agetation
-
నక్సల్స్ బాధిత పోలీసు కుటుంబాల ర్యాలీ
కృష్ణలంక : ఒడిశా, ఆంధ్ర సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ పౌరహక్కుల సంఘాల ఆధ్వర్యంలో గవర్నర్‌పేటలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశాన్ని వ్యతిరేకిస్తూ నక్సల్స్ బాధిత పోలీస్ కుటుంబాలు, వారి సానుభుతిపరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు బందర్‌రోడ్డుపై శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. బ్యానర్లు ప్రదర్శించి పౌరహక్కుల సంఘాల నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మావోయిస్టులు చనిపోతే పౌరహక్కుల ఉల్లంఘన అంటూ మాట్లాడే పౌరహక్కుల సంఘాల నాయకులు పోలీసులు చనిపోయినప్పుడు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. అమాయక గిరిజనులను అడ్డంపెట్టుకుని ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్న మావోయిస్టులను వెనుకేసుకొచ్చి మాట్లాడటం పౌరహక్కుల సంఘాల నేతలకు తగదన్నారు. తొలుత మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం నుంచి పెద్ద సంఖ్యలో నక్సల్స్ బాధిత పోలీసు కుటుంబాల సభ్యులు ర్యాలీగా బందరురోడ్డుపైకి చేరుకుని, రోడ్డు పక్కన నిరసన శిబిరంలో కూర్చున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ నిరసన కొనసాగింది. ఒక పక్క పౌరహక్కుల సంఘాల సమావేశం, మరోపక్క నక్సల్స్ బాధిత కుటుంబాలు నిరసన కార్యక్రమం చేపట్టడంతో రాఘవయ్యపార్కు వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. -
అగ్రిగోల్డ్ డెయిరీ లాకౌట్
లక్ష్మీనగర్ (ద్వారకాతిరుమల) : ద్వారకాతిరుమల మండలం లక్ష్మీనగర్‌లోని అగ్రిగోల్డ్ పాల డెయిరీ యూనిట్‌ను ఆ సంస్థ యాజమాన్యం గురువారం అర్ధరాత్రి లాకౌట్ ప్రకటించింది. దీంతో కార్మికులు రోడ్డున పడ్డారు. శుక్రవారం ఉదయం రోజూలాగే పనికి వెళ్లిన కార్మికులకు ఫ్యాక్టరీని మూసివేశామని యాజమాన్యం ప్రకటించింది. దీంతో సంస్థ యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ కార్మికులు డెయిరీ వద్ద ఆందోళనకు దిగారు. డెయిరీ ఫామ్‌ను మూసివేయడంతో తామంతా ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా డెయిరీ యూనిట్‌ను మూసివేశామంటే తాము ఏమై పోవాలని కార్మికులు యాజమాన్యాన్ని ప్రశ్నించారు. రోడ్డున పడిన 70 కుటుంబాలు మారంపల్లి పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురంలో అగ్రిగోల్డ్ సంస్థ 10 ఏళ్ల క్రితం డెయిరీ యూనిట్‌ను స్థాపించింది. అగ్రిగోల్డ్ అమృతవర్షిణి పేరుతో పాలు, ఇతర పదార్థాలు తయారవుతున్నాయి. ఇక్కడ ప్రస్తుతం 70 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా సమీపంలోని దూబచర్ల, గంటావారిగూడెం, లక్ష్మీనగర్, కప్పలకుంట, మహదేవపురం, గుణ్ణంపల్లి, బుట్టాయిగూడెం, భీమడోలు తదితర గ్రామాలకు చెందిన వారు. వీరితో పాటు నాలుగు నెలల క్రితం కీసరిలోని అగ్రిగోల్డ్ ఫ్యాక్టరీ ఇదే విధంగా మూతపడటంతో అక్కడి నుంచి ఇక్కడ పనిచేసేందుకు కొందరు కార్మికులు వచ్చారు. యాజమాన్య నిర్ణయం కారణంగా వారంతా ఉపాధి కోల్పోయారు. హెరిటేజ్‌కు లాభం చేకూర్చడానికేనా? అగ్రిగోల్డ్ సంస్థపై పలు కేసులు కోర్టులో నడుస్తున్నాయి. అయితే పాల డెయిరీ యూనిట్లు చాలాకాలంగా లాభాల్లోనే ఉన్నాయి. ఆ సంస్థ ఆస్తులకు సంబంధించి కేసులు ఉన్నా పాల కేంద్రాలు మాత్రం యథావిధిగా నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థకు లాభం చేకూర్చేవిధంగా రాష్ట్రంలోని ఇతర సంస్థలకు చెందిన పాల కేంద్రాలను దెబ్బతీసేందుకు కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ డెయిరీలను ఒక్కొక్కటిగా మూయించివేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మా పరిస్థితి ఏంటి .. అకస్మాత్తుగా ఫ్యాక్టరీని మూసివేశామంటే దీనిపైనే ఆధారపడి జీవి స్తున్న మా పరిస్థితి ఏంటి? మా గురించి ఆలోచించకుండా యాజ మాన్యం తీసుకున్న నిర్ణయం వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. – ఎన్.వాసు, కార్మికుడు ప్రత్యామ్నాయం చూపాలి.. ఇప్పటి వరకు మా కష్టంతో డెయిరీని నడిపాం. ఉన్నట్టుండి ఫ్యాక్టరీని మూసివేశామని యాజమాన్యం మాకు ప్రత్యామ్నాయం చూపకుండా చేతులు దులుపుకుంది. వెంటనే మాకు న్యాయం చేయాలి. – యు.రాజేష్, కార్మికుడు ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నాం .. దాదాపు పది సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా. ఇప్పుడు పనిలేదని చెబితే దీనిపైనే ఆధారపడి బతుకుతున్న నా కుటుంబ పరిస్థితి ఏమిటి. ముందస్తు సమాచారం ఇవ్వకుండా మూసేసి నట్టేట ముంచారు. – వి.కృష్ణవేణి, కార్మికురాలు -
న్యాయవాదుల నిరసన
అలంపూర్: జోగుళాంబ జిల్లా పేరుతో గద్వాలను జిల్లాకేంద్రం చేయాలని చేపట్టిన 72 గంటల బంద్ శుక్రవారం సంపూర్ణంగా కొనసాగింది. అఖిలపక్ష కమిటీ పిలుపు మేరకు పట్టణంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలు, వ్యాపారదుకాణాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు. పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టు న్యాయవాదులు శుక్రవారం విధులు బహిష్కరించారు. అన్ని వసతులు ఉ్న గద్వాలను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రంలో న్యాయవాదులు రాజేశ్వరి, సురేష్ కుమార్, తిమ్మారెడ్డి, నాగరాజు యాదవ్, మహేష్ యాదవ్, మహేష్ ఉన్నారు. -
ఓపెన్ వర్సిటీ సమాధాన పత్రాలు చింపివేత
ఆందోళనలో 15 మంది డిగ్రీ విద్యార్థులు చేతులెత్తేసిన యూనివర్సిటీ అధికారులు ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన 15 మంది విద్యార్థుల సమాధాన పత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు చింపి వేయడంతో విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోయే పరిస్థితి నెలకొంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినట్లే జూన్ 7 నుంచి 12 వరకు డిగ్రీ వివిధ గ్రూపులలో ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఆర్మూర్ సెంటర్ కోఆర్డినేటర్ రాజ పర్యవేక్షణలో ప్రథమ సంవత్సరంలో 230 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 240 మంది విద్యార్థులు, తృతీయ సంవత్సరంలో 144 మంది విద్యార్థులు పరీక్షలు రాసారు. ఎంపీసీ తృతీయ సంవత్సరానికి చెందిన విద్యార్థుల్లో కొందరు ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు సైతం రాసారు. పరీక్షల సమయంలో యూనివర్సిటీ నుంచి వచ్చిన అబ్జర్వర్ బాబూరావ్ ఆధ్వర్యంలో విద్యార్థులు రాసిన సమాధాన పత్రాలను లక్కతో సీల్ వేసి మరుసటి రోజు యూనివర్సిటీకి పోస్టు ద్వారా పంపిస్తారు. తృతీయ సంవత్సరం పూర్తవడంతో ఇక తమ డిగ్రీ పూర్తయినట్లే నని ఆనందంగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఎదురు దెబ్బ తగిలింది. జూన్ 30న ఓపెన్ యూనివర్సిటీ వారు విడుదల చేసిన ఫలితాలలో ఎంపీసీకి చెందిన 15 మంది విద్యార్థుల పేర్లు గల్లంతయ్యాయి. ఆందోళన చెందిన విద్యార్థులు ఓపెన్ యూనివర్సిటీ డిస్ట్రిక్ కోఆర్డినేటర్ సమ్మయ్యను, హైదరాబాద్‌లోని యూనివర్సిటీ కార్యాలయానికి వెళ్లి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ (సీవోఈ) ఏవీఎన్ రెడ్డి, రిజిస్ట్రార్ వెంకటయ్యను కలిసి తమ సమస్యను వివరించారు. మీ 15 సమాధాన పత్రాలలో మీరు రాసిన పేపర్లు చింపి వేసి ఉన్నాయి కాబట్టి మీ రిజల్ట్స్ రాలేవని వారు సమాధానం చెప్పారు. ఈ 15 మందిలో ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ రాసిన వారి సమాధాన పత్రాలు సైతం చింపివేసి ఉన్నాయని తెలిపారు. దీంతో ఎవరు తమ సమాధాన పత్రాలు చింపి వేసారు. ఇలా అయితే తాము మరో విద్యా సంవత్సరం వృథా కావాల్సి వస్తుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేయగా యూనివర్సిటీ అధికారులు విచారణకు కమిటీ వేసాము. సమాధాన పత్రాలను ఆర్మూర్ స్టడీ సెంటర్లోనే చింపి వేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసారు. విచారణ చేసినా మీకు మాత్రం న్యాయం జరిగే ప్రసక్తే లేదంటూ యూనివర్సిటీ అధికారులు సెలవిచ్చారు. దీంతో వారంతా ఆర్మూర్ పట్టణంలోని స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ రాజ, క్లర్క్ శ్యాంతో బుధవారం వాగ్విదానికి దిగారు. పూర్తి స్థాయి విచారణ జరిపి దోషులను గుర్తించి వారిని శిక్షించడమే కాకుండా తమకు న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేసారు.