addicts
-
టీనేజీలోనే గంజాయి
సాక్షి, హైదరాబాద్: గంజాయి, మద్యం, సిగరెట్, డ్రగ్స్ వినియోగం, వాటికి బానిసలై పోవడం సాధారణంగా యువకులు, పెద్దల్లోనే చూస్తుంటాం. కానీ టీనేజ్ పిల్లలు కూడా ఈ చెడు అలవాట్లకు ఎక్కువగా లోనవుతున్నారట. ఆ మాటకొస్తే పిల్లల్లో ఎక్కువ శాతం గంజాయి సేవిస్తుండటం విస్మయం కలిగిస్తోంది. ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే మానసిక రుగ్మతల కారణంగా టీనేజీ పిల్లలు ఈ వ్యసనాల బారిన పడుతుండటం. మానసిక సమస్యలు కూడా పెద్దవారికే అధికంగా ఉంటాయని అనుకుంటాం. కానీ పెద్ద వయస్సు వారికంటే యువతీ యువకుల్లోనే మానసిక రుగ్మతలు అధికంగా ఉంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), యూనిసెఫ్ (ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పిల్లల అత్యవసర నిధి)లు తేలి్చచెప్పాయి.‘యువకులు, చిన్న పిల్లల మానసిక ఆరోగ్యంపై మార్గదర్శకత్వం’పేరుతో డబ్ల్యూహెచ్ఓ, యూనిసెఫ్ తాజాగా ఓ నివేదిక విడుదల చేశాయి. ఐదేళ్ల నుంచి 24 ఏళ్లలోపు వారికి సంబంధించిన మానసిక సమస్యలపై పలు ఆసక్తికర అంశాలను పొందుపరిచాయి. మానసిక రుగ్మతల నుంచి టీనేజీ పిల్లలను రక్షించాలంటే చట్టాలు సరిగా ఉండాలని, సామాజిక భద్రత..ఆర్థిక భరోసా ఉండాలని, మౌలిక సదుపాయాలు కలి్పంచాలని సూచించాయి. నివేదికలో ఏముందంటే.. పెద్దలు తట్టుకుంటారు.. పిల్లలు కుంగిపోతారు మూడో వంతు మానసిక సమస్యలు 14 ఏళ్లలోపే మొదలవుతాయి. అందులో సగం 10 ఏళ్లలోపే ప్రారంభం అవుతాయి. 15–19 ఏళ్ల వయస్సు బాల బాలికల్లో మద్యం తాగేవారు 22 శాతం ఉన్నారు. అలాగే పెద్దల కంటే టీనేజీ పిల్లల్లోనే గంజాయి వాడకం ఎక్కువగా ఉంది. ఆ వయస్సు వారిలో 5.5 శాతం మంది టీనేజీ పిల్లలు గంజాయి తాగుతున్నారు. ఆ వయస్సులోనే మద్యం, డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. 13–19 ఏళ్ల మధ్య వయస్సులోని టీనేజీ పిల్లల్లో ప్రతి ఏడుగురిలో ఒకరికి మానసిక రుగ్మత ఉంది. పెద్ద వారు మానసిక సమస్యలను తట్టుకోగలరు. కానీ చిన్న పిల్లలు తట్టుకోలేరు. చదువు, కెరీర్ వంటివి వారిపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. 15–19 మధ్య వయస్సు వారిలో మానసిక సమస్యలు అత్యధికంగా 15 శాతం ఉండటం గమనార్హం. ఆ వయస్సులో చదువు కీలకమైన దశలో ఉంటుంది. కెరీర్‌ను నిర్ణయించుకునే దశ, ప్రేమలు, ఆకర్షణలు వంటివివారిని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఆ వయస్సువారే వివిధ మానసిక కారణాల వల్ల నేరస్థులుగా మారుతున్నారు. ఆత్మహత్యలూ 15–24 ఏళ్లలోపు వారిలోనే అధికంగా ఉంటున్నాయి. అందులో ఎక్కువగా పురుషులే ఉంటున్నారు. బాలికలు ఎక్కువగా భావోద్వేగపరమైన ఒత్తిడికి (ఎమోషనల్ డిస్టర్బెన్స్) గురవుతుంటారు. పిల్లల్లో కడుపు నొప్పి, వాంతులు, తలనొప్పి వంటివి కూడా మానసిక రుగ్మతకు సంబంధించిన అంశాలే. పెద్దవారిలో డిప్రెషన్, యాంగ్జయిటీ వంటివి కీలకంగా ఉంటాయి. అతిగా తినడమూ, తక్కువ తినడమూ మానసిక వ్యాధి లక్షణాలే. 40 ఏళ్లలోపు వరకు మానసిక సమస్యలు ఎక్కువగా వస్తాయి. 70 ఏళ్లు పైబడిన వారిలో మతిమరుపు వస్తుంది. ఏ వయస్సు వారిలో మానసిక రుగ్మతలు ఎంత శాతం అంటే.. ⇒ 5–9 మధ్య వయస్సు వారిలో 8 శాతం ⇒ 10–14 ఏళ్లు 15 శాతం ⇒ 15–19 ఏళ్లు 15 శాతం ⇒ 20–24 ఏళ్లు 14 శాతం ⇒ 25–29 ఏళ్లు 13 శాతం ⇒ 30–34 ఏళ్లు 12 శాతం ⇒ 35–39 ఏళ్లు 11 శాతం ⇒ 40–44 ఏళ్లు 9 శాతం ⇒ 45–49 ఏళ్లు 7 శాతం ⇒ 50–54 ఏళ్లు 6 శాతం ⇒ 55–59 ఏళ్లు 5 శాతం ⇒ 60–64 ఏళ్లు 3 శాతం ⇒ 65–69 ఏళ్లు 3 శాతం ⇒ 70 ఏళ్లకు పైబడి 2 శాతం ప్రాథమిక ఆరోగ్యంలో ఇది భాగం కావాలి లింగ భేదాలు కూడా మానసిక సమస్యలకు కారణంగా ఉంటున్నాయని ఆ నివేదిక తేలి్చంది. పురుషులు కుటుంబ బాధ్యతలు, అనేక ఇతర సమస్యలతో మద్యానికి బానిసలవుతున్నారు. అలాగే బయటకు చెప్పలేని పరిస్థితులూ ఉంటున్నాయి. ఉద్యోగం, ఉపాధి, ఆర్థికంగా నిలదొక్కుకోవడం వంటివి ఇబ్బందికి గురిచేస్తాయి. మానసిక రుగ్మతలకు వైద్యం చేసే పరిస్థితులు తక్కువగా ఉన్నాయి. మానసిక ఆరోగ్యాన్ని ప్రాథమిక ఆరోగ్యంలో కలపాలి. ప్రస్తుతం ప్రాథమిక, జిల్లా ఆసుపత్రుల్లో మానసిక సమస్యలకు సంబంధించిన వైద్యులు లేకపోవడాన్ని నివేదిక ఎత్తి చూపింది. ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లలు, యువకుల మానసిక ఆరోగ్యంపై ఆయా దేశాల బడ్జెట్లలో కేవలం 0.1 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. 80 శాతం దేశాల్లో మానసిక ఆరోగ్యంపై ఒక ప్రత్యేక వ్యవస్థ అనేది లేనేలేదు. – డాక్టర్ కిరణ్ మాదల, ప్రొఫెసర్ అనెస్థీíÙయా, గాంధీ మెడికల్ కాలేజీ, హైదరాబాద్ నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు..⇒ టీనేజీ పిల్లలు బయటి పరిస్థితులు, ఇంటి పరిస్థితులకు మధ్య ఘర్షణతో మానసికంగా ఇబ్బంది పడుతుంటారు. ⇒ 5–9 ఏళ్ల పిల్లలపై స్నేహితులు, తల్లిదండ్రులు పెంచే విధానం, స్కూలు, పరిసరాల ప్రభావం ఉంటుంది. ⇒ ఆర్థిక, సామాజిక, లింగపరమైన అసమాన త్వం, సామాజిక బహిష్కరణ వంటి వాటి వల్ల పిల్లలు మానసికంగా కుంగిపోతారు. ⇒ పేదరికం, యుద్ధ వాతావరణంలో ఉండే పిల్లల్లో మానసిక సమస్యలు పెరుగుతాయి. కుటుంబంలో తల్లి మద్యానికి బానిసైతే పుట్టే పిల్లల్లో మానసిక సమస్యలు రావొచ్చు. ⇒ తల్లిదండ్రులకు మానసిక సమస్యలుండటం, తల్లిదండ్రులు..కుటుంబ కలహాలు, తల్లిదండ్రులు విడిపోవడం, పిల్లలను హాస్టళ్లలో చేర్చ డం వంటివి కూడా ప్రభావితం చేస్తున్నాయి. ⇒ మానసిక రుగ్మతకు గురైన వారికి త్వరగా చికిత్స చేస్తే పెద్దయ్యేసరికి మొండిజబ్బుగా మారకుండా చూసుకోవచ్చు. ⇒ కరోనా సమయంలో అన్ని వయస్సుల వారిలో మానసిక వ్యాధులు 25 శాతం పెరిగాయి. ఉద్యోగాలు పోవడం, చదువు మధ్యలో ఆపేయడం, ఆప్తుల్ని కోల్పోవడం, ఆసుపత్రుల పాలు కావడం లాంటి అనేక కారణాలతో మానసిక సమస్యలు పెరిగాయి. -
లావోస్‌లో సైబర్ బానిసలు..
న్యూఢిల్లీ: విదేశాల్లో ఉద్యోగం అంటే ఎవరికైనా సంబరమే. మంచి జీతం, జీవితం లభిస్తాయన్న నమ్మకంతో విదేశాలకు వెళ్తుంటారు. ఇండియా నుంచి చాలామంది ఇలాగే లావోస్‌కు చేరుకొని, సైబర్ నేరాల ముఠాల చేతుల్లో చిక్కుకొని అష్టకష్టాలు పడుతున్నారు. సైబర్ బానిసలుగా మారుతున్నారు. కొన్ని ముఠాలు ఉద్యోగాల పేరిట యువతపై వల విసిరి లావోస్‌కు తీసుకెళ్తున్నాయి. అక్కడికెళ్లాక వారితో బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నాయి. ఇండియాలోని జనానికి ఫోన్లు చేసి, ఆన్లైన్లో డబ్బులు కొల్లగొట్టడమే ఈ సైబర్ బానిసల పని. మాట వినకపోతే వేధింపులు, దాడులు తప్పవు. లావోస్‌లో బొకియో ప్రావిన్స్‌లోని గోల్డెన్ ట్రయాంగిల్ ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్)లో ఏర్పాటైన సైబర్ స్కామ్ సెంటర్లలో చిక్కుకున్న 47 మంది భారతీయులను అక్కడి అధికారులు శనివారం రక్షించారు. వీరిని లావోస్‌లోని భారత రాయబార కార్యాలయంలో అప్పగించారు. బాధితుల్లో 30 మందిని క్షేమంగా స్వదేశానికి తరలించినట్లు రాయబార కార్యాలయం అధికారులు చెప్పారు. మిగిలినవారిని సాధ్యమైనంత త్వరగా తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉచ్చులోకి యువత ఉద్యోగం కోసం ఆశపడి ఉచ్చులో చిక్కుకున్న యువకులను సైబర్ నేరగాళ్లు లావోస్‌కు పంపిస్తున్నారు. అక్కడికి చేరగానే పాస్‌పోర్టు లాక్కుంటారు. బయటకు వెళ్లనివ్వరు. స్కామ్ సెంటర్లలో ఉండిపోవాల్సిందే. యువతుల మాదిరిగా గొంతు మార్చి ఫోన్లలో మాట్లాడాల్సి ఉంటుంది. నకిలీ యాప్‌లలో, ఫేక్ సోషల్ మీడియా ఖాతాల్లో అందమైన యువతుల ఫొటోలు పెట్టి జనాన్ని బురిడి కొట్టించాలి. రోజువారీ లక్ష్యాలు ఉంటాయి. నిర్దేశించినంత డబ్బు కొల్లగొట్టకపోతే కఠినమైన శిక్షలు విధిస్తారు. జాబ్ ఆఫర్ అంటే గుడ్డిగా అంగీకరించొద్దు ఉద్యోగాల కోసం లావోస్ వెళ్లి, సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న 635 మంది భారతీయులను అధికారులు గతంలో రక్షించారు. గత నెలలో ఇండియన్ ఎంబసీ 13 మందిని కాపాడింది. వారిని భారత్‌కు తిరిగి పంపించింది. లావోస్, కాంబోడియా జాబ్ ఆఫర్లు వస్తే గుడ్డిగా అంగీకరించవద్దని, చాలావరకు సైబర్ మోసాలకు సంబంధించినవే ఉంటాయని, యువత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గత నెలలో లావోస్‌లో పర్యటించారు. నేరగాళ్ల ముఠాలు భారతీయ యువతను లావోస్ రప్పించి, బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తుండడంపై లావోస్ ప్రధానమంత్రితో చర్చించారు. సైబర్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
వద్దమ్మా.. తప్పూ!
ఈ మధ్య ‘గైడింగ్ హ్యాండ్స్’ అంటూ ఒక వీడియో వచ్చింది. అది వెక్కిరింత వీడియో. ఫోన్ చూసుకుంటూ తల ఎల్లవేళలా కిందకు దించి ఉండేవారిని చేయి పట్టి చేరవలసిన చోటుకు చేర్చే‘సహాయక చేతులను’ భవిష్యత్తులో ఉపాధిగా చేసుకోవచ్చని అందులో చూపుతారు. అంటే అంధులను చేయి పట్టి నడిపించేవారికి మల్లే ఈ ఫోన్ బానిసలను చేయి పట్టి నడిపించి చార్జ్ తీసుకునే వ్యక్తులు భవిష్యత్తులో వస్తారన్న మాట. మనం ఫోన్‌కు శ్రుతి మించి ఎడిక్ట్ అయ్యామని చెప్పేందుకు ఈ వీడియో చేశారు. బండి మీద వెళుతూ ఫోన్ మాట్లాడితే ప్రమాదం అని ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ వినడం లేదు. కొందరు హెల్మెట్‌లో దూర్చి మరీ ఫోన్ మాట్లాడుతూ ప్రమాదం బారిన పడతారు. మరికొందరు హెడ్‌ఫోన్స్‌తో మాట్లాడుతూ వెనకొచ్చే వాహనాల హారన్ వినక ప్రమాదంలో పడుతున్నారు. మొన్నటి మార్చి 26న బెంగళూరు విద్యారణ్యపురలో ఒక మహిళ ఇలా ఫోన్ బిగించి కట్టి మాట్లాడుతూ ఒక వ్యక్తి కెమెరాకు చిక్కింది. అతను షూట్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. అందరూ ఇలా చేయడం ప్రమాదం అన్నారు. ఈ ఎండల్లో ఫోన్ వేడెక్కి పేలినా ప్రమాదమే అని మరికొందరు హెచ్చరించారు. పోలీసులు ఏం చేస్తున్నారని కొందరు ప్రశ్నించారు. చివరకు వీడియో పోలీసుల వరకూ వెళ్లింది. బండి నంబర్ ఆధారంగా ఆ మహిళను గుర్తించి యలహంక ట్రాఫిక్ స్టేషన్ వారు 5 వేల రూపాయల ఫైన్ వేశారు. అవసరమా ఇదంతా? -
డ్రగ్స దందాలో సరికొత్త పంథా...వినియోగిస్తూ.. విక్రయిస్తూ..
సాక్షి హైదరాబాద్: నగరానికి చెందిన సయ్యద్ ఆసిఫ్ జిబ్రాన్, పి.తరుణ్ కొన్నేళ్ల క్రితం డ్రగ్స్‌కు అలవాటుపడ్డారు. కాలక్రమంలో వినియోగించడంతో పాటు అందుకు అవసరమైన డబ్బు కోసం విక్రయించడమూ ప్రారంభించారు. గౌలిగూడ వాసి అశుతోష్ కొన్నేళ్లుగా మియాపూర్‌కు చెందిన లక్కీ నుంచి గంజాయి, హష్ ఆయిల్ ఖరీదు చేసి వినియోగిస్తున్నాడు. ఆపై స్నేహితులు, పరిచయస్తులకు వాటిని అమ్మి సొమ్ము చేసుకోవడం మొదలెట్టాడు. వీరితో పాటు వీరి నుంచి డ్రగ్స్ ఖరీదు చేసి వినియోగిస్తున్న వారినీ గత గురు–శుక్రవారాల్లో హెదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు పట్టుకున్నారు. కేవలం వీళ్లే కాదు.. కొన్నాళ్లుగా వెలుగులోకి వస్తున్న ఉదంతాలను పరిశీలిస్తే... సరదా కోసం డ్రగ్స్ వాడటం మొదలెట్టిన వారిలో 95 శాతం మంది వాటికి బానిసలుగా మారుతున్నారని, ఇలాంటి వినియోగదారుల్లో 40 శాతం విక్రేతల అవతారం ఎత్తుతున్నారని పోలీసులు గుర్తించారు. నిఘాతో పాటు పెరుగుతున్న రేటు... రాజధానికి గంజాయితో పాటు దాని సంబంధిత పదార్థమైన హష్ ఆయిల్ విశాఖ, అదిలాబాద్ ఏజెన్సీల నుంచి వచ్చి చేరుతోంది. హెరాయిన్, కొకైన్, ఎల్ఎస్డీ బోల్ట్స్ వంటి మాదకద్రవ్యాలు గోవాతో పాటు ఇతర మెట్రోల నుంచి వచ్చేవి. అయితే పోలీసులు, ఎక్సైజ్ అధికారుల నిఘా పెరగడంతో మాకద్రవ్యాల దందా డార్క్ నెట్ ద్వారా జరుగుతోంది. వీటి క్రయవిక్రయాలపై నిçఘా ఏస్థాయిలో ఉంటే... వాటి రేట్లు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ కారణంగానే వీటికి బానిసలుగా మారిన యువత ఆ ‘ఖర్చు’ల కోసం విక్రేతలుగా మారుతున్నారు. కాస్త ఎక్కువ మొత్తంలో వాటిని తెప్పించి స్నేహితులు, పరిచయస్తులకు విక్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ ధోరణి ఎక్కువైందని హెచ్–న్యూ అధికారులు చెప్తున్నారు. వారి కంటే వీరికే ఎక్కువ శిక్షలు... డ్రగ్స్, గంజాయి సంబంధిత కేసులను ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నమోదు చేస్తారు. న్యాయస్థానిల్లో నిందితులు దోషులుగా నిరూపితమైనప్పుడు ఇందులోని సెక్షన్ల ప్రకారమే శిక్షలు పడతాయి. ఈ చట్ట ప్రకారం వినియోగదారుల కంటే విక్రేతలకు ఎక్కువ శిక్షలు ఉంటాయి. ఏ నిందితుడు వినియోగదారుడు? ఎవరు విక్రేత అనేది అరెస్టు సమయంలో వారి వద్ద లభించిన డ్రగ్, గంజాయి పరిమాణంతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి నిర్థారిస్తారు. ప్రొఫెషనల్ డ్రగ్ పెడ్లర్లు కాకపోయినా... ఖర్చుల కోసం ఈ దందా చేసినా అదే స్థాయిలో శిక్ష అనుభవించాల్సి వస్తుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. డ్రగ్స్‌కు బానిసలైన వాళ్లే పెడ్లర్లుగా మారుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇవన్నీ డ్రగ్స్ బానిసల లక్షణాలు: నగరంలోని డ్రగ్స్ వినియోగదారులు, విక్రేతల్లో అనేక మందిని హెచ్–న్యూ పట్టుకుంది. వీరిని పరిశీలించడంతో పాటు విచారించిన నేపథ్యంలో అనేక సారూప్యతలు ఉన్న లక్షణాలను గుర్తించింది. ఇవి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలని, వీటిలో ఏవైనా వారి పిల్లల్లో కనిపిస్తే అప్రమత్తం కావాలని సూచించింది. మాదకద్రవ్యాలతో పాటు గంజాయి, హష్ ఆయిల్ వంటి వాటికి బానిసలుగా మారిన యువతలో అనేక మంది తమ ఒంటిపై టాటూస్ ఎక్కు వ సంఖ్యలో వేయించుకుంటున్నారు. వీటిలోనూ పుర్రెలు, కొన్ని రకాలైన పూలు ఉంటున్నాయి. డ్రగ్స్ వినియోగదారులు వినే సంగీతం కూడా అసాధారణంగా ఉంటోంది. సైకొడెలిక్‌గా పిలిచే చిత్రమైన మ్యూజిక్‌ను వింటుంటారు. టెక్నో, ట్రాన్స్ మ్యూజిక్స్‌గా పిలిచే వీటిలో లిరిక్స్ కంటే మ్యూజిక్కే ఎక్కువగా ఉంటుంది. ఇది వింటూ మత్తులో జోగుతుంటారు. వీరిని ఎదైనా ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పే విధానం సుదీర్ఘంగా ఉంటుంది. చిత్రమైన డిజైన్లతో కూడిన దుస్తులు ధరించడం, విభిన్నమైన హెయిల్ స్టైల్స్ కలిగి ఉండటం కూడా బానిసల లక్షణాలు. వీళ్లు ఎక్కువగా టీషర్టులు, చిత్రమైన షర్టులు ధరిస్తూ ఉంటారు. డ్రగ్స్‌కు బానిసలుగా మారిన వాళ్లు సాధారణంగా ఒక్కరుగా వాటిని తీసుకోరు. ఎక్కువగా గ్రూప్ పార్టీలు నిర్వహిస్తూ, వాటికి హాజరవుతూ ఉంటారు. తరచుగా గోవాకు వెళ్లివస్తున్న యువత విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని హెచ్–న్యూ అధికారులు సూచిస్తున్నారు. (చదవండి: కారు కొనివ్వలేదని యాసిడ్ తాగాడు.. ) -
త్రిపుర ప్రజల్ని బానిసలు చేశారు
సోనామురా/కైలాషహర్: త్రిపురలో అధికార కమ్యూనిస్టు పార్టీ ప్రజల జీవితాలను బానిస బతుకులు చేసిందని, ఆ పార్టీని గద్దె దించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. త్వరలో ఎన్నికలు జరగనున్న ఆ రాష్ట్రంలో మోదీ గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మాణిక్ సర్కార్‌పై దుమ్మెత్తిపోసిన మోదీ..బీజేపీ అధికారంలోకి వస్తే త్రిపురలో ‘హీరా’(హెచ్–హైవేలు, ఐ–ఇంటర్నెట్, ఆర్–రోడ్లు, ఏ–ఎయిర్వేస్) అభివృద్ధి చెందుతుందని అన్నారు. 25 ఏళ్లుగా నిరంతరాయంగా పాలిస్తున్న కమ్యూనిస్టులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, రేషన్ కార్డు లాంటి చిన్నాచితకా అవసరాలకూ ఆ పార్టీ తలుపులు తట్టాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఎవరైనా హత్యకు గురైతే ఆ పార్టీ నుంచి అనుమతి రానిదే ఎఫ్ఐఆర్ నమోదుచేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులు ప్రతి దానికీ ప్రజలు తమపైనే ఆధారపడేలా చేసారని, బానిసత్వానికి ఇది కొత్త రూపమని అభివర్ణించారు. లెఫ్ట్ పాలనలో త్రిపురలో అభివృద్ధి ఇసుమంతైనా కనిపించడం లేదని ఆరోపించారు. తామొస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సంఘం సిఫార్సులను అమలుచేస్తామన్నారు. -
ఫేస్బుక్ వ్యసనపరుల కోసం క్లినిక్!
కాన్స్టాంటిన్: ఇంటర్నెట్ ప్రపంచంలో ఫేస్‌బుక్‌కు ఉన్నటువంటి ఆదరణ, ఆకర్షణ మరే ఇతర సోషల్ నెట్వర్కింగ్ సైట్‌కు లేదనే చెప్పాలి. అయితే దీనిని పరిమితంగా వాడినంత వరకు పరవాలేదు గానీ.. శృతి మించితే మాత్రం మత్తుపదార్దాలకు బానిసైన వారికంటే ఎక్కువగా దీని బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారికోసం చికిత్స అందించడానికి ఫేస్ బుక్ డీఅడిక్షన్ క్లినిక్‌లు వెలుస్తున్నాయి. అల్జీరియాలోని కాన్స్టాంటిన్లో ఇటీవలే ఓ ప్రైవేట్ క్లినిక్‌ను తెరిచారు. అయితే ఆ క్లినిక్ అందించే సేవల లిస్ట్‌లో మత్తు పదార్థాలకు(డ్రగ్స్) బానిసైన వారు, ఆల్కహాల్ వ్యసనపరులతో పాటు.. ఫేస్బుక్ బాధితులకు కూడా చికిత్స అందించబడుతుందని తెలిపారు. ఫిజికల్ డ్రగ్స్ కంటే ఎక్కువగా ఈ ఫేస్బుక్ వ్యసనపరులకు చికిత్స అవసరమని క్లినిక్ డాక్టర్ రవుఫ్ బొకాఫా వెల్లడించారు. అల్జీరియాలో ఇప్పటికే 10 మిలియన్ల ఫేస్బుక్ యూజర్లు ఉండగా, ఈ సంఖ్య ఏడాదికి 10 శాతం చొప్పున పెరుగుతోంది. దీంతో ఫేస్బుక్ బాధితులతో క్లినిక్‌కు బాగానే ఆదరణ లభిస్తోందని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫేస్బుక్ బాధితులను.. 'బ్లూ మ్యాజిక్' బారిన పడిన వారిగా ఇక్కడి క్లినిక్‌లో ట్రీట్చేస్తున్నారు.