Andrew Flintoff
-
బట్లర్‌తో విభేదాలు.. ఇంగ్లండ్ జట్టుతో ఫ్లింటాప్ తెగదెంపులు?
ఇంగ్లండ్ క్రికెట్లో ముసలం నెలకొంది. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్, టీమ్ కన్సల్టెంట్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌కు మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో జట్టుతో విడిపోవాలని ఫ్లింటాప్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.వచ్చె నెలలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న వైట్‌బాల్ సిరీస్‌లకు ఇంగ్లండ్ కోచింగ్ స్టాప్‌లో భాగం కాకూడదని అతడు ఫిక్స్ అయినట్లు వినికిడి. ఇప్పటికే తన నిర్ణయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు కూడా ఈ లెజండరీ క్రికెటర్ తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.గతేడాది నుంచి ఇంగ్లండ్ జట్టుకు తాత్కాలిక కన్సల్టెంట్‌గా ఫ్లింటాఫ్ పనిచేస్తున్నాడు. టీ20 వరల్డ్‌కప్-2024లో కూడా ఈ ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ తన సేవలను అందించాడు. వరల్డ్‌కప్ సమయంలోనే ఫ్లింటాప్,బట్లర్‌కు గొడవలు మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఫ్లింటాప్ నిర్ణయాలను బట్లర్ వ్యతిరేకించేవాడని, ఇద్దరి మధ్య సమన్వయం లోపించినట్లు ఇంగ్లండ్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ సీనియర్ టీమ్ కోచింగ్ స్టాప్ నుంచి బయటకు వెళ్లాలని ఫ్లింటాప్ నిర్ణయించుకున్నాడంట. అతడు ఫ్రాంచైజీ క్రికెట్లో కోచింగ్‌పై దృష్టిపెట్టినట్లు మార్నింగ్ టెలిగ్రాఫ్ తమ కథనంలో పేర్కొంది. ఫ్లింటాఫ్ ప్రస్తుతం ది హండ్రెడ్ ఫ్రాంచైజీ నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌కు హెడ్‌కోచ్‌గా ఉన్నాడు.తాత్కాలిక హెడ్‌కోచ్‌గా ట్రెస్కోథిక్ఇక వన్డే, టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ విఫలమకావడంతో హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి మాథ్యూ మోట్ తప్పుకున్నాడు. ప్రస్తుతం తాత్కాలిక హెడ్ కోచ్‌గా బ్యాటింగ్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ బాధ్యతలు చేపట్టాడు. అయితే అతడిని త్వరలోనే పూర్తి స్ధాయి హెడ్‌కోచ్‌గా నియమించే అవకాశముంది. -
ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా ఆండ్రూ ఫ్లింటాఫ్..?
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఆండ్రూ ఫ్లింటాఫ్ వచ్చే అవకాశం ఉందని దిగ్గజ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ అన్నాడు. ‘ది హండ్రెడ్ లీగ్’లో కోచ్‌గా నిరూపించుకుంటే ఫ్లింటాఫ్‌నకు మార్గం సుగమమైనట్లే అని పేర్కొన్నాడు. జట్టులోని ప్రతి ఆటగాడు ఈ ఆల్‌రౌండర్ పట్ల సుముఖంగా ఉన్నారని బ్రాడ్ తెలిపాడు.కాగా ఇంగ్లండ్ ఇటీవలి రెండు ఐసీసీ టోర్నీల్లోనూ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 ప్రపంచకప్-2024లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడింది. డిఫెండింగ్ చాంపియన్‌గా ఈ రెండు టోర్నమెంట్లలోనూ సత్తా చాటలేకపోయింది.ఈ నేపథ్యంలో వన్డే, టీ20 జట్ల హెడ్ కోచ్ మాథ్యూ మాట్పై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అతడి స్థానాన్ని మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో భర్తీ చేసే అంశంపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.టీ20 ప్రపంచకప్-2024 సమయంలో కోచింగ్ సహాయక సిబ్బందిలో ఒకడైన మాజీ కెప్టెన్ ఫ్లింటాఫ్‌నకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించే విషయమై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ చేసిన వ్యాఖ్యలు వీటికి బలం చేకూరుస్తున్నాయి.కాగా ది హండ్రెడ్ లీగ్‌లో ఆండ్రూ ఫ్లింటాఫ్ నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. బెన్ స్టోక్స్ భాగమైన ఈ జట్టును నడిపించే తీరును నిశితంగా గమనించాలని ఇంగ్లండ్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి స్టువర్ట్ బ్రాడ్ మాట్లాడుతూ..‘‘ఫ్రెడ్డీ కోచింగ్ స్టాఫ్‌లో ఉన్నందుకు చాలా మంది ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేశారు. అతడిని ఓ హీరోలా భావిస్తున్నారు. అతడిది గొప్ప క్రికెట్ బ్రెయిన్. ఆట పట్ల అంకితభావం ఉన్నవాడు.ది హండ్రెడ్ లీగ్ రూపంలో కోచ్‌గా తనను తాను నిరూపించుకునే అవకాశం అతడికి దక్కింది. ఇంటర్నేషనల్ కోచ్‌గా ఎదిగేందుకు ఇది దోహదం చేస్తుంది. ఇంగ్లండ్ హెడ్ కోచ్ పదవి కోసం ఓ ఆడిషన్లా ఉపయోగపడుతుంది’’ అని పేర్కొన్నాడు. ఆండ్రూ ఫ్లింటాఫ్ కోచ్‌గా వస్తే ఇంగ్లండ్ క్రికెట్ భవిష్యత్తు గొప్పగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.కాగా 46 ఏళ్ల ఆండ్రూ ఫ్లింటాఫ్ ఇంగ్లండ్ తరఫున 79 టెస్టులు, 141 వన్డేలు, 7 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో.. 3845, 3394, 76 పరుగులు చేశాడు. అదే విధంగా.. ఈ రైటార్మ్ పేసర్ టెస్టుల్లో 226, వన్డేల్లో 169, టీ20లలో 5 వికెట్లు తీశాడు. -
చరిత్ర సృష్టించిన ఆండ్రూ ఫ్లింటాఫ్ తనయుడు.. తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా
శ్రీలంక అండర్-19 జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ అండర్-19 క్రికెటర్, ఇంగ్లండ్ దిగ్గజం ఆండ్రూ ఫ్లింటాఫ్ కుమారుడు రాకీ ఫ్లింటాఫ్ సెంచరీతో మెరిశాడు. తద్వారా ఫ్లింటాఫ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లండ్ అండర్-19 క్రికెట్ చరిత్రలో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా రాకీ ఫ్లింటాఫ్ రికార్డులకెక్కాడు.ఫ్లింటాప్ కేవలం 16 ఏళ్ల వయస్సులోనే ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 181 బంతులు ఎదుర్కొన్న రాకీ.. 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 106 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫ్లింటాఫ్ తన అద్బుత సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 477 పరుగుల భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు కెప్టెన్ హాంజా షేక్(107) సెంచరీతో రాణించాడు. అంతకుముందు శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక బ్యాటర్లలో వీరసింఘే(77) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో నవ్య శర్మ 5 వికెట్లు పడగొట్టగా.. హ్యారీ మోర్, బర్నాడ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు 324 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన లంక మూడో రోజు లంచ్ విరామానికి 7 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. -
శ్రీలంకతో టెస్ట్ సిరీస్.. మైఖేల్ వాన్, ఫ్లింటాఫ్ కుమారుల అరంగేట్రం
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్లు మైఖేల్ వాన్, ఆండ్రూ ఫ్లింటాఫ్ కుటుంబాల్లో రెండో తరం వచ్చింది. వీరిద్దరి కుమారులు ఆర్కీ వాన్, రాకీ ఫ్లింటాఫ్ ఒకేసారి ఇంగ్లండ్ అండర్-19 జట్టుకు ఎంపికయ్యారు. శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్‌తో వీరిద్దరు ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేయనున్నారు.ఆర్కీ, రాకీతో పాటు ప్రస్తుత ఇంగ్లండ్ టెస్ట్ జట్టు సభ్యులు జో డెన్లీ, రెహాన్ అహ్మద్ సంబంధీకులు కూడా ఇంగ్లండ్ అండర్-19 జట్టుకు ఎంపికయ్యారు. జో డెన్లీ అల్లుడు జైడన్ డెన్లీ.. రెహాన్ అహ్మద్ తమ్ముడు ఫర్హాన్ అహ్మద్ కూడా శ్రీలంక సిరీస్‌లో ఆడనున్నారు.ఆర్కీ వాన్, రాకీ ఫ్లింటాఫ్ విషయానికొస్తే.. ఈ ఇద్దరు అప్‌కమింగ్ క్రికెటర్లు తమ తండ్రుల లాగే బ్యాటింగ్, బౌలింగ్ స్టయిల్లను ఎంచుకున్నారు. ఆర్కీ తన తండ్రి లాగే రైట్ హ్యాండ్ టాపార్డర్ బ్యాటర్ కమ్ ఆఫ్ స్పిన్ బౌలర్ కాగా.. రాకీ ఫ్లింటాఫ్ తన తండ్రి ఆండ్రూ ఫ్లింటాఫ్లా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.ఆర్కీ వాన్, రాకీ ఫ్లింటాఫ్ ఒకేసారి అరంగేట్రం చేస్తున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్కీ, రాకీ ఒకేసారి తమ కెరీర్లు ప్రారంభించనుంటే.. మైఖేల్ వాన్, ఆండ్రూ ఫ్లింటాఫ్ కలిసి ఇంగ్లండ్ తరఫున 48 టెస్ట్‌లు (1999-2008) ఆడారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్, శ్రీలంక అండర్-19 జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జులై 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. జులై 8, 16 తేదీల్లో రెండు మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.ఇంగ్లండ్ U19 స్క్వాడ్: హంజా షేక్ (కెప్టెన్), ఫర్హాన్ అహ్మద్, చార్లీ బ్రాండ్, జాక్ కార్నీ, జైద్న్ డెన్లీ, రాకీ ఫ్లింటాఫ్, కేశ్ ఫోన్సెకా, అలెక్స్ ఫ్రెంచ్, అలెక్స్ గ్రీన్, ఎడ్డీ జాక్, ఫ్రెడ్డీ మెక్కాన్, హ్యారీ మూర్, నోహ్ థైన్, ఆర్కీ వాన్. -
అద్భుతమైన సిక్సర్లు.. తండ్రిని గుర్తు చేసిన రాకీ ఫ్లింటాఫ్
ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ చిన్న కొడుకు రాకీ ఫ్లింటాఫ్ తండ్రికి తగ్గ తనయుడనిపించుకుంటున్నాడు. రాకీ.. తండ్రి తరహాలోనే భారీ సిక్సర్లు కొడుతూ శభాష్ అనిపించుకుంటున్నాడు. లాంకాషైర్ రెండో జట్టుకు ఆడుతూ డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాకీ కొట్టిన సిక్సర్లు తండ్రి ఆండ్రూను గుర్తు చేశాయి. రాకీ కొట్టిన సిక్సర్లకు సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తుంది. రాకీ సిక్సర్లు కొట్టిన విధానం తండ్రిని పోలి ఉందని నెటిజన్లు కితాబునిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో రాకీ మూడు సిక్సర్లు బాదగా.. అందులోని ఓ సిక్సర్ ఆండ్రూ ట్రేడ్ మార్క్ సిక్సర్‌కు (పుల్‌షాట్) మక్కీ టు మక్కీగా ఉందని అభిమానులు అనుకుంటున్నారు. రాకీ మెరుపు షాట్లు ఆడుతూ తండ్రి బాటలోనే నడుస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. Rocky Flintoff with 3️⃣ sixes on his way to an unbeaten half-century for the 2nd XI! 💥👏 Our 2nd XI clash with Durham ends in a draw as the rain interrupts once again. Scorecard 📋➡ https://t.co/WieghotbNI 🌹 #RedRoseTogether pic.twitter.com/Rrc2SWUB9t — Lancashire Cricket (@lancscricket) April 18, 2024 డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో తండ్రి తరహాలోనే ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రాకీ రెండు బౌండరీలు, మూడు సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ దశలో వర్షం మొదలుకావడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ సమయానికి లాంకాషైర్ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆండ్రూ ఫ్లింటాఫ్ పెద్ద కొడుకు కోరె ఫ్లింటాఫ్ కూడా లాంకాషైర్కే ఆడటం మరో విశేషం. ఆండ్రూ అలియాస్ ఫ్రెడ్డీ ఇద్దరు కొడుకులు క్రికెట్లో రాణిస్తుండటంతో ఇంగ్లండ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెడ్డీ 20వ శతాబ్దం చివరి నుంచి దాదాపు పదేళ్ల పాటు ఇంగ్లండ్ క్రికెట్‌కు మకుటం లేని మహారాజుగా వెలిగిన విషయం తెలిసిందే. 2005 యాషెస్ సిరీస్‌లో ఫ్రెడ్డీ ఆల్‌రౌండర్‌గా విశేషంగా రాణించాడు. 2009లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అనంతరం ప్రొఫెషనల్ బాక్సర్‌గా, ఫ్యాషన్ ప్రమోటర్‌గా, కార్ రేసర్‌గా, టీవీ ప్రజెంటర్‌గా పలు రంగాల్లో కాలు మోపిన ఫ్రెడ్డీ ప్రతి రంగంపై తనదైన ముద్ర వేశాడు. 2022లో కారు ప్రమాదానికి గురైన ఫ్రెడ్డీ.. ఇటీవలే క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. 46 ఏళ్ల ఫ్రెడ్డీ ఇంగ్లండ్ వన్డే జట్టుకు జీతం లేకుండా కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు. గతేడాది నవంబర్‌లో ఫ్రెడ్డీ హండ్రెడ్ లీగ్‌లోని నార్త్రన్ సూపర్ చార్జర్స్ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గత హండ్రెడ్ ఎడిషన్‌లో ఫ్రెడ్డీ సూపర్ చార్జర్స్ హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. -
క్రికెటర్ల ప్రాణం మీదకు తెచ్చిన రోడ్డు ప్రమాదాలు
టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురవ్వడం క్రికెట్ అభిమానులను కలవరపాటుకు గురి చేసింది. అదృష్టవశాత్తూ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న పంత్ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. అయితే వేగంతో కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో పంత్‌కు గాయాలు తీవ్రంగానే అయ్యాయి. ఈ గాయాల ప్రభావం భవిష్యత్తులో అతని ఆటపై ప్రభావం చూపకూడదని దేవుడిని కోరుకుందాం. అయితే ఈ ఏడాది క్రికెటర్లకు కలిసి రాలేదనే చెప్పాలి. ఒక్క ఏడాదిలోనే నలుగురు క్రికెటర్లు సహా ఒక అంపైర్ రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. దురదృష్టవశాత్తూ ఒక క్రికెటర్, అంపైర్ తమ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. వారిద్దరే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్, అంపైర్ రూడీ కోర్ట్జెన్. రిషబ్ పంత్: డిసెంబర్ 30(శుక్రవారం తెల్లవారుజామున) ఢిల్లీ నుంచి తన ఎస్యూవీ కారును పంత్ స్వయంగా నడుపుకుంటూ వచ్చాడు. మంచి వేగంతో వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు 200 మీటర్ల దూరం దూసుకెళ్లింది. ఈలోగా కారులో మంటలు చెలరేగాయి. అయితే ఇది గమనించిన బస్ డ్రైవర్ పంత్‌ను కారులో నుంచి బయటకు లాగి అతన్ని రక్షించాడు. ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పంత్ నుదుటి రెండు కాట్లు పడ్డాయి. అదే సమయంలో కుడి మోకాలి లిగ్మెంట్ పక్కకు జరగడంతో సర్జరీ అవసరం కానుంది. ఇంకా చాలా గాయాలు అయ్యాయి. పంత్ కోలుకోవడానికి కనీసం మూడు నెలలు పట్టేలా ఉంది. ఆండ్రూ ఫ్లింటాఫ్: ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ఇదే నెలలో డిసెంబర్ 14న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. బీబీసీలో ప్రసారమయ్యే "టాప్ గేర్" ఎపిసోడ్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం సర్రేలోని డన్స్‌ఫోల్డ్ పార్క్ ప్రాంతంలో మంచుతో నిండిన పరిస్థితులలో షూటింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఫ్లింటాఫ్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అతడిని పరిశీలించిన వైద్యులు ఎటువంటి ప్రాణాప్రాయం లేదని తెలిపారు. దీంతో అతడి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆండ్రూ సైమండ్స్: క్రికెట్ ఆస్ట్రేలియాకు ఈ ఏడాది పెద్ద విషాదం అని చెప్పొచ్చు. ఈ ఏడాది ఇద్దరు ఆస్ట్రేలియా క్రికెటర్లు కన్నుమూశారు. ఒకరు దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ అయితే.. మరొకరు ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్. కారు ప్రమాదం ఆండ్రూ సైమండ్స్ ప్రాణాలను బలిగొంది. మే 14న టౌన్స్‌విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో సైమండ్స్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో కారును స్వయంగా తానే నడుపుతున్నాడు. అయితే కారు అదుపు తప్పి రివర్ బ్రిడ్జీ సమీపంలో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో సైమండ్స్ అక్కడికక్కడే మృతి చెందడం అందరిని కలిచివేసింది. బరోడా వుమెన్స్ జట్టు: అక్టోబర్ 21 బరోడా వుమెన్స్ జట్టుతో వెళ్తున్న బస్సు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వెళ్లే దారిలో ప్రమాదానికి గురైంది. తాటి చెట్లపాలెం జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ట్రక్కును బస్సు వేగంగా గుద్దుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు బరోడా మహిళా క్రికెటర్లకు తీవ్ర గాయాలు కాగా..మిగతావారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రూడీ కోర్ట్జెన్: ఇదే ఏడాది ఆగస్టు 9న సౌతాఫ్రికాకు చెందిన మాజీ అంపైర్ రూడి కోర్ట్జెన్(73) కన్నుమూశాడు.సౌతాఫ్రికాలోని రివర్‌డేల్‌లో ఉన్న గోల్ఫ్ కోర్స్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఆయన కారు యాక్సిడెంట్‌కు గురయ్యింది. ఈ ప్రమాదంలో కోర్ట్జెన్‌తో పాటు మరో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. పాకిస్తాన్ అంపైర్ అలీమ్ దార్, స్టీవ్ బక్నర్ తర్వాత అత్యధిక టెస్టులకు అంపైర్ గా చేసిన ఘనత సాధించాడు.బ్యాటర్ క్యాచ్ ఔట్, స్టంప్, ఎల్బీడబ్ల్యూ, రనౌట్ అయినప్పుడు ఎల్బీడబ్ల్యూ ఔట్ ఇచ్చే విధానం కూడా హైలైట్ గా ఉండేది. మెల్లిగా చేతిని పైకెత్తుతూ ఆయన ఔట్ ఇచ్చే విధానానికి కల్ట్ ఫ్యాన్స్ ఉండడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్ లో దీనిని ‘ది స్లో ఫింగర్ ఆఫ్ డెత్’గా అభివర్ణించేవారు. చదవండి: పీలే టాప్-10 స్టన్నింగ్ గోల్స్‌పై లుక్కేయాల్సిందే మూడేళ్ల క్రితమే పంత్‌ను హెచ్చరించిన ధావన్ -
కారు ప్రమాదంలో ఆండ్రూ ఫ్లింటాఫ్‌కు తీవ్ర గాయాలు..
ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. బీబీసీలో ప్రసారమయ్యే "టాప్ గేర్" ఎపిసోడ్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం సర్రేలోని డన్స్‌ఫోల్డ్ పార్క్ ప్రాంతంలో మంచుతో నిండిన పరిస్థితులలో షూటింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఫ్లింటాఫ్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అతడిని పరిశీలించిన వైద్యులు ఎటువంటి ప్రాణాప్రాయం లేదని తెలిపారు. దీంతో అతడి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అదే విధంగా ఈ ప్రమాదంపై బీబీసీ కూడా స్పందించింది. సోమవారం ఉదయం టాప్ గేర్ టెస్ట్ ట్రాక్ వద్ద జరిగిన ప్రమాదంలో ఫ్రెడ్డీ (ఫ్లింటాఫ్) గాయపడ్డాడు. వెంటనే మెడికల్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అతడికి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాం. అతడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తాం అని బీబీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక 79 టెస్టులు, 141 వన్డేలు, 7 టీ20 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌కు ఫ్లింటాఫ్ ప్రాతినిథ్యం వహించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 7315 పరుగులతో పాటు 400 పైగా వికెట్లు సాధించాడు. చదవండి: FIFA WC 2022 Final: ఫైనల్ చేరాం చాలు.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు! అంబరాన్నింటిన సంబరాలు -
ఈ ముగ్గురితో పాటు మరో ముగ్గురి బర్త్‌డే కూడా ఈరోజే.. ఈ విశేషాలు తెలుసా?
December 6- Top 6 Cricketers Birthday: టీమిండియా స్టార్స్ రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్.. ఈ ముగ్గురూ ఒకేరోజు జన్మించారు తెలుసా! వీళ్ల ముగ్గురి బర్త్‌డే డిసెంబరు 6నే! భారత ఆల్‌రౌండర్ జడ్డూ 1988లో జన్మించగా... స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 1993లో, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 1994లో జన్మించారు. ఇక వీరితో పాటు మరో ముగ్గురు క్రికెటర్లు కూడా ఇదే రోజు పుట్టినరోజు జరుపుకొంటున్నారు. భారత మాజీ లెఫ్టార్మ్ మీడియం పేసర్ రుద్రప్రతాప్ సింగ్, కర్ణాటక బ్యాటర్ కరుణ్ నాయర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కూడా డిసెంబరు 6నే పుట్టారు. వీళ్లందరికీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరుగురి గురించి కొన్ని ఆసక్తికర అంశాలు 1.జస్ప్రీత్ బుమ్రా- గుజరాత్ ►అహ్మదాబాద్‌లో జననం ►ప్రస్తుత టీమిండియా ప్రధాన పేసర్. ►ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం. ►టెస్టుల్లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన ముగ్గురు భారత బౌలర్ల జాబితాలో చోటు ►కెరీర్లో ఇప్పటి వరకు మొత్తంగా 162 అంతర్జాతీయ మ్యాచ్‌లు ►పడగొట్టిన వికెట్లు: 319. 2. రవీంద్ర జడేజా- గుజరాత్ ►నవగామ్‌లో జననం ►స్పిన్ ఆల్‌రౌండర్ ►టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ ప్రఖ్యాతి ►ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం ►ఇప్పటి వరకు ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లలో పరుగులు: 5427 ►పడగొట్టిన వికెట్లు: 482 ►ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడు. శ్రేయస్ అయ్యర్- మహారాష్ట్ర ►ముంబైలో జననం ►ఐపీఎల్లో ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. ►ఇప్పటి వరకు ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లు టెస్టులు 5, వన్డేలు 37, టీ20లు 49. ►పరిమిత ఓవర్ల క్రికెట్లో స్టార్ బ్యాటర్‌గా గుర్తింపు ఆర్పీ సింగ్- ఉత్తరప్రదేశ్ ►1985లో రాయ్ బరేలీలో జననం ►లెఫ్టార్మ్ మీడియం పేసర్ ►అన్ని ఫార్మాట్లలో టీమిండియాకు ఆడిన ఆర్పీ సింగ్ ►అంతర్జాతీయ కెరీర్లో 14 టెస్టులు, 58 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ►2018లో అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతూ రిటైర్మెంట్ ప్రకటన కరుణ్ నాయర్ ►1991లో జననం ►దేశవాళీ క్రికెట్లో కర్ణాటకకు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్యాటర్ ►టీమిండియా తరఫున ఇప్పటి వరకు 6 టెస్టులు, 2 వన్డేలు ఆడిన కరుణ్ నాయర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ►లంకషైర్లో 1977లో జననం ►1998లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం ►ఇంగ్లండ్ కెప్టెన్‌గా పనిచేసిన ఆల్‌రౌండర్ ►ఫాస్ట్ బౌలర్, మిడిలార్డర్ బ్యాటర్‌గా సేవలు ►2010లో ఆటకు వీడ్కోలు.. ప్రస్తుతం కామెంటేటర్‌గా ఉన్న ఫ్లింటాఫ్. చదవండి: Ind Vs Ban: చెత్త బ్యాటింగ్.. రోహిత్ ఇకనైనా మారు! అతడిని అన్ని మ్యాచ్‌లలో ఆడించాలి: మాజీ క్రికెటర్ Ivana Knoll FIFA WC: జపాన్ను అవమానించిన క్రొయేషియా సుందరి -
ఆ ఇంగ్లీష్ బౌలర్ పీక కోస్తానన్నాడు.. అందుకే అలా చేశా
న్యూఢిల్లీ: 2007 టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తన పీక కోస్తానని వార్నింగ్ ఇచ్చాడని సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ వెల్లడించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాటి ఇంగ్లండ్ కెప్టెన్ ఫ్లింటాఫ్ తనను రెచ్చగొట్టడం వల్లే స్టువర్డ్ బ్రాడ్‌పై ఎదురుదాడికి దిగానని, ఈ క్రమంలోనే 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు నెలకొల్పానని ఆయన గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్ 17వ ఓవర్లో ఫ్లింటాఫ్ బౌలింగ్‌లో తాను వరుసగా రెండు ఫోర్లు కొట్టానని, దీంతో అసహనానికి గురైన ఫ్లింటాఫ్ తనపై నోరుపారేసుకున్నాడని పేర్కొన్నాడు. రెండు చెత్త షాట్లు ఆడి సంబర పడొద్దని, తనను గేలి చేశాడని తెలిపాడు. దీనికి తాను కూడా అదే రితీలో స్పందించడంతో మాటామాటా పెరిగి కొట్టుకునే పరిస్థితి వరకు వెళ్లిందని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఫ్లింటాఫ్.. ‘నీ గొంతు కొస్తా' అని నన్ను హెచ్చరించగా, నేను కూడా బ్యాట్‌తో తలపై బాదుతానని బదులిచ్చానన్నాడు. అయితే ఫ్లింటాఫ్‌పై కోపానికి ఆ మరుసటి ఓవర్ బౌల్ చేసిన స్టువర్ట్ బ్రాడ్ బలయ్యాడని యువీ తెలిపాడు. బ్రాడ్ వేసిన ఆ ఓవర్లో అంతకుముందెన్నడూ ఆడని షాట్లను ఆడానని, యార్కర్ బంతులను సైతం స్టాండ్స్‌లోకి పంపానని అలనాటి మధుర క్షణాలను స్మరించుకున్నాడు. ఆఖరి బంతిని సిక్సర్ బాదాక ఫ్లింటాప్ వైపు చూసి ఓ చిరునవ్వు నవ్వానని యువీ చెప్పుకొచ్చాడు. యువీ విధ్వంసంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లండ్‌పై 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రముఖ స్కోర్ట్స్ జర్నలిస్ట్ గౌరవ్ కపూర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ నాటి అద్భుత క్షణాలను మరోసారి గుర్తు చేసుకున్నాడు. చదవండి: కెప్టెన్సీ నాకే ఇస్తారనుకున్నా.. కానీ మధ్యలో అతనొచ్చాడు -
యూవీ మెరుపులకు 13 ఏళ్లు
ఢిల్లీ : భారత మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేరు వింటే మొదట గుర్తు వచ్చేది 2007 టీ20 ప్రపంచకప్. సెప్టెంబర్ 19, 2007.. యూవీ కెరీర్లో మరుపురానిదిగా నిలిచిన రోజు.. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాది వీరవిహారం చేసిన రోజు... టీ20 మజా అంటే ఏంటో అభిమానులకు చూపించిన రోజు.. తనకు కోపం వస్తే అవతలి బౌలర్ ఎవరని చూడకుండా సుడిగాలి తుఫాను అంటే ఏంటో చూపించిన రోజు.. సరిగ్గా ఈరోజుతో ఆ విధ్వంసానికి 13 ఏళ్లు నిండాయి. మళ్లీ ఒకసారి ఆ మ్యాచ్ విశేషాలను గుర్తు చేసుకుందాం. (చదవండి : 'ఐపీఎల్ యాంకరింగ్ మిస్సవుతున్నా') డర్బన్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 16.4 ఓవర్లు ముగిసే సమయానికి 155/3తో నిలిచిన దశలో యువరాజ్ సింగ్ క్రీజులోకి వెళ్లాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన ప్లింటాఫ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ వరుసగా 4, 4 బాదగా.. ప్లింటాఫ్ నోరు జారాడు. దాంతో.. మైదానంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరు కొట్టుకోవడానికి కూడా రెడీ అయ్యారు. అయితే అంపైర్లతో పాటు ఇరు జట్ల కెప్లెన్లు కల్పించుకొని సర్దిచెప్పారు. అయితే అప్పటికే కోపంతో ఊగిపోతున్న యూవీ తన కోపాన్ని మొత్తం తరువాతి ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన స్టువర్ట్ బ్రాడ్ మీద చూపించాడు.ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో వరుసగా 6, 6, 6, 6, 6, 6 బాదిన యువరాజ్ సింగ్.. టీ20 వరల్డ్‌కప్‌లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. అలానే 12 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ని అందుకోవడం ద్వారా టీ20ల్లో వేగంగా అర్ధశతకం నమోదు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. (చదవండి : ఐపీఎల్ 2020 : ఇట్లు.. ప్రేమతో మీ 'కార్తీకదీపం' దీప) ఫ్లింటాఫ్ చేసిన పనికి తాను బలయ్యానని.. చాలా రోజుల వరకు ఈ పీడకల వెంటాడుతుండేదని బ్రాడ్ చెప్పుకొచ్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేయగా.. ఛేదనలో ఇంగ్లాండ్ 200/6కే పరిమితమై ఓటమిపాలయ్యింది. ఆ తర్వాత భారత్ ఫైనల్లో పాక్‌ను ఓడించి మొదటి టీ20 ప్రపంచకప్ గెలిచిన సంగతి తెలిసిందే. 2007 టీ20 ప్రపంచకప్.. యూవీ కెరీర్ టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. యూవీ ఆడిన ఇన్నింగ్స్ అభిమానుల్లో ఎంతలా జీర్ణించుకుపోయిందంటే.. ఎవరు మాట్లాడినా.. ఆరు సిక్సులకు ముందు.. ఆ తర్వాత అంటూ పేర్కొనేవారు. అప్పటినుంచి వెనుదిరిగి చూసుకోని యూవీ 2011లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లోనూ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో వరల్డ్ కప్ హీరోగా నిలిచి.. 28 ఏళ్ల తర్వాత టీమిండియా కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. క్రికెట్ మిగిలిఉన్నంత వరకు యూవీ ఆడిన ఈ ఇన్నింగ్స్ రికార్డుల పుట్టలో పదిలంగా ఉంటుందనండంలో సందేహం లేదు. టీ20 కెరీర్లో 58 మ్యాచ్‌లాడిన యూవీ 1,177 పరుగులు చేశాడు. ఈ సందర్భంగా యూవీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మ్యాచ్‌కు సంబంధించిన ఫోటోను షేర్ చేశాడు. -
ఈ బ్యాట్‌తో ఎక్కడ కొడతానో తెలుసా?
న్యూఢిల్లీ: 2007 టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ ఎలా రెచ్చిపోయాడు మనకు తెలుసు. ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఒక ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. లాంగాన్, లాంగాఫ్, మిడాన్, మిడాఫ్ ఇలా ప్రతీ షాట్ ఆడేసి యువీ ఆరు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. స్టువర్ట్ బ్రాడ్ కెరీర్ ముగిసిపోయేంత పని చేశాడు యువీ. ఇదే విషయాన్ని స్టువర్ట్ బ్రాడ్ తండ్రి క్రిస్ బ్రాడ్ సైతం యువీకి చెప్పి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. అయితే అదే మ్యాచ్‌లో జరిగిన మరో సంఘటనను యువరాజ్ గుర్తు చేసుకున్నాడు. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ ఫ్లింటాఫ్‌తో జరిగిన వాడివేడి వాగ్వాదాన్ని యువీ నెమరువేసుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌తో ఈ విషయాన్ని పంచుకున్నాడు. ‘ ఫ్రెడ్డీ(ఫ్లింటాఫ్) వరుసగా రెండు మంచి బంతులు వేశాడు. అందులో ఒకటి యార్కర్. ఆ రెండు బంతుల్ని ఫోర్లు కొట్టా. (స్టేడియాలు తెరుచుకోవచ్చు ) అప్పుడు అతను నా దగ్గరకు వచ్చి అవి డాష్ షాట్స్ అని అవహేళనగా మాట్లాడాడు. చాలా గంభీరంగా ఆ మాట అన్నాడు. నేను నీ గొంతు కోస్తా అని మాటలు అదుపు తప్పాడు. దాంతో నాకు చిర్రెత్తుకొచ్చింది. నా చేతిలో బ్యాట్ చూశావా. ఈ బ్యాట్‌తో నిన్ను ఎక్కడ కొడతానో తెలియదు. నాకు ఆ సమయంలో చాలా కోపం వచ్చేసింది. ఆ తర్వాత ఓవర్లోనే నేను బ్రాడ్ బౌలింగ్‌లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టా. ఆరు సిక్సర్ల తర్వాత దిమిత్ మస్కరెనాస్ వైపు చూసి, అప్పుడు ఫ్లింటాఫ్ వైపు కూడా చూశా. అప్పుడు కానీ కోపం చల్లారలేదు’ అని యువీ పేర్కొన్నాడు. అసలు ముందు మస్కరెనాస్ వైపు చూడటానికి కారణం కూడా వెల్లడించాడు. ‘నేను ఆరు సిక్సర్లు కొట్టిన కొద్ది ముందుగా అతను ఒక వన్డే మ్యాచ్‌లో ఐదు సిక్సర్లు కొట్టాడు. అందుకే అతన్ని ముందు చూశా. అది ఇప్పటికీ బాగా గుర్తుంది’ అని యువీ పేర్కొన్నాడు. ఫ్లింటాఫ్‌తో గొడవ 18 ఓవర్లో జరగ్గా, బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు సిక్సర్లను 19 ఓవర్లో సాధించాడు యువీ. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 218 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 200 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఆ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ 7 సిక్స్‌లు, 3 ఫోర్లతో 58 పరుగులు చేశాడు. భారత ఇన్నింగ్స్‌లో భాగంగా ఇంకా ఒక బంతి మాత్రమే ఉందనగా ఫ్లింటాఫ్ బౌలింగ్‌లో యువీ ఔటయ్యాడు. ఆనాటి టీ20 వరల్డ్‌కప్‌ను ధోని నేతృత్వంలోని భారత్ సాధించడంలో యువరాజ్ కీలక పాత్ర పోషించగా, 2011 వన్డే వరల్డ్‌కప్‌ను టీమిండియా గెలవడంలో కూడా ముఖ్య భూమిక పోషించాడు. యువరాజ్ తన కెరీర్లో 304 వన్డేలు, 58 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. ఇక 40 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. (వరల్డ్ కప్ వాయిదా పడితే... ) -
‘జట్టుగా చేసిన పాపాన్ని స్మిత్ భరించాడు’
లండన్: దాదాపు రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్ క్రాఫ్ట్‌లు బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో నిషేధం ఎదుర్కొన్నారు. ఈ వివాదంలో వార్నర్-స్మిత్‌లు ఏడాది పాటు నిషేధం ఎదుర్కోగా, బాన్ క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం పడింది. అయితే ఆనాటి ట్యాంపరింగ్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తొలిసారి మాట్లాడాడు. అది కేవలం స్మిత్‌కు మాత్రమే తెలిసిన ట్యాంపరింగ్ కాదని, అప్పటి ఘటనలో ఆసీస్ మొత్తం జట్టు పాత్ర ఉన్నదని విషయం వాస్తవమన్నాడు. (భారత క్రికెటర్లు స్వార్థపరులు..వేస్ట్!) ‘ అది ఏమైనా చిన్న ఘటన కాదు కదా. బాల్ ట్యాంపరింగ్ ఉదంతం. ఇందులో జట్టు సభ్యులు అందరి పాత్ర ఉంటుంది. కానీ స్మిత్ ఒక్కడే అవమానాన్ని భరించాడు. ఆ నెపాన్ని తనపై వేసుకున్నాడు. జట్టు అంతటిని బద్నాం చేయడం ఇష్టం లేక కెప్టెన్‌గా స్మిత్ తనపై వేసుకున్నాడు. దీనికి డేవిడ్ వార్నర్ ప్రధాన కారణం. ఇక్కడ జట్టులోని మిగతా సభ్యులు పాత్ర లేదంటే నేనైతే నమ్మను. ఒక బంతి ట్యాంపరింగ్ అయిన తర్వాత మరొక బౌలర్ అందుకుంటే అది కచ్చితంగా తెలిసిపోతుంది. నేనే బౌలర్‌ను అనుకోండి. వేరే వ్యక్తి బంతిని ట్యాంపర్ చేసి తర్వాత నాకిస్తే అది నాకు తెలియదా.. తెలుస్తుంది కదా.. ఆనాటి ట్యాంపరింగ్‌లో ఆసీస్ జట్టంతా ఉంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు’ అని ఫ్లింటాఫ్ అన్నాడు. ఏది ఏమైనా ఆ ట్యాంపరింగ్ ఘటన అంతర్జాతీయంగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును చిన్నబోయేలా చేసింది. బాల్ ట్యాంపరింగ్ ఉదంతాలు అనేవి క్రికెట్‌కు కొత్తేమీ కాదు. ఎప్పుట్నుంచూ అనాథిగా వస్తున్న ట్యాంపరింగ్‌కు క్రికెట్‌తో అవినావభావ సంబంధం ఉందంటే అతిశయోక్తి కాదేమో. (ఇంకా నాపై నిషేధం ఎందుకు?) ఇక్కడ చదవండి: ‘షీలా కి జవాని’కి వార్నర్ ఇరగదీశాడు.. -
'నా కెరీర్లో ఆ స్పెల్ ఎప్పటికి మరిచిపోను'
1999లో పాకిస్తాన్ పేసర్ షోయబ్ అక్తర్ అత్యంత వేగంగా బంతులు విసిరిన స్పెల్‌గా తనకు ఎప్పటికి గుర్తుండిపోతుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు.1999లో పాక్ జట్టు తమ దేశంలో పర్యటించింది. కాగా పెర్త్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అక్తర్ ఒక ఓవర్లో ప్రతీ బాల్‌ను గంటకు 150 కిలోమీటర్ల వేగంతో విసిరాడని గుర్తుచేశాడు. కాగా అంతకుముందు ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తనకు వేసిన అత్యుత్తమ ఓవర్ అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. (‘మామూలు ప్రపంచకప్ పోరాటం కాదిది’) ఇదే విషయాన్ని రికీ పాంటింగ్ ట్విటర్లో షేర్ చేస్తూ.. ' నా కెరీర్లో ఫ్లింటాఫ్ వేసిన ఓవర్‌ను బెస్ట్ ఓవర్‌గా చెప్పుకొన్న తర్వాత వెంటనే నాకు అక్తర్ వేసిన స్పెల్ గుర్తుకువచ్చింది. అక్తర్ వేసిన ప్రతీ బాల్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో సాగింది. వేసిన ప్రతీ బంతి నన్ను బాగానే ఇబ్బంది పెట్టింది. అక్తర్ అత్యంత ఫాస్ట్ బౌలింగ్‌ను కూడా నేను ఎప్పటికి మరిచిపోను' అంటూ చెప్పుకొచ్చాడు. 2005లో జరిగిన యాషేస్ సిరీస్‌లో ఫ్లింటాఫ్ వేసిన ఒక ఓవర్ అత్యుత్తమ ఓవర్‌గా మిగిలిపోతుందని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఫ్లింటాఫ్ వేసిన ఓవర్ మొత్తంలో పాంటింగ్ బ్యాటింగ్ చేయడానికి అపసోఫాలు పడ్డాడు. చివరి బంతికి పాంటింగ్ ఏకంగా వికెట్ సమర్పించుకొని వెనుదిరిగాడు. కాగా పాంటింగ్ తన కెరీర్లో అన్ని ఫార్మాట్లు కలిపి 27, 486 పరుగులు చేశాడు. అంతేగాక పాంటింగ్ ఈ తరంలో ఉత్తమ కెప్టెన్‌గానూ నిలవడమే గాక 2003, 2007 ప్రపంచకప్‌లు జట్టుకు అందించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. (వారిద్దరికి ఇది మరిచిపోలేని రోజు) -
‘నన్ను చిన్నచూపు చూశారు’
లండన్: సుమారు ఐదేళ్ల క్రితం తాను ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకుంటే చాలా చులకన భావంతో చూశారని ఆ దేశ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తాజాగా పేర్కొన్నాడు. తాను ఇంగ్లండ్ జట్టుకు కోచ్‌గా చేయాలనేది తన కోరికని, దానిలో భాగంగా దరఖాస్తు చేసుకుంటే చిన్నచూపు చూశారంటూ చెప్పుకొచ్చాడు. ‘2014లో ఇంగ్లండ్ కోచ్ పదవి కోసం అప్లై చేశా. ఇంటర్యూ కోసం ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేశా. నెల గడిచినా నాకు ఎటువంటి సమాధానం రాలేదు. అయితే అసలు ఏమైందని కనుక్కుంటే అప్పుడు నాకు ఫోన్ వచ్చింది. కోచ్ పదవిని వేరే వాళ్లకు ఇచ్చేశామనే సమాధానం వచ్చింది. కోచ్ పదవి కోసం దరఖాస్తు చేస్తే కనీసం ఏమి జరిగిందనేది నేను ఆరా తీసే వరకూ తెలియకపోవడం దారుణం. నాకు కోచింగ్ చేయడమనేది ఒక కోరిక. ఇంగ్లండ్ జట్టుకు కోచ్‌గా చేయాలని ఉంది. దాంతో లాంకాషైర్ కూడా కోచ్‌గా చేయడాన్ని ఇష్టపడతా’ అని ఫ్లింటాఫ్ పేర్కొన్నాడు. ఏదొక రోజు ఇంగ్లండ్‌కు కోచ్‌గా చేసే అవకాశం వస్తుందనే అనుకుంటున్నానని, ప్రస్తుతానికి ఇంకా అది తన తలుపు తట్టలేదన్నాడు.2009 యాషెస్ సిరీస్ గెలిచిన జట్టులో ఫ్లింటాఫ్ సభ్యుడు. 2006-07 సీజన్ యాషెస్ సిరీస్‌లో ఆసీస్ చేతిలో 5-0 తేడాతో వైట్‌వాష్ అయిన ఇంగ్లండ్ జట్టుకు ఫ్లింటాఫ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. తన కెరీర్లో 79 టెస్టులు, 141 వన్డేలకు ఫ్లింటాఫ్ ప్రాతినిథ్యం వహించాడు. -
ఉర్రూతలూగిస్తున్న ప్రపంచకప్ ప్రమోషనల్ వీడియో
లండన్ : 2019 ప్రపంచకప్ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రత్యేక రూపోందించిన ఓ ప్రమోషనల్ వీడియో క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తోంది. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ లీడ్ రోల్లో రూపొందించిన ఈ వీడియో నెటిజన్లను వీపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ప్రచార గీతంలో ఫ్లింటాఫ్ ‘ప్రపంచకప్ వచ్చేస్తోంది’ అని హెడ్‌లైన్‌ను న్యూస్ పేపర్లో చూసి ఆనందంతో విజిల్ వేస్తూ.. కొంత మంది డ్యాన్సర్లు, అభిమానులతో గల్లీల్లో తిరుగుతూ.. పాడుతూ చిందేశాడు. ఫ్లింటాఫ్‌తో పాటు శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర, మహిళా క్రికెటర్ చార్లొటె ఎడ్వర్డ్స్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఫిల్ టఫ్నెల్లు కూడా తమ ఆనందాన్ని పంచుకున్నారు. ‘ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్’ అంటూ ఫ్లింటాఫ్ పాడుతుండగా.. వివిధ దేశాల జెండాలతో అభిమానులు, డ్యాన్లర్లు అతన్ని ఫాలో అవుతూ డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను ‘క్రికెట్ వరల్డ్‌కప్’ అధికారిక ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రపంచ క్రికెట్ సంగ్రామం వచ్చే ఏడాది మే 30 నుంచి జూలై 14 వరకు ఇంగ్లండ్ వేల్స్ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. రౌండ్ రాబిన్, నాకౌట్ పద్దతిలో జరగనున్న ఈ టోర్నీలో 10 దేశాలు పోటీపడనున్నాయి. చదవండి: ఇంగ్లండ్ టూర్ ఆటకోసమా? హనీమూన్ కోసమా? -
ఐసీసీ ప్రమోషనల్ వీడియోకు క్రికెట్ ఫ్యాస్స్ ఫిదా
-
వారిద్దరి కంటే విరాట్ బెస్ట్
న్యూడిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచంలోనే విరాట్ బెస్ట్ బ్యాట్స్‌మన్ అని కితాబిచ్చాడు. స్టీవెన్ స్మిత్, జో రూట్ కంటే కోహ్లీ అత్యుత్తమ క్రికెటర్ని ఫ్లింటాఫ్ అన్నాడు. టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, స్టీవెన్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్లను పరిశీలిస్తే.. నలుగురూ అత్యుత్తమ ఆటగాళ్లని, వీరిలో విరాటే బెస్ట్ క్రికెటర్ అని ఫ్లింటాఫ్ చెప్పాడు. టెస్టు క్రికెట్ లో విరాట్ ఆటతీరు, వ్యూహాలు చాలా బాగుంటాయని అన్నాడు. టెస్టు క్రికెట్‌తో పోలిస్తే టి-20లలో కోహ్లీ బ్యాటింగ్ మరింత ఉత్సుకతగా ఉంటుందని చెప్పాడు. అతను రిస్క్ తీసుకోకుండా బౌండరీలతో విజృంభిస్తాడని అన్నాడు.