anti-corruption officials
-
లంచం తీసుకోవాలంటే భయపడాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవినీతి నిరోధక చర్యల విషయంలో ఏసీబీ పనితీరు ఆశించిన మేర లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లంచాలు ఇచ్చే పరిస్థితి ఎక్కడా ఉండకూడదని, ఎమ్మార్వో కార్యాలయాలు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, టౌన్ ప్లానింగ్ ఆఫీసుల్లో ఎక్కడా అవినీతి కనిపించకూడదని, లంచం తీసుకోవాలంటే భయపడే పరిస్థితి రావాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. అందుకోసం ఏసీబీ అధికారులు మరింత చురుగ్గా, క్రియాశీలకంగా.. అంకిత భావంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. ఏసీబీలో పనిచేస్తున్న సిబ్బందికి అలసత్వం ఉండకూడదని, అవినీతి తిమింగలాల భరతం పట్టాలని ఏసీబీ అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఏసీబీ(అవినీతి నిరోధక విభాగం) పనితీరుపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఏ సదుపాయాలు కావాలన్నా ఇస్తాం: సీఎం రాష్ట్రంలో అవినీతి నిరోధానికి 14400 కాల్‌సెంటర్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. దాని ఏర్పాటు వెనుక మంచి కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాల్ సెంటర్ ఏర్పాటు వల్ల ఆశించిన ఫలితాలు కనిపించాల్సిందేనని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ప్రజలెవరూ అవినీతి బారిన పడకూడదనే ఉద్దేశంతోనే కాల్ సెంటర్ ఏర్పాటు చేశామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఏసీబీ0 అధికారులకు వివరించారు. సెలవులు లేకుండా పనిచేసి, మూడు నెలల్లోగా స్పష్టమైన మార్పు చూపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అందుకోసం అవసరమైన మేర సిబ్బందిని తీసుకోవాలని, ఎలాంటి సదుపాయాలు కావాలన్న ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని సీఎం జగన్ స్పష్టం చేశారు. మరో నెలరోజుల్లో పనితీరును మళ్లీ సమీక్షిస్తానని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఏసీబీ చీఫ్ విశ్వజిత్ తదితరులు పాల్గొన్నారు. -
మనీతో మార్కులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నైలోని అన్నా యూనివర్సిటీ అధికారులు డబ్బులకు కక్కుర్తిపడ్డారు. డబ్బులు ఇచ్చిన విద్యార్థులకు మార్కులు వేసి పాస్ చేశారు. ఇలా ఏళ్లుగా సాగుతున్న ఈ దందా మెరిట్ విద్యార్థుల ఫిర్యాదుతో బయటపడింది. అధికారులు వసూలు చేసిన మొత్తం రూ.240 కోట్లు ఉంటుందని దర్యాప్తులో తేలింది. ఇంజినీరింగ్, మెడికల్ తదితర ప్రధాన కోర్సులు చదివే విద్యార్థులు సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిలైనా, ఆశించిన దానికంటే తక్కువ మార్కులు వచ్చినా పునః మూల్యాంకనం (రీవాల్యుయేషన్) కోసం దరఖాస్తు చేస్తారు. గత ఏడాది 12 లక్షల మంది సెమిస్టర్ పరీక్షలు రాశారు. వారిలో 3,02,380 మంది రీవాల్యుయేషన్‌కి దరఖాస్తు చేశారు. రీవాల్యుయేషన్ చేపట్టిన అధికారులు అదనంగా 73,733 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్టు ప్రకటన విడుదల చేశారు. దీంతోపాటు 16,630 మందికి అదనపు మార్కులొచ్చాయి. మొత్తంగా 90,369 మంది లబ్ధి పొందారు. ఈ విషయమై పలువురు విద్యార్థులు అవినీతినిరోధకశాఖకు ఫిర్యాదు చేశారు. ముడుపులు అందుకుని అదనపు మార్కులు వేస్తున్నట్లు కొందరు దళారుల ద్వారా తెలుసుకున్న విద్యార్థులు ఇచ్చిన సమాచారంతో ఏసీబీ అధికారులు రహస్య విచారణ చేపట్టగా వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తేలింది. ఈ దందా 2011 నుంచి జరుగుతున్నట్లు గుర్తించారు. 2011–16కాలంలో దాదాపు 12 లక్షల మంది రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోగా 5 లక్షలమందికి అదనపు మార్కులొచ్చాయి. ఈ ఐదు లక్షల మందిలో ఎంత మంది విద్యార్థులు లంచాలు ఇచ్చి లబ్ధి పొంది ఉంటారని ఆరాతీస్తున్నారు. ఒక్కో సెమిస్టర్‌కు రూ.45 కోట్ల వరకు విద్యార్థుల నుంచి అధికారులు వసూలు చేసినట్లు తేలింది. మార్కుల పునఃపరిశీలన పేరుతో గత మూడేళ్లలో ఆరు సెమిస్టర్లకుగాను దాదాపు రూ.240 కోట్లు స్వాహా చేసినట్లు భావిస్తున్నారు. దీంతో అవినీతి నిరోధకశాఖ, విజిలెన్స్ శాఖలో ప్రత్యేక విభాగానికి చెందిన అధికారులు అన్నా యూనివర్సిటిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి 2015–18 మధ్యకాలంలో ఎగ్జామినేషన్ కంట్రోలర్‌గా వ్యవహరించిన ఉమ సహా పదిమందిపై కేసులు పెట్టారు. ఆరోపణలు ఎదుర్కొన్న ప్రొఫెసర్లు, వర్సిటీ అధికారుల ఇళ్లలో తనిఖీలు చేయగా అదనపు మార్కుల అక్రమాలకు సంబంధించిన ఆధారాలు, స్థిరాస్తుల పత్రాలు లభించాయి. మరిన్ని ఆధారాలను వర్సిటీ అధికారులు ధ్వంసం చేసినట్లు కూడా విచారణలో వెల్లడైంది. -
చెక్పోస్టులపై ఏసీబీ దాడులు
- లెక్కకు మించిన రూ.44,690 స్వాధీనం - విచారణ అనంతరం చర్యలు : ఏసీబీ డీఎస్పీ పలమనేరు : పలమనేరు సమీపంలోని చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిలో ఉన్న పలు చెక్పోస్టులపై తిరుపతి అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం దాడులు చేశారు. లెక్కకు మించి అనధికారికంగా దొరికిన రూ.44,690 నగదును సీజ్ చేశారు. పట్టణ సమీపంలోని కేటిల్‌ఫామ్ వద్ద ఆర్టీవో, వాణిజ్య పన్నులశాఖ, అటవీశాఖ, ఎక్సైజ్, సివిల్ సప్లయిస్ చెక్‌పోస్టులు పక్కపక్కనే ఉన్నాయి. వీటిల్లో బిల్లులకు చెల్లించాల్సిన నగదుతో పాటు అధికంగా డబ్బు వసూలు చేస్తున్నారని పలువురు డ్రైవర్లు ఏసీబీకి సమాచారమిచ్చారు. దీంతో తిరుపతి ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి, సీఐలు చంద్రశేఖర్, సుధాకర్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, శ్రీనివాస్, జావెద్‌ఖాన్ సిబ్బంది కలసి మంగళవారం దాడులు చేశారు. తొలుత కమర్షియల్ టాక్స్ చెక్‌పోస్టులో లెక్కకు మించిన రూ.21,600ను సీజ్ చేశారు. అక్కడ పనిచేసే ఈ ప్రైవేట్ ఏజెంట్‌ను బాధ్యునిగా చూపారు. పక్కనే ఉన్న ఫారెస్ట్ స్పెషల్ చెక్‌పోస్టులో రూ.19,960ని స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ స్థానిక ఎఫ్ఆర్వో శివన్న సైతం ఉన్నా రు. ఈ చెక్‌పోస్టును ఎర్రచందనం అక్రమరవాణా కోసం ఏర్పాటు చేసినా అన్ని వాహ నాల నుంచి డబ్బు గుంజుతున్నట్టు ఏసీబీ తెలుసుకుంది. మరో పక్కనున్న ఆర్టీవో చెక్‌పోస్టులో రూ.3,130 మాత్రమే దొరికింది. మొత్తం కలిపి రూ.44,690లను సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి పలువురి వద్ద స్టేట్మెంట్లు రికార్డు చేసుకున్నారు. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ శంకర్ రెడ్డి తెలిపారు. ఏసీబీ దాడులు చేస్తుండగా చెక్‌పోస్టుల్లోని పలువురు ప్రయివేటు ఏజెంట్లు పారిపోయినట్లు తెలిసింది. -
ఖాకీ లంచావతారం
కారును పోలీస్‌స్టేషన్ నుంచి రిలీజ్ చేయడానికి లంచం డిమాండ్ రూ.8 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మేడ్చల్ ఎస్ఐ రాములు రెండు నెలలుగా బాధితుడిని వేధించిన వైనం స్థానికంగా కలకలం రేపిన సంఘటన మేడ్చల్ : ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడి చట్టంపై పౌరులకు విశ్వా సం కల్పించాల్సిన ఎస్ఐ లంచావతారమెత్తాడు. ఆమ్యామ్యాలు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. మేడ్చల్ ఎస్ఐ రాములు రూ.8 వేలు లం చం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. రెండు నెలలుగా వేధిస్తున్న ఎస్ఐని బాధితుడు ఎట్టకేలకు ఏసీబీ అధికారులను ఆశ్రయించి బండారాన్ని బయటపెట్డాడు. సైబరాబాద్ ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్, ఎస్ఐని ఏసీబీకి పట్టించిన బాధితుడు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్‌కు చెం దిన అబ్దుల్జ్రాక్ అనే వ్యక్తి కుటుంబసభ్యులకు వైద్య పరీక్షలు చేయించడానికి జూన్ నా లుగో తేదీన తన హుండయ్ కారును డ్రైవర్ అమీర్‌ఖాన్‌కు ఇచ్చి పంపించాడు. మేడ్చల్‌లోని జాతీయ రహదారిపై ఆర్టీసీ కాలని చౌరస్తా సమీపంలో హోండా ఆక్టివాను కారు డ్రైవర్ ఢీకొట్టాడు. దీంతో హోండాఆక్టివాపై వెళుతున్న అత్వెల్లి గ్రామానికి చెందిన అశోక్ తీవ్రగాయాల పాలయ్యాడు. చికిత్స పొం దు తూ అదే నెల 7న మరణించాడు. ఈ కేసు దర్యాప్తును ఎస్ఐ రాములుకు మేడ్చల్ సీఐ అప్పగించారు. ఎస్ఐ కేసును 304/ఎ సెక్షన్ కింద నమోదు చేశాడు. జూన్ 22న ఎస్ఐ కారు యజమాని అబ్దుల్జ్రాక్కు నోటీసులు జారీ చేసి కారుకు సంబంధించిన ధ్రువపత్రాలను తీసుకురావాలని చెప్పాడు. అదే రోజు అబ్దుల్జ్రాక్ ఎస్ఐని కలవడంతో పోలీస్‌స్టేషన్‌లో కారు ఉందని.. దానిని రిలీజ్ చేయడానికి ఎంవీఐ విచారణ చేయాలన్నా డు. అం దుకు రూ.10 వేలు ఖర్చవుతుందన్నాడు. ఈ విషయమై రజాక్ ఆదిలాబాద్ నుంచి నాలుగైదుసార్లు మేడ్చల్ పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరి గాడు. జూన్ 29న ఎంవీఐ చెకింగ్ పూర్తయ్యిం దని డబ్బులు తీసుకురావాలని ఎస్ఐ డిమాం డ్ చేశాడు. ఆయన వేధింపులు తట్టుకోలేని రజాక్ ఏంచేయాలో పాలుపోక కారును తీసుకెళ్లలేదు. దీంతో ఎస్ఐ రాములు జూలై 27న రజాక్‌కు ఫోన్ చేసి విచారణ పూర్తయ్యింది కారును తీసుకెళ్లాలని, వచ్చేటప్పుడు రూ.10 వేలు తీసుకురావాలని డిమాండ్ చేశాడు. రజాక్ తన వద్ద రూ.8 వేలే ఉన్నాయని చెప్పడంతో.. అవైనా సరే తీసుకుని రమ్మని హు కుం జారీ చేశాడు. ఎస్ఐ వేధింపులను తట్టుకోలేని రజాక్ విషయాన్ని జిల్లా ఏసీబీ అధికారులకు చెప్పాడు. వారు పథకం ప్రకారం గురువారం సాయంత్రం 4 గంటలకు రజాక్‌ను పోలీస్‌స్టేషన్‌లోకి పంపించారు. ఎస్ఐ రాములుకు డబ్బులు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ దొరికిన ఎస్ఐ రాములును న్యాయస్థానంలో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. దాడిలో ఏసీబీ సీఐలు లక్ష్మి, వెంకట్‌రెడ్డి, నాగేష్, సిబ్బంది పాల్గొన్నారు. రాములుది 2007 బ్యాచ్.. ఏసీబీ అధికారులకు చిక్కిన ఎస్ఐ రాములుది 2007 సంవత్సరం బ్యాచ్. ఆయన గతంలో నగరంలోని మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ట్రాఫిక్ ఎస్ఐగా పని చేసి 2013 సెప్టెంబర్ 13న మేడ్చల్ కు బదిలీపై వచ్చా డు. రాములు స్వస్థలం మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం రాయపోల్ గ్రామం. కాగా.. ఎస్ఐ రాములు ఏసీబీకి చిక్కిన సంఘటన గురువారం మేడ్చల్‌లో కలకలం రేపింది. అవినీతిమయంగా మేడ్చల్ పోలీస్‌స్టేషన్.. మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పూర్తిగా అవినీతీమయంగా మారిందంటూ పలువురు ఆరోపిస్తున్నారు. మేడ్చల్ సీఐ అవినీతికి పాల్పడుతున్నాడంటూ బీజేపీ నాయకుడు నరేందర్‌రెడ్డి సైబరాబాద్ కమిషనర్‌కు గతంలో ఫిర్యాదు చేశారు. ఆరు నెలల క్రితం పీఎస్ పరిధిలోని హనీబర్గ్ రిసార్టులో విదేశీయులు అశ్లీల నృత్యాలు చేయడం కేసులో ఎస్ఐ గోపరాజుపై నాటి బాలానగర్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎస్ఐల అవినీతి కారణంగానే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ పరోక్షంగా హెచ్చరించారు. ఓ చోరీ కేసు విషయంలో మేడ్చల్‌లోని మరో ఎస్ఐ సతీష్‌కుమార్ తమను వేధించాడని మెదక్ జిల్లా నర్సాపూర్ నకు చెందిన దంపతులు ఆరు నెలల క్రితం ఏకంగా మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడం గమనార్హం.