Anil Dhasmana
-
రేర్ ఫోన్‌కాల్, రహస్య లేఖ.. అభినందన్‌ను వదిలేశారు
న్యూఢిల్లీ : 2019, ఫిబ్రవరి నెలలో భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ ఆర్మీ చేతికి చిక్కిన విషయం తెలిసిందే. ఆయన నడుపుతున్న మిగ్-21 కూలిపోవడంతో ప్యారాచూట్ సాయంతో పాక్ భూభాగంలో దిగి పాక్ ఆర్మీకి చిక్కారు. దాదాపు 60 గంటలపాటు నిర్బంధంలో ఉంచి జనీవా ఒప్పందం ప్రకారం పాక్ అభినందన్‌ను వదిలేసింది. అయితే అభినందన్‌ను వదిలేయటానికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది. ఆయన పాక్ చెరలో ఉన్న సమయంలో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) చీఫ్ అనిల్ ధస్మనా పాక్‌ను గట్టిగా హెచ్చరించారు. అభినందన్‌కు ఏమైనా అయితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ సూచనల మేరకు.. ఐఎస్ఐ కౌంటర్ పార్ట్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సయ్యద్ అసిమ్ మునిర్ అహ్మద్ షాకు రేర్ ఫోన్ కాల్, రహస్య లేఖ ద్వారా ఈ హెచ్చరికలు చేశారు. అనంతరం చోటు చేసుకున్న మరికొన్ని పరిణామాలతో పాక్ వెనక్కు తగ్గి అభినందన్‌ను వదిలిపెట్టడానికి నిశ్చయించుకుంది. 2019, ఫిబ్రవరి 28వ తేదీన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత సైనికుడ్ని వదిలేస్తున్నట్లు నేషనల్ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చదవండి : నాడు అంతర్జాతీయ వెయిట్ లిఫ్టర్.. నేడు కూలీ రూ.90 లక్షల ప్లాట్ కొని.. సొరంగం తవ్వి! -
దేశ భద్రత మొత్తం ఉత్తరాఖండ్ చేతిలో..!
డెహ్రాడూన్: దేశ భద్రత మొత్తం ఉత్తరాఖండ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. అదేమిటని ఆశ్చర్యపోతున్నారా.. మరేం లేదు.. దేశ రక్షణకు సంబంధించిన అత్యున్నత పోస్టులన్నీ కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులే కైవసం చేసుకున్నారు. సహజంగానే దైవ భూమి, వీరభూమి అనే పేరున్న పర్వతాలమయమైన ఉత్తరాఖండ్.. పౌరుషాలకు పెట్టింది పేరు. ఇక్కడ నుంచి ఎంతోమంది భారత ఆర్మీలో, జాతీయ భద్రతా దళంలో, పోలీసు విభాగంలో ఉన్నారు. తాజాగా దేశ సైన్యాధ్యక్షుడిగా ఎంపికైన లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్, రా బాస్ గా ఎంపికైన అలిల్ ధస్మానా కూడా ఉత్తరాఖండ్‌కు చెందిన వారే కావడం విశేషం. వీరిద్దరు కూడా పౌరీ గర్వాల్ జిల్లాకు చెందినవారు కావడం మరింత చెప్పుకోదగిన విషయం. ఇంకా జాతీయ భద్రతా సలహా దారుగా వ్యవహరిస్తున్న అజిత్ దోవల్ కూడా పౌరీ గర్వాల్లోని గిరి బానెల్సియన్ ప్రాంతానికి చెందినవారు. ఒక కోస్టు గార్డు చీఫ్ గా పనిచేస్తున్న రాజేంద్ర సింగ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ అనిల్ భట్ ఇలా చాలా మంది రక్షణ విభాగంలో ఉన్నతాధికారులుగా ఎంపికై విధులు నిర్వర్తిస్తున్నారు. దీనిపై మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత, ఆర్మీలో కూడా పనిచేసి రిటైర్డ్ అయిన మేజర్ జనరల్ బీసీ ఖండూరి స్పందిస్తూ ఇది తమ రాష్ట్రానికి దక్కిన అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.