ఖాకీ లంచావతారం | Police illigal activities | Sakshi
Sakshi News home page

ఖాకీ లంచావతారం

Published Fri, Jul 31 2015 12:01 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

Police illigal activities

కారును పోలీస్‌స్టేషన్ నుంచి రిలీజ్ చేయడానికి లంచం డిమాండ్
రూ.8 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మేడ్చల్ ఎస్‌ఐ రాములు
రెండు నెలలుగా బాధితుడిని వేధించిన వైనం
స్థానికంగా కలకలం రేపిన సంఘటన
 
 మేడ్చల్ : ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడి చట్టంపై పౌరులకు విశ్వా సం కల్పించాల్సిన ఎస్‌ఐ లంచావతారమెత్తాడు. ఆమ్యామ్యాలు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. మేడ్చల్ ఎస్‌ఐ రాములు రూ.8 వేలు లం చం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. రెండు నెలలుగా వేధిస్తున్న ఎస్‌ఐని బాధితుడు ఎట్టకేలకు ఏసీబీ అధికారులను ఆశ్రయించి బండారాన్ని బయటపెట్డాడు. సైబరాబాద్ ఏసీబీ డీఎస్‌పీ ప్రభాకర్, ఎస్‌ఐని ఏసీబీకి పట్టించిన బాధితుడు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆదిలాబాద్‌కు చెం దిన అబ్దుల్జ్రాక్ అనే వ్యక్తి కుటుంబసభ్యులకు వైద్య పరీక్షలు చేయించడానికి జూన్ నా లుగో తేదీన తన హుండయ్ కారును డ్రైవర్ అమీర్‌ఖాన్‌కు ఇచ్చి పంపించాడు. మేడ్చల్‌లోని జాతీయ రహదారిపై ఆర్టీసీ కాలని చౌరస్తా సమీపంలో హోండా ఆక్టివాను కారు డ్రైవర్ ఢీకొట్టాడు. దీంతో హోండాఆక్టివాపై వెళుతున్న అత్వెల్లి గ్రామానికి చెందిన అశోక్ తీవ్రగాయాల పాలయ్యాడు. చికిత్స పొం దు తూ అదే నెల 7న మరణించాడు. ఈ కేసు దర్యాప్తును ఎస్‌ఐ రాములుకు మేడ్చల్ సీఐ అప్పగించారు.

ఎస్‌ఐ కేసును 304/ఎ సెక్షన్ కింద నమోదు చేశాడు. జూన్ 22న ఎస్‌ఐ కారు యజమాని అబ్దుల్జ్రాక్‌కు నోటీసులు జారీ చేసి కారుకు సంబంధించిన ధ్రువపత్రాలను తీసుకురావాలని చెప్పాడు. అదే రోజు అబ్దుల్జ్రాక్ ఎస్‌ఐని కలవడంతో  పోలీస్‌స్టేషన్‌లో కారు ఉందని.. దానిని రిలీజ్ చేయడానికి ఎంవీఐ విచారణ చేయాలన్నా డు. అం దుకు రూ.10 వేలు ఖర్చవుతుందన్నాడు. ఈ విషయమై రజాక్ ఆదిలాబాద్ నుంచి నాలుగైదుసార్లు మేడ్చల్ పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరి గాడు.

జూన్ 29న ఎంవీఐ చెకింగ్ పూర్తయ్యిం దని డబ్బులు తీసుకురావాలని ఎస్‌ఐ డిమాం డ్ చేశాడు. ఆయన వేధింపులు తట్టుకోలేని రజాక్ ఏంచేయాలో పాలుపోక కారును తీసుకెళ్లలేదు. దీంతో ఎస్‌ఐ రాములు జూలై 27న రజాక్‌కు ఫోన్ చేసి విచారణ పూర్తయ్యింది కారును తీసుకెళ్లాలని, వచ్చేటప్పుడు రూ.10 వేలు తీసుకురావాలని డిమాండ్ చేశాడు. రజాక్ తన వద్ద రూ.8 వేలే ఉన్నాయని చెప్పడంతో..  అవైనా సరే తీసుకుని రమ్మని హు కుం జారీ చేశాడు.

ఎస్‌ఐ వేధింపులను తట్టుకోలేని  రజాక్ విషయాన్ని జిల్లా ఏసీబీ అధికారులకు చెప్పాడు. వారు పథకం ప్రకారం గురువారం సాయంత్రం 4 గంటలకు రజాక్‌ను పోలీస్‌స్టేషన్‌లోకి పంపించారు. ఎస్‌ఐ రాములుకు డబ్బులు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ దొరికిన ఎస్‌ఐ రాములును న్యాయస్థానంలో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్‌పీ ప్రభాకర్ తెలిపారు. దాడిలో ఏసీబీ సీఐలు లక్ష్మి, వెంకట్‌రెడ్డి, నాగేష్, సిబ్బంది పాల్గొన్నారు.

 రాములుది 2007 బ్యాచ్..
 ఏసీబీ అధికారులకు చిక్కిన ఎస్‌ఐ రాములుది 2007 సంవత్సరం బ్యాచ్. ఆయన గతంలో నగరంలోని మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ట్రాఫిక్ ఎస్‌ఐగా పని చేసి 2013 సెప్టెంబర్ 13న మేడ్చల్ కు బదిలీపై వచ్చా డు. రాములు స్వస్థలం మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం రాయపోల్ గ్రామం. కాగా.. ఎస్‌ఐ రాములు ఏసీబీకి చిక్కిన సంఘటన గురువారం మేడ్చల్‌లో కలకలం రేపింది.
 
 అవినీతిమయంగా మేడ్చల్ పోలీస్‌స్టేషన్..
  మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పూర్తిగా అవినీతీమయంగా మారిందంటూ పలువురు ఆరోపిస్తున్నారు. మేడ్చల్ సీఐ అవినీతికి పాల్పడుతున్నాడంటూ బీజేపీ నాయకుడు నరేందర్‌రెడ్డి సైబరాబాద్ కమిషనర్‌కు గతంలో ఫిర్యాదు చేశారు. ఆరు నెలల క్రితం పీఎస్ పరిధిలోని హనీబర్గ్ రిసార్టులో విదేశీయులు అశ్లీల నృత్యాలు చేయడం కేసులో ఎస్‌ఐ గోపరాజుపై నాటి బాలానగర్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఎస్‌ఐల అవినీతి కారణంగానే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ పరోక్షంగా హెచ్చరించారు. ఓ చోరీ కేసు విషయంలో మేడ్చల్‌లోని మరో ఎస్‌ఐ సతీష్‌కుమార్ తమను వేధించాడని మెదక్ జిల్లా నర్సాపూర్ నకు చెందిన దంపతులు ఆరు నెలల క్రితం ఏకంగా మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement