Nikhil Gowda
-
కరోనా ఎఫెక్ట్: నిఖిల్ వివాహం రద్దయ్యే ఛాన్స్
సాక్షి, దొడ్డబళ్లాపురం: కరోనా ఎఫెక్ట్ చివరకు మాజీ ముఖ్యమంత్రి కుమారుడి వివాహానికి కూడా తగిలింది. రామనగర జానదలోక వద్ద భారీ ఏర్పాట్లతో జరగాల్సిన నిఖిల్, రేవతిల వివాహం రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి దంపతులు రామనగరలో కుమారుడి వివాహం చేయాలని కలలుగన్నామని చెబుతూ వస్తున్నారు. అందుకు ఎక్కువ ఖర్చుతో భారీ ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. ఇంతలో రాష్ట్రాన్ని కరోనా కుదిపేస్తున్న నేథ్యంలో వివాహం చేయాలా, వద్దా అనే ఆలోచనలో కుమారస్వామి ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతానికి జానపద లోక వద్ద వివాహ ఏర్పాట్లను నిలిపివేయడంతో అనుమానాలు బలపడుతున్నాయి. లక్షల మంది జనం మధ్య కుమారుడి వివాహం చేయాలని కుమారస్వామి భావించారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది అసాధ్యం. బెంగళూరులో కొద్దిమంది వీఐపీలు, బంధువుల మధ్య వివాహం చేయాలనే ఆలోచనలో కుమారస్వామి కుటుంబం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కుమారస్వామి రెండుమూడు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: ప్రేమ జంట తలుపు తట్టి.. ప్రియుని కళ్లెదుటే నిలిచిపోయిన పనులు -
బెంగళూరు: వైభవంగా నిఖిల్‌గౌడ నిశ్చితార్థం
-
అంగరంగ వైభవంగా నిఖిల్‌గౌడ నిశ్చితార్థం
బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ నిశ్చితార్థం బెంగళూరులో ఘనంగా జరిగింది. దీనికి పార్టీ నేతలతో పాటు నిఖిల్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్లో నిఖిల్, రేవతిల నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు అన్ని పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు హాజరయ్యారు. దాదాపు 4 నుంచి 5 వేల మంది ఈ వేడుకలో పాల్గొన్నారు. వేలాదిమంది అతిథులు, బంధువులు మధ్య నిఖిల్, రేవతిల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. పెళ్లికి కూడా కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. నిఖిల్ తెలుగుచిత్ర సీమకు కూడా సుపరిచితుడే. నాలుగేళ్ల క్రితం జాగ్వార్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమయ్యాడు. తదనంతర కాలంలో కర్ణాటక ఎన్నికలలో మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీచేసి స్వతంత్ర అభ్యర్థి అయిన సుమలతా అంబరీష్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల అనంతరం సినిమాలపైన దృష్టిపెట్టిన నిఖిల్ ఇప్పుడు పెళ్లితో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. -
నేడు నిఖిల్ నిశ్చితార్థం
సాక్షి, బెంగళూరు: నేడు (సోమవారం) నగరంలోని తాజ్ వెస్టెండ్ హోటల్లో జేడీఎస్ మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్, రేవతి నిశ్చితార్థం జరగనుంది. ఆదివారం కుమారస్వామి బెంగళూరులో తన నివాసంలో నిఖిల్ నిశ్చితార్థం గురించి మీడియాతో మాట్లాడారు. వేడుకకు అన్ని ఏర్పాట్లు చేశాం. అన్ని పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు ఇలా సుమారు నాలుగైదు వేల మంది పాల్గొనబోతున్నారు. నిఖిల్ పెళ్ళిని చాలా ఘనంగా నిర్వహించాలని అనుకున్నా. ‘ఈ పెళ్లి పైన నేను అనేక ఆశలు పెట్టుకున్నా. నటునిగా, రాజకీయ నేతగా నా కుమారుడిని ఆశీర్వదించిన వారినందరినీ ఈ పెళ్ళికి ఆహ్వానిస్తా. రామనగర–చెన్నపట్టణ మధ్యలో వివాహం నిర్వహిస్తాం. ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయ’ని తెలిపారు. జాగ్వార్ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన నిఖిల్ గత లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి సుమలత అంబరీష్ చేతితో పరాజయం పాలయ్యారు. -
బోయపాటికి హీరో దొరికాడా?
మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను, వినయ విధేయ రామ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ రావటంతో ఈ యాక్షన్ దర్శకుడు ఆలోచనలో పడ్డాడు. చాలా కాలంగా బోయపాటి నెక్ట్స్ సినిమాకు సంబంధించిన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. బోయపాటి తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఓ కన్నడ యంగ్ హీరోతో ప్లాన్ చేస్తున్నారట. జాగ్వర్ సినిమాతో టాలీవుడ్, సాండల్వుడ్లకు ఓకేసారి పరిచయం అయిన నిఖిల్ గౌడ హీరోగా బోయపాటి తదుపరి చిత్రాన్న ప్లాన్ చేస్తున్నారట. కన్నడ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్, బోయపాటి సినిమాతో మరోసారి టాలీవుడ్ మీద దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
సీఎం జగన్‌ను కలిసిన ముఖ్యమంత్రి తనయుడు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ మర్యాదపూపూర్వకంగా కలిశారు. మంగళవారం ఆయన ముఖ్యమంత్రి నివాసానికి రాగా.. సీఎం జగన్ నిఖిల్‌ను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఇద్దరు కాసేపు ముచ్చటించారు. కాగా సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగానే కలిశానని నిఖిల్ పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కర్ణాకటలోని మండ్య లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన నిఖిల్ ఘోరంగా ఓటమి పాలయ్యారు. మండ్యలో బీజేపీ మద్దతుతో పోటీ చేసిన సుమలత అంబరీష్ నిఖిల్‌పై గెలుపొందారు. నిఖిల్ గౌడతో సమావేశ అనంతరం సీఎం జగన్ తెలుగు కవి, సాహితీవేత్త సినారె (సింగిరెడ్డి నారాయణరెడ్డి) పార్లమెంట్ ప్రసంగాలపై రూపొందించిన పుస్తకాన్నిఆవిష్కరించారు. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్‌లో జరిగిని ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, నేషనల్ జ్యూడిషియల్ అకాడమీ డైరెక్టర్ జస్టిస్ గోడ రఘురామ్, తదితరులు పాల్గొన్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన ‘పెద్దల సభలో తెలుగు పెద్ద’ పుస్తకాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. -
ఓటమిపై బాధ్యత నాదే : ముఖ్యమంత్రి కుమారుడు
మండ్య : రాష్ట్రంలోనే అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మండ్య లోక్‌సభ ఎన్నికల్లో తొలి ఎన్నికలోనే ఓటమిని చవి చూసిన ముఖ్యమంత్రి కుమారుడు నిఖిల్ తొలిసారిగా తన ఓటమిపై స్పందించారు. తన ఓటమికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జేడీఎస్ నాయకులు, కార్యకర్తలు కారణం కాదని, తన ఓటమికి తానే బాధ్యత తీసుకుంటున్నాని తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. మండ్యలో తన ఓటమికి తానే కారణమని ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు చేశారు. భవిష్యత్‌లో మండ్య జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ విషయంపై త్వరలో మీడియా సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. అభినందనలు : మండ్య పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థి సుమలతకు ఆయన అభినందనలు తెలిపారు. అదే విధంగా అభిషేక్ గౌడ నటించిన అమర్ సినిమా విజయవంతం కావాలని తన ట్విటర్లో ఆకాంక్షించారు. దీంతో నిఖిల్ కుమార స్వామి చేసిన పోస్ట్ చూసిన వేలాది మంది అభిమానులు, ప్రజలు లైక్స్ కొడుతూ తమ స్పందనలను సైతం తెలిపారు. -
‘దేవెగౌడ, నిఖిల్ మధ్య వాగ్వాదం..’ దుమారం
బెంగళూరు : ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడపై కథనాన్ని రాసినందుకు కర్ణాటక సీనియర్ జర్నలిస్ట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పరాభవంతో సంకీర్ణ ప్రభుత్వం చిక్కుల్లో పడిన నేపథ్యంలో ఈ తాజా వివాదం మరింత దుమారం రేపుతోంది. జేడీఎస్ ఫిర్యాదు మేరకు కన్నడ దినపత్రిక అయిన విశ్వవాణి ప్రధాన సంపాదకుడు విశ్వేశ్వర్ భట్‌పై ఆదివారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయనపై పరువునష్టం, ఫోర్జరీ, చీటింగ్ అభియోగాలు మోపారు. మండ్యాలో ఓటమి నేపథ్యంలో దేవెగౌడ, నిఖిల్ కుమారస్వామి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందంటూ విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ భట్ ఆదివారం ఓ కథనాన్ని ప్రచురించారు. గత శుక్రవారం మైసూరులోని ఓ హోటల్లో ఉన్న సమయంలో ఈ వాగ్వాదం జరిగిందని ఆ కథనం పేర్కొంది. మాండ్యాలో బీజేపీ మద్దతుతో పోటీ చేసిన సుమలత అంబరీష్ చేతిలో నిఖిల్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. మాండ్యా జేడీఎస్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన సీటు. ఈ ఓటమితో నిఖిల్ కుంగిపోయారని, తన పెద్దనాన్న కొడుకు ప్రజ్వల్ రేవణ్ణ గెలుపొందడం.. తాను ఓడిపోవడం నిఖిల్‌ను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని, అంతేకాకుండా మాండ్యాలో తనకు కుటుంబం అంతగా సహకరించలేదని, దీంతో రాజకీయ కెరీర్ ఆరంభంలోనే ఓటమిపాలయ్యానని ఆయన తీవ్ర ఆవేదన చెందారని, ఒక మహిళ చేతిలో ఓడిపోవడం కూడా నిఖిల్‌ను మరింత అసహనానికి గురిచేసిందని ఆ కథనంలో భట్ పేర్కొన్నారు. అయితే, తన కొడుకు ప్రతిష్టను దెబ్బతీసి.. డబ్బు వసూలు చేసేందుకే ఈ కథనాన్ని భట్ రాశారని జేడీఎస్ ఆరోపిస్తోంది. ఈ కథనాన్ని ట్వీట్ చేసిన కుమారస్వామి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కుమారస్వామి తనకు ఫోన్‌చేశారని, నిఖిల్ కూడా రెండుసార్లు ఫోన్ చేసి బెదిరింపు ధోరణిలో మాట్లాడారని భట్ సోమవారం విలేకరులకు తెలిపారు. విశ్వవాణి పత్రిక సోమవారం నిఖిల్ వెర్షన్లో ఈ వ్యవహారంపై ఓ కథనాన్ని ప్రచురించింది. మరోవైపు కుమారస్వామి ప్రభుత్వం పత్రికాస్వేచ్ఛను హరిస్తోందని, అందుకు భట్‌పై కేసు నిదర్శనమని బీజేపీ మండిపడుతోంది. -
ముఖ్యమంత్రి తనయుడి ఓటమి
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సుమలత ఈ ఎలక్షన్లలో తొలిసారిగా రాజకీయ అరంగేట్రం చేసి ఘన విజయం సాధించారు. అంబరీష్ మరణంతో రాజకీయ తెర మీదకు వచ్చిన సుమలత, తన భర్త పోటి చేసిన మాండ్య నియోజిక వర్గం నుంచే బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. అయితే కాంగ్రెస్, జేడీఎస్‌ల పోత్తు కారణంగా మాండ్య సీటును కాంగ్రెస్ పార్టీ జేడీఎస్‌కు వదిలేసింది. అక్కడి నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి తనయుడు, యువ హీరో నిఖిల్ గౌడ జేడీఎస్ తరపున బరిలో నిలిచాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుమలత ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు. కన్నడ చిత్రసీమలోని స్టార్ హీరోలంతా సుమలతకు మద్ధతుగా నిలిచి ప్రచారంలో పాల్గొన్నారు. అంబరీష్ పై ఉన్న అభిమానంతో పాటు సింపతీ కూడా కలిసి రావటంతో సుమలత ఘన విజయం సాధించారు. అధికార పార్టీ నిఖిల్ ను గెలిపించేందుకు చేసిన ప్రయత్నాలన్నింటిని తిప్పి కొట్టి సుమలత విజయం సాధించారు. -
నిఖిల్‌పై తీవ్రంగా పోరాడుతున్న సుమలత!
బెంగళూరు: కర్ణాటక లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం దిశగా సాగుతోంది. అధికార కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి గట్టి షాక్ ఇస్తూ.. కమలం పార్టీ రాష్ట్రంలో ఏకంగా 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కర్ణాకటలో 28 లోక్‌సభ స్థానాలు ఉండగా.. ఎవరూ ఊహించనిరీతిలో బీజేపీ అత్యధిక స్థానాలను సొంతం చేసుకునే దిశగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఆ పార్టీ మిత్రపక్షమైన జేడీఎస్ ఒకే ఒక్క స్థానంలో లీడింగ్‌లో ఉంది. జేడీఎస్ ప్రధాన నేతలు, వారసులు సైతం వెనుకంజలో ఉండటం గమనార్హం. జేడీఎస్ అధినేత దేవెగౌడ మనవడు, సీఎం కరుణానిధి కొడుకు నిఖిల్ గౌడ మాండ్య నియోజకవర్గంలో ఎదురీదుతున్నారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రముఖ నటి సుమలత ప్రస్తుతం 1200 ఓట్ల మెజారిటీతో స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. దివంగత కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి అయిన సుమలత భర్త మృతి నేపథ్యంలో ఇక్కడ బరిలోకి దిగారు. ఇక, బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వన్ అర్షద్, బీజేపీ నుంచి పీసీ మోహన్ మధ్య నువ్వా-నేనా అన్నట్టుగా కౌంటింగ్ సాగుతోంది. -
‘జాగ్వార్’తో ‘గుండెజారి గల్లంతయ్యిందే’ డైరెక్టర్!
