Aprentissip student
-
ఇంటర్లో మళ్లీ అప్రెంటిస్‌షిప్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సులు చదువుతున్న, ఇప్పటికే చదువుకున్న విద్యార్థులకు శుభవార్త. 4ఏళ్ల తర్వాత మళ్లీ వారి కోసం ఇంటర్ విద్యాశాఖ అప్రెంటిస్‌షిప్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా గత నాలుగేళ్ల పాటు ఇంటర్లో వొకేషనల్ కోర్సుల విద్యార్థులకు అంప్రెటిస్‌షిప్ చేసే అవకాశం లేకుండా పోయింది. ఏడాది కాలం అప్రెంటిస్‌షిప్ చేయనందున ప్రభుత్వ ఉద్యోగాలకు తాము అనర్హులం అవుతున్నామని విద్యార్థులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఇంటర్ వొకేషనల్ కోర్సులను రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (ఆర్డీఎస్డీఈ) పరిధిలోకి తీసుకువచ్చేలా ఇంటరీ్మడియట్ విద్య కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ చేసిన ప్రయత్నం ఫలించింది. దీంతో ఇంటర్లో పారా మెడికల్, ఇతర సాంకేతిక విద్యా కోర్సులను చదివే విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్ అవకాశం కల్పించే సంస్థలు ఆర్డీఎస్‌డీఈలో నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టారు. ఆ కోర్సుల విద్యార్థులు కావాలి.. బుధవారం హైదరాబాద్‌లోని 46 ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆయా సంస్థల్లో అప్రెంటిస్‌షిప్ విద్యార్థుల అవసరాలపై చర్చించారు. వారంతా తమకు ఫార్మా టెక్నాలజీ (పీహెచ్‌టీ), మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎంఎల్టీ), ఫిజియోథెరపీ (పీటీ), మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) వంటి కోర్సులు చేసిన విద్యార్థులు కావాలని అడిగారు. అయితే ఆయా సంస్థలు ఆర్డీఎస్డీఈ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు. వచ్చే మార్చి/ఏప్రిల్‌లో అప్రెంటిస్ మేళా నిర్వహిస్తామని పేర్కొన్నారు. అందులో పాల్గొని విద్యార్థులను ఎంపిక చేసుకోవాలని కోరారు. -
క్షమించు అమ్మ.. నేను చనిపోతున్నా..
- హాస్టల్ గదిలో దొరికిన సూసైడ్ నోట్ - వ్యక్తిగత కారణాల వల్లేనని పోలీసుల వెల్లడి రామచంద్రాపురం: మెదక్ జిల్లా బీహెచ్ఈఎల్లో అప్రెంటిస్‌షిప్ విద్యార్థి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం భెల్ టౌన్షిప్లో సంచలనం రేపింది. మృతుడి హాస్టల్ గదిలో సూసైడ్‌నోట్ లభించింది. అందులో ‘అమ్మా, సారీ’ అని చివరిలో రాసి ఉంది. ఎస్ఐ ప్రవీణ్‌రెడ్డి కథనం ప్రకారం.. సూరారానికి చెందిన వెంకటేశ్ వృత్తి రీత్యా డ్రైవర్. అతని కుమారుడు సాయిఅభినంద్ (22) భెల్ పరిశ్రమలో అప్రెంటిస్‌షిప్ చేస్తున్నాడు. పరిశ్రమ సమీపంలోని భెల్ హాస్టల్లో ఉంటున్నాడు. సోమవారం సాయిఅభినంద్ గది నుంచి బయటకు వెళ్లాడు. గదిలో ఉన్న స్నేహితులు చాలా సేపటి తరువాత అక్కడ ఉన్న ఓ పేపర్‌ను గమనించారు. ‘నేను హాస్టల్ వెనుక భాగంలో ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని ఆ సూసైడ్‌నోట్‌లో ఉంది. వెంటనే స్నేహితులు హాస్టల్ వెనుక భాగంలో వెతికారు. ఓ గదిలో కాలిపోయిన మృతదేహాన్ని గమనించారు. వెంటనే భెల్ అధికారులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ప్రవీణ్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సూసైడ్ నోట్లో తన తండ్రి గురించి రాశాడు. మద్యం, సిగరేట్, గుట్కా మానాలని సూచించాడు. చివరలో ‘అమ్మా, సారీ’ అంటూ రాశాడు. పోలీసులు స్థానికంగా ఉన్న అతడి బంధువులకు సమాచారమిచ్చారు. సాయిఅభినంద్ను వారి తల్లిదండ్రులు గారాబంగా చూసుకునే వారని మృతుడి బంధువులు తెలిపారు. గత కొద్దిరోజుల క్రితం ఆలౌట్‌లో లిక్విడ్ తాగి ఆత్మహత్యకు యత్నించినట్టు పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.