added
-
రైల్వే శాఖ అందించిన ‘చల్లని’ వార్త
న్యూఢిల్లీ: ఏసీ కోచ్‌ల్లో లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాలను చేయాలనుకున్నా, టికెట్లు దొరక్క ఇబ్బుందులు పడుతున్న ప్రయాణికులకు రైల్వేశాఖ ఓ శుభవార్త అందించింది. సుదూరం ప్రయాణించే రైళ్లలో థర్డ్ ఏసీ బోగీలను పెంచాలని రైల్వేశాఖ ఆలోచిస్తోంది. ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లకు పెరుగుతున్న గిరాకీ నేపథ్యంలో రైల్వేశాఖ ఈ యోచన చేస్తోంది. థార్డ్ ఏసీ ప్రయాణికుల ద్వారా ఆదాయం బాగా వస్తోందని రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి చెప్పారు. కొన్నిదూరపు రైళ్లలో క్రమంగా ఏసీ బోగీలను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గత ఏడాది సీజన్లో ప్రయాణికుల నుంచి వస్తున్న ఆదాయంలో32శాతం థర్డ్ ఏసీనుంచి వచ్చినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. స్లీపర్ క్లాస్ బోగీల ద్వారా సుమారు 44 శాతం ఆదాయం సమకూరింది. ఇటీవల కేవలం థార్డ్ ఏసీ బోగీలతో రైల్వేశాఖ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించింది. ఆ రైలుకు మంచి స్పందన వస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి 2016 మార్చి 2017 వరకు 33.65 శాతానికి పెరిగిన ప్రయాణీకుల వాటాతో పోల్చుకుంటే వాటా పెరుగుదల 16.69 శాతం నుంచి 17.15 శాతానికి పెరిగింది. ప్రయాణీకుల ఆదాయం 32.60 శాతం నుంచి 33.65 శాతానికి పెరిగాయని రైల్వే గణాంకాలు చెబుతున్నాయి. -
గ్రూప్-2లో అదనంగా 500 పోస్టులు
రెండింతలు పెరిగిన ఖాళీల సంఖ్య ► అదనపు పోస్టుల్లో డిప్యూటీ తహసీల్దార్లే ఎక్కువ ► ఆర్థిక శాఖ వద్ద వివరాలు.. సీఎస్‌కు చేరిన ఫైలు ► సీఎం ఆమోదించగానే అదనపు నోటిఫికేషన్ ► జూన్ 2న పోస్టుల వివరాలను వెల్లడించే అవకాశం ► తొలివిడత నోటిఫికేషన్లో ఇప్పటికే 439 పోస్టులు ► తాజా పోస్టులతో కలిపితే మొత్తం 939 ఖాళీలు సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2లో అదనంగా 500 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెవెన్యూ విభాగం ఇచ్చిన తాజా ప్రతిపాదనలతో గ్రూప్-2 పోస్టుల సంఖ్య రెండింతలు పెరిగినట్లు తెలిసింది. అదనంగా గుర్తించిన పోస్టుల్లో ఎక్కువగా డిప్యూటీ తహశీల్దార్ పోస్టులున్నాయి. వివిధ శాఖలు తమకు పంపించిన ఖాళీల జాబితాను ఆర్థిక శాఖ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు పంపించినట్లు తెలిసింది. తొలుత 439 గ్రూప్-2 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. నిరుద్యోగులు, వివిధ పార్టీల ప్రతినిధుల విజ్ఞప్తులతో ఏప్రిల్ 24, 25 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. అదే సమయంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వెయ్యి పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దీంతో అనుబంధ నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుంది.. అదనంగా ఎన్ని పోస్టులను ప్రకటిస్తారని.. లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. వివిధ శాఖల నుంచి ఇటీవల ఆర్థిక శాఖకు చేరిన ఖాళీ పోస్టుల సంఖ్య 450 దాటింది. వీటికి తోడు తొలి నోటిఫికేషన్ సమయంలో పక్కనబెట్టినవి కూడా కలిపితే ఈ సంఖ్య 500కు చేరింది. దీంతో తొలి నోటిఫికేషన్లో ప్రకటించిన 439 పోస్టులతో కలిపితే మొత్తం పోస్టుల సంఖ్య 939కి పెరగనుంది. ఫైల్‌పై సీఎస్, సీఎం ఆమోదముద్ర పడితే అదనపు పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అవుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాతే టీఎస్పీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ వెలువడుతుంది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి ఈ అదనపు పోస్టులు, అనుబంధ నోటిఫికేషన్‌పై ప్రకటన చేసే అవకాశాలున్నాయి. -