కర్ణాటక సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ జాగ్వార్ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ అది బెడిసికొట్టడంతో నిఖిల్ వచ్చిన సంగతిని ఎవరూ పట్టించుకోలేదు. కానీ కన్నడలో మాత్రం నిఖిల్ బిజీగానే ఉన్నాడు. అయితే ఈ కన్నడ హీరోను మన టాలీవుడ్ దర్శకుడు డైరెక్ట్ చేయబోతున్నాడు. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ మూవీతో హిట్ కొట్టిన విజయ్‌కుమార్ కొండ.. ఆ తరువాత ‘ఒక లైలా కోసం’ చిత్రాన్ని తెరకెక్కించారు. నాగచైతన్య, పూజా హెగ్డే కాంబోలో వచ్చిన ఈ సినిమా ఫర్వాలేదనిపించినా.. మళ్లీ ఇంతవరకు మరో ప్రాజెక్టును పట్టాలెక్కించలేకపోయాడు. శ్యాండిల్‌వుడ్‌లో తన ప్రతిభను చాటుకుని.. టాలీవుడ్ మళ్లీ అవకాశాలను పొందేందుకు ప్రయత్నిస్తున్నాడేమో దర్శకుడు విజయ్. దీనిలో భాగంగానే నిఖిల్ గౌడతో సినిమా చేయబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం నిఖిల్ సీతారామ కళ్యాణ, కురుక్షేత్ర సినిమాలో అభిమన్యుడిగా నటిస్తూ బిజీగా ఉన్నాడు. -
కుమారస్వామితో షూటింగ్ లోకేషన్‌కు కేటీఆర్
-
కన్నడ మూవీ సెట్లో కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఓ కన్నడ మూవీ షూటింగ్ జరుగుతున్న లోకేషన్‌కు వెళ్లారు . కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కుమారుడు జాగ్వార్ ఫేం నిఖిల్ గౌడ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సీతారామ కల్యాణ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బెంగళూరులో జరుగుతోంది. కుమారస్వామితో కలిసి షూటింగ్ లోకేషన్‌కు వెళ్లిన కేటీఆర్ యూనిట్ సభ్యులతో ముచ్చటించారు. నిఖిల్ గౌడతో కలిసి సినిమా రషెస్ చూసి సాంకేతిక నిపుణులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అదే సమయంలో కుమారస్వామితో పలు రాజకీయ అంశాలను కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. -
ఓటమి భయంతో బాలకృష్ణ ఏం మాట్లాడుతున్నాడో..
దొడ్డబళ్లాపురం: మాగడి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి బాలకృష్ణ తనకు సంబంధించిన సీడీ ఏదో విడుదల చేస్తానని బెదిరిస్తున్నాడని, బహుశా అది నా మొదటి సినిమా జాగ్వార్ సీడీనే అయ్యుంటుందని కుమారస్వామి కుమారుడు నిఖిల్‌గౌడ ఎద్దేవా చేసాడు. శుక్రవారం మాగడి పట్టణంలో రోడ్‌షో నిర్వహించి జేడీఎస్ అభ్యర్థి ఎ మంజుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసిన నిఖిల్ ఈ సందర్భంగా బాలకృష్ణ వ్యాఖ్యలను గుర్తుచేస్తూ ప్రసంగించారు. తాను సీడీలు విడుదల చేసేంత గొప్ప పనులు ఏం చేయలేదన్నారు. ఓటమి భయంతో బాలకృష్ణ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలీడంలేదన్నారు. అందుకే జేడీఎస్ అభ్యర్థి క్రమ సంఖ్యలను మార్పు చేసి తప్పుడు పప్రచారం చేస్తూ ఓటర్లను తప్పుదారి పట్టించాలని చూస్తున్నాడని, ఓటర్లు ఓటు వేసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. ఇందుకు సంబంధించి క్రిమినల్ కేసు నమోదు చేస్తామని చెప్పారు. -
సినిమా బాగా నచ్చిందట: నిఖిల్
బెంగళూరు: కన్నడ సినీ చరిత్రలోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన జాగ్వార్ చిత్రంతో కన్నడ, తెలుగు భాషల్లో ఒకేసారి అడుగుపెట్టిన మాజీ ముఖ్యమంత్రి కుమారుడు నిఖిల్‌గౌడ తన మొదటి చిత్రంతోనే కన్నడనాట భారీ అభిమానగణాన్ని సొంతం చేసుకున్నాడు. జాగ్వార్ చిత్రంతో ఘనవిజయం సాధించడంతో చిత్రం ప్రచారంతో పాటు అభిమానులను కలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న అతడు మంగళవారం తన మనసులోని భావాలను మీడియాతో పంచుకున్నాడు. మొదటి చిత్రంతోనే కన్నడ ప్రజలు తనను చాలా బాగా ఆదరించారన్నారు. సినిమా బాగా నచ్చిందని ఇటీవల ఓ ప్రైవేటు సంస్థలో పని చేసే ఉత్తరాదికి చెందిన ఉద్యోగులు పేర్కొనడం సంతోషాన్నిచ్చిందని తెలిపాడు. జాగ్వార్ సినిమాను ఇంకా బాగా తెరకెక్కించి ఉంటే ప్రేక్షకుల్లోకి మరింత చొచ్చుకెళ్లేదన్నాడు. మొదటి చిత్రంతో చాలా నేర్చుకున్నానని, దొర్లిన తప్పులను రెండవ చిత్రంలో పునరావృతం కాకుండా మరింత శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. కన్నడ సినీ ఇండస్ట్రీకి మంచి ప్రతిభావంతులను పరిచయం చేసే ఉద్దేశంతో కొత్త స్టూడియోను నిర్మించనున్నామని, అందులో కంప్యూటర్ గ్రాఫిక్స్, అధునాతన డబ్బింగ్ టెక్నాలజీ తదితర సాంకేతికత సౌకర్యాలను కల్పించనున్నట్లు నిఖిల్ గౌడ పేర్కొన్నాడు. కాగా అతడు నటించబోయే రెండవ చిత్రానికి రేసుగుర్రం, ఊసరవెల్లి,కిక్ తదితర హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సురేందరరెడ్డి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. -
సురేందర్ రెడ్డితో జాగ్వర్..?
జాగ్వర్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన యంగ్ హీరో నిఖిల్ గౌడ. తొలి సినిమాతో భారీ బడ్జెట్ తో తెరకెక్కించటంతో నిఖిల్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ఆ అంచనాలను అందుకోవటం జాగ్వర్ విఫలమైంది. అయితే తొలి సినిమా రిజల్ట్ తో సంబందం లేకుండా నిఖిల్ రెండో సినిమాను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు. జాగ్వర్ ఆడియో రిలీజ్ లో చెప్పినట్టుగా ఓ తెలుగు దర్శకుడితో నిఖిల్ రెండో సినిమా ఉండబోతుందన్న వార్త ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ధృవ సినిమాను తెరకెక్కిస్తున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నిఖిల్ తన రెండో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. స్టైలిష్ ఎంటర్టైనర్ లు రూపొందించటంతో స్పెషలిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి నిఖిల్ కు సక్సెస్ ఇస్తాడేమో చూడాలి. -
'జాగ్వర్' మూవీ రివ్యూ
టైటిల్ : జాగ్వర్ జానర్ : యాక్షన్ ఎంటర్టైనర్ తారాగణం : నిఖిల్ గౌడ, దీప్తి సేతి, జగపతిబాబు, రావూ రమేష్, సంపత్ రాజ్, ఆదిత్య మీనన్ సంగీతం : ఎస్ ఎస్ థమన్ దర్శకత్వం : మహదేవ్ నిర్మాత : అనితా కుమారస్వామి, హెచ్ డి కుమారస్వామి మాజీ ప్రధాని మనువడు, మాజీ ముఖ్యమంత్రి కొడుకు నిఖిల్ కుమార్ గౌడ హీరోగా పరిచయం అయిన భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ జాగ్వర్. నిఖిల్ మాతృభాష కన్నడ అయినా.. తెలుగు ప్రేక్షకులకు కూడ తొలి సినిమాతోనే చేరువయ్యే ఉద్దేశంతో జాగ్వర్ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కించారు. బాలకృష్ణతో 'మిత్రుడు' సినిమాను రూపొందించిన మహదేవ్ ఈ సినిమాకు దర్శకుడు. బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందించటంతో జాగ్వర్ పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.ఇంతటి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన జాగ్వర్‌తో నిఖిల్ గౌడ సక్సెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడా..? కథ : ఎన్నో వ్యాపారాలు ఉన్న ప్రముఖ వ్యాపార వేత్త సంపత్ రాజ్, తన వ్యాపారాలన్నింటినీ కాపాడుకునేందుకు ఎస్ ఎస్ టివి అనే న్యూస్ చానల్‌ను నిర్వహిస్తుంటాడు. తన టీవీ టీఆర్పీలు పెంచుకునేందుకు ఎలాంటి పనికైనా సిద్ధపడే సంపత్ ఛానల్‌ను ఓ ముసుగు మనిషి(నిఖిల్ గౌడ) హ్యాక్ చేసి ఓ మర్డర్‌ను లైవ్ టెలికాస్ట్ చేస్తాడు. లైవ్‌లో జడ్జిని మర్డర్ చేసిన ముసుగు వ్యక్తిని పట్టుకునే బాధ్యత సిబిఐ ఆఫీసర్ జెబి(జగపతిబాబు)కి అప్పగిస్తారు. తను డీల్ చేయబోయే ఆ కేసుకు ఆ మర్డర్ చేసిన వ్యక్తికి జాగ్వర్ అని పేరు పెట్టుకుంటాడు జెబి. ఎస్ ఎస్ కృష్ణ(నిఖిల్ గౌడ), తనని తాను అనాథగా పరిచయం చేసుకొని శాంతి మెడికల్ కాలేజ్‌లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్‌గా జాయిన్ అవుతాడు. అదే కాలేజిలో ఫైనల్ ఇయర్ చదివే సిన్సియర్ స్టూడెంట్ ఆర్యతో ఫస్ట్ రోజునుంచే గొడవ పడతాడు. అదే సమయంలో ఆర్య.., కాలేజ్‌లో, హాస్పిటల్లో జరిగే అన్యాయాల మీద పోరాటం మొదలు పెడతాడు. ఆర్యని బెదిరించడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎన్కౌంటర్ శంకర్ కూడా జాగ్వర్ చేతిలో చనిపోతాడు. అసలు కృష్ణ, జాగ్వర్ పేరుతో ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు..? నిజంగానే కృష్ణ అనాథేనా..? జాగ్వర్ కేసును డీల్ చేస్తున్న జెబి జాగ్వర్ను పట్టుకున్నాడా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : తొలి సినిమాతో తనని తాను అన్ని రకాలుగా ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నిఖిల్. ఆశించినట్టుగా డ్యాన్స్‌లు, ఫైట్ల విషయంలో ఆకట్టుకున్నా.. నటుడిగా పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. హీరోయిన్గా నటించిన దీప్తి సేతి తెరమీద కనిపించింది కొద్ది సేపే.. ఉన్నంతలో పర్వాలేదనిపించింది. అభ్యుదయ భావాలున్న వ్యక్తి పాత్రలో రావూ రమేష్ మరోసారి తన మార్క్ చూపించాడు. విలన్లుగా సంపత్ రాజ్, ఆదిత్య మీనన్‌లు ఆకట్టుకున్నారు. కీలక పాత్రలో రమ్యకృష్ణ నటన సినిమాకు ప్లస్ అయ్యింది. అవసరం లేకపోయినా ఇరికించిన ఐటమ్ సాంగ్‌లో తమన్నా అందాలు అలరిస్తాయి. సాంకేతిక నిపుణులు : భారీ నేపథ్యం ఉన్న యువ కథానాయకుణ్ని వెండితెరకు పరిచయం చేసే బాధ్యత తీసుకున్న దర్శకుడు మహదేవ్, రివేంజ్ యాక్షన్ డ్రామాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తొలి సినిమాతోనే నిఖిల్‌ను మాస్ యాక్షన్ హీరోగా లాంచ్ చేసేందుకు చేసిన ప్రయత్నం అంతగా ఆకట్టుకోలేదు. భారీ తనం మీద ఎక్కువగా దృష్టి పెట్టిన యూనిట్ కథా కథనాలను ఆ స్ధాయిలో రెడీ చేసుకోలేదు. రొటీన్ రివేంజ్ డ్రామాతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. టెక్నికల్‌గా మాత్రం జాగ్వర్ సూపర్బ్. మనోజ్ పరమహాంస సినిమాటోగ్రఫి బాగుంది. ముఖ్యంగా యాక్షన్, చేజ్ సీన్స్‌లో కెమరా వర్క్ ఆకట్టుకుంటుంది. థమన్ అందించిన పాటలు పెద్దగా అలరించకపోయినా.. నేపథ్య సంగీతం మాత్రం చాలా సీన్స్‌కు మరింత హైప్ తీసుకు వచ్చింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : సినిమాటోగ్రఫి యాక్షన్ సీన్స్ మైనస్ పాయింట్స్ : పాటలు సెకండ్ హాఫ్ లెంగ్త్ కామెడీ ఓవరాల్‌గా జాగ్వర్ సినిమాతో నిఖిల్ గౌడ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చినా.. హీరోగా ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం మరో ప్రయత్నం చేయక తప్పదు. - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
‘జాగ్వార్’ మూవీ స్టిల్స్
-
కొత్త హీరో కోసం ముగ్గురు స్టార్ డైరెక్టర్లు
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా జాగ్వర్. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి తనయుడు నిఖిల్ కుమార్‌ను హీరోగా పరిచేయం చేస్తూ ఆయనే స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దాదాపు 75 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆడియో రిలీజ్ నుంచి ప్రమోషన్ వరకు ప్రతీ విషయంలోనూ అదే భారీతనాన్ని చూపిస్తున్నారు. అయితే తొలి సినిమా రిలీజ్ కాక ముందే నిఖిల్ కుమార్ రెండో సినిమా కోసం ముగ్గురు స్టార్ డైరెక్టర్లను లైన్లో పెట్టాడు. ఈ విషయాన్ని నిఖిల్ తండ్రి జాగ్వర్ నిర్మాత కుమారస్వామి స్వయంగా ప్రకటించారు. నిఖిల్ రెండో సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, పూరి జగన్నాథ్లలో ఒకరు డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. నిఖిల్ తొలి సినిమాను పూరినే డైరెక్ట్ చేయాల్సి ఉండగా కథ సెట్ కాకపోవటంతో విరమించుకున్నారు. జాగ్వర్ రిలీజ్ తరువాత నిఖిల్ నెక్ట్స్ సినిమాకు దర్శకుడెవరో ప్రకటించే అవకాశం ఉంది. -
జేడీఎస్‌లో ముసలం!
