- హాస్టల్ గదిలో దొరికిన సూసైడ్ నోట్
- వ్యక్తిగత కారణాల వల్లేనని పోలీసుల వెల్లడి
రామచంద్రాపురం: మెదక్ జిల్లా బీహెచ్‌ఈఎల్‌లో అప్రెంటిస్‌షిప్ విద్యార్థి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం భెల్ టౌన్‌షిప్‌లో సంచలనం రేపింది. మృతుడి హాస్టల్ గదిలో సూసైడ్‌నోట్ లభించింది. అందులో ‘అమ్మా, సారీ’ అని చివరిలో రాసి ఉంది. ఎస్‌ఐ ప్రవీణ్‌రెడ్డి కథనం ప్రకారం.. సూరారానికి చెందిన వెంకటేశ్ వృత్తి రీత్యా డ్రైవర్. అతని కుమారుడు సాయిఅభినంద్ (22) భెల్ పరిశ్రమలో అప్రెంటిస్‌షిప్ చేస్తున్నాడు. పరిశ్రమ సమీపంలోని భెల్ హాస్టల్‌లో ఉంటున్నాడు. సోమవారం సాయిఅభినంద్ గది నుంచి బయటకు వెళ్లాడు. గదిలో ఉన్న స్నేహితులు చాలా సేపటి తరువాత అక్కడ ఉన్న ఓ పేపర్‌ను గమనించారు. ‘నేను హాస్టల్ వెనుక భాగంలో ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని ఆ సూసైడ్‌నోట్‌లో ఉంది. వెంటనే స్నేహితులు హాస్టల్ వెనుక భాగంలో వెతికారు.
ఓ గదిలో కాలిపోయిన మృతదేహాన్ని గమనించారు. వెంటనే భెల్ అధికారులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ప్రవీణ్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సూసైడ్ నోట్‌లో తన తండ్రి గురించి రాశాడు. మద్యం, సిగరేట్, గుట్కా మానాలని సూచించాడు. చివరలో ‘అమ్మా, సారీ’ అంటూ రాశాడు. పోలీసులు స్థానికంగా ఉన్న అతడి బంధువులకు సమాచారమిచ్చారు. సాయిఅభినంద్‌ను వారి తల్లిదండ్రులు గారాబంగా చూసుకునే వారని మృతుడి బంధువులు తెలిపారు. గత కొద్దిరోజుల క్రితం ఆలౌట్‌లో లిక్విడ్ తాగి ఆత్మహత్యకు యత్నించినట్టు పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
క్షమించు అమ్మ.. నేను చనిపోతున్నా..
Published Mon, May 23 2016 8:51 PM | Last Updated on Tue, Nov 6 2018 8:22 PM
Advertisement
Advertisement