
పెళ్లి వేడుక దృశ్యం
కర్ణాటక, యశవంతపుర: లాక్‌డౌన్ నిబంధనలను గాలికి వదిలి మాజీ ఎమ్మెల్యే కొడుకు పెళ్లి వైభవంగా జరిగింది. చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు బీజీ గోవిందప్ప తనయుని పెళ్లి బేలూరులో జరిపారు. పెద్దసంఖ్యలో అతిథులు రావడం, కనీస దూరం, మాస్కులు లేకుండా పెళ్లి వేడుక జరిపారు. దీంతో ప్రజలకు ఒక చట్టం, పెద్దలకు మరో చట్టమా? అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.