రేపటితో ప్రచారానికి తెర
నియోజకవర్గాల్లో అభ్యర్థుల సుడిగాలి పర్యటనలు సినీ స్టార్లతో ప్రచార హోరు తాయిలాల పర్వం మొదలు పోలీసుల విస్తృత తనిఖీలు సాక్షి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల పక్రియలో భాగంగా జరుగుతున్న బహిరంగ ప్రచారానికి మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు తెర పడనుంది. దీంతో అభ్యర్థులు ప్రచార వేగాన్ని పెంచారు. మరోవైపు ‘తాయిలాల’కు అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల కమిషన్ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తుండగా, అదే సమయంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వివిధ ప్రాంతాల్లో నిఘా పెంచారు. ప్రచార గడువు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. బైక్ ర్యాలీలు, పాదయాత్రలు, రోడ్‌షోలతో ప్రజల వద్దకు వెళ్లి తమను ఈ ఎన్నికల్లో గెలిపించాల్సిందిగా వేడుకుంటున్నారు. ఆయా పార్టీలు కూడా తమ ‘స్టార్ క్యాంపెయిన్ల’తో రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేయించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి అయిన నరేంద్రమోడీ ఆదివారం ఒక్కరోజే ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలోని చిక్కబళాపుర, చిక్కమగళూరు, హావేరిలో ఏర్పాటు చేసిన బహిరంగ వేదికలపై ప్రసంగించారు. ఆ పార్టీ జాతీయ నేతలైన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరిక్కర్, వెంకయ్యనాయుడు కూడా బెంగళూరులో ఆదివారం జరిగిన పలు బహిరంగ ప్రచార సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్, జేడీఎస్‌తో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా తమ ప్రచారంతో రాష్ట్రన్ని హోరెత్తిస్తున్నారు. అన్ని పార్టీలు చివరి రెండు రోజులైనా ఓటర్లను ఆకర్షించడానికి వెండి, బుల్లితెర నటులను తమ ప్రచార కార్యక్రమాల్లో వినియోగించుకోవాలని నిర్ణయించాయి. దీంతో ఇప్పటి వరకూ ప్రచారానికి దూరంగా ఉన్న గోల్డెన్‌స్టార్ గణేష్, రాగిణీ ద్వివేదిలు కూడా ప్రచారం చేయనున్నారు. తాయిలాల పర్వం మొదలు : ఇప్పటి వరకూ బహిరంగ వేదికలపై ఉపన్యాసాలతో ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నించిన అభ్యర్థులు ఇక ఓటర్లుకు తాయిలాలు అందజేస్తూ తమ వైపునకు తిప్పుకునే పర్వానికి తెరలేపారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ అధికారులు దాడులు చేసి భారీ మొత్తంలో నగదు, విలువైన వస్తువులు స్వాధీనం చేసుకుంది. చెక్‌పోస్టుల్లో ప్రత్యేక నిఘా ఉంచింది. ఇప్పటి వరకు రూ. 21.36 కోట్ల నగదు, రూ.10 కోట్ల విలువ చేసే బంగారు, వెండి, చీరలు తదితర సొత్తుతో పాటు రూ.2.77 కోట్ల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా శాంతి భద్రతలకు ఎటువ ంటి విఘాతం కలగకుండా ఉండటానికి పారామిలటరీ దళాలు రాష్ట్రానికి చేరుకున్నాయి.