Amrith scheme
-
బల్దియాకు బహుమానం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల కోసం బాండ్ల జారీ ద్వారా రూ.200 కోట్లు సేకరించినందుకు ప్రోత్సాహకంగా రూ.26 కోట్ల చెక్కును ప్రధాని మోదీ.. మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డికి అందజేశారు. లక్నోలో శనివారం 2 రోజుల ‘ట్రాన్స్ఫార్మింగ్ అర్బన్ ల్యాండ్ స్కేపింగ్’ సదస్సు ముగింపు సందర్భంగా అమృత్ పథకం కింద ఈ బహుమతిని, ప్రత్యేక ప్రశంసాపత్రాన్ని అందజేశారు. మేయర్, కమిషనర్.. ప్రధానికి స్వచ్ఛ నమ స్కారం అంటూ గౌరవిస్తూ ప్రత్యేకత చూపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మం త్రులు రాజ్‌నాథ్ సింగ్, హరిదీప్‌సింగ్, గవర్నర్ రాంలాల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ‘సింగం చెరువు’ లబ్ధిదారుతో ప్రధాని భేటీ హైదరాబాద్‌లోని సింగం చెరువు తండా డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీలో ఇల్లు పొందిన గిరిజన మహిళ జ్యోతితో ప్రధాని సమావేశమయ్యారు. కూలి చేసుకునే తమకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇంటిని నిర్మించి ఉచితంగా ఇచ్చిందని తెలిపింది. గుడిసెలో ఉన్నప్పుడు ఎండ, వానలకు ఇబ్బందులను ఎదుర్కొనేవారమని.. ఇప్పుడు తమ కుటుంబం సంతోషంగా ఉందని చెప్పింది. సూచన పాటించారు.. బహుమతి పొందారు స్థానిక సంస్థలు.. ముఖ్యంగా మునిసిపల్ కార్పొరేషన్లు స్వయం సమృద్ధికి బాండ్ల జారీ ద్వారా నిధు లు సమీకరించుకోవాలని, దీనికి తెలంగాణ ప్రభు త్వం చొరవ చూపాలని మెట్రోరైలు ప్రారంభోత్స వానికి నగరానికి వచ్చిన ప్రధాని.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు సూచించారు. దీంతో మంత్రి బాండ్ల ద్వారా నిధులు సేకరించాలని జీహెచ్ఎంసీ ని ఆదేశించారు. నగరంలో చేపట్టనున్న ఎస్సార్డీపీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం వెయ్యి కోట్లు సేకరించాలనే లక్ష్యంతో కృషి చేసి సఫలమయ్యారు. పుణే తర్వాత జీహెచ్ఎంసీ మాత్రమే బాండ్ల ద్వారా నిధులు సేకరించాయి. జీహెచ్ఎంసీలోని ఆర్థిక క్రమశిక్షణ, ఆస్తులు, వనరులు తదితరమైన వాటిని పరిగణనలోకి తీసుకున్న పలు సంస్థలు వెయ్యి కోట్లకు పైగా నిధులిచ్చేందుకు ముంబై స్టాక్ ఎక్సే్ఛంజ్‌లో పోటీలు పడ్డాయి. తొలిదశలో ఎస్సార్డీపీ పనులకు రూ.200 కోట్లు సేకరించారు. సొంతంగా నిధులు సేకరించే స్థానిక సంస్థలకు ప్రోత్సాహకంగా బాండ్ల ద్వారా తీసుకున్న మొత్తానికి వడ్డీని కేంద్రమే అందజేయాలని కేటీఆర్ కోరారు. ఈ మేరకు సీఎస్ ఎస్కే జోషి కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించారు. సుముఖత వ్యక్తం చేసిన కేంద్రం జీహెచ్ఎంసీని ఇందుకు ఎంపిక చేసింది. ప్రజోపయోగానికి రూ. 26 కోట్లు... జీహెచ్ఎంసీ బాండ్ల రూపంలో నిధులను సేకరించినందున కేంద్రం ప్రోత్సాహకంగా అందజేసిన రూ.26 కోట్లను వినూత్న కార్యక్రమాలకు ఉపయోగించాలని కేటీఆర్ సూచించారు. దీంతో ప్రత్యేక ప్రజోపయోగ కార్యక్రమానికి ఈ నిధులు వినియోగించాలని, దీనికి ప్రజాభిప్రాయాన్నీ సేకరించనున్నట్లు కమిషనర్ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. -
రూ.250కే కుళాయి కనెక్షన్
సాక్షి, అమరావతి: పట్టణాల్లోని పేదలకు తక్కువ మొత్తానికి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన అమృత్ (అటల్‌మిషన్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్) పట్టణాల్లో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రోత్సాహాలు అందుబాటులోకి రానున్నాయి. సాలీనా రూ.500 ఇంటి పన్ను చెల్లించే బీపీఎల్ కుటుంబాలకు రూ.250కే కుళాయి కనెక్షన్లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీలయినంత ఎక్కువ మందికి ఈ కనెక్షన్లు ఇచ్చేందుకు వీలుగా ఆయా పట్టణాల్లో రక్షిత మంచినీటి సరఫరా పథకాలను సిద్ధం చేస్తున్నారు. కనెక్షన్లు తీసుకోవాలంటూ కొన్ని పట్టణాల్లో మున్సిపల్ అధికారులు ప్రచారం కూడా ప్రారంభించారు. గ్రేటర్ విశాఖలో బీపీఎల్ కుటుంబాల వివరాలను సేకరించి కనెక్షన్లు కోసం దరఖాస్తు చేయాలని అక్కడి అధికారులు సమాచారం కూడా ఇస్తున్నారు. వచ్చే అక్టోబర్‌లోపు కుళాయి కనెక్షన్లు ఇవ్వడానికి అనువుగా అధికారులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2015–16లో రాష్ట్రంలోని 31 పట్టణాల్లో కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ పట్టణాల్లో రక్షిత మంచినీరు, భూగర్భ మురుగునీటి సరఫరా పథకాలను చేపట్టేందుకు రూ.2000 కోట్లు విడుదల చేసింది. ఆ పట్టణాల్లో రక్షిత మంచినీటి పథకాల నిర్మాణాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. ఆ నేపథ్యంలోనే కుళాయి కనెక్షన్ల మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దాదాపు 16 లక్షల కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు అనువుగా ఈ పథకాలు చేపట్టారు. తెల్లరేషన్ కార్డు కలిగి, సాలీనా రూ.500 ఇంటి పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. కనెక్షన్ ఇచ్చే సమయంలో పైపులు తదితరాలకు రూ.1000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నందున బీపీఎల్ కుటుంబాలు ఎనిమిది వారాల్లో కుళాయి కనెక్షన్ డిపాజిట్‌ను చెల్లించాల్సి ఉంటుంది. గ్రేటర్ విశాఖలో వచ్చే అక్టోబరులోపు రెండు లక్షల కనెక్షన్లు ఇచ్చేందుకు అనువుగా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు నగరపాలక సంస్ధతోపాటు మున్సిపాల్టీల్లో దరఖాస్తు చేసుకున్న వారికి కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు. నరసరావుపేట మున్సిపాల్టీలో దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లో కుళాయి అమర్చుతున్నారు. గుంటూరు జిల్లాలో దాదాపు 60 వేల కనెక్షన్లు ఇచ్చేందుకు అనువుగా రక్షిత మంచినీటి పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఏలూరు, మచిలీపట్నం, నెల్లూరు, అనంతపురం, కాకినాడ పట్టణాల్లోని అధికారులు బీపీఎల్ కుటుంబాలు చెల్లిస్తున్న ఇంటిపన్ను రూ.500 నుంచి రూ.750లకు పెంచితే మరి కొన్ని కుటుంబాలకు కుళాయి కనెక్షన్ పొందే అవకాశం ఏర్పడుతుందని, ఆ మేరకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పంపారు. -
‘అమృత్’ పరిధిలోకి సిరిసిల్ల
► మురికి నీటి శుద్ధి ప్లాంటు ఏర్పాటు ► జూన్‌లో ఢిల్లీకి సిరిసిల్ల కౌన్సిలర్ల బృందం ► కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ సిరిసిల్ల : కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘అమృత్’ పథకం పరిధిలోకి సిరిసిల్లను చేర్పించేందుకు కృషి చేస్తున్నామని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ తెలిపారు. పట్టణంలోని కార్మికవాడల్లో శనివారం ఉదయం 6.30 నుంచి 10.30 గంటల వరకు కాలినడకన పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ నివాసంలో విలేకరులతో మాట్లాడారు. సిరిసిల్ల కార్మికవాడల్లోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ‘అమృత్’లో సిరిసిల్లకు స్థానం లభిస్తే ఏటా పట్టణాభివృద్ధికి కోట్లాది నిధులు మంజూరవుతాయని చెప్పారు. శివారు గ్రామాలను పట్టణంలో విలీనం చేసే ప్రతిపాదనను పరిశీలించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. పట్టణ జనాభా లక్ష వరకు ఉంటే కేంద్రం ద్వారా ఎక్కువ నిధులు సాధించే అవకాశం ఉంటుందన్నారు. జూన్‌లో సిరిసిల్ల కౌన్సిలర్ల బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడిని కలుస్తామన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, వైస్ చైర్మన్ తవుటు కనకయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, పార్టీ నాయకులు చీటి నర్సింగారావు, మంచె శ్రీనివాస్, సయూద్‌ఖాన్, దార్నం లక్ష్మీనారాయణ, గూడూరి ప్రవీణ్, కొమిరె సంజీవ్, గడ్డం నర్సయ్య, మున్సిపల్ కమిషనర్ సుమన్‌రావు, కౌన్సిలర్లు దార్నం అరుణ, గుండ్లపల్లి పూర్ణచందర్, బత్తుల వనజ, డీఈఈ ప్రభువర్ధన్‌రెడ్డి, ఏఈ రవికుమార్ ఉన్నారు. తెలంగాణ రెజిమెంట్ పోలీస్ ఏర్పాటు తెలంగాణ రెజిమెంట్ పోలీస్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తుందని ఎంపీ తెలిపారు. సిరిసిల్లలో కానిస్టేబుల్ శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో ఉదయం మానేరు తీరంలో కలిసి మాట్లాడారు. యువత కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని, యువశక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలిపారు. తెలంగాణ రెజిమెంట్ పోలీస్ వ్యవస్థను నెలకొల్పేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. సిరిసిల్ల టౌన్ సీఐ జి.విజయ్‌కుమార్, ఎస్సై శ్రీనివాస్‌గౌడ్, ‘సెస్’ వైస్‌చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.