amit saha
-
Lok sabha elections 2024: గిర్ సఫారీలో... మళ్లీ వార్ వన్‌సైడే!
ఏ ఆటగాడైనా సొంత పిచ్‌పై బరిలోకి దిగితే ప్రత్యర్థులకు చుక్కలే. మరి అలాంటిది దేశాన్ని నడిపిస్తున్న కెప్టెన్, వైస్ కెప్టెన్ తమ సొంత రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో స్కెచ్ గీస్తే పరిస్థితి ఎలా ఉంటుంది! వార్ వన్‌సైడే! గుజరాత్లో గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో అక్షరాలా అదే జరిగింది. రాష్ట్రంలో మొత్తం 26 లోక్‌సభ స్థానాలనూ 2014, 2019 ఎన్నికల్లో విపక్షాలకు ఒక్కటీ దక్కకుండా క్లీన్‌బౌల్డ్ చేశారు మోదీ, అమిత్ షా. ఒకప్పుడు కాంగ్రెస్‌కు పట్టున్న ఈ పశ్చిమ రాష్ట్రం మోదీ రాకతో పూర్తిగా కమలనాథుల గుప్పెట్లోకి వెళ్లిపోయింది. ఈసారీ క్లీన్‌స్వీప్ చేసి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న కాషాయదళాన్ని కాంగ్రెస్ ఏ మేరకు అడ్డుకుంటుందన్నది ఆసక్తికరం... స్టేట్స్కాన్గుజరాత్లో ఎన్నికలేవైనా బీజేపీ దెబ్బకు పారీ్టలన్నీ చుక్కలు లెక్కబెడుతున్నాయి. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఒంటరిగా పోటీ చేసి మొత్తం సీట్లు తమ ఖాతాలో వేసేసుకుంది. 2009లో 11 సీట్లు గెలిచి బీజేపీకి గట్టి పోటీ ఇచి్చన హస్తానికి ఆ తర్వాత రాష్ట్రం నుంచి లోక్‌సభలో పదేళ్లుగా ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. 2019 ఎన్నికల్లోనైతే ఇరు పారీ్టల ఓట్ల శాతంలో ఏకంగా 30 శాతానికి పైగా అంతరముండటం విశేషం. బీజేపీకి 62.21 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 32.11 దక్కాయి మిగతా పారీ్టలేవీ ఇక్కడ పెద్దగా సోదిలో లేవు. గత ఎన్నికల్లో 25 చోట్ల పోటీ చేసిన బీఎస్పీకి నోటా కంటే తక్కువ ఓట్లు పడ్డాయి!కాంగ్రెస్.. ‘ఇండియా’ పోటీనిచ్చేనా!గుజరాత్లో ఎంతో కొంత పుంజుకోవడానికి కాంగ్రెస్ ఆపసోపాలు పడుతూనే ఉంది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 60 సీట్లు కోల్పోయి 17కు పరిమితమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా 5 సీట్లు గెలుచుకుని రాష్ట్రంలో భవిష్యత్తుకు పునాదులు వేసుకుంది. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా కాంగ్రెస్ 24 చోట్ల పోటీ చేస్తుండగా భావనగర్, బారుచ్ స్థానాల్లో ఆప్ బరిలో ఉంది. రైతులు, యువత, మహిళలు, ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలపై ఇండియా కూటమి హామీల వర్షం కురిపిస్తోంది. వాటినే ప్రచారాస్త్రాలుగా మలచుకుంటోంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలోనూ వాటికే పెద్దపీట వేయడం తెలిసిందే. మోదీ హయాంలో దేశవ్యాప్తంగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం చుక్కలనంటాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నారు. పేదల పొట్టగొట్టి అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు దోచిపెడుతున్నారంటూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ప్రభావం గుజరాత్లో ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. విపక్షాలపై బీజేపీ కక్షగట్టి నేతలను వరుసగా జైలుపాలు చేస్తోందన్న ఇండియా కూటమి ప్రచారం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. సోనియా, రాహుల్, ప్రియాంకతో పాటు కాంగ్రెస్ నుంచి 40 మంది స్టార్ క్యాంపెయినర్లు గుజరాత్లో ప్రచారం చేస్తున్నారు. ఆప్ తరఫున కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఆప్ కీలక నేతలు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తదితరులు కూడా రంగంలోకి దిగారు.కమలం బోణీ! గుజరాత్లో ఇంకా పోలింగైనా జరగకుండానే తొలి ‘కమలం’ విరబూసింది! కాషాయదళం బోణీ కొట్టేసింది. సూరత్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభనీని ప్రతిపాదించిన నేతల సంతకాల్లో తేడా ఉండటంతో నామినేషన్ తిరస్కరణకు గురవడమే ఇందుకు కారణం. కాంగ్రెస్ ప్రత్యామ్నాయ అభ్యర్థి సురేశ్ పడ్సాలా నామినేషన్ కూడా పలు కారణాలతో తిరస్కరణకు గురైంది. ఆ వెంటనే పోటీలో ఉన్న ఇతర పారీ్టల అభ్యర్థులంతా నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దాంతో ముకేశ్ ఏకగ్రీవంగా గెలుపొందినట్లు ఈసీ ప్రకటించింది. సర్వేలన్నీ కమలం వైపే దాదాపు అన్ని సర్వేలూ బీజేపీకే జై కొడుతున్నాయి. ఈసారి కూడా మొత్తం సీట్లను చేజిక్కించుకుని హ్యాట్రిక్ కొడుతుందని అంచనా వేయడం విశేషం.బీజేపీ సమరోత్సాహం...గుజరాత్లో రాజకీయం మోదీకి ముందు, తర్వాత అన్నట్టుగా మారిపోయింది. బీజేపీ దిగ్గజ నేత కేశూభాయ్ పటేల్ అనారోగ్యం, ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలతో 2001 అక్టోబర్‌లో మోదీ అనూహ్యంగా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఏడాదికే 2002 నాటి గోద్రా రైలు దహనంలో 60 మంది కరసేవకుల మరణం మతకల్లోలాలకు దారి తీసి రాష్ట్రాన్ని కుదిపేసింది. సీఎంగా వాటి అదుపులో మోదీ వైఫల్యంపై తీవ్ర విమర్శలు చివరికి అసెంబ్లీ రద్దుకు దారితీశాయి. అయితే హిందుత్వ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు మోదీ. ఆ తర్వాత కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమి కేంద్రంలో పదేళ్లు అధికారంలో కొనసాగినా గుజరాత్లో మోదీ పీఠాన్ని మాత్రం కదపలేకపోయింది. అద్వానీకి ప్రత్యామ్నాయంగా 2013లో ఎన్డీఏ ప్రధాని అభ్యరి్థగా మోదీ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్‌లోని వడోదరతో పాటు వ్యూహాత్మకంగా యూపీలోని వారణాసి నుంచీ పోటీ చేసి రెండింటా ఘనవిజయం సాధించారు. బీజేపీకి ఒంటి చేత్తో మెజారిటీ దక్కించి ప్రధాని పగ్గాలు చేపట్టారు.మోదీకి సేనాపతిగా పేరొందిన అమిత్ షా కూడా గుజరాత్లో బీజేపీ పాతుకుపోవడంలో కీలకంగా నిలిచారు. 2001 నుంచి 2014 దాకా గుజరాత్ సీఎంగా చక్రం తిప్పిన మోదీ ప్రధానిగా కూడా రాష్ట్రాభివృద్ధిపై బాగా దృష్టి పెట్టారు. దాంతో గుజరాత్ ఆర్థిక వ్యవస్థ పరుగులు తీసింది. అయినా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీగా పుంజుకుంది. కానీ 2022 ఎన్నికల్లో మళ్లీ చతికిలపడింది. 182 సీట్లకు బీజేపీ ఏకంగా 156 స్థానాలతో దుమ్మురేపింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లోనూ కమలనాథులు అభివృద్ధి అజెండాతో పాటు అయోధ్య రామమందిర సాకారం తదితర అంశాలను బలంగా ప్రచారం చేస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అమిత్ షా విమర్శలకు అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్
-
మోదీని కలిసిన సింధియా
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ రాజకీయం మంగళవారం కొత్తమలుపు తిరిగింది. 17 మందిఎమ్మెల్యేలతో క్యాంపు నిర్వహిస్తోన్న కాంగ్రెస్ పార్టీ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం ప్రధాని నరేంద్రమోదీని కలిశారు.ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లిన ఆయన ముందుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ప్రధానిని కలిశారు. దీంతో మధ్యప్రదేశ్ రాజకీయం అత్యంత ఆసక్తిగా మారింది. సింధియా బీజేపీలో చేరుతారని..రాజ్యసభ సభ్యత్వంతో పాటు కేంద్ర కేబినెట్లో ఆయనకు చోటు కల్పించనున్నారని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఆయన మోదీని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. (చదవండి : ‘సింధియాకు స్వైన్ ప్లూ వచ్చింది’) కాగా, కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ 17 మంది ఎమ్మెల్యేలు సోమవారం తిరుగుబావుటా ఎగరేసిన విషయం తెలిసిందే. వీరంతా సింధియాకు మద్దతుగా ఇప్పటికే బెంగళూరులోని ఓ రిసార్టులో ఉన్నారు. వీరిని సంప్రందించేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ వారు టచ్‌లోకి రావడంలేదు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న కమల్‌నాథ్ పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని సోమవారం రాత్రి భోపాల్ చేరుకున్నారు. వెంటనే దిగ్విజయ్‌సింగ్ తదితర సీనియర్ నేతలతో తన నివాసంలో రెండు గంటలపాటు అత్యవసర సమాలోచనలు జరిపారు. రాత్రి 10 గంటలకు కేబినెట్ భేటీ ఏర్పాటుచేసి, వివిధ పరిణామాలపై చర్చించారు. అనంతరం, హాజరైన 22 మంది మంత్రులు రాజీనామా చేశారు. (చదవండి : కమల్ సర్కార్‌లో సింధియా చిచ్చు) దీంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమమైంది. ఫలితంగా అసంతృప్త ఎమ్మెల్యేలకు పదవులు దక్కే అవకాశం ఉంది. బెంగళూరు రిసార్టులో ఉన్న సింధియా వర్గం ఎమ్మెల్యేలంతా తిరిగి వస్తారని కమల్‌నాథ్ శిబిరం చెబుతోంది. సింధియాను శాంతింపజేసేందుకు పీసీసీ అధ్యక్ష పదవి లేదా రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు. మరోవైపు, సింధియా బీజేపీలో చేరతారని.. ఆయనకు రాజ్యసభ సభ్యత్వంతోపాటు కేంద్ర కేబినెట్లో చోటు దక్కే అవకాశాలున్నాయని ఊహాగానాలు వస్తున్నాయి -
‘అనంత’ టీడీపీ నేతలు కమలం గూటికి!
సాక్షి ప్రతినిధి, అనంతపురం రాయలసీమకు చెందిన పలువురు టీడీపీ కీలక నేతలు త్వరలో బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్, పరిటాల కుటుంబం, పల్లె రఘునాథరెడ్డి, వరదాపురం సూరి తదితరులు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం ఇప్పటికే వీరితో సంప్రదింపులు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో చేరిక తేదీని ఖరారు చేసుకుని త్వరలోనే వీరు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎదుట కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది. రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన.. ఈ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో టీడీపీ కోలుకోలేని విధంగా దెబ్బతింది. 14 అసెంబ్లీ స్థానాలకుగానూ 12 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. హిందూపురం, ఉరవకొండలో మాత్రమే నందమూరి బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ గెలుపొందారు. 2 పార్లమెంట్ స్థానాల్లో వైఎస్సార్ సీపీ విజయ బావుటా ఎగురవేసింది. ఒకపక్క చంద్రబాబు విశ్వసనీయత కోల్పోవడం, మరోవైపు లోకేష్ సామర్థ్యంపై నమ్మకం లేని టీడీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై కలవరం చెందుతున్నారు. బంపర్ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ సుదీర్ఘకాలం అధికారంలో ఉండటం ఖాయమనే అంచనాకు వచ్చిన టీడీపీ నేతలు ప్రత్యామ్నాయం దిశగా అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీని వీడి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పుట్టపర్తి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యేలు కూడా.. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి కూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీరితో కూడా రాంమాధవ్ చర్చలు జరిపినట్లు సమాచారం. జేసీ బ్రదర్స్ చేరిక తర్వాత వీరు పార్టీలో చేరే అవకాశం ఉంది. ఈ నెల 23 లేదా 27న వీరు బీజేపీలో చేరతారని తెలుస్తోంది. ముందు వరుసలో జేసీ బ్రదర్స్ టీడీపీని వీడి బీజేపీలో చేరనున్న నేతల్లో జేసీ బ్రదర్స్ మొదటి వరుసలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో జేసీ సోదరులు రాజకీయాల నుంచి తప్పుకుని వారసులను బరిలోకి దింపినా వారూ ఓటమి పాలయ్యారు. తమ కుమారులతో చర్చించిన జేసీ బ్రదర్స్ టీడీపీకి ఇక భవిష్యత్తు లేదని, తిరిగి అధికారంలోకి రావడం అసంభవం అనే నిర్ధారణకు వచ్చారు. దీంతో తమ వారసులను బీజేపీలోకి పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో ఇప్పటికే చర్చలు కూడా ముగిసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 12న అమిత్‌షా ఎదుట వీరు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అపాయింట్మెంట్ లభించకుంటే త్వరలోనే మరో తేదీ ఖరారు చేసుకుని బీజేపీలో చేరే అవకాశం ఉంది. పరిటాల కుటుంబంతో చర్చలు సఫలం పరిటాల కుటుంబం రాజకీయ జీవితం టీడీపీతోనే మొదలైంది. 2005లో పరిటాల రవీంద్ర హత్య అనంతరం ఆయన సతీమణి సునీత రాజకీయాల్లోకి వచ్చారు. ఈ దఫా ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ పోటీ చేసి ఓటమి చవిచూశారు. బీజేపీలో చేరేందుకు వీరు కూడా సంప్రదింపులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్నందున హఠాత్తుగా పార్టీ మారితే నియోజకవర్గంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి? కేడర్ తమతో వస్తుందా? రాదా? అనే సందిగ్ధంలో ఉన్నారు. దీంతో పార్టీ కేడర్‌ను ఒప్పించి బీజేపీలో చేరాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జేసీ బ్రదర్స్, పల్లె, సూరి చేరికల తర్వాత పరిటాల కుటుంబం బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన నేతలు కూడా టీడీపీలో కొనసాగే పరిస్థితి లేదని, వారు కూడా ఎవరిదారి వారు చూసుకుంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. -
చెన్నూర్‌లో టికెట్టు కోసం పోటాపోటీ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వచ్చే ఎన్నికల్లో కింగ్ కాకపోయినా... కింగ్ మేకర్ అవ్వాలని కలలుగంటున్న భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పాగా కోసం కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలలో ఒంటరిగా పోటీచేసి అనూహ్య విజయాలను సొంతం చేసుకోవాలనే ఆలోచనతో నాయకులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. గతంలో గట్టి పోటీ ఇచ్చిన స్థానాలతో పాటు కొన్ని నియోజకవర్గాల్లో కొత్తగా వచ్చిన నాయకత్వంతో అద్భుత విజయాలు సాధిస్తామనే ధీమా కమల నేతల్లో కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాల జోడి దేశంలోని పలు రాష్ట్రాల్లో సాధించిన విజయాల పరంపరలో తెలంగాణ రాష్ట్రం కూడా చేరితే తమకు ఎదురులేదని టికెట్లు ఆశిస్తున్న ఆశావహులు భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా ఆశావహుల జాబితాను రాష్ట్ర నాయకత్వం సిద్ధం చేసుకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో పోటీకి సంబంధించిన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసినట్లు సమాచారం. వచ్చే వారంలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి మరింత స్పష్టత రానున్నట్లు జిల్లా నేతలు చెపుతున్నారు. అమిత్‌షా రాష్ట్ర పర్యటనతో కొత్తగా పార్టీలోకి వలసలు పెరగడం కలిసి వచ్చే అదృష్టంగా బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఈసారి పోటీ చేస్తే మోదీ, అమిత్‌షా కలిసి చేసే ప్రచారం వల్ల గట్టెక్కినా ఆశ్చర్యపోనక్కరలేదని నాయకులు భావిస్తున్నారు. పది సీట్లలో పోటీకి నిర్ణయం రాష్ట్రంలో ఈసారి ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్న బీజేపీ నేతలు అందుకు అనుగుణంగా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలిపేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయనుంది. 2014 ఎన్నికల్లో మిత్రపక్షం టీడీపీతో కలిసి పోటీ చేసిన బీజేపీ ఆదిలాబాద్, ముధోల్ నియోజకవర్గాల్లో 14వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. అప్పట్లో టీడీపీతో పొత్తే తమ కొంప ముంచిందని భావిస్తున్న బీజేపీ నేతలు ఈసారి ఒంటరిగా పోటీచేసి ఈ రెండు సీట్లతో పాటు మరో మూడింట విజయం సాధించాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆదిలాబాద్, ముధోల్తో పాటు ఈసారి మంచిర్యాల, నిర్మల్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో సైతం గెలుపు అవకాశాలు ఉన్నాయని పార్టీ భావిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల విషయంలో చేసే తప్పులను అనుకూలంగా మలుచుకొంటూ ముందుకు సాగాలని నిర్ణయించినట్లు నాయకుడొకరు చెప్పారు. అందుకే ఎవరు పోటీ చేయబోతున్నారో తెలిసినా, కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన తరువాతే బీజేపీ అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది. మంచిర్యాలలో తెరపైకి ఎన్నారై మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి గత ఎన్నికల్లో మంచిర్యాల స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా ఆయనే పోటీ చేయాలని భావించగా, కొత్తగా రఘునాథరావు అనే ఓ ఎన్నారై తెరమీదికి వచ్చినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో రాజకీయంగా బలమైన ఓ సామాజిక వర్గానికి చెందిన ఈయనను కొందరు మంచిర్యాలలో పోటీకి సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే పార్టీ కోసం గత కొన్నేళ్లుగా సేవలందిస్తున్న మల్లారెడ్డి మాత్రం తనకే సీటు అనే ధీమాతో ఉన్నారు. ఆయనతో పాటు పార్టీ సీనియర్ నాయకుడు గోలి రాము కూడా టికెట్టు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. చెన్నూర్‌లోనూ తీవ్ర పోటీ చెన్నూర్ నియోజకవర్గంలో పోటీకి పలువురు నాయకులు ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రాం వేణుతో పాటు 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన అందుగుల శ్రీనివాస్ టికెట్టు వేటలో ముందున్నారు. బీజేపీ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తూ పలుమార్లు అభ్యర్థిగా పోటీ చేసిన ఆరుమల్ల పోషం, మరో నాయకుడు రొడ్డ మోహన్ కూడా టికెట్టు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. బోథ్ నియోజకవర్గంలో గతంలో ఆదిలాబాద్ జెడ్పీటీసీగా పనిచేసిన మడావి రాజుతో పాటు నానాజీ టికెట్టు కోసం పోటీ పడుతున్నారు. ఎస్టీ రిజర్వుడ్ ఖానాపూర్‌లో ప్రస్తుతానికి పండూరి ప్రభాకర్ అభ్యర్థిగా భావిస్తున్నప్పటికీ, ఇక్కడ నెలకొన్న రాజకీయ పరిణామాలలో ఏ మార్పులైనా జరిగే అవకాశం ఉంది. ఆరుగురు అభ్యర్థులు ఖరారైనట్టే! బీజేపీకి సంబంధించి ఉమ్మడి జిల్లాలోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు ఖరారైనట్టే. ఆదిలాబాద్ నియోజకవర్గంలో పాయల్ శంకర్, ముధోల్‌లో పడకంటి రమాదేవి గత ఎన్నికల్లో విజయానికి కొద్ది దూరంలో నిలిచారు. ఈసారి కూడా వీరే పోటీలో నిలవనున్నారు. నిర్మల్‌లో మాజీ డిప్యూటీ స్పీకర్ భీంరెడ్డి కూతురు డాక్టర్ స్వర్ణారెడ్డి ఇటీవలే బీజేపీలో చేరడంతో పోటీ చేయడం ఖరారైంది. ఇప్పటికే ఇక్కడ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎ.మహేశ్వర్‌రెడ్డిల మధ్య గట్టి పోటీ నెలకొనగా, అదే సామాజిక వర్గానికి చెందిన స్వర్ణారెడ్డి బీజేపీ అభ్యర్థిగా నిలువనుండడం గమనార్హం. సిర్పూర్లో డాక్టర్ శ్రీనివాస్ ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటనలు, పాదయాత్రలు, ప్రచారంతో ముందుకు సాగుతున్నారు. శ్రీనివాస్‌కు టికెట్టు ఖరారైనట్టే. ఆసిఫాబాద్ నియోజకవర్గంపై కూడా దృష్టి పెట్టిన బీజేపీ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి 25వేల ఓట్లు సాధించిన మర్సుకోల సరస్వతిని బరిలో నిలపాలని నిర్ణయించింది. అయితే ఆమె ఇంకా బీజేపీ తీర్థం పుచ్చుకోలేదు. జిల్లా కేంద్రం ఆసిఫాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచిగా మొన్నటి వరకున్న ఆమె ప్రస్తుత ఎమ్మెల్యే కోవ లక్ష్మికి స్వయానా సోదరి. ఆదివాసీ అభ్యర్థుల పోరులో సరస్వతికి విజయావకాశాలు ఉంటాయని బీజేపీ అంచనా వేస్తోంది. టీఆర్ఎస్ ఆసిఫాబాద్ జెడ్పీటీసీగా గెలిచి, రాష్ట్ర జెడ్పీటీసీల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న కొయ్యల ఏమాజీ ఏడాది క్రితమే టీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో పోటీ చేయడమే లక్ష్యంగా ఆయన గత కొన్ని నెలలుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆయనకే అధిష్టానం కూడా టికెట్టు ఖరారు చేయనుందనడంలో సందేహం లేదు. ఈ ఆరింట అభ్యర్థులు మారే అవకాశాలు లేవని పార్టీ వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. -
2017 రౌండప్: బీజేపీ రాత మార్చిన ‘ఏడు’
కొన్నిసార్లు రాజకీయ పార్టీలకు బాగా కలిసి వస్తాయి.. మరికొన్నిసార్లు ఊహించని స్థాయిలో వైఫల్యాలు ఎదురవుతుంటాయి. మరికొద్ది రోజుల్లో చరిత్రలో కలిసిపోతున్న 2017 సంవత్సరం భారతీయ జనతా పార్టీకి ఘన విజయాలు అందించింది. ఈ ఏడాది జరిగిన ఏడు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో నాలుగుచోట్ల జయకేతనం ఎగరేసింది. రెండుచోట్ల బొటాబొటీ మెజారిటీ వచ్చినా అనూహ్యంగా అధికారాన్ని కైవసం చేసుకుంది. ఒక్క పంజాబ్‌ను మినహాయిస్తే ఆరింటిలో అధికారంలోకి వచ్చింది. ఈ ఏడాది కాంగ్రెస్‌కు అశనిపాతమే అని చెప్పాలి. పంజాబ్‌లో అధికారంలోకి వచ్చినా.. రెండు రాష్ట్రాల్లో పెద్ద పార్టీగా నిలిచినా ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయింది. అలాగే అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌ను బీజేపీకి అప్పగించింది. భారతీయ జనతాపార్టీ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత.. ఇంతలా కలిసి వచ్చిన ఏడాది లేదనే చెప్పాలి. సాధారణ ఎన్నికలతో పాటు జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్, హర్యానా, మహరాష్ట్ర, జార్ఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లో అధికారంలోకి రాగా, ఆంధ్రప్రదేశ్‌లో సంకీర్ణ భాగస్వామిగా అధికారాన్నిపంచుకుంది. ఇక 2015లో జరిగిన ఢిల్లీ, బిహార్ ఎన్నికల్లో బీజేపీ దారుణ ఓటములను చవిచూసింది. 2016లో కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుడిచ్చేరి ఎన్నికల్లోనూ కాషాయ పార్టీకి చేదు ఫలితాలే వచ్చాయి. ఫెమాఖండూ పార్టీ మారడంతో.. అరుణాచల్ ప్రదేశ్‌ను బీజేపీ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో 2017లో జరిగిన గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, మణిపూర్లలో అధికారం దక్కించుకుంది. అలాగే బిహార్‌లో జరిగిన రాజకీయ మార్పులతో.. అధికార కూటమిలో భాగస్వామిగా మారింది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఒక్క పంజాబ్‌లో మాత్రమే బీజేపీ ఓటమి పాలైంది. శిరోమణి అకాళీదళ్‌తో కలిసి పోటీ చేసిన కమలం పార్టీకి ఇక్కడ చుక్కెదురైంది. బీజేపీ బిగ్ 7 భారతీయ జనతా పార్టీ దేశమంతా విస్తరించింది.. 2017లోనే. ఈ ఏడాది విజయాలతో బీజేపీ దేశంలోని సంకీర్ణ ప్రభుత్వాలతో కలుపుకుని.. మొత్తం 19 రాష్ట్రాల్లోకి అధికారంలోకి రాగలిగింది. ఉత్తరప్రదేశ్ : బీజేపీకి కొత్త ఊపు, శక్తిని ఇచ్చి ఎన్నిక ఇది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 325 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలను నామమాత్రపు స్థాయికి పరిమితం చేసింది. పెద్ద నోట్ల రద్దు తరువాత జరిగిన ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్మాత్మకంగా మారింది. ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన లేకుండా ఎన్నికలకు బీజేపీ వెళ్లినా ప్రజలు మాత్రం తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. తరువాత యోగి ఆదిత్యనాథ్‌ను బీజేపీ ముఖ్యమంత్రిగా పార్టీ ఎంపిక చేసింది. ఉత్తరాఖండ్ 2017 వరకూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం. ముఖ్యమంత్రిగా హరీష్ రావత్ వ్యహరిస్తున్నారు. 2017లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 69 స్థానాలున్న ఉత్తరాఖండ్ శాసనసభలో.. 57 చోట్ల బీజేపీ విజయదుందుభి మోగించింది. ప్రస్తుతం త్రివేంద్ర సింగ్ రావత్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. గోవా గోవా శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీజేపీని పక్కన పెట్టారు. 2012లో గోవాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2014లో కేంద్రంలోనూ బీజేపీ అధికారంలోకి రావడంతో.. అప్పటి వరకూ గోవా ముఖ్యమంత్రిగా వ్యహరిస్తున్న మనోహర్ పరీకర్‌ను మోదీ.. రక్షణ మంత్రిగా కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నారు. దీంతో పరీకర్ స్థానంలో లక్ష్మీకాంత్ పర్సేకర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పర్సేకర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో.. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గి రెండో స్థానంలో నిలించింది. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్రాన్ని కైవసం చేసుకుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మనోహర్ పరీకర్ తిరిగి గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మణిపూర్ : మణిపూర్‌లో రాష్ట్రంలోనూ ప్రజలు ఏ పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీకి 21 సీట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో 11 మంది స్వతంత్రులను కలుపుకుని బీరేన్ సింగ్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హిమాచల్ ప్రదేశ్ హిమాలయ రాష్ట్రంలో వీరభద్రసింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ ఏడాది ఆఖర్లో జరిగిన ఎన్నికల్లో.. ఈ రాష్ట్రాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. మొత్తం 68 స్థానాల్లో బీజేపీ 44 చోట్ల విజయం సాధించింది. గుజరాత్ బీజేపీ కంచుకోటగా ఈ రాష్ట్రాన్ని చెప్పుకోవాలి. వరుసగా 5 పర్యాయాల నుంచి ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది. తాజా ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించడంతో.. వరుసగా ఆరోసారి గుజరాత్లో బీజేపీ అధికారంలోకి వచ్చినట్లు అయింది. ఇక్కడ బీజేపీకి గతంతో పోలిస్తే సీట్లు తగ్గాయి. బిహర్ బిహార్ శాసనసభకు 2015లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తీవ్ర వైఫల్యాన్ని మూటగట్టుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాకూటమి ఘన విజయం సాధించింది. అయితే.. సరిగ్గా రెండేళ్లు కూడా తిరగముందే నితీష్ కుమార్ మహాకూటమి నుంచి బయటకు వచ్చి.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో అప్పటి వరకూ కాంగ్రెస్, జేడీయూలు అధికార కూటమిలో ఉండగా.. ప్రస్తుతం అవి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. -
'టీఆర్ఎస్ దరఖాస్తు చేసుకోలేదు'
కేంద్రంలో చేరికపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆ పార్టీ నుంచి వినతి వస్తే ఆలోచిస్తాం రాష్ట్రంలో ఒంటరిగానే బలోపేతం అవుతాం ఏపీ, తెలంగాణ మధ్య వివక్ష లేదు రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం మోదీ పాలనలో భారత్ పేరు ప్రపంచమంతా మార్మోగుతోంది సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రివర్గంలో చేరుతామని టీఆర్ఎస్ ఇప్పటిదాకా దరఖాస్తు చేసుకోలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. టీఆర్ఎస్ నుంచి వినతి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకోవాలా లేదా అన్న విషయంపై ఆలోచిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘వికాసపర్వం’ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన అమిత్‌షా ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే బలోపేతం అవుతుందని, రాష్ట్రంలో పార్టీ విస్తరించడానికి అనువైన పరిస్థితులున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం ఉందన్నారు. ఇప్పుడు ఎన్నికలు లేనందున పొత్తుల ప్రస్తావన కూడా లేదని వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం 14వ ఆర్థిక సంఘం ముందుందని పేర్కొన్నారు. ఇప్పటిదాకా ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినా.. ఏపీకి అదే స్థాయిలో నిధులిచ్చి అభివృద్ధికి సహకరిస్తున్నామని చెప్పారు. ఏపీ, తెలంగాణ మధ్య మిగతా ఎలాంటి వివక్ష లేకుండా, రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తున్నామన్నారు. ప్రపంచంలో భారత్ పేరు మర్మోగిపోతోంది ప్రధానిగా నరేంద్రమోదీ రెండేళ్లు పూర్తి చేసుకున్నారని, ఈ రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా భారత్ పేరు మార్మోగిపోతోందని అమిత్ షా అన్నారు. భారత్ వైపు ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయని, ప్రధాని పనితీరు, సమర్థత, ముందుచూపే అందుకు కారణమని వివరించారు. అవినీతికి ఆస్కారం లేకుండా రెండేళ్ల పాలన స్వచ్ఛంగా ఉందని చెప్పారు. ఈ రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచుతున్నామని, దేశవ్యాప్తంగా 200 ప్రెస్మీట్లు పెడుతున్నామని తెలిపారు. ‘‘కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా గ్రామాల్లో ఉంటూ ప్రచారం చేస్తారు. కాంగ్రెస్ నేతలు అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారు. వారి అక్కసు సహజమే. వారు విమర్శలకు బదులు ప్రశంసలు చేస్తారని మేం ఆశించడం లేదు. ఇప్పుడు దేశానికి సమర్థవంతమైన, పని చేయగలిగే ప్రధాని ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలంతా మంత్రులే. ఒక్క ప్రధాని తప్ప అంతా ప్రధానమంత్రులే’’ అని షా ఎద్దేవా చేశారు. యూపీఏ హయాంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి గత ప్రభుత్వం మాదిరి కాకుండా తమ ప్రభుత్వం ప్రతీ అంశంలో ఒక స్పష్టతతో పనిచేస్తోందని అమిత్‌షా అన్నారు. ప్రధానిగా మోదీ కన్నా మన్మోహన్సింగ్ ఎక్కువ దేశాల్లో పర్యటించారని చెప్పారు. అయితే ప్రధానిగా మన్మోహన్ పర్యటనను విదేశాలు పట్టించుకోలేదని, మోదీ విదేశాలకు వెళ్తే రెడ్‌కార్పెట్ స్వాగతాలు పలుకుతున్నాయని వ్యాఖ్యానించారు. యూపీఏలో హయాంలో ప్రధాని అసమర్థత వల్ల ప్రభుత్వ విధానాల్లో పక్షవాతం వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పాలసీలు అప్పటి ప్రధానికి కూడా తెలిసేవి కావన్నారు. ఆ పదేళ్లలో రూ.12 లక్షల కోట్ల అవినీతి, కుంభకోణాలు జరిగాయన్నారు. అట్టడుగు స్థాయికి పథకాలు.. మోదీ చేపడుతున్న కార్యక్రమాలు దేశంలోని రైతులు, యువత, మహిళలు, పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. పట్టణాలు, పల్లెల మధ్య వ్యత్యాసం లేకుండా సమాంతర అభివృద్ధి జరుగుతోందన్నారు. గ్రామాల విద్యుద్దీకరణ, పేద మహిళలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు, కిసాన్ బీమా, ముద్రా బ్యాంకు, సుకన్య యోజన, భేటీ బచావో-బేటీ పడావో వంటి పథకాలు అట్టడుగు స్థాయికి చేరుతున్నాయన్నారు. యూరియా కొరత లేకుండా చేశామని, బ్లాక్ మార్కెట్లను నియంత్రించామని చెప్పారు. నల్లధనం వెనక్కి తీసుకురావడానికి ఇప్పటి దాకా కాంగ్రెస్ పార్టీయే అడ్డుపడిందన్నారు. అయినా బ్లాక్‌మనీ వెనక్కి తీసుకురావడానికి ఇప్పటికే చాలా పని జరిగిందని, త్వరలోనే తీసుకొస్తామని చెప్పారు. దళితులకు గుడి ప్రవేశాన్ని అడ్డుకోవడం దుర్మార్గమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, హన్స్‌రాజ్ గంగారాం అహిర్, బీజేఎల్పీ నాయకులు జి.కిషన్ రెడ్డి పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో అమిత్‌షాకి ఘనస్వాగతం