సాక్షి, బెంగళూరు: ‘మనవడి సినీ రంగ ప్రవేశానికి ఖర్చు పెట్టేందుకు రూ.60కోట్లున్నాయి. కానీ, ఒక కోటి రూపాయలతో ఆఫీసును నిర్మించేందుకు మాత్రం అందరూ చందాలేయాలా?’ ఇది ప్రస్తుతం జేడీఎస్ శ్రేణుల్లో చెలరేగుతున్న ప్రశ్న. దేవెగౌడ మనవడు, హెచ్.డి.కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడను హీరోగా పరిచయం చేస్తూ రూ.60కోట్లతో సినిమా తీయనున్నారనే వార్తలు జేడీఎస్ శ్రేణుల్లో తీవ్ర ఆక్రోశాన్ని రగిలిస్తున్నాయి. నిఖిల్ గౌడను శాండల్‌వుడ్‌కు పరిచయం చేస్తూ, మునుపెన్నడూ శాండల్‌వుడ్ చరిత్రలో లేని విధంగా భారీ బడ్జెట్‌తో సినిమా చేయాలని హెచ్.డి.కుమారస్వామి భావిస్తున్నారు. ఇందుకు గాను రూ.60కోట్ల బడ్జెట్‌తో సినిమాను రూపొందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఈ సినిమాకు ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఇక రేస్‌కోర్సులోని భవనంలో గత కొన్ని రోజుల వరకు తమ పార్టీ అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చిన జేడీఎస్ పార్టీ, సుప్రీంకోర్టు తీర్పుతో ఇటీవలే ఆ భవనాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలోనిృకష్ణా ఫ్లోర్‌మీల్ వద్ద జేడీఎస్ పార్టీ తన తాత్కాలిక కార్యాలయాన్ని ఇటీవలే ప్రారంభించింది. ఒక చిన్న పాటి రేకుల షెడ్లో ఈ తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో బీబీఎంపీ నుంచి అన్ని అనుమతులు వచ్చిన తర్వాత పూర్తి స్థాయి కార్యాలయాన్ని నిర్మించాలన్నది జేడీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్.డి.దేవేగౌడ ఆలోచన. ఇక ఈ భవనాన్ని నిర్మించేందుకు గాను తన వద్ద కానీ, తన కుమారుల వద్ద కానీ డబ్బు లేదని దేవెగౌడ ప్రకటించడం విశేషం. ఇదే సందర్భంలో పార్టీ భవన నిర్మాణానికి గాను పార్టీ శ్రేయోభిలాషులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా ప్రతి ఒక్కరూ తమకు తోచినంత మేర విరాళాలు ఇవ్వాలని సైతం దేవెగౌడ కోరారు. అంతేకాదు ప్రస్తుత తాత్కాలిక కార్యాలయ భవనం వద్ద విరాళాల సేకరణకు గాను ఓ హుండీని సైతం ఏర్పాటు చేయడం కొస మెరుపు. దీంతో దేవెగౌడ ద్వంద్వ నీతిపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆక్రోశం చెలరేగుతోంది. ‘మనవడి సినీరంగ ప్రవేశానికి అన్ని కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతూనే, మరో వైపు పార్టీ భవన నిర్మాణానికి డబ్బు లేదనడం ఎంత వరకు సమంజసం?’ అనేది పార్టీ శ్రేణుల్లో చెలరేగుతున్న ప్రశ్న. ‘పార్టీ భవన నిర్మాణానికి డబ్బు అవసరమైతే విరాళాలు ఇచ్చేందుకు మేము సిద్ధమే, అయితే అదే సందర్భంలో దేవెగౌడ లాంటి రాజకీయ వేత్త ఇలా ద్వంద్వ నీతిని అనుసరించడం మాత్రం ప్రజల్లోకి పార్టీపై వ్యతిరేక సందేశాన్నే తీసుకెళుతుంది’ అని పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు వాపోతున్నారు. -
తెరపైకి కుమారుడు
