మలాలాకు మరో అరుదైన గౌరవం
ఇస్లామాబాద్: అతి చిన్న వయసులో ప్రపంచ శాంతి నోబుల్ బహుమతి దక్కించుకున్న మలాలా యూసఫ్ జాయ్ మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు. కాలిఫోర్నియాలోని నాసా లోని ల్యాబ్ శాస్త్రజ్ఞులు 316201 అనే ఉల్కకు , బాలికా విద్య కోసం కృషిచేసిన మలాలా పేరును పెట్టారు. ఒక ఉల్కకు (ఆస్ట్రాయిడ్)మలాలా పేరు పెట్టడం చాలా గొప్ప విషయమని నాసా ఖగోళ శాస్త్రజ్ఙుడు ఎమీ మైంజర్ పేర్కొన్నారు. ఇంతకుముందు చాలామంది ఈ గౌరవం లభించినప్పటికీ మహిళల కోసం పనిచేసిన మహిళకు దక్కడం చాలా అరుదని ఆయన తెలిపారు.