Appaji
-
సీక్వెల్ కు జై కొడుతున్న స్టార్ హీరోలు..
-
ధీరజ అప్పాజీకి ‘గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారం’
సినిమా జర్నలిజంలో చేస్తున్న కృషికి గాను సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీని ప్రతిష్టాత్మక గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారం వరించింది. ‘వాడుక భాషా ఉద్యమ పితామహుడు’ గిడుగు రామ్మూర్తి పంతులు 83వ వర్ధంతిని పురస్కరించుకుని... ‘శంకరం వేదిక’తో కలిసి గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ నిర్వహించిన వేడుకలో అప్పాజీ ఈ పురస్కారం అందుకున్నారు. తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ డా.జి.రాధారాణి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి తెలంగాణ బి.సి.కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు, ఇన్కమ్ టాక్స్ కమిషనర్ జీవన్ లాల్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహిత్య - కళ - సేవా రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్న పలువురికి ఈ పురస్కారాలు ప్రదానం చేశారు. హైదరాబాద్, సుందరయ్య విజ్ఞానకేంద్రంలో శనివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ అధ్యక్షురాలు ‘గిడుగు కాంతికృష్ణ’, ప్రముఖ పాత్రికేయులు - కవి - కళారత్న డా.బిక్కిన కృష్ణ, ‘శంకరం వేదిక’ అధ్యక్షురాలు యలవర్తి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధం.. ఒకే గదిలో ముగ్గురు.. చివరకు..
సాక్షి, కృష్ణా జిల్లా: వివాహేతర సంబంధం ఓ వ్యక్తి దారుణ హత్యకు దారి తీసింది. నందిగామ పట్టణంలోని ఎన్సీఆర్ క్లబ్ రోడ్డులో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గుత్తి విజయ్, ఉష కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం నందిగామలోని ఓ హోటల్ పని చేసేందుకు వచ్చారు. ఈ క్రమంలో ఉషకు వరి అప్పాజీ అనే వ్యక్తితో కొంత కాలంగా పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం ఆ ముగ్గురు కూడా ఒకే గదిలో నివాసం ఉంటున్నారు. ఉష, అప్పాజీ తో కూడా బాగా చనువుగా ఉంటోంది. అది నచ్చని విజయ్ నిద్రపోతున్న అప్పాజీని కత్తితో పీక కోసి హత మార్చాడు. ఆ సమయంలో అడ్డొచ్చిన ఉషకు కూడా తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: (ప్రియురాలికి స్నేహితురాలు వీడియోకాల్.. వక్రబుద్ధితో..) -
చర్చికి వెళ్లిన మహిళ అదృశ్యం
చర్చికి వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైంది ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దగ్గుమిల్లి అప్పాజీ భార్య లక్ష్మి(52) గృహిణి. ఆమె సోమవారం ఉదయం 11 గంటల సమయంలో మియాపూర్‌లోని కల్వరి టెంపుల్ చర్చికి ప్రార్థన కోసం వెళ్లింది. ప్రార్థనల అనంతరం సాయంత్రమైనా ఆమె ఇంటికి తిరిగి రాకపోవటంతో కుటుంబసభ్యులు అన్ని చోట్లా ఆరా తీశారు. జాడ తెలియకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘రాజమహల్’లో రహస్యం
హారర్, సస్పెన్స్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ప్రేమకథా చిత్రం ‘రాజమహల్’. అప్పాజీ కొండా దర్శకుడు. సన్ ఐ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రంలో సూర్యనాథ్ మూడు భిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఆరుగురు హీరోయిన్లు. 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ సినిమా కథా కథనాలు వైరైటీగా ఉంటాయి. గ్రాఫిక్స్ ఈ చిత్రానికి హైలైట్. మిగిలిన షూటింగ్‌ని త్వరలో పూర్తి చేసి, డిసెంబర్లో పాటలను, ఫిబ్రవరి రెండోవారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. రియా, అక్షయ, సుమన్, జీవా, సూర్య, కాదంబరి కిరణ్‌కుమార్, జయవాణి, సందీప్తి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జి.ఎల్.బాబు, సంగీతం: సురేష్ యువన్.