ambarpet
-
తన హత్యకు తానే గొయ్యి తీసుకున్నాడు
అంబర్‌పేట : గుప్త నిధుల ఆశ అతని ప్రాణం తీసింది. హత్యకు గురయ్యే వరకు అతను గుప్త నిధుల మైకంలోనే ఉన్నాడు. తనను పూడ్చిపెట్టేందుకు గొయ్యి తీయడంలోనూ నిందితులకు సహాయపడ్డాడు. తననే గోతిలో వేసి హత్య చేస్తారని పసిగట్టలేక పోయాడు.30 రోజులు తర్వాత హత్య కేసులో మిస్టరీ వీడిన సంఘటన అంబర్‌పేట పోలీసు స్టేషన్ పరిదిలో గురువారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నంద్యాల సమీపంలోని కోడిమామిళ్లకు చెందిన చంద్రశేఖర్(47) దివ్యాంగుడు బతుకు దెరువు నిమిత్తం భార్య వరలక్ష్మితో నగరానికి వలసవచ్చి అంబర్‌పేట చెన్నారెడ్డి నగర్లో ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం అతడికి రైలులో సుల్తాన్ బజార్ సీఎస్‌లో హోం గార్డుగా పని చేస్తున్న గిద్దలూరుకు చెందిన వెంకటరామిరెడ్డితో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. తరచూ చంద్రశేఖర్ ఇంటికి వచ్చి వెళేకల వెంకటరామిరెడ్డి, చంద్రశేఖర్ భార్య వరలక్ష్మితో వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. దీనిని పసిగట్టిన చంద్రశేఖర్ భార్యను మందలించాడు. బంధువుల వద్ద పంచాయితీ పెట్టడంతో వరలక్ష్మి ఈ విషయాన్ని వెంకటరామిరెడ్డి చెప్పడంతో ఇద్దరూ కలిసి చంద్రశేఖర్ హత్యకు పథకం రచించారు. గుప్త నిధుల బలహీనత ఆసరాగా... చంద్రశేఖర్‌కు గుప్త నిధుల ఆశ ఉన్నట్లు తెలుసుకున్న వెంకటరామిరెడ్డి గత నెల జనవరి 11న అతడిని మంచాల పోలీసు స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతాలోకి తీసుకువెళ్లి అక్కడ గుప్త నిధులు ఉన్నట్లు చెప్పడంతో ఇద్దరూ కలిసి గొయ్యి తవ్వారు. అనంతరం అదే నెల 13న నిధులను తీసుకుందామని అదే ప్రాంతానికి తీసుకెళ్లాడు. పథకంలో భాగంగా వెంకటరామిరెడ్డి తన బంధువు రమేష్‌రెడ్డిని ఎల్బీ నగర్‌కు పిలుపించుకున్నాడు. ముగ్గురు కలిసి అక్కడే మద్యం కోనుగోలు చేసి ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న చంద్రశేఖర్‌ను హత్య చేసి, మంచాల పోలీసు స్టేషన్ పరిధిలో గోతిలో పుడ్చిపెట్టారు. తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు... అనంతరం చంద్రశేఖర్ భార్య వరలక్ష్మి తన భర్త కనిపించడం లేదని జనవరి 24న అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వరలక్ష్మి, ఆమె ప్రియుడు వెంకటరామిరెడ్డిపై చంద్రశేఖర్ బంధువులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. వెంకటరామిరెడ్డిని సంఘటనా స్థలానికి తీసుకెళ్లి పూడ్చిపెట్టి మృత దేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన నగరంలోని అంబర్‌పేట, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం, మంచాల పోలీసు స్టేషన్ల పరిధిలో చోటు చేసుకోవడం గమనార్హం. -
అంబర్‌పేటలో విషాదం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని అంబర్పేట్, ప్రేమనగర్లో విషాదం చోటు చేసుకుంది. భవన నిర్మాణ పనుల్లో ప్రమాదవశాతతూ గోడ కూలి ఇద్దరు మృతి చెందారు. మరొకరికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అనుమతులు లేకుండా ఓ కంపెనీ నిర్మాణాలు చేపడుతున్నట్లుగా ఈ ఘటన చోసుకుంది. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భవన యజమాని పరారీలో ఉండగా గాలింపు చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
అంబర్‌పేటలో ఐదుగురు విద్యార్థినుల అదృశ్యం
-
యువతిపై సామూహిక లైంగికదాడి
-
యువతిపై సామూహిక లైంగికదాడి
హైదరాబాద్: ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు లైంగిక దాడి చేసి పరారైన సంఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం పెద్ద అంబర్‌పేట శాంతినగర్‌కు చెందిన ఓ యువతి(20) చింతల్‌కుంటలోని ఎల్పీటీలో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సుమారు 9.45గంటల సమయంలో విధులు ముగించుకుని ఇంటికి వచ్చే క్రమంలో జాతీయ రహదారిపై శాంతినగర్ కాలనీ వద్ద బస్సు దిగి కాలనీకి నడుచుకుంటూ వెళ్తుండగా ఏపీ29టీవీ6595 నెంబర్ గల కారులో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి యువతిని బలవంతంగా కారులోకి లాక్కుని గ్రామ శివారుకు తీసుకువెళ్లి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే ఈ విషయాన్ని గమనించిన కాలనీవాసి పలువురుకి సమాచారం అందించారు. వారంతా కారు వెళ్లిన ప్రాంతానికి వెళ్లగా దుండగులు కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. అయితే అప్పటికే వారు యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: కుటుంబ కలహాలతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నగరంలోని అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న ఓ పదో తరగతి విద్యార్థిని కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రావెల్స్ బస్సు- ఢీసీఎం ఢీ: ఇద్దరు మృతి
హైదరాబాద్: హయత్‌నగర్ మండలం వద్ద అంబర్‌పేట్‌లో ఆదివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ప్రైవేటు ట్రావెల్ బస్సు డ్రైవర్, క్లీనర్ మృతిచెందగా, మరో 14మందికి తీవ్రగాయాలయ్యాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ప్రియాంక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (ఏపీ 10v 2255) ఎదురుగా వస్తున్న ఢీసీఎంను ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. తీవ్రగాయాలైన వారి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. -
అన్నను హతమార్చిన సోదరుడు
మెదక్ : మెదక్ జిల్లా వర్గల్ మండలం అంబర్‌పేటలో దారుణం జరిగింది. రక్తం పంచుకు పుట్టిన అన్ననే....సోదరుడు హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కుటుంబ కలహాల కారణంగా తమ్ముడు... తన సోదరుడిని గొడ్డలితో నరికి చంపాడు. కాగా మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అంబర్‌పేటలో కిషన్ రెడ్డి ఆధిక్యం
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. అంబర్‌పేట నుంచి బరిలోకి దిగిన ఆయన సమీప టీఆర్ఎస్ ప్రత్యర్థిపై దూసుకు వెళుతున్నారు. కాగా కూకట్పల్లి, ఉప్పల్ మేడ్చల్ లో ఇంకా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు.