Answer Key
-
AP: కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కీ విడుదల
సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ(ఆదివారం) జరిగిన పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు 91 శాతం అభ్యర్ధులు హాజరైనట్లు రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. అలాగే కీని సైతం రిలీజ్ చేసేసింది. మొత్తం 6,100 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. 5,03,487 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. ఇదిలా ఉంటే.. ఆదివారం ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు 4,58,219 మంది హాజరు కాగా, 45,268 మంది గైర్హాజరు అయ్యారు. ఇక ముందుగా చెప్పిన టైంకి slprb.ap.gov.in వెబ్సైట్ లో ప్రిలిమినరీ ఆన్సర్ కీ అప్ లోడ్ చేశారు అధికారులు. జనవరి 25వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ప్రిలిమినరీ ఆన్సర్ కీ పై అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పిస్తారు. అభ్యంతరాలను తెలిపేందుకు id mail-slprb@ap.gov.in మెయిల్ ఐడీ కేటాయించింది రిక్రూట్మెంట్ బోర్డు. పూర్తి సమాచారం కోసం సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ క్లిక్ చేయండి -
వచ్చే వారంలో గ్రూప్–1 ప్రిలిమ్స్ ఫైనల్ కీ!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష తుది కీ విడుదలకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కసరత్తు వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేసిన కమిషన్... ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ చేపట్టింది. ఈనెల 4తో ప్రాథమిక కీ అభ్యంతరాల స్వీకరణ పూర్తికాగా, పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వచ్చినట్లు సమాచారం. అయితే మొత్తంగా ఎన్ని అభ్యంతరాలు వచ్చాయనే విషయాన్ని కమిషన్ వెల్లడించలేదు. మరోవైపు ప్రాథ మిక కీ పైన వచ్చిన అభ్యంతరాల పరిశీలనకు టీఎస్పీఎస్సీ కార్యాచరణ సిద్ధంచేసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను లోతుగా పరిశీలించాలని నిర్ణయించిన టీఎస్పీఎస్సీ.. ప్రత్యేకంగా నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. సోమవారం నుంచి అభ్యంతరాల పరిశీలన చేపట్టనున్నట్లు సమాచారం. వాటిలో సమ్మతమైనవెన్ని?... ప్రశ్నపత్రంలో తప్పొప్పులున్నాయా? తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి తుది కీ ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల్లోగా పరిశీలన పూర్తి చేయాలని భావిస్తున్న కమిషన్.. ఈ ప్రక్రియ ముగిస్తే వచ్చే వారంలో తుది కీని విడుదల చేయనుంది. ప్రిలిమినరీ పరీక్షకు మొత్తం 3.8 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఈనెల 16న పరీక్షకు 2,85,916 మంది హాజరయ్యారు. -
ఆన్సర్ చేసినా ఆనవాలే లేదట.. జేఈఈ అభ్యర్థులకు చేదు అనుభవం
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్ష మునుపెన్నడూ లేనంతగా సమస్యలు సృష్టిస్తోంది. పరీక్ష రోజు గంటల తరబడి ఆలస్యం కాగా... ఇప్పు డు సమాధానం ఇచ్చిన ప్రశ్నలను కంప్యూటర్ లెక్కలోకి తీసుకోని చేదు అనుభవం అభ్యర్థులు చవిచూస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దేశవ్యాప్తంగా నిర్వ హించిన ఈ పరీక్షలో లోపాలు వస్తే వినే నాథుడే కన్పించడం లేదని విద్యార్థులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎన్టీఏ జేఈఈ ప్రశ్నపత్రం కీ విడు దల చేసింది. అభ్యర్థులు లాగిన్ అయి చూసుకుని కలవరప డుతున్నారు. తాము ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే, తక్కువ ఇచ్చినట్టు చూపిస్తోందని అనేకమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లోని ఒక మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో పరీక్ష రాసిన విద్యార్థుల్లో దాదాపు పది మందికి ఇదే అనుభవం ఎదురైంది. అనుజ్ అనే విద్యార్థి 65 ప్రశ్నలకు కంప్యూటర్లో టిక్ పెడితే, రెస్పాన్స్ షీట్ మాత్రం 30 ప్రశ్నలకు బదులిచ్చినట్లే చూపింది. మరో విద్యార్థిని భవిత్ 51 ప్రశ్నలు పూర్తి చేస్తే, 34 మాత్రమే చేసినట్టు వచ్చిందని తెలిపింది. ముద్ద యశ్వసిని అనే విద్యార్థిని 21 ప్రశ్నలు పూర్తి చేస్తే, రెస్పాన్స్ షీట్ లో అసలేమీ చేయలేదని వచ్చిందని వాపోయింది. దీనిపై ఎన్టీఏకి ఫిర్యాదు చేసినా స్పందించలేదని, పొరపాట్లను సరిచేయకపోతే ప్రతిభావంతులు కూడా కనీస ర్యాంకుకు చేరుకోవడం కష్టమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఈసెట్ ప్రాథమిక కీ విడుదల
అనంతపురం : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 14 వ తేదీన నిర్వహించిన ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈసెట్)-2015 ప్రాథమిక 'కీ'ని శనివారం విడుదల చేసినట్లు ఏపీ ఈ-సెట్ కన్వీనర్ ఆచార్య పీఆర్ భానుమూర్తి తెలిపారు. ఆన్సర్ కీ ని www.apecet.org అనే వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చునని సూచించారు. ఇందులో ఏమైనా సందేహాలుంటే apecet2015key@gmail.comకు గానీ, ఫ్యాక్స్ నెంబరు 08554-235678కు గానీ ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తెలియజేయాలని పేర్కొన్నారు. ఈ నెల 20న తుది 'కీ' విడుదల చేస్తామని వెల్లడించారు.