త్వరలో నిఖిల్ గౌడ సినీ అరంగేట్రం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ శాసన సభా పక్షం నాయకుడు హెచ్డీ కుమార స్వామి తనయుడు నిఖిల్ గౌడ త్వరలోనే సినిమా అరంగేట్రం చేయనున్నారు. భారీ బడ్జెట్ సినిమాను దీపావళి నాటికి ప్రారంభించి, సంక్రాంతి నాటికి విడుదల చేయాలనేది ప్రస్తుత లక్ష్యం. ఈ దిశగా కుమార స్వామి కసరత్తును ప్రారంభించినట్లు సమాచారం. ఆయనకు సినిమా రంగం కొత్తేమీ కాదు. అనేక సినిమాలకు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా...ఇలా చిత్ర రంగంలో బహుముఖ పాత్రలను పోషించారు. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించక ముందు ‘తెర’ వెనుక ఒక వెలుగు వెలిగారు. రాజకీయాల్లో జేడీఎస్ పురోగతి ఆశాజనకంగా లేకపోవడం, జేడీఎస్ కుటుంబ పార్టీ అనే విమర్శలు తరచూ వినిపిస్తుండడం... నిఖిల్ గౌడ రాజకీయ వైరాగ్యానికి కారణమని తెలుస్తోంది. ఇటీవల ఆయన పార్టీ పరంగా ఒకటి, రెండు సందర్భాల్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ, ఎప్పుడూ చురుకుగా కనిపించ లేదు. కుమార స్వామి సైతం తన కుమారుడు తొలుత సినిమాల్లో రాణిస్తే, తదుపరి రాజకీయాల్లోకి రావడానికి మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కనుక తొలి సినిమానే ఎటు లేదన్నా...రూ.25 కోట్ల వ్యయంతో భారీ హంగులతో నిర్మించాలని ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం. కుమార స్వామి ఇదివరకే ‘చెన్నాంబిక ఫిల్మ్స్’కు అధిపతి. ఆ బ్యానర్‌పైనే అదిరిపోయే సినిమా తీయాలని ఆయన ఉత్సాహంతో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు సినిమా ‘దూకుడు’ రీమేక్ ‘పవర్’కు దర్శకత్వం వహించిన మాదేశ్ లేదా దర్శక దిగ్గజం కేవీ. రాజు డెరైక్షన్‌లో సినిమాను నిర్మించాలనేది ప్రాథమిక ఆలోచన. తొలి సినిమా కనుక పక్కన హీరోయిన్ కూడా ఆకర్షణీయంగా ఉండాలని పలు పేర్లను పరిశీలించారు. అంతిమంగా సమంత లేదా కాజోల్‌లలో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. క్లాస్ అండ్ మాస్ మిళితంగా చిత్రంగా ఉండాలని, ఈ క్రమంలో తెలుగులో మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్‌ల సూపర్ డూపర్ హిట్లలో ఒక దానిని రీమేక్ చేయాలని కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. సినిమాకు మంచి పేరును సూచించాల్సిందిగా సినీ రంగంలోని ప్రముఖులతో పాటు ప్రజలను కూడా కోరే అవకాశాలున్నాయి. దీనిపై కుమార స్వామి ఇదివరకే ప్రముఖ డెరైక్టర్లతో రెండు దఫాలుగా చర్చించినట్లు తెలిసింది. నిఖిల్ సినిమాలతో పాటు రాజకీయాల్లో రాణించాలనేది తండ్రి ఆశయం కాగా అతను వ్యాపార దిగ్గజంగా వెలుగొందాలనేది తల్లి, మాజీ ఎమ్మెల్యే అనితా కుమార స్వామి కోరిక. తమ కుటుంబం ఆధ్వర్యంలోని కస్తూరి టీవీ ఛానెల్‌ను ప్రస్తుతం నిఖిల్ చూస్తూ ఉన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా అతను పార్టీ ప్రచార సభల్లో పాల్గొన్నారు. సింగపూర్‌కు కుమార స్వామి ఆరోగ్య పరీక్షల నిమిత్తం కుమార స్వామి సింగపూర్‌కు వెళ్లారు. భార్య అనితా కుమార స్వామితో కలసి బుధవారం రాత్రి ఆయన కెంపే గౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరారు. వైద్య పరీక్షల అనంతరం శని లేదా ఆదివారం తిరిగొస్తారు.