anantakumar
-
రాజ్యాంగాన్ని సవరిస్తాం!
బెంగళూరు/న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని సవరించేందుకు వీలుగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మూడింట రెండొంతుల మెజారిటీ కట్టబెట్టాలంటూ ఆ పార్టీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కర్ణాటకలోని కర్వార్‌లో బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజ్యాంగానికి కాంగ్రెస్ హయాంలో పలు మార్పుచేర్పులు చేసి అనవసర అంశాలతో నింపేశారు. ముఖ్యంగా హిందూ సమాజాన్ని అణగదొక్కే చట్టాలను చేర్చారు. ఇలాంటి తప్పిదాలన్నింటినీ సరిచేయాల్సి ఉంది. ఇందుకు పార్లమెంటు ఉభయ సభల్లోనూ బీజేపీకి మూడింత రెండొంతుల మెజారిటీ అవసరం’’ అని హెగ్డే అన్నారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. రాజ్యాంగాన్ని తిరగరాసి సర్వనాశనం చేయాలన్న బీజేపీ, ఆరెస్సెస్ రహస్య అజెండా మరోసారి బట్టబయలైందని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. మున్ముందు ఎన్నికలతో నిమిత్తమే లేకుండా నియంతృత్వ పాలనకు తెర తీసేందుకు మోదీ సర్కారు ప్రయతి్నస్తోందని ఎక్స్‌లో ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని ఎలాగోలా సర్వనాశనం చేయాలన్న ప్రధాని మోదీ, సంఘ్ పరివార్ ఉద్దేశాలే హెగ్డే నోట వెలువడ్డాయని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. వారికి న్యాయం, సమానత్వం, పౌర హక్కులు, ప్రజాస్వామ్యమంటే అంతులేని విద్వేషమని ఆరోపించారు. ‘బీజేపీని ఓడిద్దాం, రాజ్యాంగాన్ని రక్షిద్దాం’ అంటూ కాంగ్రెస్ నేతలు తమ సోషల్ అకౌంట్లలో హాష్‌ట్యాగ్ జోడించారు. దాంతో ఈ వివాదంపై బీజేపీ ఆచితూచి స్పందించింది. హెగ్డే వ్యాఖ్యలు వ్యక్తిగతమని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అన్నారు. వాటిపై ఆయనను వివరణ కోరతామని తెలిపారు. హెగ్డే బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరు. ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. హిందూ అతివాద వ్యాఖ్యలతో ఆయన తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. -
భారత రాజ్యాంగంపై ఎందుకీ గొడవ?
సాక్షి, న్యూఢిల్లీ : భారత రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం సవరించాలనుకుంటోందని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే వ్యాఖ్యానించడం ద్వారా కొత్త వివాదాన్ని రేపారు. ముఖ్యంగా రాజ్యాంగం పీఠికలోని ‘సెక్యులర్’ పదం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇప్పటికే రాజ్యాంగాన్ని ఎన్నో సార్లు మార్చినందున మరోసారి మార్చడం తప్పుకాదని కూడా వాదించారు. ఆయన వాదనను కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో తూర్పార పట్టడంతో ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారో, ఏమో హెగ్డే వెనక్కి తగ్గి క్షమాపణలు కూడా చెప్పుకున్నారు. (సాక్షి ప్రత్యేకం) భారత రాజ్యాంగ పరిషత్తు మూడేళ్లు శ్రమపడి భారత రాజ్యాంగాన్ని రూపొందించినప్పటికీ దీనికి పరిమితులున్నాయని, కాలమాన పరిస్థితులనుబట్టి ప్రజల మనోభావాలకు అనుగుణంగా దీన్ని ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చని భారత రాజ్యాంగ కమిటీ చైర్మన్ బీఆర్ అంబేడ్కర్ స్వయంగా సూచించారు. అయితే ఆయన రాజ్యాంగం మౌలిక స్వరూపం మారకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కనుకనే రాజ్యాంగానికి కేంద్ర ప్రభుత్వాలు పలు సవరణలు చేస్తూ వచ్చాయి. రాజ్యాంగాన్ని ఆమోదించినప్పటి నుంచి ఇప్పటివరకు వందకుపైగా సవరణలు చోటుచేసుకున్నాయి.(సాక్షి ప్రత్యేకం) అందులో ముఖ్యమైనదే 42వ సవరణ. రాజ్యాంగం పీఠికలో సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలను చేరుస్తూ నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చింది. అదే సవరణ కింద కొన్ని రాజ్యాంగ అధికరణల్లో, సెక్షన్లలో మార్పులు, చేర్పులు కూడా చేసింది. ఎమర్జెన్సీ కాలంలో ఈ సవరణను తీసుకరావడం వల్ల దాన్ని ‘ఇందిరా రాజ్యాంగం’ అంటూ ప్రతిపక్షం విమర్శించింది. పౌరుల ప్రాథమిక హక్కులను మార్చే అధికారం పార్లమెంట్‌కు లేదంటూ 1973లో సుప్రీం కోర్టు స్పష్టం చేసినప్పటికీ ఇందిర ప్రభుత్వం 42వ సవరణ ద్వారా పౌరుల ప్రాథమిక హక్కుల్లో కూడా సవరణలు తీసుకొచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ప్రభుత్వం పౌరుల ప్రాథమిక హక్కులను పునరుద్ధరిస్తూ 43, 44వ సవరణలు తీసుకొచ్చింది. (సాక్షి ప్రత్యేకం)అయితే రాజ్యాంగం పీఠికలో పేర్కొన్న ‘సెక్యులర్, సోషలిస్ట్’ పదాలు ‘ఎక్స్ప్రెస్ట్ ఎక్స్ప్లిసిటి వాట్ వాజ్ ఇంప్లిసిట్ (అంతర్లీన భావాన్ని ఎలాంటి సందేహం లేకుండా సుస్పష్టం చేయడం) అనే సుప్రీం కోర్టు వ్యాఖ్యానికి తగ్గట్టుగా ఉండడంతో ఆ రెండు పదాలను మాత్రం జనతా పార్టీ ప్రభుత్వం ఎత్తివేయలేదు. భారత రాజ్యాంగమే సెక్యులర్, సోషలిస్ట్ అని భావించడం వల్ల ఆ పదాల జోలికి ఆ ప్రభుత్వం వెల్లలేదు. భారత రాజ్యాంగాన్ని అంబేడ్కర్ పార్లమెంట్‌కు సమర్పించినప్పుడు కూడా చాలా మంది నాయకులు సెక్యులర్ అనే పదాన్ని జోడించాల్సిందిగా సూచించారు. కొంత మంది డిమాండ్ కూడా చేశారు. పౌరల ప్రాథమిక హక్కుల స్వరూపమే లౌకికంగా ఉన్నప్పుడు, ఆ హక్కులను మార్చే అధికారం పార్లమెంట్‌కు లేనప్పుడు ఆ పదాన్ని ఉపయోగిస్తే ఎంత, ఉపయోగించకపోతే ఎంత! అని అంబేడ్కర్ ప్రశ్నించారు. భవిష్యత్ తరాలు మనకంటే బాగుండాలి కనుక, వారి వారి కాలమాన పరిస్థితులనుబట్టి రాజ్యాంగాన్ని మార్చుకునే అవకాశం ఉండాలని, వారికి సెక్యులర్, సోషలిస్ట్ పదాలు అడ్డంకి కాకూడదని, వాటికంటే మంచి సిద్ధాంతాలే మున్ముందు రావచ్చని అంబేడ్కర్ స్పష్టం చేశారు. ఈ అన్ని అంశాలను దష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని పరిశీలించిన భారత సుప్రీం కోర్టు 1980వ దశకంలో పౌరుల ప్రాథమిక హక్కులకు భంగంగా ఉన్న 42 రాజ్యాంగ సవరణలోని మరిన్ని అంశాలను నిర్ద్వంద్వంగా కొట్టివేసింది. పౌరులను హక్కును మార్చే అధికారం పార్లమెంట్‌కు లేదని తెలిపింది.(సాక్షి ప్రత్యేకం) ‘ఎస్ఆర్ బొమ్మై, కేంద్ర ప్రభుత్వం’ మధ్య తలెత్తిన ఇలాంటి ఓ వివాదంలో 1994లో సుప్రీం కోర్టు తీర్పు చెబుతూ ‘భారత రాజ్యాంగం మౌలిక స్వరూపమే లౌకికతత్వమనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని రూలింగ్ ఇచ్చింది. నాడు రాజ్యాంగం పీఠికలో ఇందిర ప్రభుత్వం ‘సెక్యులర్, సోషలిస్ట్’ పదాలను ఎలా చేర్చిందో, అలాగే సంపూర్ణ మెజారిటీ కలిగిన బీజేపీ ప్రభుత్వం అదే పద్ధతిలో, అంటే రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పదాలను ఎత్తివేసినంత మాత్రాన భారత రాజ్యాంగం లౌకిక స్వరూపం మారదు. అలాంటప్పుడు ఎందుకీ గొడవ ? భారత పౌరల ప్రాథమిక హక్కుల్లో మార్పు రాదు. తమ కిష్టమైన మతాన్ని ఎంచుకునే ప్రాథమిక హక్కు భారతీయులకుందికనుక మన రాజ్యాంగంలో హిందూ, ముస్లిం, మైనారిటీ పదాలను తీసుకరావడం, తద్వారా ప్రజల్లో చిచ్చు తీసుకరావడం సాధ్యం కాదు.(సాక్షి ప్రత్యేకం) -
ఆ కేంద్రమంత్రి నాలుక కట్ చేస్తే.. !
సాక్షి, బెంగళూరు(కలబుర్గి): కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే నాలుకను కత్తిరించిన వారికి రూ.1 కోటి నగదు బహుమానం అందిస్తామంటూ కలబురిగి జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు గురుశాంత్ పట్టేదార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనవరి 26వ తేదీ లోపు కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే నాలుకను కత్తిరించి తమకు అందించిన వ్యక్తులకు కోటి రూపాయల నగదు బహుమానం అందిస్తామంటూ షరతు విధించారు. ప్రస్తుతం దేశ ప్రజలు మత సామరస్యంతో జీవిస్తున్న తరుణంలో ఎన్నికల్లో ఓట్ల కోసం కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆరోపించారు. అందుకే ఆయన నాలుక కత్తిరించిన వ్యక్తులకు బహుమానం ప్రకటించామంటూ తమ వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. భారత రాజ్యాంగాన్ని విమర్శిస్తూ అనంత్‌కుమార్ హెగ్డే వ్యాఖ్యలు చేశారని, రాజ్యాంగాన్ని విమర్శించే వారెవరైనా సరే దేశ ద్రోహులేనని అన్నారు. ఇటీవల అనేక వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రజల మధ్య వైషమ్యాలను రగిలిస్తున్న కేంద్ర మంత్రి హెగ్డేపై తక్షణం ప్రధాని నరేంద్రమోదీ చర్యలు తీసుకోవాలని గురుశాంత్ పట్టేదార్ డిమాండ్ చేశారు. -
టిప్పు లొల్లి.. షరా మాములే!
సాక్షి, బెంగళూర్ : కన్నడనాట మళ్లీ టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాల రగడ మొదలైంది. ప్రతీయేడూ లాగే ఈసారి కూడా టిప్పు జయంతి వేడుకలను బహిష్కరించాలని హిందుత్వ సంఘాలు పిలుపునిస్తుండగా.. కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే లేఖతో ఈసారి అది మరింత రసవత్తరంగా మారింది. టిప్పును హిందూ వ్యతిరేకిగా పేర్కొంటూ... నవంబర్ 10న నిర్వహించబోయే జయంతి వేడుకలకు తననను ఆహ్వానించొద్దంటూ హెగ్డే కర్ణాటక ప్రభుత్వానికి ఈ యేడాది కూడా లేఖ రాశారు. దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాస్త ఘాటుగా స్పందించారు. జయంతి వేడుకలను హేగ్డే రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ శనివారం మీడియాతో మాట్లాడుతూ సిద్ధరామయ్య మండిపడ్డారు. బ్రిటీష్ వారి వ్యతిరేకంగా పోరాటం జరిపిన యోధుడి విషయంలో ఇలాంటి రాద్ధాంతం చేయటం సరికాదని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో భాగం అయి ఉండి ఆయన(హెగ్డే) ఇలాంటి పని చేయటం సరికాదు. ఆహ్వానాలు అందరికీ పంపుతాం. వాటిని తీసుకోవటం.. తీసుకోకపోవటం.. రావటం.. రాకపోవటం.. అనేది వాళ్ల ఇష్టం అని ముఖ్యమంత్రి తెలిపారు. ఇక బీజేపీ ఎంపీ శోభా కరందల్జే హెగ్డేకు మద్ధతు తెలిపారు. టిప్పు సుల్తాన్ ఓ కన్నడ వ్యతిరేకని.. హిందూ వ్యతిరేకని ఆమె తెలిపారు. టిప్పు జయంతి వేడుకలను బహిష్కరించాలని కన్నడ ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. గతేడాది కూడా అనంతకుమార్ ఇదే రీతిలో తనను మైసూర్ సుల్తాన్ టిప్పు జయంతి వేడుకలకు ఆహ్వానించొద్దంటూ లేఖ రాశారు కూడా. విమర్శలు... భారతదేశపు మొట్టమొదటి మిస్సైల్ మ్యాన్ గా టిప్పు సుల్తాన్‌ను చరిత్రకారులు అభివర్ణిస్తుంటారు. కానీ, కొందరు విమర్శకులు మాత్రం ఆయన హిందువులను దారుణంగా హత్య చేశారని ఆరోపిస్తుంటారు. ముఖ్యంగా కొడగు, శ్రీరంగపట్నంలో ఈ నరమేధం ఎక్కువగా జరిగిందని చెబుతుంటారు. మోహన్‌దాస్ లాంటి విద్యావేత్తలు సదస్సులు నిర్వహించి మరీ విమర్శలు గుప్పిస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఉత్సవాల నిర్వహణలో వెనక్కి తగ్గటం లేదు. -
నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి
కేంద్ర మంత్రి అనంతకుమార్ సాక్షి,బెంగళూరు: కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2011లో గెజిటెడ్ పోస్టుల నియామకాలను రద్ధు చేస్తూ మంత్రిమండలి ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్ అభిప్రాయపడ్డారు. బెంగళూరులో అదమ్యచేతన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్వీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన రక్షాబంధన్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోస్టుల రద్దు విషయంలో ప్రభుత్వ నిర్ణయం సబబుగా లేదన్నారు. తప్పు జరిగినట్లు ఇప్పటికే తేటతెల్లమయ్యిందని, ఇందుకు కారణమైనవారిని కూడా సీఐడీ గుర్తించిందని అన్నారు. వారిని శిక్షిస్తే సరిపోతుందన్నారు. అయితే నియామకాలను రద్దు చేస్తూ ఎంపికైన అభ్యర్థులందరినీ బాధపెట్టడం సరికాదన్నారు. కర్ణాటకలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు ఎక్కువ అవుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. పోలీసు సిబ్బందిని ముఖ్యంగా మహిళలను ఎక్కువగా నియమించుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు. కాగా, అంతకు ముందు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ తారాతో సహా పలువురు బీజేపీ మహిళా విభాగం నాయకులు అనంతకుమార్‌కు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
ఇద్దరు భర్తలు... ఇద్దరు భార్యలు...ఒక్క ఎంపీ సీటు
ఈ లోకసభ ఎన్నికల్లో బెంగుళూరు సౌత్ లో చాలా ఆసక్తిదాయకమైన పోటీ నెలకొంది. ఐటీ రంగ దిగ్గజం నందన్ నీలేకని, ఓటమినెరుగని బిజెపి నేత అనంతకుమార్ లు ఇక్కడ నుంచి పోటీ పడుతున్నారు. నీలేకని కాంగ్రెస్ నుంచి పోటీలో ఉంటే, అనంతకుమార్ బిజెపి నుంచి పోటీ పడుతున్నారు. ఇద్దరు నాయకుల భార్యలు కూడా ప్రచారంలో తలమునకలై ఉన్నారు. అనంత్ కుమార్ భార్య తేజస్విని, నీలేకని భార్య రోహిణి ల ప్రచార శైలి కూడా చాలా భిన్నం. రోహిణి రాజకీయాలకు కొత్త. ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్లడం ఆమెకు అలవాటు లేదు. ఐటీ ఉద్యోగులతో కలిసి మాట్లాడటం కాస్త సులువుగానే ఉన్నా మిగతా ప్రజలతో ఆమె కలవడంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు. అసలు భర్త రాజకీయాల్లోకి వస్తారన్న విషయాన్ని ఆమె ఏనాడూ ఊహించలేదు. ఆమె ఇప్పటికీ జీర్ఝించుకోలేకపోతోంది. అయితే మారిన పరిస్థితులకనుగుణంగా తనను తాను మలచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తేజస్విని అనంత్ కుమార్ 1988 నుంచే ప్రజా జీవనంలో ఉన్నారు. ఆమెకు ప్రజలను కలవడం బాగా అలవాటు. నిజానికి అనంత్ కుమార్ కు మొదటి నుంచీ ఆమె వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు. అసలు అనంత్ సక్సెస్ కు కారణం తేజస్వినే అని చాలా మంది చెబుతున్నారు. ఆమె గతంలో లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ విభాగంలో పనిచేశారు. భర్త క్రియా శీల రాజకీయాల్లోకి రాగానే ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటిని, భర్త కార్యాలయాన్ని మేనేజ్ చేస్తున్నారు. నందన్ ఆస్తులు 770 కోట్లు. ఆయనకు ఇన్ఫోసిస్ లో 1.45 శాతం షేర్లున్నాయి. రోహిణికి కూడా 1.30 శాతం షేర్లున్నాయి. అనంత్ కుమార్ భార్యకు 4/2 కోట్ల ఆస్తి, అనంతకుమార్ కి 51.13 లక్షల విలువైన ఆస్తులున్నాయి.