Amanchi Venkata Subrahmanyam
-
నా కాలేయం ఇచ్చి బతికించా.. చివరకు నా చేతుల్లోనే ప్రాణం..: ఏవీఎస్ కూతురు
కమెడియన్‌గా తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక పేరు సంపాదించుకున్నాడు ఏవీఎస్. ఆయన పూర్తి పేరు ఆమంచి వెంకటసుబ్రహ్మణ్యం. రంగస్థల కళాకారుడిగా, మిమిక్రీ ఆర్టిస్టుగా, జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్న ఆయన మిస్టర్ పెళ్లాం చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే నంది అవార్డు అందుకున్నాడు. మాయలోడు, మా విడాకులు, శుభలగ్నం, ఘటోత్కచుడు, శుభలగ్నం, యమలీల, సమరసింహారెడ్డి, ఇంద్ర, యమగోల మల్లీ మొదలైంది.. ఇలా ఎన్నో చిత్రాలు చేశాడు. దాదాపు 500 చిత్రాల్లో నటించి ప్రేక్షక హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. 2013లో ఏవీఎస్ మరణించాడు.ఇటీవలే అమ్మ కూడా..తాజాగా ఏవీఎస్ (AVS) కూతురు శాంతి- అల్లుడు చింటూ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా శాంతి (Comedian AVS Daughter Shanthi) మాట్లాడుతూ.. మా నాన్న 57 ఏళ్ల వయసులో మరణించాడు. అమ్మ 62 ఏళ్ల వయసులో (గతేడాది నవంబర్లోనే) కన్నుమూసింది. నిరంతరం షూటింగ్‌లోనే ఉంటూ నిద్రను పట్టించుకోకపోవడం వల్లే నాన్న ఆరోగ్యం దెబ్బతింది. కానీ బయటి వారు మాత్రం తాగడం వల్లే ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడని అపోహపడుతుంటారు.మందు అలవాటే లేదుమాది బ్రాహ్మణ కుటుంబం. నాన్న ఎగ్ కూడా తినేవారు కాదు. ఎగ్ ఉంటుందని కేక్ కూడా ముట్టుకోరు. సోడా కూడా పెద్దగా తాగకపోయేవారు. మందు జోలికి వెళ్లిందే లేదు. కానీ 2008లో నాన్న కాలేయం పాడైపోయింది. రక్తపు వాంతులు చేసుకున్నాడు. డాక్టర్స్ ఆయన్ను పరీక్షించి కాలేయం మార్పిడి చేయాలన్నారు. నేను కాలేయం ఇవ్వడానికి రెడీ అయ్యా.. కానీ లావుగా ఉన్నానని నాది సెట్టవదన్నారు. (చదవండి: సౌత్ సినిమాతో హీరోయిన్గా పరిచయం.. ఇప్పుడు దేశంలోనే టాప్!)1% మాత్రమే బతికే ఛాన్స్దాత దొరకాలంటే ఏడాది పడుతుందన్నారు. నాకేం అర్థం కాలేదు. ఏం చేయాలో తోచలేదు. ఇంతలో సడన్‌గా ఆయన జ్ఞాపకశక్తి కోల్పోయారు. మా అమ్మను కూడా గుర్తు పట్టలేదు. కేవలం నా ఒక్క పేరు మాత్రమే గుర్తుంది. నాన్న బతకడానికి ఒక్క శాతమే ఛాన్స్ ఉందన్నారు. ఆయన్ను ఐసీయూలో ఉంచి మమ్మల్ని ఇంటికి వెళ్లిపోమన్నారు. రాత్రంతా నిద్రపోకుండా దేవుడికి దండం పెట్టుకుంటూనే ఉన్నాం. తర్వాతి రోజు ఉదయం 6.30 గంటలకు నాన్న స్వయంగా కాల్ చేశాడు. నా భర్తే ఒప్పించాడుఎవరూ రాలేదేంట్రా? ఇక్కడ నేను ఒక్కడినే ఉన్నాను అని మాట్లాడాడు. ఒక్క రాత్రిలో తనకు పోయిన జ్ఞాపకశక్తి ఎలా తిరిగొచ్చిందో అర్థం కాలేదు. అయితే 20 రోజుల్లో కాలేయం ఆపరేషన్ చేయాలన్నారు. దాతల కోసం వెతికేంత సమయం లేదని నేనే రెడీ అయ్యాను. నాకు ఆరోగ్య పరీక్షలు చేసి అంతా బాగుందన్నారు. కానీ, నాన్న ఒప్పుకోలేదు. భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయమోనని సందేహించాడు. అప్పుడు నా భర్తే దగ్గరుండి తనను ఒప్పించాడు. ఆయన సరే చెప్పేందుకు వారం రోజులు పట్టింది. (చదవండి: ఈ విషయం తెలిసుంటే 'బేబీ జాన్'లో నటించేదానినే కాదు: కీర్తి సురేష్)ఆరు నెలలు విశ్రాంతి తీసుకోమంటే..అలా నా కాలేయంలో 60 శాతం దానం చేశాను. ఆపరేషన్ తర్వాత నా శరీరంలో రక్తకణాల సంఖ్య పడిపోవడంతో ఒకరోజంతా అపస్మారక స్థితిలో ఉన్నాను. ప్లేట్లెట్స్ ఎక్కించడంతో కోలుకున్నాను. ఆపరేషన్ తర్వాత కనీసం ఆరు నెలలైనా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు నాన్నకు సూచించారు. కానీ ఆయన వింటేగా! ఆపరేషన్ అయిన రెండో నెలకే మళ్లీ పనిలో పడిపోయాడు. సరిగా విశ్రాంతి తీసుకోలేదు.నా చేతిలో ప్రాణం పోయిందికాలేయం పెరగడం కోసం దాదాపు నాలుగేళ్లు గ్యాప్ ఇచ్చాక పిల్లల్ని ప్లాన్ చేసుకున్నాం. నాకు పిల్లలు పుడతారో, లేదోనని నాన్న భయపడిపోయాడు. అలాంటిది నాకు పాప పుట్టగానే నాన్న సంతోషంతో ఏడ్చేశాడు. ఆపరేషన్ అయిన ఆరేళ్లకు నాన్న పరిస్థితి విషమించి నా చేతిలోనే రక్తం కక్కుకుని చనిపోయాడు. ఆపరేషన్‌కు రూ.65 లక్షలదాకా ఖర్చయింది. అప్పుడు తెలుగు ఇండస్ట్రీ (Tollywood) చాలా సపోర్ట్ చేసింది అని శాంతి చెప్పుకొచ్చింది.చదవండి: క్లీంకారను అప్పుడే అందరికీ చూపిస్తా!: రామ్‌చరణ్ -
ఏవీఎస్ ఇకలేరు
తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన హాస్యనటుడు కాలేయం, మూత్రపిండాలకు తీవ్ర ఇన్ఫెక్షన్ సాక్షి, హైదరాబాద్: ప్రముఖ తెలుగు హాస్యనటుడు ఏవీఎస్ శుక్రవారం రాత్రి తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. వయసు 56 సంవత్సరాలు. స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. హైదరాబాద్‌లోని మణికొండలో నివసిస్తున్న ఏవీఎస్‌కు భార్య ఆశ, కుమారుడు ప్రదీప్, కూతురు ప్రశాంతి ఉన్నారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఏవీఎస్‌ను పది రోజుల కిందట చికిత్స కోసం గ్లోబల్ ఆస్పత్రిలో చేర్పించారు. కాలేయంలో తీవ్ర ఇన్ఫెక్షన్తో పాటు మూత్రపిండాలు పాడైపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పది రోజుల నుంచి ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకపోవటంతో శుక్రవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. హైదరాబాద్ మణికొండ పంచాయతీ పరిధిలోని శివాజీనగర్ కాలనీలో గల దేవులపల్లి అపార్ట్మెంట్లో ఆయన స్వగృహానికి తరలించారు. ఏవీఎస్ రాత్రి 8.05 నిమిషాల ప్రాంతంలో కన్నుమూశారు. ఆయనకు 2008లో కాలేయం పాడైపోగా.. అప్పట్లో గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఏవీఎస్ కుమార్తె శ్రీప్రశాంతి ఆయనకు లివర్‌ను దానం చేశారు. శస్త్రచికిత్స తర్వాత కోలుకున్న ఆయన మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. ఐదేళ ్లపాటు ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే నటనే ప్రాణంగా బతుకుతున్న ఏవీఎస్ వేళకు మందులు వేసుకోకపోవడం, సమయానికి వైద్యుడిని సంప్రదించకపోవడం వంటి కారణాలతో కాలేయంలో ఇటీవల మళ్లీ ఇన్ఫెక్షన్ వ చ్చింది. మళ్లీ ఆస్పత్రిలో చికిత్స అందించినప్పటికీ.. ఇన్ఫెక్షన్ తగ్గకపోగా మూత్రపిండాలపై కూడా ప్రభావం పడింది. మూత్రపిండాలు కూడా పాడైపోవడంతో డయాలసిస్ చేస్తున్నారు. ఏవీఎస్‌కు మళ్లీ కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేసినా ఫలితం ఉండదని, కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయారని, ఇక తాము ఏమీ చేయలేమని ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు చెప్పారు. దీంతో బంధువులు ఆయన్ను శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లారు. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నాక తనను చూసేందుకు వచ్చిన వారితో ఏవీఎస్ మాట్లాడారు. ఆ తర్వాత కొద్ది గంటలకే ఆయన కన్నుమూశారు. ప్రముఖుల నివాళులు: పాత్రికేయుడు, హాస్యనటుడు, రచయిత, నిర్మాత, దర్శకుడిగా బహుముఖ ప్రతిభాశాలి అయిన ఏవీఎస్ మరణంతో మణికొండలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయనను చివరిసారిగా పరామర్శించిన వారిలో సినీ ప్రముఖులు మురళీమోహన్‌తో పాటు శివకృష్ణ, పరుచూరి గోపాలకృష్ణ, జయలలిత, అశోక్‌కుమార్, మహర్షి ఉన్నారు. ఏవీఎస్ మరణం విషయం తెలుసుకుని సినీనటులు సాయికుమార్, ఆలి, ఉత్తేజ్ లు నివాళులర్పించారు. పార్లమెంటు సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఏవీఎస్ మృతికి కిరణ్, బాబు, చిరంజీవి విచారం ఏవీఎస్ మృతి పట్ల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఏవీఎస్ ఉత్తమ నటుడని, తన ప్రతిభతో ఎన్నో అవార్డులు గెలుచుకున్నారని సీఎం పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఏవీఎస్ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏవీఎస్ మృతి సినీ ప్రపంచానికి తీరనిలోటని కేంద్ర మంత్రి చిరంజీవి సంతాపం వ్యక్తంచేశారు. రాష్ట్ర మంత్రి డీకే అరుణ ఏవీఎస్ కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు. జర్నలిస్టుల ఉద్యమంలో ఏవీఎస్ ఎనలేని కృషి చేశారని స్మరించుకున్నారు. పాత్రికేయుల హక్కుల కోసం ఆయన పోరాటం చేశారని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు సోమసుందర్, ప్రధాన కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిడి సోమయ్యలు సంతాపం తెలిపారు. కళా రంగానికి తీరని లోటు: జగన్ సంతాపం హాస్యనటుడు ఏవీఎస్ మరణం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఏవీఎస్ మరణం కళా, సాంస్కృతిక రంగాలకు తీరనిలోటన్నారు. జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన ఏవీఎస్ సినీరంగంలో స్థిరపడి, తన నటనతో తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొన్నారని కీర్తించారు. ఏవీఎస్ మృతి సినిమా రంగానికి తీరని లోటంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
ప్రముఖ హాస్య నటుడు ఏవీఎస్ ఇకలేరు
-
హాస్య నటుడు ఏవీఎస్ ఇకలేరు
ప్రముఖ దర్శకుడు బాపు రూపొందించిన 'మిస్టర్ పెళ్లాం' చిత్రంతో 1993లో తెలుగు చిత్ర సీమకు పరిచయమైన ఏవీఎస్ దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించారు.ఏవీఎస్ మృతిపట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారుశుభలగ్నం, యమలీల, సమర సింహారెడ్డి, 'ఇంద్ర', 'కంటే కూతర్నే కను' లాంటి చిత్రాల్లో ఆయన ఉత్తమ నటన ప్రదర్శించారు.సూపర్ హీరోస్, అంకుల్, ఓరి నీ ప్రేమ బంగారం కాను, కోతిమూక, రూమ్ మేట్స్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. -
ప్రముఖ హాస్య నటుడు ఏవీఎస్ ఇకలేరు
ప్రముఖ హాస్య నటుడు ఏవీఎస్ శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఏవీఎస్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఏవీఎస్ కు గత కొద్దిరోజులుగా గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితిలో మార్పులేకపోగా.. మరింత క్షీణించడంతో వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు ఈ మధ్యాహ్నం ఆయనను ఇంటికి తీసుకెళ్లారు. గతంలో ఏవీఎస్ కు కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తగా ఆయన కుమార్తె కాలేయ దానం చేశారు. దాంతో కొద్ది రోజులు ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. తాజాగా మళ్లీ ఆయన ఆరోగ్యం విషమంగా మారండంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రముఖ దర్శకుడు బాపు రూపొందించిన 'మిస్టర్ పెళ్లాం' చిత్రంతో 1993లో తెలుగు చిత్ర సీమకు పరిచయమైన ఏవీఎస్ దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించారు. తుత్తి అనే పదం ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులకు ఆయన సుపరిచితులు. కోట శ్రీనివాసరావు, అలీ, బ్రహ్మానందం లాంటి ప్రముఖ హస్య నటులతో సమానంగా ఏవీఎస్ రాణించారు. ఆయన నటించిన తొలి చిత్రం 'మిస్టర్ పెళ్లాం' లో ఉత్తమ ప్రదర్శనకు నంది అవార్డు లభించింది. హస్య నటుడే కాక, దర్శకుడిగా పనిచేశారు. శుభలగ్నం, యమలీల, సమర సింహారెడ్డి, 'ఇంద్ర', 'కంటే కూతర్నే కను' లాంటి చిత్రాల్లో ఆయన ఉత్తమ నటన ప్రదర్శించారు. సూపర్ హీరోస్, అంకుల్, ఓరి నీ ప్రేమ బంగారం కాను, కోతిమూక, రూమ్ మేట్స్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. పాత్రికేయుడిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఏవీఎస్, ఆ తర్వాత సినీరంగంలోకి అడుగుపెట్టారు. కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత కూడా ఆయన తన కలానికి పదును పెడుతూనే ఉన్నారు. తరచు దినపత్రికలలో ఆయన పేరు కనిపిస్తుంటుంది. ఏవీఎస్ మృతిపట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలుగు చిత్రసీమ ప్రముఖ హాస్యనటుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
నటుడు ఏవీఎస్ ఆరోగ్యం విషమం
-
నటుడు ఏవీఎస్ కు అస్వస్థత
ప్రముఖ నటుడు ఆమంచి వెంకట సుబ్రమణ్యం(ఏవీఎస్) తీవ్ర అస్వస్థతకు గురయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొద్దికాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గతంలో ఏవీఎస్ కు కాలేయ మార్పిడి చికిత్స జరిగింది. ఏవీఎస్ కు ఆయన కూతురు కాలేయ దానం చేశారు. దాంతో ఆయన ఆరోగ్యం కుదుటపడింది. తాజాగా మళ్లీ ఆయన ఆరోగ్యం విషమించడంతో గ్లోబల్ ఆస్పత్రిలో గత వారం రోజులుగా చికిత్స అందిస్తున్నారు. వైద్యులు సూచించడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం మధ్యాహ్నం ఏవీఎస్ ను ఆయన నివాసానికి తీసుకెళ్లారు. ప్రముఖ దర్శకుడు బాపు రూపొందించిన 'మిస్టర్ పెళ్లాం' చిత్రంతో తుత్తి అనే పదం ద్వారా 1993లో తెలుగు చిత్ర సీమకు పరిచయమైన ఏవీఎస్ 400 పైగా చిత్రాల్లో నటించారు. కోట శ్రీనివాసరావు, ఆలీ, బ్రహ్మనందం లాంటి ప్రముఖ హస్య నటులతో సమానంగా ఏవీఎస్ రాణించారు. శుభలగ్నం, యమలీల, సమర సింహారెడ్డి, ఇంద్ర, కంటే కూతర్నే కను' లాంటి చిత్రాల్లో ఆయన ఉత్తమ నటన ప్రదర్శించారు. సూపర్ హీరోస్, అంకుల్, ఓర్ని ప్రేమ బంగారం కాను, కోతిమూక, రూమ్ మెట్స్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. -
నటుడు ఎవిఎస్ కు తీవ్ర అస్వస్థత