అదనపు సొలిసిటర్ జనరల్‌గా లావు నాగేశ్వరరావు | L.Nageswararao appointed as additional solicitor general | Sakshi
Sakshi News home page

అదనపు సొలిసిటర్ జనరల్‌గా లావు నాగేశ్వరరావు

Published Tue, Aug 27 2013 6:09 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM

L.Nageswararao appointed as additional solicitor general

సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్‌గా తెలుగువారైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది లావు నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు న్యాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం. ఆయనను ఈ పదవి వరించడం ఇది రెండోసారి. ఎన్డీయే హయాంలో కూడా అదనపు సొలిసిటర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. గుంటూరు జిల్లాలో సాధారణ రైతు కుటుంబంలో నాగేశ్వరరావు జన్మించారు. గుంటూరు ఏసీ కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 1996 వరకు కేసులువాదించిన ఆయన గత 17 ఏళ్లుగా సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement