అదనపు సొలిసిటర్ జనరల్‌గా లావు నాగేశ్వరరావు
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్‌గా తెలుగువారైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది లావు నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు న్యాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం. ఆయనను ఈ పదవి వరించడం ఇది రెండోసారి. ఎన్డీయే హయాంలో కూడా అదనపు సొలిసిటర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. గుంటూరు జిల్లాలో సాధారణ రైతు కుటుంబంలో నాగేశ్వరరావు జన్మించారు. గుంటూరు ఏసీ కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 1996 వరకు కేసులువాదించిన ఆయన గత 17 ఏళ్లుగా సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేస్తున్నారు.