bjp
-
బీఆర్ఎస్కు విరాళాల వెల్లువ.. అగ్రస్థానంలో బీజేపీ
ఢిల్లీ : గడిచిన ఎన్నికల్లో స్థానిక పార్టీల్లో బీఆర్ఎస్కు ఊహించని విధంగా విరాళాలు అందాయి. విరాళాలు పొందే విషయంలో జాతీయ పార్టీల్లో బీజేపీ అగ్రస్థానంలో ఉండగా..రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంది. రాజకీయ పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల సంఘం (Election Commission) తన వెబ్సైట్లో ఉంచింది. రాజకీయ పార్టీలకు ఏయే సంస్థలు ఎంతెంత విరాళం ఇచ్చాయి? అందులో వివరించింది. ఈసీ నివేదిక ప్రకారం.. 2023-24లో దాతలు బీజేపీకి రూ. 20,000 అంత కంటే ఎక్కువ మొత్తం దాదాపు రూ.2,244 కోట్లను విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తం 2022-23లో అందుకున్న మొత్తం కంటే మూడు రెట్లు ఎక్కువ. బీఆర్ఎస్ రూ.580 కోట్లతో రెండవ స్థానంలో, కాంగ్రెస్ రూ.289 కోట్లతో మూడో స్థానంలో ఉంది. కాంగ్రెస్‌కు అంతకుముందు సంవత్సరం రూ.20,000 అంతకంటే ఎక్కువ విరాళాల రూపంలో రూ.79.9 కోట్లు వచ్చాయి. ఈ మొత్తం కాంగ్రెస్ కంటే బీజేపీకి అందిన విరాళాలు 776.82 శాతం ఎక్కువ.ట్రస్ట్ (Satya Electoral Trust)లు బీజేపీ, కాంగ్రెస్ రెండింటికీ అత్యధిక విరాళాలు అందించాయని భారత ఎన్నికల సంఘం (eci) డేటా చెబుతోంది. అందులో బీజేపీ రూ.723 కోట్లు, కాంగ్రెస్ రూ. 156 కోట్లు ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ విరాళంగా వచ్చాయి. ఇతర పార్టీలలో, ఆమ్ ఆద్మీ 2023-24లో రూ. 11.1 కోట్ల విలువైన విరాళాలు పొందింది. అంతకు ముందు ఏడాది ఆప్ రూ.37.1 కోట్లు అందుకుంది. 2023-24లో సీపీఎం విరాళాలు రూ. 6.1 కోట్ల నుండి రూ. 7.6 కోట్లను పొందింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత వివిధ రాజకీయ పార్టీలు స్వీకరించిన విరాళాలను ఎన్నికల సంఘం ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఈసీ ఆయా రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్ని వెల్లడించింది. -
కాంగ్రెస్ మాయ చేస్తోంది...
ప్రాంతీయ పార్టీల ఉనికిని జమిలి ఎన్నికలు ప్రశ్నార్థకం చేస్తాయని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది. దానితోపాటు మరికొందరూ కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రంలో కూడా అదే పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రచారం చేస్తున్నారు. సుదీర్ఘ కాలంగా జమిలి ఎన్నికలే జరుగుతున్న ఆంధ్రప్రదేశ్నే ఓ కేస్ స్టడీగా తీసుకుందాం: ఇక్కడ జాతీయ పార్టీలు ఈ కారణంగా బలం పుంజుకున్నాయా? ప్రాంతీయ పార్టీలు ఏమైనా బలహీన పడ్డాయా? ఎన్నికలు జరిగేటప్పుడు ప్రజలు ఎంచుకునే అంశాల ఆధారంగానే ఓటింగ్ జరుగుతుంది. అంతే కాని జమిలి ఎన్నికల వల్ల కాదని ఈ ఉదాహరణతో అర్థమవుతోంది.‘వన్ నేషన్ – వన్ ఎల క్షన్’ను వ్యతిరేకిస్తున్న పార్టీల్లో డీఎంకే, టీఎమ్సీ, సమాజ్ వాదీ పార్టీలు ఉన్నాయి. జమిలీ ఎన్నిక లను ఆ పార్టీలు వ్యతిరేకించడా నికి ప్రధాన కారణం బీజేపీ వ్యతి రేక ధోరణి మాత్రమే. బీజేపీ ఏ పని చేసినా వ్యతిరేకిస్తుంది టీఎమ్సీ. సమాజ్ వాదీ పార్టీదీ అదే ధోరణి. దేశంలో మొదటి మూడు ఎన్నికలు జమిలీనే. అప్పుడు ఎందుకు అవి దేశానికి నష్టమనీ, ప్రజాస్వామ్యానికి హానికరమనీ కాంగ్రెస్ ప్రచారం చేయలేదు? చాలా ప్రాంతీయ పార్టీలు ఈ జమిలి బిల్లును సమర్థిస్తూండటం ఇతర పార్టీల వాదనల్లో పస లేదనడానికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీ, వైసీపీ, జనసేన, బీఆర్ఎస్, బీజేడీ సహా అత్యధిక పార్టీలు సానుకూలంగా ఉన్నాయి. గతంలో లా కమి షన్కే తమ అనుకూలత తెలిపాయి. మరికొన్ని ప్రాంతీయ పార్టీలకు లేని భయం... కాంగ్రెస్ మాయలో ఉన్న పార్టీలకు ఉండటానికి కారణం ఏమిటి? ఆ బిల్లును తీసుకొస్తోంది బీజేపీ, ప్రధాని మోదీ కాబట్టి వ్యతిరేకిస్తున్నారు. కానీ వారు దేశ ప్రయోజనాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దేశంలో ఐదేళ్ల పాటు... ప్రతి ఏడాదీ జరుగుతున్న ఎన్నికలకు కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చయిపోతోంది. అదే పదే పదే ఎన్నికలు లేకపోతే రాజకీయ అవినీతి కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. జమిలి ఎన్నికల విధానం అమల్లోకి వచ్చి, దేశమంతటా ఎన్నికలు ఒకేసారి పూర్తి అయితే... అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పాలన మీద, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి పెట్ట డానికి వీలవుతుంది. దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఓ కేతువులా పట్టి పీడిస్తోంది. దేశం అంతా తమ గుప్పిట్లోనే ఉండాలని చెప్పి అన్ని రకాల వ్యవస్థ లనూ చెరబట్టింది. ఎమర్జెన్సీ విధించడమే కాదు సుప్రీంకోర్టు అధికా రాలనూ తగ్గించడానికి ప్రయత్నించింది. దేశ ప్రజ లను... మతాలు, కులాల వారీగా విభజించి తమ పబ్బం గడుపుకునేందుకు అలవాటు పడిన కాంగ్రెస్ పార్టీ మాయలో ప్రాంతీయ పార్టీలు పడకుండా ఉండాల్సిన అవసరం ఉంది.ప్రజాస్వామ్యానికి ప్రజాభిప్రా యమే బలమైన పునాది అని ప్రధాని మోదీ నమ్మతారు. అది బీజేపీ మూల సిద్ధాంతం కూడా. అందుకే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి బిల్లును పంపించారు. ఇప్పుడు అన్ని పార్టీలూ సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. జమిలి ఎన్నికల విధానం మరింత మెరుగ్గా తీర్చిదిద్దేలా సలహాలు ఇవ్వొచ్చు. అలా చేయడం దేశభక్తి అవుతుంది. ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ మాయ నుంచి బయటకు రావాలి. నిజం తెలుసుకోవాలి. దేశం కోసం జమిలి ఎన్నికల బిల్లుకు మద్దతివ్వాలి.ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు -
జీవితాంతం అంబేడ్కర్‌ను అవమానించారు
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను జీవితాంతం అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. ఆయనకు భారతరత్న ఇవ్వకపోగా, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కనీసం చిత్రపటం కూడా ఏర్పాటు చేయకపోవడం చూస్తే కాంగ్రెస్‌కు అంబేడ్కర్ పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇందిరాగాంధీ సహా ఎంతోమందికి భారతరత్న ఇచి్చనా.. కాంగ్రెస్ అంబేడ్కర్‌కు ఇవ్వలేకపోయిందన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా బుధవారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్‌ను రెండుసార్లు ఎన్నికల్లో కాంగ్రెస్ కావాలనే ఓడించిందని ఆరోపించారు. ఎన్డీయే హయాంలోనే అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చామని గుర్తుచేశారు. ఏడాదిపాటు వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వాజ్‌పేయి జీవితం దేశానికి ఆదర్శమని, ఆయన ప్రసంగం వినడానికి దేశం నలుమూలల నుంచి వేలాదిమంది వచ్చేవారన్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.. అప్పట్లో జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో వాజ్‌పేయి జనసంఘ్ నేతలతో కలిసి పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, వారి సర్టిఫికెట్ బీజేపీకి అవసరం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ కుటుంబ, అవినీతి, నియంతృత్వ రాజకీయాల గురించి ప్రజలకు వివరిస్తూ.. కాంగ్రెస్ నిజస్వరూపాన్ని ఇంటింటికీ తెలియచేస్తామని కిషన్‌రెడ్డి అన్నారు. అబద్ధాల్లో కాంగ్రెస్‌కు ఆస్కార్: బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి అబద్ధాల్లో ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ 70 ఎంఎం సినిమా చూపించి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. వాజ్‌పేయి అందరికీ స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. దేశభక్తి, అభివృద్ధి, చతుర్భుజి పేరిట జాతీయ రహదారుల నిర్మాణంతో దేశాన్ని ఒక ప్రాంతంతో మరో ప్రాంతాన్ని అనుసంధానించారన్నారు. అన్ని పారీ్టల్లోనూ ఆయనను అభిమానించే నేతలు ఉన్నారని చెప్పారు. ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పండుగ వాతావరణంలో వాజ్‌పేయి శతజయంతి వేడుకలు జరుగుతున్నాయన్నారు. సంతుïÙ్టకరణ విధానాలకు వాజ్‌పేయి వ్యతిరేకమని, అవినీతికి ఆమడదూరం ఉన్నారని చెప్పారు. మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, వాజ్‌పేయి మధ్య మంచి అనుబంధం ఉందని చెప్పారు. కాంగ్రెస్‌కు, అంబేడ్కర్ గురించి మాట్లాడే కనీస అర్హత లేదని, అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వని కాంగ్రెస్ అంబేడ్కర్ గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. క్రైస్తవ మైనార్టీల అభ్యున్నతికి కృషి: భట్టి మధిర: క్రైస్తవ మైనార్టీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర మండలం బయ్యారం రోమన్ కేథలిక్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. అన్ని మతాల అభ్యున్నతికి స్థిర సంకల్పంతో పని చేస్తున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ పాల్గొన్నారు. -
కిమ్స్ లో శ్రీతేజ్ ను పరామర్శించిన డీకే అరుణ
-
Atal Bihari Vajpayee: చదవని ప్రేమలేఖ
అటల్ బిహారీ వాజ్‌పేయి అవివాహితునిగా మిగిలిపోవడం వెనక ఆసక్తికరమైన కథ ఉంది. కాలేజీ రోజుల్లోనే ఆయన మనసు దోచిన రాజ్‌కుమారీ హస్కర్ అనే మహిళ దూరమవడంతో పెళ్లి చాప్టర్‌కు దూరమయ్యారు. ఏక్ నిరంజన్‌లా ఉండిపోయారు.ఎవరీ హస్కర్? కశ్మీర్ పండిట్ల కుటుంబానికి రాజ్‌కుమారీ హస్కర్ వాజ్‌పేయికి కాలేజీ రోజుల్లో సహాధ్యాయి. ఇందిరాగాందీకి దూరపు బంధువంటారు. పలు కార్యక్రమాల్లో కలిసి పని చేసే క్రమంలో మొదలైన స్నేహం ప్రేమగా మారింది. కానీ ఎవరూ దాన్ని బయటపెట్టలేదు. వాజ్‌పేయి ఆమెకు ప్రేమలేఖ రాసినా నేరుగా ఇవ్వకుండా గ్రంథాలయంలో ఆమె చదివే అవకాశమున్న ఓ పుస్తకంలో పెట్టారు. అయితే హస్కర్ ఆ పుస్తకాన్ని చదవలేదు. అలా వాజ్‌పేయి ప్రేమలేఖ ఆమెకు అందనే లేదు. రాజకీయాలు చేసే వ్యక్తికి కూతురును ఇవ్వడం హస్కర్ తండ్రికీ ఇష్టం లేకపోయింది. దాంతో బ్రిజ్ నారాయణ్ కౌల్ అనే ప్రొఫెసర్‌తో ఆమె వివాహం జరిగిపోయింది. అలా హస్కర్ శ్రీమతి కౌల్గా మారి వాజ్‌పేయి జీవితం నుంచి అదృశ్యమైంది. వాజ్‌పేయి కూడా ప్రేమ సంగతి మర్చిపోయి క్రియాశీల రాజకీయాల్లో మునిగిపోయారు.16 ఏళ్ల తర్వాత దాదాపు 16 ఏళ్ల తర్వాత వాజ్‌పేయి, శ్రీమతి కౌల్ ఓ కాలేజీ ఫంక్షన్లో అనుకోకుండా పరస్పరం తారసపడ్డారు. ఢిల్లీలో తన భర్త పని చేసే కాలేజీలో కీలకోపన్యాసం సందర్భంగా అక్కడ కౌల్‌ను చూసి వాజ్‌పేయి నిశ్చేషు్టలయ్యారు. తర్వాత కౌల్ దంపతులతో ఆయన అనుబంధం బలపడింది. వాజ్‌పేయి విదేశాంగ మంత్రిగా ఉండగా కౌల్ దంపతులు కూడా తమ కూతురు నమితతో కలిసి ఆయన ఇంటికి మారిపోయారు. దాంతో వారి బంధంపై ఢిల్లీ వర్గాల్లో పెద్ద చర్చే జరిగింది. భావ సారుప్యత ఉన్న కౌల్‌ను వాజ్‌పేయీ పెళ్లాడితే మంచిదని సన్నిహితులు, రాజకీయ నేతలు, ఆర్ఎస్ఎస్ వర్గాలు చెప్పినా ఆయన కొట్టిపారేశారంటారు. ‘‘దీనిపై చర్చ అనవసరం. నేను పెళ్లీడు వయసులో ఉండగా ఆదర్శవంతమైన భార్య కోసం అన్వేషణ మొదలెట్టాను. దొరికినా దురదృష్టవశాత్తు ఆమె తండ్రి తనకు అనువైన ఆదర్శ భర్త కోసం వెతికారు’’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వాజ్‌పేయిలోని ఈ కోణాన్ని జాతీయ మీడియా ఎప్పుడూ పతాక శీర్షికలకు ఎక్కించలేదు. కౌల్ కూతురు నమితను వాజ్‌పేయి తన కన్నకూతురిలా చూసుకున్నారు. తర్వాత దత్తత తీసుకున్నారు. వాజ్‌పేయి అంత్యక్రియలను నమిత, ఆమె కూతురు నీహారిక దగ్గరుండి జరిపించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మనసారా మాట్లాడండయ్యా!
కవితాత్మక ప్రసంగాలతో మంత్రముగ్దుల్ని చేసే చాతుర్యం వాజ్‌పేయికి వెన్నతో పెట్టిన విద్య. తేలికైన పదాలతో బరువైన భావాలను వెల్లడించే మాటలకు ఆయన పెట్టింది పేరు. సాహితీ రంగంలోనూ అటల్ తనదైన ముద్ర వేశారు. హిందూ పురాణాల సారాన్ని నింపుకున్న ఆయన వాక్యాలకు పార్లమెంటులో పార్టీలకు అతీతంగా సభ్యులంతా సలామ్ కొట్టేవారు. ఆయన రాజకీయ ప్రసంగాలు కూడా సాహితీ సౌరభాలు వెదజల్లేవి. తాను అధికారంలో ఉండగా విపక్షాలు చేసే విమర్శలకు హుందాగా, చమత్కారంగా బదులిచ్చేవారు. ‘మనసారా మాట్లాడండయ్యా’ అంటూ తోటివారిని ప్రోత్సహించేవారు.చిరస్మరణీయ ప్రసంగం ప్రజాస్వామ్యంపై వాజ్‌పేయికి ఉన్న అపార నమ్మకం ఆయన దార్శనికతలో తొణికిసలాడేది. తన తొలి ప్రభుత్వం 13 రోజులకే కూలిన సందర్భంలో 1996 మే 27న ఆయన పార్లమెంట్లో చేసిన ప్రసంగం మరపురానిది! దాన్ని నాటి పార్లమెంట్ సభ్యులు, రాజకీయ నేతలు నేటికీ గుర్తు చేసుకుంటారు. ఎమర్జెన్సీ వేళ జైలు జీవితం గడుపుతూ రాసిన కవితలతో ‘ఖైదీ కవి కుండలీ’ అనే కవితా సంకలనం రచించారు. ‘అమరత్వం అగ్ని లాంటిది’, ‘నా 51 కవితలు’ వంటి పలు సంకలనాలు వెలువరించారు. ‘కవిత్వం రాసుకునేంత సమయాన్ని కూడా రాజకీయాలు మిగల్చలేదు. నా కవితా వర్షపుధార రాజకీయ ఎడారిలో ఇంకిపోయింది’ అని ఓసారి వాపోయారు. ధోతీ, కుర్తాలో నిండుగా కనిపించే అటల్ ఖాళీ సమయాల్లో కవితలు రాస్తూ సాహిత్యంతో దోస్తీ చేసేవారు. అవుంటేనే కవిత వాజ్‌పేయి సరదా మనిషి. ‘‘కవిత్వం రాయాలంటే అనువైన వాతావరణముండాలి. మనసు లగ్నం చేయగలగాలి. మనల్ని ఆవిష్కరించుకునే సమయం చిక్కాలి. ఈ రణగొణ ధ్వనుల మధ్య అవెలా సాధ్యం?’’ అన్నారోసారి. కొంతమేర సాహిత్య కృషి చేసినా పెద్దగా రాణించలేదంటూ తెగ బాధపడేవారట. ‘‘కవిత్వంలో నేను చేసింది సున్నా. అసలు రాజకీయాల గడప తొక్కక పోయుంటే హాయిగా కవితలు రాసుకుంటూ, కవి సమ్మేళనాల్లో పాల్గొంటూ ముషాయిరాల్లో మునిగి తేలుతూ గడిపేవాడిని’’ అంటూ తరచూ అంతర్మథనానికి లోనయ్యేవారు. -
రాజకీయ కవిసార్వభౌముడు
అది 1984 డిసెంబర్ 30. ముంబైలోని శివాజీ పార్కు. బీజేపీ సదస్సులో అటల్ ప్రసంగిస్తున్నారు. చీమ చిటుక్కుమన్నా విని్పంచేంతటి నిశ్శబ్దం నడుమ అంతా చెవులు రిక్కించి మరీ వింటున్నారు. ‘‘చీకట్లు విడిపోతాయి. సూర్యుడు ఉదయిస్తాడు. కమలం వికసిస్తుంది’’ అంటూ భవిష్యద్దర్శనం చేశారాయన. అప్పట్లో అంతా పెదవి విరిచినా, మరో పుష్కరం తిరక్కుండానే హస్తిన కోటపై కాషాయ జెండా ఎగరేసి చూపించారు. ప్రాణమిత్రుడు ఆడ్వాణీతో కలిసి బీజేపీని కేవలం రెండు లోక్‌సభ సీట్ల స్థాయి నుంచి కేంద్రంలో అధికార పీఠం దాకా ఒక్కొక్క మెట్టూ ఎక్కించారు. ఒకప్పుడు రాజకీయాల్లో అంటరానిదిగా పరిగణన పొందిన బీజేపీని వాజ్‌పేయీ ప్రబల శక్తిగా తీర్చిదిద్దారు. ఆ క్రమంలో ఎదురైన ఆటుపోట్లను ఏమాత్రమూ చలించని నిబ్బరంతో, అచంచల ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నారు. మూడుసార్లు ప్రధానిగా చేసి ఆ పదవికే వన్నె తెచ్చారు. అంతకుముందు లోక్‌సభలో విపక్ష నేతగానూ పార్టీలకతీతంగా మన్ననలూ అందుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై పొరుగు దేశం కుట్రలను పటాపంచలు చేసి దేశ వైఖరిని ప్రస్ఫుటంగా చాటారు. నెహ్రూ తనకిష్టమైన నేత అని చెప్పినా, పాక్ పీచమణిచి బంగ్లాను విముక్తం చేసిన ఇందిరను విజయేందిరగా కొనియాడినా వాజ్‌పేయికే చెల్లింది. తర్వాత కొన్నేళ్లకే ఎమర్జెన్సీ వేళ అదే ఇందరి నియంతృత్వాన్ని ఆయన అంతే నిస్సంకోచంగా కడిగిపారేశారు. అదే సమయంలో పార్టీ సిద్ధాంతాల కంటే దేశమే ముందని, ముఖ్యమని త్రికరణ శుద్ధిగా నమ్మడమే గాక దాన్ని ఆచరణలోనూ చూపారు. పలు సందర్భాల్లో మాతృ సంస్థ ఆరెస్సెస్ విధానాలతోనే విభేదించారు. బాబ్రీ మసీదు కూల్చివేతపై పార్టీ వైఖరికి భిన్న స్వరం వినిపించేందుకు కూడా వెనకాడలేదు. అంతేనా...? తొలిసారి ప్రధాని పదవి తనకు 13 రోజుల ముచ్చటగానే ముగిశాక నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెర దించేందుకు ఏకంగా కాంగ్రెస్‌కు బయటి నుంచి మద్దతిచ్చేందుకు కూడా ముందుకొచి్చన దేశ ప్రేమికుడు వాజ్‌పేయి. ఇలా బహుముఖీనమైన వ్యక్తిత్వంతో పార్టీలకతీతంగా చెరగని అభిమానం సంపాదించుకున్నారు వాజ్‌పేయి. రాజనీతిజ్ఞుడనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిపోయారు. ఆయన జయంతి డిసెంబర్ 25 సుపరిపాలన దినోత్సవంగా ప్రకటిస్తూ కేంద్రం సముచిత నిర్ణయమే తీసుకుంది. ఆదర్శ నాయకుడు 1984 సార్వత్రిక ఎన్నికల నాటికే దేశంలో ముఖ్యమైన పార్టీగా బీజేపీ గుర్తింపు తెచ్చుకుంది. వాజ్‌పేయి నేతృత్వంలో 1996 ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా నిలిచింది. మిత్రపక్షాల సాయంతో తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్డీఏ రూపంలో జాతీయ రాజకీయాల్లో సంకీర్ణ ప్రయోగాలకు వాజ్‌పేయి ఆద్యునిగా నిలిచారు. పదో ప్రధానిగా ప్రమాణం చేశారు. 13 రోజులకే గద్దె దిగాల్సి వచ్చినా 1998లో రెండోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. 13 నెలల అనంతరం ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పడిపోయినా చలించలేదు. ఆ వెంటనే వచి్చన ఎన్నికల్లో నెగ్గి ముచ్చటగా మూడోసారి గద్దెనెక్కి పూర్తికాలం పదవిలో కొనసాగారు. ఆ ఘనత సాధించిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా నిలిచిపోయారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో దశాబ్దాల విభేదాలకు, ఉద్రిక్తతలకు శాంతిచర్చలే విరుగుడంటూ సాహసోపేతంగా సంప్రదింపులకు తెర తీశారు. నాటి పాక్ అధ్యక్షుడు ముషార్రఫ్ ఆగ్రా ఒప్పందం కుదుర్చుకున్నారు. 1999లో ఢిల్లీ–లాహోర్ మధ్య చరిత్రాత్మక బస్సు సరీ్వసును ప్రారంభించారు. పాక్ కపట బుద్ధి కార్గిల్ యుద్ధానికి దారి తీసినా ‘ఆపరేషన్ విజయ్’ ద్వారా దాయాదికి మర్చిపోలేని గుణపాఠం నేర్పారు. 2003లో ఇరాక్‌పై యుద్ధంలో అమెరికా సైనిక సాయం కోరితే నిష్కర్షగా తిరస్కరించిన ధీశాలి వాజ్‌పేయి. డజన్ల కొద్దీ దేశాలు అమెరికా పక్షం వహించినా, అదే బాటన నడుద్దామని సొంత మంత్రివర్గ సభ్యులే ఒత్తిడి తెచి్చనా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అదే మేలని మీడియా సలహాలిచి్చనా ససేమిరా అన్నారు. ఇరాక్‌పై అమెరికా యుద్ధంలో పాల్గొనేది లేదని పార్లమెంటులోనే కుండబద్దలు కొట్టారు. ఇది అంతర్జాతీయ వేదికపై భారత ప్రతిష్టను ఇనుమడింపజేసిన కీలక ఘట్టంగా మిగిలిపోయింది.కీలక సంస్కరణలు మూడోసారి ప్రధానిగా కీలక ఆర్థిక సంస్కరణలకు వాజ్‌పేయి బాటలు వేశారు. పీవీ బాటన సాగుతూ స్వేచ్ఛా వాణిజ్యాన్ని, సరళీకృత విధానాలను, విదేశీ పెట్టుబడులను, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించారు. ఆర్థికరంగాన్ని కొత్తపుంతలు తొక్కించారు. హైవేల అభివృద్ధి, ప్రధాని గ్రామసడక్ పథకాలతో దేశ రవాణా రూపురేఖలనే మార్చేశారు. అమెరికాతో బంధాన్ని బలోపేతం చేశారు. నాటి అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 1998లో పోఖ్రాన్లో రెండో అణు పరీక్షల ద్వారా భారత అణ్వస్త్ర పాటవాన్ని ప్రపంచానికి చాటారు. దేశంలో టెలికాం విప్లవానికి బాటలు పరిచిందీ వాజ్పేయే. ఆయన హయాం సుపరిపాలనకు పర్యాయపదంగా నిలిచిపోయింది. 2004 ఎన్నికల్లో బీజేపీ ఓటమి అనంతరం వాజ్‌పేయీ క్రమంగా రాజకీయ రంగం నుంచి తప్పుకున్నారు. 2006లో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ తర్వాత చివరిసారిగా మీడియాతో మాట్లాడారు వాజ్‌పేయి. ఈ సందర్భంగానే నాయకత్వ బాధ్యతలను ఆడ్వాణీకి అప్పగించారు. క్షీణించిన ఆరోగ్యానికి నిదర్శనంగా అప్పటికే చేతికర్ర సాయం తీసుకున్నారు. 2007లో చివరిసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ కోసం ప్రచారం చేశారు. ఆ తర్వాత 2018 ఆగస్టు 16న కన్నుమూసేదాకా దాదాపు పుష్కర కాలం వాజ్‌పేయి ఏకాంత జీవితమే గడిపారని చెప్పాలి. ఆ గళం.. అనితరసాధ్యంవాజ్పేయి అద్భుత వక్త. హిందీ, ఇంగ్లీష్ ల్లో తిరుగులేని వాగ్ధాటి ఆయన సొంతం. 1957లో పార్లమెంటేరియన్‌గా తొలి ప్రసంగంతోనే నాటి ప్రధాని నెహ్రూతో సహా అందరినీ ఆకట్టుకున్నారు. రాజకీయాల్లో గొప్పగా రాణించి ప్రధాని అవుతాడంటూ నెహ్రూ ప్రశంసలు అందుకున్నారు. విపక్ష నేతగా అయినా, ప్రధానిగా హోదాలోనూ ఆయన మాట్లాడేందుకు లేచారంటే సభ్యులంతా చెవులు రిక్కించి వినేవారు. సునిశితమైన హాస్యం, చమత్కారాలు, అక్కడక్కడా అవసరమైన మేరకు వ్యంగ్యం మేళవిస్తూ కవితాత్మకంగా సాగే వాజ్‌పేయి ప్రసంగాలు అందరినీ మంత్రముగ్ధుల్ని చేసేవి. హిందీ అంతగా అర్థం కాని తమిళ దిగ్గజం సీఎన్ అన్నాదురైని కూడా ఆకట్టుకున్న ఘనత ఆయన ప్రసంగాలకు దక్కింది! 1994లో జెనీవా వేదికపై కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ సమస్యగా చిత్రించేందుకు పాక్ చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు నాటి ప్రధాని పీవీ నరసింహారావు ఏరికోరి వాజ్‌పేయినే ఎంచుకున్నారు. ఏ అంశంపై అయినా సమగ్ర కసరత్తు చేశాకే మాట్లాడేవారు. గణాంకాలు తదితరాలను తప్పకుండా ప్రస్తావించేవారు. అందుకే పార్లమెంటులో ఆయన వాదనలను తిప్పికొట్టలేక ప్రత్యర్థి పక్షాల్లోని మహామహులైన నేతలు కూడా చేష్టలుడిగేవారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో హిందీలో ప్రసంగించిన క్షణాలు తనకు మరపురానివని గుర్తు చేసుకునేవారు. వాజ్‌పేయి కొంతకాలం జర్నలిస్టుగా కూడా రాణించారు.సినీ ప్రియుడు వాజ్‌పేయి సినీ ప్రియుడు. పాత హిందీ సినిమాలు బాగా చూసేవారు. తీస్రీ కసమ్, దేవదాస్, బందినీ వంటివి ఆయన ఆల్‌టైం ఫేవరెట్ హిందీ సినిమాల్లో కొన్ని. లతా మంగేష్కర్, ముకేశ్, ఆయన అభిమాన గాయనీ గాయకులు. ‘మీకూ నాకూ ఎన్నో పోలికలు. ఇద్దరమూ ఒంటరితనమే. ఇంగ్లీష్ లో నా పేరు (అటల్)ను తిరగేస్తే మీ పేరు (లత) వస్తుంది’ అంటూ ఓసారి లతా మంగేష్కర్తో చమత్కరించారట! అలాగే హాలీవుడ్ సినిమాలు కూడా బాగా ఇష్టపడేవారు. ద బ్రిడ్జ్ ఆన్ ద రివర్ క్వై తనకిష్టమైన సినిమా అని తరచూ చెప్పేవారు. అలాగే బార్న్ ఫ్రీ, గాంధీ సినిమాలు కూడా. వాజ్‌పేయి కవితలకు పలువురు గాయకులు ప్రాణం పోయడం మరో విశేషం. ఆయన రాసిన ‘క్యా ఖోయా, క్యా పాయా’, ‘దూర్ కహీ కోయీ రోతా హై’, ‘ఝుకీ న ఆంఖే’ వంటి వేదనాభరిత కవితలను గజల్ సమ్రాట్ జగ్జీత్సింగ్ తన గళంతో అజరామరం చేశారు. శరత్, ప్రేమ్‌చంద్ సాహిత్యమన్నా వాజ్‌పేయికి ప్రాణం. ఎమర్జెన్సీ వేళ జైల్లోనూ కవితా రచన చేసిన కళాపిపాసి వాజ్‌పేయీ. అడ్వాణీ ఆయనకు ఆజన్మాంతం ప్రియమిత్రుడు. తనతో కలిసి ఢిల్లీ వీధుల్లో స్కూటర్‌పై చక్కర్లు కొట్టేవారు. పానీపూరీ, చాట్ వాజ్‌పేయి ఎంతో ఇష్టంగా తినేవారని అడ్వాణీ చెబుతారు. ఆయన చేయి తిరిగిన వంటగాడే గాక మంచి భోజనప్రియుడు కూడా.చావు అయుష్షెంత, రెండు క్షణాలేగా! మరి జీవితమేమో ప్రగతిశీలం, ఒకటీ రెండు నాళ్లలో ముగిసేది కాదు ప్రధానిగా ఒకనాటికి మాజీని అవుతానేమో. మాజీ కవిని మాత్రం ఎప్పటికీ కాలేను మిత్రులను మార్చగలం గానీ పొరుగువారిని మార్చుకోలేం భారతీయులుగా మనమంతా ఉత్కృష్ట నాగరికతకు వారసులం. శాంతే మన జీవిత గీతిక అధికారం కోసం పార్టీని చీల్చాల్సి, కొత్త గ్రూపులు కట్టాల్సే వస్తే అలాంటి అధికారాన్ని తాకనైనా తాకను పేదరికం బహుముఖీనం. దాన్ని కేవలం డబ్బు, ఆదాయం, విద్య, ఆరోగ్య పరామితుల్లో కొలవలేం పుడమి వయసు లక్షల ఏళ్లు. మనిషివి అంతులేని జీవన గాథలు. కానీ మన దేహానికి హద్దులున్నాయి.శత శరత్కాలాల వాణిని విన్నాం. అది చిట్టచివరిసారి తట్టినపుడైనా మనసు తలుపు తెరుద్దాంపాలిటిక్స్తో విసిగిపోయా. వాటిని వదిలేద్దామనుకుంటున్నాను. కానీ అవి నన్ను వదిలేలా లేవుస్వేచ్ఛకు సంకెళ్లు వేద్దామనుకునేవాళ్లు ఒకటి గుర్తుంచుకోవాలి. నిప్పుతో చెలగాటాలొద్దు. పక్కింటికి నిప్పుపెడితే ఆ దావాగ్ని మీ ఇంటినీ కాల్చేస్తుంది–వాజ్‌పేయి -
లోకం మెచ్చిన నాయకుడు..
ప్రపంచం మెచ్చిన విలక్షణ నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి. ఆయన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 1924 డిసెంబర్ 25న కన్యాకుబ్జ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు కృష్ణా దేవి, కృష్ణ బిహారీ వాజ్‌పేయి. తండ్రి గ్వాలియర్‌లో స్కూల్ టీచర్. తాత శ్యామ్‌లాల్ వాజ్‌పేయి ఉత్తరప్రదేశ్‌లోని బటేశ్వర్ నుంచి మధ్యప్రదేశ్‌లోని మొరేనాకు వలస వెళ్లారు. తర్వాత మెరుగైన జీవనోపాధి కోసం గ్వాలియర్‌కు చేరారు. అక్కడి సరస్వతి శిశు మందిర్‌లో వాజ్‌పేయి ప్రాథమిక విద్య అభ్యసించారు. గ్వాలియర్ విక్టోరియా కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. హిందీ, ఇంగ్లీష్, సంస్కృతంలో బీఏ ఉత్తీర్ణులయ్యారు. కాన్పూర్‌లో ఆగ్రా వర్సిటీకి చెందిన డీఏవీ కాలేజీ నుంచి ఎంఏ (పొలిటికల్ సైన్స్) చేశారు.ఆర్య సమాజోద్యమంతో ప్రస్థానం ఆర్య సమాజ ఉద్యమం పట్ల వాజ్‌పేయి చిన్నప్పుడే ఆకర్షితులయ్యారు. గ్వాలియర్‌లో ఆర్య సమాజ ఉద్యమ యువజన విభాగమైన ఆర్యకుమార సభలో చేరారు. 1944లో ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1939లోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్)లో చేరారు. 16 ఏళ్ల వయసులోనే స్వయం సేవకునిగా చురుకైన పాత్ర పోషించారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అరెస్టై 24 రోజులు జైల్లో ఉన్నారు. 1947లో ఆరెస్సెస్ ప్రచారక్ (పూర్తిస్థాయి కార్యకర్త)గా ఎదిగారు. దేశ విభజన పరిణామాల నేపథ్యంలో న్యాయ విద్యను మధ్యలోనే ఆపేశారు. ఆర్ఎస్ఎస్ పత్రికల్లో జర్నలిస్టుగా సేవలందించారు. కవిగా, రచయితగా, ప్రజానాయకుడిగా రాణించారు. ఆరెస్సెస్ రాజకీయ విభాగం భారతీయ జన సంఘ్‌లో సభ్యుడిగా చేరారు. దాని అధినేత శ్యామాప్రసాద్ ముఖర్జీ ప్రధాన అనుచరుడిగా ఉత్తరాదిన పార్టీని ముందుకు నడిపారు. 1957 సాధారణ ఎన్నికల్లో బలరాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి నెగ్గారు. పార్లమెంట్లో పలు అంశాలపై ఉర్రూతలూగించేలా ప్రసంగించేవారు. ఆయనపై నెహ్రూ ప్రభావం బాగా ఉండేది. నెహ్రూనూ వాజ్‌పేయి ప్రతిభ ఆకట్టుకుంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరణం తర్వాత జన సంఘ్ బాధ్యతలను వాజ్‌పేయి స్వీకరించారు. 1968లో జనసంఘ్ అధ్యక్షుడయ్యారు. నానాజీ దేశ్‌ముఖ్, ఎల్.కె.ఆడ్వాణీ వంటి సహచరుల తోడ్పాటుతో పార్టీ అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేశారు. పదవీ వ్యామోహం లేదు ప్రధాని పదవి పట్ల వాజ్‌పేయికి ఎన్నడూ వ్యామోహం లేదంటారు. 1995 డిసెంబర్లో బీజేపీ భేటీలో ఆడ్వాణీ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో సార్టీ గెలిస్తే వాజ్పేయే ప్రధాని అవుతారని ప్రకటించగా ఆయన వారించారు. ఎన్నికల్లో నెగ్గడంపైనే దృష్టి పెట్టాలని, ప్రధాని అభ్యర్థి ఎవరన్నది అప్రస్తుతమని సున్నితంగా హెచ్చరించారు. 1996 ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీకి అడుగు దూరంలో ఆగినా ఏకైక అతిపెద్ద పారీ్టగా అవతరించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ వాజ్‌పేయిని రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ఆహ్వానించారు. దాంతో వాజ్‌పేయి తొలిసారిగా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభలో మెజారీ్టని కూడగట్టడంలో విఫలం కావడంతో 13 రోజుల్లోనే వాజ్‌పేయి రాజీనామా చేయాల్సి వచ్చింది. 1996 నుంచి 1998 మధ్య రెండు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు కొలువుదీరినా మధ్యలోనే కూలిపోయాయి. 1998 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు మెజార్టీ రావడంతో వాజ్‌పేయి రెండోసారి ప్రధాని అయ్యారు. కానీ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మద్దతు ఉపసంహరించడంతో 13 నెలల తర్వాత ప్రభుత్వం కుప్పకూలింది. 1999 ఏప్రిల్ 17న లోక్‌సభలో విశ్వాస పరీక్షలో ఒక్క ఓటు తేడాతో పడిపోయింది. కార్గిల్ విజయం తదితరాల సాయంతో 1999 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించింది. లోక్‌సభలో 543 సీట్లకు గాను 303 సీట్లు గెలుచుకుంది. వాజ్‌పేయి మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు. 1999 నుంచి 2004 దాకా ఐదేళ్లపాటు పూర్తికాలం పదవిలో ఉన్నారు. జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడు లోక్‌సభల్లో ప్రధానమంత్రిగా పనిచేసిన తొలి నాయకుడిగా వాజ్‌పేయి రికార్డుకెక్కారు. నాలుగు వేర్వేరు రాష్ట్రాలు(ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ) నుంచి వేర్వేరు సమయాల్లో పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించిన ఏకైక నేత వాజ్‌పేయి. తగిన మెజార్టీ లేక వాజ్‌పేయి ప్రభుత్వాలు కూలిపోవడాన్ని హేళన చేసిన ప్రతిపక్షాలతో, ‘‘చూస్తూ ఉండండి! ఏదో ఒక రోజు బీజేపీ పూర్తి మెజార్టీతో సొంతంగా అధికారంలోకి వస్తుంది’’ అని పార్లమెంట్లో వాజ్‌పేయి బల్లగుద్ది మరీ చెప్పారు. ఆయన వాక్కు నిజమైంది.బీజేపీ తొలి అధ్యక్షుడు.. 1975లో ఎమర్జెన్సీ సమయంలో వాజ్‌పేయీ అరెస్టయ్యారు. తర్వాత 1977 ఎన్నికల్లో జనసంఘ్ ఇతర పార్టీలతో కూడిన జనతా కూటమి నెగ్గి మొరార్జీ దేశాయ్ ప్రధాని అయ్యారు. వాజ్‌పేయీ విదేశాంగ మంత్రిగా రాణించారు. 1977లో ఐరాసలో హిందీలో మాట్లాడి చరిత్ర సృష్టించారు. 1980లో జనసంఘ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)గా మారాక దాని తొలి అధ్యక్షుడయ్యారు. ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో లోక్‌సభకు పదిసార్లు, రాజ్యసభకు రెండుసార్లు ఎన్నికయ్యారు. 1996లో 13 రోజులు, 1998లో 13 నెలలు, 1999 నుంచి పూర్తిస్థాయిలో ఐదేళ్లూ ప్రధానిగా చేశారు. 1998లో పోఖ్రాన్ అణుపరీక్షలతో ప్రపంచాన్ని నివ్వెరపరిచారు. దాయాది పాకిస్తాన్‌తో సంబంధాలకు ప్రాధాన్యమిచ్చారు. లాహోర్ బస్సు యాత్ర చేశారు. కార్గిల్ యుద్ధం తర్వాత కూడా పాక్‌తో సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నించారు. గొప్ప రాజనీతిజు్ఞడిగా దేశ విదేశాల్లో పేరుగాంచారు. పార్టీలకతీతంగా ఎంపీలతో ఆయనకు సత్సంబంధాలుండేవి. అంతర్జాతీయ వ్యవహారాలపై వాజ్‌పేయీకి అమితాసక్తి ఉండేది. ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాల్లో విస్తృతంగా పర్యటించారు. వాజ్‌పేయీ హయాంలో 2001లో పార్లమెంట్‌పై దాడి 2002లో గుజరాత్లో మత కలహాలు జరిగాయి. ఆయన్ను భారత రాజకీయాల్లో భీష్మ పితామహుడిగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభివర్ణించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దేశం గర్వించదగ్గ గొప్ప నేత
సాక్షి, హైదరాబాద్: దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుల్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ముఖ్యులని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుధాన్షు త్రివేది కొనియాడారు. వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం హైదరాబాద్‌లో అటల్ బిహారీ వాజ్‌పేయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్మారకోపన్యాసంలో త్రివేది ప్రసంగించారు. దేశ చరిత్రలో ఇప్పటివరకు నాయకులుగా పుట్టి ప్రధాని పగ్గాలు చేపట్టింది ఇద్దరేనని.. వారిలో వాజ్‌పేయి అయితే మరొకరు నరేంద్ర మోదీ అన్నారు. వాజ్‌పేయి ఆలోచలను ప్రధాని మోదీ అనుసరిస్తున్నారని త్రివేది చెప్పారు. దేశంలో మౌలికవసతుల కల్పనకు వాజ్‌పేయి బీజం వేస్తే దాన్ని మోదీ వటవృక్షం చేశారన్నారు. విద్యతోపాటు, నైపుణ్యం, డిజిటల్ విద్య, డిజిటల్ ఎకానమీ వరకు అన్నింటినీ గ్రామాల చెంతకు చేర్చారని ప్రశంసించారు. నాటి వాజ్‌పేయి ప్రభుత్వం దేశ అణ్వస్త్ర సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తే ప్రస్తుతం మోదీ సర్కారు అణ్వాయుధాలను భూమ్యాకాశాల నుంచి ప్రయోగించే సామర్థ్యానికి తీసుకెళ్లిందని గుర్తుచేశారు. అందరినీ మెప్పించిన నేత వాజ్‌పేయి: కిషన్‌రెడ్డి అనంతరం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పాయ్ పేరు కాదని, ఒక చరిత్ర అని అన్నారు. దేశ ప్రధానిగా, కేంద్రమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, పార్టీ అధినేతగా వేలెత్తి చూపించలేని పనితీరుతో అందరినీ మెప్పించారన్నారు. చివరి శ్వాస వరకు జాతీయ వాదానికి, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి అని కొనియాడారు. అటల్జీ స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామన్నారు. మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ వాజ్‌పేయిని ప్రజలు దేశానికి ఒక కాంతిరేఖగా గుండెల్లో దాచుకున్నారన్నారు. అలాంటి వ్యక్తి పాలనలో పనిచేసే అవకాశం లభించిందని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, వాజ్‌పేయి ఫౌండేషన్ చైర్మన్ సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అమిత్ షా రాజీనామా చేయాలి
సాక్షి, హైదరాబాద్/సాక్షిప్రతినిధి, ఖమ్మం/కవాడిగూడ: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్‌ను అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో మంగళవారం అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాద్ జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, వరంగల్, సిద్దిపేట జిల్లా కేంద్రాల్లో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌తోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. జిల్లా కేంద్రాల్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం జిల్లా కలెక్టరేట్లకు ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు అక్కడ కలెక్టర్‌ను కలిసి అమిత్ షాను బర్తరఫ్ చేయాలంటూ వినతిపత్రాలు ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలి: భట్టి భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి.. ఆ రాజ్యాంగాన్నే ఉల్లంఘించిన కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రపతి రద్దు చేయాలని భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు. ఖమ్మంలో ర్యాలీ అనంతరం భట్టి మాట్లాడుతూ.. రాజ్యాంగంపై ప్రమాణం చేసి.. అందుకు అనుగుణంగా పాలన అందించకుంటే ఏ ప్రభుత్వా న్ని అయినా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గుర్తించదన్నారు. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనగలుగుతోందంటే అందుకు రాజ్యాంగం, దాన్ని అందించిన అంబేడ్కరే కారణమని పేర్కొన్నారు. అలాంటి అంబేడ్కర్‌ను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన అమిత్ షా రాజీనామా కోరడం అందరి నైతిక హక్కు అని భట్టి చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. బీజేపీ ముసుగు తొలగిపోయింది: టీపీసీసీ చీఫ్బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై అమిత్‌షా వ్యాఖ్యలతో బీజేపీ పార్టీ ముసుగు తొలగిపోయిందన్నారు. రాజ్యాంగంపై నమ్మకమున్న ప్రతి పౌరునికి అమిత్ షా మాటలు బాధ కలిగించాయన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీకి అంబేడ్కర్‌పై ఎంత ద్వేషం ఉందో బయటపడిందని ఏఐసీసీ నేత కొప్పుల రాజు అన్నారు. హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీగణేష్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
దార్శనికత గల రాజనీతిజ్ఞుడు
దేశ ప్రజలు తమ ప్రియతమ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి (డిసెంబర్ 25)ని జరుపుకొంటున్న వేళ ఇది. ఆయన ఎంతో మందికి ప్రేరణను ఇస్తూ ఒక రాజనీతి కోవిదునిగా సమున్నత స్థానంలో నిలిచారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆయన సామాన్య పౌరుల కష్టాలను అర్థం చేసుకున్నారు. ప్రభుత్వానికి దక్షత ఉంటే ఎంతటి పరివర్తనను తీసుకురావచ్చో చేతల్లో చూపించారు. దేశాన్ని 21వ శతాబ్దంలోకి నడిపిన మహనీయునిగా అటల్జీకి దేశ ప్రజలు ఎన్నటికీ రుణపడి ఉంటారు.అటల్జీ 1998లో ప్రధా నిగా పదవిని స్వీకరించిన తరుణంలో మన దేశం రాజకీయ అస్థిరత్వంతో కొట్టుమిట్టాడుతోంది. దాదాపు తొమ్మిదేళ్లలో నాలుగు సార్లు లోక్‌సభకు ఎన్నికలు జరగడాన్ని మనం చూశాం. దేశ ప్రజానీకం సహనాన్ని కోల్పోతూ, ఈ ప్రభుత్వాలు వాటి బాధ్యతను సమర్థంగా నెరవేర్చ గలుగుతాయా? అనే అనుమానంలో పడిపోయారు. ఈ స్థితిని అటల్జీ మార్చి స్థిరమైన, ప్రభావవంతమైన పాలనను అందించారు.అటల్జీ నాయకత్వం ఎన్నో రంగాల్లో గణనీయ ప్రభావాన్ని చూపించింది. ఆయన పదవీ కాలంలో సమాచార సాంకేతిక విజ్ఞానం (ఐటీ), టెలికం, కమ్యూనికేషన్స్ రంగాల్లో గొప్ప పురోగతి చోటు చేసుకొంది. యువశక్తి అత్యంత చైతన్యవంతంగా ఉన్న భారత్ వంటి దేశానికి ఇది చాలా ముఖ్యం. అటల్జీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం టెక్నాలజీని సామాన్య పౌరులకు అందుబాటులోకి తేవడానికి శ్రద్ధ తీసుకుంది. భారత్‌లో సంధాన సదుపాయాల కల్పన విషయంలోనూ ముందుచూపు కనిపించింది. స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టును ఈనాటికీ చాలామంది గుర్తు పెట్టుకుంటున్నారు. ఇది దేశంలో అనేక ప్రాంతాలను అనుసంధానం చేసింది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన వంటి కార్యక్రమాలను అమలుచేయడం ద్వారా స్థానికంగా కూడా సంధానాన్ని పెంపొందింప చేయడానికి వాజ్‌పేయి ప్రభుత్వం చేసిన కృషి అంతే గుర్తించదగ్గది. ఇదే మాదిరి ఆయన ప్రభుత్వం ఢిల్లీ మెట్రోను ఏర్పాటు చేయడానికి పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. ఢిల్లీ మెట్రోకు ఒక ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల రంగ ప్రాజెక్టు అనే పేరు ప్రఖ్యాతులున్నాయి. వాజ్‌పేయి ప్రభుత్వం ఆర్థిక వృద్ధిని పెంచడమే కాక, దూరదూరాల్లో ఉన్న ప్రాంతాలను చేరువచేసి ఏకత, సమగ్రత వర్ధిల్లేటట్టు చూసింది.సర్వ శిక్షా అభియాన్ వంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రజలకు, ముఖ్యంగా పేదలకూ, సమాజంలో ఆదరణకు నోచుకోకుండా ఉండి పోయిన వర్గాలకూ ఆధునిక విద్యను అందుబాటులోకి తేగలిగే భారత దేశాన్ని ఆవిష్కరించాలన్న అటల్జీ కలను గురించి చెబుతుంది. ఆశ్రిత పక్షపాతం, దశాబ్దాల పాటు ఎదుగూబొదుగూ లేని ఆర్థిక విధా నాలతో సాగిన దేశంలో... అనేక ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు ఆయన ఆధ్వర్యంలోని ప్రభుత్వం చొరవ తీసుకుంది.వాజ్‌పేయి అద్భుత నాయకత్వానికో చక్కటి ఉదాహరణ 1998 వేసవి. ఆయన ప్రభుత్వం అప్పుడే పదవీ బాధ్యతలు చేపట్టింది. వెంటనే మే 11న పోఖ్రాన్లో అణు పరీక్షలను నిర్వహించింది. ‘ఆప రేషన్ శక్తి’ పేరిట జరిగిన ఈ పరీక్షలు భారత శాస్త్రవేత్తల శక్తిని నిరూ పించాయి. భారత్ ఈ రకమైన పరీక్షలను నిర్వహించడమా? అని ప్రపంచం విస్తుపోయింది. ప్రపంచ దేశాలు వాటి ఆగ్రహాన్ని స్పష్టంగా వ్యక్తం చేశాయి. ఆ సమయంలో ఏ సామాన్య నేత అయినా ఒత్తిడికి తలొగ్గేవారు. కానీ, అప్పుడు జరిగిందేమిటి? భారత్ దృఢంగా నిల బడటమే కాక, మరో రెండు రోజుల తరువాత అంటే మే 13న రెండో దఫా పరీక్షలు నిర్వహించింది. 11వ తేదీ పరీక్షలు విజ్ఞానశాస్త్ర నైపు ణ్యాన్ని చాటితే, 13వ తేదీన నిర్వహించిన పరీక్షలు సిసలైన నాయకత్వం అంటే ఏమిటో రుజువుచేశాయి. బెదిరింపులకో, ఒత్తిడికో లొంగిపోయే రోజులు గతించాయని ప్రపంచానికి ఆయన ఒక సందేశాన్ని పంపారు. అప్పటి ఎన్ డీఏ ప్రభుత్వం అంతర్జాతీయ ఆంక్షల్ని ఎదుర్కొంటూనే గట్టిగా నిలబడింది. భారత్ తన సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకొనే హక్కును నిలబెట్టుకొంటూ, ప్రపంచ శాంతిని బలంగా సమర్థించే దేశంగా కూడా నిలిచింది.భారత ప్రజాస్వామ్య వ్యవస్థను, దాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని అటల్జీ అర్థం చేసుకున్నారు. దేశ రాజకీయాల్లో సంకీ ర్ణాలను పునర్నిర్వచించిన ఎన్డీఏకు ఆయన నాయకత్వం వహించారు. ఆయన రాజకీయ ప్రయాణంలో అడుగడుగునా రాజనీతిజ్ఞత కనిపిస్తుంది. గుప్పెడు మంది ఎంపీలున్న పార్టీకి చెందిన వ్యక్తి అయి నప్పటికీ ఆయన మాటలు శక్తిమంతమైన కాంగ్రెస్ పార్టీని గడగడ లాడించేవి. ప్రధానమంత్రిగా తనదైన శైలిలో విపక్షాల విమర్శలను తిప్పి కొట్టేవారు. తనను ద్రోహిగా ముద్ర వేసే స్థాయికి కాంగ్రెస్ దిగ జారినప్పటికీ ఎవరిపైనా ద్వేషం పెంచుకోలేదు.అధికారం కోసం ఏనాడూ ఆయన అవకాశవాద రాజకీయాలకు పాల్పడలేదు. 1996లో ప్రతికూల పరిస్థితుల్లో సైతం రాజీనామా చేయడానికి మొగ్గు చూపారే తప్ప బేరసారాలకు పాల్పడలేదు. 1999లో కేవలం ఒక్క ఓటు తేడాతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. ఆ సమయంలో జరిగిన అనైతిక రాజకీయాలను సవాలు చేయమని చాలా మంది చెప్పినప్పటికీ, న్యాయబద్ధంగానే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చివరకు అద్భుతమైన ప్రజాతీర్పుతో తిరిగి అధికారాన్ని చేపట్టారు.శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానం ఆయన్ని తీవ్రంగా ప్రభా వితం చేసింది. కొన్నేళ్ల తర్వాత జరిగిన ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో ఆయన ప్రధాన భూమిక పోషించారు. ఆత్యయిక పరిస్థితి తర్వాత, 1977 ఎన్నికలకు ముందు తాను స్థాపించిన (జన్ సంఘ్) పార్టీని జనతా పార్టీలో విలీనం చేసేందుకు అంగీకరించారు. ఇది ఆయనతో పాటు ఇతరులను సైతం బాధించిన నిర్ణయమని నేను భావిస్తున్నాను. కానీ రాజ్యాంగాన్ని పరిరక్షించడమే ఆయనకు ప్రధానం.భారతీయ సంస్కృతితో అటల్జీ ఎంతగా మమేకమయ్యారో కూడా గమనించాల్సిందే. విదేశీ వ్యవహారాల మంత్రిగా ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన తొలి భారతీయ నేతగా నిలిచారు. భారతీయ వారసత్వం, గుర్తింపు పట్ల ఆయన ఎంత గర్వంగా ఉండే వారో చెప్పడానికి అంతర్జాతీయ వేదికపై చెరగని ముద్ర వేసిన ఈ ఒక్క ఉదాహరణ చాలు.ఆయన ఓ గొప్ప రచయిత, కవి. స్ఫూర్తి నింపేందుకు, ఆలోచన లను రేకెత్తించేందుకు, ఓదార్పును అందించేందుకు తన మాటలను ఉపయోగించేవారు. ఆయన అంతర్మథనానికి, దేశం పట్ల ఉన్న ఆకాంక్షలకు ఆయన కవిత్వం అద్దం పడుతుంది.అటల్జీతో సంభాషించే, నేర్చుకొనే అవకాశం దక్కడం నాలాంటి ఎంతో మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఓ గొప్ప వరం. బీజేపీకి ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివి. పార్టీ తొలినాళ్ళ నుంచి ఎటువంటి సవాళ్లు ఎదురైనప్పటికీ ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి లాంటి దిగ్గజాలతో కలసి వాటిని సమర్థంగా ఎదుర్కొంటూ పార్టీని విజయపథంలో నడిపించారు. సిద్ధాంతం, అధి కారం మధ్య ఒకదాన్ని ఎంచుకోవాల్సిన సందర్భాలు ఎదురైతే ఆయన మొదటిదానినే ఎంచుకొనేవారు. అటల్జీ శత జయంతి వేళ ఆయన ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చేందుకు మనల్ని మనం పునరంకితం చేసుకోవాలి. ఆయన అనుసరించిన సుపరిపాలన, ఐక్యత, ప్రగతి అనే నియమాలను ప్రతిబింబించే భారత్‌ను నిర్మించడానికి మనం కృషి చేద్దాం. మన దేశ సామర్థ్యంపై అటల్జీకి ఉన్న అచంచలమైన విశ్వాసం ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని, కష్టపడి పనిచేసేలా మనల్ని ప్రేరేపిస్తుంది.నరేంద్ర మోదీభారత ప్రధాని (మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి ముగింపు నేడు.) -
మిగతా కేసులతో పోలిస్తే ఈ కేసు చాలా చిన్నది
-
నేను చెప్తే సీఎం, డిప్యూటీ సీఎం చెప్పినట్లే
ఆదోని టౌన్: ‘ఆదోని నియోజకవర్గంలో కూటమి కార్యకర్తలు, నాయకులను ఆదుకోవడం నా బాధ్యత. ప్రభుత్వం నుంచి మంజూరయ్యే సంక్షేమ పథకాలను వర్తింపజేసి వాటి ద్వారా కార్యకర్తలు, నాయకులుబ్దిపొందేలా చూసుకుంటా. నేను చెబితే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ చెప్పినట్లే. గతంలో నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అన్నివిధాలుగా లబ్ధిపొందారు. ఇక చాలు.. రేషన్‌షాపులు, మధ్యాహ్న భోజనం ఏజెన్సీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితర పోస్టులను కూటమి నాయకులు, కార్యకర్తలకు వదిలేసి వెళ్లాలి’.. అని కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి చేసిన సంచలన వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.ఐదు రోజుల క్రితం జేబీ ఫంక్షన్ హాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన కూటమి నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. ‘వైఎస్సార్సీపీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, రేషన్‌షాపు డీలర్లు .. అన్నీ వదిలి వెళ్లిపోవాలి. వైఎస్సార్సీపీ ఐదేళ్లుగా చేస్తున్నది చాలు. అధికారుల నుంచి ఎలాంటి లేఖలు తీసుకొచ్చినా నేను బెదరను. నేను చెప్పిందే ఒక పెద్ద లెటర్. అదే చెల్లుబాటవుతుంది. ఆ పిమ్మట ఎవరు చెప్పినా ఏం జరగదు’.. అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. కార్యకర్తలు, నాయకులకు ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడే న్యాయం చేస్తామన్నారు. ఇక ఎమ్మెల్యే వ్యాఖ్యల అనంతరం ఆదోని పట్టణంలో పది రేషన్ షాపులకు బీజేపీ కూటమి కార్యకర్తలు తాళాలు వేశారు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. -
ఈ-రేసు కేసులో కేటీఆర్‌పై కుట్ర జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు
-
ఆప్ Vs బీజేపీ.. ఢిల్లీలో పొలిటికల్ మంటలు..
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. బీజేపీ పార్టీపై మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే ఎజెండానే బీజేపీకి లేదన్నారు. అలాగే, గడిచిన ఐదేళ్ల కాలంలో ఢిల్లీకి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ ఛార్జ్‌షీట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీని టార్గెట్ చేస్తూ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ..‘ఢిల్లీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కాషాయ పార్టీకి స్పష్టమైన ఎజెండా లేదు. పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో కూడా తెలియదు. ఢిల్లీలో విద్యుత్, మంచి నీరు, మహిళలకు ఉచిత ప్రయాణం, మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆప్ ఎంతో కృషి చేసింది. కానీ, ఢిల్లీలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నా బీజేపీ పట్టించుకోవడం లేదు. ఢిల్లీలో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడుతోంది. ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చిన వెంటనే నాపై ఛార్జిషీట్లు వేస్తున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇదే సమయంలో ఢిల్లీలో ఓటర్లను బీజేపీ తొలగిస్తోందని ఆరోపించారు. Forget about becoming CM, Arvind Kejriwal will not become even MLAHis political career may soon be over — Sandeep Dikshit on🔥 pic.twitter.com/6grdNMZYUK— Amoxicillin (@__Amoxicillin_) December 23, 2024ఇదిలా ఉండగా.. అంతకుముందు కేజ్రీవాల్‌ను టార్గెట్ చేస్తూ బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఢిల్లీని కేజ్రీవాల్ సర్కార్ స్కామ్‌లకు రాజధానిగా మార్చిందన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీ, ఢిల్లీ జల్ బోర్డు, డీటీసీ, వక్ఫ్ బోర్డుకు సంబంధించి కుంభకోణాలకు పాల్పడింది. కేంద్ర నిధులు ఉన్నప్పటికీ ఢిల్లీ ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో ఆప్ విఫలమైంది. కేవలం ప్రకటనల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. ఇదే సమయంలో దేశ వ్యతిరేక శక్తులకు ఆప్ మద్దుతు ఇస్తోందని కామెంట్స్ చేశారు. మరోవైపు.. కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ నేతలు సైతం ఆరోపణలు చేయడం గమనార్హం. ఇక, ఎప్పటికీ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కాలేరని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ అన్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేరని వ్యాఖ్యలు చేశారు. ఇక, 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. Forget about becoming CM, Arvind Kejriwal will not become even MLAHis political career may soon be over — Sandeep Dikshit on🔥 pic.twitter.com/6grdNMZYUK— Amoxicillin (@__Amoxicillin_) December 23, 2024 -
Formula E race case : టార్గెట్ కేటీఆర్.. ఎందుకంటే..?
సాక్షి,తెలంగాణ భవన్: ఫార్ములా ఈ-రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కుట్ర జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. తెలంగాణ భవన్లో కవిత మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్, బీజేపీలు బాయ్ బాయ్ అని కేటీఆర్ కేసుతో రుజువైంది. ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ.. నడుపుతున్నది బీజేపీ వాళ్ళు. గతంలో ఏ కేసులో కూడా ఇంత త్వరగా ఈడీ కేసు నమోదు చేయలేదు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలను కలిశాకనే ఫార్ములా కేసు నమోదు చేశారు. ఫార్ములా రేసు కేసును.. రాజ్ భవన్ నుంచి నడిపించారు. ప్రాంతీయ పార్టీలు ఉండకూడదని కాంగ్రెస్, బీజేపీల ప్లాన్’ అని ధ్వజమెత్తారు. -
నేను చెప్తే బాబు, పవన్ చెప్పినట్టే..
-
సీటీ రవిని ఎన్కౌంటర్ చేస్తారేమో ?
హుబ్లీ: ఎమ్మెల్సీ సీటీ రవిని పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారేమోనని అనుమానం ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన బాగల్కోటెలో మీడియాతో మాట్లాడారు. సీటీ రవిని అరెస్ట్ చేయడం, నిబంధనలు పాటించకుండా దారుణంగా వ్యవహరించడంపై కోర్టులో ప్రశి్నస్తామన్నారు. ప్రభుత్వ కీలుబొమ్మలుగా మారిన పోలీసు అధికారులకు తగిన గుణపాఠం చెప్పడానికి కోర్టుకు వెళ్తామన్నారు. రవి ఎటువంటి వ్యాఖ్యలు చేశారన్నదే స్పీకర్ నిర్ణయిస్తారన్నారు. స్పీకర్ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలన్నారు. ముఖ్యంగా ఇలాంటి కేసులలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిపారు. స్పీకర్ అనుమతి లేకుండా ఎమ్మెల్సీని అరెస్ట్ చేయడానికి వీలు లేదన్నారు. ఆయన్ను గుర్తు తెలియని ప్రాంతాలకు తీసుకెళ్లడం వెనుక దురుద్దేశం ఉందన్నారు. -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు : రైతు భరోసాపై చర్చ
Telangana Assembly Sessions 2024 LIVE updatesతెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసాపై చర్చసీఎం రేవంత్ రెడ్డి రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనకాడదు.వ్యవసాయం చేసుకునే వారికి సహాయం చేయడం రైతు బంధు లక్ష్యం.. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో లో చేర్చింది.రూ.22606 కోట్ల రూపాయల రైతు బంధు అనర్హులకు వేశారురోడ్లు ,రాళ్లు ఉన్న భూములకు రైతు బంధు ఇచ్చారు.రాజీవ్ రహదారికి రైతు బంధు ఇచ్చారుక్రషర్లు నడుస్తున్న భూములకు , మైనింగ్ భూములకు రైతు బంధు ఇచ్చారుగిరిజన పోడు పట్టాలకు.. నకిలీ పట్టాలు తయారు చేసి రైతు బంధు పొందారుహైదరాబాద్ చుట్టూత రియల్ఎస్టేట్ జరుగుతుంది.. వాటికి రైతు బంధు ఇచ్చారుమేము ఇచ్చినట్లు గానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని కేటీఆర్ అంటుంన్నారుమీరు ఇచ్చినట్లు ఇస్తే..మేము ప్రతిపక్షంలో ఉంటాం..ఆ తర్వాత బయటకు వెల్లాల్సి వస్తుందికేసీఆర్ చేసిస ఘనకార్యానికి ఆయన సభకు రాలేకపోతున్నారుగుట్టలు ,రోడ్డు ,రియలెస్టేట్ వెంచర్లకు రైతు భరోసా ఇవ్వాలా వద్దా.. బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి.మా ప్రభుత్వం సూచనలను తీసుకోవడానికి సిద్ధంగా ఉందిబీఆర్ఎస్ సభలో ఎంత చిల్లరగా వ్యవహరించినా ఓపికతో ఉన్నాం. మంత్రి సీతక్క రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్దిరైతులు వరి వేస్తే ఉరి అన్నది మీరుఇప్పుడు కౌలు రైతుల గురించి మీకు మాట్లాడే అర్హత ఉందాకౌలు రైతులకు రైతు బంధు ఎందుకు ఇవ్వాలని అన్నది మీరు కాదా?అద్దె ఇంట్లో ఉన్నవాళ్లు ఓనర్లు అవుతారా? అన్నది మీరు కాదా?ఈ రాష్ట్రంలో భూముల పై సమగ్ర సర్వే జరగాలివందల ఎకరాల ఫౌంహౌజ్లు ఉన్నాయిరూ.5, రూ.6 లక్షల జీతాలు తీసుకునేవారు కూడా రైతుల ముసుగులో రైతు బంధు తీసుకున్నారుగుట్టలకు,రోడ్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిందినిజంగా వ్యవసాయం చేసే కౌలు రైతులకు రైతు బంధు రాలేదుబీఆర్ఎస్ ఇచ్చింది రైతు బంధు కాదు.. పట్టా పెట్టుబడిపట్టాలేని ఎంతో మంది రైతులకు రైతు బంధు రాలేదుబీఆర్ఎస్ చేసింది రుణమాఫీ కాదు..వడ్డీ మాఫీబీఆర్ఎస్ అందరికీ రుణమాఫీ చేస్తే...ఇప్పుడు రూ.30 వేల కోట్ల రుణ భారం ఎందుకైందిభూమి లేని పేదలకు మీరు ఏమిచ్చారుఉచిత బస్సు సౌకర్యం ఇస్తే..బీఆర్ఎస్ ఓర్వలేకపోతుందివందల ఎకరాల ఫౌంహౌస్‌లకు రైతు భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ అడుగుతుందారైతు భరోసా ఎవరికి ఎంత పోతుంది.. అని అన్ని గ్రామాల్లో వివరాలు ఉంచాలి మాజీ మంత్రి కేటీఆర్అదాని కోసం కొడంగల్ రైతులను అరెస్ట్ చేశారురైతు రుణమాఫీ పూర్తి జరిగింది అంటున్నారు60 శాతం అయ్యింది అని మరొకరు అంటున్నారురైతు రుణమాఫీ ఎంత మేర జరిగిందో స్పష్టంగా చెప్పండి25 శాతమా, 50 శాతమా మీకే స్పష్టత లేదుకోతలు పెడితే అది మీ ఇష్టంకౌలు రైతులకు ఇస్తారా లేదా క్లారిటీ ఇవ్వాలిరాష్ట్ర రైతాంగం కోసం చేయండిఅదాని కోసం కొడంగల్ రైతులను జైల్లో పెట్టారుఅనుముల కుటుంబం కోసం, బామర్ధి కోసం, అన్నదమ్ముల కోసం, అదాని కోసం చేయకండిజూపల్లి కృష్ణారావు మంత్రికేటీఆర్ సవాల్‌ను స్వీకరిస్తున్నాకేటీఆర్తో పాటు రాజీనామా చేయడానికి నేను సిద్ధంమా జిల్లాకు నీళ్లు ఇవ్వలేదుగత ప్రభుత్వం అప్పులు చేసింది నిజం కాదాకేటీఆర్ నిజాలు మాట్లాడాలిమాజీ మంత్రి కేటీఆర్మహబూబ్ నగర్ జిల్లాలో ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాంజూపల్లి కృష్ణారావు అబద్ధాల గురించి మాట్లాడవద్దు...ఇదే సభలో కేసీఆర్‌ని పొడిగారుజూపల్లి కృష్ణారావు మంత్రికేటీఆర్ పదే పదే అబద్ధాలు చెప్తున్నారుఅప్పులపై మాజీ మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో లెక్క చెప్తున్నారు30 నిమిషాలు టైం ఇస్తున్నా రికార్డులు తీయాలని కోరుతున్నా మాజీ మంత్రి కేటీఆర్కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా ఇవ్వలేదురెండు పంటలది రైతు భరోసా ఇవ్వలేదుఏడాది కాంగ్రెస్ పాలనలో రూ.17వేల బాకి పడ్డారు.రూ. 26వేల కోట్లు రైతులకు బాకీ పడ్డారు.రైతులకు ఉన్న బకాయిలను క్లియర్ చేసి...కొత్త రైతు భరోసా రైతులకు ఇవ్వాలిరుణమాఫీ రూ.40 వేల కోట్లు సిఎం రేవంత్ రెడ్డి అన్నారు...కేబినెట్లో రూ.31వేలు అయ్యింది. బడ్జెట్ కి వచ్చే సరికి రూ.26 వేల కోట్లయ్యిందిరుణమాఫీ కాలేదు...కొండారెడ్డి, సిరిసిల్ల పోదామా?ఏ ఊరిలో అయినా రుణమాఫీ పూర్తి అయినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటాఎన్నికల హామీలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి మాజీ మంత్రి కేటీఆర్ మహబూబ్ నగర్ జిల్లాలో 30 ఎకరాలు ఉన్నా కూలీలుగా పనిచేశారు..అందుకే రైతు బందుపై సీలింగ్ పెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బందు కోతలు పెట్టొద్దు అని కోరుతున్నాంరైతు బందు ను కాఫీ కొట్టి కేంద్రం పీఎం కిసాన్ అని పెట్టిందిప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం1లక్షల 34వేల కోట్ల ధాన్యం కొనుగోలు పదేళ్ళలో కేసీఆర్ ప్రభుత్వం చేసిందిరైతులకు డబ్బులు పంచుతుంటే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారుపోడు భూముల్లో ఒక పంట మాత్రమే పండుతుందిఒక పంట పండుతుందని ఒకే సారి రైతుబందు ఇస్తామనడం కరెక్ట్ కాదుగిరిజనులకు రెండు పంట పండినా..పండకపోయినా రెండు సార్లు రైతు బందు ఇవ్వాలితుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర మంత్రిమేము రైతు భరోసా లో కటాప్ పెడతమని చెప్పలేదుసభ్యుల అభిప్రాయం మేరకు నిర్ణయం ఉంటుందిబీఆర్ఎస్ ఇవ్వకుండా వదిలిపెట్టిన రైతు బంధును మా ప్రభుత్వం వచ్చాక వేశాంమాజీ మంత్రి కేటీఆర్కేసీఆర్ పాలనలో నల్గొండ జిల్లాకు 2లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు.కేసీఆర్ పాలనలో వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నల్గొండ జిల్లా మొదటి స్థానంలో ఉన్నది నల్గొండ జిల్లా ఇరిగేషన్‌పై చర్చ పెట్టాలని కోరుతున్నాం కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిబావ,బామ్మర్దికి నల్గొండ జిల్లాపై కోపం ఎందుకు?మాకు విషం ఇచ్చి చంపండి మాజీ మంత్రి కేటీఆర్కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టింది మేమే అని డబ్బా కొట్టుకోవచ్చు. కానీ మేము చేసింది చెప్పొద్దా?24 గంటల కరెంట్ వస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన చేశారు.సభ తరువాత బస్సులో నల్గొండకు వెళ్దాంఇవ్వాళ 24 గంటల కరెంటు ఈ రోజు ఇస్తున్నట్లు రైతులు చెప్తే మా మొత్తం శాసన సభ్యులం రాజీనామా చేస్తాం హరీష్‌రావు సవాల్‌ను స్వీకరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డినల్గొండ జిల్లా సూర్యాపేటకు వెళ్దాంనాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టింది ఎవరు? మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్రంలో రైతు బందుపై ప్రజలు గమనిస్తున్నారు.కేటీఆర్ మాట్లాడుతున్నప్పుడు మంత్రులు వరుసగా ఇంట్రాప్ చేస్తున్నారు మిషన్ భగీరథలో రూ.50వేలు తిన్నట్లు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపిస్తున్నారు.మిషన్ భగీరథకు పెట్టిన ఖర్చే రూ. 25వేల ఖర్చు సభ తరువాత కోమటి రెడ్డి వస్తే నేరుగా నల్గొండకు వెళ్దాంనల్గొండ జిల్లాలో 2లక్షల ఎకరాలు, మెడికల్ కాలేజీలు ఇచ్చాంకోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారుకోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర మంత్రికేసీఆర్ పాలనలో 24 గంటల కరెంటు ఇవ్వలేదు24గంటల కరెంట్ ఇవ్వలేదని లాగ్ బుక్స్ తెచ్చి చూపిస్తాఎక్సైజ్ టెండర్లు ఒక ఏడాది ముందు పెట్టారు.. రూ.2 వేల కోట్లు ముందుగా వసూలు చేశారుకేటీఆర్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు.గత ప్రభుత్వం లో కేవలం 14 గంటల కరెంటు మాత్రమే ఇచ్చారునేను సబ్ స్టేషన్ వెళ్లి చెక్ చేశానునేను ఎమ్మెల్యే, ఎంపీగా గత పదేళ్లుగా పని చేశాను.కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంటు ఇవ్వలేదు.ఎక్సైజ్ టెండర్లు 2లక్షలు పెట్టీ...2వేల కోట్లు వసూళ్లు చేశారు... ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయో తెలీదు.కాళేశ్వరం నీళ్లు నల్గొండ జిల్లా ఒక్క ఎకరానికి నీళ్లు ఇస్తే రాజీనామా చేస్తాతెలంగాణ వచ్చాక నష్టపోయిన జిల్లా నల్గొండ తెలంగాణ వస్తే దళితున్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు కేసీఆర్...మాట తప్పారు పదేళ్ల కేసీఆర్ పాలన..వందేళ్లు వెనక్కి తీసుకెళ్ళారుకూలిపోయే ప్రాజెక్టులు మాత్రమే కట్టారుఇంటింటికి నీళ్లు ఇయ్యకపోతే ఓట్లు అడుగా అన్నావ్సిరిసిల్లకు పోదాం ఏ ఇంటికి నీళ్లు వస్తున్నాయో తెలుస్తుందిహరీష్ రావు ఒక ఎమ్మెల్యే...ఆయన డిప్యూటీ లీడర్ కాదుహరీష్ రావుకు మైక్ ఇవ్వొద్దు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏక వచనంతో సంబోధించవద్దని కేటీఆర్‌కి సూచనమాజీ మంత్రి కేటీఆర్ గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి.. కెసిఅర్ పట్ల గౌరవంగా మాట్లాడితే మేం గౌరవం ఇస్తాంవ్యవసాయ స్థిరీకరణ కోసమే రైతు బంధు ఇచ్చాం24 గంటలకు నాణ్యమైన విద్యుత్ ఇచ్చాంరైతుల ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నాసద్విమర్శగానే చూడాలని కోరుతున్నారైతు బంధు పథకంలో 21 వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యిందని మంత్రి అంటున్నారురైతు బంధు ఇవ్వడం వల్లే సాగు విస్తీర్ణం పెరిగిందినాలుగున్నర లక్షల మంది గిరిజన రైతులకు పొడు భూములకు ROFR కింద పట్టాలు ఇచ్చాంపోడు భూముల్లో రెండో పంటకు రైతు బంధు ఇవ్వరా ?కంది, పత్తి పంటలు 8 నెలల పంట.. రెండో పంట పండించలేరు. వాటికి రెండో పంట రైతు బంధు ఇస్తారా ? ఇవ్వరా ?తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర మంత్రి గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు వివరాలను మాత్రమే ఇచ్చాంరైతు బంధు పై అభిప్రాయాలు తెలుసుకుంటున్నాంరెండో పంట పండించకపోతే రైతు కు రైతు బంధు ఇవ్వాలో ? వద్దో? మీరే చెప్పండిరైతు భరోసా పై మేం ఇంకా ఏమి చెప్పలేదుమాజీ మంత్రి కేటీఆర్ రైతు బంధు రెండో పంట పండించకపోతే ఇస్తారో.. ఇవ్వరో చెప్పకపోతే ఈచర్చ ఎందుకు ?మూడో పంట కూడా వేయడానికి రైతులు సిద్దంగా ఉన్నారువికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మూడో పంట కూరగాయలు వేస్తారుమూడో పంటకు రైతు భరోసా ఇస్తారా ?రైతు ఆత్మహత్యలు సాధ్యమైనంత వరకు తగ్గించాంఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్రైతు భరోసా పై సూచనలు, సలహాలు ఇవ్వండికావాలని రైతులకు లేనిపోని అనుమానాలు కల్పిస్తున్నారుతెలంగాణ రాకముందు అంశాలు ఇప్పుడు ఎందుకు ?తెలంగాణకు అన్యాయం జరిగినందుకే రాష్ట్రం తెచ్చుకున్నాంరైతుబంధుపై సమగ్రంగా చర్చ జరగాలి : కేటీఆర్మంత్రి తుమ్మల మాకు ఆత్మీయ మిత్రుడురైతుబంధులోనే సాగు విస్తీర్ణం పెరిగిందిరైతుబంధుపై తుమ్మల సావధాన సమాధానం చెప్పాలిరైతుబంధుపై సమగ్రంగా చర్చ జరగాలి ఉన్నది ఉన్నట్లు ఇస్తామంటే.. రైతుభరోసాపై చర్చ ఎందుకు సాగు చేస్తేనే రైతుభరోసా ఇస్తామంటే.. రైతులు అని పంటలు వేస్తామంటారురైతుబంధు ఇవ్వడం వల్లే 2కోట్ల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది11.5శాతం ఉన్న రైతుల ఆత్మహత్యలను 1.5 శాతానికి తగ్గించాం రైతుభరోసాపై ఏ నిర్ణయం తీసుకోలేదు : మంత్రి తుమ్మలఏ పంటకు ఎలా ఇవ్వాలో.. బీఆర్ఎస్ సూచనలు ఇస్తే తీసుకొని.. అమలు చేస్తాం రైతుభరోసాపై ప్రభుత్వం ఏ నిర్ణయం ప్రకటించలేదుబీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టిందిగత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టిందిసీఎం రేవంత్‌రెడ్డి అంటే రైతులకు నమ్మకంరైతులను కన్ఫ్యూజ్ చేసి.. ఇబ్బంది పెట్టారుకేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ కలసి రైతులను తీవ్రంగా ఇబ్బందికి గురి చేశాయి.. అసెంబ్లీలో కాంగ్రెస్ మంత్రి తుమ్మలధరణి పోర్టల్ ఆధారంగా గతంలో రైతుబంధు ఇచ్చారురైతు బంధులో 21 వేల కోట్ల రూపాయల దుర్వినియోగంహరీష్ రావును ఉద్దేశించి స్పీకర్ సభ ఎప్పుడు పెద్దగా లేట్ కాలే ! ఈరోజు జీరో వరకు తీసుకోవాలనే అంశం మీద చర్చ జరిగింది అందుకే కొద్దిగా ఆలస్యమైంది హరీష్ రావుఅసెంబ్లీ పది నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం కావడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన బీఆర్ఎస్ సభ సమయపాలన పాటించాలి ప్రతిరోజు ఆలస్యంగా ప్రారంభమవుతుంది అందరికి ఆదర్శంగా మనం ఉండాలి సభ ఇలా ఆలస్యంగా జరుగుతే ఎలాతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభంనేడు సభ ఆఖరి రోజుహైదరాబాద్లో మౌలిక వసతుల కల్పన .. అభివృద్ధిలో ప్రభుత్వ వైఫల్యంపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం మహిళలకు రూ.2500 ఆర్దిక సహాయం, కాలేజీ విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, కళ్యాణ లక్ష్మీ కింద తులం బంగారం ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తుందని దీనిపై శాసనసభలో చర్చకు బీజేపీ వాయిదా తీర్మానం కాంటాక్ట్ ,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏజెన్సీల ద్వారా కాకుండా కార్పోరేషన్ ద్వారా జీతాలు ఇవ్వాలని సీపీఐ వాయిదా తీర్మానం వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిన్నటితో ముగియాల్సి ఉండగా.. ఈ సమావేశాలను ఒకరోజు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్న భూ భారతి, రైతు భరోసా వంటి అంశాలపై స్వల్ప కాలిక చర్చ జరగాల్సి ఉంది. అయితే సభ్యుల ఆందోళన ఫలితంగా నిన్న భూభారతి చర్చ వరకే పరిమితమయింది. -
రాహుల్‌పై కేసు క్రైమ్ బ్రాంచ్‌కు...
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం జరిగిన తోపులాటకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై నమోదైన కేసును ఢిల్లీ పోలీసులు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. బీజేపీ ఫిర్యాదు మేరకు రాహుల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇకపై ఈ కేసును క్రైమ్‌బ్రాంచ్ దర్యాప్తు చేస్తుందని అధికారులు శుక్రవారం వెల్లడించారు. భారత న్యాయ సంహితలోని సెక్షన్ 117, 125, 131, 351, 3(5) కింద రాహుల్‌పై పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్లో కేసు నమోదయ్యింది. తోపులాటలో గాయపడిన ఇద్దరు బీజేపీ ఎంపీల స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. అలాగే రాహుల్ గాం«దీని పిలిపించి ప్రశ్నించనున్నట్లు తెలిపారు. పార్లమెంట్లో గురువారం జరిగిన తోపులాటకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ కోసం పార్లమెంట్ సెక్రటేరియట్‌కు లేఖ రాస్తామని వెల్లడించారు. తోపులాటలో బీజేపీ ఎంపీలు ప్రతాప్‌చంద్ర సారంగి(69), ముకేశ్ రాజ్‌పుత్(56) గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని, కోలుకుంటున్నారని డాక్టర్లు శుక్రవారం తెలియజేశారు. -
వాళ్లు గొప్ప నటులు!
న్యూఢిల్లీ: పార్లమెంటు ఘర్షణలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ ఎంపీలది నటనేనని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ ఆరోపించారు. వారి నటనా పటిమకు అన్ని అవార్డులూ ఇవ్వొచ్చంటూ ఎద్దేవా చేశారు. రాహుల్‌గాం«దీ, ఇతర కాంగ్రెస్, విపక్షాల ఎంపీల తోపులాటలో గాయపడ్డట్టు బీజేపీ సభ్యులు ప్రతాప్‌చంద్ర సారంగీ, ముకేశ్ రాజ్‌పుత్ చెప్పడం తెలిసిందే. రాహుల్ తనతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆ పార్టీకి చెందిన మహిళా ఎంపీ ఫాంగ్నాన్ కొన్యాక్ ఆరోపించారు.శుక్రవారం విపక్షాల ఆందోళన సందర్భంగా జయ మీడియాతో మాట్లాడుతూ వారి తీరును తీవ్రంగా ఆక్షేపించారు. వాళ్లకంటే మెరుగైన నటులను తన కెరీర్లోనే చూడలేదంటూ వ్యంగ్యా్రస్తాలు విసిరారు. ‘‘రాజ్‌పుత్‌కు తొలుత చిన్న బ్యాండేజీ వేశారు. తర్వాత దాని సైజు పెరిగింది. చివరికి చూస్తే ఐసీయూలో తేలారు. ఎంత అద్భుతమైన నటనో!’’ అంటూ దుయ్యబట్టారు. జయ విమర్శలపై బీజేపీ మండిపడింది. ‘‘బాధితులను వదిలి నిందితుని పక్షం వహించడమా? సమాజ్‌వాదీ పార్టీ సంస్కృతికి, విపక్ష ఇండియా కూటమి సంస్కృతికి ఇది మరో నిదర్శనం’’ అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా విమర్శించారు. -
ఇదేనా అంబేడ్కర్ వారసత్వం!
అనుకున్నట్టే పార్లమెంటు శీతాకాల సమావేశాలు పరస్పర వాగ్యుద్ధాలతో మొదలై ఘర్షణలతో ముగిశాయి. పార్లమెంటు ముఖద్వారం వద్ద అధికార, విపక్ష సభ్యులు ఒకరినొకరు తోసుకోవటం, ఒకరిద్దరు గాయడటం, పోలీసు కేసుల వరకూ పోవటం వంటి పరిణామాలు అందరికీ దిగ్భ్రాంతి కలిగించాయి. తమ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముకేశ్ రాజ్‌పుత్‌లు గాయపడ్డారని బీజేపీ అంటున్నది. కాదు... వారే తమను పార్లమెంటులోకి వెళ్లకుండా అడ్డగించారని, ఆ తోపులాటలో కిందపడ్డారని కాంగ్రెస్ చెబుతున్నది. వారు అడ్డగించటం వల్ల తమ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే కూడా గాయపడ్డారని, ముగ్గురు బీజేపీ ఎంపీలు రాహుల్ గాంధీపై భౌతికదాడికి పాల్పడ్డారని వివరి స్తున్నది. రెండు వర్గాలూ అటు స్పీకర్‌కూ, ఇటు పోలీసులకూ ఫిర్యాదులు చేసుకున్నాయి. నాగా లాండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ సభ్యురాలు కోన్యాక్ తనతో రాహుల్ గాంధీ అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ విషయంలో రాహుల్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదయ్యే అవకాశం ఉన్నదంటున్నారు. అసెంబ్లీ సమావేశాలప్పుడు ఏదో వివాదం రేకెత్తి ఒకరిపైకొకరు లంఘించటం, ఘర్షణపడటం, కుర్చీలు విసురుకోవటం, దుర్భాషలాడుకోవటం రాష్ట్రాల్లో సర్వసాధారణమైంది. కానీ ఇదేమిటి... దేశమంతటికీ ప్రాతినిధ్యం వహించే అత్యున్నత చట్టసభ ఇంత చట్టుబండలు కావటం ముందూ మునుపూ విన్నామా? సమావేశాల ప్రారంభంలోనే అదానీ వ్యవహారంపై విపక్షాలు పెద్ద రగడ సృష్టించాయి. ఆయనపై అమెరికాలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, అరెస్టు చేస్తారని వచ్చిన వార్తలు నిజం కావని ప్రముఖ న్యాయవాదులు చెప్పాక అది సద్దుమణిగింది. వివాదాలు ఉండొచ్చు... విధానాల విషయంలో విభేదాలుండొచ్చు. కానీ చట్టసభ అనేది అధి కార, విపక్షాలు ప్రజలకు గరిష్టంగా మేలు చేయటానికి గల అవకాశాలను అన్వేషించే వేదిక. తమ నిర్ణయాల పర్యవసానం గుర్తెరగకుండా పాలకపక్షం ప్రవర్తిస్తున్నప్పుడు విపక్షాలు నిరసన గళం వినిపిస్తాయి. అందువల్ల పాలకపక్షం తనను తాను సరిదిద్దుకునే ఆస్కారం కూడా ఉంటుంది. అది లేనప్పుడు కాస్త ఆలస్యం కావొచ్చుగానీ... అధికార పక్షానికి ప్రజలే కళ్లు తెరిపిస్తారు. ఇందిరాగాంధీ ఏలుబడిలో ఎమర్జెన్సీ విధించినప్పుడేమైంది? ఆ తర్వాత వచ్చిన జనతాపార్టీ ప్రభుత్వం ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ఇష్టారాజ్యంగా రద్దుచేసినప్పుడు భంగపాటు తప్పలేదు. ఏకంగా 400 మంది సభ్యుల బలం ఉన్న రాజీవ్‌గాంధీ ఏకపక్షంగా వ్యవహరించినప్పుడు కూడా ఆయనకు చేదు అను భవాలే ఎదురయ్యాయి. 2020లో వచ్చిన సాగుచట్టాలు కూడా ఎన్డీయే సర్కారు ఉపసంహరించు కోక తప్పలేదు. ఏ విషయంలోనైనా తక్షణమే అమీతుమీ తేల్చుకోవాలనుకునే మనస్తత్వం వల్ల ఉన్న సమస్య కాస్తా మరింత జటిలమవుతున్నది. ఇటీవలి కాలంలో చట్టసభలు బలప్రదర్శన వేదికలవు తున్నాయి. సమస్య ఎదురైనప్పుడు దాని ఆధారంగా అవతలి పక్షం అంతరంగాన్ని బయటపెట్టి ప్రజలు గ్రహించేలా చేయటం అనే మార్గాన్ని వదిలి బాహాబాహీ తలపడటం అనేది దుష్ట సంప్రదాయం. అందువల్ల చట్టసభ అంటే సాధారణ పౌరుల్లో చులకన భావం ఏర్పడటం తప్ప సాధించే దేమీ ఉండదు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను ఎవరు అవమానించారు... ఎవరు నెత్తిన పెట్టుకున్నారన్న విషయమై ఏర్పడిన వివాదం కాస్తా ముదిరి పరస్పరం క్రిమినల్ కేసులు పెట్టుకోవటం వరకూ పోవటం విచారకరం. బీజేపీ ఎంపీలు అప్పటికే బైఠాయించిన ప్రధాన ద్వారంవైపునుంచే పార్లమెంటులోకి ప్రవేశించాలని కాంగ్రెస్ అనుకోవటం వల్ల బాహాబాహీకి దిగే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి వేరే ద్వారంనుంచి వెళ్లమని భద్రతా సిబ్బంది చేసిన సూచనను రాహుల్ గాంధీ బేఖాతరు చేశారని, పైగా ఇతర సభ్యులను రెచ్చగొట్టారని బీజేపీ ఫిర్యాదు సారాంశం. దేశంలో ఏదో ఒకమూల నిత్యమూ సాగిపోతున్న విషాద ఉదంతాలు గమనిస్తే డాక్టర్ అంబే డ్కర్ నిజమైన వారసులెవరన్న అంశంలో భౌతికంగా తలపడిన రెండు పక్షాలూ సిగ్గుపడాల్సి వస్తుంది. ఒకపక్క పార్లమెంటులో ఈ తమాషా నడుస్తుండగానే తన పెళ్లికి ముచ్చటపడి గుర్రంపై ఊరేగుతున్న ఒక దళిత యువకుడిపై ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఆధిపత్య కులాలవారు దాడిచేసి కొట్టారన్న వార్త వెలువడింది. ఇది ఏదో యాదృచ్ఛికంగా కులోన్మాదులు చేసిన చర్య కాదు. దశాబ్దాలుగా ఇలాంటి ఘోరాలు సాగుతూనే ఉన్నాయి. తాము ఉపయోగించే బావిలో లేదా చెరువులో దప్పిక తీర్చుకున్నారన్న ఆగ్రహంతో దళితులపై దాడులు చేసే సంస్కృతి ఇంకా పోలేదు. చాలాచోట్ల రెండు గ్లాసుల విధానం ఇంకా సజీవంగా ఉంది. మన రాజ్యాంగం అమల్లోకొచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా చర్చిస్తుండగానే... డాక్టర్ అంబేడ్కర్ వారసత్వం గురించి పార్టీలు పోటీపడుతుండగానే వాస్తవ స్థితిగతులు ఇలా ఉన్నాయి.సైద్ధాంతిక విభేదాలను ఆ స్థాయిలో మాట్లాడుకుంటే, ఆరోగ్యకరమైన చర్చల ద్వారా అన్ని విషయాలనూ ప్రజలకు తేటతెల్లం చేస్తే మెరుగైన ఫలితం వస్తుంది. నిజానిజాలేమిటో అందరూ గ్రహిస్తారు. డాక్టర్ అంబేడ్కర్ తన జీవితకాలమంతా రాజీలేని పోరాటం చేశారు. మెజారిటీ ప్రజానీకం ప్రయోజనాలను దెబ్బతీసే భావాలనూ, చర్యలనూ అడుగడుగునా తీవ్రంగా వ్యతిరేకించారు. ఉద్యమాలు నిర్వహించారు. అంతేతప్ప అవతలిపక్షంపై హింసకు దిగలేదు. ఆయన వారసత్వం తమదేనంటున్నవారు వాస్తవానికి తమ చర్యల ద్వారా ఆ మహనీయుడి స్మృతికీ, ముఖ్యంగా ఆయన నాయకత్వంలో రూపొందిన రాజ్యాంగానికీ అపచారం చేస్తున్నామని గుర్తిస్తే మంచిది. -
లోక్‌సభ నిరవధిక వాయిదా
ఢిల్లీ : లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అవమాన పరిచారంటూ ఇండియా కూటమి నేతలు పార్లమెంట్ శీతాకాల సమావేశాల చివరి రోజైన శుక్రవారం పార్లమెంట్ వద్ద నిరసన చేపట్టారు. విపక్ష నేతల నిరసనకు పోటా పోటీగా ఎన్డీయే కూటమి నేతలు సైతం ప్లకార్డ్‌లతో ఆందోళనకు దిగారు. దీంతో సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. Lok Sabha adjourned sine die pic.twitter.com/5jgpBbnNjn— ANI (@ANI) December 20, 2024నవంబర్ 25న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశం మొదటి వారంలో పలు మార్లు వాయిదా పడింది. రాజ్యాంగం, ఫెడరలిజం, ప్రజాస్వామ్యంపై డిబేట్,బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై విపక్షాల అవిశ్వాస తీర్మానం, ప్రియాంక గాంధీ లోక్‌సభ అరంగేట్రం వంటి అనేక అంశాలు పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రధాన చర్చకు దారి తీశాయి. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం తొలి వారంలో గౌతమ్ అదానీపై అమెరికా వేసిన అభియోగంపై చర్చ జరగాలని డిమాండ్ చేయడంతో పాటు పలు అంశాలపై ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి. చర్చకు అధికార పక్షం అంగీకరించకపోవడంతో నిరసనలకు దారి తీసింది. ఈ సెషన్లోనే 'ఒక దేశం, ఒకే ఎన్నికల' బిల్లుపై చర్చ జరిగింది. జమిలి ఎన్నికలపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో జమిలి ఎన్నికల కోసం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం 31 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటుచేసింది. ఈ మేరకు తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ సమావేశాల చివరి రోజు ఇవాళ జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి లోక్ సభ పంపంది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై విపక్షాల అవిశ్వాస తీర్మానం వీగింది. ధన్‌ఖడ్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. అయితే, 14 రోజుల నోటీసు లేకపోవడం,డ్రాఫ్టింగ్‌లో లోపాలతో సహా విధానపరమైన కారణాలతో అవిశ్వాస తీర్మానాన్ని పక్కన పెట్టారు. -
KSR Live Show: రాహుల్ గాంధీపై కేసు తప్పదా?.. బీజేపీ నేత కిశోర్ కామెంట్స్
-
అంబేడ్కర్ పేరు ఒక భరోసా!
అంబేడ్కర్ గురించి మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయిందని పార్లమెంట్లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పటివరకూ కప్పి ఉంచిన కొన్ని వాస్తవాలను వెలికి తీశాయి. ‘తాము మాట్లాడితే ప్రేమ, ఎదుటివారు మాట్లాడితే ఫ్యాషన్’ అన్నంతగా బీజేపీ ప్రభుత్వానికి అంబేడ్కర్ పట్ల స్వాధీనత ఉందని మాట వరసకి అనుకుందాం. కానీ తర్వాతి వాక్యాలని గుడ్డిగా సమర్థించుకోవడం ఆశ్చర్యమే. కాంగ్రెస్ సభ్యులు అంబేడ్కర్‌ని ప్రస్తావించడం మీద అమిత్ షా వ్యాఖ్యానిస్తూ ‘అంబేడ్కర్ అంబేడ్కర్ అంబేడ్కర్... వారు ఇన్ని సార్లు దేవుడి నామం స్మరిస్తే ఏడేడు జన్మల స్వర్గలోక ప్రాప్తి వచ్చే’దని అనడం అంబేడ్కర్ పట్ల గౌరవాన్ని వ్యక్త పరిచినట్లు కాదు; అలాగని ఆ కామెంట్స్ కేవలం కాంగ్రెస్ మీద చేసిన విమర్శగా కూడా చూడలేము. కాంగ్రెస్ మీది కోపాన్ని అంబేడ్కర్ మీద చూపినట్లుగా మాత్రమే కాక, లోపల జీర్ణించుకున్న చులకనభావం బైట పడి నట్లుగా కూడా ఆ మాటలు ఉన్నాయి. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో జాతి నిర్మాణం కోసం పాటుపడిన అంబేడ్కర్‌ని – విశ్వాసాల మీద ఆధారపడిన దైవభావనతో పోల్చి తక్కువ చేయడం వ్యతిరేకించాల్సిన విషయం. కడుపు నిండిన వారికి స్వర్గలోక ద్వారాల వైపు చూపు ఉండొచ్చు. కానీ కులం, మతం, జెండర్ వంటి అనేక వివక్షలకి లోనయ్యే పీడితులు, పేదలు అంబేడ్కర్‌ని తమ ‘అన్నం గిన్నె’గా అభివర్ణించుకుంటారు. అంబేడ్కర్ పేరు పదేపదే స్మరించడం వారి జీవితాలకి భరోసా. ప్రధాని ‘ఎక్స్’ వేదికగా అమిత్ షా వ్యాఖ్యలను సమర్థించడం మరొక విచిత్రం. అసలు వ్యాఖ్యల సంగతి వదిలేసి చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్‌కి చేసిన అన్యాయాలను తవ్వితీయడం గొప్ప చతురత. కాంగ్రెస్ చేసిన అన్యాయాలను అంబేడ్కర్‌వాదులు తప్పక ప్రశ్ని స్తారు కానీ ఇప్పటి అమిత్ షా వ్యాఖ్యల సంగతేమిటి? ప్రజలకి నిజం తెలుసుననీ, అది కాంగ్రెస్ వారి దురదృష్టమనీ అన్నారు. అవును, ప్రధానమంత్రి గారూ, ప్రజ లకి నిజం తెలుసు. అయితే అది మీరు నిర్మించే నిజం కాదు. అంబేడ్కర్ చరిత్రను తుడిపివేసేందుకు కాంగ్రెస్ చేసిన పన్నాగాలను బట్టబయలు చేశామన్న ప్రధానమంత్రి, అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం తీసుకున్న కార్యాచరణ వివరించారు. పంచ తీర్థ, చైత్యభూమి సమస్య, అంబేడ్కర్ చివరి దశలో గడిపిన ఇల్లు, లండన్‌లో అంబేడ్కర్ నివసించిన ఇల్లు కొనుగోలు చేయడం ద్వారా ఆయన ఆశ యాలు నెరవేర్చే పనులు చేశామని అన్నారు. ఇవన్నీ అంబేడ్కర్ పట్ల కృతజ్ఞతతో ప్రజలూ ప్రభుత్వాలూ తమ కోసం తాము ప్రతీకగా చేసే పనులు. నాయకారాధన పట్ల స్పష్టమైన అవగాహనతో మాట్లాడిన అంబేడ్కర్ ఎపుడూ తన చిహ్నాల ఉద్ధరణ తన ఆశయ మని చెప్పలేదు. ఆయన రచనలు, ప్రసంగాలు, ఆచరణ గురించి తెలుసుకుంటే ఆశయాలు ఏమిటో తెలుస్తాయి. అవి మతతత్వ, కులవాద, పితృస్వామిక రాజకీయ పార్టీలను, వ్యవస్థలను నిరంతరం నిలదీస్తాయి. వాటి పీడనకి, వివక్షకి గురయ్యేవారిని అక్కున చేర్చుకుని ‘సమీకరించు, బోధించు, పోరాడు’ అని వెన్ను తడతాయి. కానీ పీడక పార్టీలు, వ్యవస్థలు ఈరోజు అంబేడ్కర్ ప్రభావాన్ని విగ్రహాలకి, నివసించిన స్థలాలకి కుదించి అవే ఆయన ఆశయాలని ప్రచారం చేస్తున్నాయి.బీజేపీ ప్రభుత్వానికి అంబేడ్కర్ ఆశయాలను నెర వేర్చాలన్న ఆకాంక్ష బలంగా ఉంటే రాజకీయాల్లో మెజారిటీ మత చొరబాట్లను నిరోధించి లౌకిక విలువలను స్వయంగా ప్రచారం చేయాలి. కుల నిర్మూలనకి అంబే డ్కర్ ఇచ్చిన సూచనలు అమలు చేయాలి. కులాంతర, మతాంతర పెళ్లిళ్లను ప్రోత్సహించాలి. వేదాలు, పురా ణాలు స్త్రీలను, దళితులను ఎంత అమానవీయంగా చూశాయో గుర్తించి వాటిని కల్పనా సాహిత్యంగా మాత్రమే పరిగణించాలి.దళితుల విద్యా ఉద్యోగ రాజ్యాధికారాలకి ప్రణాళికలు వేయాలి. పౌరులకు ఉన్న రాజ్యాంగబద్ధ హక్కులను గౌరవించాలి. మరీ ముఖ్యంగా మాట్లాడితేనో, నచ్చిన ఆహారం తింటేనో తీసుకెళ్ళి జైళ్ళలో పడేయకూడదు. ప్రజాస్వామ్య భావనని దాని నిజార్థంలో ఆచరించాలి. ఏకత – ఐక్యతలు ఒకటి కావని గుర్తించాలి. ఇలా మన ప్రభుత్వ వ్యవస్థల నియంతృత్వాన్ని సమూలంగా మార్చేయగల అనేక మార్పులను చేయడమే ఆయన ఆశయాలను నెరవేర్చడం. అందుకే కేవలం ఎక్కడో నాలుగు విగ్రహాలు పెట్టి గొప్ప ఆచరణగా ప్రకటించడం కన్నా, అసంఖ్యాకంగా ఉన్న అంబేద్కర్ రచనలను, ప్రసంగా లను, వివిధ ఘట్టాల్లో ఆయన పని తీరును అధ్యయనం చేయడం ద్వారా ప్రజలకు మేలు చేసే నిజమైన కార్యాచరణ రూపొందించుకోవచ్చు. ‘అంబేడ్కర్ ఆలోచనల తాత్వికత’ పేరిట ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక అంతర్జాల మాధ్యమంలో 21 వారాల పాటు 48 ప్రసంగాల సిరీస్ నిర్వహిస్తున్నది. 2024 డిసెంబర్ 22 నుంచి 2025 మే 18 వరకూ నడిచే ఈ సిరీస్‌లో తెలుగు సమాజంలోని మేధావులు అంబేడ్కర్ ఆలోచనల తాత్వికతను ఆయన రచనలు, ప్రసంగాల ఆధారంగా పరిచయం చేస్తారు. ఆసక్తి ఉన్నవారు (zoom ID: 8254545523 Password PRARAVERK) ద్వారా పాల్గొనవచ్చు. కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త ప్రరవే ఏపీ కార్యదర్శి ‘ 88850 16788