
సాక్షి, దొడ్డబళ్లాపురం: కరోనా ఎఫెక్ట్ చివరకు మాజీ ముఖ్యమంత్రి కుమారుడి వివాహానికి కూడా తగిలింది. రామనగర జానదలోక వద్ద భారీ ఏర్పాట్లతో జరగాల్సిన నిఖిల్, రేవతిల వివాహం రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి దంపతులు రామనగరలో కుమారుడి వివాహం చేయాలని కలలుగన్నామని చెబుతూ వస్తున్నారు. అందుకు ఎక్కువ ఖర్చుతో భారీ ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. ఇంతలో రాష్ట్రాన్ని కరోనా కుదిపేస్తున్న నేథ్యంలో వివాహం చేయాలా, వద్దా అనే ఆలోచనలో కుమారస్వామి ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతానికి జానపద లోక వద్ద వివాహ ఏర్పాట్లను నిలిపివేయడంతో అనుమానాలు బలపడుతున్నాయి. లక్షల మంది జనం మధ్య కుమారుడి వివాహం చేయాలని కుమారస్వామి భావించారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది అసాధ్యం. బెంగళూరులో కొద్దిమంది వీఐపీలు, బంధువుల మధ్య వివాహం చేయాలనే ఆలోచనలో కుమారస్వామి కుటుంబం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కుమారస్వామి రెండుమూడు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: ప్రేమ జంట తలుపు తట్టి.. ప్రియుని కళ్లెదుటే
నిలిచిపోయిన పనులు
Comments
Please login to add a commentAdd a comment