్రీడలు

ముంబై కంచుకోట బద్దలు.. పదేళ్ల తర్వాత ఆర్సీబీ గెలుపు
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తిరిగి గెలుపు బాట పట్టింది. వాఖండే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో 12 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. 222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేయగల్గింది.ముంబై బ్యాటర్లు ఆఖరి వరకు పోరాడినప్పటికి కొండంత లక్ష్యాన్ని కరిగించలేకపోయారు. ముంబై విజయానికి చివరి ఓవర్లో 19 పరుగులు అవసరమయ్యాయి. ఆర్సీబీ స్పిన్నర్ కృనాల్ పాండ్యా అద్బతంగా బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(29 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 56) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హార్దిక్ పాండ్యా(15 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 42)క్రీజులో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు.ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా నాలుగు వికెట్లు పడగొట్టగా.. హాజిల్ వుడ్, దయాల్ తలా రెండు వికెట్లు సాధించారు. వాంఖడేలో ముంబై ఇండియన్స్‌పై ఆర్సీబీ విజయం సాధించడం 10 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.కోహ్లి, పాటిదార్ హాఫ్ సెంచరీలుఈ మ్యాచ్‌లో ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(67), రజిత్ పాటిదార్(64) హాఫ్ సెంచరీలు సాధించగా.. పడిక్కల్(37), జితేష్ శర్మ(40) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ముంబై బౌలర్లలో బౌల్ట్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించగా.. విఘ్నేష్ ఒక్క వికెట్ పడగొట్టారు.

IPL 2025: హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు.. తొలి భారత క్రికెటర్‌గా
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వాంఖడే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో పాండ్యా రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. విరాట్ కోహ్లి, లివింగ్ స్టోన్లను వరుస క్రమంలో పెవిలియన్‌కు పంపాడు. లివింగ్ స్టోన్ వికెట్ పాండ్యాకు 200వ టీ20 వికెట్ కావడం గమనార్హం. దీంతో ఓ అరుదైన ఫీట్‌ను పాండ్యా తన పేరిట లిఖించుకున్నాడు.టీ20 క్రికెట్లో 5000 పరుగులతో పాటు 200 వికెట్లు తీసిన తొలి భారత క్రికెటర్‌గా పాండ్యా నిలిచాడు. ఇప్పటివరకు ఏ ఇండియన్ క్రికెటర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు. ఓవరాల్‌గా ఈ అరుదైన ఘనత సాధించిన 12వ ప్లేయర్‌గా పాండ్యా రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది సీజన్లో పాండ్యా ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడి 10 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(67), రజిత్ పాటిదార్(64) హాఫ్ సెంచరీలు సాధించగా.. పడిక్కల్(37), జితేష్ శర్మ(40) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ముంబై బౌలర్లలో బౌల్ట్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించగా.. విఘ్నేష్ ఒక్క వికెట్ పడగొట్టారు.ఈ అరుదైన ఫీట్ సాధించిన ఆటగాళ్లు వీరే..డ్వేన్ బ్రావో - 6970 పరుగులు- 631 వికెట్లుషకీబ్ అల్ హసన్ - 7438 పరుగులు - 492 వికెట్లుఆండ్రీ రస్సెల్ - 9018 పరుగులు - 470 వికెట్లుమహ్మద్ నబీ - 6135 పరుగులు- 369 వికెట్లుసమిత్ పటేల్ - 6673 పరుగులు- 352 వికెట్లుకీరాన్ పొలార్డ్ - 13537 పరుగులు- 326 వికెట్లురవి బొపారా - 9486 పరుగులు- 291 వికెట్లుడేనియల్ క్రిస్టియన్ - 5848 పరుగులు - 281 వికెట్లుమోయిన్ అలీ - 7140 పరుగులు - 375 వికెట్లుషేన్ వాట్సన్ – 8821 పరుగులు- 343 వికెట్లుమహ్మద్ హఫీజ్ – 7946 పరుగులు- 202 వికెట్లుహార్దిక్ పాండ్యా – 5390 పరుగులు- 200 వికెట్లుచదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..

సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ప్రకటించిన సౌతాఫ్రికా.. క్లాసెన్‌కు భారీ షాక్
క్రికెట్ దక్షిణాఫ్రికా (CSA) 2025-26 సీజన్ కోసం మెన్స్ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించింది. సోమవారం(ఏప్రిల్ 7)తో 23 మంది ఆటగాళ్లతో కూడిన లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ జాబితాలో స్టార్ ప్లేయర్లు హెన్రిచ్ క్లాసెన్, అన్రిచ్ నోర్జే, తబ్రైజ్ షంసీలకు చోటు దక్కలేదు. క్లాసెన్ సౌతాఫ్రికా వైట్ బాల్ జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నప్పటికి.. అతడు ఎక్కువగా ఫ్రాంచైజ్ క్రికెట్ ఆడేందుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే అతడిని కాంట్రాక్ట్ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. సౌతాఫ్రికా క్రికెట్ కూడా అతడితో ఇంకా చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది. కాగా క్లాసెన్ హండ్రెడ్ లీగ్ కారణంగా ఆస్ట్రేలియా సిరీస్‌కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఇప్పటికే సీఎస్ఎకు అతడు తెలియజేశాడు. అదేవిధంగా ఈ స్టార్ వికెట్ కీపర్ గతేడాదే టెస్టులకు విడ్కోలు పలికాడు. ఇవన్నీ అతడి కాంట్రాక్ట్ రిటైన్ విషయంలో సౌతాఫ్రికా క్రికెట్ పరిగణలోకి తీసుకుంది. గతంలో క్వింటన్ డికాక్ కూడా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడేందుకు కాంట్రాక్ట్‌ను వదులుకున్నాడు.మరోవైపు అన్రిచ్ నోర్జే, తబ్రైజ్ షంసీ గత కాలంగా రెగ్యూలర్‌గా జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నారు. ఇక ఇది ఇలా ఉండగా.. స్టార్ బ్యాటర్లు డేవిడ్ మిల్లర్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్లకు సౌతాఫ్రికా క్రికెట్ ప్రమోషన్ ఇచ్చింది. హైబ్రిడ్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో వీరిద్దరికిచోటు దక్కింది. దక్షిణాఫ్రికా 2025-26కు సెంట్రల్ కాంట్రాక్టులు లిస్ట్టెంబా బావుమా, డేవిడ్ బెడింగ్హామ్, నాండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, ఐడెన్ మార్క్రామ్, వియాన్ ముల్డర్, సెనురాన్ ముత్తుసామి, లుంగీ ఎన్గిడి, ట్రియాన్‌సిక్‌బ్స్‌టన్, ట్రియాన్‌సిక్‌బ్స్‌టన్, ట్రియాన్సిక్బ్యాడ వెర్రేన్నే, లిజాడ్ విలియమ్స్హైబ్రిడ్ కాంట్రాక్టులు: డేవిడ్ మిల్లర్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్

IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 13,000 పరుగులు మైలు రాయిని అందుకున్న తొలి భారత ప్లేయర్‌గా రికార్డులెక్కాడు. ఐపీఎల్-2025లో వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 17 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు.386 ఇన్నింగ్స్‌లలో కోహ్లి ఈ రేర్ ఫీట్‌ను నమోదు చేశాడు. ఓవరాల్‌గా ఐదో క్రికెటర్‌గా విరాట్ నిలిచాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో కోహ్లి కంటే ముందు క్రిస్ గేల్ (455 ఇన్నింగ్స్‌ల్లో 14562 పరుగులు), అలెక్స్ హేల్స్ (490 ఇన్నింగ్స్‌ల్లో 13610), షోయబ్ మాలిక్ (514 ఇన్నింగ్స్‌ల్లో 13557), కీరన్ పోలార్డ్ (617 ఇన్నింగ్స్‌ల్లో 13537) ఉన్నారు. అయితే ఇన్నింగ్స్‌ల పరంగా ఈ ఫీట్ సాధించిన రెండో క్రికెటర్ మాత్రం కోహ్లినే కావడం గమనార్హం.కాగా ఐపీఎల్-2025లో విరాట్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా కోహ్లి హాఫ్ సెంచరీ సాధించాడు. 60 పరుగులతో కోహ్లి తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అంతకుముందు కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా విరాట్(59) హాఫ్ సెంచరీతో రాణించాడు.తుది జట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI: విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ XI: ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, విఘ్నేష్ పుత్తూర్, జస్ప్రీత్ బుమ్రాచదవండి: కోహ్లి, రోహిత్ కాదు.. వారితోనే ఆడాలని ఉంది: ఎంఎస్ ధోని
బిజినెస్

