Amway
-
ఆమ్వేకు భారీ షాక్ ! రూ.757 కోట్ల ఆస్తులు ఎటాచ్
మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీ ఆమ్వేకు భారీ షాక్ తగిలింది, మనీ లాండరింగ్ ఆరోపణలపై ఆ కంపెనికి చెందిన రూ.757 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎటాచ్ చేసింది. ఇందులో స్థిర, చర ఆస్తుల విలువ రూ.411 కోట్లు ఉండగా మిగిలిన రూ.346 కోట్ల నగదును ఎటాచ్ చేసింది. ఆమ్మేకు చెందిన దుండిగల్‌లో ఉన్న ఫ్యాక్టరీ, ఫర్నీచర్, మెషినరీలతో పాటు ఈ కంపెనీకి చెందిన 36 బ్యాంకు ఖాతాలను ఈడీ ఎటాచ్ చేసింది. మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గత డిసెంబరులో ఈ కంపెనీలకు కొత్త నియమ నిబంధనలు అమల్లోకి తెచ్చారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలు అందిస్తున్న పొడక్టులన్నీ కూడా రెగ్యులర్ మార్కెట్లో ఉన్న ఉత్పత్తుల కంటే అధిక ధరతో ఉండటం, ఈ వ్యాపారంలో భాగస్వాములకు అధిక మొత్తంలో కమిషన్లు అందివ్వడం తదితర వ్యవహరాలపై అనేక విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంఎల్‌ఎంలో అతి పెద్ద సంస్థ అయిన ఆమ్వేకు భారీ షాక్ ఇచ్చింది ఈడీ. ED has provisionally attached assets worth Rs. 757.77 Crore belonging to M/s. Amway India Enterprises Private Limited, a company accused of running a multi-level marketing scam. — ED (@dir_ed) April 18, 2022 చదవండి: ఆమ్వే, ఓరిఫ్లేమ్, టప్పర్‌వేర్.. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలకు షాక్ ! -
ఫ్లిప్‌కార్ట్‌ను కోర్టుకీడ్చిన ఆమ్వే
సాక్షి, ముంబై: అమెరికా ఆన్లైన్ దిగ్గజం వాల్‌మార్ట్ డీల్ తరువాత దేశీయంగా దూసుకుపోతున్న ఫ్లిప్‌కార్ట్‌కు మరో దిగ్గజం ఆమ్వే షాక్ ఇచ్చింది. భారతీయ ఇ-కామర్స్ నిబంధనలకు ఇరుద్ధంగా ఫ్లిప్‌కార్ట్ తమ ఉత్పత్తులను అనధికారికంగా విక్రయిస్తోందని డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ సంస్థ ఆమ్వే ఆరోపిస్తోంది. తద్వారా 2016 లో కేంద్రం జారీ చేసిన డైరెక్ట్ సెల్లింగ్ గైడ్‌లైన్స్‌ను అతిక్రమించిందని వాదించింది. ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ 'అనధికార' అమ్మకాలు జరుపుతోందని ఆరోపించింది. ముందస్తు అనుమతి లేకుండా అక్రమంగా తమ ప్రొడక్ట్స్‌ను విక్రయిస్తోందని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కామర్స్ సంస్థలు ఆన్లైన్ ఉత్పత్తుల లిస్టింకు ముందు కంపెనీల ముందస్తు అనుమతి తప్పనిసరి అన్న భారతదేశ మార్గదర్శకాలను ఫ్లిప్‌కార్ట్ ఉల్లంఘిస్తోందని ఆమ్వే పేర్కొంది. అంతేకాదు తమ ఉత్పత్తుల మూతలపై ముద్రించిన యూనీకోడ్, సిల్వర్ ఫోయిల్ సీల్స్‌ను టాంపర్ చేసి మరీ అక్రమ విక్రయాలకు పాల్పడుతోందని ఆమ్వే విమర్శించింది. దీనిపై ఫ్లిప్‌కార్ట్‌కు నోటీసులు పంపించినా స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్టు తెలిపింది. డైరెక్ట్ విక్రయదారుల ప్రయోజనాలు, జీవనోపాధిని కాపాడటం, వ్యాపార ప్రాథమిక పునాదిని కాపాడుకోవడంతోపాటు వినియోగదారుల భద్రతను కాపాడేందుకు న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలని ఆమ్వే కోరింది. గతంలో ఇదే వ్యవహారంలో స్నాప్‌డీల్, ఆన్లైన్ ఫార్మా సంస్థ 1ఎంజీ.కామ్‌పై కేసులు నమోదు చేసింది. ఈ మేరకు రెండు సంస్థలు ఆమ్వే ఉత్పత్తులను తొలగించాయి. మరి తాజా పరిణామంపై ఫ్లిప్‌కార్ట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. -
