additional solicitor general
-
నూతన చట్టాలతో సత్వర న్యాయం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారతీయ కొత్త చట్టాలతో బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని తెలంగాణ హైకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ బి.నర్సింహ శర్మ అన్నారు. బంజారాహిల్స్‌లోని సుల్తాన్ ఉలూం లా కాలేజీలో అన్లాకింగ్ ‘కొత్త దిశలు–భారత దేశం క్రిమినల్ చట్టాలు’ అనే అంశంపై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు చాలా బాగున్నాయన్నారు.ఇవి సామాన్యులకు సత్వర న్యాయం జరిగే విధంగా రూపొందించడం అభినందనీయమన్నారు. గత చట్టాల్లో లేని ఎన్నో అంశాలను ప్రస్తుత చట్టాల్లో ఏర్పాటు చేశారని చెప్పారు. ముఖ్యంగా మహిళలకు, పిల్లలకు ప్రస్తుతం చట్టాల్లో ఎంతో ప్రాధాన్యతనిచ్చారని పేర్కొన్నారు. టెర్రరిస్టు యాక్టివిటీలు, ఆర్గనైజ్డ్ క్రైం చేసే వారికి కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు.ముఖ్యంగా హిట్ అండ్ రన్ కేసుల్లో ప్రస్తుతం సెక్షన్లలో ప్రమాదానికి కారణమై బాధితులను ఆస్పత్రిలో చేర్చి పోలీసులకు సమాచారం ఇచ్చిన వారికి శిక్ష తగ్గుతుందని.. అలా కాకుండా నిర్లక్ష్యంగా వెళ్లిపోయే వారికి కఠిన శిక్షలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఓయూ లా కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ జీబీ రెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్ కృష్ణమాచారి, లా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
అదనపు సోలిసిటర్ జనరల్ అమన్ లేఖి రాజీనామా
సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అమన్ లేఖి, అదనపు సోలిసిటర్ జనరల్ పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం హడావిడిగా ఆయన తన రాజీనామా లేఖను కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజ్జూకి పంపించారు. తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని ఆయన మంత్రిని కోరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అదనపు సోలిసిటర్ జనరల్ పదవి రాజీనామాకు గల కారణాల్ని ఆయన లేఖలో తెలియజేయలేదు. కేవలం రెండు లైన్ల సందేశంతో ఆయన లెటర్ సమర్పించడం విశేషం. ఆయన తిరిగి ప్రైవేట్ ప్రాక్టీస్ వైపే వెళ్లొచ్చని సన్నిహితులు చెప్తున్నారు. సుప్రీం కోర్టు అదనపు సోలిసిటర్ జనరల్‌గా లేఖి మార్చి, 2018లో నియమించబడ్డారు. జులై 1, 2020న ఆయన్ని తిరిగి నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన పదవీకాలం 2023, జూన్ 30న ముగియాల్సి ఉంది. ఈలోపే ఆయన కారణం చెప్పుకుండా రాజీనామా చేయడం గమనార్హం. అమన్ లేఖి ఏఎస్జీ హోదాలో బోగ్గు కేటాయింపుల స్కామ్, 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల స్కామ్‌లో హాజరయ్యారు. బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి ఈయన భార్యే. -
అదనపు సొలిసిటర్ జనరల్‌గా సూర్యకరణ్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా టి.సూర్యకరణ్‌రెడ్డిని కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ నియమించింది. ఈయన హైదరాబాద్ కేంద్రంగా సదరన్ జోన్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. గతంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. -
'ఆరు వారాలు అశ్లీల చిత్రాలను పరిశీలించండి'
న్యూఢిల్లీ: కండోమ్ ప్యాకెట్ల మీద, వాటికి సంబంధించిన ప్రకటనల్లో మహిళల అసభ్య ఫొటోలను ముద్రిస్తూ, అశ్లీలతతో కూడిన ప్రకటనలు గుప్పిస్తు ప్రజలను చెడుతోవ పట్టిస్తున్నారని పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతుండటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా భావించింది. ఈ విషయంలో కండోమ్ తయారీ కంపెనీలకు, ప్రకటనకర్తలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఆయా ప్రకటనల్లో అశ్లీలతపై పరిశీలన చేయాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఏఎస్ జీ) మనీందర్ సింగ్ ను ఆదేశించింది. వీటిని నియంత్రించేందుకు మీ దగ్గర ఏవైనా ప్రణాళికలు ఉన్నాయా? అని ఏఎస్ జీని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం.. ఆ మేరకు సూచనలు ఇవ్వాలని కోరింది. 'ఆరు వారాలు ఆ ప్రకటనలను నిశితంగా పరిశీలించి అభిప్రాయం చెప్పండి' అని ఏఎస్ జీని సుప్రీం కోరినట్లు పలు జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అయితే ఏఎస్ జీ మనీందర్ సింగ్ కార్యాలయం మాత్రం దీనిపై స్పందించేందుకు విముఖత ప్రదర్శించింది. మంగళవారం సుప్రీం కోర్టు నుంచి ఉత్తర్వులు అందాయని మాత్రం తెలిపింది. మనీందర్ సింగ్ ప్రభుత్వ పరంగా మూడో అత్యున్నత న్యాయాధికారి కావడంతో కాండోమ్ ప్రకటనలపై ఆయన ఎలాంటి సూచనలు చేస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తినెలకొంది. -
అదనపు సొలిసిటర్ జనరల్‌గా లావు నాగేశ్వరరావు
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్‌గా తెలుగువారైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది లావు నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు న్యాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం. ఆయనను ఈ పదవి వరించడం ఇది రెండోసారి. ఎన్డీయే హయాంలో కూడా అదనపు సొలిసిటర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. గుంటూరు జిల్లాలో సాధారణ రైతు కుటుంబంలో నాగేశ్వరరావు జన్మించారు. గుంటూరు ఏసీ కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 1996 వరకు కేసులువాదించిన ఆయన గత 17 ఏళ్లుగా సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేస్తున్నారు.