మార్కెట్లు భగ భగ
‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ నినాదంతో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలిచిన ట్రంప్... ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో సృష్టిస్తున్న భగభగలు చల్లారటం లేదు. అమెరికాతో వ్యాపారం చేస్తున్న ప్రతి దేశాన్నీ కాళ్ల బేరానికి వచ్చేలా చేయడానికి ఆయన ఎంచుకున్న ప్రతీకార సుంకాలు అమెరికా సహా అన్ని స్టాక్ మార్కెట్లలోనూ కల్లోలాన్ని కొనసాగిస్తున్నాయి. కెనడా, జపాన్ సహా పలు దేశాల అధినేతలు ట్రంప్‌తో చర్చలకు వెళుతున్నట్లు ఇప్పటికే ప్రకటించగా... చైనా మాత్రం దిగిరాలేదు. పైపెచ్చు ట్రంప్ టారిఫ్‌లకు జవాబుగా చైనా కూడా అమెరికా వస్తువులపై సుంకాలు పెంచటంతో ట్రంప్ బెదిరింపులకు దిగారు. చైనా వాటిని ఉపసంహరించుకోకపోతే మరో 50 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. సోమవారం అమెరికా మార్కెట్లు మొదట్లో కోలుకున్నట్లు కనిపించినా ఈ ట్రేడ్ వార్ భయాలతో మళ్లీ భారీ పతనం దిశగా కదిలాయి. మరోవంక ట్రంప్ చర్యలతో ప్రపంచాన్ని మాంద్యం ముంచెత్తే అవకాశాలు 60 శాతానికి చేరినట్లు ఆర్థిక దిగ్గజాలు ప్రకటించాయి. దీంతో భారత్ సహా ప్రపంచ మార్కెట్లన్నీ సోమవారం భారీ పతనాన్ని చూశాయి. సెన్సెక్స్ ఆరంభంలో 4 వేల పాయింట్ల వరకూ నష్టపోయినా చివరకు కాస్త కోలుకుని 2,226.79 పాయింట్లు (–2.95%) క్షీణించి 73,137 వద్ద ముగిసింది. నిఫ్టీ 742 పాయింట్లు (–3.24%) పడిపోయి 22,160 వద్ద ముగిసింది. ఈ పతనంతో రూ.14 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరయ్యింది. చమురు, బంగారం ధరలు కూడా భారీగా పతనంఅవుతున్నాయి. మరోవైపు హాంకాంగ్ సూచీ హాంగ్‌సెంగ్ 15% నష్టపోగా... తైవాన్ వెయిటెడ్ 11%, జపాన్ నికాయ్ 8%, సింగపూర్ స్ట్రెయిట్ టైమ్స్ 8%, చైనా షాంఘై 7% చొప్పున నష్టపోయాయి. యూరప్ మార్కెట్ల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ట్రంప్ టారిఫ్ వార్తో ప్రపంచ మార్కెట్లను బేర్ చీల్చిచెండాడింది. ఆసియా నుంచి అమెరికా దాకా బ్లాక్ మండే దెబ్బకు ఇన్వెస్టర్లు కుదేలయ్యారు. అమెరికా సుంకాలకు చైనా ప్రతీకార టారిఫ్‌లు విధించడం.. ఇతర దేశాలూ అదే బాటలో వెళ్తుండటంతో వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. దీంతో ద్రవ్యోల్బణం ఎగబాకి ఆర్థిక మాంద్యానికి దారి తీయొచ్చనే భయాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల సునామీ వెల్లువెత్తింది. ఈ ప్రభావం దేశీయ ఈక్విటీ మార్కెట్‌పైనా విరుచుకుపడింది. ఫలితంగా భారత స్టాక్ సూచీలు పది నెలల్లో (2024 జూన్ 4 తర్వాత) అతిపెద్ద నష్టాన్ని చూశాయి. సెన్సెక్స్ 2,227 పాయింట్లు క్షీణించి 73,138 వద్ద, నిఫ్టీ 743 పాయింట్లు నష్టపోయి 22,162 వద్ద నిలిచింది. ఈ క్రాష్‌తో ఇన్వెస్టర్ల సంపదగా భావించే, బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ సోమవారం ఒక్కరోజే రూ.14.09 లక్షల కోట్లు ఆవిరై రూ.389 లక్షల కోట్ల (4.54 ట్రిలియన్ డాలర్లు)కు పడిపోయింది. ఒకానొక దశలో సంపద రూ.20.16 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. ముంబై: గత వారాంతంలో అమెరికా మార్కెట్లు కుప్పకూలడంతో సోమవారం ఆసియా మార్కెట్లు అతలాకుతలం అయ్యాయి. ఆ సెగతో మన సూచీలు కూడా భారీ నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 3,915 పాయింట్ల క్షీణతతో 71,450 వద్ద, నిఫ్టీ 1,146 వద్ద పతనంతో 21,758 వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 3,940 పాయింట్లు, నిఫ్టీ 1160 పాయింట్లు దిగజారాయి. జాతీయ, అంత్జాతీయ ప్రతికూలతల ప్రభావంతో రోజంతా భారీ నష్టాల్లో కదలాడాయి. అయితే కనిష్టాల వద్ద కొన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలు కొంత భర్తీ అయ్యాయి.→ సెన్సెక్స్ సూచీలో ఒక్క హెచ్‌యూఎల్ (0.25%) మినహా మిగిలిన 29 షేర్లు నష్టాలు చవిచూశాయి. రంగాల వారీగా సూచీల్లో మెటల్ 6.22%, రియల్టీ 5.69%, కమోడిటీస్ 4.68%, ఇండ్రస్టియల్ 4.57%, కన్జూమర్ డి్రస్కేషనరీ 4%, ఆటో 3.77%, బ్యాంకెక్స్ 3.37%, ఐటీ, టెక్ మూడు శాతాలు క్షీణించాయి. బీఎస్ఈలో 3,515 షేర్లు నష్టపోయాయి. 570 స్టాక్స్ లాభపడ్డాయి. మిగిలిన 140 షేర్లలో ఎలాంటి మార్పుల్లేవు. 775 స్టాక్స్ ఏడాది కనిష్టాన్ని , 59 షేర్లు ఏడాది గరిష్టాన్ని తాకాయి.ఐటీ షేర్లు.. హాహాకారాలు... ఆర్థిక మాంద్య భయాలతో అమెరికా నుంచి అధిక ఆదాయాలు ఆర్జించే ఐటీ షేర్లు భారీ క్షీణించాయి. ఆన్వర్డ్ టెక్నాలజీస్ 14%, జెనెసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ 11% క్షీణించాయి. క్విక్ హీల్ టెక్నాలజీస్ 10%, జాగిల్ ప్రీపెయిడ్ ఓషియన్ సరీ్వసెస్, డేటామాటిక్స్ గ్లోబల్ సరీ్వసెస్ 9%, న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ 8%, హ్యాపియెస్ట్ మైండ్స్, సొనాటా సాఫ్ట్వేర్, టాటా టెక్నాలజీ, ఎంఫసిస్ 6% క్షీణించాయి. అధిక వెయిటేజీ ఇన్ఫోసిస్ 4%, హెచ్‌సీఎల్ టెక్ 3%, టెక్ మహీంద్రా 2.50%, ఎల్‌టీఐమైండ్‌ట్రీ 2%, విప్రో ఒకశాతం, టీసీఎస్ అరశాతంనష్టపోయాయి. బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ గడిచిన మూడు ట్రేడింగ్ సెషన్లలో 8 శాతం క్షీణించింది.టాటా.. టప టపా!టెక్నాలజీ, స్టీల్, ఆటోమొబైల్స్ రంగాల్లో అధిక భాగం వ్యాపారాలు కలిగిన టాటా గ్రూప్ షేర్లు డీలా పడ్డాయి. టాటా ట్రెంట్ షేరు 15%, టాటా స్టీల్ 9%, టాటా మోటార్స్, టాటా టెక్నాలజీ 6%, టీసీఎస్, టాటా కెమికల్స్, టైటాన్, ఇండియన్ హోటల్స్ షేర్లు 5–2% నష్టపోయాయి. ఈ గ్రూప్‌లో మొత్తం 16 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.90,000 కోట్లు హరించుకుపోయి రూ.25.3 లక్షల కోట్లకు దిగివచి్చంది. ఒకానొక దశలో రూ.2.3 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ కోల్పోయింది.అప్రమత్తత అవసరం: నిపుణులుతీవ్ర అనిశ్చితులతో ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లో భయాందోళనలు భారీగా పెరిగాయి. ట్రంప్ సుంకాల విధింపుతో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితులు ఎప్పుడు సద్దుమణుగుతాయో ఎవరికి సరైన స్పష్టత లేదు. అయినప్పట్టకీ.., ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్లపై ప్రభావం తక్కువగా ఉంది. క్షీణత వేళ అప్రమత్తతతో వ్యహరిస్తూ మంచి షేరు విలువ ఆకర్షణీయంగా కనిపిస్తే కొనుగోలు చేయొచ్చు. రక్షణాత్మక రంగాల్లో పెట్టుబడి మరీ మంచిది అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యూహకర్త వి.కే. విజయ్‌కుమార్ తెలిపారు.

వచ్చేస్తున్నాయి.. సరికొత్త స్మార్ట్ఫోన్లు
ప్రస్తుతం ఏప్రిల్ నెల ప్రారంభంలో ఉన్నాం. ఈ నెలలో అనేక స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఎంట్రీ లెవల్, మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్లతో సహా వివిధ రేంజ్ ధరల్లో శాంసంగ్, ఐక్యూ, వివో, రియల్మీ వంటి బ్రాండ్ల నుంచి అద్భుత ఫీచర్లతో సరికొత్త ఫోన్లు విడుదలకు సిద్ధమయ్యాయి. ఆయా ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు ఇప్పటికే వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో లాంచ్ అవుతున్న కొన్ని స్మార్ట్ఫోన్లు.. వాటి ఫీచర్ల గురించి మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం.రియల్మీ నార్జో 80 ప్రో ఏప్రిల్ 9న రియల్మీ నార్జో 80 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. శక్తివంతమైన డైమెన్సిటీ 7400 చిప్సెట్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకత. ఎక్కువ కాలం పనిచేసే అంతరాయం లేని మల్టీటాస్కింగ్ కోరుకునే వినియోగదారులకు ఈ కాంబినేషన్ అనువైన ఎంపికగా చేస్తుంది.వివో వీ50ఈ ఏప్రిల్ 10న లాంచ్ కానున్న వీ50ఈతో కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ల సంప్రదాయాన్ని వివో కొనసాగిస్తోంది. సోనీకి చెందిన ఐఎంఎక్స్ 882 సెన్సార్ కలిగిన ఈ ఫోన్ అసాధారణ ఫోటోగ్రఫీ సామర్థ్యాలను అందిస్తుంది, షట్టర్ బగ్స్, కంటెంట్ క్రియేటర్లకు సరైనదిగా ఉంటుంది.ఐక్యూ జెడ్10 7,300 ఎంఏహెచ్ బ్యాటరీతో ఐక్యూ జెడ్10 స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 11న లాంచ్ కానుంది. స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్ సెట్ తో కూడిన ఈ డివైస్ గేమర్స్, హెవీ డ్యూటీ యూజర్ల కోసం రూపొందించారు.శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ ఏప్రిల్ 15న లాంచ్ కానుంది. సొగసైన డిజైన్, శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ మొబైల్ టెక్నాలజీలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుందని భావిస్తున్నారు. ఇందులో హైలైట్ ఏంటంటే.. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అద్భుతమైన ఇమేజ్ క్వాలిటీని అందిస్తుంది.

‘ట్రంప్’ అలజడికి తట్టుకున్న ఒకేఒక్క ఇన్వెస్టర్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ప్రకటించిన టారిఫ్‌లను తట్టుకోవడానికి చాలా మంది ఇన్వెస్టర్లు ఇబ్బంది పడుతుంటే, వారెన్ బఫెట్ మాత్రం అమెరికా స్టాక్ మార్కెట్లలో జోరు కొనసాగిస్తున్నారు. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, జుకర్ బర్గ్, బెర్నార్డ్ అర్నాల్ట్ వంటి వారు వందల బిలియన్ డాలర్లు నష్టపోయారు. గత రెండు రోజుల్లో యూఎస్ స్టాక్ మార్కెట్లలో ట్రిలియన్ డాలర్లు ఆవిరైనా బెర్క్‌షైర్ హాత్వే చైర్మన్, సీఈఓ వారెన్ బఫెట్ మాత్రం తన కంపెనీలో పెట్టుబడులతో బఫెట్ లాభాలను ఆర్జిస్తూనే ఉన్నారు.ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఇప్పటివరకు 184 దేశాలపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఫలితంగా వాల్ స్ట్రీట్ విలువ దాదాపు 8 ట్రిలియన్ డాలర్ల మేర క్షీణించడంతో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. గత రెండు రోజుల్లో యూఎస్ స్టాక్ మార్కెట్లు దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేశాయి. 2020 మార్చిలో కోవిడ్ -19 మహమ్మారి తర్వాత ఇదే అత్యంత భారీ పతనం. అయితే ఈ ట్రెండ్ బఫెట్‌పై మాత్రం ఎలాంటి ప్రభావం చూపడం లేదు. ఈ ఏడాది ఆయన తన సంపదకు 12.7 బిలియన్ డాలర్లు జోడించారు. ప్రస్తుతం బఫెట్ సంపద 155 బిలియన్ డాలర్లుగా ఉంది.ముందస్తు ఆలోచనలతోనే.. బఫెట్ పతనం కాకుండా ఉండటానికి కొన్ని గణనాత్మక చర్యలు తీసుకున్నారు. బహుశా మార్కెట్ తిరోగమనం సంభవిస్తుందనే అంచనాతో ఆయన భారీ కొనుగోళ్లలో నగదును మదుపు చేయడం మానేశారు. 2024లో బుల్ మార్కెట్లు ఊగిసలాటలో ఉన్న సమయంలో బఫెట్ కంపెనీ ఈక్విటీల్లో 134 బిలియన్ డాలర్లను విక్రయించి 334 బిలియన్ డాలర్ల నగదుతో ఏడాదిని ముగించింది.తన తోటి ఇన్వెస్టర్లు ఎదురుగాలులతో ఇబ్బందులు పడుతున్నప్పుడే బఫెట్ మెల్లగా యాపిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి యూఎస్ టెక్ స్టాక్స్‌లో పెట్టుబడులను తగ్గించడం ద్వారా సాహసోపేతమైన చర్య తీసుకున్నారు. మరోవైపు జపాన్ ట్రేడింగ్ దిగ్గజాలపై మాత్రం ఆయన పెట్టుబడులు రెట్టింపు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో బఫెట్ జపాన్‌లోని ఐదు అతిపెద్ద వాణిజ్య సంస్థలైన మిట్సుయి, మిత్సుబిషి, సుమిటోమో, ఇటోచు, మరుబెనిలలో తన వాటాను పెంచుకున్నారు.రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం, బెర్క్‌షైర్ ఇప్పుడు మిత్సుయి అండ్ కోలో 9.82 శాతం, మిత్సుబిషి కార్ప్‌లో 9.67 శాతం, సుమిటోమో కార్ప్‌లో 9.29 శాతం, ఇటోచు కార్ప్‌లో 8.53 శాతం, మరుబెని కార్ప్‌లో 9.30 శాతం వాటాలను కలిగి ఉంది. ఈ పెట్టుబడులు బెర్క్ షైర్ హాత్వే మార్కెట్ క్యాప్ ను 1.14 ట్రిలియన్ డాలర్లకు మించి, టెస్లా వంటి అగ్రశ్రేణి కంపెనీలను అధిగమించేలా చేశాయి.

EMIలు తగ్గుతాయ్.. లోన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్..
దేశంలోని రుణగ్రహీతలకు శుభవార్త. అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) తన ఎంసీఎల్ఆర్ (వడ్డీ రేటు)ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. సవరించిన తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ 9.10 శాతం నుంచి 9.35 శాతం మధ్య ఉంటుంది. సవరించిన రేట్లు ఏప్రిల్ 7 నుంచి వర్తిస్తాయి.ఎంసీఎల్ఆర్.. దాని ప్రభావంమార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్ లేదా ఎంసీఎల్ఆర్ అనేది ఒక నిర్దిష్ట రుణం కోసం బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు వసూలు చేయాల్సిన కనీస వడ్డీ రేటు. ఇది రుణానికి వడ్డీ రేటు తక్కువ పరిమితిని నిర్దేశిస్తుంది. ఆర్బీఐ 2016లో ఎంసీఎల్ఆర్ను ప్రవేశపెట్టింది.గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలతో సహా వివిధ ఫ్లోటింగ్-రేట్ రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించడానికి బ్యాంకులు ఉపయోగించే బెంచ్‌మార్క్ రేటును ఎంసీఎల్ఆర్ అంటారు. ఈ ఎంసీఎల్ఆర్ తగ్గడం వల్ల రుణ ఈఎంఐలు లేదా రుణ కాలపరిమితి తగ్గుతుంది. ఇది దీర్ఘకాలికంగా రుణగ్రహీతలకు ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే ఈ ప్రయోజనం పరిధి, సమయం రుణ ఒప్పందంలో పేర్కొన్న రీసెట్ క్లాజ్‌పై ఆధారపడి ఉంటుంది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణ రేట్లుఓవర్నైట్, ఒక నెల ఎంసీఎల్ఆర్ కాలపరిమితిని 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 9.20 శాతం నుంచి 9.10 శాతానికి తగ్గించింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ను 9.30 శాతం నుంచి 9.20 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ను 9.40 శాతం నుంచి 9.30 శాతానికి తగ్గించింది. ఏడాది, రెండేళ్ల ఎంసీఎల్ఆర్ రేటును 9.40 శాతం నుంచి 9.30 శాతానికి తగ్గించింది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ను 9.45 శాతం నుంచి 9.35 శాతానికి తగ్గించింది.
ఫ్యామిలీ

వ్యాధులకు చెక్‌పెట్టి.. ఆరోగ్యంగా జీవిద్దాం ఇలా..!
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.. ఆరోగ్యం లేకపోతే కోట్లాది రూపాయలు ఉన్నా సుఖం లేనట్టే.. ప్రస్తుత జీవన శైలితో ప్రపంచ ఆరోగ్యం తిరోగమన బాట పడుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా రోగాలు పెరుగుతున్నాయని, ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948లోనే గుర్తించింది. తొలిసారిగా వరల్డ్ హెల్త్ అసెంబ్లీని ఏర్పాటు చేసింది. ఏటా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించాలని ఈ అసెంబ్లీ 1950లో తీర్మానించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించి, అందరూ ఆరోగ్యంగా జీవించేలా చేయటమే దీని ముఖ్యఉద్దేశం. రోగాలు వచ్చిన తర్వాత వైద్యుల దగ్గరకు పరిగెట్టడం కంటే ముందు జాగ్రత్త చర్యలతో ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎన్సీడీ–3.0 ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై దృష్టిపెట్టింది. బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించేందుకు గత ఏడాది నవంబరులో ఎన్సీడీ (నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ 3.0) కార్యక్రమం పేరుతో స్క్రీనింగ్ పరీక్షలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్‌తోపాటు, పలు రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయితే వైద్యం అందించేందుకు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. 8,75,977 మందికి స్క్రీనింగ్ పరీక్షలు గుంటూరు జిల్లాలో 18 ఏళ్లు దాటిన జనాభా 17,50,399 మంది ఉన్నారు. వీరిలో 8,75,977 మందికి వైద్యసిబ్బంది స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. వీరిలో మధుమేహం అనుమానితులు 23,103 మంది ఉండగా, 4,438 మందికి మధుమేహం ఉన్నట్లు నిర్ధారౖణెంది. ఇప్పటికే షుగర్‌తో 1,17,609 మంది చికిత్స పొందుతున్నారు. బీపీ అనుమానిత బాధితులు 23,294 మంది ఉండగా, 4,635 మందికి బీపీ ఉన్నట్లు నిర్ధారౖణెంది. ఇప్పటికే బీపీతో 1,33,419 మంది చికిత్స పొందుతున్నారు. క్యాన్సర్ అనుమానిత కేసులు 94 ఉండగా, క్యాన్సర్ ఉన్నట్టు ఆరుగురికి నిర్ధారౖణెంది. క్యాన్సర్ రోగులను గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్లో ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. గుండె ప్రధానం శరీరంలోని అన్ని అవయవాల్లో గుండె ప్రధానమైంది. లబ్‌డబ్‌మంటూ ప్రతి నిమిషం కొట్టుకుంటూ ఉంటేనే మనిషి ప్రాణాలతో ఉన్నట్లు లెక్క. గుండెకోసం తప్పని సరిగా రోజూ వ్యాయామం చేయాలి. మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలి. నూనె అధికంగా ఉండే పదార్థాలు , చికెన్, మాంసం లాంటి కొవ్వు అధికంగా ఉండే పదార్థాలను తినకూడదు. ఆకు, కాయగూరలు తీసుకోవాలి. ఉప్పును సాధ్యమైనంత తక్కువగా వినియోగించాలి. బీపీ, షుగర్లను నియంత్రణలో పెట్టుకోవాలి. ధూమపానం, మద్యపానం లాంటి వ్యసనాల జోలికి వెళ్ళకూడదు. ఒత్తిడి లేకుండా ఉండాలి. –డాక్టర్ పోలవరపు అనురాగ్, ఇంట్రవెన్షనల్ కార్డియాలజిస్టు, గుంటూరు.బీపీ, షుగర్లను అదుపులో పెట్టుకోవాలి... శరీరంలో వచ్చే అనేక శారీరక రుగ్మతలకు రక్తపోటు, మధుమేహం ప్రధాన కారణాలవుతున్నాయి, ఇవి అదుపులో లేకపోతే మూత్రపిండాలు, గుండె ఫెయిలవుతాయి. దృష్టిలోపాలు వస్తాయి. పక్షవాతం కూడా వస్తుంది. రోజూ ఉప్పు వాడకం 5 గ్రాముల కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. బీపీ వయస్సుతో సంబంధం లేకుండా, వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. అదుపులో పెట్టేందుకు రోజూ యోగా చేయాలి. పొటాషియం, క్యాల్షియం ఉండే పాలు, పండ్లు లాంటి ఆహారాన్ని తీసుకోవాలి. –డాక్టర్ రేవూరి హరికృష్ణ, ఇన్ఫెక్షన్స్ స్పెషలిస్టు, గుంటూరు.ఆరునెలలకోసారి కిడ్నీ పరీక్షలు అవసరం కాళ్లవాపులు, మూత్రం ఎక్కువసార్లు రావటం, మూత్రంలో మంట రావటం, రక్తం కారటం, ఆకలిలేకపోటం, వాంతులు కావడం వంటి లక్షణాలు కన్పిస్తే కిడ్నీలకు వ్యాధి సోకినట్లు అర్ధం చేసుకోవాలి. కుటుంబంలో ఒకరికి ఉంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ముందస్తుగా పరీక్షలు చేయించుకోవటం మంచిది. నొప్పి మాత్రలు ఎక్కువగా వాడటం, నాటు మందులు వాడటం, బీపీ, షుగర్లు అదుపులో లేకపోవటం వల్ల మూత్రపిండాలు పాడవుతాయి. బీపీ, ఘగర్‌లు ఉన్నవారు ప్రతి 6 నెలలకు ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్ చింతా రామక్రిష్ణ, సీనియర్ నెఫ్రాలజిస్ట్, గుంటూరు(చదవండి: రాజ వంశం కాదు..సంపదలో వారసత్వానికి నో ఛాన్స్! బిల్‌గేట్స్ బెస్ట్ పేరెంటింగ్ పాఠం)

పోస్ట్‌పార్టం సమస్యలతో శ్రద్ధా ఆర్య, ట్విన్స్ జిబ్లీ ఫోటోలు సూపర్ క్యూట్
నటి శ్రద్ధా ఆర్య ఇటీవల పండంటి కవలల పిల్లలకు జన్మనిచ్చింది. ముద్దుల మూటగట్టే తన కవలల సంరక్షణలో బిజీగా ఉంది. ఇటీవల, శ్రద్ధా తన పిల్లల పేర్లను గిబ్లి-శైలి చిత్రంతో ప్రకటించింది. మరోవైపు తొలి సారిగా ప్రతి స్త్రీ ఎదుర్కొనే ప్రసవానంతర సమస్యల గురించి (Postpartum Problem) మాట్లాడింది.వివాహం పిల్లలతో ప్రస్తుతం నటనకు దూరంగా ఉన్న శ్రద్ధా ఆర్య (Shraddha Arya) మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. అయితే ప్రసవానంతర సమస్యలు గురించి మాట్లాడింది. సాధారణంగా మాతృత్వం అనేది మహిళలకు వరం మాత్రమే కాదు.. అనేక సమస్యలకు మూలం కూడా. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ప్రసవానంతర సమస్యలతో మహిళలు చాలా ఇబ్బంది పడతారు. శారీరక సమస్యలతోపాటు,మానసిక ఒత్తిడితో మరికొన్ని ఇబ్బందు లొస్తాయి. దీనినే పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ (పీపీడీ)అని వ్యవహరిస్తారు. ఈ ఒత్తిడి కారణంగా, ఆత్మన్యూనతా భావంతో కుంగిపోవడం, తానే హాని చేసుకోవడం, శిశువును కూడా గాయ పరచడం వంటి స్థితికి వెళతారు. శరీరంలో మార్పులు, అధిక బరువు , మానసిక స్థితిలో మార్పులు, నిరాశ, తదితర ప్రసవానంతరం వచ్చే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రసవ సమయంలో బిడ్డను ఈ లోకంమీదికి తెచ్చేందుకు తల్లి పడే బాధ,ఆ వేదన వర్ణనాతీతం. వీటి గురించే ఆమె ఇన్‌స్టాలో ప్రస్తావించింది. ముఖ్యంగా జుట్టు రాలడం గురించి తన అభిప్రాయాలను షేర్ చేసింది. విపరీతంగా జుట్టురాలడంపై ఆవేదన వ్యక్తం చేసింది. కుచ్చులుగా రాలిపోతున్న వెంట్రుకల ఫోటోను పంచుకుంది. View this post on Instagram A post shared by Shraddha Arya (@sarya12)శ్రద్ధా ఆర్య, రాహుల్ నాగల్, జిబ్లి ఆర్ట్ ట్రెండ్టీవీ నటిగా అద్భుతమైన నటనతో పాపులర్ అయింది శ్రద్ధా ఆర్యా. 2004లో టీవీ రియాలిటీ షోలో పాల్గొన్న ఈమె.. 2006లో 'కలవనిన్ కదలై' అనే తమిళ సినిమాద్వారా హీరోయిన్గా బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. తరువాత తెలుగులో గొడవ, రోమియో, కోతిమూక తదితర సినిమాల్లో నటించింది. పాటు పలు సీరియల్స్‌లోనూ యాక్ట్ చేసిన శ్రద్ధా కుండలి భాగ్య సీరియల్‌తో మరింత పాపులర్ అయింది.ఏడాది పాటు డేటింగ్ చేసిన నేవీ ఆఫీసర్ రాహుల్ నగల్ని ,శ్రద్ధా ఆర్యా 2021, నవంబరులో పెళ్లాడింది. ఈ జంటకు 2024 నవంబరు 29న ట్విన్స్( పాప, బాబు) పుట్టారు. కుమారుడికి ‘శౌర్య' అని కుమార్తెకు 'సియా' అంటూ పూర్లు కూడా పెట్టేశారు. తాజాగా జిబ్లి తరహా క్యూట్ ఫోటోలను షేర్ చేయడంతో ఇవి సోషల్ మీడియా ప్రపంచాన్ని విపరీతంగా ఆకర్షించాయి.

Bill Gates : రాజ వంశం కాదు..సంపదలో వారసత్వానికి నో ఛాన్స్!
చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు బాగుండాలని ఎంతో తాపత్రయంతో సంపాదిస్తుంటారు. కోట్లకొద్దీ ఆస్తులను కూడబెడుతుంటారు. ఒకవేళ పిల్లలకు చదువు అబ్బకపోయినా..ఏ చీకు చింతా లేకుండా దర్జాగా కూర్చుని తినాలనుకుంటారు. చాలామటుకు ధనవంతులైన తల్లిదండ్రులు ఇలానే ఆలోచిస్తుంటారు. కూర్చొని తింటే కొండలైనా కరిపోతాయనే పెద్దల నానుడిలా వారసత్వ సంపద, ఆస్తులు ఏరోజుకైనా కరిగిపోక మానవు. అవేమి వారికి బతికే స్థైర్యానివ్వవు. కేవలం వాళ్ల కాళ్లమీద నిలబడి బతకగలిగే సామర్థ్యమే..పిల్లలకు శ్రీరామ రక్ష అనేది జగమెరిగిన సత్యం. ఆ సిద్ధాంతాన్నే విశ్వసిస్తానంటున్నారు ప్రపంచ కుభేరులలో ఒకరైన, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్. అంతేగాదు ఇదేం రాజులనాటి కాలం కాదు..ప్రతిదీ వారసత్వంగా తీసుకోవడానికి అని ప్రశ్నిస్తున్నారాయన. పిల్లల్ని ప్రయోజకులుగా చేయండి చాలు అంటున్నారు బిల్‌గేట్స్. అదెలాగో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇటీవల 'ఫిగరింగ్ అవుట్ విత్ రాజ్ షమానీ' పాడ్‌కాస్ట్‌లో పిల్లల పెంపకం, వారి అభ్యున్నతికి సంబంధించి అమూల్యమైన విషయాలను షేర్ చేసుకున్నారు. పిల్లలు తమ తల్లిదండ్రులు సృష్టించిన సంపదను వారసత్వంగా పొందడం కంటే స్వయంగా సక్సెస్ అవ్వడానికి మొగ్గు చూపేలా చేయాలి. అదే వారి అభ్యున్నతికి దోహదపడుతుందని అన్నారు. పిల్లలు ఉన్నత స్థానంలో ఉంచడటం కాదు..ఉన్నతంగా ఆలోచించేలా పెంచాలి. తాతలు, తండ్రుల ఆస్తులు వారసత్వంగా పొందడం కాదు..వాళ్ల ఐడెంటిటీతో బతికి.. స్వయంగా సంపాదించేలా ఎదగనివ్వాలంటున్నారు. పిల్లలను ప్రయోజకులగా తీర్చిదిద్దడం అంటే ఇదేనని నొక్కి చెప్పారు. అంతేగాదు బిల్‌గేట్స్ తన ముగ్గురు పిల్లలు కూడా తన సంపదలో కేవలం ఒక్క శాతం ఆస్తికి మాత్రమే అర్హులని అన్నారు. సంపన్న కుటుంబాలు తమ పిల్లల ఎదుగుదల కోసం స్వయంకృషికే పెద్దపీటవేయాలన్నారు. వారికి మంచి చదువు, వసతులను అందిస్తే చాలు..పైకి రావాల్సిన బాధ్యత వారిదేనని చెప్పారు. అలా చేస్తేనే డబ్బు విలువ, కష్టం గొప్పదనం తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. తల్లిదండ్రులుగా మన పిల్లలపై మనకు అపారమైన ప్రేమ ఉంటుదనేది కాదనలేని సత్యం. కానీ ఆ ప్రేమ వారి ఎదుగుదలను కుంటుపడేలా చేయకూడదు. తమ పిల్లలు మంచి ప్రయోజకులు అయ్యి..సమున్నత స్థాయిలో ఉండాలని కోరుకోవాలి. వారు ఎదిగేందుకు అవకాశాలివ్వండే తప్ప ప్రతీది మనమే అమర్చిపెట్టేయకూడదని హితవు పలకారు. అలాగే వాళ్లకు ఇది తమతల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తి.. తమది కాదనే భావన ఉండాలన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి ఆశించడం అనే రోగం బారినపడకుండా పెంచాలని చెప్పారు. ఇక బిల్గేట్సకి తన మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్‌తో రోరీ గేట్స్, జెన్నిఫర్ గేట్స్ నాసర్, ఫోబ్ గేట్స్ అనే ముగ్గురు పిల్లలున్నారు. ఆయన రూ. 13 లక్షల కోట్ల సంపాదనలో కేవలం ఒక్కశాతం మాత్రమే తన పిలల్లకు వాటా ఉంటుందని అన్నారు. తన పిల్లలు తండ్రికి ఉన్నంత సంపదను కలిగి ఉండకపోయినా.. ప్రపంచ జనాభాలో ఒక శాతం మంది ధనవంతుల సరసన ఉంటారన్నారు. తన మిగతా సంపాదనంతా ఫౌండేషన్‌కి వెళ్లిపోతుందని, అర్హులైన వాళ్లకు దక్కుతుందన్నారు. ఇలా బిల్‌గేట్స్‌లా వారసత్వ సంపదను అందించకూడదన్న జాబితాలో ఆపిల్ కంపెనీకి చెందిన దివంగత స్టీవ్ జాబ్స్, అమెజాన్ కంపెనీకి చెందిన జెఫ్ బెజోస్ వంటి అనేక మంది ప్రముఖ టెక్ దిగ్గజాలు ఉన్నారు. వారంతా కూడా వారసత్వ సంపదను సృష్టించడం పట్ల మక్కువ చూపలేదు..తమ పిల్లలు తమ ఐడెంటిటీతో ఎదగాలని భావించారు. నిజంగా ఇది ప్రతి తల్లదండ్రులు తెలుసుకోవాల్సిన గొప్ప పేరెంటింగ్ పాఠం కదూ..! (చదవండి: Weight loss Surgery: బరువు తగ్గాలని సర్జరీ చేయించుకుంది..పాపం ఆ మహిళ..!)

యోయో హనీ సింగ్ కచేరీలో అనుకోని అతిథి స్టెప్పులు, వీడియో వైరల్
రాపర్ , గాయకుడు యో యో హనీ సింగ్ సంగీతాభిమానులకు పరిచయం అవసరంలేదు.అంతర్జాతీయంగా గత పదిహేనేళ్లుగా పాప్ సంగీతాన్ని ఏలుతున్న ఘనత అతగాడి సొంతం. ఇటీవల హనీ సింగ్ భారత పర్యటన సందర్భంగా ఒక విశేషం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.హనీ సింగ్ భారత పర్యటనలో భాగంగా కోల్కతాలొ (ఏప్రిల్ 4) మ్యూజిక్ కన్సర్ట్ ఏర్పాటైంది. అతని సంగీత ఝరిలో ప్రేక్షకులంతా ఓలలాడుతున్నారు. ఈ కచేరీ సందర్భంగా వేదికపై ఉన్న యో యో హనీ సింగ్‌ను కలవడానికి ఒక వృద్ధుడు దూసుకొచ్చాడు. భారీగా గుమిగూడిన జనాల మధ్యనుంచి ,బారికేడ్‌ను దూకి మరీ వృద్ధుడి ముందుకొచ్చాడు. నెత్తిన తలపాకాగాతో ఆ పెద్దాయన (సింగ్) రావడాన్ని చూసి హనీ సింగ్ ఆయను వేదికమీదకు ఆహ్వనించాడు. అంతే.. వేదికమీదకు రాగానే సూపర్‌గా స్టెప్పులేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హనీసింగ్ హిట్ ట్రాక్ డోప్ షోప్కు హుషారుగా నృత్యం చేశాడు. దీంతో అక్కడున్నవారంతా ఉత్సాహంతో ఊగిపోయారు. హనీ సింగ్ స్వయంగా ఈ చిన్న క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. " మై ఫరెవర్ యంగ్ ఫ్యాన్స్" అంటూ పోస్ట్ చేయడం హైలైట్ అయింది. View this post on Instagram A post shared by Yo Yo Honey Singh (@yoyohoneysingh) జస్ప్రీత్ పనేసర్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో మొత్తం వీడియోను షేర్ చేయడంతో బారికేడ్‌ను దాటి సింగ్‌ను కంటెంట్ సృష్టికర్త జస్ప్రీత్ తండ్రి అని తేలింది. "కోల్‌కతాలో హనీ సింగ్ కచేరీలో నాన్నకు ఒక అద్భుతమైన క్షణం" అంటూ ఈ జస్ప్రీత్ వీడియోలో చెప్పారు. "నాకు హనీ సింగ్ అంటే చాలా ఇష్టం. పదేళ్ల వయస్సు నుండి అతని పాటలు వింటున్నాను. నా తండ్రి ఈ రోజు అతనితో వేదికపై డ్యాన్స్ చేశాడు. చెప్పలేనంత ఆనందంగా ఉంది" అంటూ పేర్కొన్నాడు.
ఫొటోలు


వైభవంగా ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)


మ్యాడ్‌డాక్ ప్రొడక్షన్ 20 ఇయర్స్ సక్సెస్ పార్టీలో మెరిసిన తారలు (ఫొటోలు)


భీమవరం విష్ణు కాలేజీలో ‘జాక్’ మూవీ టీమ్ సందడి (ఫొటోలు)


Allu Arjun: ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్' పుట్టినరోజు.. మధురమైన జ్ఞాపకాలు (ఫోటోలు)


భద్రాచలం : వైభవోపేతంగా రామయ్యకు పట్టాభిషేకం (ఫొటోలు)


రోమ్ వెళ్లారు.. మహేశ్ ని మాత్రం దాచేశారు (ఫొటోలు)


నేచురల్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న నటి కాయాదు లోహర్ గ్లామరస్ (ఫొటోలు)


ఓర చూపు, మైమరపించే అందాలతో మాయ చేస్తున్న కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోస్


సన్‌రైజర్స్ vs గుజరాత్ మ్యాచ్‌లో సందడి చేసిన సినీనటి సౌమ్యజాను (ఫోటోలు)


పసలేదు బ్రో.. సన్‌రైజర్స్ ఆట తీరుపై అభిమానుల నిరాశ (ఫొటోలు)
అంతర్జాతీయం

Saudi Arabia: 14 దేశాలకు వీసాల జారీ నిలిపివేత.. జాబితాలో భారత్
రియాద్: హజ్ యాత్ర సమీపిస్తున్న తరుణంలో సౌదీ అరేబియా ప్రభుత్వం(Kingdom of Saudi Arabia) (KSA) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరగబోయే హజ్ యాత్రకు ముందుగానే 14 దేశాల పౌరులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిషేధం ఉమ్రా, బిజినెస్, కుటుంబ సందర్శన తదితర వీసాలపై జూన్ మధ్యకాలం వరకు అంటే హజ్ సమయం ముగిసే వరకు అమలులో ఉండనుంది. హజ్ యాత్ర(Hajj pilgrimage) సమయంలో రద్దీని నియంత్రించేందుకు, సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ చేసేందుకు వచ్చేవారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకున్నదని సౌదీ అధికారులు తెలిపారు. గత ఏడాది హజ్ సమయంలో తీవ్రమైన వేడి వాతావరణం, రిజిస్ట్రర్డ్ కాని యాత్రికుల కారణంగా తొక్కిసలాట ఘటన చోటుచేసుకుంది. ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండేందుకే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వీసా నిబంధనలను మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.సౌదీ అరేబియా సవరించిన నిబంధనల ప్రకారం ఈ ఏడాది ఉమ్రా వీసా(Umrah Visa) కోసం కేటాయించిన గడువు 2025, ఏప్రిల్ 13తో ముగియనుంది. అలాగే హజ్ ముగిసే వరకు కొత్త ఉమ్రా వీసాలు జారీ చేయరు. ఈ నిషేధం కారణంగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తో సహా పలు దేశాల నుంచి సౌదీ వెళ్దాలనుకునేవారికి నిరాశ ఎదురయ్యింది.వీసాలు నిషేధించిన దేశాలివే..1. భారత్2. బంగ్లాదేశ్3. పాకిస్తాన్4. అల్జీరియా5. ఈజిప్ట్6. ఇథియోపియా7. ఇండోనేషియా8. ఇరాక్9. జోర్డాన్10. మొరాకో11. నైజీరియా12. సుడాన్13. ట్యూనిషియా14. యెమెన్నిషేధం వెనుక కారణాలివే..సౌదీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హజ్ సమయంలో భద్రత కల్పించేందుకు, రద్దీని నియంత్రించేందుకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2024లో హజ్‌యాత్రలో పాల్గొన్న 1,200 మందికి పైగా యాత్రికులు వివిధ కారణాలతో మృతిచెందారు. రిజస్టర్డ్కాని యాత్రికుల కారణంగా హజ్లో తీవ్రమైన రద్దీ ఏర్పడిందని సౌదీ అరేబియా అధికారులు భావిస్తున్నారు. దీనిని నివారించేందుకే వివిధ రకాల వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, హజ్ యాత్ర కోసం ప్రత్యేకంగా నమోదైన యాత్రికులకు ఈ నిషేధం వర్తించదు. దౌత్య వీసాలు, నివాస అనుమతులు, హజ్-నిర్దిష్ట వీసాలు యథావిధిగా కొనసాగుతాయి.ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాలపై బీజేపీ గురి.. రంగంలోకి అమిత్ షా

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు.. ట్రంప్ రియాక్షన్ ఇదే..
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దాడులు చేయకుండా తాము రష్యాను ఆపాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. యుద్ధం కారణంగా ప్రతీ వారం వేలాది మంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించారు. ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..‘ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తోంది. మేము రష్యాతో మాట్లాడుతున్నాం. దాడులను ఆపాలని మేము కోరుకుంటున్నాం. నిరంతరం రష్యా బాంబు దాడులు చేయడం సరికాదు. దాడుల కారణంగా ప్రతీ వారం వేలాది పౌరులు చనిపోతున్నారు. ఇలా జరగడం నాకు ఇష్టం లేదు. కాల్పులు విరమణపై చర్చలు జరుగుతున్నాయి. రష్యాను ఒప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాము’ అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. ఇటీవల పుతిన్‌తో ట్రంప్ ఫోన్లో మాట్లాడిన అనంతరం.. కాల్పుల విరమణ ఒప్పందానికి మాస్కో కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే, రష్యాపై పశ్చిమదేశాల ఆంక్షలు ఎత్తివేస్తేనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలుచేస్తామని పుతిన్ షరతు పెట్టినట్లు తెలుస్తోంది. అంతేగాక.. జపోరిజియా అణు విద్యుత్ ప్లాంట్‌ను ఉక్రెయిన్‌కు తిరిగిచ్చేందుకు కూడా రష్యా నిరాకరిస్తున్నట్లు సమాచారం. కీవ్‌తో కాల్పుల విరమణ అంశాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ కావాలనే సాగదీస్తున్నారని ట్రంప్ చెప్పుకొచ్చారు. వాషింగ్టన్ మధ్యవర్తిత్వాన్ని మాస్కో తారుమారు చేస్తోందని ఆరోపించారు.#WATCH | On the ongoing Russia-Ukraine war, and if any peace deal is expected, US President Donald Trump says, "We are talking to Russia, we would like them to stop. I don't like them bombing on and on, and every week thousands of young people being killed."(Source - US Network… pic.twitter.com/L15l0oECdw— ANI (@ANI) April 7, 2025ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత నగరం క్రైవీరిపై శుక్రవారం రష్యా క్షిపణి దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో తొమ్మిది మంది చిన్నారులు సహా మొత్తం 18 మంది మరణించారు. ఈ ఘటనపై ఉక్రెయిన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం స్పందించిన తీరుపై జెలెన్స్కీ అసహనం వ్యక్తం చేశారు. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ భావోద్వేగ పోస్టు పెట్టారు. జెలెన్స్కీ మాట్లాడుతూ..‘క్రైవీరిపై జరిగిన దాడి విషయంలో అమెరికన్ ఎంబసీ స్పందన పేలవంగా ఉంది. అంత పెద్ద దేశం ఇలాంటి బలహీన ప్రకటన చేయడం ఆశ్చర్యంగా ఉంది. చిన్నారులను చంపిన క్షిపణి గురించి మాట్లాడేటప్పుడు వారు ‘రష్యన్’ అనే పదాన్ని చెప్పడానికి కూడా భయపడుతున్నారు. యుద్ధం ముగియాలి. అయితే ఈ ఉద్రిక్తతలను ముగించాలనే ఉద్దేశం రష్యాకు లేదు. కాల్పుల విరమణను కాకుండా చిన్నారుల ప్రాణాలు తీయడాన్ని మాస్కో ఎంచుకుంటోంది. అందుకే ఆ దేశంపై పూర్తిస్థాయి ఒత్తిడి తీసుకురావాలి’ అని కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో రష్యా దాడిపై జపాన్, స్విట్జర్లాండ్ దేశాల రాయబార కార్యాలయాలు స్పందించిన తీరును జెలెన్స్కీ ప్రశంసించారు.

సముద్రంలో కూలిన హెలికాప్టర్.. ముగ్గురు మృతి
టోక్యో: జపాన్‌లో హెలికాప్టర్ ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మెడికల్ హెలికాప్టర్ సముద్రంలో కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. మరో ముగ్గురిని సహాయక బృందాలు రక్షించాయి. మృతిచెందిన వారిలో వైద్యుడి కూడా ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.వివరాల ప్రకారం.. జపాన్‌లో సాధారణంగా డాక్టర్ హెలికాప్టర్ అని పిలువబడే విమానం Medevac EC-135 ప్రమాదానికి గురైంది. ఆదివారం నాగసాకి ప్రిఫెక్చర్‌లోని విమానాశ్రయం నుండి ఫుకుయోకాలోని ఆసుపత్రికి రోగులను తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. నైరుతి జపాన్ ప్రాంతంలోని సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాద సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన జపాన్ కోస్ట్ గార్డ్, సహాయక బృందాలు ముగ్గురిని కాపాడారు.అనంతరం, ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించినట్టు అధికారులు వెల్లడించారు. మృతిచెందిన వారిలో వైద్య వైద్యుడు కీ అరకావా (34), రోగి మిత్సుకి మోటోయిషి (86), ఆమె సంరక్షకురాలు కజుయోషి మోటోయిషి (68) ఉన్నారని అధికారులు తెలిపారు. తరువాత వారి మృతదేహాలను జపాన్ ఎయిర్ సెల్ఫ్-డిఫెన్స్ ఫోర్స్ హెలికాప్టర్ ద్వారా నీటి నుండి వెలికితీశారు. ప్రాణాలతో బయటపడిన వారిలో హెలికాప్టర్ పైలట్ హిరోషి హమడ (66), మెకానిక్ కజుటో యోషిటకే, నర్సు సకురా కునిటకే(29) ఉన్నారు. ప్రమాదం నుంచి బయటపడిన ముగ్గురు హైపోథర్మియాకు గురయ్యారని వైద్యులు వెల్లడించారు. #Breaking A Medevac EC-135 crashed off Nagasaki (Japan). 3 of 6 aboard died. Helicopter had been missing east of Tsushima island, found floating upside fown near Iki island. Helicopter [Registration “JA555H”] was operated by “SGC Saga Aviation opf Fukuoka Wajiro Hospital” pic.twitter.com/M5J4t7vf0H— Air Safety #OTD by Francisco Cunha (@OnDisasters) April 6, 2025

టారిఫ్‌లపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) ప్రపంచంలోని పలు దేశాలపై సుంకాల విధింపు నేపథ్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆ ఆందోళనలపై ట్రంప్ స్పందించారు. సుంకాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.అమెరికా ప్రపంచ దేశాలపై సుంకాల విధింపుతో గ్లోబల్ స్టాక్ మార్కెట్లో అనిశ్చితి , మాంద్యం భయాలు,అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థ అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ప్రపంచ ఆర్ధిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ట్రంప్ మాత్రం తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని భీష్మించుకున్నారు.ఈ తరుణంలో ఎయిర్ ఫోర్స్ వన్‌లో.. ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అమెరికా విధించే సుంకాల కారణంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయని నేను అనుకోవడం లేదు. కానీ కొన్నిసార్లు ఏదైనా సమస్యను పరిష్కరించేందుకు మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అంటే పరోక్షంగా కొన్నిసార్లు ఏదైనా సమస్యను పరిష్కరించడానికి అది ఎంత కష్టంగా ఉన్నా నిర్ణయం తీసుకోవాల్సిందే. ఆ నిర్ణయం వల్ల బాధపడినా సరే. వెనక్కి తగ్గకూడదని అన్నారు. 👉ఇదీ చదవండి : ట్రంప్‌కు హ్యాండ్సాఫ్ సెగసోమవారం పునఃప్రారంభం అనంతరం స్టాక్ మార్కెట్లు భారీ క్రాష్ అవుతాయన్న అంచనాల నడుమ ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సుంకాల విధింపుపై నెలకొన్న ఆందోళనల్ని తొలగించేందుకు తన అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తోందని చెప్పారు. సుంకాల విధింపు తర్వాత అమెరికాతో వాణిజ్యం ఒప్పందాలు కుదుర్చుకోవడానికి 50కి పైగా దేశాలు తమని సంప్రదించాయని వెల్లడించారు. ‘టారిఫ్ విధింపుపై యూరోప్, ఆసియా ఇతర దేశాది నేతలతో మాట్లాడాను. యాభైకి పైగా దేశాలు వ్యాపార, వాణిజ్యం విషయంలో అమెరికా ఒప్పందం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నేను వారికి ఒకటే చెప్పాను. మీ దేశం మా దేశంతో చేసే వాణిజ్యంలో ఎలాంటి లోటు ఉండకూడదు. లోటు ఉంటే మాకు నష్టమే. మేం లాభాల్ని ఆశించడం లేదు. అటు నష్టం, ఇటు లాభం కాకుండా సమతూల్యంగా ఉండాలని అనుకుంటున్నట్లు వారితో చెప్పామని, అందుకు వారు సుముఖత వ్యక్తం చేయడమే కాదు.. టారిఫ్ విధింపు తర్వాత మాతో వ్యాపారం, వాణిజ్యం చేసేందుకు ముందుకు రావడం శుభపరిణామం అని తెలిపారు.
జాతీయం

యూపీలో ఏం జరుగుతోంది?: సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల తీరుపై దేశ అత్యున్నత న్యాయం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్ కేసుల్ని క్రిమినల్ కేసులుగా నమోదు చేయడంపై సుప్రీంకోర్టు మండిపడింది. యూపీలో చట్టాన్ని అతిక్రమించే చర్యలే ప్రతిరోజూ కనిపిస్తున్నాయంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఓ వ్యక్తి తాను తిరిగి తీసుకున్న నగదును ఇవ్వకపోవడంతో అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు యూపీ పోలీసులు. ఈ కేసులో సుప్రీంకోర్టులో విచారణకు రావడంతో అసలు యూపీలో ఏం జరుగుతుందని సూటిగా ప్రశ్నించింది సీజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్శనాథన్‌లతో కూడిన ధర్మాసనం.‘ఇదొక సివిల్ కేసు.. దీన్ని క్రిమినల్ కేసు కింద ఎందుకు ఫైల్ చేశారు. యూపీ పోలీసుల తీరు ఎంతమాత్రం సహేతుకం కాదు. సివిల్ నేపథ్యం ఉన్న కేసుల్ని క్రిమినల్ కేసుగా ఎందుకు మార్చి రాశారు. చట్ట ప్రకారం ఇది సరైనది కాదు. ఒక మనిషి దగ్గర తీసుకున్న డబ్బును తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వలేని పక్షంలో అది క్రిమినల్ కేసులోకి రాదు యూపీలో ప్రతీరోజూ చాలా వరకూ ఈ తరహా కేసులే కనిపిస్తున్నాయి. సివిల్ కేసుల్ని తీసుకొచ్చి క్రిమినల్ కేసుల కింద ఎలా ఫైల్ చేస్తారు. ఇది కంప్లీట్ గా చట్టాన్ని అతిక్రమించడమే’ అని ధర్మాసనం చురకలు అంటించింది. ఇదీ చదవండి: మీ తీరు అమానవీయం’.. సీఎం యోగి సర్కార్‌పై సుప్రీం కోర్టు

World Health Day: వీళ్ల ఆరోగ్యమే.. దేశానికి మహాభాగ్యం!
రాజకీయ నాయకుల ప్రధాన విధి.. ప్రజలకు సేవ చేయడం. ఆ బాధ్యత సక్రమంగా నిర్వహించాలంటే.. వాళ్లూ ఆరోగ్యంగా ఉండాల్సిందే. అప్పుడే పరిపూర్ణంగా.. విరామం ఎరగకుండా తమ కర్తవ్యాలను నిర్వర్తించగలుగుతారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం(World Health Day) సందర్భంగా.. తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన ముఖ్య కారణాలు.. ఇంతకీ వీళ్ల ఆరోగ్యం దేశానికి ఎలా మహాభాగ్యమో ఓసారి పరిశీలిద్దాం..బిజీ షెడ్యూల్: నాయకులు రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి శ్రమిస్తుంటారు. అలాగని.. ఆరోగ్యంగా ఉంటేనే వారు దీర్ఘకాలం సేవ చేయగలుగుతారు.నిరంతర ప్రయాణాలు: స్థల మార్పులు, వేళకి తగినపుడు ఆహారం పొందకపోవడం ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. సరైన జీవనశైలి పాటించడం(టైం టు టైం తినడం లాంటివి..) ద్వారా దీన్ని నివారించగలుగుతారు.ఇమ్యూనిటీ బూస్ట్: రాజకీయ నేతలు ఎడతెరిపిలేని పర్యటనల్లో పాల్గొంటారని చెప్పుకున్నాం కదా. ఈ క్రమంలో రకరకాల వ్యాధుల బారిన పడే అవకాశం లేకపోలేదు. కాబట్టి మంచి ఆహారం.. ఆరోగ్యపు అలవాట్లు పాటిస్తే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.మానసిక ఒత్తిడి: ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక నిర్ణయాలు తీసుకోవడం అంటే.. తీవ్ర ఒత్తిడికి గురైనట్లే. ధ్యానం, యోగా ద్వారా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.ప్రధాన ఆరోగ్య సమస్యలుగుండె సంబంధిత వ్యాధులు: అధిక ఒత్తిడి కారణంగా గుండెపోటు సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి.మధుమేహం : భోజన అలవాట్ల వల్ల మధుమేహం రిస్క్ పెరుగుతుంది.హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు): చురుకైన రాజకీయ జీవితం వల్ల అధిక రక్తపోటుకి గురవుతారు.నిద్రలేమి: నిత్యం మీటింగులు, ప్రణాళికలు కారణంగా తగిన నిద్ర పొందలేక సమస్యలు ఉత్పన్నమవుతాయి.ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు..ఆహార నియంత్రణ : అధిక పిండి పదార్థాలు, కొవ్వు తగ్గించి.. శరీరానికి అవసరమైన పోషకాలు తీసుకోవడం.నియమిత వ్యాయామం : రోజూ కనీసం 30 నిమిషాలు నడవడం, యోగా చేయడం.ఆరోగ్య పరీక్షలు: ప్రతి ఆరునెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్ష చేయించుకోవడం.నిద్ర-విశ్రాంతి: రోజుకు 7-8 గంటల నిద్ర పోవడం.. వీలు చిక్కినప్పుడు విశ్రాంతి తీసుకోవడం. మరీ వీలైతే కుటుంబ సభ్యులతో సమయం గడపడం.ఒత్తిడి నిర్వహణ : ధ్యానం, యోగా, స్మార్ట్ డిజిటల్ డిటాక్స్(స్మార్ట్ ఫోన్లకు కొంతకాలం దూరంగా ఉండడం) వల్ల ఒత్తిడి తగ్గుతాయి.నేతలు తమ ఆరోగ్యం కాపాడుకోవడం.. వాళ్ల సామాజిక బాధ్యత. ఆరోగ్యమున్న నాయకులే సమర్థవంతంగా దేశానికి సేవ చేయగలరు. అదే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే.. అది ప్రభుత్వ విధానాల మీద ప్రతికూల ప్రభావం చూపించగలదు. ఆరోగ్యం మంచిగా ఉంటేనే ప్రజలకు శ్రద్ధగా సేవ చేయగలరు. ఆరోగ్యమే నిజమైన సంపద.. ఈ సందేశాన్ని ఈ World Health Day 2025 సందర్భంగా ప్రతీ నాయకుడు గుర్తించాలి!.

స్టాక్‌మార్కెట్‌పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
పాట్నా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మార్కెట్లపై(భారత్ సహా) ప్రతికూల ప్రభావం చూపెడుతున్నాయి. ఇవాళ కూడా దేశీయ మార్కెట్లు భారీగా పతనం అయ్యాయి. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్‌పై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi On Stock Market) కీలక వ్యాఖ్యలు చేశారు.స్టాక్ మార్కెట్(StockMarket)లో డబ్బు అపరిమితంగా సృష్టించబడుతుందని, అయితే అది అందరికీ లాభం చేకూర్చదని అన్నారాయన. సోమవారం పాట్నా(బీహార్)లో సంవిధాన్ సురక్షా సమ్మేళన్ పేరిట జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారాయన.అమెరికా అధ్యక్షుడి(US President) నిర్ణయం.. మన స్టాక్ మార్కెట్‌ను కుదిపేస్తోంది. మన దేశంలో ఒక శాతం కంటే తక్కువ మందే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు పెడుతున్నారు. అంటే.. ఇది అందరి కోసం కాదని అర్థం. స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించడం అనేది ఓ భ్రమ. ప్రత్యేకించి.. యువత స్టాక్ మార్కెట్లకు దూరంగా ఉండండి అని రాహుల్ గాంధీ సందేశం ఇచ్చారు.#WATCH | Patna, Bihar | Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "The US president has led to a tumble in the stock market. Less than 1% of the people here have their money invested in the stock market, which means the stock market is not a field for you. Unlimited money… pic.twitter.com/UNhSIHV4mv— ANI (@ANI) April 7, 2025

ఆశారాం మద్యంతర బెయిల్ రెండు నెలలు పొడిగింపు
జైపూర్: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా నిర్తారణ అయిన ఆధ్యాత్మిక గురువు ఆశారాం(Spiritual guru Asaram)నకు రాజస్థాన్ హైకోర్టు నుంచి ఉపశమనం లభించింది. ఆయన ప్రస్తుతం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. తాజాగా ఆశారాం అభ్యర్థన మేరకు రాజస్థాన్ హైకోర్టు ఆయన మద్యంతర బెయిల్‌ను రెండు నెలల పాటు పొడిగించింది.ఆశారాం తన అనారోగ్య సమస్యల కారణంగా గతంలో కూడా మద్యంతర బెయిల్(Interim bail) పొందిన సందర్భాలున్నాయి. ఈసారి కూడా ఆశారాం ఆనారోగ్య కారణాలతో బెయిల్ పొడిగింపును పొందారు. గుజరాత్ హైకోర్టు ఇటీవల ఆయనకు మూడు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసినప్పటికీ, రాజస్థాన్ కేసులో కూడా ఆయన బెయిల్ పొందాల్సి ఉంది. ఇప్పుడు రాజస్థాన్ హైకోర్టు ఇందుకు అనుమతిచ్చింది. ఈ పొడిగింపుతో హైకోర్టు ఆశారాంనకు జైలు వెలుపల ఉండే అవకాశాన్ని కొనసాగిస్తూ, ఆయన వైద్య చికిత్స కోసం మరింత సమయం అందించింది.ఆశారాంపై 2013లో జోధ్‌పూర్‌లో అత్యాచారం కేసు నమోదయ్యింది. విచారణ అనంతరం ఆయనకు 2018లో జీవిత ఖైదు విధించారు. అదేవిధంగా, గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఆయనకు మరో అత్యాచార కేసులో 2023లో జీవిత ఖైదు(Life imprisonment) శిక్ష పడింది. ఈ రెండు కేసుల్లోనూ ఆయన దోషిగా తేలడంతో, బెయిల్ పొందినప్పటికీ, రెండు కోర్టుల నుండి ఉపశమనం లభించే వరకు ఆయన బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో సుప్రీం కోర్టు కూడా ఆశారాంనకు వైద్య కారణాలతో తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే ఆశారాంనకు అందుతున్న బెయిల్ పొడిగింపులు బాధితుల కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. బాధితురాలి తండ్రి గతంలో ఆశారాం బెయిల్‌పై ఉన్న కారణంగా తమకు భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: విమానంలో వృద్దురాలు మృతి.. అత్యవసర ల్యాండింగ్
ఎన్ఆర్ఐ

సింగపూర్‌లో విశ్వావసు నామ ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్ లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో మార్చి 30న ఘనంగా జరిగాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో బాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. గంటల పంచాంగాన్ని ప్రముఖ పంచాంగ కర్తలు పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ (శ్ర శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి)సిద్ధం చేయడం జరిగింది. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి తదితర ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గాప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి , ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము,కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలను భక్తులు కొనియాడారు.ఉగాది వేడుకల నిర్వహణ, దాతలకు, స్పాన్సర్లతోపాటు, సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS ధన్యవాదాలు తెలిపింది. ఈ వేడుకలలో పాల్గొన్న వై.ఎస్.వి.ఎస్.ఆర్.కృష్ణ (పాస్స్పోర్ట్ అటాచ్, ఇండియన్ హై కమిషన్, సింగపూర్) గారికి అధ్యక్షులు గడప రమేష్ బాబు, కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే మై హోమ్ బిల్డర్స్, సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, గారాంటో అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, సౌజన్య డెకార్స్‌కు సొసైటీ కృతజ్ఞతలు తెలిపింది.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

అట్టహాసంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ మహాసభలు
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొదటి జాతీయ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియ (Philadelphia) ఎక్స్ పో సెంటర్లో మార్చి 28న మొదటి రోజు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులతో మొదటిరోజు వేడుక ఎన్నారైలను ఆకట్టుకుంది. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ఘనమైన స్వాగతసత్కారాన్ని నిర్వాహకులు అందించారు.కన్వెన్షన్ కన్వీనర్ సత్య విజ్జు, రవి చిక్కాల స్వాగతోపన్యాసం చేశారు. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (andhra pradesh american association) ఫౌండర్ హరి మోటుపల్లి AAA ముఖ్య నాయకులను వేదిక మీదకు ఆహ్వానించి, అభినందించారు. అనంతరం ఫౌండర్ హరి మోటుపల్లి AAA ఏర్పాటు, తదితర విషయాలపై క్లుప్తంగా వివరించారు. AAA అధ్యక్షులు బాలాజీ వీర్నాల సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఊహించిన దానికన్నా కన్వెన్షన్ విజయవంతం కావడం పట్ల ప్రెసిడెంట్ ఎలక్ట్ హరిబాబు తూబాటి హర్షం వ్యక్తం చేశారు. సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. దాతలు, వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు.కన్వెన్షన్‌ను పురస్కరించుకుని AAA నిర్వహించిన పోటీల్లో విజేతలకు హీరో, హీరోయిన్లు బహమతులు ప్రదానం చేశారు. హీరోలు సందీప్ కిషన్, ఆది, సుశాంత్, తరుణ్, విరాజ్.. హీరోయిన్స్ దక్ష, రుహాని శర్మ, అంకిత, కుషిత, ఆనంది ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ దర్శకులు సందీప్ వంగా, శ్రీనువైట్ల, వీరభద్రం, వెంకీ అట్లూరి మొదటిరోజు వేడుకల్లో మెరిశారు. డైరక్టర్ సందీప్ వంగాను స్టేజిమీదకు పిలిచినప్పుడు హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ రుహాని శర్మ, సినీ దర్శకులు వెంకీ అట్లూరి మ్యూజిక్ అవార్డ్స్ విజేతలను ప్రకటించారు. తరుణ్ నటించిన సినిమాల పాటలతో చేసిన ట్రిబ్యూట్ డాన్స్ ఆకట్టుకుంది. తానా, నాట్స్ వంటి ఇతర సంస్థల నాయకులను కూడా వేదికపైకి ఆహ్వానించి సన్మానించారు. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నిరవల్ బ్యాండ్ మ్యూజికల్ నైట్ అందరినీ అలరించింది. మహిళలు, పిల్లలు నిరవల్ బ్యాండ్ సింగర్స్ పాటలకు డాన్సులు చేసి ఆనందించారు. ఆంధ్ర వంటకాలతో వడ్డించిన బాంక్వెట్ డిన్నర్ అందరికీ ఎంతో నచ్చింది. బాంక్వెట్ డిన్నర్ నైట్‌కి సుప్రీమ్, ఎలైట్, ప్రీమియం అంటూ 3 రకాల సీటింగ్ ఏర్పాట్లు చేసి అందరి ప్రశంసలను నిర్వాహకులు అందుకున్నారు. సెలెబ్రిటీలు, స్టార్స్ అందరికీ అందుబాటులో ఉండేలా ఈ సీటింగ్ ఏర్పాట్లు చేయడం బాగుంది. ఆటపాటలతో ఆనందోత్సాహాలతో మొదటి రోజు కార్యక్రమం ముగిసింది.చదవండి: గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గల్ఫ్ కార్మికుల సాంఘిక భద్రత, సంక్షేమం, గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు గురించి ప్రవాసీ మిత్ర ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన 'రేవంత్ సర్కార్ - గల్ఫ్ భరోసా' అనే మినీ డాక్యుమెంటరీని శనివారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేశారు. చిత్ర బృందం ఇటీవల ఉత్తర తెలంగాణలోని పలు గ్రామాలలో పర్యటించి గల్ఫ్ మృతుల కుటుంబాలను, కొందరు ప్రవాసీ కార్మికులు, నాయకుల అభిప్రాయాలను చిత్రీకరించారు. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఆర్థిక సహాయం పొందిన గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యుల అభిప్రాయాలను ఈ డాక్యుమెంటరీలో పొందుపర్చారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంటరీ నిర్మాత, గల్ఫ్ వలస వ్యవహారాల నిపుణుడు మంద భీంరెడ్డి, డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన ప్రముఖ చలనచిత్ర దర్శకులు పి. సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాణ సహకారం అందించిన రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి, గల్ఫ్ జెఏసి నాయకులు చెన్నమనేని శ్రీనివాస రావు, కెమెరామెన్ పి.ఎల్.కె. రెడ్డి, ఎడిటర్ వి. కళ్యాణ్ కుమార్, సౌదీ ఎన్నారై మహ్మద్ జబ్బార్‌లు పాల్గొన్నారు. చదవండి: విదేశీ విద్యార్థులపై అమెరికా మరో బాంబు

అయోవా నాట్స్ ఆరోగ్య అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా అయోవాలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖ వైద్యులు డాక్టర్ స్మిత కుర్రా, డాక్టర్ ప్రసూన మాధవరం, డాక్టర్ నిధి మదన్, డాక్టర్ విజయ్ గోగినేని వివిధ ఆరోగ్య అంశాలపై తెలుగువారికి అవగాహన కల్పించారు. భారత ఉపఖండంలో మధుమేహం వ్యాధి, ఆ వ్యాధి ప్రాబల్యంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.. మధుమేహం నివారించడానికి లేదా తొందరగా రాకుండా ఉండటానికి కొన్ని విలువైన చిట్కాలను తెలుగు వారికి వివరించారు. హృదయ సంబంధ వ్యాధులపై కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ నిధి మదన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గుండె జబ్బు అంశాలపై ప్రేక్షకుల నుండి వచ్చిన అనేక ప్రశ్నలకు విలువైన సమాధానమిచ్చారు. గుండె సమస్యలను నివారించడానికి ఉత్తమ జీవనశైలిని సూచించారు.అయోవా చాప్టర్ బృందంలో భాగమైన పల్మనాలజిస్ట్ డాక్టర్ విజయ్ గోగినేని నిద్ర, పరిశుభ్రత, స్లీప్ అప్నియాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నాణ్యమైన నిద్ర, స్లీప్ అప్నియా లక్షణాలను గుర్తించడం వల్ల కలిగే ప్రాముఖ్యత, వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను డాక్టర్లు చక్కగా వివరించారు. డాక్టర్ స్మిత కుర్రా నేతృత్వంలో ఏర్పాటైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో చొరవ తీసుకున్నారు, ఇతర వైద్యులతో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమానికి అనుసంధాన కర్తగా వ్యవహరించారు.నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్(ఎలక్ట్) శ్రీహరి మందాడి, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి జమ్ముల ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించినందుకు అయోవా చాప్టర్ కో ఆర్డినేటర్ శివ రామకృష్ణారావు గోపాళం, నాట్స్ అయోవా టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమానికి ఆహారాన్ని స్పాన్సర్ చేసినందుకు అయోవాలోని సీడర్ రాపిడ్స్‌లో ఉన్న పారడైజ్ ఇండియన్ రెస్టారెంట్ యజమాని కృష్ణ మంగమూరి కి నాట్స్ అయోవా చాప్టర్ సభ్యుడు శ్రీనివాస్ వనవాసం కృతజ్ఞతలు తెలిపారు. నాట్స్ హెల్ప్‌లైన్ అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడుతుందని.. అత్యవసర పరిస్థితుల్లో నాట్స్ హెల్ప్ లైన్ సేవలు వినియోగించుకోవాలని నాట్స్ అయోవా చాప్టర్ సభ్యులలో ఒకరైన హొన్ను దొడ్డమనే తెలిపారు.జూలై4,5,6 తేదీల్లో అంగరంగవైభవంగా టంపాలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ అయోవా సభ్యులు నవీన్ ఇంటూరి తెలుగువారందరిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో,నాట్స్ అయోవా చాప్టర్ సలహాదారు జ్యోతి ఆకురాతి, ఈ సదస్సుకు వచ్చిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!
క్రైమ్

కిడ్నాప్.. ఆపై గ్యాంగ్ రేప్..!
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిని కిడ్నాప్ చేసి, వారం రోజుల వ్యవధిలో 22 గ్యాంగ్ రేప్‌నకు పాల్పడ్డారు. వీరిలో ఆరుగురిని అరెస్ట్ చేశామని, మిగతా వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. నగరంలోని లాల్పూర్కు చెందిన 19 ఏళ్ల యువతి మార్చి 29వ తేదీన ఫ్రెండ్‌ను కలిసేందుకని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తరచూ ఆమె ఇలాగే బయటకు వెళ్లి వస్తూంటుంది. కానీ, ఈసారి అలా జరగలేదు. దీంతో, కుటుంబసభ్యులు ఏప్రిల్ 4వ తేదీన ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు, పోలీసులు పాండేపూర్ వద్ద డ్రగ్స్ మత్తులో ఉన్న ఆమెను కిడ్నాపర్ల చెర నుంచి విడిపించారు. అనంతరం ఆమెను దగ్గర్లోని ఫ్రెండ్ ఇంటి వద్ద వదిలి వెళ్లారు. ఆ తర్వాత సొంతింటికి చేరుకుని తనపై లైంగిక దాడి జరిగిన విషయాన్ని తండ్రికి తెలిపింది. ఈ నెల 6న తండ్రితో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక హుక్కా సెంటర్, ఒక హోటల్, ఒక లాడ్జి, ఒక గెస్ట్ హౌస్‌లో తనపై మొత్తం 22 మంది అత్యాచారానికి ఒడిగట్టినట్లు అందులో ఆరోపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు హుకూల్ గంజ్, లాల్పూర్ ఏరియాలకు చెందిన కొందరు నిందితులను అదే రోజు రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అయితే, వీరిలో కొందరు మైనర్లు అయినందున పోలీసులు వీరి పూర్తి వివరాలను వెల్లడించడం లేదు. అయితే, బాధితురాలు కానీ, ఆమె కుటుంబం కానీ లైంగిక దాడి జరిగినట్లుగా ఏప్రిల్ 4న ఫిర్యాదు అందించలేదని డీసీపీ చంద్రకాంత్ మీనా తెలిపారు. అత్యాచారం జరిగిందంటూ వారు ఈ నెల 6వ తేదీన మాత్రమే ఫిర్యాదు చేశారని, దర్యాప్తు పురోగతిలో ఉందని ఆయన వివరించారు.

సహజీవనం చేసే వాడే చంపేశాడు
తిరుమలగిరి(జగ్గయ్యపేట): తనతో సహజీవనం చేస్తున్న మహిళను రోకలి బండతో మోది చంపిన ఘటన సోమవారం తెల్లవారుజామున ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపింది. జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన పసుపులేటి మురళీకృష్ణ అవివాహితుడు. లారీ క్లీనర్‌గా పని చేస్తుంటాడు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం తక్కెళ్ళ పాడుకు చెందిన వివాహిత కనపర్తి మంగమ్మ (44) తో పరిచయం ఏర్పడింది.ఆమె తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలి మురళీకృష్ణ దగ్గరికి రాగా ఇద్దరూ కలసి తిరుమలగిరిలోనే ఓ అద్దె ఇంట్లో గత 12 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో తరచూ గొడవలు పడుతుండేవారు. ఇంటి యజమాని, చుట్టుపక్కల వారు సర్ది చెబుతుండేవారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మురళీ కృష్ణ ఇంట్లో నిద్రిస్తున్న మంగమ్మ తలపై రోకలిబండతో బలంగా కొట్టి చంపి పరారయ్యాడు. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు చిల్లకల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ తోట సూర్య శ్రీనివాసులు ఘటనా స్థలానికి వచ్చి, వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్డం నిమిత్తం పేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆ తర్వాత నిందితుడు మురళీకృష్ణ పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు.

బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
చెన్నైకి చెందిన టెక్ బిలియనీర్, రిప్లింగ్ సహ వ్యవస్థాపకుడు ప్రసన్న శంకర్(Prasanna Sankar) దంపతులు వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నడిపిస్తోందని ప్రసన్న శంకర్.. తన భర్తే పెద్ద కా*పిశాచి అని దివ్యా శశిథర్(Dhivya Sashidhar) పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో విడాకులు, భరణం, కొడుకు కస్టడీ కోసం న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు. ప్రసన్న శంకర్, దివ్య తొలిసారిగా 2007లో కలుసుకున్నారు. 2013లో వీరు వివాహం చేసుకున్నారు. ప్రసన్న శంకర్, దివ్యల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలో కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. భరణం కింద తనకు నెలకు రూ. 9 కోట్ల రూపాయలు ఇవ్వాలని దివ్య డిమాండ్స్తోంది. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ప్రసన్నపై దివ్య సంచలన ఆరోపణలకు దిగింది. ది శాన్ ఫ్రాన్సిస్కో స్టాండర్డ్‌కు ఇచ్చిన వ్యక్తిగత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన భర్త కేవలం తనను సెక్స్ కోసమే అన్నట్లు చూసేవాడని తెలిపింది. ‘‘కోరిక తీర్చకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. ప్రసవ సమయంలో నొప్పి అనుభవిస్తున్నప్పుడు కూడా నాతో బలవంతంగా సెక్స్ చేశాడు. అతడు వేశ్యలతో సంబంధాలు పెట్టుకునేవాడు. బాత్రూంలో కెమెరాలతో నిఘా పెట్టేవాడు. రోజూవారీ కార్యకలాపాల సమయంలో చిత్రీకరించేవాడు. సంపదపై పన్నులు పడొద్దని నన్ను, నా కొడుకును మరో దేశానికి ఈడ్చుకెళ్లాడు. .. ఒక వేళ నాతో శృంగారంలో పాల్గొనకుంటే, బయటకు వెళ్లి దానిని పొందాలనుకుంటున్నట్లు చెప్పేవాడు. తన స్నేహితులతోనూ పడుకోవాలని ఒత్తిడి చేసేవాడు. అనూప్‌తో తనకు ఉన్న సంబంధం గురించి ప్రసన్న చెప్పేవి అన్ని కల్పితమైనవే. అతడితో నా సంబంధం లైంగికమైనది కాదు. భావోద్వేగమైనది మాత్రమే’’ అని ఆ ఇంటర్వూ్యలో తెలిపారామె. అయితే భర్త ప్రసన్న శంకర్ ఆమెవన్నీ ఆరోపణలే అని ఖండించారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వీరి కేసు కాలిఫోర్నియా కోర్టులో విచారణలో ఉంది.

భర్త చనిపోయి బాధలో ఉన్న అత్తను ఓదార్చాల్సిందిపోయి ...
బద్వేలు అర్బన్ : భర్త చనిపోయి బాధలో ఉన్న అత్తను ఓదార్చాల్సిందిపోయి ... ఇదే అదునుగా భావించి ఆ అల్లుడు ఆమె ఇంటికే కన్నం వేశాడు. రూ.6 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేసి చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఆదివారం స్థానిక అర్బన్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను అర్బన్ సీఐ ఎం.రాజగోపాల్ వెల్లడించారు. గోపవరం మండలం టీ.సండ్రపల్లె గ్రామానికి చెందిన పిచ్చయ్య, పెంచలమ్మ దంపతులు గత కొన్నేళ్లుగా పట్టణంలోని తెలుగుగంగ కాలనీలో నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె భర్త అయిన మంగుదొడ్డి మురళి డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. వీరు గతంలో నెల్లూరు జిల్లా కలువాయి గ్రామంలో నివసిస్తూ రెండేళ్ల క్రితం నుంచి అత్తగారింటికి సమీపంలో వేరే ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. నిందితుడి వివరాలను వెల్లడిస్తున్న అర్బన్ సీఐ రాజగోపాల్ అయితే గత నెల 18వ తేదీన పిచ్చయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో అంత్యక్రియల నిమిత్తం కుటుంబ సభ్యులంతా స్వగ్రామమైన టీ.సండ్రపల్లెకు వెళ్లారు. వారితో పాటు మురళి కూడా వెళ్లాడు. అయితే ముందస్తు ప్రణాళిక ప్రకారం గత నెల 27న బద్వేలుకు వచ్చిన మురళి తెలుగుగంగ కాలనీలో ఉన్న అత్తగారింటికి వెళ్లి చోరీకి పాల్పడ్డాడు. ఇంట్లోని బీరువాలో ఉన్న రూ.6 లక్షలు విలువ చేసే 7 తులాల బంగారు ఆభరణాలు (ఒక లాంగ్‌చైన్, ఒక జత బంగారు గాజులు, ఒక జత బుట్టకమ్మలు, ఒక పాపిడిబిళ్ల) ఎత్తుకెళ్లాడు. అనంతరం ఎవరికి అనుమానం రాకుండా తిరిగి టీ.సండ్రపల్లెకు వెళ్లి కుటుంబ సభ్యులతో ఉన్నాడు. మరుసటిరోజు ఇంటి తాళాన్ని తెరిచి ఉండటం గమనించిన చుట్టుపక్కల వారు పెంచలమ్మ రెండవ కుమార్తె శిరీషకు విషయం తెలపడంతో ఆమె వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తాళాలు పగులకొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గ్రహించి అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా చోరీ చేసింది అల్లుడు మురళినే అని గుర్తించి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తనతో పాటు ఎస్ఐలు రవికుమార్, సత్యనారాయణ, సిబ్బంది కలిసి నిందితుడు మురళిని పట్టణంలోని నెల్లూరు రోడ్డులో గల పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి చోరీకి గురైన బంగారు నగలు స్వా«దీనం చేసుకుని కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో అర్బన్ ఎస్ఐలు రవికుమార్, సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు వెంకటే‹Ù, ఓబులేసు, చెన్నారెడ్డి, నరసింహులు, కోటేశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
వీడియోలు


ఆరోగ్యశ్రీ ఆగిపోయింది మొర్రో అంటే..వైద్యం చిట్కాలు చెప్తున్న చంద్రబాబు


Cylinders Price: సామాన్యుల నెత్తిపై గ్యాస్ బండ


జీఎస్డీపీ గ్రోత్ పై వైఎస్ జగన్ ట్వీట్


పవన్ బసచేసిన రైల్వే గెస్ట్ హౌస్ ముందు వాలంటీర్లు నిరసనలు


Global Stock Markets: మార్కెట్లు క్రాష్!


పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు ప్రమాదం


దిల్సుఖ్నగర్ బ్లాస్ట్ కేసులో నేడు తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు


Sri Sathya Sai Dist: నేడు లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ జగన్


కర్నూలులో కాటసాని రాంభూపాల్ రెడ్డి హౌస్ అరెస్ట్


కూటమి సర్కార్‌పై YSRCP అధినేత వైఎస్ జగన్ ఫైర్