Adultery Relationship
-
వ్యభిచారాన్ని మళ్లీ నేరంగా పరిగణించాలి: ఎంపీ ప్యానెల్
ఢిల్లీ: కొత్త నేర న్యాయ బిల్లులపై సమీక్ష చేపట్టిన పార్లమెంటరీ ప్యానెల్.. కీలక సవరణలు చేసింది. సుప్రీంకోర్టు కొట్టేసిన సెక్షన్ 497(వ్యభిచారం)ని మళ్లీ నేరంగా పరిగణించాలని అంటోంది. వివాహ వ్వవస్థ పవిత్రమైనది దానిని పరిరక్షించాలని పేర్కొంటూ భారతీయ న్యాయ సంహిత బిల్లులపై తన రిపోర్టును కేంద్రానికి సమర్ఫించింది. ప్రతిపాదిత సవరణలో లింగ-తటస్థ (gender-neutral ) నేరంగా పరిగణించాలని నివేదికలో పేర్కొంది. ఈ కేసుల్లో పురుషుడు, మహిళ సమాన బాధ్యత వహించాలని పిలుపునిచ్చింది. భారతీయ న్యాయ సంహితపై తదుపరి పరిశీలన కోసం బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదికను ఒక వేళ పార్లమెంట్ ఆమోదం తెలిపితే.. వివాహేతర సంబంధాలపై 2018 నాటి సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పును పక్కకు పెట్టినట్లవుతుంది. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు.. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో.. భారతీయ న్యాయ సంహిత- 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత- 2023, భారతీయ సాక్ష్య బిల్లు- 2023 లను కేంద్రం తేనుంది. వీటిని పార్లమెంట్లో ప్రవేశపెట్టి.. తదుపరి పరిశీలన కోసం బీజెపి ఎంపీ బ్రిజ్ లాల్ నేతృత్వంలోని హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీకి ఆగస్టులో పంపారు. సుప్రీం తీర్పు.. వివాహేతర సంబంధం నేరం కాదంటూ 2018 సెప్టెంబర్‌లో తీర్పు ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం. ఓ ప్రవాస భారతీయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. వ్యభిచారం నేరంగా పేర్కొంటున్న ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ‘‘మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న సెక్షన్ 497కు కాలం చెల్లింది, అది రాజ్యాంగ విరుద్ధం’’ అని ప్రకటించింది. ఇదీ చదవండి: 377, 497 సెక్షన్లు మళ్లీనా?.. భారతీయ న్యాయ సంహిత బిల్లులో సవరణలతో చేర్చే ప్రతిపాదన! -
ఇష్టపూర్వక శృంగారం నేరం కాదు
-
మీ నంబరు ఆమె వద్ద ఎందుకుంది?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: మొన్న వ్యభిచారం చేస్తూ పట్టుబడిన మహిళ ఫోన్ నంబరుకు మీరు ఎందుకు కాల్ చేశారు? మీరు ఆమె వద్దకు వెళ్లినట్టున్నారు. మీపై కూడా కేసు పెడతాం. ఫలానా నగర్లో దొరికిన మహిళ ఫోన్లో మీ నంబరు ఉంది. అసలు మీ నంబరు ఆమె వద్ద ఎందుకుంది? మీకు, ఆమెకు సంబంధం ఏమిటో విచారణ చేయాలి. ఒక్కసారి స్టేషన్‌కు రండి.. ఇవీ ఈ మధ్య కాలంలో పలువురికి ఓ పోలీసు అధికారి నుంచి వస్తున్న ఫోన్‌కాల్స్ ఇది విచారణలో భాగమే కదా అనుకోవచ్చు. అయితే, కథ ఇంతటితో ఆగడం లేదు. వారి మీద కేసులూ పెట్టడం లేదు. విచారించడమూ లేదు. కేవలం స్టేషన్‌కు పిలిపించుకుని బేరం మాట్లాడుకోవడానికే ఈ తతంగమంతా నడుస్తుండటం మొత్తం కథలో అసలు మలుపు. ఈ విధంగా అనేక మంది వద్ద నుంచి సదరు పోలీసు అధికారి భారీగా వసూలు చేసినట్టు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ విధంగా మామూళ్లు సమర్పించిన వారిలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు చిన్న చిన్న వ్యాపారులు కూడా ఉన్నట్టు సమాచారం. తమ పేరు బయటకొస్తే పరువు పోతుందనే భయంతో బాధితులు ‘తేలు కుట్టిన దొంగల్లా’ ఉండిపోతున్నారు. ఇది కాస్తా సదరు పోలీసు అధికారికి భారీ ఆదాయ వనరుగా ఆమెతో ఎందుకు మాట్లాడారు?మారిపోతోంది. వ్యభిచారం కట్టడి పేరుతో సదరు అధికారి సాగిస్తున్న వసూళ్ల వ్యవహారం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం. ఫోన్ నంబర్ ఉందంటూ... జిల్లాకేంద్రంలోని బస్టాండుతో పాటు వివిధ శివారు కాలనీల్లో వ్యభిచారం నడుస్తోంది. ఇక కొన్ని లాడ్జీలు ఇదే ‘వ్యాపారం’ చేస్తున్నాయి. వీటిపై వచ్చిన ఫిర్యాదులతో పోలీసులు దాడులు చేస్తున్నారు. వ్యభిచారం చేస్తున్న మహిళలతో పాటు విటులనూ పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. సదరు మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు. విటులపై కేసులు నమోదు చేస్తున్నారు. అయితే, కథ ఇక్కడితో ముగియడం లేదు. ప్రధానంగా కాలనీల్లో నడుస్తున్న వ్యవహారంలో మధ్యవర్తులు ఉంటున్నారు. వీరు అమ్మాయిలను సరఫరా చేస్తున్నారు. దాడుల సందర్భంగా పట్టుబడిన మధ్యవర్తులు, అమ్మాయిల ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. వాటిలోని నంబర్లతో పాటు కాల్‌డేటా ఆధారంగా పలువురిని విచారణ పేరుతో పిలుస్తున్నారు. అయితే, ఎక్కడా విచారణ సాగడం లేదు. వ్యభిచారి ఫోన్ నంబరుకు మీరు పదే పదే మాట్లాడారని, మీపై కేసు పెడతామని ఒక పోలీసు అధికారి బెదిరింపులకు దిగుతున్నట్టు తెలుస్తోంది. ఇలా స్టేషన్‌కు వెళ్లిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సదరు పోలీసు అధికారికి భారీ మొత్తంలో సమర్పించుకున్నట్టు సమాచారం. మధ్యవర్తిగా కానిస్టేబుల్ పోలీస్ అధికారి పిలుపు మేరకు బాధితులు స్టేషన్‌కు వెళ్లగానే కథ అసలు మలుపు తిరుగుతోంది. ఆ స్టేషన్‌లోని ఓ కానిస్టేబుల్ వీరితో మాటలు కలిపి.. కేసు కాకుండా ఉండాలంటే కొంత మొత్తం ఇవ్వాలని బేరసారాలు నడుపుతున్నారు. చివరకు ఒక మొత్తం వద్ద ఒప్పందం కుదురుతోంది. ఆ మొత్తాన్ని కానిస్టేబుల్ సదరు పోలీసు అధికారికి చేర్చుతున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు ఒక్కొక్కరు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకూ సమర్పించుకున్నారని సమాచారం. ఈ వ్యవహారం కాస్తా పోలీసు బాస్ దృష్టికి కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. వ్యభిచారంపై విచారణ పేరిట పోలీసు అధికారి సాగిస్తున్న వసూళ్ల వ్యవహారాన్ని ఎలా కట్టడి చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. -
డమ్మీ శవం కోసం బాలిక హత్య
-
డమ్మీ శవం కోసం బాలిక హత్య
జీవితాంతం ప్రియుడితో కలసి ఉండేందుకు దారుణం మహబూబాబాద్ రూరల్: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ మహిళ ఎప్పటికీ.. అతడితోనే ఉండేందుకు దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడి దగ్గర నుంచి కుటుంబీకులు తరచూ వెనక్కి తీసుకొస్తుండడంతో తాను చనిపోయినట్లు అందర్నీ నమ్మించేందుకు ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. ఇందుకోసం అన్నెంపున్నెం తెలియని బాలికకు తన దుస్తులు వేసి హత్య చేసి.. బావిలో పడేసి పరారైంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో జరిగిన ఈ హత్య కేసు మిస్టరీ.. వారం తర్వాత వీడింది. ఆదివారం ఎస్పీ కోటిరెడ్డి ఈ హత్య వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్‌లోని రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన పువ్వల భవ్యకు 15 ఏళ్ల క్రితం తన మేనమామ పూర్ణచందర్‌రావుతో వివాహమైంది. వీరికి కుమార్తె, కుమారుడు. భవ్య బైపాస్ రోడ్డులో చిన్నహోటల్ నడుపుతోంది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తన హోటల్ ఎదురుగా ఉన్న అమ్మా ట్రాన్స్‌పోర్టుకు వచ్చే విజయవాడ పడమటకు చెందిన జంగిలి శ్రీనివాస్‌తో భవ్యకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. భవ్య విజయవాడ వెళ్లి ప్రియుడితోనే ఉంటోంది. ఆమె భవ్య కుటుంబ సభ్యులు విజయవాడ వెళ్లి భవ్యను తీసుకొచ్చారు. అయినా భవ్య విజయవాడకు వెళ్లి వస్తోంది. ఈ క్రమంలోనే తన పోలికలతో ఉండే మరో మహిళను చంపేసి తాను చనిపోయినట్లు నమ్మించాలని భవ్య భావించి శ్రీనివాస్‌తో చెప్పింది. ఈ నెల 13న తన హోటల్‌కు చాక్లెట్ కోసం వచ్చిన ఓర్సు అనూష(8)పై భవ్య కన్ను పడింది. ఆమెకు మాయమాటలు చెప్పి తన నైటీ ఇచ్చి, ఆమెను వేసుకోమంది. అనం తరం ఇంట్లోకి తీసుకెళ్లి కర్రతో అనూష తలపై బాదడంతో స్పృహతప్పి పడిపోయింది. ఆ తర్వాత అనూషపై భవ్య కిరోసిన్ చల్లి నిప్పంటించింది. పెద్దమ్మ విజయలక్ష్మితో కలసి భవ్య... శవాన్ని సంచిలో మూటకట్టి ఆటోలో తీసుకెళ్లి ఈదులపూసపల్లి నల్లాల బావిలో పడేసింది. తర్వాత భవ్య నేరుగా విజయవాడకు వెళ్లి తన ప్రియుడు శ్రీనివాస్ తో జరిగిన విషయం చెప్పింది. అదృశ్యమైన బాలిక తల్లిదండ్రులు 13న పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఈ నెల 16న మహబూబాబాద్ మండలంలోని ఈదులపూసపల్లి గ్రామశివారులోగల నల్లాల బావిలో అనూష మృతదేహం పోలీసులకు లభ్యమైంది. ఈ మృతదేహం అనూషదిగా తొలుత పోలీసులు పోల్చుకోలేకపోయారు. ఫోరెన్సిక్ నిపుణుల ప్రాథమిక నివేదిక, బాలిక తల్లిదండ్రుల వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. భవ్య, జంగిలి శ్రీనివాస్, కస్తూరి విజయలక్ష్మి ఈ హత్య కేసులో నిందితులుగా తేలడంతో... వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
గొంతు కోసి, కాళ్లు నరికి..
మహిళను హత్యచేసి గోనె సంచిలో కుక్కిన దుండగుడు నంగునూరు: మహిళ గొంతు కోసి, కాళ్లు నరికి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాలలో జరిగింది. గట్లమల్యాల గ్రామానికి చెందిన దండ్ల రాజు కువైట్ వెళ్లడంతో భార్య లావణ్య (28) ముగ్గురు పిల్లలతో కలసి గ్రామంలో ఉంటోంది. ఆదివారం రాత్రి బహిర్భూమికని వెళ్లిన లావణ్య.. తిరిగి రాకపోవడంతో కాలనీవాసులు చుట్టుపక్కల వెతికారు. గ్రామ శివారులో ఉన్న చెరువు వద్ద లావణ్య మృతదేహం కనిపించింది. తల, రెండు పాదాలు నరికి చెరువు గుంతలోని చెట్లపొదల్లో పడేశారు. పోలీసులు డాగ్‌స్క్వాడ్స్‌ను రప్పించగా.. చెరువు వద్దకు వెళ్లి ఆగిపోయాయి. క్లూస్‌టీం సభ్యులు ఆనవాళ్లను సేకరించారు. కాగా, అదే గ్రామానికి చెందిన రంగు పర్శరాములుగౌడ్‌తో లావణ్యకు వివాహేతర సంబంధం ఉందని, అతడే దారుణంగా హత్య చేశాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. పర్శరాములును కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబాన్ని ఆ దుకోవాలని డిమాండ్ చేస్తూ మృతదేహాన్ని తరలించకుండా పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. మృతురాలి కూతురు అంజలి, కుమారులు గణేశ్, శివను ప్రభుత్వపరంగా అన్ని విధాలా ఆదుకుంటామని సిద్దిపేట ఆర్డీవో ముత్యంరెడ్డి హామీ ఇవ్వడం తో వారు శాంతించారు. కాగా, పర్శరాములుగౌడ్ లైంగికదాడి చేసి ఆభరణాల కోసం హత్య చేసినట్లు కేసు నమోదు చేశారు. -
నీటిలో ముంచి శిశువును హత్య చేసిన తల్లి
హైదరాబాద్: అప్పుడే పుట్టిన శిశువును ఓ తల్లి బకెట్‌లోని నీటిలో ముంచి హత్యకు పాల్పడింది. అవివాహిత అయిన ఆమెకు వివాహేతర సంబంధం వల్ల శిశువు జన్మించడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా మణుగూరుకు చెందిన జి.హేమజ (22) మూడు రోజుల క్రితం గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని కాకతీయ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా ఉద్యోగంలో చేరింది. విధుల్లో ఉన్న హేమజకు సోమవారం రాత్రి 1.30 గంటలకు బాత్రూమ్లో డెలివరీ అయ్యింది. శిశువు ఏడుపు వినిపించడంతో స్టాఫ్‌నర్సు కృష్ణమ్మ బాత్రూమ్ తలుపు తట్టింది. ఎంతకూ గడియ తీయని హేమజ తనకు జన్మించిన మగ శిశువును బకెట్ నీటిలో ముంచి చంపేసింది. ఎట్టకేలకు బాత్రూమ్ డోర్ తెరిపించి చూడగా డెలివరీ కాగానే శిశువును హత్య చేసిందని గుర్తించి, కాకతీయ ఆస్పత్రి జీఎం చంద్ర మధుసూదన్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృత శిశువును ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హేమజ కాకతీయ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివాహేతర సంబంధం కారణంగానే శిశువు జన్మించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. హేమజ తల్లిదండ్రులకు సమాచారం అందించామని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.