Angkor Wat
-
పునర్నిర్మాణంతో పునరుజ్జీవం!
సాక్షి, హైదరాబాద్: దేవునిగుట్ట ఆలయం.. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఆంగ్కోర్వాట్ (ఆంకోర్వాట్) కంటే ముందు ఆ తరహా నిర్మాణ శైలితో రూపుదిద్దుకున్న దేవాలయం. ఇసుక రాతి బిల్లలపై ముందుగానే దేవతామూర్తుల భాగాలను చెక్కి పూర్తిరూపం వచ్చేలా క్రమపద్ధతిలో పేర్చిన గొప్ప నిర్మాణం. ఈ తరహా నిర్మాణం దేశంలో ఇదొక్కటే అనే అభిప్రాయం ఉంది. దాదాపు 1,500 ఏళ్ల క్రితం నిర్మితమైనట్లు భావిస్తున్న ఈ ఆలయం ఎప్పు డు కూలుతుందో తెలియని పరిస్థితి. ఇంతకాలం తర్వాత దీని పునరుద్ధరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఆలయాన్ని పూర్తిగా విప్పదీసి తిరిగి నిర్మించబోతున్నారు. త్వరలో టెండర్లు పిలిచి ఏడాదిలో పునర్నిర్మాణాన్ని పూర్తి చేయా లని లక్ష్యంగా పెట్టుకున్నారు. ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణాదిత్య చొరవతో కాకతీయ హెరిటేజ్ ట్రస్టు ఆధ్వర్యంలో, తెలంగాణ వారసత్వ శాఖ పర్యవేక్షణలో పనులు జరగనున్నాయి. జిల్లా కేంద్రం నుంచి 20 కి.మీ. దూరంలోని కొత్తూరు గ్రామ శివారులోని దట్టమైన అడవిలో దేవునిగుట్టపై ఈ ఆలయం ఉంది. ఆరో శతాబ్దంలో వాకాట రాజు హరిసేన హయాంలో మందిరాన్ని నిర్మించి ఉంటారని అంచనా. పద్మపాణిగా భావిస్తున్న శిల్పం ఏం చేస్తారు? దేవునిగుట్ట ఆలయం దాదాపు 24 అడుగుల ఎత్తుంది. దేవతామూర్తుల ఆకృతులను ఒకే రాయిపై కాకుండా, చిన్నచిన్న రాళ్లపై చెక్కి, వాటిని క్రమపద్ధతిలో పేర్చటం ద్వారా మూర్తు లకు పూర్తి రూపమిచ్చారు. ముందుగా ఈ రాళ్లపై నంబర్లు రాసి విప్పదీస్తారు. నిర్మాణాన్ని పూర్తిగా విప్పిన తర్వాత పునాదిని పరిశీలిస్తారు. ఇప్పటివరకు ఉన్న ఆలోచన ప్రకారం.. డంగు సున్నంతో పునాదిని నిర్మిస్తారు. దానిమీద, నంబర్ల ప్రకారం రాళ్లను పేర్చి పాత రూపమిస్తారు. రాయిరాయికి మధ్య డంగుసున్నం, కరక్కాయ, నల్లబెల్లం, రాతిపొడి తదితర మిశ్రమంతో బైండింగ్ పొర ఏర్పాటు చేస్తారు. ఇలా పిరమిడ్ తరహాలో పైకి పేర్చుకుంటూ వెళ్తారు. పైభాగంలో ప్రస్తుతం పెద్ద రంధ్రం ఉంది. అం దులోంచి వాననీరు లోనికి చేరుతోంది. కొత్త నిర్మాణంలో ఇలాంటి లోపాలను సరిదిద్దుతా రు. రాళ్లు మళ్లీ కదిలిపోకుండా స్టెయిన్లెస్ స్టీల్ పట్టీలను బిగించే యోచనలో ఉన్నారు. రూ.2 కోట్లతోనే పనులు.. ములుగు జిల్లా కలెక్టర్ అందజేసిన రూ.1.8 కోట్ల నిధులకు కాస్త జోడించి రూ.2 కోట్లలోనే పనులు పూర్తయ్యేలా చూడాలని భావిస్తున్నారు. ఈ మేరకే టెండర్లు పిలువబోతున్నారు. కాకతీయ నిర్మాణాల పునరుద్ధరణ పనుల్లో అనుభవం ఉన్న కాంట్రాక్టర్లకే అవకాశం ఇవ్వనున్నారు. 6 నెలల నుంచి ఏడాదిలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్రేన్ లేకుండా.. ఈ ఆలయం గుట్టపైన ఉంది. రోడ్డు మార్గం లేకపోవడంతో క్రేన్ను పైభాగానికి తరలించే వీలు లేదు. క్రేన్ లేకుండా గొలుసులు ఏర్పాటు చేసి వాటితో రాళ్లను ఎత్తే ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆలయానికి వినియోగించిన రాళ్లు కదిలాయే తప్ప, విరగలేదని గుర్తించారు. ఇటీవల డాక్యుమెంటేషన్ చేసే క్రమంలో త్రీడీ పరిజ్ఞానాన్ని వినియోగించి లేజర్ చిత్రాలు తీసి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎక్కడెక్కడ పగుళ్లున్నాయి.. బేస్మెట్ ఎలా ఉంది.. తదితర వివరాలు గుర్తించారు. ప్రత్యేకంగా కొత్తగా రాళ్లను చెక్కాల్సిన అవసరం లేదని గుర్తించారు. -
మన అంకోర్వాట్ కూలుతోంది..
సాక్షి, హైదరాబాద్: అంకోర్వాట్ (ఆంగ్కోర్వాట్)... ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న కంబోడియాలోని అద్భుత హిందూ దేవాలయం. 12వ శతాబ్దంలో నిర్మితమైన ఈ ఆలయాన్ని గతేడాది దాదాపు 26 లక్షల మంది పర్యాటకులు సందర్శించారు. యునెస్కో గుర్తింపు పొందిన ఈ కట్టడాన్ని పునరుద్ధరించటంలో కీలక పాత్ర భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) దే. మన సాయంతోనే దాన్ని పునరుద్ధరించి ప్రపంచపటంలో ప్రధాన పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా నిలిపారు. అయితే మన దేశంలో అంకోర్వాట్ తరహా శైలిలో నిర్మించిన మందిరం ఒక్కటే ఉంది. ఇది చిన్న నిర్మాణమే అయినా, నిర్మాణశైలి అంకోర్వాట్దే. ఆ ఒక్క నిర్మాణం మన తెలంగాణలోనే ఉంది. విశేషమేంటంటే.. అంకోర్వాట్కు ఈ చిన్న నిర్మాణమే స్ఫూర్తి అన్నది చరిత్రకారుల మాట. ఎందుకంటే అంకోర్వాట్ కంటే దాదాపు 550 ఏళ్ల క్రితమే దీన్ని నిర్మించారని చెబుతారు. ఆ తరహా నమూనాలో నిర్మించిన దేశంలోనే ఏకైక ఈ చిన్న గుడిని పరిరక్షించటం ఇప్పుడు అదే ఏఎస్ఐకి సాధ్యం కావటం లేదు. ఎందుకంటే స్థానిక యంత్రాంగం ఎన్ఓసీ ఇవ్వకపోవటమే. కళ్ల ముందే ఆ అద్భుత నిర్మాణం కూలిపోతున్నా.. యంత్రాంగం దాని పరిరక్షణకు ముందుకు రావటం లేదు. స్వచ్ఛందంగా అడుగు ముందుకేసి పూర్తిస్థాయిలో పూర్వ రూపు కల్పిస్తామన్న ఏఎస్ఐకి సహకరించటం లేదు. ఆరో శతాబ్దంలో నిర్మాణం! ములుగు జిల్లా కేంద్రానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో కొత్తూరు గ్రామ శివారులోని దట్టమైన అడవిలో దేవునిగుట్టపై కొలువుదీరింది ఈ ఆలయం. మూడేళ్ల క్రితమే దేవునిగుట్ట ఆలయం బయటి ప్రపంచానికి తెలిసింది. అప్పటివరకు స్థానికులే అక్కడ ఉత్సవాలు నిర్వహించుకునేవారు. దాన్ని ఎవరు నిర్మిం చారో ఇదమిత్థంగా ధ్రువీకరించేందుకు అక్కడ శాసనాలు లభించలేదు. దాని శైలి ఆధారంగా వాకాటకుల హయాంలో నిర్మితమైనట్టు చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఆరో శతాబ్దంలో వాకాట రాజు హరిసేన హయాంలో నిర్మించి ఉంటారని అంచనా. అప్పట్లో మహాయానబుద్ధిజం ప్రభావం ఎక్కువ. ఆలయం దక్షిణం వైపు అజంతాలో ఉండే బోధిసత్వ పద్మపాణి తరహాలో భారీ శిల్పం ఉంటుంది. కానీ అది మహాశివుడి రూపమైన దక్షిణామూర్తి విగ్రహమని, హరిసేన హయాంలోనే హిందూయిజం విస్తరించటం బాగా ఉండేదని కొందరి వాద న. ఆలయంలో ఎలాంటి విగ్రహాలు లేవు. ఇసుక రాళ్లే ఇటుకలుగా.... చాలా తేలికగా ఉండే ఇసుక రాళ్లను పేర్చి దేవునిగుట్ట గుడిగా మలిచారు. ఆ రాళ్లపై మానవ, జంతు ఆకృతులను తీర్చిదిద్దారు. ఆ ఆకారాలను వరసగా పేరిస్తే పూర్తి రూపమొస్తుంది. అంటే.. ముందుగానే రాళ్లపై శిల్పంలోని భాగాలు చెక్కి పేర్చి పూర్తి ఆకృతినిచ్చారు. ఇది కంబోడియాలో ఉండే నిర్మాణాలశైలి. ఒక గర్భగుడి మాత్రమే నిర్మించారు. ముందు ఎలాంటి మండపాలు లేవు. గర్భాలయం లోపల నిలబడి చూస్తే శిఖరం చివర వరకు కనిపిస్తుంది. ఆలయం వెలుపల, లోపల రాళ్లపై చిత్రా లు కనిపిస్తాయి. దట్టమైన అడవిలో ఉండటం, బయటి ప్రపంచానికి తెలియకపోవటంతో ఇంతకాలం దాన్ని పట్టించుకోలేదు. ఫలి తంగా రాళ్లు కదిలిపోయి ఆలయం కూలేదశకు చేరింది. దీన్ని గుర్తించిన తర్వాత మూడేళ్ల క్రితం ఏఎస్ఐ అధికారులు పరిశీలించారు. అది హెరిటేజ్ తెలంగాణ రక్షిత కట్టడం జాబితాలో లేకపోవటంతో పరిరక్షణకు సిద్ధమయ్యారు. వెంటనే స్థానిక గ్రామపంచాయతీ ప్రతినిధులను కలిసి లిఖితపూర్వకంగా విన్నవించారు. దీనికి స్పందించిన నాటి గ్రామ పంచాయతీ ఎన్ఓసీ ఇచ్చింది. వెంటనే నాటి భూపాలపల్లి (ప్రస్తుత ములుగు జిల్లా) కలెక్టర్కు ఎన్ఓసీ కోసం దరఖాస్తు చేసింది. అప్పట్నుంచి అది పెండింగులోనే ఉంది. తరచూ అధికారులు జిల్లా యంత్రాంగాన్ని వాకబు చేస్తున్నా ఫలితముండటం లేదు. ఇటీవలి భారీ వర్షాలకు ఆలయం రాళ్లు బాగా కదిలిపోయాయి. వచ్చే వానాకాలం నాటికి మొత్తం నేలమట్టమయ్యే ప్రమాదం నెలకొంది. ఇక్కడికి తరచూ విదేశీ నిపుణులు అధ్యయనంలో భాగంగా వచ్చి అబ్బురపడుతున్నారు. అంకోర్వాట్ తరహాలోనే నిర్మాణం ఉందని తేల్చి చెబుతున్నారు. కానీ దాన్ని పరిరక్షించాలన్న ఆలోచన మాత్రం మన యంత్రాంగానికి రావటం లేదు. -
రామ మందిరం ఎలా వుండాలంటే...
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును ద్వారక పీఠాధిపతి శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పు తనకు చాలా సంతోషాన్ని కలిగించిందనీ, రాముడు ఉత్తరప్రదేశ్లోని నగరంలోనే జన్మించాడనేది నిరూపితమైందని వ్యాఖ్యానించారు. శ్రీరాముడు అయోధ్యలోనే జన్మించాడనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. రామమందిరాన్ని నిర్మించడానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలన్న సుప్రీం ఆదేశంపై స్వరూపానంద స్పందిస్తూ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఇప్పటికే ఉందని వ్యాఖ్యానించారు. అయితే, అయోధ్యలో అనేక దేవాలయాలున్నాయని సున్నీ వక్ఫ్ బోర్డుకు అయిదు ఎకరాల భూమిని కేటాయించాలన్న సుప్రీం ఆదేశాలపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రతిపాదిత రామమందిరం డిజైన్ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా, ప్రపంచ చారిత్రక కట్టడాలలో ఒకటిగా వెలుగొందుతున్న కంబోడియాలోని "అంగ్కోర్ వాట్ దేవాలయం" అంత ఘనంగా, అంత విశాలంగా ఉండాలని స్వరూపానంద సరస్వతి అభిలషించారు. -
ఇది మన అంగ్కోర్వాట్!
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఒక శిల్పాన్ని ఒకే రాయిపై చెక్కుతారు. కానీ ఒకే శిల్పాన్ని చిన్న రాళ్లపై భాగాలుగా చెక్కి.. ఇటుకల మాదిరిగా పేర్చి పూర్తి రూపం ఇవ్వటం మాత్రం అరుదే. కాంబోడియా దేశంలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత అంగ్కోర్వాట్ ఆలయంలో శిల్పాలను ఇలాగే రూపుదిద్దారు. ఇండోనేసియా సెంట్రల్ జావాలోని బోరోబుదూర్ దేవాలయం కూడా ఈ తరహా నిర్మాణ కౌశలానికి ప్రతీక. మరి అలాంటి ప్రత్యేకత ఉన్న పురాతన నిర్మాణం మన తెలంగాణలోనూ ఉంది. ఆరు అడుగుల ఎత్తు.. దాదాపు 20 దాకా ఇసుకరాతి ఇటుకలు.. ఒక్కో ఇటుకపై ఒక్కో భాగం.. అన్నీ కలిస్తే.. అజంతా చిత్రాల్లోని పద్మఫాణిని పోలిన బోధిసత్వుడు రాచకొలువులో లలితాసనంలో కూర్చున్న దృశ్యం ఆవిష్కృతం.. బుద్ధుడి జీవిత గాథలతో కూడిన ఇలాంటి ఎన్నో చిత్రాలను ఆ రాళ్లు కళ్లకు కడతాయి. చూడగానే అంగ్కోర్వాట్ ఆలయ గోడలను మరిపించే ఈ మందిరం.. అంగ్కోర్వాట్ ఆలయం కంటే దాదాపు ఐదొందల ఏళ్లకు ముందుది. ఆ మహా నిర్మాణంతో పోలిస్తే రూపులో చాలా చిన్నదే అయినా, నిర్మాణ కౌశలం పరంగా దానికి అమ్మలాంటిదే. ఇంతకూ ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలంలోని కొత్తూరు గ్రామ శివారులో దేవునిగుట్టపై ఠీవిగా నిలిచి ఉంది. ఇలాంటి అద్భుత దేవాలయం ఒకటి ఇక్కడ ఉందనే సంగతి స్థానికులకు మినహా ఐదారు నెలల క్రితం వరకూ బాహ్య ప్రపంచానికి తెలియదు. పురావస్తుశాఖ కూడా దాన్ని ఇంతవరకు గుర్తించలేదు. వజ్రయాన ప్రభావమే..? బౌద్ధానికి చివరిదశ వజ్రయానం. తాంత్రిక బౌద్ధమని, మంత్రయానమనీ పిలిచే ఈ విధానం తెలంగాణలోని నాగార్జున కొండ నుంచి మొదలై ఇతర దేశాలకు విస్తరించిందంటారు. కాంబోడియా సహా ఇతర ప్రాంతాలకు తెలంగాణ నుంచే వ్యాపించినందున, ఆదిలో ఇక్కడ ఆ తరహా ఆలయం నిర్మితమై ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దేవునిగుట్టపై నుంచే రాతిని తొలిచి దాన్ని ఇటుకలుగా మార్చి ఆలయాన్ని నిర్మించారు. ఇసుకరాయి అంత పటుత్వంగా ఉండదు. కొనలు సులభంగా రాలిపోతాయి. అందుకనే వాటిని చిన్న ఇటుకలుగా మార్చి, అనుకున్న శిల్పాకృతిని భాగాలుగా వాటిపై ముందు చెక్కి ఆ తర్వాత వరసగా పేర్చారు. అందులోని విగ్రహాలు మాత్రం మాయం కావటంతో ఇటీవల స్థానికులు దాన్ని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంగా మార్చుకుని కాముని పున్నమి సమయంలో జాతర నిర్వహిస్తున్నారు. శతాబ్దాల క్రమంలో మార్పులు.. నలువైపులా అర్ధపద్మాలు, సింహాల బొమ్మలు చెక్కిన పాలరాతి బౌద్ధ ఆయకస్తంభం ఉండటాన్ని బట్టి ఒకటి లేదా రెండో శతాబ్దంలో ఇది బౌద్ధ స్థావరంగా ఉండేదని వారు పేర్కొంటున్నారు. వందల ఏళ్ల పరిణామక్రమంలో ఇది బౌద్ధ చైత్యాలయంగా మారి ఉంటుందని భావిస్తున్నారు. గర్భాలయం, దాని ముందు ప్రహరీ మాత్రమే ఉంది. ప్రవేశద్వారం ఎత్తు తక్కువగా ఉంది. లోనికి వెళ్తే.. గోడల్లోని రాతి ఇటుకలపై బుద్ధుడి జీవిత చరిత్రను ప్రతిబింబించే చిత్రాలెన్నో ఉన్నాయి. బౌద్ధంలోని వజ్రయానంలో బుద్ధుడిని పరమశివుడి రూపంలోనూ పూజించే పద్ధతి ఉన్నందున, ఈ ఆలయ గోడలపై అర్ధనారేశ్వర శిల్పం కూడా కనిపిస్తుండటం విశేషం. భయంకరంగా ఉన్న పెద్ద తల కలిగిన బోధిసత్వుడు(జాంభాలుడి రూపం అయి ఉంటుంది) ఎడమకాలితో మరో వ్యక్తిని వంచి ఎడమ చేతితో ఆతని మెడను వెనక్కి విరిచి పట్టుకున్న మరో దృశ్యం ఉంది. అంగ్కోర్వాట్లో పెద్ద రూపంలో ఉన్న అమితాభుని శిరస్సు రూపం ఇక్కడ చిన్న రాతిపై కనిపిస్తోంది. అన్నీ ఇసుక రాతి ఇటుకలే.. కాకతీయులు.. కళ్యాణ చాళుక్యుల కాలం.. వారి వారి నిర్మాణశైలిలో తెలంగాణలో ఎన్నో అద్భుత ఆలయాలు రూపుదిద్దుకున్నాయి. కానీ.. ఈ ఆలయం మాత్రం వాటన్నింటికీ భిన్నం. ఇప్పటి వరకూ మనం చూడని శైలి. అడుగు నుంచి నాలుగు అడుగుల మేర ఉన్న ఇసుక రాతి ఇటుకలను పేర్చి దీన్ని నిర్మించారు. రాళ్లను డంగు సున్నం మిశ్రమంతో జోడించారు. ప్రస్తుతం ఆ మందిరం ఎత్తు 24 అడుగుల వరకు ఉంది. దానిపైన శిఖరం కూడా గతంలో ఉండేదనటానికి నిదర్శనాలున్నాయి. పునాదులు లేకుండా తొమ్మిది అడుగుల మందంతో రాతి ఇటుకలతో నిర్మించారు. మధ్యలో ఖాళీ ఉండి రెండు పొరలతో నిర్మితమై ఆ గోడ వెలుపల, లోపల రాళ్లపై శిల్పాలు చెక్కి ఉన్నాయి. ఇటీవల ఆలయం విషయం తెలిసి ‘సాక్షి’ దాన్ని వెలుగులోకి తెచ్చే క్రమంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం దృష్టికి తీసుకెళ్లింది. అప్పటికే ఆ బృందం కూడా దీని సమాచారం తెలిసి అన్వేషణలో ఉంది. తాజాగా ఔత్సాహిక పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్ నేతృత్వంలో వేముగంటి మురళి, కట్టా శ్రీనివాస్, అరవింద్, సదానందం, సమీర్, కరుణాకర్, మహేశ్, చంటి, కొత్తూరు గ్రామ సర్పంచ్ రవీందర్రావు తదితరులు దీన్ని పరిశీలించి విశ్లేషించారు. కదిలిపోతున్న రాళ్లు.. కనీస నిర్వహణ లేకపోవటంతో ఈ అతిపురాతన ఆలయం చెదిరిపోతోంది. రాళ్లు కదిలిపోతూ శిల్పాల రూపం దెబ్బతింటోంది. లోపలివైపు నుంచి చూస్తే ఆలయ శిఖరం మొనదేలిన పిరమిడ్ తరహాలో కనిపిస్తోంది. కానీ పై మొన భాగం లేదు. అక్కడ పెద్ద రంధ్రం ఏర్పడి వాననీరు లోనికి వస్తోంది. అంటే శిక్షర భాగం దెబ్బతిన్నట్లు స్పష్టమవుతోంది. అతి అరుదైననిర్మాణ శైలితో రూపొందిన ఈ పురాతన మందిరాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇది శిథిలమైతే ఇక ఈ తరహా నిర్మాణం అంతరించినట్టే. గుట్టపైకి రహదారి ఏర్పాటు చేసి ఆలయాన్ని పునరుద్ధరిస్తే పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది. -
భువిలో వైకుంఠం.. ఆంగ్కోర్వాట్ దేవాలయం
విదేశీ పుణ్యక్షేత్ర సందర్శనం అత్యంత ఖర్చుతో, శ్రమతో కూడుకున్న పని. అక్కడి భాష, సాంఘిక అలవాట్లు, కట్టుబాట్లు తెలియక చాలామంది వెళ్లాలని బలమైన కోరిక ఉన్నా వెనుకంజ వేస్తుంటారు. సామాన్యుడికి సైతం ఈ ఆలయ సందర్శనం సులభం కావాలనే లక్ష్యంతో ట్రావెల్ ఛాయిస్ ఇంటర్నేషనల్ ఎం.డి. శ్రీ సంకురాత్రి బాల వెంకటేశ్వరరావుగారు, విదేశీ హిందూ దేవాలయాల సందర్శనకు ‘వరల్డ్ వైడ్ హిందూ’ అనే పేరిట ప్రత్యేక వింగ్ను ఏర్పాటు చేసి ఒక కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. భువిలో వైకుంఠాన్ని తలపించే ఆలయాన్ని మీరెప్పుడైనా చూశారా? ఆ ఆలయం కంబోడియాలో ఉంది. కంబోడియాలో తొమ్మిదో శతాబ్దిలో కేవలం 35 ఏళ్ల వ్యవధిలో నిర్మించిన వైకుంఠవాసుని దివ్యధామమైన ‘ఆంగ్కోర్ వాట్’ దేవాలయం విశేషాలను తెలుసుకుందాం. ఒకప్పుడు కాంబోడియాను కాంభోజ దేశంగా పిలిచేవారు. యూరోపియన్ల ప్రభావంతో దీని పేరు కంపూచియాగా, కంబోడియాగా మారింది. కంబోడియాలోని ‘ఆంగ్కోర్ వాట్’ మహావిష్ణు ఆలయం ఒక మహాద్భుతం. సువిశాలమైన నీటి కొలను మధ్య భూమిని చదును చేసి, ఇసుక రాళ్లను, ఇసుకను పొరలు పొరలుగా పేర్చి, హిమాలయాల్లోని కైలాసం సహా ఐదు దివ్య శిఖరాలకు ప్రతీకగా ఐదు శిఖరాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. దీని నిర్మాణాన్ని తలపెట్టిన రాజు రెండవ సూర్యవర్మ. అతని మరణంలోగా ఆలయ నిర్మిస్తే మోక్షం లభిస్తుందని పండితులు చెప్పారు. వెంటనే ఆయన ఆలయ నిర్మాణం చేపట్టాడు. ముందుగా ఆలయంలోని నీటిమట్టాన్ని నియంత్రించేందుకు రిజర్వాయర్ నిర్మించారు. దీని ద్వారా కరువు, వరద వంటి ప్రకృతి విపత్తులను నియంత్రించగలిగారు. ఒకదానికొకటి అనుసంధానమైన 1,500 కిలోమీటర్ల పొడవునా కాలువలు నిర్మించారు. ఇనుము, అల్యూమినియం వంటి నిర్మాణ సామగ్రి రవాణా కోసం ఈ కాలువలను ఉపయోగించుకున్నారు. ఆలయ నిర్మాణానికి నీటిపై తేలియాడే ‘లాటరైట్’ రాళ్లను ఎంపిక చేశారు. వాటిపై సియాన్రీవ్లోని కులేన్ పర్వతాల నుంచి తెచ్చిన ఇసుక శిలలను అతికించి, శిల్పాలు చెక్కారు. వాటిని అంత దూరం నుంచి ఇక్కడకు తరలించేందుకు ఏనుగులను, తేలియాడే బల్లకట్లను వాడారు. పలు దేశాల శిల్పులు, సుమారు ఐదువేల మంది కార్మికులు రాత్రింబవళ్లు ఈ నిర్మాణం కోసం శ్రమించారు. ఈ ఆలయంలో 1,352 స్తంభాలు ఉన్నాయి. పైకప్పు రాళ్లను ‘కోబ్లింగ్’ పద్ధతిలో అతికారు. తేలికైన లాటరైట్ రాళ్లు కదిలి, శిలలను ముందుకు తోసివేయకుండా మెట్లు కట్టారు. పశ్చిమ ముఖద్వారం గల ఈ ఆలయం ముఖద్వారం నుంచే మూడు పెద్దపెద్ద గోపురాలు కనిపిస్తాయి. టోనెల్సాన్ సరస్సు తీరాన సుమారు 200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని పలు దేవాలయాల సముదాయం ఆహ్లాదభరితంగా ఉంటుంది. తర్వాతి కాలంలో ఈ ఆలయం తన ఉనికి కోల్పోయి అడవులలో కప్పబడిపోయింది. కంబోడియా ఫ్రెంచి ప్రభుత్వ అధీనంలోకి వచ్చాక ఇది తిరిగి వెలుగు చూసింది. కంబోడియా జాతీయ పతాకంపై ‘ఆంగ్కోర్వాట్’ ఆలయ చిత్రం ఉంటుందంటే, ఆ దేశం ఈ ఆలయానికి ఎంతటి గౌరవాన్ని ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. గర్భాలయంలో విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్టించిన సూర్యవర్మ మరణానంతరం తన అస్థికలను ఒక పేటికలో ఉంచాలని ఆదేశించాడట. తన మరణానంతరం అలా చేయగానే ఆయన మోక్షం పొందాడనేందుకు సూచనగా విష్ణుమూర్తి విగ్రహం కళ్లు తెరిచిందట. ప్రతి ఒక్కరూ జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవలసిన దివ్యధామం ‘ఆంగ్కోర్వాట్’ ఆలయం. ఆంగ్కోర్వాట్’ ఆలయం Ph: 8143000999, 040 67461999 SMS: HOLIDAY WWH to 56677