తప్పు చేస్తే ఆమ్వే పై చర్యలు తీసుకోండి: హైకోర్టు
చట్ట విరుద్ధంగా ఆమ్వే ఇప్పటికీ మనీ సర్కులేషన్ కింద వ్యాపారం చేస్తున్నట్లు తేలితే సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చట్ట నిబంధనలకు, హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఆమ్వే మనీ సర్కులేషన్ వ్యాపారం చేస్తోందని, దీనిని అడ్డుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ విజయవాడకు చెందిన కార్పోరేట్ ఫ్రాడ్స్ వాచ్ సొసైటీ 2009లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన హైకోర్టు గురువారం దీనిని మరోసారి విచారణ చేపట్టింది. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం ఇందులో విచారించడానికి ఏమీ లేదని తేల్చి చెప్పింది. ఈ సమయంలో పిటిషనర్ తరఫున న్యాయవాది జోక్యం చేసుకుంటూ ఆమ్వే ఇప్పటికీ గొలుసుకట్టు వ్యాపారం చేస్తోందన్నారు. అయితే చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఆమ్వే మనీ సర్కులేషన్ కింద వ్యాపారం చేస్తుంటే సంబంధిత చట్టాల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఇరు ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశిస్తూ ఈ వ్యాజ్యాన్ని మూసివేస్తున్నట్లు పేర్కొంది. -
ఆమ్వే సీఈవో విలియం స్కాట్ పింక్నీ అరెస్ట్
-
ఆమ్వే సీఈవో విలియం స్కాట్ పింక్నీ అరెస్ట్
కర్నూలు : ఆర్థిక అవకతవకల ఆరోపణలపై నెట్వర్క్ మార్కెటింగ్ సంస్థ ఆమ్వే ఇండియా చైర్మన్ విలియం స్కాట్ పింక్నీ మరోసారి అరెస్ట్ అయ్యారు. చీటింగ్ కేసులో ఆయనను కర్నూలు పోలీసులు గుర్గావ్లో అదుపులోకి తీసుకున్నారు. విలియం స్కాట్ పింక్నీపై కర్నూలు జిల్లాలో పలు కేసులు నమోదు అయ్యాయి. ఆమ్వే సంస్థ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. గుర్గావ్లోని ఆమ్వే కేంద్ర కార్యాలయంలో పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అతను అరెస్ట్ కావటం ఇది రెండోసారి. 2013లోనూ స్కాట్ పింక్నీతో పాటు ఆసంస్థకి చెందిన ఇద్దరు డెరైక్టర్లను(అన్షు బుధ్రాజా, సంజయ్ మల్హోత్రా) కేరళ పోలీసులు అరెస్టు చేశారు. మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (నిషేధ) చట్టం నిబంధనల ఉల్లంఘన కింద 2011లో వాయనాడ్ క్రైమ్ బ్రాంచ్‌లో వీరిపై 3 కేసులు నమోదయ్యాయి. విలియం స్కాట్ పింక్నీపై దేశవ్యాప్తంగా పలు కేసులున్నాయి. మరోవైపు ఆమ్వే సంస్థ మాత్రం తాము చట్టబద్దంగానే వ్యాపారం చేస్తున్నట్లు చెప్పుకోవటం విశేషం. మరికాసేపట్లో పింక్నీని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. -
పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు.